"అయ్యోలూ..అమ్మోలూ.. ఇంతేనా బ్రతుకు హో హో హో." మీకందరికీ జెమిని టి.వి. లో వచ్చే అమృతం సీరియల్ కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట తెలిసే ఉంటుంది. కారణం తెలియదు కానీ, ఈ పాట వినగానే అప్రయత్నంగా నాకు ఈ కింద కథ గుర్తొస్తుంది. ఆ పాట విన్నా/ సీరియల్ చూసినా ఎంత నవ్వొస్తుందో, ఈ కథ గుర్తొచ్చినప్పుడల్లా అంత ఉద్వేగం ఆవహిస్తుంది. మనకున్నవే కష్టాలు అనుకోవద్దు అన్న సందేశం ఈ కథలో ఉండడం కారణమేమో కానీ, ఈ పాట గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా రెండు విరుద్ధమైన భావాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాను. అందుకే సిరివెన్నెల బ్లాగులో హాస్యపూరితమైన వ్యాఖ్యానం, ఇక్కడ ఉద్వేగభరితమైన కథనం.
శతాబ్ధి రైలుబండిలో ఒక భోగీలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ.
వివేక్, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో. విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించవలసిన వ్యక్తి ఇలా ట్రెయిన్‌లో ప్రయాణించడం చాలా చిరాకు కలిగించే విషయంగా ఆఫీసు అడ్మిన్‌తో మాట్లాడినా లాభం లేకపోయింది. కనీసం, ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుందామని తన ల్యాప్‌టాప్ తీసి ఏదో పని చేసుకుంటూండగా "మీరు సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తారా అండీ" అని పలకరించిందో స్వరం తన పక్కనుండి. కనీసం చూపైనా అటువైపు విసరకుండా "అవును" అని సమాధానమిచ్చి తన పనిలో లీనమై ఉండగా మళ్లీ అదే స్వరం "మన దేశాన్ని మీరెంతో అభివృద్ధి పరుస్తున్నారు. ఈరోజుల్లో మొత్తం కంప్యూటర్ మయం అయిపోయింది. అదంతా మీలాంటి వారి వల్ల జరిగిన అభివృద్ధే" అంటూ మెచ్చుకోలుగా చూశాడు ఆ వ్యక్తి.
"థ్యాంక్స్" అంటూ తన దృష్టిని ఆ వ్యక్తి వైపు సారించాడు సాధారణంగా పొగడ్తని కాదనలేని వివేక్. చక్కని వ్యాయామంతో దృఢమైన శరీరం గల యువకుడు అతను. చాలా సాధారణంగా ఉన్నాడు. ఒక చిన్న టౌన్ నుండి వచ్చినవాడిలా కనిపించాడు. రైల్వే క్రీడాకారుడు అయ్యుండొచ్చు అనుకున్నాడు వివేక్. సాధారణంగా వాళ్లే తమకు ఉచితంగా వచ్చిన రైల్వే పాసుని ప్రయాణాలకు ఎక్కువగా వినియోగించుకుంటారని అతని నమ్మకం.
"మీరు నాకెప్పుడూ అద్భుతంగా కనిపిస్తారు. మీ ఏ.సి. గదిలో కూర్చుని ఆ కంప్యూటర్‌లో ఏదో రాస్తారు. బయట అది ఎన్నో చేస్తుంది" అన్నాడు. ఒక నిరాసక్తమైన నవ్వు బదులిచ్చి మొదలు పెట్టాడు వివేక్ "అది నువ్వనుకున్నంత సులభమైనది కాదు ఫ్రెండ్. ఏదో రెండు లైన్లు రాయడం కాదు. దాని వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది" ఇంకా ఏదో చెప్పబోయి ఎందుకులే అనుకుని " అది చాలా కష్టమైన పని.. చాలా కష్టం" అని ఊరుకున్నాడు వివేక్. నిజానికి అతని మనః స్థితికి తనకుండే కష్టాలన్నీ గట్టిగా అరిచి చెప్పుకోవాలనిపించింది.
"మీకు జీతభత్యాలు అంత ఎక్కువగా ఇస్తారంటే ఆశ్చర్యం ఏమీ లేదు. మరి ఇంత కష్ట పడతారు కదా"
ఇక ఆపుకోలేని కోపాన్ని ఆ వ్యక్తిపై ప్రదర్శించాడు వివేక్. "అందరూ ఇచ్చే డబ్బుల్నే చూస్తారు. మా కష్టాలు ఎవరికి తెలుసు? ముఖ్యంగా ఇండియన్స్‌కే ఇటువంటి 'నారో'మైండ్ ఉంటుంది. ఏ.సి. గదుల్లో కూర్చున్నంత మాత్రాన మాకు చెమట పట్టదు అనుకోవద్దు. మీరు శరీరానికి వ్యాయామం ఇస్తే మేము మెదడుకి ఇస్తాం అంతే తేడా. నిజం చెప్పాలంటే ఏ విషయంలోనూ మీకన్నా తక్కువ ఉండదు ఈ పని. ఇంకా ఎక్కువే" తన కోపాన్ని విసుగుని భరించగలిగే వ్యక్తి దొరికాడనిపించింది వివేక్‌కి. ఏమాత్రం సంకోచించకుండా తన ఉక్రోషాన్నంతా వెళ్లగక్కాడు.
"నీకొక ఉదాహరణ ఇస్తా. మన రైల్వే రిజర్వేషన్ సిస్టం చూడు. ఎవరైనా, ఏ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణానికైనా, దేశంలో ఎక్కడి నుండైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఎంత కష్టంతో నిర్మించబడిన సిస్టమో చూడు. నువ్వు అర్థం చేసుకోగలవా ఇందులో ఉన్న కష్టం..?"
ఆ యువకుడు మాత్రం ఒక ప్లానెటోరియం దగ్గర చిన్న కుర్రాడిలా వింటూ ఉన్నాడు చాలా ఆశ్చర్యంతో. ఇదంతా అతని ఊహకి అందని విషయం.
కాసేపటికి తేరుకుని " మీరు అటువంటి సిస్టంని డిజైన్ చేసి కోడ్ చేస్తారా?" అడిగాడు.
"ఒకప్పుడు చేసేవాడిని. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజర్‌ని"
"ఓహ్.. అంటే ఇప్పుడు కొంచెం మీ పని సులువు అయ్యుండొచ్చు కదా"
తగ్గిందనుకున్న కోపం మళ్లీ పైకెక్కింది వివేక్‌కి "ఎవరి జీవితమైనా పైకెదుగుతుంటే పనులు తగ్గుతాయా.? ఎదుగుదల కొత్త బాధ్యతల్ని తెస్తుంది. ఇప్పుడు నేను కోడ్ చెయ్యను అంటే పని చెయ్యను అని కాదు. పని చేయించాలి. అది ఇంకా కష్టమైన పని. ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఒక వైపు ఎప్పటికప్పుడు రెక్వైర్మెంట్లు మార్చేసే 'క్లైంట్', ఇంకోవైపు ఇంకేదో కోరుకునే 'యూజర్' మరో వైపు పనంతా నిన్నే అయిపోవాలి కదా అని ప్రశ్నించే నా పై'మేనేజర్'. ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా?
కొద్ది సేపు ఆగాడు వివేక్. చివరికి "నీకు తెలియదు, కత్తి మీద సాము ఎలా ఉంటుందో" ముగించి ఆ యువకుడి వైపు చూసాడు.
తన సీట్ వెనక్కు ఆనుకుని కళ్లు మూసుకుని ఉన్నాడు, ఏదో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లుగా..
"నాకు తెలుసు సర్.. నాకు తెలుసు. కత్తి మీద సాము ఎలా ఉంటుందో." ఐహిక వస్తువేమీ అతనికి కనిపించడం లేదిప్పుడు. కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ చెబుతున్నాడు.
"మేము మొత్తం 30, మా కెప్టెన్ 4875 శిఖరాన్ని రాత్రికి కవర్ చెయ్యాలని మమ్మల్ని ఆర్డర్ చేసినప్పుడు. శతృవు శిఖరపుటంచుల నుండి కాల్పులు జరిపిస్తున్నాడు. ఎవ్వరికీ తెలియదు, తరువాత బుల్లెట్ ఎక్కడి నుండి వస్తుందో, ముఖ్యంగా ఎవరికి తగులుతుందో. ఉదయాన్నే శిఖరాన్ని అందుకుని మువ్వన్నెల ఝెండా ఎగురవేసే సమయానికి నలుగురం మిగిలాము.
"మీ..రు..?" ఆశ్చర్యంతో వివేక్.
"నేను సుబేదార్ సుశాంత్, కార్గిల్ యుద్ధంలో 4875 పీక్ గురించి యుద్ధం చేసాను. యుద్ధం ముగిసాక, పైవాళ్ల నుండి పిలుపు వచ్చింది. నీ బాధ్యత పూర్తి అయింది నువ్వు కోరుకుంటే సులువైన పని ఇస్తాం అని. మీరు చెప్పండి సర్, ఎవరైనా జీవితాన్ని సులువు చేసుకోవచ్చు అనుకుని తమ బాధ్యత నుండి తప్పుకుంటారా..?
యుద్ధం ముగిసి తిరిగి వస్తుంటే నా తోటి సైనికుడు మంచు కారణంగా అశ్వస్థతకు గురై శతృవుల కాల్పులకు దొరికాడు. అతడిని అక్కడి నుండి తప్పించి భద్రమైన ప్రదేశానికి చేరవేయడం నా బాధ్యత. కానీ మా కెప్టెన్ అందుకు నిరాకరించి, తనే వెళ్లారు. దానికి అతనిచ్చిన కారణం, ఒక ఆర్మీ కమాండర్‌గా మొదట అతను చేసిన ప్రతిఙ్ఞ తను కమాండ్ చేసిన వారి ప్రాణలకు భద్రత కల్పించడం. సైనికుడిని కాపాడినందుకు కెప్టెన్ చంపబడ్డారు. ఆరోజు నుండి నాకు గురి చెయ్యబడిన ప్రతి బుల్లెట్‌ని అతను తీసుకున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు నిజంగా తెలుసు సర్, కత్తి మీద సాము అంటే ఏమిటో.."
వివేక్ చేష్టలుడిగిపోయాడు. తనువంతా ఉద్వేగంతో నిండిపోయింది. తనకు తెలియకుండానే ల్యాప్‌టాప్ ఆపేసాడు. అంతలో ట్రెయిన ఏదో స్టేషన్‌లో ఆగింది. సుబేదార్ సుశాంత్ తన లగేజ్ తీసుకుని దిగబోతూ.. "ఇట్ వజ్ నైస్ మీటింగ్ యౌ సర్" అన్నాడు. వివేక్ అసంకల్పిత ప్రతీకార చర్య లాగా షేక్‌హ్యాండ్ ఇచ్చి, ఆ చేతిని చూస్తూ మనసులో అనుకున్నాడు 'ఈ చెయ్యి, శిఖరాల్ని అధిరోహించింది, ట్రిగ్గర్ నొక్కింది, మువ్వన్నెల ఝెండా ఎగరేసింది.' తనకి తెలియకుండానే అట్టెన్షన్‌లోకి వెళ్లిపోయి, సెల్యూట్ చేసాడు వివేక్, తన దేశానికి ఇది మాత్రమే తను చెయ్యగలిగింది అనుకుంటూ..
ఇది నేను చాలా రోజుల క్రితం ఆంగ్లంలో చదివాను. గుర్తున్నంత వరకూ తెలుగులో రాయడానికి ప్రయత్నించాను.
Friday, December 31, 2010
Thursday, December 23, 2010
వేదమంటి మా గోదారి..
కింద చూస్తే నీళ్లు.. పైన చూస్తే ఆకాశం.. పక్కనంతా పచ్చని కొండలు.. అదొక కొత్త ప్రపంచం.. ఆ అందాల్ని వర్ణించడం చాలా కష్టం. ఎవరన్నారు నీటికి రంగు, రుచి, రూపం లేవని..? ఖచ్చితంగా చూసి ఉండరు మా గోదావరి తల్లిని. గలగలమని పరవళ్లు తొక్కుతూ ఎంత అందంగా వయ్యారంగా నడుస్తూ ఉంటుందనీ.. ఆ అందాన్ని వర్ణించతరమా.. ఎన్నెన్ని కథల్ని, ఊసుల్ని, ఆనందాల్ని, విషాదాల్ని తనలో దాచుకుని అవేమీ బయటకు కనిపించకుండా గంభీరంగా , ముగ్ధలా సాగుతూ ఎందరిని అలరిస్తుందనీ.. మౌనంగా ఎన్నెన్ని ఊసుల్ని మనసుల్లోకి జొప్పిస్తుందో , మన ప్రమేయం లేకుండానే.. అంత గొప్ప గోదారి ఎంత ఒద్దిగ్గా ఉంటుందనీ.. ఇక తనపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఆ తల్లి ఒక అమృతవర్షిణే.. ఎందరి జీవితాలను తన చుక్కానితో నడిపిస్తుందనీ..
ఆ గోదారమ్మ అలల హొయల పరుగు, అబ్బా.. మాటలు సరిపోవట్లేదు. ప్రకృతి మాత తన సింగారాన్ని గోదారి పైటతో అలంకరించుకున్నట్లు.. ఎంత అందమైన అలంకరణో తెలుసా.. లోతైన గంభీరమైన అద్భుతమైన అలంకరణ. ఎవ్వరినీ కదిలించకుండా తన దారిన తాను, చిన్ని చిన్ని అలలతో సున్నితంగా కొండల్ని తడుముతూ..తడుపుతూ.. ముద్దాడుతూ.. తనలో తను కలుస్తూ.. తనతో తను విడివడుతూ.. ఎంత అద్భుతమైన అందం.. ఎంత అందమైన నిజం.. వెరసి నా పాపికొండలు ప్రయాణం.. ఒక్కసారిగా కృత్రిమత్వానికి దూరంగా సహజత్వంలోపలికి గోదారి తల్లి నన్ను భద్రంగా తీసుకెళ్తున్న భావన.
భద్రాచలం నుండి పేరంటాళ్ల పల్లి వరకు సాగిన ఆ ప్రయాణం నేను జన్మలో మర్చిపోలేనిదనే చెప్పుకోవాలి. అదృష్టం.. పంచభూతాలూ సహకరించాయి మా ప్రయాణమంతా..:)

పాపి కొండల మధ్యలో పాపిటంత గోదారి
చుక్కల్లా మారిన సూర్యుడి జలకాలాట
గోదారి తల్లి సన్నిధిలో వెన్నెల రాత్రి గడుపుతారా..
పడమర పొత్తిళ్లలో సూరీడు..
అలల లయలు..
లయల అలలు..
అలల్లో దాగిన లయలు..
లయలతో సాగే అలలు..
అలపై అల దూసుకు వస్తూ..
అల కింద అల నలిగిపోతూ..
అల పక్కన అల స్నేహంగా..
అలతో అల కలిసిపోతూ..
అలతో అల విడివడుతూ..
అలను అల తోసుకుంటూ..
మొత్తంగా
అలల లయలు..
లయల అలలు..
అలా అలా సాగుతూ..
వెళ్లొస్తా నేస్తం..
వెన్నెల రాత్రి బసకి వెదురు బొంగుల విడిది..
హైలెస్సా.. హైలెస్సా..
ఇదంతా నాణేనికి ఒకవైపు. రెండో వైపు నాకు నచ్చని అంశాలున్నాయి.ముఖ్యంగా ప్లాస్టిక్ చెత్త గోదావరిలోనే పారెయ్యడం, నాకు చాలా బాధ కలిగించిన విషయం. :(
ఎంత మందికని చెప్పగలను.. నా వరకు నేను మాత్రం అందులో ఏమీ పారెయ్యకుండా చూసుకున్నాను. మనం ఇలా ప్రకృతికి హాని కలిగిస్తున్నందుకే కదా ప్రకృతి మన మీద కన్నెర్రజేస్తుంది... నాకో బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది. అలా చెయ్యొద్దూ ఇలా చెయ్యొద్దూ అని ఎంత చెప్పినా మనం వినం. ప్రకృతికి మనం ఎంత హాని కలిగిస్తే అంత మన జీతాల్లోంచి కట్ అని ఏదైనా చట్టం వస్తే బాగుండు.;) ఏమంటారూ..?
Tuesday, December 14, 2010
నా నేస్తానికి అంకితం
"నవ్వు" అంటే ఏంటి..?
అప్పుడే పుట్టిన మొగ్గల్లా పెదవులు విచ్చుకోవడమా..!
అరవిరిసిన కుసుమాల్లా కళ్లు మారడమా..!!
విరబూసిన జాజుల్లా మనసు వెలగడమా!!
అదేంటో మరి..
నీ సావాసంలో అయితే నా శరీరమంతా నవ్వుతుంది.
కలిసి గడిపిన క్షణాల్లో ఎన్నెన్ని ఊసులు దొర్లుతాయని..
ప్రపంచమంతా మన మాటల్ని పలకరించే పక్కకి జరుగుతుందేమో..
ముత్యాల ముచ్చట్లలో ఒదిగిపోయిన సమయం
మనకి కనిపించదు అనుకుంటాం కానీ..
నిజానికి.. మనం కలిస్తే..
కాలం అసూయతో పరుగందుకుంటుంది.
"ఎంత సమయం" కన్నా "ఎలా గడిపాం" అన్నదే కదా ముఖ్యం.
నీతో పంచుకున్న ఆ నాలుగు నిమిషాలు చాలు
స్నేహానికి అర్థం చెప్పడానికి.
చాలా రోజుల తరువాత ఈరోజు నా స్నేహితురాలు కలిసిందండీ. ఎవరి పనుల్లో వారు మునిగిపోయి, అసలు ఫోన్ కూడా చేసుకోక చాలా రోజులే అయింది. రెండు కొప్పులు ఒకచోట చేరితే ఏం జరుగుతుందో తెలుసు కదా..;) ప్రపంచంలోని విషయాలన్నీ ఒకసారి మాట్లాడేసుకున్నాం. మా సంతోషానికి మాకు ఒక గంట సమయం మాత్రమే దొరికింది..:( ఏం చేస్తాం. బోలెడన్ని ఆ గంటలోనే మాట్లాడేసుకుని సంతోషంగా గడిపాం. ఇద్దరు మనుషులకి ఒకే అంశం మీద ఆసక్తి ఉంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. తను కూడా మనలాగే కళా పోషకురాలు..:) ఇక సాహిత్యం మీద చర్చ మీద చర్చ జరిపేసి, టైం చూసి భారంగా నిట్టూర్చి వెళ్లిపోయింది..:(
నా మనసుకు నచ్చిన నేస్తం కోసం, మనసులో మెదులుతున్న ఆ నాలుగు భావాలకి ఇలా అక్షర రూపం ఇచ్చాను. మీరు భరించాలి తప్పదు..:))

Friday, December 3, 2010
"కళ"కొచ్చిన కష్టాలు..:(
అటకటా.. అసలు నాకు బ్లాగుల గురించి ఎందుకు తెలియవలె.. తెలిసినదే పో.. వాటి గురించి నేనెందుకు పట్టించుకోవలె..? పట్టించుకుంటినే పో.. నాకు కూడా ఒక బ్లాగు ఉండవలెనని నాకేల అనిపించవలె..? అనిపించనదే పో.. ఆలోచన వచ్చిందే తడవుగా ఎందుకు మొదలు పెట్టవలె.. పెట్టితినే పో, ఆవేశం ఆగక అందరికీ ఎందుకు దండోరా వేయించవలె.. హయ్యో హత విధీ.. ఈరోజు ఇటుల ఎందుకు చింతించవలె..
అసలు ఇలాక్కాదు... అతను మా ఆఫీసులోకే ఎందుకు రావలె.? వచ్చినా మా ప్రాజెక్టు.. ఇంకా నా పక్క సీటే ఎందుకు ఎంచుకోవలె.? దీని పేరే కదూ ఖండ కావరం.. (కాదని చెప్పకండి.. చెప్పిన వాళ్లందరికీ ఒక్కో తిట్టు..)
నాకు తెలుసు మీరంతా ఏమి ఆలోచిస్తున్నారో. అసలు ఉపోద్ఘాతం ఏమీ లేకుండా ఇలా మాటర్‌లోకొచ్చేసి మీకు ఏమీ అర్థం కాని గోండు జాతి భాష సినిమా చూపించేస్తున్నాను కదూ.. చెబుతాను వినుకోండి. మరేమో మనకి కొంచెం ఆవేశం, ఆతృత, ఆశ, అత్యుత్సాహం ఇంకా అవీ ఇవీ ఎక్కువ కదా.. మన బలాగు సంగతి నాకు తెలిసిన వారికీ, తెలియని వారికీ, తెలిసీ తెలియని వారికీ బట్టీ కొట్టిన పాఠం లాగా అప్పజెప్పేశానా.. అదేంటో అందరూ నాకు మంచోళ్లే తగులుతారు.. ఎక్కువ మంచి కాని వాళ్లు తగులుతారు (అదేనండీ చెడ్డోళ్లు..). అలాంటి ఒక మంచి కాని పిచ్చోడి పేరు రాంబాబు.. ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక పేరు రాంబాబు.. గుర్ర్‌ర్ర్‌ర్ర్ (పేరు మార్చడమైనది )
పోనీలే పాపం, ఏదో ఫ్రెండే కదా అని మన బ్లాగు చదివే సదవకాశం ఉచితంగా చాలా సహృదయంతో ప్రసాదిస్తే దానిని సద్వినియోగ పరుచుకోకుండా ఇలా నన్ను నానా మాటలని, నన్ను నా బ్లాగుని ఇంకా చెప్పాలంటే బ్లాగుల్లో ఉన్న మన అక్కలూ అన్నలూ అందర్నీ కించపరిచేశాడు. మాట్లాడితే "మనసు పలుకుతుందా" అమ్మాయి ఉరుకుతుందా, ఎన్ని సంవత్సరాలైనా ఆ అమ్మాయి గమ్యం లేకుండా అలా పరిగెట్టేస్తూ ఉంటుందా, బ్లాగర్ సర్వర్ క్రాష్ అయిపోయే దాకా నీ మనసు పలుకుతూనే ఉంటుందా, అసలు అలసట రాదా... ఇలాంటి ప్రశ్నలు. ఒకవైపు ఆఫీసులో ఇష్యూస్‌కే టైం లేక ఇవాల్సిన అప్‌డేట్‌లు ఇవ్వకుండా ఉండిపోతుంటే రెండు బ్లాగుల్ని మేనేజ్ చేసే టైం ఎక్కడ దొరుకుతుంది.. ఇలాంటి ధర్మ సందేహాలు. మీరే చెప్పండి ఇదేమన్నా భావ్యమా..?
పనిలో ఉన్నప్పుడో, భోజనాలు చేస్తున్నప్పుడో ఏదో ఒక టాపిక్‌లో మొదలెట్టేస్తాడు.. మనసు పలికిందా అని. నా జీవిత కాలంలో ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక ఘడియలో నేనైనా మర్చిపోవచ్చేమో అసలు నాకంటూ ఒక బ్లాగు ఉందనీ, అందులో నేను అవీ ఇవీ గెలుకుతూ ఉంటానని. కానీ అతను మాత్రం మర్చిపోను గాక మర్చిపోడు. మనసు అన్న పదం కనిపిస్తే చాలు మనసు పలికే, ఆ వెనువెంటనే నేను కూడ గుర్తొచ్చేస్తాను. పోనీ అంతటితో ఊరుకుంటాడా అంటే, అది కాదే... నాకు గుర్తు చేసేసి, నన్ను కించపరిచేసి, ఏడిపించేసి, నా బ్లాగు ఫోటోలో ఉన్న అమ్మాయిని నానా మాటలనేసి గానీ వదలడు. అనేది నన్నొక్క దాన్నేనా..!! మన బ్లాగ్లోకాన్నంతా అనేస్తాడు.. నాకో డవుట్.. అసలిదంతా ప్రతి పక్షాల కుట్రా..? తీవ్రవాదుల చర్యా..? ఆల్‌ఖయిదా మతోన్మాదమా..? కాదు కాదు ఇదంతా పురుషాహంకారమే అని సవినయంగా మనవి చేసేసుకుంటున్నాను.
మీకిక్కడ మరో విషయం చెప్పాలి. ప్రపంచంలో చెడ్డ మనుషులెవరూ ఒక్కరే ఉండరు. వారికి ఒక కుడి భుజం ఉంటుంది. ఆ భుజం పేరు సోంబాబు (పేరు మార్చడమైనది ). ఎంచక్కా నా మిగతా స్నేహితులంతా చక్కగా చదివేసి "సూ..పరు, కేక, కెవ్వు, కత్తి, చాకు, బ్లేడు" ఇంకా వీలైతే "గునపం, గడ్డపార, ఱంపం" అని పొగిడేస్తూ ఉంటారా.. వీళ్లిద్దరేమో నన్ను నానా రకాలుగా హింసించేస్తూ ఉంటారు. వా..వా..:(:( ఏమన్నా అంటే ఎప్పుడూ పొగడ్తలనే కాదు విమర్శల్ని కూడా తీసుకోవాలమ్మా అంటారు..:( పోనీ చదివి విమర్శిస్తారా అంటే, విమర్శిస్తారు కానీ చదవరు. మొన్నొక రోజు పొరపాటున మన దగ్గర ఉన్న బ్రహ్మాస్తం వదిలా "మడిసన్నాక కూసింత కళా పోషణ ఉండాలి" అని. అనేసి ఎంత తప్పు చేసానో నాకు రోజుకి తొంభై ఆరు సార్లు తెలుస్తుంది (అదేం సంఖ్యా అని ఆలోచించకండి. పెద్ద లాజిక్కు ఏమీ లేదు. ఏదో అలా పెట్టేసా..) "మమ్మల్ని పోషించుకోవడమే కష్టంగా ఉంది.. ఇంక ఏ కళనని పోషించాలి.." అన్నది ఆ సమయానికి వచ్చిన సమాధానం (మరే.. ఇద్దరూ ఎముకల గూడు మీద తోలు కప్పినట్లుగా ఉంటారులే..) ఇంక ఆ తరువాత జరిగిన ప్రతి సంభాషణ లోనూ దీన్నేనా కళ అంటారు..? దాన్నేనా కళ అంటారు.. అంటూ వెధవ ప్రశ్నలు. వదిలెయ్యండి మహాప్రభో అంటూ అరిచి గగ్గోలు పెట్టినా నా గోడు విన్న పాపాన పోలేదు..చివరికి మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటూ ఉన్నా కూడా ఇది కూడా ఒక కళేనా.. ఏం పేరబ్బా అని ఎగతాళి చేస్తూ ఉంటారు..:( అలా వినీ వినీ ఈ మధ్య కళ అన్న పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నాను..

కోపంతో, నీ మీద పగ ప్రతీకారం తీర్చుకుంటానుండు అని చెప్పి, ఇదిగో ఇలా మనదైన స్టైల్‌లో కోపాన్ని వెళ్లగక్కుతున్ననమాట.. :((
హ్మ్.. ఇంతా తిట్టేసి, టపా రాసేసి ఇదిగో మీ గురించి ఈ టపా రాసాను అని చెబితే, విచ్చలవిడిగా సొంత పేరే రాసేసి టపా పెట్టుకో మళ్లీ దానికి అలియాస్ పేర్లు ఎందుకు ..అని నన్ను తీవ్రంగా కించపరిచేశాడు.
ఎంత ఖండ కావరం..!!!!!!!!Monday, November 22, 2010
మౌన ముద్ర
కనుల ముందు కొత్త కాంతి..
వేయి దీపాలు ఒక్కసారి వెలిగినట్టు..
కోటి నక్షత్ర మాల ఎదురైనట్టు..
ఈ వెలుగు కోసం చూసిన రోజులు ఏమయ్యాయి..?
ఇప్పుడిలా సిగ్గుతో పక్క చూపులు ప్రవేశించాయేం..!?
ఇన్నాళ్లూ గుంభనంగా గుండె గదిలో దాచుకున్న.......,
చెప్పలేను..
ఏమని చెప్పగలను..?
ఎన్నని చెప్పగలను..?
వాసంత, హేమంత, శరత్, శిశిరాలను..
సంగీత, సాహిత్య, శత వర్ణ చిత్రాలను..
మోదాగ్ర శిఖరాలను, ఖేదాఖాతాలను..
హిమవన్నగాలను.., మహార్ణవాలను..
పదిలంగా దాచుకున్న మనసుని..
చైత్రపు చినుకునే కాదు, వేసవి వెన్నెలనూ ఆనందించే ఈ మనసుని..
అరలు.. తెరలు.. దాటుకుని హృది కవాటాల్ని తెరిచి.. నీ ముందుంచాలని..
ఎన్నెన్ని కలలు కన్నాను.?
మరేంటి..? ఇప్పుడిలా..!!
చిగురించిన వాసంతం నీకు స్వాగతం పలుకుతున్నా..
తలపుల తలుపులు వాటంతటే తెరుచుకున్నా..
ఈ పిచ్చి మనసు..
మౌన ముద్ర దాల్చి..
కనీసం నీ చూపులతో చూపులు కలపలేకపోతోంది..

Monday, November 8, 2010
"క్షణం" అడిగిన ప్రశ్న..
ఎదగాలి.. పైపైకి ఎగరాలి..
గోడమీద ఊగిసలాడే కాలాన్ని వెనక్కి నెట్టుకుంటూ పరిగెత్తాలి...
మీదకి దూసుకు వచ్చే ఘడియ మెట్లను ఎక్కుకుంటూ పైకెళ్లాలి..
ఉవ్వెత్తున ఎగిసి పడే క్షణల కెరటాల్లోంచి దూసుకుంటూ ముందుకెళ్లాలి.
నిశీధిలో దాక్కున్న నిమిషాలు సైతం "నేను సైతం" అనాలి..
కానీ..
నన్ను నేను కోల్పోయిన ఆ క్షణం.. ఆ ఒక్క క్షణం మాత్రం నన్ను అడుగుతుంది..
"ఎక్కడి వరకూ.." అని.
నాకు తెలియదు, అది నేనే వేసుకున్న ప్రశ్న అని.. ఎప్పుడూ సమాధానం చెప్పను.
"సంతోషం దొరికేంత వరకూ.." ఇప్పుడు చెప్పాను.
"సం...తో..షం..???" చాలా విస్మయంతో చూసింది.
మరి కావాల్సిన తీగ కాలికి తగిలితే పక్కకి తప్పుకుని పోయే నన్ను, అలా చూడ్డంలో తప్పు లేదులే..
"మొన్నొక రోజు, నువ్వు సూర్యుడికన్నా ముందు నిద్ర లేచిన ఉదయం,
పువ్వులన్నీ బద్దకంగా ఒళ్లు విరుచుకుంటున్న క్షణంలో..
చల్లని మలయమారుతంలా నీ చెంతకొచ్చింది.. అదే కదూ సంతోషమంటే..?
ఇంకొక రోజు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆపదలో ఉన్న నీ నేస్తానికి సహాయం చేసిన రోజు,
ప్రశాంతంగా నీ వద్దకొచ్చింది.. అదే కదూ సంతోషమంటే..?
మరొక రోజు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పసికందుని కాపాడిన రోజు, సంతృప్తితో పాటు నిన్ను చేరుకుంది.. అదే కదూ సంతోషమంటే..?
ఇంకోరోజు, ఒక చిన్న విజయగర్వంతో నువ్వు కలతల్లేని నిద్ర పోయిన రోజు,
రాత్రంతా నిన్ను హత్తుకుని పడుకుంది.. అదే కదూ సంతోషమంటే.."
అవునా..
ఇన్ని సార్లు నన్ను కలిసిందా..?
అప్పుడర్థమైంది. ఎదగాలి అన్న కాంక్షతో, వచ్చిన ప్రతి క్షణాన్ని పక్కకు నెట్టేస్తున్నానే తప్ప, ఆ క్షణం నాకోసం ఏం తెస్తుంది అన్నది తెలుసుకోవడంలేదని.
ఇలా ఎన్నెన్ని నిమిషాలని కనీసం తొంగి కూడా చూడకుండా చీకట్లో చేజార్చుకుంటున్నానో..
నాకు ప్రసాదించబడిన ఎన్నెన్ని సుమధుర ఘడియల సౌరభాల్ని, ఆస్వాదించకుండా పోగొట్టుకుంటున్నానో.
వెతకాలి, నేను పోగొట్టుకున్న ఒక్కొక్క నిమిషాన్ని వెతికి పట్టుకోవాలి..
చేజార్చుకున్న నా సంతోషపు ఛాయల్ని ఏ నిశీధిలో దాక్కున్నా సరే, కనిపెట్టి తెచ్చుకోవాలి..
ఆ అమూల్యమైన క్షణాలు ఏ మతిమరుపు ముళ్లపొదల్లో చిక్కుకున్నా సరే, గుర్తుపట్టి అపురూపంగా నా దోసిలిలో దాచిపెట్టుకోవాలి.
ఇక ఏ క్షణం నాకోసం ఏం తెచ్చినా, దాన్ని పూర్తిగా ఆస్వాదించి సంతోషంగా సాగనంపాలి..
మరోసారి ఏ క్షణమూ నన్ను ప్రశ్నించకూడదు.. అసలు నన్ను నేను కోల్పోకూడదు..
ఎందుకంటే, నన్ను నేను కోల్పోయిన ఆ క్షణం, ఆ ఒక్క క్షణం నన్ను అడిగిన ప్రశ్నతో నాకు జీవితం విలువ తెలిసింది..
మరి.. మళ్లీ మళ్లీ జీవితాన్ని కోల్పోలేం కదా.

Wednesday, November 3, 2010
నా "నీకు"...
నా హృదయం ప్రార్ధిస్తోంది నా హృదయ స్పందన విను
జీవితం అనే కాలం లో కొన్ని మధురమైన క్షణాలను నీకు అందిస్తా
నేను శ్వాసిస్తున్న ఊపిరిని నీతో పాటు పంచుకుంటా
నీ కోసం ఎవరైనా గాలిస్తే ..నా కళ్ళల్లో వెతకమని చెప్పు..
ప్రతి కదలిక లో పుడుతుంది ఒక కొత్త దారి
వెళ్తున్న ప్రతి దారీ కావచ్చు మరొక కొత్త మలుపు
నీ పరిచయం అయ్యాక తెలుసుకున్నా నువ్వే నా మజిలీ
కవిత్వం లో నిశబ్దం గుర్తెరిగిన అనుభూతి నీ తోడు.
నా హృదయం అనే గది లో వెదజల్లు పరిమళం నువ్వై..
నువ్వే నా అపూర్వం .. నువ్వులేని నేను అసంపూర్ణం..
Wednesday, October 27, 2010
కాస్త విశ్రాంతి...
ఎప్పుడూ ఏ.సి. ఆఫీసులు, క్యాబులు, కంప్యూటర్లు, కీబోర్డు లేనా. కాస్త అప్పుడప్పుడూ, ఆర్.టి.సి. బస్సులు, చెప్పుల్లేకుండా మట్టిలో నడవడాలూ, పచ్చికలూ, పొలాలు, పక్షులు ఉంటే ఎంత బాగుంటుంది కదూ.. అందుకే పోయిన వారం అలా మా ఊరు వెళ్లొచ్చా.
ఊరు వెళ్తున్నప్పుడు..
నీటి కాలువలో పాము..(ఏ పామో తెలియదు)
వరి పొలం..
పత్తి పువ్వు
నీటి కాలువ
బావి
పత్తి
పసుపు చేను
బావిలో రాయేసి మరీ తీసాను ఈ ఫోటోలు..:)
ఎడ్ల బండి
ఎలా ఉన్నాయి మా ఊరి ఫోటోలు..? బాగున్నాయి కదూ..:)

Tuesday, October 12, 2010
గుచ్చుకున్న "మొగలి రేకులు"
*******************************Note Note Note*******************************
మీలో ఎవరైనా "మొగలి రేకులు" సీరియల్ కి ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఇటు తొంగి కూడా చూడకండి. ఆ తరువాత మీ మనోభావాలు గాయపడితే నన్ను బాధ్యురాలిని చెయ్యొద్దు..:( ఇది కేవలం ఆ రేకుల తాకిడి తట్టుకోలేక మొదలెట్టిన నా కంఠశోష. ఎవరినైనా కించపరిచినట్లు అనిపిస్తే క్షంతవ్యురాలిని..
*********************************************************************************
ఓర్నాయనోయ్.. ఓరి దేవుడోయ్.. అనుకోకుండా, నా అదృష్టం బాలేక, శని దేవుడు నా నెత్తిమీదే టెంట్ కట్టుకుని కూర్చున్నందువల్ల, అసలు జ్యోతిష్యం ప్రకారం గానీ, సంఖ్యా శాస్త్రం ప్రకారం గానీ, వాస్తు ప్రకారం గానీ నా పొజిషన్ బాలేక మొన్నటి శుక్రవారం రాత్రి జెమిని టి.వి. పెట్టాల్సి వచ్చింది, అది కూడా రాత్రి 8:30 ప్రాంతంలో.. అప్పటి నుండీ నా కడుపు ఉబ్బిపోయి ఉబ్బిపోయి ఎప్పుడెప్పుడు మీ చెవిలో ఈ విషయం వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంది.. ఇదిగో ఇప్పుడు ఇలా మీ అదృష్టం బాలేక నాకు సమయం దొరికింది. ఓర్నాయనోయ్.. ఆ రేకుల జీడిపాకం ఇంకా అవ్వలేదా.. అప్పుడెప్పుడో... చూసినట్లు గుర్తు, అందులో పాత్రలన్నీ వయసుకు తగ్గట్లుగా ఉన్నప్పుడు. అదేంటో.. అందరూ అలాగే కనిపించారు ఇప్పుడు కూడా..(కొన్ని పాత్రలు పోషించిన వాళ్లు మారిపోయారు లెండి..) కానీ వాళ్లకి చెట్టంత ఎదిగిన కొడుకులు, పెళ్లీడుకొచ్చిన కూతుర్లు.. ఇక ఈ పాకం సాగడం ఆగదా అంట.. అసలు సీరియల్ చూడ్డం మొదలు పెట్టగానే నా మైండ్ బ్లాక్ అయిపోయి, నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయి, నా హార్ట్‌లో హోల్ కూడా పడిపోయిన ఫీలింగ్.. ఇంత హింస తట్టుకోలేక నా చిన్ని గుండె ఎన్ని కష్టాలు పడిందో పాపం..
బాలయ్య సినిమా కన్నానా అని నన్నడగొద్దు ప్లీజ్.. రాళ్లల్లో కొన్ని వేలరకాలు, పళ్లు ఊడగొట్టుకోడానికి.. ఇక పులి గొడవ. కొమరం పులి నేను అతి కష్టపడి, అసలు ఎందుకు ఫెయిల్ అయిందో.., ఏ యాంగిల్‌లో డైరెక్టర్‌కి నచ్చి ఉంటుందో చూద్దామని/తెలుకుందామని అంతటి సాహసానికి ఒడిగట్టాను, నా ల్యాప్‌టాప్ పుణ్యమా అని .. నాకు అర్థం కాని ఒకేఒక్క విషయం అలాగే నా మదిలో ఉండిపోయింది."అసలు థియేటర్‌లో చూసిన వాళ్లు ఎలా భరించారా ఆ సంకల్పాన్ని" అని. అంతేనా.. అసలా సంకల్పం ఏ మెదడు నుండి మొలిచిందా అన్న ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకనేలేదు. ఇంకా చాలా చాలా ప్రశ్నలు సమాధానాలు దొరక్క మనసులోనే కొట్టేసుకుని చచ్చిపోతున్నాయి.. అయినా, ఇంకా లోకం పోకడ తెలియని ఈ చిట్టి హృదయానికి అలాంటి భయానక భీభత్సకర దృశ్యాలు చూపిస్తే ఎలా తట్టుకోగలదు..?
సరే, మన రేకుల గొడవలోకొద్దాం. నేనైతే మొగలి పువ్వుల్ని ఎప్పుడూ చూడలేదు కానీ, పుస్తకాల్లో చదివిన ఙ్ఞానం, ఆనోటా ఈనోటా విన్న పైత్యం కలిసి వాటికి ఒక గౌరవపూర్వకమైన స్థానాన్ని కల్పించాయి.కానీ అదేంటో ఇప్పుడు ఆ పేరు వింటేనే జెమిని టి.వి. గుర్తొస్తూ ఉంటుంది.. అయినా, ఈ ఒక్క సీరియల్‌ని అనుకుని ఏం లాభం లెండి. ఇంకా చాలా ఉన్నట్లున్నాయి ఇలాంటి ఆణి ముత్యాలు, జాతి రత్నాలు. ఏదో ఓ సినిమా(బాగా హిట్టయిన సినిమా) పేరు పెట్టేసి దాన్ని నాలుగు సార్లు రాగయుక్తంగా మాట్లాడేసి (పాడేసి) పాటయిపోయిందనిపించేసి.. ఇలా ఉంటున్నాయి కదూ సీరియల్స్.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినప్పుడల్లా నేను ఎంత బాధ పడిపోతానో తెలుసా.. ఇంకా అందులో బోలెడన్ని బంపర్ ఆఫర్‌లు.. ఉన్నట్లుండి ఒక పాత్ర లోకి ఇంకో వేరే ఎవరో వ్యక్తి వచ్చి నటించేస్తూ ఉంటాడు/ఉంటుంది. ఇదేంటా అని విస్తుపోయే లోగా "తరువాయి భాగ వచ్చే వారం"... ఏదో ఈ భాగం లో బోల్డంత కథ చూపించేసినట్లు..!! తీరా జరిగిందేదో తెలుసుకునే సరికి అప్పటి వరకు అడ్రస్ లేని ఒక ఆక్సిడెంట్ వస్తుంది పిక్చర్‌లోకి.. దానితో పాటు ఒక ప్లాస్టిక్ సర్జరీ..
మనుషులు మారిపోతారు, కానీ మారిన ఆ మనుషుల్ని గుర్తు పట్టకూడని వాళ్లంతా గుర్తు పట్టేస్తారు.. ఒకే మనిషి వేషం మార్చుకుని వెళ్తే ఎవ్వరూ గుర్తు పట్టలేరు.. హేమిటో..
కొన్ని సమయాల్ని/సంఘటనల్ని మనం నిజ జీవితాల్లో ఎంతో మామూలుగా తీసుకుని పక్కకి తప్పుకుని పోతూ ఉంటాం.. కానీ ఈ serials లో అలాక్కాదు. ప్రతి చిన్న విషయానికి, కెమెరా నాలుగు దిక్కుల నుండి రావాలి. ఒక ఎపిసోడ్ అంతా ఆ ఒక్క మొహాన్నే చూపించాలి. మరీ అంత పెద్ద ఆశ్చర్యార్థకం ఉంటుందంటారా మన నిజ జీవితాల్లో.. అంతేనా.. ఇంకా ఎన్నెన్ని బంపర్ ఆఫర్‌లు..? ఏ సీరియల్ తీసుకున్నా ఆడ విలన్లే. సాధారణంగా ఇంట్లో ఉండి ఏమీ తోచక ఈ సీరియల్స్‌ని చూసే వాళ్లంతా ఆడవాళ్లే.. వాళ్ల మనసుల్లో ఎన్ని విషబీజాలు నాటుతున్నాయో ఈ సీరియళ్లు అని తలుచుకుంటే భయం వేస్తూ ఉంటుంది.. అదృష్టం, నాకు మాత్రం ఇష్టం లేదు ఆ చెత్త అంటే.. లేకపోతే నేను ఈ సమయానికి ఓ యశోద(ఆంటీ) లాగానో, ఇంకో (ఇంకే పేరూ గుర్తు రావడం లేదులే..) లాగానో తయారయ్యి ఉండేదాన్నేమో కదూ..!!!! హహ్హహ్హహ్హా.. (విలనీ నవ్వు)

Thursday, September 30, 2010
తోటకూర అనుబంధం..
అవి నేను హాస్టల్ లో కొత్తగా చేరిన రోజులు.. అంటే నా తొమ్మిదవ తరగతిలో కొత్త స్కూల్ కి ఎలాగైనా మారాల్సిందే అని ఏడ్చి గీపెట్టి హాస్టల్ లో చేరిన రోజులన్నమాట.. మరే.. చేరడం అయితే చేరిపోయాను కానీ, హాస్టల్ జీవితం ఎంత అందంగా ఉంటుందో అందులో అడుగు పెట్టిన తరువాత కానీ తెలిసి రాలేదు.. మనిషికొక చిన్న బెడ్. అంటే అందులో నేనూ నా టెడ్డీబేర్ దాని ఫామిలీ అంతా పట్టేట్లుగా కాదండోయ్ (సాధారణంగా సినిమాల్లో అలాగే చూపిస్తాడు కదా). కేవలం నేను మాత్రమే పట్టే బెడ్ అది. భలే బాధగా ఉండేది కొంచెం లావు ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటా అని..:( ఏమిటో బొత్తిగా చదువులు కమర్షియల్ అయిపోయాయి అని ఒకసారి తిట్టేసుకుని కొత్త స్కూల్ ని మిగిలిన విషయాల్లో ఆస్వాదించడం మొదలు పెట్టాను. సరే.. చదువు, ర్యాంకులు అంటే ఎప్పుడూ ఉండేవే.. మరి తిండో..!! ఎంత కష్టం అది (సరిగ్గా ) లేకపోతే..? మొదట్లో మాత్రం భలేగా ఉండేవి రుచిగా.. మరి, నాకు కొత్త కావడం వలన అలా అనిపించిందో.. లేదా.. " ఏదైనా మొదట ప్రజల హృదయాల దాకా చేరగలిగితే తరువాత అది బాలేక పోయినా వాళ్లే చూసుకుంటారు" అన్న సూత్రం ఇక్కడ కూడా అప్లై చేసేశారో తెలియదు కానీ, పిల్లలకు వారి తల్లిదండ్రులకు బ్రహ్మాండమైన భోజనం పెట్టేవారు మొదట్లో. అది చూసి మా నాన్న గారు కూడా చాలా ఆనంద పడిపోయారు. కానీ ఎవరికి మాత్రం తెలుసు..? Infront there is crocodile festival అని..
ప్రతి రోజూ ఉండటానికి మాత్రం చాలా రకాల పదార్థాలు ఉండేవి తినడానికి. ఫలహారం కింద 7 రకాలు, రోజుకొకటి చొప్పున వారం రోజులు. నాకు ఈ రోజుకీ అర్థం కాదు ఆ పదార్థాలని ఫలహారం అని ఎలా అనగలరో. ఒక్కొక్క దానికి ఒక్కో కథ. ఆ కథని ఒక్కో పోస్ట్ లో పంచుకోవచ్చు మీతో. ముఖ్యం గా ఉప్మా గురించి.. సినిమాల్లో ఉప్మా రవ్వ బదులు ఫెవికాల్ వేస్తే ఎలా ఉంటుదో మనకి చాలా సార్లు చూపించారు. నాకు ఎప్పటి నుండో డవుట్, సినిమా వాడికి మా హాస్టల్ యాజమాన్యమే ఆ రెసిపీ అమ్మేసిందేమో అని..;) సరే ఫలహారాల సంగతి కాస్త పక్కన పెడితే, మధ్యాహ్న భోజన పథకం కింద ప్రసాదించే గొప్ప ఉపయోగకరమైన ప్రసాదాలు ఏంటంటే, ఒక పప్పు, ఒక కూర మరియు ఒక పచ్చడి అనబడు పదార్థాలు. అసలు ఆ పచ్చడి గురించి చెప్పాలంటే.. ఒక రెండు పోస్ట్ లు రాయొచ్చేమో. రోజుకొక పచ్చడి పేరు చెబుతారు(బీరకాయ, దొండకాయ, టమాటా, వంకాయ, etc..). కానీ, మా హాస్టల్ యాజమాన్యం ఎంత గొప్పది కాకపోతే వారం రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క రోజు కూడా ముందు రోజు తిన్న పచ్చడికి ఆ రోజు తిన్నదానికి ఒక్క తేడా కూడా కనిపెట్టాలేకుండా అన్ని సంవత్సరాలు (ఇప్పటికి కూడా ఉంది, కానీ అందులో ఫుడ్ ఎలా ఉందో తెలియదు) manage చెయ్యగలుగుతుంది.అదేంటో అన్నిట్లో వేరు శనగల రుచే ఉండేది.
హ్మ్..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు, విశేషాలు, విశేషణలు, ఆశ్చర్యార్థకాలు, ప్రశ్నార్థకాలు ఎదురవుతాయి. కాబట్టి స్ట్రయిట్ గా పాయింట్ లోకి వచ్చేస్తున్నా.. అలా హాస్టల్ లో పెట్టే రకరకాల గడ్డి అంతా తిని కొన్ని రకాల ఇంటి వంటల కోసం, కరువు ప్రాంతాల్లో సహాయ శిబిరాలు విసిరేసే పొట్లాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉండే వాళ్లం.. సింపుల్ గా గోతి కాడ నక్కలా..:)
అలాంటి కొన్ని వంటల్లో కొబ్బరి పచ్చడి, కోడిగుడ్డు కూర, గడ్డ పెరుగు, కాకర కాయ అన్నిటికన్నా ముఖ్యంగా తోటకూర, చుక్క కూర, పాలకూర ( ఇలాంటి ఆకు కూరలన్నీ హాస్టల్స్ లో పెట్టరు, పనెక్కువ అని) ఉండేవి. ఇంటికెళ్లినప్పుడలా మా నాన్నారేమో, కోడి తెప్పించనా, చేప తెప్పించనా, మేక తెప్పించనా అని ఎంతో ప్రేమగా అడుగుతారు. నేనేమో తోటకూర, పాల కూర, కొబ్బరి పచ్చడి అని అంతే ప్రేమగా అడుగుతాను. ఇక్కడో ఆశ్చర్యార్థకము మరియు ప్రశ్నార్థకమూ మా నాన్నగారికి. మా అమ్మ మాత్రం చాలా ఆనందంగా, అలా పెరట్లోకి వెళ్లిపోయి,లేలేత తోటకూర తెచ్చేసి రుచికరంగా వండి పెట్టేది.
ఇంతకీ మా ఇంటి గురించి మా పెరడు గురించి చెప్పలేదు కదూ.. మా ఇంట్లో ఉన్న రెండు పోర్షన్స్ లో మేము మా బాబాయి వాళ్లు ఉంటాము. బాబాయికి ఇద్దరు కొడుకులు, (వాళ్లే) నాకున్న ఇద్దరంటే ఇద్దరే తముళ్లు. నేనేమో వాళ్లకున్న ఏకైన అక్కయ్యని. మా అందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య..:). మా ఇంటి చుట్టు ఒక రెండెకరాల పెరడు ఉంటుంది.ఆ పెరడులో మా తాతయ్య, మొక్క జొన్నలు, పశువులకి జాడు వగైరా పెంచేవారు. మా అమ్మ, పిన్నేమో ఆకు కూరలు, కూరగాయలు పండించేవారు. అన్ని రకాల కూరగాయ పాదులు, మొక్కలు ఉండేవి.
అలా అప్పటికప్పుడు పెరట్లోకి వెళ్లి లేత తోటకూర తెచ్చి కొంచెం టమాటా కలిపి వండితే భలే ఉండేది..:) అలాగే చుక్క కూర పాలకూర కూడానూ.. అలా ఆకుకూరలతో నాకు పుట్టిన అనుబంధం, ఇప్పటికీ పెరిగి పెద్దదయ్యి, పువ్వులు పూసి, కాయలు కాసి, అవి పండి, ఎండి, కిందపడి, విత్తులతో కొత్త అనుబంధపు మొక్కలు మొలిచి, ఒక వట వృక్షం అయ్యి తనివి తీరని అనుబంధం గా మారింది.
నాకు తెలుసు ఇప్పుడు మీరంతా ఏమనుకుంటున్నారో.. ఒకప్పుడు, " తిండి తిప్పలు" అని పోస్ట్ పెట్టేసి తన గోడు వెళ్లబుచ్చుకున్న ఈ అమ్మాయికి ఇలా ఇష్టమైన వంటకాలు కూడా ఉంటాయా అనే కదా.. హ్మ్..ఏం చేస్తాం.. నా హాస్టల్ జీవితం కొన్ని వంటల మీద ఇష్టాన్ని పెంచితే చాలా వాటి మీద తగ్గించేసింది. ఉదాహరణకి ఉప్మా.. ఇలాంటివి చూస్తేనే తిప్పలు పడేది తినడానికి.. :(
మీకు ఇక్కడింకో విషయం చెప్పాలి. నేను మాంసాహారం కూడా తింటాను కానీ అది కూడా మామూలు ఒక కూరలా తినడమే తప్ప, స్పెషల్ గా, ఇష్టం గా తినడం అంటూ ఏమీ ఉండదు. చాలా చాలా తక్కువ. ఇలా ఆకు కూరలు, రోటి పచ్చళ్లు అయితే ఫుల్ గా తినేస్తా. అదిగో సరీగ్గా అక్కడే సామాన్య ప్రజానీకానికి నాకు పెద్దగా పడేది కాదు. నీకిష్టమైన కూర ఏది అనగానే "అశోకుడు చెట్లు నాటించెను, బావులు తవ్వించెను" లాగా తడుముకోకుండాగా వచ్చే సమాధానం తోటకూర. ఆతర్వాత వెంటనే ఏమాత్రం ఆలస్యం కాకుండా మొహమాట పడకుండా వచ్చే శబ్దం లాఫింగ్ క్లబ్ లో నవ్వే నవ్వులు. అందుకే ఈ సమాజం మీద నాకు తీరని పగ, నెరవేరని ప్రతీకారం.
మన దగర ఉన్న ఇంకో మహత్తర నైజం ఏంటంటే.. ఏదైనా కొత్త పదార్థాన్ని ఎన్ని చెప్పినా తినను కానె, ప్రూఫులతో సహా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటే తినేస్తా. అంటే ఆరోగ్యానికి మంచిది కదా అని కష్టపడి తినను. అదేంటొ చాలా సహజంగా దాని మీద ఇష్టం వచ్చేస్తుంది. అదే కోవలోకి, క్యారెట్, కీరా, ఓట్స్, కాకరకాయ(నాకు ఇదంటే భలే ఇష్టం), పాలు ఇంకా చాలా, సాధారణంగా సామాన్య ప్రజానీకం తినడానికి ఇష్టపడనివి మరియు ఆరోగ్యానికి మంచివీ..
కాకరకాయ విషయంలో మీతో ఒక విషయం పంచుకోవాలిక్కడ. నాకున్న ఇద్దరు తమ్ముళ్లలో చిన్నవాడు,వాడు వెళ్తున్న దారిలో ఎక్కడైనా కాకరకాయ తీగ కనిపిస్తే చాలు, అదేదో దేవతలు వాడికోసం అమృతం కాయల రూపంలో పంపించి కాకర తీగల్లో దాచినట్టు తెగ వెతికేసి, కాకరకాయ కోసేసుకుని మనమంతా కొబ్బరి, క్యారెట్ ఎంత ఆనందంగా తింటామో వాడు అంత ఆనందంగా పచ్చి కాకరకాయ తింటాడు. ఇలాంటి రాచకార్యాలు చాలా చేస్తాడులే వాడు. వాడి గురించి ఒక నవల రాసెయ్యొచ్చు, కనీసం ఒక పోస్ట్ అయినా రాసి నా జన్మ సార్థకం చేస్కుంటాను త్వరలో;).
ప్రస్తుతానికి నా తోటకూర కబుర్లు. అదేంటో, సామాన్య ప్రజానీకం సంగతి పక్కన పెడితే నా నేస్తాలు కూడా నన్ను సపోర్ట్ చెయ్యరు ఈ విషయంలో. డిగ్రీలో ఒక్క నేస్తం తప్ప. పేరు అనుపమ. ఏ రోజైనా తోటకూర లంచ్ బాక్స్ లో తెస్తే ఆ రోజు తన బాక్స్ నాకే..:) ఇంకా ఏ రోజైనా నేను వాళ్లింటికి వెళ్తే, వాళ్ల అమ్మకి చెప్పి మరీ ఆరోజు అదే కూర వండిస్తుంది.. ఇప్పటికి కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటే అంటూ ఉంటుంది " ఆ రోజులు మర్చిపోలేము కదూ.. అసలు నాకైతే తోటకూర వండిన ప్రతి రోజూ నువ్వే గుర్తొస్తావు.." అంటుంది. కానీ ఇంకెవ్వరూ అర్థం చేసుకోకపోగా నవ్వేసి, తొక్క.. తోటకూర.. అంటూ హేళన చేస్తారు.. Grrr...
ఇప్పుడు చెప్పండి. మీరంతా ఏం చేస్తారు..? సపోర్ట్ ఇస్తారా..? సామాన్య ప్రజానీకంలో కలిసి పోతారా.? రెండవ దారి మీదైతే తరువాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలిని కాను.(ఏం చేస్తానో ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అందుకే ఇటువంటి శాపం..;)).

Tuesday, September 21, 2010
నేను - నామనసు
టపా రాయాలి. చాలా రోజులు అయిపోయినట్లుంది నా "మనసు పలికి". కానీ, ఏం రాయాలో ఎలా రాయాలో అసలు ఎందుకు రాయాలో అర్థం కాక; అదేదో సినిమాలో బాబూమోహన్ అనుకున్నట్లుగా "ఎందుకు? ఏమిటి? ఎలా?" అన్న ప్రశ్నలు టక టకా అడిగేసుకున్నాను నా మనసుని. కానీ నా మనసేమన్నా చాకోలేట్స్ తినే చిన్న పిల్లా ఇలా బుజ్జగించి అడిగితే చెప్పెయ్యడానికి. నేనంటే మహా కోపం దానికి.. అది చెప్పిన మాట విననని. అందులోనూ, చాలా రోజులుగా పలికించకపోయేసరికి నా మనసు బద్ధకరత్న బిరుదుని సంపాదించుకుని హాయిగా ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. పది రోజులకేనా అని నోరెళ్లబెట్టకండి. బద్ధకం ఆపాదించుకోడానికి 10 రోజులు చాలా తక్కువ సమయం అని తెలిస్తే నా మనసు ఇగో చాలా హర్ట్ అవుతుంది..
అంత బద్ధకంగా వర్షాకాలంలో ముసుగుతన్ని నిద్రపోతున్న నా మనసుని ఇలా హఠాత్తుగా నిద్ర లేపి పలకమంటే ఏం పలుకుతుంది పాపం..? కాస్త ఆలోచించుకోవాలి కదా.
అందుకే.. నాకు ఎలా సమాధానాలు చెప్పాలో అలాగే చెప్పింది.
మరే.. ఎందుకు రాయాలి అని చాలా మర్యాదగా, సవినయంగా అడిగి చూశాను. పనీ పాటా లేక అని సమాధానం వచ్చింది..:(
పోనీ రెండో బాణం అన్నా తగలక పోతుందా అని "ఏమిటి?" అని అడిగేసి ఎంత పొరపాటు చేశానో తరువాత కానీ అర్థం కాలేదు.
కథలు*** ఎబ్బే.. మనకి సరిపోవు. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద బ్లాగరులు బ్లాగరిణి లు కథల మీద కథలు రాసేసి కామెంట్ల మీద కామెంట్లు కొట్టేసి అందులో తల, బ్లాగు పండి పోయి ఉన్నారు. ఇక నువ్వు మొదలెట్టావనుకో ఆ బ్లాగే వాళ్లకంతా కథల మీద విరక్తి వచ్చెయ్యొచ్చు..
పాటలు *** మరద్దే.. ఎకసెక్కాలంటే.. పాటల పరువు తియ్యకు. (నీ జీవితానికి పాటలు రాయడం ఒక్కటే తక్కువ ఇప్పుడు అన్నట్లు) వచ్చేసింది కదా సమాధానం... ఇంకేం చూస్తున్నారు..:(
జోకులు*** హిహ్హిహ్హ్హి.. నువ్వు జోకులు టపా చేస్తున్నావంటేనే నవ్వు వచేస్తుంది. తరువాత ఎవ్వరికీ నవ్వు రాకపోవచ్చు.. లైట్ తీస్కో...
సినిమా రివ్యూలు*** ముందు కొత్త కొత్త సినిమాలు మొదటి రోజో మొదటి వారం లోనో చూడటం నేర్చుకో.. తరువాత రాద్దువులే రివ్యూలు..
బొమ్మలు?? *** వెయ్యక వెయ్యక రెండు బొమ్మలు వేసి పెట్టావ్.. ముందు పూర్తి కాని ఆ బొమ్మని పూర్తి చెయ్యి.. లేదా ఇంకో నాలుగు కొత్త బొమ్మలు వేసి అప్పుడు పెట్టు "నీ పిచ్చి గీతలు" టపా.
ఫోటోలు *** తార గారన్నట్లు రెండు లక్షలు కొట్టు కెమెరా పట్టు.. పోస్ట్ పెట్టు.. (నా ఆర్థిక స్థోమత తెలిసి కూడా...)
పోనీ.... క..వి..త..లు.. *** వద్దమ్మా వద్దు.. నువ్వు కవితలని మొదలెడితే అవి కాస్తా తవికలయ్యి కూర్చుంటున్నాయి..దయచేసి అంత సాహసం చెయ్యొద్దమ్మా..
ఇదంతా కాదు, అసలు నిన్నడిగేదేంటని నా ఙ్ఞాపకాలు స్మృతులు అన్నీ కలిపి ఒక దండగా పేర్చేసి మీ అందరి ముందు ఉంచేద్దామనుకున్నానా.. మరి మనసనే దారం లేకుండా ఎలా.?? :( మాయాబజార్ సినిమాలో యస్.వి.రంగారావు లాగా.. యమలీలలో సత్యనారాయణ లాగా ఒక పెద్ద నవ్వు నవ్వేసి నా మనసు నన్ను కించ పరిచేసి గాయ పరిచేసి ముక్కలు ముక్కలు చేసేసింది..
సామాన్య, సాంఘిక, గణిత, అర్థ, జీవ, పౌర, భౌగోళిక, ఇంకేదైనా శాస్త్రాలు, చరిత్ర సహాయం చేస్తాయేమో అని కూడా చూశాను. అబ్బే.. అవన్నీ చదివేసి చాలా యుగాలు గడిచిపోయినట్లు ఉంది. ఇక రాజకీయం, మన ఒంటికి/ఇంటికి పడదు.. ఇంకేం చేస్తాం..? నోరు మూసుకుని, చెవులు తెరుచుకుని మనసు చెప్పింది వినడం మొదలెట్టాను.
ఎంత విన్నా ఏం లాభం చెప్పండి. చెప్పే మనసుకి వినే మనుషులు లోకువన్నట్లు.. అన్నీ అవకతవకలే.. అన్నీ బ్లాగర్లు భయపడి పారిపోయే ఆలోచనలే.. ఒక్కటైనా సరిగా చెప్పవు కదా నువ్వు అనుకుంటూ(తిట్టుకుంటూ) వింటూ ఉన్నాను.
ఇంత కష్ట పడి వింటూ ఉన్నానా..? కొంచెమైనా జాలి పడాలి కదా.. ఉహు.. ఇంతా చేసి, ఇప్పుడు మత్తులోంచి బైటికి వచ్చినట్లుంది. సినిమాల్లో హీరోకో హీరోయిన్ కో ఆక్సిడెంట్ అయ్యి తలకి పెద్ద గాయం తగిలి "ఎవరు నేను..? ఎక్కడున్నాను..?" అన్నట్లుగా "అసలేం జరిగింది ఇప్పటి వరకూ..? నువ్వు నన్నేమైనా హింసించావా..?" అని నన్నే హింసించడం మొదలెట్టింది..:(
ఇంకేం చేస్తాను.. ఈ సారి చెవులు కూడా మూసేస్కుని పరుగందుకున్నాను..
ఇదిగో.. మిమ్మల్నే..
పెద్ద పెద్ద.. గొప్ప గొప్ప బ్లాగర్లూ.. కాస్త సాయం చేద్దురూ..
" ఏం రాయాలి..? ఎలా రాయాలి.? ఎందుకు రాయాలి..?"
మీ ఋణం వెంటనే తీర్చుకుంటాలే.. మీ టపాల్లో కామెంటేసి..;-)

Wednesday, September 8, 2010
"నేను" నేనే..
మరిప్పుడేమో.. నేను ఎప్పుడో ఇంటర్ లో ఉన్నప్పుడు రాసుకున్న కవిత ఒకటి మీ మీదకి వదులుతానంట.. మీరంతా దాన్ని చకా చకా చదివేసి నన్ను పొగిడెయ్యాలంట..;) లేకపోతే నేను కచ్చే అంట..:)
ఎవరి రంగంలో వారు గొప్పవారే..
ఒక కృష్ణ శాస్త్రి.. ఒక ఐన్ స్టీన్..
ఒక డావిన్సీ.. ఒక మదర్ థెరిస్సా..
ఎవరి దృక్పథంలో చూస్తే వారిది మంచే..
ఒక అరుణ్ శౌరి.. ఒక బిన్ లాడెన్...
ఒక దేవదాసు.. ఒక నేను..
ఎన్ని సార్లు అనుకున్నానో.. సాహిత్యంలో కృష్ణ శాస్త్రినవ్వాలని..
ఇంకెన్ని సార్లనుకున్నానో.. ఐన్ స్టీన్ గుర్తింపు నాకుండాలని..
డావిన్సీ కుంచె నాచేతికొస్తే బాగుండుననుకున్న సందర్భాలు లెక్క లేవు..
ఎన్నో సార్లు థెరిస్సాకే అమ్మనవ్వాలనిపించింది..
ఒకనాటి కృష్ణ రజనిలో..
నా కనుపాప నిశ్శబ్ధంగా..
కను రెప్పల చాటు నుండి స్వప్నాలను ప్రసవిస్తుంది..
తనకే సంబంధం లేదన్నంత అమాయకంగా..
ఆ కలల పరంపరలోనే..
అందర్నీ చూస్తాను నాలా..
నన్ను చూసుకుంటాను అందరిలా..
అంతలోనే కనుపాప ఏదో గుర్తొచ్చిన దానిలా.. చప్పున కళ్లు తెరుస్తుంది..!
తన లోగిలిలో ఏముందో చూద్దామనేమో..
అదేంటో నేను, నేనుగానే ఉంటా..
రాత్రి తాలూకు స్వప్నాలను ఏరుకోవడం కోసం విఫలయత్నం చేస్తూ ఉంటాను..
స్వప్నాలు కదా..! దొరకవు.
మొదట.. నిరాశగా.. తరువాత.. రాజీ పడుతూ..
ఆ తరువాత అమితానందంతో..
"నేను"..
నేనుగానే ఉంటాను..
నేను నేనుగానే ఉండాలనుకుంటాను..
తెలుసు కదా.. ఎవరికి వారు గొప్పే..:):)

Friday, August 20, 2010
అందమె వ్వాఆ..నందం..
మనం ఎప్పుడైనా ఒక అందమైన వస్తువుని చూసినప్పుడో.. అందమైన దృశ్యాన్ని చూసినప్పుడో.. అందమైన అబ్బాయిని/అమ్మాయిని చూసినప్పుడో.. ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోతాం. అలా ఏదైనా అందంగా కనిపించినప్పుడు కనీసం ఒక్క క్షణమైనా చూడకుండా ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. అంతెందుకు, ఉన్నంతలో అందంగా కనబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందమంటే అంత ఇష్టం. ఆ అందానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాం అంటే అందంగా ఉంటే జీవతం అంతా ఆనందంగా ఉండిపోగలం అన్నంతగా (డవుటా..? ఈ పాట వినండి "అందమె ఆనందం.. ఆనందమె జీవిత మకరందం..") తలా తోక లేని ఈ ఉపోద్ఘాతం ఏంటా అని చూస్తున్నారా.? మరదే.. చెప్పేది calm గా వింటానంటేనే చెప్తాను. లేదంటే కచ్చే.. హహ్హ.. అదీ అలా రండి దారికి.
నేను డిగ్రీ చివరి సంవత్సరం లో ఉన్నప్పుడు అనుకుంటా.. నా ఒకానొక నేస్తం బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటే, నేను కూడా తోకలా తన వెంట వెళ్లాను. నేను ఒక చిన్న పల్లెటూరి నుండి రావటం వలన , హైదరాబాదు కి వచ్చి మూడు సంవత్సరాలు అయినా చదువు మీద(??) ఇతరత్రా విషయాల మీద ( అంటే చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్పడం, ఏదో కొంచెం సంగీతం పట్ల కూడా అవగాహన కలిగించుకుందాం అన్న సదుద్దేశంతో వయొలిన్ పాఠాలు నేర్చుకోవడం, తెలుగు నవలలు కథలు చదువుకోవడం లాంటివన్నమాట.) ధ్యాస పెట్టడం వలన అప్పటి వరకూ బ్యూటీ పార్లర్ ముందున్న మొదటి మెట్టు మీద కూడా అడుగు పెట్టలేదు. కానీ నా దురదృష్టమో అదృష్టమో.. ఆరోజు.. అందమంటే ఎంత బాధో నాకు తెలిసి రావాల్సిన రోజు.. అలా నా నేస్తంతో బ్యూటీ పార్లర్ కి వెళ్లాను. సరే వెళ్లాను, కానీ ఎంచక్కా తన పని తను కానిస్తూ ఉంటే, ఒక మూల కూర్చుని చూస్తూ ఆనందించవచ్చు కదా. ఉహు.. అలాక్కాదు. నాకు కూడా ఫేషియల్ చేసెయ్యమని ఆర్డర్ ఇచ్చేశాను. "ఏ ఫేషియల్?" అన్నది ఆ పార్లర్ హెడ్ ప్రశ్న. నా నేస్తం మాత్రం ఏదో చెప్పేసింది. నాకు వినిపించలేదు. మరి తెలియదు అంటే పరువు పోతుంది కదా. అందుకనే చాలా తెలివిగా "ఏమేమి ఉన్నాయి?" అని నా బాణాన్ని సంధించాను. నార్మల్,******,గోల్డ్. అయ్యబాబోయ్.. ఇదేంటి?? చిత్రగుప్తుడు తప్పుల చిట్టా చదివినట్లు చదువుతుంది అని అనుకునేలోగా ఒక పేరు మాత్రం నన్నాకర్షించింది. ఫ్రూట్ ఫేషియల్. మళ్లీ ఎక్కడ మర్చిపోతానో అని ఠక్కున చెప్పేశా.. సరే పేరు చెప్పేశాం. మరి తరువాత సంగతి? మెళ్లో గొలుసు, చెవుల జూకాలు తీసెయ్యమని చెప్పింది. సరే పాపం అని తీసేశా. ఎంచక్కా ఒక పెద్ద ఈజీ చెయిర్ మీద కూర్చోబెట్టింది. జుట్టంతా పైకి కట్టేసింది. ఆహా ఎంత గొప్ప మర్యాద అనేస్కున్నాను మనసులో. ఇక మొదలు పెట్టింది ఫేషియల్ ప్రహసనం. నన్ను మాత్రం కళ్లు మూసుకో అని చెప్పి నాకు మొదటి సారి జరిగే ఆ మహత్కార్యాన్ని నేను చూస్కోకుండా చేసింది. పోనీలే పాపం అని ఈ విషయంలో కూడా కళ్లు మూసేస్కోని త్యాగం చేసేశాను. ఏదో నీళ్ల లాంటి ద్రావకంతో మొహమంతా కాటన్ తో క్లీన్ చేసింది. (దీన్నే Cleansing అంటారని నాకు తరువాత తెలిసింది..:) ) ఎంచక్కా తను అలా సుతారంగా కాటన్ తో తుడుస్తూ ఉంటే.. ఆహా నా మనసు ఎక్కడెక్కడికో ఎగిరిపోయింది. ఆ తరువాత ఏదో పదార్దం తో మసాజ్ చెయ్యడం మొదలెట్టింది. నాకు ఆ క్షణంలో "అనుభవించు రాజా.." పాట గుర్తు రావడం ఇప్పటికీ గుర్తుంది:) అలా అలా స్వర్గలోకపుటంచులదాకా వెళ్లాను. అదిగో అప్పుడే మసాజ్ చెయ్యడం ఆపేసి మళ్లీ కాటన్ తో తుడిచేసింది. మరేమో అప్పుడు నాకు చాలా కోపమొచ్చేసింది. ఎందుకంటారేమిటి..? అలా స్వర్గాన్ని ఆశ చూపించి చివరి నిమిషంలో ఇలా లెఫ్ట్ లెగ్ పట్టుకుని లాగెయ్యడం ఏమైనా బాగుందా..? అప్పుడు మొదలయింది నా మొహానికి ఏదో వేడిగా తగలడం. ఆ వేడి కొంచెం కొంచెం గా ఎక్కువ అవుతూ ఉంది. (కళ్లు మూస్కున్నాను కదా నాకు అక్కడ ఏం జరుగుతుంది అని తెలియదు. అది స్టీం అట. తరువాత తెలిసింది). బాబోయ్ అది చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. ఆపవే బాబూ అని మనసులోనే అభ్యర్ధిస్తూ నా ముఖ కవళికలతోనే ఆ బ్యూటీషియన్ కి చెబుతూనే ఉన్నాను. అప్పుడే Koktail jiuce అనుకోని ఒక లీటరు ఆముదం తాగినట్లుగా పెట్టాను నా మొహం. అయినా అర్థం చేస్కోదే..! బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది , కాస్త తప్పించవే ఆ వేడిని అనుకుని నా మొహాన్ని అటు ఇటు తిప్పడం మొదలెట్టాను. అప్పటికీ కరుణించదే.. అలా బరువుగా భారంగా మంటగా చాలా సుదీర్ఘ ఘడియలు గడిచిన పిదప, ఆ దేవుడు నా మొర ఆలకించి ఆ బ్యూటీషియన్ చెవిలో నా గోడును వేసినట్లున్నాడు. ఆపేసింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నానా. అంతలోనే మళ్లీ ఏమైందో.. దేనితోనో నా ముక్కుని గిల్లడం మొదలెట్టింది (removing black/whiteheads అట.). బాబోయ్.. ఈ సారి ఆముదం ఒక్కటే కాదు అన్ని రకాల నూనెలు, కూల్ అండ్ హాట్ డ్రింకులు ఇంకా ప్రపంచంలో ఎన్ని రకాల ద్రావకాలు ఉన్నాయో అన్నీ కలిపి కడుపులో పోసినట్లుగా పెట్టాను మొహం. కళ్లు మూసుకోవడం వల్ల ఆ పరికరం ఏంటో చూడలేకపోయాను కానీ, ఆ క్షణానికి మాత్రం మళ్లీ ఆ శివయ్యే నాకు శతృవులా కనిపించాడు, తన త్రిశూలాన్ని ఈ బ్యూటీషియన్ చేతికి ఇచ్చి. ముక్కంతా నొప్పి, మంట. ఎన్ని రకాల హావభావాలు ప్రదర్శించినా పట్టించుకోదే..! అదిగో.. సరిగ్గా అప్పుడే.. అప్పుడే అర్థమైంది. అసలు అందం కోసం ఎంత బాధ పడతామో.. అందంగా కనిపించడం కోసం ఎంత బాధ పడతామో.. నాకు తెలిసినంత వరకూ అందంగా ఉన్న తర్వాత కూడా ఎదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. అసలు అందమంటేనే బాధ అన్న విషయం అప్పుడే అర్థమైంది.. ఇక లాభం లేదని మనసులో బోల్డన్ని తిట్లు తిట్టేస్కున్నాను. ఓయీ పాపాత్మురాలా. దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట దుర్మదాంధురాలా... ఎంతో సున్నిత సుకుమారమైన ఈ యువరాణివారి ముక్కుని ఇవ్విధమ్ముగా హింసించెదవా..! రేపు సూర్యోదయం కల్లా నీ ముక్కు మీద వెయ్యి కాదు కాదు లక్ష black/whiteheads వచ్చి గంట సేపు నిన్ను ఇలాగే కూర్చోబెట్టి ఇదే త్రిశూలంతో నీ ముక్కుని మరో బ్యూటీషియన్ హింసించు గాక. హ్హ. అసలు నా ఈ తిట్లన్నీ వింటే నన్ను ఇంకో గంట అలాగే కూర్చోబెట్టేదేమో.. :( అసలే అందరికీ అందమంటే ప్రాణం. లక్ష blackheads రావాలి అని మొక్కుకున్నాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా..! అలా ఎంతో కష్టపడిన తరువాత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అదృష్టం, ఈ సారి నా చేత ఇంకేమీ తాగించలేదు. మళ్లీ మసాజ్ మొదలు పెట్టింది. తెలుసు కదా, మళ్లీ స్వర్గలోకపుటంచుల దాకా వెళ్లొచ్చాను. ఆ తరువాత ఏదో ఫేస్ ప్యాక్ అని ఒక 20 నిమిషాలు కూర్చోబెట్టి ఫేషియల్ అన్న బృహత్కార్యాన్ని పూర్తి చేసింది.
ఆరోజు మాత్రం మంగమ్మ శపథం , భీష్మ ప్రతిఙ్ఞ లాంటివి ఎన్నెన్నో చేసేస్కున్నాను మళ్లీ బ్యూటీ పార్లర్ తలుపులు తట్టొద్దని (జుట్టు కత్తిరించుకోడానికి తప్ప). ఆ తరువాత ఈరోజు వరకూ వెళ్లలేదు ( ఒక రెండు సార్లు వెళ్లాను- ఫేషియల్ కే.. ;) హిహ్హి)
సో.. తోటి బ్లాగర్లారా..! అర్థం అయింది కదా, ఇక్కడ మీరు నన్ను కాక ఆ బ్యూటీషియన్ ని సపోర్ట్ చేస్తే, ఆ శాపం మీకు కూడా వర్తిస్తుంది. హహ్హహ్హా..
P.S.: టైటిల్ లేదా ఇంకే విషయంలోనైనా, ఏదైనా సలహా ఉంటే ఇటు పడేసి మీరు శాప విముక్తి పొందొచ్చు..:):)

Monday, August 9, 2010
నా పిచ్చి గీతలు..
అంటే.. నేను గీసిన బొమ్మలన్న మాట. ఇవి కూడా ఇప్పుడు గీసినవి కాదు లెండి. నా డిగ్రీ రోజుల్లో.. చెప్పాను కదా, నన్ను నేను కోల్పోయాను అని. ఈ విషయంలో కూడా..
ఎలా ఉంది.? ఇప్పుడు ఇంకో చిత్రం.. :))
చాలా బాగుంది కదూ!! కానీ ఇక్కడో తిరకాసు ఉంది మరి. కింద చూడండి.
ఇంకా పూర్తవ్వలేదు.. :( ఎప్పుడో నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో మొదలు పెట్టాను. డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు అయింది.. ఇంకా ఆచిత్రం అదే దశలో ఉంది.:( చూసినప్పుడల్లా బాధగా ఉంటుంది. పోనీ అలా అని దాన్ని పూర్తి చేద్దాం అంటే పెన్సిల్ రాదు. కష్టపడి పెన్సిల్ వచ్చినా చెయ్యి రాదు.పొరపాటున ఆ చెయ్యి గీసేస్తాను అని మారాం చేసినా, మనసు మాత్రం ఖచ్చితంగా రాదండీ.. ఎక్కడ ఆ చిత్రాన్ని పాడు చేసేస్తానో అని చచ్చేంత భయం. అందుకే దాన్ని పూర్తి చెయ్యాలంటే ధైర్యం రావట్లేదు :(
అందుకే అంటారేమో.. ఎంత, పులి గడ్డి తినడం మొదలెడితే మాత్రం, కోతి కొబ్బరి చిప్ప తినడం మానేస్తుందా అని. (ఇక్కడ మీకొక చిన్న మనవి. దయచేసి, ఈ వాక్యం అర్థం కానీ, ఇక్కడ సందర్భానికి , ఈ వాక్యానికి సంబంధం కానీ నన్ను అడగొద్దు. అది దైవ రహస్యం...)

Monday, August 2, 2010
తిండి.. ' తిప్పలు '..
ఇంటి తలుపు తెరవగానే ఘుమఘుమలు.. ఇంట్లో పంచభక్ష్య పరవాన్నాలు.. సూప్ లు, సలాడ్లు, పళ్లు, స్వీట్లు ఇంకా తినదగిన ఎన్నో రకాల వంటకాలు... మీకు నోరు ఊరుతుంది కదూ!! కానీ ఇవన్నీ పడని వాళ్లు ఎవరైనా ఉంటారా..? (ఆరోగ్య రీత్యా తినకూడని వాళ్లు మినహాయింపు.). తినాల్సిన టైం అయితే చాలు, అబ్బా అర గంట ముందే కదా తిన్నది ( ఇక్కడ అర గంట అంటే ఓ నాలుగైదు లేదా ఆరు గంటలు వేసేస్కోండి.. ), మళ్లీ తినాలా అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా..? విందు భోజనాలకి వెళ్లినప్పుడు అక్కడ వాళ్లు పెట్టే రకరకాల వంటలను చూసి (నిజానికి చూడకుండానే) ఈ సారి ఏ సాకు చెప్పి తప్పించుకోవాలా అని తలకిందులుగా తపస్సు చేసినంత పని చేసేవాళ్లు ఉంటారని మీకు తెలుసా..? కడుపులో ఆకలి ఉంటుంది, చేతిలో కంచం, అందులో అన్నం with పప్పు, కూర మరియు పెరుగు కూడా భేషుగ్గా ఉంటాయి. కానీ, అతి కష్టం మీద ఆరు ముద్దలు పట్టించి ఏడో ముద్దకి ఆపసోపాలు పడే వాళ్లని చూశారా..? ఆ కంచం లో అప్పుడే ఒక నాలుగైదు కోళ్లు breakdance చేసి వెళ్లినట్లుగా ఉండటం చూశారా..?
అసలు ఏంటి ఇదంతా అని ఆలోచించకండి.. పైన అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక సమాధానం ఉంది. అవన్నీ నా గురించి ఉద్భవించిన ప్రశ్నలే.. ఇంకా చెప్పాలంటే అలా చేసేది నేనే.. హిహ్హీహ్హీ.. :) మరదే.. మరీ నన్నలా చూడకండి.. నేను ఇక బ్లాగడం మానేస్తాను మీరలా చూస్తే.
చిన్నప్పుడు మా అమ్మ ఒక కథ చెప్పింది. ఈ మానవ జన్మలని సృష్టించిన మొదట్లో.. శివుడు నంది కి చెప్పాడంట, "నువ్వు భూ మండలానికి వెళ్లి అక్కడ మనుషులు అనబడు ప్రాణులకి ఈ విధంగా చెప్పు : రోజూ తలస్నానం, వారానికి ఒకరోజు భోజనం" మరి మన నంది గారేమో, అన్ని లోకాలని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా దాటుకుంటూ, అన్ని వింతలు విశేషాలని తన్మయత్వంతో చూసుకుంటూ వచ్చి అసలు విషయాన్ని మర్చిపోయి, శివుడు చెప్పిన ఆ రెండు ముక్కల్నీ అటు ఇటు గా ఇటు అటు గా మార్చి చెప్పిందట. అంటే, వారానికి ఒకరోజు తలస్నానం మరియు ప్రతి రోజూ భోజనం.. (మరి రోజుకు మూడు సార్లు ఎందుకు తింటున్నాం అని మాత్రం నన్ను అడగకండేం..నాకు కూడా తెలియదు) అలా నా జీవితం తారు మారు అయ్యిందండీ.. ఆ మహాపరాధానికి గాను, నంది గారికి శివుడు గారు " ప్రతి రోజూ భోజనం అంటే ఎక్కడి నుండి వస్తుంది..? నువ్వెళ్లి పొలాల్ని దున్ని సాగు చెయ్యడంలో రైతన్నలకి సాయం చెయ్యి పో" అని శెలవిచ్చారట. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ నా గురించి ఎవ్వరూ పట్టించుకోరేం..? రోజూ మూడు పూటలు తినడం అంటే ఎంత కష్టం మీరే చెప్పండి.. నాకు ఇంత అన్యాయం చేసిన ఆ శివుడు ( చేసింది నందే గానీ, శివుడి ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదండీ.. అందుకని, ఆ మహాపరాధానికి కారకుడు ఆ శివయ్యే అని మొర పెట్టుకుంటున్నాను యువర్ ఆనర్..) పోనీలే పాపం రోజూ ఏం తింటుంది ఈ ఒక్క పూటకు తినకులే అమ్మా అని ఎవరి బుర్రలో అయినా బుద్ధి పుట్టించాడా అంటే అదీ లేదు. ఎంత సేపూ తిను అని అరిచే వాళ్లే గానీ ఈ రోజుకి వద్దులే అనే వాళ్లు ఒక్కళ్లు కూడా లేకపోవడంతో నా చిన్ని మనసు ఎం...తో... గాయపడి పోయి బయటకొచ్చిన రక్తం కాస్తా కన్నీళ్ల రూపంలో ఆ నలుగురినీ మారుస్తుందనుకుంటే.. అది కూడా నా అత్యాశే అయింది.:( ఎంతో సత్కారణం గల నా ఏడుపుని కించ పరిచి పగిలిన నా గుండె ని ముక్కలు ముక్కలు గా చేసేశారు.
అలా భారమైన నా గుండె కి ఎడారిలో ఒయాసిస్సు లాగా.. చలికాలం లో వేణ్ణీళ్ల లాగా.. ఇంకా చెప్పాలంటే నడి రాతిరిలో టార్చి లైట్ లాగా.. నాకు ఒక నేస్తం దొరికింది. అవి, నా నేస్తం నేను ఒకే హాస్టల్ ఒకే రూం లో ఆడుతూ పాడుతూ ఉండే రోజులు. చాలా విషయాల్లో మా అభిప్రాయాలు కలిసేవి. ముఖ్యంగా తిండి తినేటప్పుడు తిప్పలు పడే విషయంలో..అందరూ మా అన్యోన్యతను చూసి కుళ్లుకుని మమ్మల్ని తిట్టే వాళ్లు, అన్నం సరిగ్గా తినట్లేదన్న వంకతో.. అయితే మాత్రం, అంత చిన్న విషయం కూడా మాకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది..? మేము మాత్రం మాకు ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా ఎంత మంది మమ్మల్ని వారించినా.. అన్నం తినడం అనే కార్యక్రమాన్ని మినిమం గంటన్నర కూడా లేకుండా పూర్తి చెయ్యలేదెప్పుడూ.. అలా ఎంతో ఆనందంగా గడిచిపోయే రోజుల్లో ప్రశాంతంగా ఉన్న సముద్రంలో సునామీ వచ్చినట్లుగా నా జీవితం లో కూడా ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన నా జీవితంలో నాకు నచ్చని(అప్పుడు నచ్చని) ఎన్నో మార్పులను తెచ్చింది. ఇప్పుడు ఆ సంఘటన మీకు చెప్తాను. దయచేసి మీరు కన్నీరు కార్చొద్దు నాకోసం.
మరేమో నాకు ఇంకో నేస్తం ఉండేది. నాకు పూర్తి విరుద్ధమైన నేస్తం. అప్పట్లో ఎన్నో సార్లు అనుకునే వాళ్లం , అసలు మన ఇద్దరికీ ఎలా సఖ్యత కుదిరిందబ్బా అని.. కానీ ఇది కూడా శివయ్య పనే అని తర్వాత తెలిసింది. నన్ను లావు చెయ్యడమే తన జీవిత పరమావధి గా పెద్ద కంకణం కట్టేస్కుని వాళ్ల ఇంట్లోనే ఉండమని చెప్పేసింది. అంటే నాకు అప్పటికి ఆ కంకణం సంగతి సరిగ్గా తెలియక నేను కూడా చాలా ఆనంద పడి పోయి వెంటనే పెట్టె బేడా సర్దుకుని వెళ్లిపోయాను. చూస్తే ఏముంది, ఆంటీ నర్సు, అంకుల్ నర్సెస్ కో-ఆర్డినేటర్.. అంతా ఆరోగ్య మయం.. అది తిను , ఇది తిను.. అప్పుడు అర్థం అయింది, కంకణం నా నేస్తం మాత్రమే కట్టుకోలేదు, ఆంటీ, అంకుల్ కూడా చాలా బలంగా కట్టేస్కున్నారని. ఇంకేముందీ, వాళ్లందరి బలమైన కంకణ బలం ముందు నా బలహీనమైన్ సంకల్ప బలం చాలా చిన్నదైపోయింది. అంతే కాదు చాలా చాలా దారుణంగా ఓడిపోయింది..:( ఆ కంకణాలను చూసి మా అమ్మ నాన్న మాత్రం ఎంతో సంతోషపడిపోయారు. నేను మాత్రం అలా ఓడిపోయిన బాధతో అన్నీ తినేస్తూ కాలం గడిపేశాను. అలా నన్ను మార్చే క్రమంలో ఒకరోజు జరిగిన చిన్న సంఘటన ఇంకా నా మదిలో పదిలంగా ఉంది. ఒకరోజు రాత్రి నేను అన్నం తినకుండా నిద్ర పోతూ ఉంటే, ఆంటీ వచ్చి లెగమ్మా కొంచెం అన్నం తిని పడుకో అని బ్రతిమిలాడుతూ ఉన్నారు. నేనేమో ఊర్మిళా దేవి తోబుట్టువులా నిద్రపోతూనే ఉన్నాను. పాపం పిలిచీ పిలిచీ విసిగిపోయిన ఆంటీ "నేను నా కూతురిని కూడా ఎప్పుడూ ఇంతగా బ్రతిమిలాడలేదు. లేమ్మా.. తిని పడుకో" అన్నారు. అంతే, చటుక్కున లేసి తినేసి పడుకున్నాను.:)
ఆ తర్వాత నా డిగ్రీ అయిపోవడం, ఉద్యోగం వచ్చేయడం, ఇల్లు మారిపోవడం చక చకా జరిగి పోయాయి. కానీ ఇప్పటికీ కలుస్తూ ఉంటాను ఆంటీ, అంకుల్ ని. ఎప్పుడు ఫోన్ చేసినా ఒకటే ప్రశ్న, ఎమైనా లావు అయ్యావా అని. కలిసినప్పుడు మాత్రం, ఇక నువ్వు లావు అవ్వవులే అన్న నమ్మకమైన చూపు.:( ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తూ ఉంటుంది. కానీ, నిజానికి ఇప్పుడు నేను చాలా health conscious అయ్యాను అంటే అది మాత్రం ఆంటీ, అంకుల్ వల్లనే.. నేస్తం..నాకు అటువంటి మంచి ఆంటీ, అంకుల్ ని ఇచ్చినందుకు నీకు నా ధన్యవాదాలు.:)

Monday, July 26, 2010
గణితంలో పదనిసలు..
అవి క్రీ.పూ.2 వ సంవత్సరపు రోజులు.. అంటే నేను 2వ తరగతి చదివే రోజులు అన్నమాట. మరేమో అప్పుడు నేను మా చిన్న పల్లెటూరిలో ఉన్న ఒక చిన్న బడికి వెళ్లేదాన్ని. మా చుట్టుపక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకి అదే పాఠశాల. మానాన్న గారేమో ఆ నాలుగైదు గ్రామాలకి ఉన్న ఒకే ఒక తపలా కార్యాలయానికి(పోస్ట్ ఆఫీసు) తల అన్నమాట (అదేనండీ హెడ్). అంతే కాక మా పాఠశాల విద్యా కమిటీ కి అధ్యక్షులు కూడానూ.. అంచేత, మనం స్కూల్ లో ఎన్ని అల్లరి చిల్లరిపనులు చేసినా, ఎన్ని కోతి వేషాలు వేసినా ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. ఇంకో విషయం ఏంటంటే ఎంత అల్లరి చేసినాచదువులో మాత్రం ఎప్పుడూ ముందు ఉండేదాన్ని. అంచేత ఉపాధ్యాయులకి నేనంటే భలే ఇష్టం. మా నాన్నగారు స్కూల్ కి వచ్చినప్పుడల్లా, ఉపాధ్యాయులంతా నా గురించి గొప్పగా చెప్తుంటే, నేను భలే ఆనంద పడిపోయే దాన్ని. మా నాన్నారేమో గర్వ పడిపోయేవారు. ఆగస్ట్ 15, జనవరి 26 వచ్చాయంటే పండగే. స్కూల్ లో, ఆసుపత్రి లో (మనుషుల ఆసుపత్రి & పశువుల ఆసుపత్రి రెండిటిలోనూ..) ఇంకా బ్యాంక్ లో జెండావందనం జరిపించేవారు. నాకు ఎంత ఇష్టం అంటే జెండావందనం అంటే, రోజూ మా అమ్మని ఎంతో విసిగించి కానీ లేవని నేను, ఆ రోజు నేనే లేచి, నా అంతట నేనేతయారయ్యి, ఎవరూ రాక ముందే స్కూల్ కి వెళ్లి పోయేదాన్ని. ముందు రోజు రాత్రి వరకూ ఉండి ముగించిన రంగుకాయితాల అలంకరణకి తుది మెరుగులు దిద్ది, స్నేహితుల తో జాతీయ గీతం మరియు గేయం కూడా పాడటానికి సిద్ధమయ్యేదాన్ని. అలా చాలా ఆనందం గా గడిచిపోయేవి రోజులు. కానీ కాలానికి ఏదైనా అందాన్ని/ఆనందాన్ని చూస్తేకన్ను కుట్టకుండా మానదు కదండీ.. నాకు మాత్రం ఆ కుట్టడం ఏదో ఎక్కాల(టేబుల్స్) రూపం లో వచ్చింది.. అన్నీ బాగాచదివే నేను, ఆ ఎక్కాల విషయానికొస్తే మాత్రం, గోడ కుర్చీ వెయ్యకుండా ఇంటికి వెళ్లేదాన్ని కాదు:( పోనీ ఆ మాస్టారుకైనా, పోనీలే పాపం ఎన్ని రోజులు అలా గోడ కుర్చీ వేయిస్తాం, ఈ సారికి వదిలేద్దాం లే అన్న బుద్ధి పుట్టించొచ్చుగా.. అలాజరిగే సమస్యే లేదన్నట్టుగా రోజు రోజు కీ ఆ "కుట్టడం" ఇంకాస్త ఎక్కువయ్యేది. ఏదో కష్టపడి, అలా అలా నెట్టుకొచ్చానా.. 6వ తరగతి లో వచ్చాయి, అవేవో లెక్కలు. Ax+By+C అంటాడు, 2Ax+7By+d అంటాడు, ఆ రెండిటినీ కలపమంటాడు. దాన్ని చూస్తుంటే నాకు మాత్రం లాటిన్ కి కొంచెం ఎక్కువ, ఉర్దూ కి కొంచెం తక్కువ గా కనిపించేది. అందులోనూ, మాకు అప్పుడు వచ్చిన టీచర్ ఏమో, చాలా ముసలాయన. పెద్ద పొట్ట, గుబురు మీసాలు (వీరప్పన్ కి zoo zoo పొట్ట తగిలిస్తే ఎలా ఉంటుందో అలా అనమాట.) ఎప్పుడూ ఏదో తింటూ ఉండేవాడు. నాకు భలే కోపం వచ్చేది. ఏదీ ఓపిగ్గా చెప్పేవాడు కాదు. కానీ, తప్పు రాస్తే మాత్రం చెవి మెలి తిప్పే వాడు. అప్పుడు నేనేమో నా మీద తెగ జాలి పడిపోయేదాన్ని.(మరి ఆ క్షణం లో ఏనుగు వచ్చి ఎలుక పిల్ల చెవి తిప్పుతున్నట్లుగా ఉండేది.) చెప్పొద్దూ, ఒకసారి నాకు 0 మార్కులు వచ్చాయి. ఇక చూడాలి నా కష్టాలు. ఎక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారో, ఎక్కడ సంతకం పెట్టించుకుని రమ్మంటారో అని. నిజం గా ఆముదం తాగితే ఎలా ఉంటుందో తెలీదు కానీ నాకు ఆ క్షణం ఆ ఫీలింగ్ పరిచయం అయినట్లుగా అనిపించింది. నన్ను ఇంట్లో ఎప్పుడూ తిట్టి , కొట్టి ఎరుగరు కానీ, ఆ సమయానికి నాకు అదే పెద్ద కష్టం. ఇక ఒక నెలరోజుల వరకూ అదే ఆలోచన. నిద్ర కూదా సరిగ్గా పట్టేది కాదు. కలల్లో కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేసి మీ నాన్నని తీసుకురా అని చెప్పినట్లు.. భలే భయం వేసేదిలే. తెల్లవారగానే మా అమ్మ అడిగేది "ఏంటి రాత్రంతా ఏదేదో కలవరిస్తున్నావ్ ఏమైంది" అని. ఇక ఒకటే టెన్షన్, ఎక్కడ వినేసిందో ఎక్కడ తెలిసి పోయిందో అని. :( మనసులో మాత్రం దేవుడిని ఒకటే కోరేసుకునేదాన్ని, దేవుడా దేవుడా.. (క్షణ క్షణం లో శ్రీదేవి లాగా..) ఈ ఒక్కసారికి ఏదో లాగా గట్టెంకిచ్చెయ్యవా అని. తరువాత కష్టపడిపోయి గణిత సామ్రాజ్యాని ఏలేస్తా లాంటి ప్రతిఙ్ఞ లెన్నో చేసేశాను. దేవుడు నన్ను నమ్మేశాడేమో మరి. ఆసారికి మాత్రం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదు (అది జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గవర్నమెంట్ స్కూల్- సాధారణంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటి రిస్క్ లు తీస్కోరు.) కానీ పాపం దేవుడు, నా సంగతి తెలియక ఆ తర్వాత అలాంటి ప్రతిఙ్ఞలు ఎన్నిటినో నమ్మేశాడు. నేను మాత్రం నేను చేసిన ప్రతిఙ్ఞని ఎలా నిలబెట్టుకోకుండా ఉండాలి అన్న విషయం మీద గాల్లోఒక గ్రంథం రాసేశాను. మరి.. మనకి లెక్కలు తక్కువ కానీ తెలివితేటలు తక్కువ కాదుగా.. అలా అలా.. 7వ తరగతి పరీక్షలు, వాటి ఫలితాలు కూడా వచ్చేశాయి. అన్నిటిలో 90% వచ్చి, లెక్కల్ని మాత్రం అత్తెసరు మార్కులతో అధిగమించి కొంచెంలో స్కూల్ ఫస్ట్ అవకాశం పోగొట్టుకున్నాను.
అప్పుడు మొదలయ్యాయి, నా జీవితం లో స్వర్ణ యుగపు రోజులు. నేను ప్రతిఙ్ఞలు చేసేసి అవి తీర్చకుండా ఉన్నందుకు దేవుడే బాధ పడిపోయి నా ప్రతిఙ్ఞలని నేను నెరవేర్చేలా చేశాడేమో.. అందుకే కదా మరి నా లెక్కల సామ్రజ్యం లోకి నాగరాజు అనబడు మంత్రిని పంపించాడు. నేను అప్పుడు ఆ అన్నయ్య దగ్గరికి ట్యూషన్ కి వెళ్లేదాన్ని. అప్పుడు అర్థం అయింది, అసలు లెక్కలు అంటే జస్ట్ స్కెలిటన్ లోని బొక్కలు కాదని, ఆ బొక్కలకి తొడిగిన చాలా అందమైన తోలు కూడా అని. (దయచేసి ఈ పోలిక గురించి ప్రశ్నలు అడగొద్దు. సమాధానాలు నాకు కూడా తెలియదు ;) ).
అలా నా స్వర్ణ యుగంలో చాలా చాలా అనుభవించేస్తూ.. (అంటే నేను అప్పుడు లెక్కల సామ్రాజ్యంలో మకుటం లేని మహారాణిని అనమాట) స్కూల్ మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలేస్తూ 8వ తరగతి పూర్తి చేసేశాను. మరేమో, ఎప్పుడూ ఒకే రాజ్యం అయ్యేసరికి యువరాణి వారికి బోరొచ్చేసి అలా అలా దేశయాటనకై బయలుదేరి 9వ తరగతికి ఒక ప్రయివేట్ స్కూల్ లో స్థిరపడిపోయాను. అప్పుడేమో నేను హాస్టల్లో ఉండేదాన్ని. మా నాన్నగారు వచ్చినప్పుడల్లా మొదట నన్ను అడిగేప్రశ్న "ఎలా ఉన్నావమ్మా" ఆ ప్రశ్నతో నా పక్క ఉండే స్నేహితురాళ్లంతా కుక్కర్లో పెట్టిన కందిపప్పు లాగా ఉడికిపోయి నామీద అసూయ పడేవారు. మరి వాళ్ల నాన్నలంతా మొదటి బాణంగా "ఎలా చదువుతున్నావు?" అని మాత్రమే అడిగేవాళ్లు. మా నాన్న వచ్చిన ప్రతి సారీ నా చదువు గురించి అడుగుతారేమో అని చూసేవాళ్లు. కానీ మా నాన్నఎప్పుడూ అడిగేవాళ్లు కారు. మంచిగా తిను, మంచిగా నిద్రపో అని మాత్రమే చెప్పెవారు. వాళ్ల ఆశ నెరవేరక పోయేసరికి, వాళ్లే చెప్పేవాళ్లు, ఈ సారి అప్పుకే ఫస్ట్ రాంక్ అని. మా నాన్న ఒక చిరుమందహాసం ఇచ్చి ఊరుకునే వాళ్లు. నాకు భలేకోపం వచ్చేది. నేను అంత సాధిస్తే ఇలా తీసి పారేస్తారేంటి అని(ఇప్పుడు తెలుస్తుంది లెండి మా నాన్న చేసిందే మంచి అని). ఇంకా చెప్పాలంటే చాలా చాలా టాలెంట్ టెస్టుల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ పేటెంట్స్ తీసేస్కున్న దానిలా కొట్టుకొచ్చేసేదాన్ని.
లెక్కల్లో మాత్రం ఎప్పుడూ నంబరు9 మేఘం మీదే ఉండేదాన్ని. అలా అక్కడ కూడా రాణి గారి ప్రతాపం చూపించేస్తూ అక్కడి ప్రజలని గడ గడ లాడిస్తూ జెండా పాతేసి(ఎంతగా జెండా పాతానంటే, మా స్కూల్ డైరెక్టరు సర్ కూడా నన్ను "మా అమ్మాయి" అని పిలిచేవారు.) ఎట్టకేలకు 9 మరియు 10 తరగతుల్లో 99/100 మార్కులు కొట్టేసి స్కూల్ ఫస్ట్ గా నిలిచిపోయి చివరికి అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రతిభా అవార్డు కూడా తీసేస్కుని అలసిపోయి వేసవి సెలవుల్లో బాగా విశ్రాంతి తీసేస్కున్నారన్నమాట.
ఇక 10వ తరగతి లో మన ప్రావీణ్యం చూసిన అదే యాజమాన్యపు ఇంటర్ కాలేజీ వారు, నేనేదో ర్యాంకుల పంటపండించేస్తానని, బంగారు బాతునని ఫీల్ అయిపోయి నన్ను ఫ్రీగా చదివిస్తాం అదే కాలేజీలో అని నోరు జారిపోయారు. కానీ మనం దేవుడితో పెట్టుకున్న ఒప్పందం గురించి వాళ్లకేం తెలుసు.. మరి నేనేమో విధిని/దేవుడిని పట్టించుకోడం మానేశాననుకుంటా.. ఈ సారి కొంచెం ఘాట్టిగానే తన్నింది. అంటే మెల్లగా తన్నుకుంటూ మొదలు పెట్టింది ఇంటర్నుండి. మనం దాన్ని డిగ్రీ లోకి వచ్చాక కూడా లెఖ్క చెయ్యకపోయేసరికి గురి చూసి ఏమాత్రం తప్పకుండా ఘాట్టిగాతన్నిందనమాట. డిగ్రీ 2వ సంవత్సరపు ఫలితాలతో తెలిసివచ్చింది యువరాణిగారికి, తను తన్నబడిందనీ..స్ట్రయిట్ గా వచ్చి సప్లమెంటరీ బకెట్లో పడిందనీ.. అది కూడా తను ఎంతో ఎత్తుకు ఎదిగి వచ్చిన బొక్కల లెక్కల్లో అనీ.. ఇక ఏముందీ..ఏడుపే ఏడుపు..కష్టాలకి సంబంధించిన సామెతలన్నీ ఒకేసారి గుర్తుకొచ్చాయి. అంటే "కష్టాలు మనుషులకి కాక మ్రానులకి/కాకులకి వస్తాయా" "మంచి మనుషులకే కష్టాలు వస్తాయి "etc.. అప్పటికే చేతిలో ఉన్న రెండు జాబు ఆఫర్ లెటర్లు ఇంకా దుఃఖాన్ని పెంచాయి."అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు" అన్నట్లుగా ఫెయిల్ అయినందుకు కాదు, రెండు జాబులు పెట్టుకుని కూడా ఫెయిల్ అయితే నా పరువు ఏ గోదావరి/గంగలో దూకి సూసైడ్ చేస్కుంటుందో అని నా బాధ. అప్పుడు మళ్లీ దేవుడు గుర్తొచ్చాడు. ఈసారి ఇంకా ఘాట్టిగా మొక్కేస్కున్నాను. 108 ప్రదక్షిణలు చేసేస్తానని. ఇంకా ఏమేమో ఏమేమో చేసేస్తానని. ఈసారి దేవుడు నమ్మడు అని ఫిక్స్ అయిపోయాను. కానీ చిత్రం, దేవుడు నమ్మేశాడు.. నన్ను మళ్లీ గట్టెక్కించేశాడు. ఎంతైనా దేవుడు దేవుడే కదా.. అలా గట్టెక్కేసిన తరువాత, మొత్తానికి డిగ్రీ ముగించాను అనిపించి ఉద్యోగంలో జాయినయిపోయి ఇలా కాలాన్ని వెళ్లదీస్తున్నానన్నమాట. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తూ ఉంటుంది. నా లెక్కల గ్రాఫు మాత్రం నాకు ఒక కార్డియోగ్రాఫుని తలపిస్తూ ఉంటుంది. :)

Friday, July 16, 2010
ఐటి లో పంటపొలాలు..
ఈ రోజు మా కార్యాలయం లో జరిగిన ఒక చిన్న సంభాషన తరువాత నాకు వచ్చిన ఒక చిలిపి ఆలోచనని ఇలా ఒక టపాగా రాస్తే బాగుండు అనిపించి మీ ముందుంచుతున్నాను.ఇది ఎవరినీ ఉద్ధేశించి రాసింది కాదు. సరదాగా నవ్వుకోడానికి మాత్రమే ఈ కల్పిత కథనం. ఎవరినైనా కించపరిచినట్లు అనిపిస్తే క్షంతవ్యురాలిని.
ఐటి లో పంటపొలాలు, ఒక్క సారి ఊహించుకోండి.. ప్రతి క్యాబిన్ లో కంప్యూటర్, కీబోర్డ్ ఇంకా ఒక దూరవాణి పరికరం( టెలిఫోన్:) ) కాకుండా.. మట్టి, అందులో మొక్కలు వాటికి పూతలు మరియు కాయలు. చాలా బాగుంది కదూ..!!అంతా పచ్చ పచ్చగా.. చల్లగా. కానీ అంతా ఇలా సవ్యంగా, అందంగా సాగితే అది జీవితం అవదు కదండీ... మధ్యలో డెలివరీ మేనేజరు/ప్రాజెక్ట్ మేనేజరు అనబడు ఇంటి పెద్ద ఉంటాడు కదా.. పోయిన సంవత్సరం ఎన్ని బస్తాలు వడ్లు పండించావ్.. ఈ సంవత్సరం లక్ష్యం ఎన్ని బస్తాలు పండించాలని (గోల్స్ & ఆబ్జెక్టివ్స్).. పోయిన సంవత్సరం పట్టిన పురుగు ఈ సంవత్సరం పట్టకుండా, ఒకవేళ పట్టినా దాని సమూల నిర్మూలనకు తగు ప్రణాళిక సిద్ధం గా ఉందా.. ఆ ప్రణాళిక అందరి ఆమోదం పొందిందా.. ఇలా గత సంవత్సరపు దిగుబడి కి గాను అన్ని రకాల అక్షింతలు వేయించుకుని, కొత్త సంవత్సరపు కొత్త వ్యవసాయానికి వీర నారుల్లా/నారీమణుల్లా ముందుకు సాగుతామా..
అప్పుడు మొదలవుతాయి అసలైన కష్టాలు. అసలే సొంత పొలం కాదాయె (అదేనండీ క్లైంట్ ప్రసాదించిన ప్రాజెక్ట్ కదా). తెచ్చిన విత్తులు(రిక్వైర్మెంట్స్) అర క్యాబిన్ కైతే సాగు చెయ్యాల్సింది ఒక క్యాబిన్. ఎదో ఒక విధంగా కష్టపడి విత్తు నాటడం అన్న బృహత్కార్యాన్ని (మరి అర క్యాబిన్ విత్తులతో క్యాబిన్ కి సరిపడా నాటడం అంటే మాటలా.?) పూర్తి చేస్తాం. మన బాధను అర్థం చేస్కున్నట్లుగా ఆ విత్తులు కాస్తా మొక్కలయ్యి సిద్ధం గా ఉంటాయి. ఇక ఇప్పుడు ఆ మొక్కలను నాటాలి (వేరు వేరు మాడ్యూల్స్ ని కలిపి ఒక అప్లికేషన్ పూర్తి చెయ్యడం అన్నమాట). ఆ కార్యక్రమం కాస్తా పూర్తయ్యాక ప్రశాంతం గా కూర్చుందాం అవి పెరిగి పెద్దయ్యేదాకా అనుకుంటే పొరపాటే.. మధ్య మధ్యలో పురుగులు పడుతూ ఉంటాయి (టెస్టింగ్ లో బగ్గులు వస్తూ ఉంటాయి). వాటికి మందులు కొడుతూ మధ్య మధ్య లో అక్షింతలు వేయించుకుంటూ.. 'పోయిన సారి వచ్చిన పురుగు ని అప్పుడే "సమూల" నాశనం చేయకుండా ఎందుకు రెండో సారి వచ్చే దాకా ఎదురు చూస్తూ ఉన్నావ్..' లాంటివన్నమాట. ఆ విధంగా ఎన్నో రకాల కష్టాలని ఓర్చుకుని పట్టిన పురుగుని "చంపినట్లు చేసి" సంతోషం గా ఉండే సమయం లో.. "లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గుర్తొస్తుంది. పుట్టిన పురుగు చావదు. కేవలం ఒక రూపం నుండి ఇంకో రూపం లోకి మారుతుంది." ఇక అప్పుడు మొదలవుతుంది, మూల కారణాన్వేషణ(రూట్ కాజ్ అనాలసిస్).. అసలు ఆ పురుగు ఎందుకు పట్టింది..? ఎక్కడి నుండి వచ్చింది..? ఎందుకు మరో రూపం లో వచ్చింది..? ఇలా కొన్ని "సులువైన ప్రశ్న"లకి "అతి వేగంగా" సమాధానాలు దొరికాక, వాటి శాశ్వత పరిష్కారానికై మార్గాల వెతుకులాట ప్రారంభమవుతుంది. శాశ్వత పరిష్కారం సంగతి పక్కన పెడితే, ఈ లోపు పట్టిన పురుగు కాస్తా చేనంతా మేసేస్తూ ఉంటుంది. అప్పటి వరకూ నిద్ర పోతున్న మిగిలిన కుటుంబ సభ్యులు(రకరకాల మేనేజర్లు) అంతా మేల్కొని కథ మళ్లీ మొదటి నుండి చెప్పమంటారు.ఇక మళ్లీ ప్రశ్నల వర్షం మొదలవుతుంది. ఇక్కడ ప్రశ్నలకి సమధానాలు చెప్పాలో, అక్కడ చేనుకి పట్టిన పురుగు సంగతి చూడాలో అర్థం కాని అమాయక చక్రవర్తులం అటు అదీ సరిగ్గా చెయ్యలేక, ఇటు ఇదీ సరిగ్గా చెయ్యలేక రెండు విధాలా నష్టపోతాము.ఇవన్నీ కాక, మధ్య మధ్య లో ఎన్ని విత్తులు మొక్కలు అయ్యాయి, ఒక్కో మొక్కకి ఎన్ని ఆకులు వచ్చాయి, ఎన్ని మొక్కలకి పురుగులు పట్టాయి, ఎన్ని పురుగులు నిర్మూలించబడ్డాయి, ఎన్ని బ్రతికి పోయాయి అన్న వాటి మీద రోజు వారీ, వారాంతపు, నెలాంతపు ప్రగతి పత్రాలు.. ఏ రోజు వ్యవసాయం గురించి ఆలోచన మొదలు పెట్టాలి అని ఆలోచించిన క్షణం నుంచి విత్తులు మొక్కలయ్యి, మొక్కలు వరి కంకులయ్యి, కంకులు వరి గింజలయ్యి అవి బియ్యం గా రూపు దిద్దుకుని అవి అన్నం గా మారి, ఎవరో ఒకరి ఆకలి తీర్చేంత వరకూ జరిగిన ప్రతి రూపాంతరాన్ని పొందిగ్గా భద్రపరచాలి(డాక్యుమెంటేషన్)..
ఇదంతా జరిగే లోపే, పంట చేతికొచ్చే సమయం అయిపోతుంది. ఎప్పటి లాగానే రావాల్సిన దానికన్నా పది బస్తాలు తక్కువ పండించి అక్షింతలు వేయించుకోడానికి సిద్ధంగా ఉంటాం. మళ్లీ వచ్చే సంవత్సరానికైనా ఎక్కువ బస్తాలు పండించాలి అన్న లక్ష్యాలు మళ్లీ మొదలవుతూ ఉంటాయి. అది జరగదు అన్న విషయం మాత్రం అందరికీ ఆపాటికే అర్థం అయిపోయే ఉంటుంది.
ఇదండీ ఐటి లో పంటపొలాల కథా కమామీషు.. ఎలా ఉందంటారు..? తప్పకుండా మీ సలహాలని అందిస్తారు కదూ..
మీ అపర్ణ..

Tuesday, July 13, 2010
నా ప్రియ నేస్తం..
నా మనసు మీ అందరితో నేను రాసిన ఒక చిన్ని కవితని పంచుకుంటానని ఉవ్విళ్లూరుతూ ఉంది.. అయ్యయ్యో అలా పరిగెడుతున్నారేంటి..? భయపడకండి,నేను చెప్పేది "నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా.. నేను రచయిత్రిని కానన్న వాడిని రాయెత్తి కొడతా" కవిత కాదులెండి. ఏదో.. నేను చదువుకునే రోజుల్లో నా ఒకానొక ప్రాణ స్నేహితురాలికి అంకితమిచ్చిన కవిత. ఇలా ఈ రోజు మీ ముందుంచుదామని అనిపించింది. ఇక కాచుకోండి మరి.. :)
చిరునవ్వుల సంద్రం లో ఎగిసే అల నీవైతే..
నీ స్నేహం పొందేందుకు పరిగెత్తే నది నేను.
నా కోసం నువ్వు కరిగి మేఘం లా మారావు.
నింగంతా తిరిగి తిరిగి నాకోసం వెతికావు.
మన్ను పై నన్ను చూసి సంకేతంగా గర్జించావు.
నీ చినుకుల స్పర్శతో మధురానుభూతినిచ్చావు.
నీ రాకతో ఆనందం నిండిన ఈ హృదయం తో,
వేదం లా.. నాదం లా.. రాళ్లల్లో నడిచాను.
నిను చేరే కాంక్ష లో అది కూడా మధురమే.
దారిలో మనసులకు నీ ఊసులు తెలిపాను.
విని తరించారని సంతసించి, నీ కోసం వచ్చాను.
నా స్నేహం అందించి.. పాత కథలు విన్నవించి..
బాధలనే మరచిపోయి..అలసటనే అధిగమించి..
నీతోపాటెగిరాను.. ఆ నింగిని తాకాను..
అపుడే మరి తెలిసింది, ఆ విశ్వమే స్నేహమని..
స్నేహం అనంతమని..
మన బంధం అదేనని..
ఎలా ఉంది నా చిన్ని కవిత.. :) చాలా కష్టపడి చదివి నాకు మీ సలహాలను ఇవ్వబోతున్నందుకు ధన్యవాదాలు.. :)

Tuesday, July 6, 2010
నన్ను కోల్పోయాను
మనసు ఏం పలుకుతుందా అని చూస్తున్నారా..? నా మనసు ఎన్నెన్నో చెబుతుందండీ. అవన్నీ ఎవరితో చెప్పాలా అని చూస్తుంటే ఇదిగో ఇలా బ్లాగ్లోకం, బ్లాగాడు వారు కనిపించారు. మన మనసుల్లో ఎలాంటి తింగరి ఆలోచనలు వచ్చినా అవి చదవాల్సిన "బాధ్యత" (ఖర్మ అనుకోండి) మన బ్లాగ్మిత్రులకు ఎల్లప్పుడూ ఉంటుంది..ఉండాలి. ఏమంటారు..? ఇంతకీ చెప్పాలనుకున్నది చెప్పకుండా ఊరికే ఈ ఉపోద్ఘాతం ఎంటా అని చూస్తున్నారా? వస్తున్నా వస్తున్నా.. అక్కడికే వస్తున్నా. ఎప్పుడూ ఖాళీ గా ఉండని మన చిన్న మెదడు కి అప్పుడప్పుడూ సుతి మెత్తని ఆలోచనల చిరుగాలి తాకిడి, విరజాజుల సువాసనల్ని అందించి భావుకత్వాన్ని నిద్ర లేపుతుంది. మరి అలాంటప్పుడు మన మనసుల్లో నుండి బైటికి వచ్చే చిలిపి ఆలోచనలకి అక్షర రూపం కల్పించి, భద్రపరిచి, మిగిలిన వారి మెదడుల్ని కూడా భుజించెయ్యాలని ఎవరికి ఉండదండీ..? అదే కోవలో నేనూనూ..!!
రెండు మూడేళ్ల క్రితం ఇలాంటి ఆలోచనలు చాలానే వచ్చేవండీ.. మరి ఐటి ఉద్యోగమంటే మాటలా..? మన ఆలోచనల్ని అలవాట్లని ఇట్టే మర్చెయ్యదూ..!! అలా మారిన బాధనంతా మూట గట్టుకుని దానికి ఇలా ఒక రూపాన్ని ఇచ్చానండీ..
నన్ను నేను ఎక్కడో పోగొట్టుకున్నాను..
నాకు తెలిసిన "నేను" కాదు; ఇప్పుడున్న నేను..
ఏమయ్యాను..?
ఇష్టం లేని మార్గం లో.. ఎక్కడో..ఎక్కడో.. ఆగిపోయాను.
"నన్ను" కోల్పోయి నెను పరిగెడుతూనే ఉన్నాను; ఆగకుండా...!
ఎన్నిటినో తడుముతున్నాను; యాంత్రికంగా..!
ఎక్కడ పోగొట్టుకున్నానో తిరిగి చూసే సమయం లేదు,
వెనుక వాడు ముందుకెళ్లిపోయే (పె..ద్ద) ప్రమాదం ఉంది...(!?)
నిలబడి నీళ్లు తాగలేకపోతున్నాను..
అందుకే,
పాలే తాగడం నేర్చుకున్నాను... పరిగెడుతూ.
"అదేంటి అలా పరిగెడుతున్నావు? నాతో పాటే నువ్వు"
అని "నేను" ఎంత చెబుతున్నా వినట్లేదు నేను;
అంత తీరిక లేదు మరి.
ఎక్కడో ఆవేశపు తొందరలో.. అనాలోచితపు దొంతర్లలో.. ఎక్కడో పోగొట్టుకున్నాను.
పరిగెడుతూ చాలానే పారేసుకున్నాను..
"నా" తో మొదలుకొని.. విలువల వస్త్రాల వరకూ..
అలా నగ్నంగా పరిగెడుతూనే ఉన్నాను;
కీర్తి ప్రతిష్ఠల కవచం ఉందన్న భ్రమలో.
మధ్యలో రుధిరపు తూరుపు పలకరిస్తున్నా పట్టించుకోలేదు.
సంగీతపు మధుఝరిలో ఓలలాడించాలని ప్రయత్నించిన శాకుంతలాలని ఛీ పొమ్మన్నాను.
అమాయకపు విరజాజి పై ఆకర్షితమవుతున్న మనసుని గొంతు నులిమి చంపేశాను.
గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న ముసలవ్వని, చూడనట్లే నటించాను.
ఎప్పుడూ నా ముందే పరిగెట్టే సెకన్ల ముల్లుని దాటడం కోసం,
ఎన్నో వదిలేశాను..ఎన్నో మర్చి పోయాను..
మరెన్నో పోగొట్టుకున్నాను.
తెలియడం లేదు..
స్పందించే హృదయాన్ని పోగొట్టుకున్నానో..
హృదయ స్పందననే పోగొట్టుకున్నానో..
మళ్లీ వెనక్కి వెళ్లాలనిపిస్తోంది.
"నా" తో పాటు సాగడానికి...
నా బాధ మీకు అర్ధం అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. కొత్తగా ఈ బ్లాగ్లోకం లోకి ప్రవేశించిన నాకు మీ విలువైన సలహాలని అందిస్తారని ఆశిస్తున్నాను.కోట్లాది ధన్యవాదాలతో..
అపర్ణ.

Subscribe to:
Posts (Atom)