విశాలమైన, అన్ని వసతులు కలిగిన తరగతి గది (హైలీ సోఫిస్టికేటెడ్ ని ఎలా తెనుగీకరించాలి..?) అంటే, రెండు ప్రొజెక్టర్లు, రెండు పెద్ద పెద్ద స్క్రీన్లు, మంచి లైటింగ్ సిస్టం (నిద్ర పోడానికి అనువుగా), ఒక్కో వరుస ఒక్కో మెట్టుపై ఉండేలా ఫిక్స్డ్ టేబుల్స్ .. చెయిర్స్.. ఇంచు మించుగా మంచి సినిమా హాల్లో లాగా. ఇక ఏ.సి. గురించి వేరేగా చేప్పేదేముంది..?
ఆదివారం, మధ్యాహ్నం భోజనం తరువాత సెషన్. క్లాస్‌లోకి రాగానే అందరి పేర్లు, వివరాలు అడిగి తెలుసుకుని ఏదో టాపిక్ చెప్పడం మొదలెట్టారు, సాధారణంగా అర్థ గంట క్లాస్‌కి ప్రెపేర్ అయి వచ్చి దాన్నే రెండు గంటలు చెప్పడానికి ప్రయత్నించే ఆ ప్రొఫెసర్ (ఈయన గురించి మీకు బోలెడన్ని చాడీలు చెప్పాలి.) అలా జూం చేస్తే పై నుండి (అంటే చివరి నుండి) రెండో వరుసలో కూర్చున్న ఒక అమ్మాయి, కుర్చున్నట్లుగా నటిస్తూ నిద్రిస్తున్న అమ్మాయి. నిద్రల యందు తరగతి గదిలో నిద్ర వేరయా అన్నట్లుగా, కలల లోకంలో అలా అలా తేలిపోతూ ఉంది.
మధ్యలో ఎవరో అపర్ణా అని పిలిచినట్లుగా అనిపించి చప్పున కళ్లు తెరిచి చూసింది. ఎవరా ఆ నిద్ర పోయేది అని చూస్తున్నారా...? హిహ్హిహ్హి అది నేనే.. అప్పటి వరకూ బాగా నిద్రలో ఉన్నానేమో, అసలు ఆ పిలుపు కలలోనా ఇలలోనా అన్నది అర్థం కాలేదు;) అలా ప్రొఫెసర్ పిలిస్తే పలకనప్పుడు కనీసం పక్క జనాలైనా మన వంక చూస్తారు కదా అని అటు పక్క ఇటు పక్క కింద పైనా అన్నీ దిక్కులూ చూసాను. ఎవరూ నావైపు చూడటం లేదు. పోనీ మన నిద్ర సంగతి తెలిసి పోయి పిలిచారేమో ఆయన అనుకుంటే, అసలు ఏ మాత్రం కనిపించడానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీ గా పడుకున్నానన్న విషయం గుర్తొచ్చి నా నిద్రాత్మ కసిరింది.
ఇదంతా భ్రమే అని ఘాట్టిగా ఫిక్స్ అయిపోయి(ఈ మధ్య భ్రమలు ఎక్కువైపోయాయిలే) మళ్లీ కలల లోకం లోకి పారిపోదామా అనుకునేంతలో మళ్లీ అదే స్వరం.."Is there anybody named Aparna" అంటూ.. బాబోయ్.. అప్పుడర్థమయింది. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఒక సబ్జెక్ట్ చెప్పి మళ్లీ ఇప్పుడు వచ్చారు మా క్లాస్‌కి ఆ ప్రొఫెసర్. ఎనభై మందిలో నా పేరు+నేను గుర్తుండడం అన్నది నిజంగా కష్టం (బోల్డంత చదివేసి, చక చకా సమాధానాలు చెబితే తప్ప) కాబట్టి నేనే అపర్ణ అన్న విషయం ఆయనకి తెలియదు. ఒక అర్థ గంట ముందే చెప్పాము అందరి పేర్లు కానీ, అంత మందిలో నేను ఏం పేరు చెప్పానో కూడా గుర్తుండడం కష్టమే ఆయనకి.
కాబట్టి ఇప్పుడు తెలిసొచ్చిన విషయమేమనగా, ఆయనకి నేనే అపర్ణ అన్న విషయమే గుర్తు లేదు, ఇంక నేను పడుకున్నాను అన్న విషయం ఎలా తెలుస్తుంది..? అసలు అక్కడ ఒక వ్యక్తి కుర్చున్నట్లు ఆయనకి కింద నుండి కనిపించదు గాక కనిపించదు. అంత బాగా సెట్ చేసుకున్నాను మరి మన ప్లేస్‌ని;) ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవన్నీ ఆలోచించుకునే లోపే మరో సారి వినిపించింది.."So there is no Aparna in this class, is it? " అని.. ఇక నా బుర్ర పాదరసం లా పని చేసింది. మొదటి రెండు సార్లు పలకకుండా మూడో సారి పలికెతే.. హమ్మ బాబోయ్.. తెలిసిపోతుంది. పైగా ఆయన ఏం టాపిక్ చెబుతున్నారో కూడా తెలీదు. అందులో ఏమైనా అడిగి, మన తెల్ల మొహం సమాధానంగా కనిపిస్తే.. ఇక నా తలని, మొహాన్ని ఎక్కడ పెట్టుకునేదీ..? ఎందుకైనా మంచిదని పక్కన అబ్బాయిని అడిగాను."Is he calling me..?" "yes, he is putting some questions to everybody. don't worry, he didn't realise that you are here" అని చెప్పాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చేసుకున్నాను.కానీ, అంత మంచి నిద్ర దూరంగా వెళ్లి ఆకాశంలో కూర్చుంది :( సరేలే ఏదో ఒకటి వినడానికి ప్రయత్నిస్తున్నాను.

ఏమైందో మాస్టారుకి, ఉన్నట్టుండి లాస్ట్‌కి వచ్చారు. అక్కడ ppt లో రాసింది నోట్ చేసుకోండి అని అందరి దగ్గరా ఆగి మరీ చెబుతున్నారు. ముందే చెప్పాను కదా, అర్థ గంట చెప్పాల్సిన దాన్ని రెండు గంటలు చెప్పాలంటే ఇలాంటి మార్గాలు తప్పనిసరి. అప్పుడు భయం మొదలయింది. కొంపతీసి నా దగ్గరికి వచ్చి నీ పేరు అపర్ణే కదూ అని అడుగుతారేమో అని. "చి చి నా పేరు అపర్ణ కాదు, అర్చన" చెప్పేద్దాం అని డిసైడ్ అయిపోయాను;) కానీ నా చేత ఒక అబద్దం ఆడించకుండా బ్రతికించిన ప్రొఫెసర్ గారూ.. ధన్యవాదాలు:)))
నాకు వచ్చిన ఒక ఫన్నీ S.M.S.
నాకు వచ్చిన ఒక ఫన్నీ S.M.S.
If all the Musicians of this world join together and make a sweet Melody to Facilitate Sleep. They still can't win against our lecturers and class books :)