Thursday, September 30, 2010

తోటకూర అనుబంధం..

అవి నేను హాస్టల్ లో కొత్తగా చేరిన రోజులు.. అంటే నా తొమ్మిదవ తరగతిలో కొత్త స్కూల్ కి ఎలాగైనా మారాల్సిందే అని ఏడ్చి గీపెట్టి హాస్టల్ లో చేరిన రోజులన్నమాట.. మరే.. చేరడం అయితే చేరిపోయాను కానీ, హాస్టల్ జీవితం ఎంత అందంగా ఉంటుందో అందులో అడుగు పెట్టిన తరువాత కానీ తెలిసి రాలేదు.. మనిషికొక చిన్న బెడ్. అంటే అందులో నేనూ నా టెడ్డీబేర్ దాని ఫామిలీ అంతా పట్టేట్లుగా కాదండోయ్ (సాధారణంగా సినిమాల్లో అలాగే చూపిస్తాడు కదా). కేవలం నేను మాత్రమే పట్టే బెడ్ అది. భలే బాధగా ఉండేది కొంచెం లావు ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటా అని..:( ఏమిటో బొత్తిగా చదువులు కమర్షియల్ అయిపోయాయి అని ఒకసారి తిట్టేసుకుని కొత్త స్కూల్ ని మిగిలిన విషయాల్లో ఆస్వాదించడం మొదలు పెట్టాను. సరే.. చదువు, ర్యాంకులు అంటే ఎప్పుడూ ఉండేవే.. మరి తిండో..!! ఎంత కష్టం అది (సరిగ్గా ) లేకపోతే..? మొదట్లో మాత్రం భలేగా ఉండేవి రుచిగా.. మరి, నాకు కొత్త కావడం వలన అలా అనిపించిందో.. లేదా.. " ఏదైనా మొదట ప్రజల హృదయాల దాకా చేరగలిగితే తరువాత అది బాలేక పోయినా వాళ్లే చూసుకుంటారు" అన్న సూత్రం ఇక్కడ కూడా అప్లై చేసేశారో తెలియదు కానీ, పిల్లలకు వారి తల్లిదండ్రులకు బ్రహ్మాండమైన భోజనం పెట్టేవారు మొదట్లో. అది చూసి మా నాన్న గారు కూడా చాలా ఆనంద పడిపోయారు. కానీ ఎవరికి మాత్రం తెలుసు..? Infront there is crocodile festival అని..
ప్రతి రోజూ ఉండటానికి మాత్రం చాలా రకాల పదార్థాలు ఉండేవి తినడానికి. ఫలహారం కింద 7 రకాలు, రోజుకొకటి చొప్పున వారం రోజులు. నాకు ఈ రోజుకీ అర్థం కాదు ఆ పదార్థాలని ఫలహారం అని ఎలా అనగలరో. ఒక్కొక్క దానికి ఒక్కో కథ. ఆ కథని ఒక్కో పోస్ట్ లో పంచుకోవచ్చు మీతో. ముఖ్యం గా ఉప్మా గురించి.. సినిమాల్లో ఉప్మా రవ్వ బదులు ఫెవికాల్ వేస్తే ఎలా ఉంటుదో మనకి చాలా సార్లు చూపించారు. నాకు ఎప్పటి నుండో డవుట్, సినిమా వాడికి మా హాస్టల్ యాజమాన్యమే ఆ రెసిపీ అమ్మేసిందేమో అని..;) సరే ఫలహారాల సంగతి కాస్త పక్కన పెడితే, మధ్యాహ్న భోజన పథకం కింద ప్రసాదించే గొప్ప ఉపయోగకరమైన ప్రసాదాలు ఏంటంటే, ఒక పప్పు, ఒక కూర మరియు ఒక పచ్చడి అనబడు పదార్థాలు. అసలు ఆ పచ్చడి గురించి చెప్పాలంటే.. ఒక రెండు పోస్ట్ లు రాయొచ్చేమో. రోజుకొక పచ్చడి పేరు చెబుతారు(బీరకాయ, దొండకాయ, టమాటా, వంకాయ, etc..). కానీ, మా హాస్టల్ యాజమాన్యం ఎంత గొప్పది కాకపోతే వారం రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క రోజు కూడా ముందు రోజు తిన్న పచ్చడికి ఆ రోజు తిన్నదానికి ఒక్క తేడా కూడా కనిపెట్టాలేకుండా అన్ని సంవత్సరాలు (ఇప్పటికి కూడా ఉంది, కానీ అందులో ఫుడ్ ఎలా ఉందో తెలియదు) manage చెయ్యగలుగుతుంది.అదేంటో అన్నిట్లో వేరు శనగల రుచే ఉండేది.
హ్మ్..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు, విశేషాలు, విశేషణలు, ఆశ్చర్యార్థకాలు, ప్రశ్నార్థకాలు ఎదురవుతాయి. కాబట్టి స్ట్రయిట్ గా పాయింట్ లోకి వచ్చేస్తున్నా.. అలా హాస్టల్ లో పెట్టే రకరకాల గడ్డి అంతా తిని కొన్ని రకాల ఇంటి వంటల కోసం, కరువు ప్రాంతాల్లో సహాయ శిబిరాలు విసిరేసే పొట్లాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉండే వాళ్లం.. సింపుల్ గా గోతి కాడ నక్కలా..:)
అలాంటి కొన్ని వంటల్లో కొబ్బరి పచ్చడి, కోడిగుడ్డు కూర, గడ్డ పెరుగు, కాకర కాయ అన్నిటికన్నా ముఖ్యంగా తోటకూర, చుక్క కూర, పాలకూర ( ఇలాంటి ఆకు కూరలన్నీ హాస్టల్స్ లో పెట్టరు, పనెక్కువ అని) ఉండేవి. ఇంటికెళ్లినప్పుడలా మా నాన్నారేమో, కోడి తెప్పించనా, చేప తెప్పించనా, మేక తెప్పించనా అని ఎంతో ప్రేమగా అడుగుతారు. నేనేమో తోటకూర, పాల కూర, కొబ్బరి పచ్చడి అని అంతే ప్రేమగా అడుగుతాను. ఇక్కడో ఆశ్చర్యార్థకము మరియు ప్రశ్నార్థకమూ మా నాన్నగారికి. మా అమ్మ మాత్రం చాలా ఆనందంగా, అలా పెరట్లోకి వెళ్లిపోయి,లేలేత తోటకూర తెచ్చేసి రుచికరంగా వండి పెట్టేది.
ఇంతకీ మా ఇంటి గురించి మా పెరడు గురించి చెప్పలేదు కదూ.. మా ఇంట్లో ఉన్న రెండు పోర్షన్స్ లో మేము మా బాబాయి వాళ్లు ఉంటాము. బాబాయికి ఇద్దరు కొడుకులు, (వాళ్లే) నాకున్న ఇద్దరంటే ఇద్దరే తముళ్లు. నేనేమో వాళ్లకున్న ఏకైన అక్కయ్యని. మా అందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య..:). మా ఇంటి చుట్టు ఒక రెండెకరాల పెరడు ఉంటుంది.ఆ పెరడులో మా తాతయ్య, మొక్క జొన్నలు, పశువులకి జాడు వగైరా పెంచేవారు. మా అమ్మ, పిన్నేమో ఆకు కూరలు, కూరగాయలు పండించేవారు. అన్ని రకాల కూరగాయ పాదులు, మొక్కలు ఉండేవి.
అలా అప్పటికప్పుడు పెరట్లోకి వెళ్లి లేత తోటకూర తెచ్చి కొంచెం టమాటా కలిపి వండితే భలే ఉండేది..:) అలాగే చుక్క కూర పాలకూర కూడానూ.. అలా ఆకుకూరలతో నాకు పుట్టిన అనుబంధం, ఇప్పటికీ పెరిగి పెద్దదయ్యి, పువ్వులు పూసి, కాయలు కాసి, అవి పండి, ఎండి, కిందపడి, విత్తులతో కొత్త అనుబంధపు మొక్కలు మొలిచి, ఒక వట వృక్షం అయ్యి తనివి తీరని అనుబంధం గా మారింది.
నాకు తెలుసు ఇప్పుడు మీరంతా ఏమనుకుంటున్నారో.. ఒకప్పుడు, " తిండి తిప్పలు" అని పోస్ట్ పెట్టేసి తన గోడు వెళ్లబుచ్చుకున్న ఈ అమ్మాయికి ఇలా ఇష్టమైన వంటకాలు కూడా ఉంటాయా అనే కదా.. హ్మ్..ఏం చేస్తాం.. నా హాస్టల్ జీవితం కొన్ని వంటల మీద ఇష్టాన్ని పెంచితే చాలా వాటి మీద తగ్గించేసింది. ఉదాహరణకి ఉప్మా.. ఇలాంటివి  చూస్తేనే తిప్పలు పడేది తినడానికి.. :(
మీకు ఇక్కడింకో విషయం చెప్పాలి. నేను మాంసాహారం కూడా తింటాను కానీ అది కూడా మామూలు ఒక కూరలా తినడమే తప్ప, స్పెషల్ గా, ఇష్టం గా తినడం అంటూ ఏమీ ఉండదు. చాలా చాలా తక్కువ. ఇలా ఆకు కూరలు, రోటి పచ్చళ్లు అయితే ఫుల్ గా తినేస్తా. అదిగో సరీగ్గా అక్కడే సామాన్య ప్రజానీకానికి నాకు పెద్దగా పడేది కాదు. నీకిష్టమైన కూర ఏది అనగానే "అశోకుడు చెట్లు నాటించెను, బావులు తవ్వించెను" లాగా తడుముకోకుండాగా వచ్చే సమాధానం తోటకూర. ఆతర్వాత వెంటనే ఏమాత్రం ఆలస్యం కాకుండా మొహమాట పడకుండా వచ్చే శబ్దం లాఫింగ్ క్లబ్ లో నవ్వే నవ్వులు. అందుకే ఈ సమాజం మీద నాకు తీరని పగ, నెరవేరని ప్రతీకారం.
మన దగర ఉన్న ఇంకో మహత్తర నైజం ఏంటంటే.. ఏదైనా కొత్త పదార్థాన్ని ఎన్ని చెప్పినా తినను కానె, ప్రూఫులతో సహా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటే తినేస్తా. అంటే ఆరోగ్యానికి మంచిది కదా అని కష్టపడి తినను. అదేంటొ చాలా సహజంగా దాని మీద ఇష్టం వచ్చేస్తుంది. అదే కోవలోకి, క్యారెట్, కీరా, ఓట్స్, కాకరకాయ(నాకు ఇదంటే భలే ఇష్టం), పాలు ఇంకా చాలా, సాధారణంగా సామాన్య ప్రజానీకం తినడానికి ఇష్టపడనివి మరియు ఆరోగ్యానికి మంచివీ..
కాకరకాయ విషయంలో మీతో ఒక విషయం పంచుకోవాలిక్కడ. నాకున్న ఇద్దరు తమ్ముళ్లలో చిన్నవాడు,వాడు వెళ్తున్న దారిలో ఎక్కడైనా కాకరకాయ తీగ కనిపిస్తే చాలు, అదేదో దేవతలు వాడికోసం అమృతం కాయల రూపంలో పంపించి కాకర తీగల్లో దాచినట్టు తెగ వెతికేసి, కాకరకాయ కోసేసుకుని మనమంతా కొబ్బరి, క్యారెట్ ఎంత ఆనందంగా తింటామో వాడు అంత ఆనందంగా పచ్చి కాకరకాయ తింటాడు. ఇలాంటి రాచకార్యాలు చాలా చేస్తాడులే వాడు. వాడి గురించి ఒక నవల రాసెయ్యొచ్చు, కనీసం ఒక పోస్ట్ అయినా రాసి నా జన్మ సార్థకం చేస్కుంటాను త్వరలో;).
ప్రస్తుతానికి నా తోటకూర కబుర్లు. అదేంటో, సామాన్య ప్రజానీకం సంగతి పక్కన పెడితే నా నేస్తాలు కూడా నన్ను సపోర్ట్ చెయ్యరు ఈ విషయంలో. డిగ్రీలో ఒక్క నేస్తం తప్ప. పేరు అనుపమ. ఏ రోజైనా తోటకూర లంచ్ బాక్స్ లో తెస్తే ఆ రోజు తన బాక్స్ నాకే..:) ఇంకా ఏ రోజైనా నేను వాళ్లింటికి వెళ్తే, వాళ్ల అమ్మకి చెప్పి మరీ ఆరోజు అదే కూర వండిస్తుంది.. ఇప్పటికి కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటే అంటూ ఉంటుంది " ఆ రోజులు మర్చిపోలేము కదూ.. అసలు నాకైతే తోటకూర వండిన ప్రతి రోజూ నువ్వే గుర్తొస్తావు.." అంటుంది. కానీ ఇంకెవ్వరూ అర్థం చేసుకోకపోగా నవ్వేసి, తొక్క.. తోటకూర.. అంటూ హేళన చేస్తారు.. Grrr...
ఇప్పుడు చెప్పండి. మీరంతా ఏం చేస్తారు..? సపోర్ట్ ఇస్తారా..? సామాన్య ప్రజానీకంలో కలిసి పోతారా.? రెండవ దారి మీదైతే తరువాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలిని కాను.(ఏం చేస్తానో ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అందుకే ఇటువంటి శాపం..;)).

71 comments:

హరే కృష్ణ said...

first comment naade :)

Anonymous said...

నేను కూడా తోటకూర ఫ్యాన్నే..

Krishnapriya said...

చాలా చక్కగా రాశారు. Very Nice.. I am also major fan of greens and రోటిపచ్చళ్ళు

నేస్తం said...

నాకు ఈ పోస్ట్ బాగా నచ్చింది అపర్ణ..శైలి చాలా బాగుంది.. ఇక ఇక్కడ ఆకుకూరలు వారానికి 2 టైంస్ కొంటా గాని తినను..గడ్డిలా ఉంటాయి ..రుచి పచి ఉండదు.. మరి విటమిన్స్ ఏమన్నా ఏడుస్తాయోలేదో వాటిలో..ఇండియాలో అయితే భలే..ఇట్టే అంటే అట్టే ఉడికిపోతాయి..తినేస్తా.. నాకు ఎప్పటి నుండో కోరిక చుక్క కూర తినాలని.. అది తినలా:(

నీహారిక said...

మా ఇంట్లో అందరం తోటకూర ఫాన్సే. నాకయితే ప్రాణం కానీ ఇపుడు తోటకూర కంటే చికెనే చీప్ అయిపోయింది.తోటకూర కొనాలంటే ఎ టి ఎమ్ కార్డ్ తీయాల్సొస్తుంది.

మనసు పలికే said...

కృష్ణ.. నీదే ఫస్ట్ కామెంట్.:)

తార గారూ.. ధన్య్యవాదాలు నాకే సపోర్ట్ చేసినందుకు..:) మళ్లీ ఎక్కడ యాంటీ తోటకూర సంఘాన్ని మొదలు పెడతారో అని భయపడ్డాను..;) ఇదంతా తోటకూర మహత్యం కదూ..:))

కృష్ణ ప్రియ గారూ, మొదటగా స్వాగతం నా బ్లాగులోనికి.. ధన్యవాదాలు నా టపా నచ్చినందుకు..:) మీరు కూడా ఫ్యానా..! ఏంటో అనుకున్నాను. అయితే మనమంతా ఒక సంఘం నడిపెయ్యొచ్చన్నమాట..

నేస్తం అక్కయ్యా.. ఒక్క నిమిషం, అలాగే ఉండండి, ఎక్కడికీ వెళ్లొద్దు... జజ్జినక జజ్జినక ( తన మొదటి చిత్రం "నిన్ను చూడాలని" లో జూనియర్ NTR ని గుర్తు తెచ్చుకోండి..)నా పోస్ట్ మీకు నచ్చింది కదా, అందుకే సెలబ్రేషన్స్..:)) అయితే మీకు కూడా ఇష్టమే అన్నమాట ఆకుకూరలు..:) అయ్యో చుక్కకూర తినలేదా మీరు..?? చాలా బాగుంటుంది పుల్లపుల్ల గా. తోటకూర కన్నా తొందరగా ఉడికిపోతుంది..:)

నీహారిక గారూ.. హహ్హా.. నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా తోటకూర ఫ్యాన్స్ ని ఇంతమందిని చూస్తుంటే.. చికెన్ చీప్ అయిపోయిందా తోటకూర కన్నా..??
>>తోటకూర కొనాలంటే ఎ టి ఎమ్ కార్డ్ తీయాల్సొస్తుంది.
అయ్యయ్యో..

వేణూ శ్రీకాంత్ said...

బాగుందండీ. ఎవరైనా హెల్తీ అని చెప్పగానే మీకు ఎలా ఇష్టం పెరిగిపోతుందో నాకు అలా అయిష్టం పెరిగి పోతుంది :-) strictly no healthy foods concept అనమాట నాది.

కాకరకాయ వేపుడు, గోంగూర పచ్చడి / ఇగురు తప్ప మిగతావేవీ సయించవ్. ఆకుకూరలేవైనా పప్పులో వేస్తే మాత్రం ఇష్టంగా తింటాను. అసలు పప్పులో వేయడానికి తప్ప అవి విడిగా వండటానికి పనికిరావని నానమ్మకం :-)

Bulusu Subrahmanyam said...

తోటకూర నేనూ తింటాను.కానీ మీ సంఘంలో చేరను. ఎందుకంటే మీరు ఉప్మాని ఫెవికాల్ అన్నారు కాబట్టి.ఉప్మా అనగా నేమి? టిఫిన్ల లో కల్లా శ్రేష్టమైన టిఫిన్. ఉప్మా (చేయడం కాదు) తినడం ఎట్లా అన్న విషయం మీద సమగ్ర పరిశోధన చేసి ఓ టపా రాసేయాలని నిర్ణయించుకున్నాను.
బాగా వ్రాసారు (ఉప్మా గురించి తప్ప)

పరిమళం said...

"సినిమా వాడికి మా హాస్టల్ యాజమాన్యమే ఆ రెసిపీ అమ్మేసిందేమో అని..;)" :) :)
అదేంటోనండీ...మీరు చెప్పినదానికి పూర్తివిరుద్ధం మాఇంట్లో ....ఆరోగ్యకరం అంటే చాలు ఆమడదూరం పెడతారు...కారెట్ ,ఆకుకూరలు ,పళ్ళు ఇలాంటివన్నీ అన్నమాట ! నేను వండటం ఐతే మాననులెండి :)

కొత్త పాళీ said...

చిన్నప్పుడు నాక్కూడా చుక్కకూర చాలా ఇష్టం. మీరు మీ బడి హాస్టలు భోజనం గురించి రాసిన ప్రతి వాక్యం మా ఆర్యీసీ హాస్టలు మెస్సు, తరవాత కాంపూరు ఐఐటీ మెస్సు, రెండిటికీ సమానంగా వర్తిస్తాయి.

కొత్త పాళీ said...

@ నేస్తం .. ఇంట్లో కొంచెం సూర్యరశ్మి పడే జాగా ఉంటే, ఒక అల్యూమినియం ట్రేలో మట్టి నింపి మెంతులు చల్లండి. రెండు మూడు వారాల్లో ఒక వంటకి సరిపడా ఫ్రెష్ మెంతి కూర.

మనసు పలికే said...

వేణురాం గారు, ఆకు కూరల గురించి అంత తక్కువ అంచనా వేస్తున్నారా..? అసలు ఎప్పుడైనా తోటకూర విత్ టమాటా కానీ, చుక్కకూర పచ్చడి కానీ తిన్నారా అంట.. వాటి ముందు ఇంకేదైనా దిగదుడుపే..:)

సుబ్రహ్మణ్యం గారు, అంటే మీరు ఉప్మా ఫ్యానా..? :) అదేంటోనండీ, నేను రాసిన టపా చూసేసి మీరు ఎంతో అద్భుతంగా టపాలు రాసేస్తున్నారు..:) " నేను ఎందుకు రాస్తున్నాను" రాసి మాకు నవ్వుల పువ్వులు అందించారు. ఉప్మా గురించి కూడా రాసేద్దురూ.. మనస్పూర్తిగా మళ్లీ నవ్వుకోవాలని ఉంది..:)

పరిమళం గారు, అలా పారిపోయే వాళ్లంతా సామాన్య ప్రజానీకం..;) అవునండోయ్.. నేను పళ్ల సంగతే మర్చిపోయాను.. నాకు పళ్లుంటే చాలు ఇక ఏమీ అవసరం లేదు.. మీరు మాత్రం వండటం మానకండి. అపర భగీరథుల్లా అలా కానిస్తూనే ఉండండి, ఎందుకు తినరో చూద్దాం..:)

కొత్తపాళీ గారు, మీరు కూడా అటువంటి పదార్థాలకి బలయ్యారా..? :( ప్చ్..
>> ఇంట్లో కొంచెం సూర్యరశ్మి పడే జాగా ఉంటే, ఒక అల్యూమినియం ట్రేలో మట్టి నింపి మెంతులు చల్లండి. రెండు మూడు వారాల్లో ఒక వంటకి సరిపడా ఫ్రెష్ మెంతి కూర.
నిజమేనండోయ్.. నేను మీ గోంగూర టపా చూశాను..:)

శ్రీనివాస్ పప్పు said...

"బాబాయికి ఇద్దరు కొడుకులు,(వాళ్లే)నాకున్న ఇద్దరంటే ఇద్దరే తముళ్లు.నేనేమో వాళ్లకున్న ఏకైన అక్కయ్యని.మా అందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య..:)"
ఈ ఒకే తాతయ్య అంటే కొన్నేళ్ళక్రితం కాకినాడ లో మేము కొత్తగా దిగిన అద్దింటి ఓనర్ తో మా సతీమణి కబుర్లు చెప్తూ మాకు "నలుగురు మామ్మలు-ఒక్కడే తాత" అన్నమాట గుర్తొచ్చింది(ఆ దెబ్బకి ఇంటావిడ నోరెళ్ళబెట్టింది).అదృష్టం బావుండి నేను అక్కడే ఉన్నా కాబట్టి సర్దిచెప్పాల్సొచ్చింది ఆవిడ భాషావక్రాన్ని.అసలు విషయం ఏంటంటే ఆవిడ నలుగురు మామ్మలకీ(అక్కచెల్లెళ్ళు)ఆయనొక్కడే తమ్ముడన్నమాట.
ఇకపోతే నా క్లాస్‌మేట్ "తోటకూర" ఇంటిపేరున్నవాడుండేవాడు. చేపలు,కోళ్ళు అవీ తినడం తప్పు కదా(జీవహింస లెక్కల్లో అనేవాళ్ళం)అంటే వాడు మీరు తోటకూర అవీ తినడం కూడా తప్పే అని వాదించేవాడు.ఎందుకూ అంటే "బోస్" చెప్పాడు కదా మొక్కలకీ ప్రాణం ఉంటుందని అని వాదించేవాడు.అదీ సంగతి.
అసలు సంగతి తోటకూర పెసరపప్పు వేడిగా ఉన్నప్పుడొక రుచి చల్లగా ఉన్నప్పుడొక రుచి ఉంటుంది ప్రయత్నించండి.

Anonymous said...

>> నేను పళ్ల సంగతే మర్చిపోయాను.. నాకు పళ్లుంటే చాలు ఇక ఏమీ అవసరం లేదు..

అబ్బా.. ఫ్రూట్స్ ఆ..టీత్ అనుకున్నా..లొల్

Sai Praveen said...

నేను తోటకూర విషయంలో సపోర్ట్ చేస్తా కాని కాకరకాయ విషయంలో మాత్రం చెయ్య. :)

..nagarjuna.. said...

పాలకూర పప్పు + నెయ్యి , తోటకూర/గోంగూర శనగపప్పు, పుదీన + చుక్కకూర , తోటకూర/పాలకూర మటన్ ---- ఆహా లొట్టలేసుకుంటూ గిన్నెలు గిన్నెలు అన్నం లాగించేయవచ్చు :D

ఉప్మాని తక్కువ చేసి పెద్దతప్పు చేసవమ్మాయ్... కృష్ణప్రియ గారూ ఇక్కడే ఉన్నారా, సరే, అపర్ణకు అర్జంటుగా టల్లోస్ ఇంకా అదేదో ఉంది కదూ...ఆ, చుంబస్కర అవి పంపించండి....ఉప్మోపదేశం జరిగిపోలంతే..

..nagarjuna.. said...

కాకరకాయ్ కు సపోర్ట్ చెయ్యరా..ఎపుడైనా కాకరకాయ పులుసుగాని, ఫ్రై గాని తిన్నారాంట...పచ్చి కాకరకాయ్ విష్యంలో నేను సపొర్ట్ చెయ్యనకుకో...అది వేరే విషయం ;)

మనసు పలికే said...

శ్రీనివాస్ గారు, స్వాగతం సుస్వాగతం నా బ్లాగులోకి..:) ధన్యవాదాలండీ కామెంటినందుకు, మరియు మంచి జోక్ మాతో పంచుకున్నందుకు..:)
>>బాబాయికి ఇద్దరు కొడుకులు,(వాళ్లే)నాకున్న ఇద్దరంటే ఇద్దరే తముళ్లు.నేనేమో వాళ్లకున్న ఏకైన అక్కయ్యని.మా అందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య..:)"
హహ్హా. కావాలనే రాశాను ఇలా..:)
మీ క్లాస్‌మేట్ సంగతులు మాత్రం భలే ఉన్నాయి, ముఖ్యంగా బోస్ సిద్ధాంతం తు.చ. తప్పకుండా పాటించడం..:) తోటకూర పెసరపప్పు సంగతి మాత్రం చూడాలి..:)

Anonymous గారూ, హహ్హహ్హా.. భలే పట్టేశారు..:) ఆవేశం ఆనందం ఆగక అలా రాసేశాను..:)

సాయి ప్రవీణ్, హహ్హా.. కాకరకాయ నచ్చదా..?

నాగార్జున, కొత్త కాంబినేషన్స్ చెప్పావ్. తప్పక రుచి చూడాలి..:)
ఉప్మోపదేశమా..? తోటకూర సంఘమేమో గానీ చూడబోతే ఇక్కడో ఉప్మా సంఘం ఏర్పడిపోయేలా ఉందిగా ;)

Anonymous said...

>>వాడి గురించి ఒక నవల రాసెయ్యొచ్చు

నవలా..నేను ఢాం..

అవును పప్పుగారు, మరి అంతే కదా, ఒక మొక్క, రేపు అదే మహా వృక్షం అవ్వోచు, పది మందికి నీడనివ్వోచు, ఒక ఇరవై కాకులకి ఆవాసం కావొచ్చు అటువంటి దాన్ని, కనీసం చెట్టుకుడా కాకముందే మొక్కగా ఉన్నప్పుడే పెకిలించి చంపేసి కూరొండుకోవడం చాలా ఘొరం..ఖండించాల్సిన విషయం.

తోటకూర చింతపండు కాంబినేషన్ మీద ప్రజల అభిప్రాయం ఏమిటో తెలియజేయగలరు..

Anonymous said...

మర్చిపోయాను, ఉప్మా పేరు ఎత్తితే నేను ఇటువైపు రానే రాను, అమ్మో....నాకు భయ్యం...

శ్రీనివాస్ గారు అంటే ఎవరో అనుకున్నాను, వారికి చివర పప్పు ఉండాలి..

మనసు పలికే said...

తార గారు, నవల నేను రాయను లెండి. సుబ్రహ్మణ్యం గారికి అప్పజెప్పేస్తా (రిక్వైర్మెంట్స్ అన్నీ ఇచ్చి) అప్పుడైతే భలేగా నవ్వుకోవచ్చు.
క్లారిటీ మిస్ అయింది తార గారు.. సామాన్య ప్రజానీకం అభిప్రాయం కావాలా.? తోటకూర అభిమాన సంఘం అభిప్రాయం కావాలా..? :D :D

Anonymous said...

ఇద్దరిదీను...

వేణూరాం said...

ఒహో... మీరు కూడా తోట కూర ఫాన్స్ అన్నమాట.. నాకు మా అమ్మమ్మ గారు చేసిన తోట కూర వేపుడంటే...... నా సామిరంగా..కూరలోకి అన్నం నంచుకోవలసిందే.. :)..కాని తోటకూర కన్నా గోంగూర కే నా ఓటు.
ఉప్మా విషయం లో Bulusu Subrahmanyam గారికి నా సపోర్ట్ ప్రకటిస్తున్నాను.. ఇంత ఆలస్యం గా కామెంటుతున్నందుకు చింతిస్తున్నాను :( :( .
కాని కూరల్లో నాకు నచ్చని ఒకే ఒక్క కూర "కీర ". దాన్ని పచ్చిగా అలా ఎలా తింటారు రా బగమంతుడో . :( :(
పాపం పైన వేణు శ్రీకాంత్ గారి కి ఇవ్వాల్సిన రెప్లై నాకిచ్చారు... హిహిహి. .
నైస్ పోస్ట్ అపర్ణ గారు.

వేణూరాం said...

hare krishna ki congratulationss....:)

మనసు పలికే said...

హయ్యయ్యో.. వేణు శ్రీకాంత్ గారు, క్షమించెయ్యండి సర్ నన్ను.. :( పైన పెట్టిన వ్యాఖ్య మీకే..:)

వేణురాం.. మీకు కీరా నచ్చదా..?? హ్మ్.. గోంగూర కూడా బాగుంటుందండోయ్.. సో మీరు కూడా ఉప్మా ఫ్యాన్ అన్నమాట. :(

వేణూరాం said...

గోంగూర "కూడానా"?? హా హా...హా.. గోంగూర కింగ్ కదా అసలు??
కీర?? దాని వాసనే పడదు నాకు...:( :( :( దాని బదులు కాకర కాయ నయ్యం.. మొత్తానికి మీ బ్లాగ్ ని కూరగాయల దుకాణం చేసేసేరు కదండీ..:)

sunita said...

ఊహూ, నేనూ ఆకుకూరలు బాగానే వండుతా, తింటా, పిల్లలతో తినిపిస్తా కానీ ( ఇక్కడ చిరంజీవిని గుర్తు తెచ్చుకోండి. డిక్ష్ణరీలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం టైపులో) తోటకూర ఒక్కటి తప్ప:-) సో, నా వోటు కాదు, కాదు, తోటకూరకు కానే కాదంతే:-)

ఇందు said...

మీ పొస్ట్ చూస్తే నా హాస్టల్ లైఫ్ గుర్తుకొచ్చింది.నేను తోటకూర ఫ్యాన్ నే..కాని అందులో మసాలాలు కాకుండా...ఒక్క చెంచాడు పంచదార వేయాలన్నమాట...ఇంకా కాకరకయ నా ఫేవరెట్....మీరు చెప్పిన కీర,కేరెట్ కూడ తింటా కాని...పాలు ఎం బాగుంటాయండీ...?? అసలు ఈ పాలు..పప్పు ఎవడు కనిపెట్టాడు రా ? అని రోజు తిట్టుకుంటా... :D

ఆ.సౌమ్య said...

నాకూ ఆకు కూరలు చాలా ఇష్టం, తోటకూర పులుసు/కూర, పాలకూర పప్పు, బచ్చలికూర కూర, చుక్కకూర పప్పు/పులుసు, గోంగూర పచ్చడి అన్నీ ఇష్టమే.

మీ హాస్టల్ తిండి మా హాస్టల్ తిండిని గుర్తు చేసింది. కానీ మా ఫుడ్ బానే ఉండేదిలెండి, అప్పుడప్పుడూ మాత్రం మీరు చెపినట్టు ఉండేది...అలా ఉన్నప్పుడు నేను కూర,పులుసు, పచ్చడి, పెరుగు అన్ని ఒకేసారి కలిపేసుకుని కళ్ళు మూసుకుని తినేసేదాన్ని. ఏ మాటకామాటే చెప్పుకోవాలి....మా హాస్టల్ లో బ్రేక్ ఫాస్ట్, గుత్తొంకాయ కూర, కాకరకాయ వేపుడు, పాలక్-ఆలూ కూరఇలా కొన్ని మాత్రం బ్రహ్మాండంగా చేసేవారు, అవి ఉన్న రోజుల్లో నేను కుమ్మేసేదాన్ని. :)

హరే కృష్ణ said...

చుక్కకూర అంటే నాకు చాలా ఇష్టం
తోటకూరా కూడా బావుంటుంది
గోంగూర పచ్చడి అయితేనే మజా
తోటకూర టొమాటో తో వేసుకొని తింటే ఉంటుంది అబ్బా...అమోఘమే
ఇక్కడ ఎవరు కీరా ని కించపరిచినది తమతో ముక్కలు వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని అలా తింటుంటే ఉంటుంది కేకో కేక ఎన్ని పెట్టినా తింటా

హరే కృష్ణ said...

తొ.తో.బ్లా.స (తొక్కలో తోటకూర బ్లాగర్ల సంఘం) ని మొదలు పెట్టిన వారు నష్టపరిహారం గా మూడు లక్షలు డిపాజిట్ చెయ్యల్సింది గా డిమాండ్ చేస్తున్నాం

Krishnapriya said...

నాగార్జునా,

ఉప్మా విషయం లో అపర్ణ కి నా ఫుల్ సపోర్ట్. ఈ ఒక్క విషయానికే అపురూపంగా అసలు 2 కిలోల/లీటర్ల చుంబరస్కా, టల్లోస్ లు ప్యాక్ చేసి పంపిద్దామనుకుంటున్నాను.


అసలు టల్లోస్ లో తోటకూర కలిపి పొడి గా వండుకుంటే (TT) తోటకూర టల్లోస్ ఇంకా అద్భుతం గా ఉంటుంది.! చుంబరస్కా లో కూడా అభిరుచిని పట్టి తగినంత మోతాదు లో చుక్కకూర వేయవచ్చు.

Bulusu Subrahmanyam said...

నన్ను ఇక్కడ ఎవరో తలుచుకుంటున్నారని, ఉప్మా గురించి చెడుగా మాట్లాడుతున్నారని సూతమహర్షి సందేశం పంపారు. వందే ఉపమా ప్రియాం అని సంసృతంలో లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం అన్న శ్లోకంలో రాసారని నా ఆత్మగాడు ఇప్పుడే చెప్పాడు. కాబట్టి లక్ష్మీ ప్రసన్నత కావాలంటే ఉప్మా తినాలి అని వేదాలలో వ్రాసారని తారగారు తెలుసుకోవాలి.
జై ఉప్మా ప్రేమికులందరికి జై జై.

RNP said...

అపర్ణ గారూ,

మీ తిండి, తిప్పలు లో, ఇప్పటి పోస్ట్లో చూసి, హమ్మయ్య నా చిన్నప్పటి వెర్షన్ లాంటి వారు ఉన్నారు అని ఎంత సంతోషించానో మీకు తెలిసే ఛాన్స్ లేదు ! ఈ పోస్ట్ లో, నేను అమృతం లా తినే కాకరకాయ కూర ని ఇష్ట పడే వారు ఉంటారు అని తెల్సుకున్నా. ఇంకా మీ లాగే ఆరోగ్యం అంటే చాలు, ఏదో పూనుతుంది నాకు కూడా.

అనారోగ్యమైనవి తిని ఏమి సాధిస్తాం, అనారోగ్యం తప్ప !

నాకు ఉప్మా ని ఫెవికాల్ అనటం నచ్చింది. :-) ఉప్మా అంటే తెగ ఇష్టమే నాకు కూడా, కానీ మంచిది కాదు కదా, అందుకని ... ...హహహః.

ఏమీ ఉండదు అందులో షుగర్ తెచ్చే గుణం తప్ప .గోధుమ రవ్వ ఉప్మా ని మాత్రం ఏమన్నా అంటే ఊరుకోను, ఆ ... పైగా అది ఫెవికాల్ లా ఉండదు కూడా ...

నాకూ, ఆకు కూరలు అంటే ఇష్టం ఉన్నా ( అవి లేని రోజు ఉండదు మా ఇంట్లో ) -
మీరు నాకు ఇష్టమైన మీ పేరు కి అన్యాయం చేసారు కాబట్టి మీ సంఘంలో చేరను.

పర్ణము = అనగా ఆకు

ఒక కథ వాడుక లో ఉంది మీ పేరుకి ...మీకు తెలిసే ఉంటుంది ...

పార్వతీ దేవి శివుడి కోసం తపస్సు చేస్తూ, ముందు కందమూలాలు, తర్వాతా అవి కూడా మానేసి... చాల కాలం ఆకులు మాత్రమె తినేదట. అవి తినటం కూడా మానేస్తే, అక్కడి మునులు - ఈవిడే అపర్ణ ( (కనీసం) ఆకులు కూడా తిననిధీ ) అని నామకరణం చేసారుట.

అపర్ణ అనే పేరు పెట్టుకుని - పర్ణములు గొప్పవి అని రాస్తే, పాపం మీ పేరు మౌనం గా రోదిస్తుంటుంది.

Sai Praveen said...

నాకు అపర్ణ వల్ల ఈ రోజు ఒక విషయం తెలిసింది. బ్లాగు లో ఏం రాయాలో మన మనసు మనకి చెప్పకపోతే ఇలా తోటకూర కబుర్లు చెప్పాలి :P

మనసు పలికే said...

వేణురాం గారు..
>>మొత్తానికి మీ బ్లాగ్ ని కూరగాయల దుకాణం చేసేసేరు కదండీ..:)
నా బ్లాగా..? కూరగాయల దుకాణమా.?? అయ్.. ఆకుకూరల దుకాణం అనండీ అప్పుడు క్షమించేస్తాను మిమ్మల్ని..:)


సునీత గారు, అదేంటండీ అన్నీ తింటాను అనేస్తే ఎంచక్కా మా సంఘమే అని ఫీల్ అయిపోయాను..:( లాస్ట్ లో ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటీ..??:(


ఇందు గారూ, నాకు కూడా మసాలాలంటే అస్సలు పడదు..
>> అసలు ఈ పాలు..పప్పు ఎవడు కనిపెట్టాడు రా ? అని రోజు తిట్టుకుంటా
అదేంటండీ.. పాలు చాలా మంచివి(ట) ఆరోగ్యానికి...


సౌమ్య గారూ. హేమిటో.. ఇక్కడ అందరూ హాస్టల్ బారిన పడినవారే అనుకుంట పాపం..:( అయినా మీరు కొంచెం అదృష్టవంతులు లెండి. కొంచెం బాగానే ఉండేవి కదా మీ హాస్టల్ కూరలు..:)

మనసు పలికే said...

కృష్ణా.. అయితే మనమంతా కలిసి నిరభ్యంతరంగా ఒక సంఘం పెట్టెయ్యొచ్చేమో మన అభిరుచులన్నీ పరిగణనలోకి తీసుకుని.
3 లక్షలు ఎవరు డిపాసిట్ చెయ్యాలి ఇంతకీ.???:(

కృష్ణప్రియ గారు, చుంబరస్కా, టల్లోస్ లు అనగానేమి..:( నాకు జనరల్ నాలెడ్జి కొంచెం తక్కువ, క్షమించగలరు..:( అయినా ఏదైతేనేమి, తోటకూర మీద, నా మీద అభిమానంతో మీరు అలా పంపిస్తానంటే నేనెందుకు కాదంటాను..? అది కూడా ఉప్మా మీద ఇంతటి వ్యతిరేకత ఉన్నందుకు..:) తొందరగా పంపించెయ్యండి..:)


సుబ్రహ్మణ్యం గారు, సూతమహర్షి మధ్యలో ఎక్కడి నుండి వచ్చారండీ..:( మీకు భలే సందేశాలు అందించేస్తారు..
>>వందే ఉపమా ప్రియాం
ని ఉప్మా చేసేశారా.!!!!!!!!!!!!!!


RNP గారూ.. ధన్యవాదాలండీ..:)
చాలా సంతోషంగా ఉంది నాలాగే ఇంకొకరు కూడా ఉన్నందుకు.. :))
హ్మ్.. ఇక నా పేరు విషయానికొస్తే నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టారు చెప్పారు ఈ కథ..:) (తరువాత నేను చాలా మందికి అంటే నా పేరుకి అర్థం అడిగిన అందరికీ చెప్పి చావగొట్టాననుకోండి..;))
అయినా నా పేరు గురించి కూడా ఒక టపా రాసెయ్యమని మొన్ననే నా మనసు చెబితే సరేలే అనుకున్నాను. ఇదేంటండీ ఇలా చెప్పేశారు ముందుగానే స్టోరీ.. నా మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి..:P ఇప్పుడు నాకు ఎవరైనా అపాలజీ చెప్పాల్సిందే..;)

సాయి ప్రవీణ్ గారూ.. హహ్హహ్హ.. భలే పట్టేశారు..;)

Anonymous said...

పనిలో పనిగా నాక్కూడా ఒక అపాలేజి చెప్పుకోండి, దీవిస్తాను..

ఆ లచ్చలు నా దగ్గిర డిపాజిట్ చేసుకోవచ్చు, మీ సొమ్ములు నా తాన వశిష్ట వాహన్ కన్నా భద్రంగా ఉంచబడును.

శివరంజని said...

అపర్ణ 2 డేస్ హాలిడేస్ పోస్ట్ చూడటానికి లేట్ అయ్యింది ....ఇంకా చదవ లేదు చదివి వచ్చి మళ్ళి కామెంట్ పెడతా

శివరంజని said...

హ..హ..హ.అపర్ణ .రైతు బజార్ లో కూరగాయలన్ని వచ్చేసాయి నీ పోస్ట్ లో ...చాలా బాగా రాసావు .. కొన్ని లైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి..... ఎవరైనా వెజ్ ఆర్ నాన్ వెజ్ లైక్ చేస్తారు ..నువ్వేంటి వెరైటీగా లీఫీ వెజ్ ఇష్టమంటున్నావ్ ... నువ్వు ఇంత తోటకూర పాన్ వి అనుకోలేదు .సుమీ .. నేనయితే తోటకూర కాదు గాని గోంగూర పచ్చడికే ఓటు వేస్తా ... ఇంక కాకరకాయ , బీన్స్ అటువంటివి అస్సలు ఇష్టం ఉండదు ...

మనసు పలికే said...

తార గారూ.. అపాలజీ అన్న పదం వచ్చేసి చాలా సేపయింది ఇంకా తార గారు ప్రత్యక్షం అవ్వలేదేంటా అనేసుకున్నాను..:D హమ్మయ్య వచ్చేశారుగా..:)))
>>ఆ లచ్చలు నా దగ్గిర డిపాజిట్ చేసుకోవచ్చు, మీ సొమ్ములు నా తాన వశిష్ట వాహన్ కన్నా భద్రంగా ఉంచబడును.
హహ్హహ్హా.. తప్పకుండా..

రంజని, సో నీకు గోంగూర మాత్రమే నచ్చుతుందన్నమాట. హ్మ్.. ధన్యవాదాలు టపా నచ్చినందుకు..:) అవును, నాకు తోటకూరంటేనే ఇష్టం..హహ్హా..

ఒక అఙ్ఞాత నేస్తం వల్ల పూర్తయిన టపా ఇది..:) నాకు తోటకూర ఇష్టం అనగానే నా నేస్తం నవ్వేసి ఇచ్చిన ఐడియా ఇది..:) సో.. వచ్చిన వ్యాఖ్యలన్నీ తనకే చెందుతాయి..:) బ్లాగ్ముఖంగా తనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..

jaggampeta said...

wow thotakooraku inthe seen undhaa?

మనసు పలికే said...

జగ్గంపేట గారు,
>>wow thotakooraku inthe seen undhaa?
అయ్.. ఏమిటండీ మీ ఉద్దేశ్యం..! అసలు తోటకూర గురించి ఏమనుకుంటున్నారు.. ఏమన్నా అంటే ఇక్కడ తోటకూర ఫ్యాన్స్ సంఘం ఊరుకోదు.. హహ్హహ్హా.. ;)

శిశిర said...

:) బాగుంది. నాకు కూడా తోటకూర అంటే చాలా ఇష్టం.

హరే కృష్ణ said...

:( ఇదేం బాగాలేదు నాకు మూడు లక్షల విలువ చేసే బంగారం అంటే చాలా ఇష్టం

హరే కృష్ణ said...

మీ ఫ్రెండ్ ఎక్కడ తార కు సమాధానం చెప్పండి

హరే కృష్ణ said...

తోటకూర ఇష్టమైన వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేయండి
తోటకూర సంఘం పార్టీ ఫండ్ కి

హరే కృష్ణ said...

మినిమం అయిదు వేలు collect చేయండి
మూడు లక్షలకి 60 మంది సరిపోతారు :)

హరే కృష్ణ said...

49

హరే కృష్ణ said...

యాభైవ కామెంట్ నాదే

హరే కృష్ణ said...

మార్పు శిఖామణి నాయకత్వం వర్ధిల్లాలి
తూర్పు తిరిగి దండం పెట్టుకొని ఆ కెమెరా డబ్బులు ఇక్కడ కొట్టండి

హరే కృష్ణ said...

రంజనీ విన్నావా చూసావా అని కామెంట్ పెట్టడం మర్చిపోకండి

మనసు పలికే said...

కృష్ణ.. నా డవుట్ నిజం గా నిజం అయింది. నాకు తెలుసు. నువ్వు ఒక కౌంటర్ ఏదో maintain చేస్తున్నావ్. కామెంట్స్ యాభై కి లేదా వందకి దగ్గర పడితే చాలు నీ వ్యాఖ్యాస్త్రాలు చకచకా పంపించేసి పూర్తి చేస్తావ్..:)

మనసు పలికే said...

శిశిర గారు.. అయితే మీరు కూడా మా సంఘ సభ్యులే అన్నమాట..:) ధన్యవాదాలు కామెంటినందుకు..:)

అశోక్ పాపాయి said...

:-(((((((((((((...????

మంచు said...

తెలుగు బాష లొ నాకిస్టం లేని ఏకైక కూర పేరు తొటకూర .. ఇంకా కొన్ని ఉన్నాయ్.. బచ్చలి కూర, చుక్కకూర, మెంతికూర, బీరకాయ, దొండకాయ, ఆనపకాయ, దోసకాయ, పొట్లకాయ, కాలిఫ్లవర్, క్యేబేజి, ముల్లంగి, చేతులు నొప్పిపుడుతున్నాయ్...ఇక్కడితొ లిస్ట్ ఆపేస్తా...

మంచు said...

>>>> మా ఇంట్లో ఉన్న రెండు పోర్షన్స్ లో మేము మా బాబాయి వాళ్లు ఉంటాము. బాబాయికి ఇద్దరు కొడుకులు, (వాళ్లే) నాకున్న ఇద్దరంటే ఇద్దరే తముళ్లు. నేనేమో వాళ్లకున్న ఏకైన అక్కయ్యని. మా అందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య..:). మా ఇంటి చుట్టు ఒక రెండెకరాల పెరడు ఉంటుంది.ఆ పెరడులో మా తాతయ్య, మొక్క జొన్నలు, పశువులకి జాడు వగైరా పెంచేవారు. మా అమ్మ, పిన్నేమో ఆకు కూరలు, కూరగాయలు పండించేవారు. అన్ని రకాల కూరగాయ పాదులు, మొక్కలు ఉండేవి. >>>>

మా అన్నయ్య సినిమాలొ రాజశేఖర్ ఇల్లులా ఉంటుందా మీ ఇల్లు

మంచు said...

లేత తోటకూర చూసి నోరు ఊరడం ఎమిటి.. మేక లా :)

మనసు పలికే said...

అశోక్..
>>:-(((((((((((((...??? అర్థమేమి.?? :(


మంచు గారు.. అయితే మీరు కూడా తొ.తో.బ్లా.స. సభ్యులన్నమాట. కాబట్టి అర్జెంట్ గా కృష్ణ కి మూడు లక్షలు ఇచ్చెయ్యండి..:)
>>మా అన్నయ్య సినిమాలొ రాజశేఖర్ ఇల్లులా ఉంటుందా మీ ఇల్లు
హహ్హహ్హా. కాదు లెండి..:)
>>లేత తోటకూర చూసి నోరు ఊరడం ఎమిటి.. మేక లా :)
తోటకూర అభిమాన సంఘ సభ్యురాలిగా నేను దీని తీవ్రాతి తీవ్రంగా ఖండించేస్తున్నాను. కామ్రేడ్స్.. అందరూ ఏకంకండి. ఇలాంటి (తోటకూర అభిమాన) సంఘ విద్రోహ చర్యలను కంబైండ్ గా ఖండిద్దాం...;) :D

మంచు said...

అంత లేదు... నేస్తం గారు మా వైపు ఉన్నారు (తొ తొ బ్లా స వైపు)... ఇక మీరేం చేస్తారు:-))

మనసు పలికే said...

మంచు గారు..
>>ఇక ఇక్కడ ఆకుకూరలు వారానికి 2 టైంస్ కొంటా గాని తినను..గడ్డిలా ఉంటాయి ..రుచి పచి ఉండదు.. మరి విటమిన్స్ ఏమన్నా ఏడుస్తాయోలేదో వాటిలో..ఇండియాలో అయితే భలే..ఇట్టే అంటే అట్టే ఉడికిపోతాయి..తినేస్తా
ఈ వ్యాఖ్య సారం అదా..?? అలా అనిపించడం లేదే.. ;);)
>>బచ్చలి కూర, చుక్కకూర, మెంతికూర, బీరకాయ, దొండకాయ, ఆనపకాయ, దోసకాయ, పొట్లకాయ, కాలిఫ్లవర్, క్యేబేజి, ముల్లంగి, చేతులు నొప్పిపుడుతున్నాయ్...ఇక్కడితొ లిస్ట్ ఆపేస్తా...
నాకో డవుట్ ఇక్కడ..:) అసలు మీరు ఏం తింటారో తెలుసుకోవచ్చునా..;) నాకు తెలిసి తినేవాటి లిస్టే చిన్నగా ఉంటుందేమో కదూ..:)

శివరంజని said...

అపర్ణ నిజమే చెప్పడం మర్చిపోయాను ... అపర్ణ అంటే పర్ణములు తిననిది అని అర్ధం ... 50 కామెంట్స్ దాటినందుకు కంగ్రాట్స్

మంచు గారు : మీ కామెంట్ సూపర్ ...కాని పాపం మన అపర్ణ మేక కాదు బంగారమే

హరే కృష్ణ గారు : >>రంజనీ విన్నావా చూసావా అని కామెంట్ పెట్టడం మర్చిపోకండి<< ............ మీ కామెంట్ అర్ధం కాలేదు

మనసు పలికే said...

రంజనీ..
>>అపర్ణ అంటే పర్ణములు తిననిది అని అర్ధం..
అవును..:) ధన్యవాదాలు..:)
>>కాని పాపం మన అపర్ణ మేక కాదు బంగారమే
ధన్యవాదాలు రంజనీ.. నువ్వయినా నన్ను అర్థం చేసుకున్నావు..:)
>>రంజనీ విన్నావా చూసావా అని కామెంట్ పెట్టడం మర్చిపోకండి
ప్రతి సారీ నన్ను కానీ నిన్ను కానీ ఎవరైనా (ముఖ్యంగా హరే కృష్ణ ;)...) ఏమన్నా అంటే నేను అలాగే పిలుస్తా కదా "రంజనీ చూశావా " అంటూ.. అందుకే అలా పెట్టి ఉంటాడు కృష్ణ.. అంతేనా కృష్ణ..?

మంచు said...

వాళ్ళింట్లొ ముక్కలేక పొతే ముద్ద దిగదు అని ఎదొ పొస్ట్లొ చెప్పారు...అవిడ గొంగూర కొంటే..గొంగూర చికేన్ కొసం అన్నమాట... చింతచిగురు కొంటే రొయ్యల కూరలోకి.. మేథీ కొంటే మటన్ లోకీ అలా.... ఇప్పుడెవరొ చుక్కకూరతొ చందువా చేప అని కొత్త వంట చెప్పారట (కృష్ణ ప్రియగారు అయిఉంటారు :-) )...ఇప్పుడర్దం అయ్యిందా వ్యాఖ్యాసారం :-))

అయినా... లేలేత చిగుర్లతొ అప్పుడే పుట్టిన బుల్లి బుల్లి మొక్కలని మీ జిహ్వా చాపల్యం కొసం పుటుక్కున తెంపెయ్యడం పాపం కదూ... జాలి వెయ్యదు వాటిని చూస్తే :-))

మనసు పలికే said...

>>అయినా... లేలేత చిగుర్లతొ అప్పుడే పుట్టిన బుల్లి బుల్లి మొక్కలని మీ జిహ్వా చాపల్యం కొసం పుటుక్కున తెంపెయ్యడం పాపం కదూ... జాలి వెయ్యదు వాటిని చూస్తే :-))
మరే.. దీన్ని బట్టి నాకు అర్థమయిన విషయమేమనగా, మీకు కోడి, మేక, చేప కంటే తోటకూర, చుక్కకూర, పాలకూర అంటేనే ఇష్టమని. అందుకే కదా వాటి మీద ఎనలేని జాలి దయ కరుణ మీకు ;) అందులో ఇసుమంతైనా ఆ కోడిమీదో దాని గుడ్డు మీదో చేపపిల్ల మీదో ఉంటే ఎంత బాగుండేది కదూ.. అప్పుడైతే ఇక మీరు గాలిని భుజిస్తారేమో.. హహ్హహ్హా.. :D

Sasidhar Anne said...

Abba... Meeru chala lukcy antha peeda intilo periginanduku..:) maaa thathhaya valla illu kooda anthey vundedhi..
Vunde koddiki mee posts lo hasyam content peruguthundhi and ee post chala bavundi.

nenu chadivindhi Vignan vadlamudi lendi.. akkada vantalu chala bavundevi.. kani naa btech days lo chennai lo arava vatalaki saccha :(

మనసు పలికే said...

శశిధర్ గారు, ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు.:)
అవునండీ మా ఇల్లు చాలా బాగుంటుంది, ఎప్పుడెప్పుడు వీలవుతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అనిపిస్తుంది. మా తమ్ముళ్లు, తాతయ్య, పిన్ని బాబాయ్, అమ్మ నాన్న భలే ఉంటుంది ముఖ్యంగా పండగలప్పుడు.
అయితే హాస్టల్ విషయంలో మీరు అదృష్టవంతులన్నమాట..

మధురవాణి said...

అపర్ణా,
బాగుంది నీ టపా! :)
నాక్కూడా తోటకూరంటే చాలా ఇష్టం. అదీ, మనింట్లో మొక్కలయితేనే! :) నేను ఇంటికి వెళ్ళగానే కావాలని అడిగే మొదటి కూర అదే! చాలా మిస్సయిపోతున్నాను ఇక్కడ. :(

మనసు పలికే said...

మధుర గారు.. ధన్యవాదాలు..:) అయితే మీరు కూడా తోటకూర ఫ్యాన్ అన్నమాట.. సంతోషం..:) నిజమే, ఇంటి దగ్గర కూర అయితే ఎంత బాగుంటుందో కదూ.. నేను ఇక్కడ కంప్లీట్‌గా మిస్ అవ్వడం లేదు కానీ, ఇంటి కూర మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతున్నాను..:(

పరుచూరి వంశీ కృష్ణ . said...

>>అలా హాస్టల్ లో పెట్టే రకరకాల గడ్డి అంతా తిని కొన్ని రకాల ఇంటి వంటల కోసం, కరువు ప్రాంతాల్లో సహాయ శిబిరాలు విసిరేసే పొట్లాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉండే వాళ్లం.. సింపుల్ గా గోతి కాడ నక్కలా..:)

:) ...అప్పట్లో నేను కూడా అంతే !


>>" ఆ రోజులు మర్చిపోలేము కదూ.. అసలు నాకైతే తోటకూర వండిన ప్రతి రోజూ నువ్వే గుర్తొస్తావు.." అంటుంది."

హ్హ హ్హ


>> నా హాస్టల్ జీవితం కొన్ని వంటల మీద ఇష్టాన్ని పెంచితే చాలా వాటి మీద తగ్గించేసింది.

నాకైతే ఇష్టం తగ్గించడమే కాదు విరక్తి కూడా కల్గించింది :(

పోస్ట్ చాలా బాగా రాసారు .....

మనసు పలికే said...

పరుచూరి వంశీ కృష్ణ గారు, ధన్యవాదాలండీ నా టపా నచ్చినందుకు..:) అయితే మీరు కూడా హాస్టల్ భోజనాలకి బలయ్యారన్న మాట..
>>నాకైతే ఇష్టం తగ్గించడమే కాదు విరక్తి కూడా కల్గించింది :(
పాపం..:(((