Wednesday, October 27, 2010

కాస్త విశ్రాంతి...

ఎప్పుడూ ఏ.సి. ఆఫీసులు, క్యాబులు, కంప్యూటర్లు, కీబోర్డు లేనా. కాస్త అప్పుడప్పుడూ, ఆర్.టి.సి. బస్సులు, చెప్పుల్లేకుండా మట్టిలో నడవడాలూ, పచ్చికలూ, పొలాలు, పక్షులు ఉంటే ఎంత బాగుంటుంది కదూ.. అందుకే పోయిన వారం అలా మా ఊరు వెళ్లొచ్చా.

                                                      ఊరు వెళ్తున్నప్పుడు..

                                               నీటి కాలువలో పాము..(ఏ పామో తెలియదు)


                                                             వరి పొలం..                                                          పత్తి పువ్వు 


                                                                   నీటి కాలువ 


                                                                   బావి


                                                                     పత్తి

  
                                                                       పసుపు చేను


                                                 బావిలో రాయేసి మరీ తీసాను ఈ ఫోటోలు..:)                                                               ఎడ్ల బండి 


ఎలా ఉన్నాయి మా ఊరి ఫోటోలు..? బాగున్నాయి కదూ..:)

54 comments:

Rishi said...

హాయిగా ఉన్నాయి మనసుకి.ఊరి విశేషాలతో ఒక పోస్టు కూడా రాయండి మరి

కొత్త పాళీ said...

Beautiful.
One request - please check if you have widgeo widgets - they cause pop-ups which are very irritating

Sravya Vattikuti said...

Really very beautiful.

banthi said...

బాగున్నాయి ఫోటోలు... రిషి అన్నట్టు విశేషాలతో పోస్ట్ రాయండి.
అయినా పాముల్ని పెట్టి మమ్మల్ని భయపెడతారా ఆ!

3g said...

nice pics

3g said...

అవునూ చెరువుని చూపించి బావి అంటారేంటి.

karthik said...

మీ ఊరు చాలాబాగుందండీ.. కోస్తా ఆంధ్రా ప్రాంతమా?? నాకు చాలా జెలసీగా ఉంది.. నాకిప్పుడు పల్లెలకు పొయ్యె చాన్సే లేదు :(
anyway happy holiday..

-Karthik

మనసు పలికే said...

రిషి గారు, ధన్యవాదాలు.. తప్పకుండా వేస్తా మా ఊరి విశేషాలతో ఒక టపా..

కొత పాళీ గారు, ధన్యవాదాలండీ.
widgeo widgets??
అప్పుడెప్పుడో కూడా మిమ్మల్ని ఈ పాపప్స్ ఇలాగే సతాయించాయి కదూ..:( క్షమించండి, నాకు తెలియడం లేదు ఏం చెయ్యాలో..

శ్రావ్య గారు, ధన్యవాదాలండీ..:)

బంతి గారు, ప్లీజ్ మీరలా కన్నెర్రజేయకండి.. ఇక్కడ నేను భయపడిపోతున్నాను..:) ధన్యవాదాలు టపా నచ్చినందుకు

3g గారు, ధన్యవాదాలు..:)
అది చెరువు కాదండీ.. అంటే ఒక షేప్ లేని బావి అన్నమాట. 50 అడుగుల లోతు ఉంది అది..

వేణూరాం said...

సూపర్ ఫొటోస్.. మనసు పలికేగారు..
నాకు వరిచేను, పసుపు చేను,ఫొటోస్ బాగ నచ్చాయి..
నీటిలో రాయి వేసి తీసిన ఫొటో అయితే కేకో కేక.. ఫొటోగ్రఫి లో పట్టా పొందినోళ్ళకి కూడా ఇట్టాంటి అవిడియాలు రావు. మీ క్రియెటివిటీ కి నా జోహార్లు.

ఏ కెమెరా వాడారో చెప్పేరుకారు..!

మధురవాణి said...

ఫోటోలు సూపర్ గా ఉన్నాయి అపర్ణా! నువ్వెక్కిన బస్సులో ఎక్కేసి నేనూ ఇంటి దాకా వెళ్ళోచ్చా ఒకసారి. ;)

అశోక్ పాపాయి said...

అమ్మొ పామును చూసి చాల బయపడిపోయను ఫోటోస్ మాత్రం ఎంత బాగున్నాయి అంటే చెప్పలేనంత బాగున్నాయి తెలుస?? ఆ ఎండ్ల బండి మీద ఒక్కసారి మా ఊరికి పోవలని అనిపిస్తుంది.

పల్లెకు పోదాం పారుని చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో :)))

ఇందు said...

భలే ఉన్నాయి పిక్స్.ఆ పాముని ఎలా తీసారండీ బాబూ! భయం వేయలేదు?? :) నాకు పసుపు చేను నచ్చేసింది....అలాగే ఎడ్లబండీ :)

మనసు పలికే said...

కార్తీక్ గారు, ధన్యవాదాలండీ.:) కోస్తా ఆంధ్ర కాదండీ, భద్రాచలం దగ్గర.:)

వేణురాం, హహ్హహ్హా.. ధన్యవాదాలు నా క్రియేటివిటీని పొగిడినందుకు.. నాది మీలాగా, తార మరియు కృష్ణ లాగా 3 లక్షల కెమెరా కాదండీ బాబూ.. ఏదో డబ్బులు కూడబెట్టుకుని, 6 వేలు పెట్టి కొనుక్కున్న నోకియా ఫోన్‌లో ఉన్న 3.2MP కెమెరా..:))

మధుర గారూ..:) ధన్యవాదాలు.. తప్పకుండా.. మళ్లి ఎపుడు వెల్దామో చెప్పు, అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం..:)

అశోక్. హహ్హహ్హా.. నీకు కూడా భయమా పామంటే. నిజానికి నాక్కూడా.. కానీ ఏదో అలా ఫొటో కోసం ధైర్యం చేశా..:) పల్లెకు పోదామా.. చలో చలో..

ఇందు గారు, ధన్యవాదాలండీ.. పాముని చూసేసరికి కొంచెం భయమేసిందండీ.. కానీ, పక్కనే మా తమ్ముడు కూడా ఉన్నడు, ఇంకా ఆ పాము ఎక్కడ పారిపోతుందో అని అలా ధైర్యం తెచ్చేసుకుని తీసేశాను.. ఇలా ఫొటో తీశాను, అది అలా పరిగెట్టేసింది..:)

మాలా కుమార్ said...

చాలా బాగున్నాయి ఫొటోలు .
భద్రాచలం దగ్గరా ? ఐతే చిన్నప్పుడు నేనాడుకున్న చేలే అయివుంటాయి అవి :)

Shiva Bandaru said...

ఆ పాము బురదపాము అనుకుంటున్నాను. వాటికి విషం ఉండదు.

మనసు పలికే said...

మాలాకుమార్ గారు, ధన్యవాదాలండీ...:) ఏమో అయ్యుండొచ్చు, మీరు చిన్నప్పుడు ఆడుకున్న చేలే అయ్యుండొచ్చు..:))


శివ గారు, నిజమేనండీ.. అదేదో నీటి పామో బురద పామో.. కానీ విషం ఉన్నా లేకపోయినా పాముని, దాని చర్మాన్ని చూస్తే చాలు ఒళ్లు జలదరిస్తుంది.:((

హరే కృష్ణ said...

ఇక్కడ ఎవరు సర్పాలను కించపరుస్తూ మాట్లాడేది
నేను ఊరుకున్నా సర్పరిచితుడు అయిన మా రాయుడు మిమ్మల్ని ఊరుకొనేది లేదు హా..!

నువ్వు మొబైల్ కెమెరా లోనే ఇంత బాగా తీస్తే నీకు డిజిటల్ కెమెరా ఇస్తే కుమ్మేసేటట్టు ఉన్నావే..!
నాకు మూడు లక్షలు ఇచ్చాకనే నువ్వు ఈ కెమెరా కొనాలి అని మనవి చేసుకుంటున్నాను

Pics are Very nice!

హరే కృష్ణ said...

శివ గారు మీ మెయిల్ id మా రాయుడు మరియు ఇతర సర్ప బాధితులకి ఇవ్వ గలరా . ఈ సారి మా ఇళ్ళల్లో పాములు కనిపిస్తే మీకు ఫోటో అప్లోడ్ చేసి పంపుతాం
ఫోటో విషపూరితం కాకపొతే హింసను,రక్తపాతం ఆపేస్తాం

హరే కృష్ణ said...

>>>నీటిలో రాయి వేసి తీసిన ఫొటో అయితే కేకో కేక..

వేణూరాం నీకు ఇంకా అర్ధం అవ్వలేదా !
విచ్చిన్నం చేయడానికి అలవాటు పడిన బంగారు చేతులు అవి
మనుషులే కాదు పంచభూతాలను కూడా అతలాకుతలం చేస్తే కాని నిద్ర పట్టదు ఈ అపర్ణ కి ఎంతైనా మార్పు శిఖామణి కదా:)
ఎంత నిచ్చలమైన నీటిని సుడిగుండాలుగా మార్చి పడేసావ్
ఆ గోదావరి నీళ్ళకి నా ప్రఘాడ సానుభూతి

శివ చెరువు said...

ఇది మా వూరు భద్రాచలమా?????

To remove "widgeo widgets" you may have to make necessary changes in your template coding.

I guess it should work

శివ చెరువు

మంచు said...

ఉహు... ఈ పొలాలమద్యలొ ఉండే మీ లంకంత ఇల్లు, ఆ పెరట్లొ ఉండే అమాయకమయిన లేత తొటకూర మొక్కలను చూపించక పొవడం ఎమీ బాలేదు...
:-)

Anonymous said...

ఆహ్లాదకరంగా అనిపించింది. మంచి ఫోటోలు చూపించినందుకు ధన్యవాదాలు.

బాబు

హరే కృష్ణ said...

సాయి ప్రవీణ్ బ్లాగ్ లో ఇవ్వాల్సిన ధనము తో పాటు AP09 BX 3472 మారుతి స్విఫ్ట్ కారుని అమ్మి నా లకారాలను నాకివ్వ వలిసింది గా మనవి చేసుకుంటున్నాను

Sai Praveen said...

ఒక మంచి పల్లెటూరు చూడాలని చిన్నప్పటి నుంచి కోరిక నాకు. ఎప్పుడు తీరుతుందో చూడాలి. గత నాలుగేళ్ల నుంచి అయితే ఇలాంటి వాతావరణానికి పూర్తిగా దూరంగా ఉంటున్నాను నేను. నాకు ఇక్కడ నచ్చట్లేదు.
ఇప్పుడు నాకు చిన్న పిల్లాడిలా ఏడవాలని ఉంది. నేను ఇంటికెల్లిపోతా....... వా..... :)
ఫొటోస్ చాల బావున్నాయి.

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగున్నాయి ఫోటోలు ...ఎడ్ల బండి ఫోటో ఎదురుగా వస్తే బాగుండేది.... :) nice post

Geetika said...

అపర్ణా...

ఫొటోస్ చాలా చాలా బాగున్నాయి. మొన్న పండగ సెలవుల్ని బాగా ఎంజాయ్ చేశావన్న మాట మీ ఊర్లో. మన(సు)కి ప్రశాంతతనిచ్చే ప్రకృతిలోని పచ్చదనాన్నంతా బ్లాగులో నింపేశావ్...

నైస్ పోస్ట్

Shiva Bandaru said...

@ హరే కృష్ణ
ఇళ్ళల్లోనూ , తుప్పల్లోనూ తిరిగే పాముల్లో విషం ఉంటుంది. వాటితో జాగ్రత్తగా ఉండాలి. తెల్లిసర అనే మొక్కలను ఇంటిలో పెంచుకుంటే ఆ దరిదాపుల్లోకి పాములు రావడానికి సాహసించవు. అలాగే తెల్లిసర మొక్కని కూడా తీసుకుని పాములున్న చోటకి వెలితే అవి పారిపోతాయి. మా విషయంలో ఇది వందశాతం పనిచేస్తుంది.

మనసు పలికే said...

కృష్ణ.. ధన్యవాదాలు ఫోటోస్ నచ్చినందుకు..
>>నేను ఊరుకున్నా సర్పరిచితుడు అయిన మా రాయుడు మిమ్మల్ని ఊరుకొనేది లేదు హా..!
హహ్హహ్హా.. రాయుడిని ఇక్కడికి తెచ్చేశావా.:))
అయితే నాకు డిజిటల్ కెమెరా కొనిస్తావా మరి..? నీకు మూడు లక్షలు ఇస్తాను, నాకు నువ్వు 5 లక్షల కెమెరా కొనివ్వాలి.. డీల్ ఓకేనా.?
>>ఆఫ్09 భ్X 3472 మారుతి స్విఫ్ట్
అయ్యబాబోయ్. అది మా కారు కాదు. నేను బస్‌లో ఉండి తీశాను ఆ ఫోటో.. అలా తీస్తూ ఉంటే ఆ కారు వచ్చింది మధ్యలో..:)
>>పంచభూతాలను కూడా అతలాకుతలం చేస్తే కాని నిద్ర పట్టదు ఈ అపర్ణ కి
చదివి గట్టిగా నవ్వేసుకున్నాను తెలుసా.. ఇంత గొప్ప గొప్ప ఐడియాలు ఎలా వస్తాబ్బా నీకు..!!


శివ గారు, ధన్యవాదాలండీ.. ఇప్పుడే ట్రై చేస్తా..:)

మంచు గారు,
>>ఆ పెరట్లొ ఉండే అమాయకమయిన లేత తొటకూర మొక్కలను చూపించక పొవడం ఎమీ బాలేదు
అమాయకపు తోటకూర మొక్కలా.. హహ్హహ్హా భలే అడిగారు..

బాబు గారు ధన్యవాదాలు..:)

మనసు పలికే said...

ప్రవీణ్ గారు, ఇంకెందుకు ఆలస్యం..? వచ్చేయ్యండి మా ఊరికి..:) అలా ఏడవకండి బాబ్బాబు.. బ్లాగ్లోకం అంతా అతలాకుతలమై పోతుంది..:(

వంశీ కృష్ణ గారు, ధన్యవాదాలండీ.. ఎడ్ల బండి ముందు నుండి కూడా తీశాను ఫోటో.. కానీ, మా ఏడ్లబండి డ్రైవర్ (హిహ్హి) ఏమో తననే ఫోటో తీస్తున్నట్లు ఫోజ్ ఇస్తేనూ, వెనుక నుండి తీసిన ఫోటో పెట్టాను..:))

గీతిక గారు,
ధన్యవాదాలండీ.. అవునండీ, పండగ సెలవల్లోని ఫోటోలే ఇవి.:) ఆ మూడు రోజులు మాత్రం బాగా ఎంజాయ్ చేశాను పల్లెటూరి వాతావరణాన్ని. ఈ పొల్యూషన్ కి దూరంగా, ప్రకృతికి దగ్గరగా.. చాలా మనశ్శాంతిగా..:))

శివ బండారు గారు, అవునా.. తెల్లిసర మొక్క గురించి నాకు తెలియదండీ.. ధన్యవాదాలు..:)

చెప్పాలంటే.... said...

చాలా చాలా బాగున్నాయి ఫోటోలు

వేణూరాం said...

అతలాకుతలం చెయ్యలేదు హరే కృష్ణా.... నిద్ర పోతున్న నీటిలో కదలిక తీసుకొచ్చి , కొత్త కళ తీసుకోచ్చ్చితిరి . అంతే కదా అపర్ణా? :)

సుమన్ said...

చిత్రాలు చాల బాగున్నై మనసుపలికె గారు.
నేను గీసిన బొమ్మల్లా కాకుండా , చాల అందం గా ఉన్నై..

Bulusu Subrahmanyam said...

మీరు బస్ లో కూర్చుని కారు ఫోటో ఎందుకు తీసారా అని ఆలోచిస్తున్నాను .మీరు కారులో ఉండగా ఎవరైనా బస్ లోంచి తీసారా.3472 ఎక్కడ కనిపించినా ఆపి కనుక్కొంటా.మీరు మీ పల్లెటూరు మొగలిపూల మీద పరిశోధనల కి వెళ్లారని, అందుకే పాము ఫోటో తీసారని అనుమానం వస్తోంది.
ఫోటోలు బావున్నాయి కానీ మమ్మలెవరిని తీసుకెళ్ళ కుండా మీరొక్కరే వెళ్లడం బాగాలేదు.
మీవూరు విశేషాలు రాయండి.

మనసు పలికే said...

చెప్పాలంటే గారు, ధన్యవాదాలండీ..:)

వేణు, అంతే.. అంతే.. చాలా కరెక్ట్‌గా చెప్పావు. చాలా చాలా థాంక్స్..:)

సుమన్ గారు, ధన్యవాదాలు ఫోటోలు నచ్చినందుకు..:) అయితే మీరు మంచి బొమ్మలు గీస్తారన్నమాట..:)

సుబ్రహ్మణ్యం గారు, హహ్హహ్హా.. నేను బస్‌లో ఉన్నానండీ. రోడ్‌ని ఫోటో తీస్తూ ఉంటే అలా మధ్యలో కార్ వచ్చింది..:)
>>మీరు మీ పల్లెటూరు మొగలిపూల మీద పరిశోధనల కి వెళ్లారని, అందుకే పాము ఫోటో తీసారని అనుమానం వస్తోంది.
హహ్హహ్హా.. తప్పకుండా రాస్తానండీ, మా ఊరి విశేషాలు..:) ఈసారి వెళ్లే ముందే మీకు చెబుతాను, తప్పకుండా మీరు రావాలి..:) ఈసారికి మాత్రం క్షమించెయ్యండీ..

Sai Praveen said...

>>సుమన్ గారు, ... అయితే మీరు మంచి బొమ్మలు గీస్తారన్నమాట..:)

అయ్యో.. అపర్ణ.. నీకు ఏది వివరంగా చెప్తే తప్ప అర్ధం కాదనుకుంటా :))
ఒక సారి నిన్న హరే కృష్ణ బ్లాగుకి వచ్చిన అతిధులను గుర్తు తెచ్చుకో.. ఈ సుమన్ ఎవరో తెలుస్తుంది :)

మనసు పలికే said...

>>అయ్యో.. అపర్ణ.. నీకు ఏది వివరంగా చెప్తే తప్ప అర్ధం కాదనుకుంటా :))
ష్..ష్.. సాయి.. గట్టిగా అరవకు.. ఇలాంటి విషయాలు సీక్రెట్‌గా ఉంచాలి, ఇలా అందరికీ చెప్పేసుకుంటారా ఏంటి..?;)
అయినా నాకు తెలుసులే ఈ సుమన్ ఎవరో..:)

నేస్తం said...

అప్పూ భలే బాగున్నాయి ఫొటోస్ ...ఉహు హు నేను కూడా ఒక పొటో బ్లాగ్ మొదలు పెట్టేయాలమ్మా... నాకు కుళ్ళొచ్చేస్తుంది :)

మనసు పలికే said...

నేస్తం అక్కయ్యా...............:)))))))))
వచ్చేశారా.. ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నాను.:) ధన్యవాదాలు. ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టెయ్యండి. మీ జాజిపూలని ఆస్వాదించినట్లే మీరు పెట్టే ఫోటోలని కూడా చూసేసి ఆనందించేస్తాం..:))

వేణూరాం said...

అపర్ణా... మీరేమి మాట్లాడుతున్నారో తెలుస్తుందా?? అక్క బ్లాగ్ లో ఫొటోస్ ఎలా ఉంటాయో మర్చిపోయారా?
వద్దొద్దు నేస్తం అక్కా..! మీరు ఫోటో బ్లాగ్ పెడితే మా బ్లాగులు ఎవరూ చూడరు. :) :) :)

..nagarjuna.. said...

I feel nostalgic seeing those lush green farms....

ఓ మాట ఎప్పాలి అపర్ణ... పచ్చని పొలాల వెంబడి వెళ్తున్నపుడు వీచే చల్లటిగాలి ఉంటుంది....వాహ్...ఎన్ని లక్షలు ఖర్చుపెట్టి కొన్న ఏ.సి లైనా ఆ గాలిముందు దిగదుడుపే. ఎపుడో చిన్నపుడు సెలవుల్లో అమ్మమ్మవాళ్ల ఇంటినుండి తిరిగొస్తుండగా బుఱ్ఱలో వెలిగింది ఆ అనుభూతి.....అవునూ ఈ టైములో బత్తాయి పండ్లు వచ్చేసుంటాయే....తిన్నావా వాటిని.. ?

@హరే, వేణూరాం: అతలకుతలం అని ఒకరు, జీవకళ అని ఒకరు....ఆడ్డెడ్దెడ్డెడ్డే.....ఏమి ఎనాలసిన్ చేసారు బాబులు...ఎనాలసిస్ ఈజ్ అరుపు, మేరుపు, ఉరుము, రచ్చ, భీభత్సం, కెవ్వు, కేక :)

శిశిర said...

నేనూ మీ ఊరొచ్చేశా. చాలా బాగున్నాయి ఫోటోలు ఆ పాము ఫోటో తప్ప. నేను పాము పేరు చెప్తేనే భయపడి చస్తా. ఏకంగా ఫోటో చూపించేస్తారా. ఈ పోస్ట్ లో ఆ ఫోటో చూసి 104 జ్వరమొచ్చేస్తే మందులు మింగి మరీ ఈ కామెంట్ రాస్తున్నా. :)

మనసు పలికే said...

వేణురాం.. హహ్హహ్హా.. కరెక్టే.. ఇప్పుడేం చేద్దాం మరి..? అక్కేమో పెట్టేస్తాను అని ఫిక్స్ అయిపోయారు..;)


నాగార్జున, పచ్చని పొలాలని చూసేసరికి భావుకత్వం పొంగుకొస్తుంది కదూ మనసులోనుంచి..:) నిజమే, ఆ గాలిని ఆ రంగుల్ని ఎంత బాగా ఎంజాయ్ చేశానో తెలుసా..! కోటి రూపాయలు ఇస్తా అన్నప్పుడు కూడా అంత ఆనందం ఉండదు..:) బత్తాయిలు తినలేదు నాగార్జున, మా వైపు అవి పండించరు.. సీతా ఫలాలు మాత్రం కుమ్మేశా..:)


శిశిర గారూ.. అయ్యయ్యో అయితే ఇప్పుడు మీరు జ్వరంతో ఉన్నారా.? అది కూడా నా బ్లాగులోని పోస్ట్ వల్ల..:(
అంత జ్వరంలో కూడా మా ఊరొచ్చేసినందుకు ధన్యవాదాలు..:) మా ఊరు నచ్చేసినందుకు ఇంకా ధన్యవాదాలు..:)

శ్రీనివాస్ పప్పు said...

ఫొటోలు చాలా బావున్నాయి అపర్ణ గారు,మీ తీపి గుర్తుల్లాగే.(స్లైడ్ షో పెట్టాల్సిందేమో).భద్రాచలం పరిసరప్రాంతాలు అంటే ఏజెన్సీ ఏరియా లెక్కల్లోకొచ్చేస్తాయి కదా మరి పచ్చటి పొలాలు అవి ఉండకపోతే ఎలా?అసలే గోదారి పరివాహక ప్రాంతమాయే.

మనసుపలికే "చిత్ర"గీతం కలగజేసే,
సౌందర్యోపాసిక మానసికోల్లాసం.

మనసు పలికే said...

శ్రీనివాస్ పప్పు గారు, ధన్యవాదాలండీ :) అవునండీ మాది ఏజెన్సీ ప్రాంతమే.. స్లైడ్ షో పెట్టమంటారా..! నాకు తెలియదోచ్ ఎలా పెట్టాలో..;)
>>మనసుపలికే "చిత్ర"గీతం కలగజేసే,
సౌందర్యోపాసిక మానసికోల్లాసం.
ధన్యవాదాలు మళ్లీ.. చాలా ఆనందంగా ఉంది..:)

శ్రీనివాస్ పప్పు said...

స్లైడ్‌షో గురించి ఈ లింకులో కెళ్ళండి అన్నీ అక్కడే తెలుస్తాయి.
www.slide.com

సవ్వడి said...

Aparna! Photos are good..
mee vuru inkaa baagundi.

మనసు పలికే said...

శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండీ.. ఈ సారి తప్పకుండా ట్రై చేస్తా..:)

సవ్వడి గారు, ధన్యవాదాలండీ, ఫోటోస్ మరియు మా ఊరు కూడా నచ్చినందుకు..:)

చిన్ని said...

xlnt phots

మనసు పలికే said...

చిన్ని గారు, ధన్యవాదాలండీ.:)

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగున్నాయి అపర్ణగారు మనసుకు హాయిగా ఉన్నాయి మీ ఊరి ఫోటోలు. ఇంత చక్కని అనుభూతి పంచినందుకు ధన్యవాదాలు.

శివరంజని said...

అపర్ణ భలే బాగున్నాయి ఫొటోస్ .నాకు కుళ్ళొచ్చేస్తుంది :)

మనసు పలికే said...

వేణు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు ఫోటోలు నచ్చినందుకు..:)

రంజనీ, మనలో మనం కుల్లుకుంటున్నామని తెలిస్తే, వ.బ్లా.స సభ్యులు ఊరుకోరు. అసలే మన మధ్య చాలా గొడవలు పెట్టేద్దామని చూస్తున్నారు..;) :D

Arun Kumar said...

ఆహ్లాదకరంగా అనిపించింది. మంచి ఫోటోలు చూపించినందుకు ధన్యవాదాలు.

kallurisailabala said...

mee blog , mee photoes, meru raase vidhanam anni bavunnayi...meeku kudirinappudu okasari na blog visit cheyandi..

http://kallurisailabala.blogspot.com