ఎదగాలి.. పైపైకి ఎగరాలి..
గోడమీద ఊగిసలాడే కాలాన్ని వెనక్కి నెట్టుకుంటూ పరిగెత్తాలి...
మీదకి దూసుకు వచ్చే ఘడియ మెట్లను ఎక్కుకుంటూ పైకెళ్లాలి..
ఉవ్వెత్తున ఎగిసి పడే క్షణల కెరటాల్లోంచి దూసుకుంటూ ముందుకెళ్లాలి.
నిశీధిలో దాక్కున్న నిమిషాలు సైతం "నేను సైతం" అనాలి..
కానీ..
నన్ను నేను కోల్పోయిన ఆ క్షణం.. ఆ ఒక్క క్షణం మాత్రం నన్ను అడుగుతుంది..
"ఎక్కడి వరకూ.." అని.
నాకు తెలియదు, అది నేనే వేసుకున్న ప్రశ్న అని.. ఎప్పుడూ సమాధానం చెప్పను.
"సంతోషం దొరికేంత వరకూ.." ఇప్పుడు చెప్పాను.
"సం...తో..షం..???" చాలా విస్మయంతో చూసింది.
మరి కావాల్సిన తీగ కాలికి తగిలితే పక్కకి తప్పుకుని పోయే నన్ను, అలా చూడ్డంలో తప్పు లేదులే..
"మొన్నొక రోజు, నువ్వు సూర్యుడికన్నా ముందు నిద్ర లేచిన ఉదయం,
పువ్వులన్నీ బద్దకంగా ఒళ్లు విరుచుకుంటున్న క్షణంలో..
చల్లని మలయమారుతంలా నీ చెంతకొచ్చింది.. అదే కదూ సంతోషమంటే..?
ఇంకొక రోజు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆపదలో ఉన్న నీ నేస్తానికి సహాయం చేసిన రోజు,
ప్రశాంతంగా నీ వద్దకొచ్చింది.. అదే కదూ సంతోషమంటే..?
మరొక రోజు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పసికందుని కాపాడిన రోజు, సంతృప్తితో పాటు నిన్ను చేరుకుంది.. అదే కదూ సంతోషమంటే..?
ఇంకోరోజు, ఒక చిన్న విజయగర్వంతో నువ్వు కలతల్లేని నిద్ర పోయిన రోజు,
రాత్రంతా నిన్ను హత్తుకుని పడుకుంది.. అదే కదూ సంతోషమంటే.."
అవునా..
ఇన్ని సార్లు నన్ను కలిసిందా..?
అప్పుడర్థమైంది. ఎదగాలి అన్న కాంక్షతో, వచ్చిన ప్రతి క్షణాన్ని పక్కకు నెట్టేస్తున్నానే తప్ప, ఆ క్షణం నాకోసం ఏం తెస్తుంది అన్నది తెలుసుకోవడంలేదని.
ఇలా ఎన్నెన్ని నిమిషాలని కనీసం తొంగి కూడా చూడకుండా చీకట్లో చేజార్చుకుంటున్నానో..
నాకు ప్రసాదించబడిన ఎన్నెన్ని సుమధుర ఘడియల సౌరభాల్ని, ఆస్వాదించకుండా పోగొట్టుకుంటున్నానో.
వెతకాలి, నేను పోగొట్టుకున్న ఒక్కొక్క నిమిషాన్ని వెతికి పట్టుకోవాలి..
చేజార్చుకున్న నా సంతోషపు ఛాయల్ని ఏ నిశీధిలో దాక్కున్నా సరే, కనిపెట్టి తెచ్చుకోవాలి..
ఆ అమూల్యమైన క్షణాలు ఏ మతిమరుపు ముళ్లపొదల్లో చిక్కుకున్నా సరే, గుర్తుపట్టి అపురూపంగా నా దోసిలిలో దాచిపెట్టుకోవాలి.
ఇక ఏ క్షణం నాకోసం ఏం తెచ్చినా, దాన్ని పూర్తిగా ఆస్వాదించి సంతోషంగా సాగనంపాలి..
మరోసారి ఏ క్షణమూ నన్ను ప్రశ్నించకూడదు.. అసలు నన్ను నేను కోల్పోకూడదు..
ఎందుకంటే, నన్ను నేను కోల్పోయిన ఆ క్షణం, ఆ ఒక్క క్షణం నన్ను అడిగిన ప్రశ్నతో నాకు జీవితం విలువ తెలిసింది..
మరి.. మళ్లీ మళ్లీ జీవితాన్ని కోల్పోలేం కదా.

32 comments:
బావుంది
Wonderful అపర్ణ....చాలాచాలా బాగుంది....కాలంతో పోటీ పడి మనం ఏం కోల్పోతున్నామో చాలా అందంగా వ్రాసారు.చాలా బాగుంది మీ టపా :)
APARNAGAARU MEE FEELING NAAKU CHALA BGA NACHINDI...NAAKU ALAA NE ANIPISTUNDI APPUDAPPUDU
చాలా చాలా బాగా రాశారు. సంతోషానికి మీరిచ్చిన నిర్వచనాలు simply superb. ఇలాంటి ఎన్ని క్షణాలని కోల్పోతున్నామో కదా. వాటిని వెతికి పట్టుకుని ఆస్వాదించగలిగితే అంతకన్నా కావలసినదేముంటుంది జీవితంలో. కాలంతో పోటీ పడుతున్నామనుకుంటూ అదే కాలం అందిస్తున్న అపురూపక్షణాలని మరుగున పడేస్తున్నాం. చాలా ఆలోచింపచేసే టపా రాశారు అపర్ణా. Good Post!
గడిచి పోయే ఆ క్షణం కోసం ఎందుకు ఈ నిరీక్షణం అన్నాడో భావకవి. కానీ ఆక్షణం లోనే మనం వెతికే ప్రశ్నలకి జవాబు దొరకవచ్చు.
పోటీ ప్రపంచంలో అనుక్షణం అమూల్యమే అనుకుంటాం.
కానీ చిన్న చిన్న ఆనందాలు పంచే ఆ క్షణాలు చాలా విలువైనవి. వాటిని కోల్పోరాదు.
బాగుంది మీ క్షణం అడిగిన ప్రశ్న.
Chala chala bagundi..
అద్భుతం... ఈ పోస్టులో నాకు నచ్చిన లైన్ రాద్దామనుకున్నా... మళ్లీ మొత్తం కాపీ పేస్ట్ చేస్తే బాగోదని ఊరుకున్న...:) :)
చాలా బాగా రాసావు అపర్ణ..
Wonderful!
Well done buddy
అరే,అప్పుడే ఐపోయిందా ఇంకాస్త ఉంటే బావుండేది అనిపించింది....హ్మ్.
నాకో సందేహం (సందేహం కాదుగాని ఓ ఆలోచన...ఏదోఒకటి) దుఃఖంను, బాధను పలికించినంత తేలికగా...ఇంకొకళ్లకు చొప్పించేంత సులభంగా ఆనందాన్నిగాని మరేదైనా ఇతర భావాన్ని ఎందుకు చెప్పలేము. ఆనందం కలిగిందని చెప్పడానికి అంతకుముందు ఉన్న వేదనను చెబుతాం, విజయం గురించి చెప్పడానికి పడిన కష్టాలను వివరించాలి...బాధకే ఇవేమి అక్కరలేదు ఎందుకో!!! వేదన, బాధ మిగతా భావాలకన్నా ఎక్కువ విశ్వజనీయమైనవా !? మనసును పలికించేవారెవరైనా చెప్పరా ప్లీజ్...
సారి అపర్ణ అసలు పోస్టుగురించి పొగడకుండా ఏవేవో రాసేస్తున్నా...ఫ్లోలో వచ్చేసిందలా... :D
well said..
where is my comment
Na comment display kavadam ledu
బద్రి గారు, ధన్యవాదాలు..:)
ఇందు గారు, ధన్యవాదాలు.:)
ఇన్నారెడ్డి గారు, నా బ్లాగులోకి స్వాగతం..:) ధన్యవాదాలు టపా నచ్చినందుకు..:)
శిశిర గారు,
>>కాలంతో పోటీ పడుతున్నామనుకుంటూ అదే కాలం అందిస్తున్న అపురూపక్షణాలని మరుగున పడేస్తున్నాం
చాలా కరెక్ట్‌గా చెప్పారండీ.. ధన్యవాదాలు టపా నచ్చినందుకు..
సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలండీ..:)
జాబిలి గారు, ధన్యవాదాలు..:)
వేణురాం, ధన్యవాదాలు..:)
>>ఈ పోస్టులో నాకు నచ్చిన లైన్ రాద్దామనుకున్నా... మళ్లీ మొత్తం కాపీ పేస్ట్ చేస్తే బాగోదని ఊరుకున్న...:) :)
Thanks for the compliment..:)
కృష్ణ.. ధన్యవాదాలు..:)
నాగార్జున,
>>అరే,అప్పుడే ఐపోయిందా ఇంకాస్త ఉంటే బావుండేది అనిపించింది..
నిజంగానా..? ధన్యవాదాలు. ఈ కాంప్లిమెంట్ నాకు చాలా సంతోషాన్నిచ్చింది..:)
>>వేదన, బాధ మిగతా భావాలకన్నా ఎక్కువ విశ్వజనీయమైనవా !?
ఏమో.. అవునేమో..:( ఇక్కడ పెద్దలే చెప్పాలి మరి..
వేణు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు..:)
Wonderful అపర్ణ....ఏమిటో ప్రతీ లైన్ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది .... చాలాచాలా బాగుంది....Thanks అపర్ణ ఎంత మంచి టపా రాశావు
అపర్ణ చాలా బగుంది.
చక్కగా కొత్తగా చెప్పావు. నాకు బాగా నచ్చింది.
రంజనీ.. ధన్యవాదాలు..:)
>>ప్రతీ లైన్ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది
తెగ సంతోషం వేసేసిందిలే నీ వ్యాఖ్య చదివి..:)
పరిమళం గారు, చాలా సంతోషంగా ఉంది మీరు నా బ్లాగులో అడుగు పెట్టి వ్యాఖ్య పెట్టినందుకు..:) ధన్యవాదాలు..:)
సవ్వడి గారు, ధన్యవాదాలు..:)
మీదైన శైలిలో భలే బాగా రాస్తున్నారు పో...
వెతకాలి,నేను పోగొట్టుకున్న ఒక్కొక్క నిమిషాన్ని వెతికి పట్టుకోవాలి..చేజార్చుకున్న నా సంతోషపు ఛాయల్ని ఏ నిశీధిలో దాక్కున్నా సరే......
అయ్య బాబోయ్ మీ గురువు గారు సిరివెన్నెలని మించిపోయెల వున్నారు...:)))
Wonderful అపర్ణ....ఏమిటో ప్రతీ లైన్ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది ....
.
.
.
.
.
అర్ధం కాక :(
దీనికన్నా EMF theory నే ఈజీగా ఉందే అర్ధం చేసుకొవడానికి :-)
.
.
.
చాలాచాలా బాగుంది....Thanks అపర్ణ ఎంత మంచి టపా రాశావు
అశోక్.. చాలా చాలా థ్యాంక్స్..:)
>>మీ గురువు గారు సిరివెన్నెలని మించిపోయెల వున్నారు
అమ్మో.. నాకూ ఆయనకీ పోలికా.. తప్పు తప్పు. ఆయన నాకు కారణజన్ముడిలా కనిపిస్తారు..
మంచు గారు, ధన్యవాదాలు.
>>దీనికన్నా EMF Theory నే ఈజీగా ఉందే అర్ధం చేసుకొవడానికి :(((( Grrrrrrr
.
.
.
Thank you soo much for your compliment..:)
నిజమే. ఎన్ని సంతోషాల్ని మనకు తెలీకుండా చేజార్చుకున్తున్నాం..వాటిని ఆస్వాదించే ఆలోచన సమయం మనకెక్కడివి. చాల బాగుంది మీ టపా. కాసేపు ఆలోచింపజేసింది. సుపర్బ్ అపర్ణ గారు.
భాను గారు, చలా చాలా థ్యాంక్స్ అండీ..:)
బాగా రాసారు కానీ పైన రాసిన దానికి , క్రింది రెండు పేరాలలో రాసింది కాంట్రరీ గా ఉందేమో అని చిన్న సందేహం :) గడిచిపోయిన కాలాన్ని వెతికి పట్టుకోవటం అయ్యే పనేనా ? దాని కోసం ఇప్పుడు చేతిలో ఉన్న కాలాన్ని కూడా వృధా చేస్తారా :)
btw నేను ఇంతకు ముందు మీ బ్లాగులో శివరంజని , అపర్ణ ల మధ్య కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని శివరంజని ని చేసినట్లున్నాను ఈ సారికి క్షమించేయండి :)
సంతోషానికి నిర్వచనం చెప్పిన మీ భావాలు జీవితపు విలువను కూడా తెలియచేసిందండి. నాకెంత నచ్చిందో చెప్పలేను. కంగ్రాట్స్.
హమ్మయ్య..... మూడవసారి చదివింతర్వాత కొంచెం క్లారిటీ వచ్చిందండీ.....
అవును మీ ఆటోగ్రాఫ్ కావాలంటే ఎలా తీసుకోవాలి.... కొరియర్లో వీలవుతుందా.....
ఏంలేదు తరువాత మీరు ఏ శాస్త్రిగారి రేంజుకో వెళ్ళిపోయిన తరువాత మీఆటోగ్రాఫ్ కావాలంటే దొరకదు కదా:(
లేట్‌గా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి..:)
శ్రావ్య గారు, చాలా చాలా థ్యాంక్స్, మీ మనసు ఏదైతే చెప్పిందో చాలా ఫ్రాంక్‌గా తెలియజేసినందుకు.:)
గడిచిపోయిన కాలం గురించి ఆలోచించడం సమయాన్ని వృధా చెయ్యడం అని నేననుకోవడం లేదు. ఏదైనా ఆలోచన మనసులోకి రాగానే పెదవులపై చిరు నవ్వు పూచిందంటే ఆ క్షణాన్ని మనం జీవించినట్లే కదండీ..:) అదే ఉద్ధేశ్యంతో అలా రాశాను..:)
పేరు మారిస్తే పర్వాలేదు లెండి. అందులోనూ మేమిద్దరం ఫ్రెండ్సే..:))
జయ గారు, ధన్యవాదాలు టపా నచ్చినందుకు..:)
3g గారు..
>>మూడవసారి చదివింతర్వాత కొంచెం క్లారిటీ వచ్చిందండీ....
:(((( ఏమిటండీ దీనర్థం.. మొన్నేమో ఏం మాట్లాడాలో తెలియలేదు అని చుక్కలు పెట్టి నన్ను కంఫ్యూజ్ చేశారు.. ఈరోజేమో ఇలా..;))
>>ఏంలేదు తరువాత మీరు ఏ శాస్త్రిగారి రేంజుకో వెళ్ళిపోయిన తరువాత మీఆటోగ్రాఫ్ కావాలంటే దొరకదు కదా:(
హహ్హహ్హా పాపం శాస్త్రి గారు... మొత్తానికి మీరు వ్యాఖ్య ఎలా పెట్టినా నేను మాత్రం మీరు నన్ను పొగిడేశారనే అనుకుంటున్నానోచ్..:)))
ఈ టపా గురించి కాదు కానీ, నీ బ్లాగులు చదువుతుంటే నాకు అనిపించింది రాస్తున్నాను...
ఫలానా గొప్ప కవయిత్రి/రచయిత్రి అపర్ణ ఒకప్పుడు మాతో కబుర్లు చెప్పేది, మాతో కలిసి వందవ కామెంటు కోసం గోల చేసేది అని మేమందరం గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. తొందరగానే రావాలని కోరుకుంటున్నాను. :)
ఈ మధ్య ఆఫీసు పనులతో బుర్ర వేడెక్కి పోయి హాస్యం తప్ప కాస్త బరువైన విషయాలున్న టపాలేవి చూడట్లేదు. అందుకే ఇంత లేట్ గా కామెంట్ చేస్తున్నా. ఏమి అనుకోకమ్మాయ్ :)
సాయి ప్రవీణ్.. నీ వ్యాఖ్య చూసి నేను భలే మురిసిపోయానులే..:) బోలెడు ధన్యవాదాలు..:)
ఎప్పుడు వ్యాఖ్య పెట్టినా పర్లేదు.. ఇలా కాస్త పొగిడేస్తే చాలు...;) hahhahhaa.. just kidding..:)
అపర్ణా,
చాలా బాగా రాశారు. మన జీవితం లో ఇలా వచ్చిపోయే ఒక్కో క్షణం...ఆ ఒకొక్కటి ఒక్కో అనుభూతి..ఏదీ దేనికీ తక్కువ కాదు, ఎక్కువ కాదు.దేని గొప్పతనం దానిదే...
మీ శైలి కూడా చాలా బాగుంది. నాకు నచ్చింది.
కల్పన గారు బోలెడు ధన్యవాదాలండీ..:) నా టపా ఇంకా శైలి కూడా నచ్చినందుకు..:))
అపర్ణ గారూ సంతోషానికి చక్కగా నిర్వచనం చెప్పారు.
ఆ క్షణాల్ని వెతికే దారంతా ఉల్లాసమే..దొరికిన ప్రతి క్షణం లో అనుభూతి దాగే ఉంది. ఇప్పుడా ప్రయత్నంలోనే ఉన్నా..
Post a Comment