కనుల ముందు కొత్త కాంతి..
వేయి దీపాలు ఒక్కసారి వెలిగినట్టు..
కోటి నక్షత్ర మాల ఎదురైనట్టు..
ఈ వెలుగు కోసం చూసిన రోజులు ఏమయ్యాయి..?
ఇప్పుడిలా సిగ్గుతో పక్క చూపులు ప్రవేశించాయేం..!?
ఇన్నాళ్లూ గుంభనంగా గుండె గదిలో దాచుకున్న.......,
చెప్పలేను..
ఏమని చెప్పగలను..?
ఎన్నని చెప్పగలను..?
వాసంత, హేమంత, శరత్, శిశిరాలను..
సంగీత, సాహిత్య, శత వర్ణ చిత్రాలను..
మోదాగ్ర శిఖరాలను, ఖేదాఖాతాలను..
హిమవన్నగాలను.., మహార్ణవాలను..
పదిలంగా దాచుకున్న మనసుని..
చైత్రపు చినుకునే కాదు, వేసవి వెన్నెలనూ ఆనందించే ఈ మనసుని..
అరలు.. తెరలు.. దాటుకుని హృది కవాటాల్ని తెరిచి.. నీ ముందుంచాలని..
ఎన్నెన్ని కలలు కన్నాను.?
మరేంటి..? ఇప్పుడిలా..!!
చిగురించిన వాసంతం నీకు స్వాగతం పలుకుతున్నా..
తలపుల తలుపులు వాటంతటే తెరుచుకున్నా..
ఈ పిచ్చి మనసు..
మౌన ముద్ర దాల్చి..
కనీసం నీ చూపులతో చూపులు కలపలేకపోతోంది..
వేయి దీపాలు ఒక్కసారి వెలిగినట్టు..
కోటి నక్షత్ర మాల ఎదురైనట్టు..
ఈ వెలుగు కోసం చూసిన రోజులు ఏమయ్యాయి..?
ఇప్పుడిలా సిగ్గుతో పక్క చూపులు ప్రవేశించాయేం..!?
ఇన్నాళ్లూ గుంభనంగా గుండె గదిలో దాచుకున్న.......,
చెప్పలేను..
ఏమని చెప్పగలను..?
ఎన్నని చెప్పగలను..?
వాసంత, హేమంత, శరత్, శిశిరాలను..
సంగీత, సాహిత్య, శత వర్ణ చిత్రాలను..
మోదాగ్ర శిఖరాలను, ఖేదాఖాతాలను..
హిమవన్నగాలను.., మహార్ణవాలను..
పదిలంగా దాచుకున్న మనసుని..
చైత్రపు చినుకునే కాదు, వేసవి వెన్నెలనూ ఆనందించే ఈ మనసుని..
అరలు.. తెరలు.. దాటుకుని హృది కవాటాల్ని తెరిచి.. నీ ముందుంచాలని..
ఎన్నెన్ని కలలు కన్నాను.?
మరేంటి..? ఇప్పుడిలా..!!
చిగురించిన వాసంతం నీకు స్వాగతం పలుకుతున్నా..
తలపుల తలుపులు వాటంతటే తెరుచుకున్నా..
ఈ పిచ్చి మనసు..
మౌన ముద్ర దాల్చి..
కనీసం నీ చూపులతో చూపులు కలపలేకపోతోంది..
56 comments:
చాల బాగుంది..
first comment naadenaa??
కానీ ఈసరి తెలుగు లో రాయవలసింది గా ప్రార్ధన.. :) :), కనీసం శబ్దరత్నాకరం లింక్ ఇవ్వండి..plz..:) :)
ఏమని చెప్పగలను..?
ఎన్నని చెప్పగలను..?
వాసంత, హేమంత, శరత్, శిశిరాలను..
సంగీత, సాహిత్య, శత వర్ణ చిత్రాలను..
మోదాగ్ర శిఖరాలను, ఖేదాఖాతాలను..
హిమవన్నగాలను.., మహార్ణవాలను..
పదిలంగా దాచుకున్న మనసుని..
వాహ్..వా..వహ్..వా..:) :)
ఎన్నెన్ని కలలు కన్నాను.?
మరేంటి..? ఇప్పుడిలా..!!
చిగురించిన వాసంతం నీకు స్వాగతం పలుకుతున్నా..
తలపుల తలుపులు వాటంతటే తెరుచుకున్నా..
ఈ పిచ్చి మనసు..
మౌన ముద్ర దాల్చి..
కనీసం నీ చూపులతో చూపులు కలపలేకపోతోంది..
భలే రాస్తున్నారు చాల చాల బాగుంది.
simply superb..
అందంగా సిగ్గుపడిపోతున్నారేం.....!
బాగుంది మీ మౌనముద్ర. ఇంతకీ ఎందుకలా?
ఏమని చెప్పగలను..ఎన్నని చెప్పగలను..అంటూనే అన్నీ చెప్పెసారుగా ఆ పిచ్చి మనసు మౌన ముద్ర దాల్చి ...... శబ్దం కంటే నిశ్శబ్దం ఎక్కువ మాట్లాడుతుందట. మీరు మౌనంగా అన్నీ చక్కగా అందంగా చెప్పారు. సింప్లీ సుపర్బ్.
:) nice appu
చాల చాల బాగుంది..
వేణూరాం.. ధన్యవాదాలు..:) ఫస్ట్ కామెంటు నీదే..
>>కానీ ఈసరి తెలుగు లో రాయవలసింది గా ప్రార్ధన.
:( :P
>>వాహ్..వా..వహ్..వా..:) :)
Thank you..
అశోక్.. చాలా చాలా థ్యాంక్స్..:)
సవ్వడి గారు, Thank you sooo much..
మందాకిని గారు, కారణం తెలియదండీ..:) ధన్యవాదాలు..
శిశిర గారు, ధన్యవాదాలు.. ఏమో మరి ;)
భాను గారు, భలే ఉంది మీ వ్యాఖ్య. నాకు చాలా సంతోషాన్నిచ్చింది..:) ధన్యవాదాలు..:)
నేస్తం అక్కయ్యా... బోలెడు ధన్యవాదాలు..:)
చెప్పాలంటే, ధన్యవాదాలండీ..:)
చదవటానికి చాలా బాగుంది.... కాని కొన్ని పదాలకి మాత్రం నాకు అర్ధాలు తెలీదు.
అర్జెంటుగా దీనికి అర్ధాలు భావాలు చెబితే సరి. లేదంటే చెప్పండి మీ సిరివెన్నెల బ్లాగులా నేనూ ఒక బ్లాగుపెట్టేసి మీర్రాసిన కవితలన్నిటికి నాకిష్టమొచ్చిన అర్ధాలు రాసేస్తా...:))
3g గారూ.. మరీ అర్జెంట్‌గా తెలియాలాండీ..:(
పైకి అడగలేకపోతున్నా కానీ, మీ వ్యాఖ్య చూశాక నాకు బోలెడన్ని అనుమానాలు వచ్చేస్తున్నాయి.:P
>>లేదంటే చెప్పండి మీ సిరివెన్నెల బ్లాగులా నేనూ ఒక బ్లాగుపెట్టేసి మీర్రాసిన కవితలన్నిటికి నాకిష్టమొచ్చిన అర్ధాలు రాసేస్తా
దీని అర్థమేమి చెప్మా..!!
ఏదైతేనేమి.. మీరు అరెంట్గా అడిగేసారు కదా.. మరి ఏ ఏ పదాలకు కావాలో చెప్పలేదు..:))
అబ్బా... మళ్ళీ అపార్దం చేసుకున్నారా..... సారీ అండి. నాకు చాలాసార్లు అర్ధాలు తెలీకపోయినా మంచి పదాలున్న పాటలన్నీ చాలా నచ్చుతూ ఉంటాయ్. ఇప్పుడు మీరు రాసిన దాంట్లో కూడా
"వాసంత, హేమంత, శరత్, శిశిరాలను..
సంగీత, సాహిత్య, శత వర్ణ చిత్రాలను..
మోదాగ్ర శిఖరాలను, ఖేదాఖాతాలను..
హిమవన్నగాలను.., మహార్ణవాలను..
పదిలంగా దాచుకున్న మనసుని"
ఇవి చాలా బాగా నచ్చాయ్. కాని దాంట్లో మూడు, నాలుగు లైన్లకి పూర్తిగా అర్ధాలు తెలీదు అందుకే అలా రాసాను.సో.... మీ అనుమానాలన్నీ కేన్సిల్ చేసెయ్యండి.
హేయ్ అపర్ణ చాలా బాగుంది నీ కవిత.అందులో అలవోకగా వాడిన తెలుగు పదాలు ఇంకా చాలా చాలా బాగున్నాయి. సూపర్బ్ :)
>>అబ్బా... మళ్ళీ అపార్దం చేసుకున్నారా..
>>మీ అనుమానాలన్నీ కేన్సిల్ చేసెయ్యండి.
హిహ్హిహ్హీ.. అలా రండి దారికి..;)
ఇక మీరు అడిగి ప్రశ్నకి నా సమాధానం. నేను ఏ అర్థంతో అయితే వాడానో అదే చెబుతున్నాను. నేను తెలుగులో అంత పండితురాలిని అయితే కాదు..:(
మోదాగ్ర శిఖరాలు = చాలా సంతోషంగా గడిపిన క్షణాలు (మోదం=సంతోషం). శిఖరాలు ఎంత ఎత్తులో ఉంటాయో మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా అలాగే 9వ మేఘంపై ఉంటాము కదా అందుకే అలా రాసాను..:)
ఖేదాఖాతాలు = దుఃఖపు అఖాతాలు (ఖేదం = దుఃఖం). బాధలో ఉన్నప్పుడు మనకి ఏదో లోయల్లోకి పడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది కదా...
ఏదైనా తప్పులుంటే పెద్దలు తెలుపగలరు..
అఖాతం అంటే లోయా? అగాధం విన్నాను ...తెలియక అడిగాను నువ్వు కంగారుపడి నన్ను కంగారు పెట్టెయకు:)
చాలా బాగుంది అపర్ణ.. చక్కని పదాలు .. నాకు తెలియని పదాలు నీ కవిత ద్వారా తెలుసుకున్న.
9వ మేఘంపై= నాకు దిమ్మ తిరిగింది
cloud 9 ని ఎంతచక్కగా విసదీకరించావు మా తల్లే!
3g అర్జెంట్ గా మొదలెడదాం ఆ బ్లాగేదో నేను కూడా రడీ
వ్యాఖ్యల్లో చిన్న పిల్ల లాగా ముద్దు ముద్దుగా మాట్లాడతావు. కవితల్లో మాత్రం ఎంత లోతైన భావాలు... ఎంత గంభీరమైన పదాలు...
నిజం చెప్పు. నువ్వు చెప్పుకుంటున్న వయసు నిజమేనా? అంతకు ముందు పెట్టిన ఫోటో నీదేనా? లేక నీ పూర్వ జన్మలో సంపాదించిన జ్ఞానం, అనుభవం నీకు ఇంకా గుర్తున్నాయా?
లేక ఎవరో రాసినవి కొట్టుకొచ్చేస్తున్నావా? (just kidding. సరదాగా తీసుకో :) )
ఇంత రాసాక కవిత గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ప్రతి పదం నచ్చింది :)
ఇందు గారు, మీకు బోలెడు ధన్యవాదాలు..:) చాలా సంతోషం వేసింది మీ వ్యాఖ్య చూసి..:)
నేస్తం అక్కయ్యా.. మీరు ఏదైనా భలే పట్టేస్తారు. మీ వ్యాఖ్య చూడగానే నాకు చాలా కంగారు వేసేసింది..:( నేననుకున్నది తప్పా అని.. ఏమో అక్కా, అగాధం అంటే లోయే.. అఖాతం కూడా అదే అర్థాన్ని ఇస్తుందని తెలుసు. మరి పెద్దలు ఎవరైనా తెలియజేస్తే బాగుండు..
కిషన్ గారు, చాలా చాలా థ్యాంక్స్..:) మీకు తెలియని పదాలు నేను తెలియజెప్పానా.. హహ్హహ్హా.. భలే చెప్పారు.;)
కృష్ణ.. నీ వ్యాఖ్య చూసి తెగ నవ్వేసుకున్నా.. ఎంతైనా నీ స్టైలే వేరులే.. మరి ఎప్పుడు మొదలెట్టేస్తున్నారు..;) నేను వెయిటింగ్ ఇక్కడ.. :D
ప్రవీణ్.. ఆగు ఆగు.. ఏమిటా ప్రశ్నల వర్షం..? నీ వ్యాఖ్యకి ఎంత సంబర పడిపోయానో తెలుసా..
>>లేక నీ పూర్వ జన్మలో సంపాదించిన జ్ఞానం, అనుభవం నీకు ఇంకా గుర్తున్నాయా?
దీనికి సమాధానం నేను చెప్పలేను కానీ...
>>ఎవరో రాసినవి కొట్టుకొచ్చేస్తున్నావా? గుర్ర్‌ర్ర్‌ర్ర్..;)
నీకో నిజం చెప్పనా.. అసలు ఈ తవిక నేను ఇంటర్ అయిపోయి డిగ్రీ మొదలవ్వకముందు హాలిడే్స్లో రాసుకున్నది. మొన్నెందుకో ఒక మూలన పడి ఉన్న శిథిలాలని, అవశేషాలని వెలికి తీస్తుంటే ఇది కనిపించింది. వెంటనే మీ అందరి మీదకి వదిలా..
ఇహాహ్హాహ్హా.. వికటాట్టహాసం..
Thank you so much for your compliments.
9వ మేఘంపై= నాకు దిమ్మ తిరిగింది
cloud 9 ని ఎంతచక్కగా విసదీకరించావు మా తల్లే!
3g అర్జెంట్ గా మొదలెడదాం ఆ బ్లాగేదో నేను కూడా రడీ
nenu kooda ready..
"ఎవరో రాసినవి కొట్టుకొచ్చేస్తున్నావా?" ..ee doubt naaku kooda vachchindi sai.. hihihi...
@అపర్ణ Grrrrrrrrrrrrrrr
(నీ వంతు నేనే అంటున్నా )
"నీ పూర్వ జన్మలో సంపాదించిన జ్ఞానం, అనుభవం నీకు ఇంకా గుర్తున్నాయా?"
నాకు కూడా ఇలానే అనిపిస్తుంది...
ఇంటర్ లోనే ఇంత పండి పోయావా...? వామ్మో ... :) keka..
చిన్నప్పుడు పద్యాలకి ప్రతి పదార్ధాలు చదువుకునే వాళ్ళం.. మీ దయ వల్ల కవితలకి కూడా చదవాల్సి వచ్చేలాగ ఉంది. :) :) :)(JK)
//మోదాగ్ర శిఖరాలు = చాలా సంతోషంగా గడిపిన క్షణాలు (మోదం=సంతోషం). శిఖరాలు ఎంత ఎత్తులో ఉంటాయో మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా అలాగే 9వ మేఘంపై ఉంటాము కదా అందుకే అలా రాసాను..:)
ఖేదాఖాతాలు = దుఃఖపు అఖాతాలు (ఖేదం = దుఃఖం). బాధలో ఉన్నప్పుడు మనకి ఏదో లోయల్లోకి పడిపోతున్న ఫీలింగ్ //
Excellent అపర్ణ....ఇవి ఇంటర్ లో రాసారంటే నమ్మలేకుండాఉన్నాను.
హరే........... ఎప్పుడు మొదలెడదాం చెప్పు. ముందు మంచి పేరోటిపెట్టాలి కదా!ఏం పేరు పెడదాం....
వేణూరాం.. నువ్వు కూడానా..!!! అమ్మో అమ్మో.. నన్ను అనాల్సిన మాటలన్నీ అనేసి మళ్లీ జోక్ అంటావా..? అయ్.. ఏదైతేనేమి నన్ను పొగిడేసావు కదా. బ్రతికిపోయావు.. హహ్హహ్హా..
3g గారు,
>>ఇవి ఇంటర్ లో రాసారంటే నమ్మలేకుండా ఉన్నాను.
నిజమేనండీ.. కావాలంటే మొన్న బయట పడ్డ ఆ శిథిలావస్థలో ఉన్న పేపర్ ముక్కని స్కాన్ చేసి బ్లాగులో పెడతా. దాని రంగు రుచి వీలైతే చిక్కదనం కూడా చూసి మీరే చెప్పేస్తారు అది ఇప్పటి అప్పటి పేపర్ కాదు ఎప్పటిదో అని..;);):D
అపర్ణ, తిట్టకు, కోప్పడకు...నేను నీ కవితని మొదట
"కనుల ముందు కొత్త వాంతి..." అని చదివా. అమ్మో ఏమొచ్చించి ఈ పిల్లకి ఇలా రాస్తున్నాది అని మళ్ళీ చూస్తే అది "కాంతి" అని అర్థమయింది. నిజంగా ఎంత నవ్వొచ్చిందో, నీకు చెబుదామా వద్దా అని తెగ ఆలోచించి చించి చించి చెబుదామని డిసైడ్ జేసినా. ఏమనుకోకేం :D
మనకి కవితలు అవీ ఎక్కవుగానీ వినడానికి బావుంది నీ కవిత. బరువయిన పదాలు వాడి మన పిల్లకాయలను బెదరగొట్టేసావుగా! :)
సౌమ్య గారు,
>>కనుల ముందు కొత్త వాంతి..
వా.. వా.. మీరు కూడా నన్నే అనండి.;)
>>బరువయిన పదాలు వాడి మన పిల్లకాయలను బెదరగొట్టేసావుగా
నేనా....!!! ;);)
ధన్యవాదాలు టపా నచ్చినందుకు..:))
vammo.. Aparna..emaindhi.. emiti ee kavithala varsham.. super ga vundi kavitha..
Inter lo rasavu ante nammalekapothunna :) Nestam akka tho two comments peetinchukunnav.. nee meeda chala asuya.. ga vundi..
కవిత చాలా బాగుంది అపర్ణ గారు, నాకు మాత్రం మీర్రాసిన కవితే అనడంలో ఏ సందేహం కలగలేదు మీరు సిరివెన్నెల గారి పాటలకు రాసిన వ్యాఖ్యానం చూసి అనుకున్నా ఎపుడో ఇలాంటి కవితలు బయట పడతాయి అని.
శశిధర్..
>>Nestam akka tho two comments peetinchukunnav.. nee meeda chala asuya.. ga vundi.
ఇహహ్హహ్హా.. ఇహహ్హహ్హా.. నువ్వు అలాగే కుళ్లేస్కోవా ప్లీజ్. ;)
నా తవిక నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు నీకు.:) నేను ఇంటర్ అయిపోయాక రాసాను అంటే నీకు కూడా అనుమానమేనా.. చెప్పానుగా స్కాన్ చేసి పంపిస్తా.. రంగు రుచి చిక్కదనం చూసేసెయ్..;)
వేణు శ్రీకాంత్ గారు.. ఆహా.. ఓహో.. ఎన్నాళ్లకి ఎన్నేళ్లకి ఉగాదులు ఉషస్సులు..:)మీరొక్కరే నమ్మారు తెలుసా మరి..:(
>>నాకు మాత్రం మీర్రాసిన కవితే అనడంలో ఏ సందేహం కలగలేదు
మీకైతేనండీ బోలెడు బోలెడు బోలెడు ధన్యవాదాలు..:))
ఇంటర్లో రాసిందా. అది అర్థం కావటందుకు మీరు అర్థాలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు రాసినవి ఎలా ఉంటాయంటారు మరి.
భాను గారు..:( అసలిప్పుడు రాయడం మానేసానండీ తవికలు..:( ఏదో అప్పుడప్పుడూ ఒకటి అర రాస్తుంటే అవి తవికలు కూడా కావని నాకే అనుమానం వస్తుంది..:) మొన్న రాసిన "క్షణం అడిగిన ప్రశ్న" చూసారుగా.. అలా ఉందన్నమాట నా ప్రస్తుత పరిస్థితి..:)
నేను ఖేదాఖాతలని .. ఖేదఖాతాలని చదివి .. ఒహొ .. ఖేదం కలిగినప్పుడల్లా ఖాతా లో రాసుకొనే వారేమో - ఆనక అవకాశమ్ దొరికినప్పుడు దెప్పి పొడవడానికి అనుకున్నాను... :)))
మళ్ళా ఒక పంక్తి వెనక్కి వెళ్లి చదితే దీర్ఘం కనిపించి నన్ను ఒడ్డుకు జేర్చింది..
బాగా రాశారండీ
"మోదాగ్ర శిఖరాలను, ఖేదాఖాతాలను" చాలా బాగుంది
ఆ చైత్రపు చినుకు బొట్టు చుక్కబొట్టు అనుకుంటా
@నేస్తం
బంగాళాఖాతం అని ఎప్పుడూ వినలేదా మీరు!
హే...అందరు బావుంది బావుంది అంటే నాకు తెలుసుకొవాలన్న ఉత్సాహం పెరిగిపొతుంది. ఇదేవరన్నా నాకు కాస్త తెలుగులోకి అనువదించి చెప్పగలరా...
ఊకదంపుడు గారు,
ముందుగా మీరు నా బ్లాగు తలుపు తట్టి, అడుగు పెట్టి కామెంటినందుకు ధన్యవాదాలు..:)
>>నేను ఖేదాఖాతలని .. ఖేదఖాతాలని చదివి .. ఒహొ .. ఖేదం కలిగినప్పుడల్లా ఖాతా లో రాసుకొనే వారేమో -
హహ్హహ్హా.. భలే బాగుంది ఈ అర్థం కూడా.. మీకు నా తవిక నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు..:)
మంచు గారు, ఆ "ఎవరన్నా" లోకి నేను కూడా వస్తాననే ఉద్ధేశ్యంతో వ్యాఖ్య పెడుతున్నాను..;)
అసలు ఈ తవిక, ప్రియుడి రాకకై ఎదు చూసిన ఒక ప్రియురాలి మనసన్న మాట. అతను రాక ముందు ఎన్నెన్నో అతనితో షేర్ చేసుకోవాలని దాచి పెట్టుకుని తీరా అతను ఎదురయ్యే సమయానికి మౌనమే తన భాషగా మారిందని దీని సారం.
ఆ మొదటి మూడు లైన్లు ప్రియుడిని చూడగానే కలిగిన ఆనందం. ఆ తరువాత ఏదో చెప్పాలనుకుని చెప్పలేక పోతున తత్తరపాటు.
వాసంత, హేమంత...... హృది కవాటాల్ని తెరిచి.. నీ ముందుంచాలని.
వరకూ ఏమేమి చెప్పాలని ముందుగా అనుకుందో వాటి లిస్ట్ అన్నమాట..:) మొత్తంగా ఎన్నో రకాల కళలను, భావావేశాల్ని దాచుకున్న తన మనసునంతా అతని ముందు పెట్టాలనుకుని, అతను ఎదురయ్యే నిమిషంలో మాత్రం మౌన ముద్ర దాల్చి కనీసం అతడిని కన్నెత్తి చూడలేక పోతుంది సిగ్గుతో..
ఇప్పుడు ఓకేనా..!!:))
అపర్ణ బాగుంది నీ కవిత...ఈ పోస్ట్ ఎప్పుడు పెట్టావు ..నేను ఇప్పుడే చూసా
//హే...అందరు బావుంది బావుంది అంటే నాకు తెలుసుకొవాలన్న ఉత్సాహం పెరిగిపొతుంది. ఇదేవరన్నా నాకు కాస్త తెలుగులోకి అనువదించి చెప్పగలరా..//
మంచుగారు కొంచెం ఓపిక పట్టండి... మరో మూణ్ణాలుగు రోజుల్లో ఒక బ్లాగు మొదలవ్వబోతుంది దాంట్లో తెలుగు అనువాదాలేం ఖర్మ మొత్తం అన్ని ప్రపంచ భాషల్లో అనువదిస్తాం... కాకపోతే మీరుకూడా ఒక చెయ్యి వెయ్యాలి.
రంజనీ.. మొన్ననే రాసాను.. ధన్యవాదాలు నా కవిత నచ్చినందుకు..:)
3g గారు,
>>మరో మూణ్ణాలుగు రోజుల్లో ఒక బ్లాగు మొదలవ్వబోతుంది దాంట్లో తెలుగు అనువాదాలేం ఖర్మ మొత్తం అన్ని ప్రపంచ భాషల్లో అనువదిస్తాం..
ఏమిటి నిజంగానే గాట్టిగా ఫిక్స్ అయిపోయారా..?? :(
అపర్ణ, కవిత బావుంది :-)
3g,
German, Spanish, French, Italian translation rights నేను రిజర్వ్ చేసుకుంటున్నా.
(గమనిక : ఆ భాషలన్నీ నాకు రావు)
బద్రి గారు, ధన్యవాదాలు..:)
Beautiful! భావకవిత్వమన్నమాట! బాగుంది నిరీక్షన తరవాత మౌనముద్ర! :)
మధుర గారు, ధన్యవాదాలు..:)
ఆడవాళ్ళమనసు నాటకీయంగా తెరచి వుంచిన పుస్తకం
తెరిచి వుంచిన ఆ రెండుపుటలు తప్ప మరేమి కనపడదు
చదివే ప్రయత్నం చేసినా, ఏమీ అర్థం కాదు(కారు).
"మనసు పలికే "దంతా ఆ రెండు పుటల్లోనిదే !
మిగిలినదంతా అవునన్నా, కాదన్నా "మౌన రాగమే"! !
సత్య గారూ.. ఎంత బాగా రాసారో.. ఎన్ని సార్లు చదివానో మీ వ్యాఖ్యని, చాలా నచ్చింది.. ధన్యవాదాలు :)
>>చదివే ప్రయత్నం చేసినా, ఏమీ అర్థం కాదు(కారు).
మీరు ఎలా రాసారో తెలియదు కానీ నేనైతే పాజిటివ్ గానే అర్థం చేసుకున్నాను..;)
మొన్న "నా నీకు' నిన్న 'క్షణం అడిగిన ప్రశ్న' ఈ వేళ ఈ 'మౌన ముద్ర' అసలు ఈ కవితావేశం ఏమిటి? 9వ మేఘం (ఇది నాకు బాగా నచ్చింది) పైగా శిఖరాగ్రాలు అఖాతాలు, వీటికి మీ వ్యాఖ్యానాలు నచ్చాయి.
3g గారూ మీరు ఆ బ్లాగ్ ఏదో వెంటనే పెట్టేయండి. నేనూ ఓ చెయ్యవేస్తాను.
బాగుంది మీ మౌనం.
సుబ్రహ్మణ్యం గారూ.. చెప్పలేనంత సంతోషంగా ఉంది మీకు కూడా నా తవిక నచ్చినందుకు..:) బోలెడన్ని ధన్యవాదాలు. ఏంటండీ మీరు కూడా 3g గారితో కలిసిపోయారా..?
నావి ఇంతకు ముందు కూడా రెండు తవికలు ఉన్నాయండీ. చూసి ఎలా ఉన్నాయో చెప్పరూ..:))
నన్ను నేను కోల్పోయాను
http://manasupalikey.blogspot.com/2010/07/blog-post.html
నా ప్రియ నేస్తం
http://manasupalikey.blogspot.com/2010/07/blog-post_13.html
సంతోషం...నేను పాసిటివ్ గానె రాసాను, పాసిటివ్ గా నే తీసుకున్నందుకు ధన్యవాదాలు...
ఆ మాటలు....
అయోమయం లోంచి పుట్టిన ఆశువులు.
confusion లోంచి పుట్టిన conclusion .
సత్య గారు.. మీకు మళ్లీ ధన్యవాదాలు..:)
>>అయోమయం లోంచి పుట్టిన ఆశువులు.
confusion లోంచి పుట్టిన conclusion .
హహ్హహ్హా..
ఏంటి ఇది నువ్వు ఇంటర్ లో రాసావా..
ఇంటర్ లో ఇంత బాగా రాసావంటే ఇప్పుడు ఇంతకంటే బాగా రాయాలి కదా..అంటే మరో తవిక రాసి పోస్టించు
కృష్ణ.. నిజం ఇది నేను ఇంటర్ అయిపోయాక రాసుకున్నాను. ఇప్పుడు రాయడమంటే కొంచెం కష్టమే. ఎంతో కష్టపడితే కానీ క్షణం అడిగిన ప్రశ్న, నన్ను నేను కోల్పోయాను, ఇలాంటివి వచ్చాయి మరి.:(
Really loved it my friend.Nice one :-)
క్రాంతి కుమార్ గారు, ధన్యవాదాలు మీకు నా కవిత అంతగా నచ్చినందుకు, వ్యాఖ్య పెట్టినందుకు :)
Post a Comment