Tuesday, December 14, 2010

నా నేస్తానికి అంకితం

"నవ్వు" అంటే ఏంటి..?
అప్పుడే పుట్టిన మొగ్గల్లా పెదవులు విచ్చుకోవడమా..!
అరవిరిసిన కుసుమాల్లా కళ్లు మారడమా..!!
విరబూసిన జాజుల్లా మనసు వెలగడమా!!

అదేంటో మరి..
నీ సావాసంలో అయితే నా శరీరమంతా నవ్వుతుంది. 

కలిసి గడిపిన క్షణాల్లో ఎన్నెన్ని ఊసులు దొర్లుతాయని..
ప్రపంచమంతా మన మాటల్ని పలకరించే పక్కకి జరుగుతుందేమో..

ముత్యాల ముచ్చట్లలో ఒదిగిపోయిన సమయం
మనకి కనిపించదు అనుకుంటాం కానీ..
నిజానికి.. మనం కలిస్తే..
కాలం అసూయతో పరుగందుకుంటుంది.

"ఎంత సమయం" కన్నా "ఎలా గడిపాం" అన్నదే కదా ముఖ్యం.
నీతో పంచుకున్న ఆ నాలుగు నిమిషాలు చాలు
స్నేహానికి అర్థం చెప్పడానికి.


చాలా రోజుల తరువాత ఈరోజు నా స్నేహితురాలు కలిసిందండీ. ఎవరి పనుల్లో వారు మునిగిపోయి, అసలు ఫోన్ కూడా చేసుకోక చాలా రోజులే అయింది. రెండు కొప్పులు ఒకచోట చేరితే ఏం జరుగుతుందో తెలుసు కదా..;) ప్రపంచంలోని విషయాలన్నీ ఒకసారి మాట్లాడేసుకున్నాం. మా సంతోషానికి మాకు ఒక గంట సమయం మాత్రమే దొరికింది..:( ఏం చేస్తాం. బోలెడన్ని ఆ గంటలోనే మాట్లాడేసుకుని సంతోషంగా గడిపాం. ఇద్దరు మనుషులకి ఒకే అంశం మీద ఆసక్తి ఉంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. తను కూడా మనలాగే కళా పోషకురాలు..:) ఇక సాహిత్యం మీద చర్చ మీద చర్చ జరిపేసి, టైం చూసి భారంగా నిట్టూర్చి వెళ్లిపోయింది..:(

నా మనసుకు నచ్చిన నేస్తం కోసం, మనసులో మెదులుతున్న ఆ నాలుగు భావాలకి ఇలా అక్షర రూపం ఇచ్చాను. మీరు భరించాలి తప్పదు..:))

30 comments:

హరే కృష్ణ said...

1st కామెంట్ నాదే :-)

హరే కృష్ణ said...

ఎంత సేపు మాట్లడమన్నాది కాదు అప్పు.. హాయిగా మాట్లడుకున్నామా లేదా..

ఈరోజు చాలా చాలా హ్యాపీ గా ఉన్నావ్ కదా పార్టీ ఇలా పడేయ్ మా అందరికీ

మాలా కుమార్ said...

చాలా రోజులకు కలిసిన నేస్తం తో ఓ గంట సంతోషముగా గడిపారన్నమాట . ఆ సంతోషం కనిపిస్తోంది .

భాను said...

నీ సావాసంలో అయితే నా శరీరమంతా నవ్వుతుంది"ఎంత ఆనందమయితే తప్ప ఇది సాద్యం కాదు కదా. బాగుంది మీ నేస్తం కవిత

వేణూరాం said...

భరిస్తాం.. తప్పుతుందా? :) :) :)(jk)

నీ సావాసంలో అయితే నా శరీరమంతా నవ్వుతుంది.
కలిసి గడిపిన క్షణాల్లో ఎన్నెన్ని ఊసులు దొర్లుతాయని..
ప్రపంచమంతా మన మాటల్ని పలకరించే పక్కకి జరుగుతుందేమో..
ముత్యాల ముచ్చట్లలో ఒదిగిపోయిన సమయం
మనకి కనిపించదు అనుకుంటాం కానీ..
నిజానికి.. మనం కలిస్తే..
కాలం అసూయతో పరుగందుకుంటుంది.

ప్చ్.. మనసుపలికిన మాటలన్న మాట.. బావున్నాయి.. :)

ఇందు said...

చాలా బాగుంది అపర్ణగారు...మీ మనసులొ భావాలకి చక్కని రూపం ఇచ్చారు...స్నేహితులని..చాలా రొజుల తరువాత కలిస్తే...అసలు మనకి ప్రపంచమే తెలియదు కదా! మీ కవిత చాల్ బాగుంది :)

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుంది అపర్ణగారు...

బద్రి said...

మీ బ్లాగ్ footer లో జ్యోతి ట్రావెల్స్ అని వుంది, వాళ్ళకి ఏమీ లేదా ?

మంచు said...

ఎంటి పొకిరీ డైలాగులు : " ఎంత సమయం గడిపావన్నది ముఖ్యం కాదన్నాయ్ ... ఎలా గడిపామా అన్నది పాయింట్" పొకిరీ డైలాగులు హరే పేటెంట్.... మనం వాడకూడదు :-))

"రెండు కొప్పులు కలిస్తే" తెలీదు కానీ "రెండు పిలకలు కలిస్తే" ఎమి మాట్లాడుకుంటారొ ఇప్పుడు తెలిసింది.

@ మనలాగే కళా పోషకురాలు : ఇది ఫిక్స్ అవకు... నువ్వు పొషించుకొ... మమ్మల్ని అందరనీ కలపకు :-)

చెప్పాలంటే...... said...

mi santosham telustondi.....baavundi

అశోక్ పాపాయి said...

బాగుంది.

karthik said...

బాగుందండీ.. ఈ హరే కృష్ణ చాలా బిజీ అని చెబుతున్నాడు.. మొదటి కామెంట్లు మాత్రం పెడుతున్నాడు.. నేను దీన్ని ఖండిస్తున్నా.. :P

మనసు పలికే said...

కృష్ణ.. మళ్లీ పార్టీ మొదలెట్టావా..!! అలాగే. పడేస్తున్నా తీసుకో..;) హ్మ్.. మళ్లీ నీదే ఫస్ట్ కామెంట్..:))

మాలా కుమార్ గారు, చాలా సంతోషంగా ఉంది మీ వ్యాఖ్యకి..:) ధన్యవాదాలు.

మనసు పలికే said...

భాను గారూ, నిజమండీ.. చాలా సంతోషంగా ఉన్నాను..:) ధన్యవాదాలు..

వేణూరాం. అవునవును ఇవి అచ్చంగా మనసు పలికిన మాటలే. ఏ మార్పులూ చెయ్యలేదు.. ధన్యవాదాలు..:)

మనసు పలికే said...

ఇందు గారు,
>>.స్నేహితులని..చాలా రొజుల తరువాత కలిస్తే...అసలు మనకి ప్రపంచమే తెలియదు కదా!
అవునండీ. ధన్యవాదాలు నా టపా నచ్చినందుకు..:)

వేణు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు..

మనసు పలికే said...

బద్రి గారు,
హహ్హహ్హా.. అది నా స్నేహితుడు పెట్టిన ట్రావెల్ ఏజెన్సీ.. మీకేమైనా టికెట్లు బుక్ చెయ్యాలంటే ఆ నంబర్ కి కాల్ చేసేయ్యండి..:)

మంచు గారు,
>>పొకిరీ డైలాగులు హరే పేటెంట్.... మనం వాడకూడదు :-))
హహ్హహ్హా.. అలాగే.
అందర్నీ కలపకు అని ఎందుకు అంటున్నారు..? మీరు, రాంబాబు, సోంబాబు కలవరు అంతే..:))

మనసు పలికే said...

చెప్పాలంటే గారు, ధన్యవాదాలు..:)

అశోక్.. ధన్యవాదాలు..:)

కార్తీక్ గారు, హహ్హహ్హా.. నిజమేనండీ. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. హరే ని రానివ్వండి కదిగేద్దాం..:P
ధన్యవాదాలు టపా నచ్చినందుకు..:)

శిశిర said...

"అదేంటో మరి..
నీ సావాసంలో అయితే నా శరీరమంతా నవ్వుతుంది.

నీతో పంచుకున్న ఆ నాలుగు నిమిషాలు చాలు
స్నేహానికి అర్థం చెప్పడానికి. "

చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశారు మీ స్నేహాన్ని. చాలా బాగుంది.

శివరంజని said...

అపర్ణ బాగుంది నీ నేస్తం పై కవిత ...ఆ నేస్తం ఎవరో కాని నాకు ఎంత జెలసీ గా ఉందో అంత ముచ్చటేస్తుంది మీ స్నేహం చూసి ...నిజమే నువ్వు చెప్పినట్టు ఎంత సేపు మాట్లాడారు అన్నది కాదు ఎంత ప్రేమ గా మాట్లాడారు అన్నది ముఖ్యం .. మీ స్నేహం ఎప్పటికి ఇలాగే స్వచ్చంగా, శాశ్వతం గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

మనసు పలికే said...

శిశిర గారు, ధన్యవాదాలు..:)

రంజనీ.. హహ్హహ్హా.. కుళ్లుకుంటున్నావా..!
>>మీ స్నేహం ఎప్పటికి ఇలాగే స్వచ్చంగా, శాశ్వతం గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
నీకు బోలెడన్ని థాంకులు..:)

మధురవాణి said...

so sweet! :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

అరమర లేని మన చిరతర స్నేహరుచుల్
కురిసిన వెన్నెలలా, అరవిరిసిన మల్లియలా
......

అన్న విశ్వసుందరమ్మగారి గేయం గుర్తుకొచ్చింది.స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పాడుకొని పరవశించిపోయారన్న మాట.

హరే కృష్ణ గారి పార్టీ లో నేను కూడా.

Sasidhar Anne said...

Aschrayam.. rendu koopulu kalisi kalala gurinchi matladukunnaya.. Namma vidham ga lede..
Dress materials, Chiralu, Shops, vagaira vagaira kada.. Topics..

Kavitha bavundi :)

మనసు పలికే said...

మధుర గారు, ధన్యవాదాలు..:)

సుబ్రహ్మణ్యం గారు,
మీ వ్యాఖ్య నాకు ఎంత బాగా నచ్చిందో.. ధన్యవాదాలు..:) హహ్హహ్హా.. మీకు కూడా పార్టీనా.. తప్పకుండా.:)

శశిధర్ గారు, అసలు ఏమిటటా తమరి ఉద్ధేశ్యం..? అయ్..:P
టపా నచ్చినందుకు ధన్యవాదాలు..:)

రాధిక(నాని ) said...

అదేంటో మరి..
నీ సావాసంలో అయితే నా శరీరమంతా నవ్వుతుంది.
మీ కవిత మీ ఫీలింగ్స్ కి అద్దంపడుతుంది.మీ ఆనందమంతా మీ పోస్ట్ లో కనిపిస్తుంది .బాగుందండి..

C.ఉమాదేవి said...

స్నేహబంధము ఎంత మధురము అని ఊరకే అనలేదు.మీ స్నేహగీతం స్నేహసౌరభాన్ని వెదజల్లింది.

మనసు పలికే said...

రాధిక గారు, ధన్యవాదాలండీ..:)

ఉమాదేవి గారు,
>>స్నేహబంధము ఎంత మధురము అని ఊరకే అనలేదు
బాగా చెప్పారు. ధన్యవాదాలు..:)

Sai Praveen said...

"ముత్యాల ముచ్చట్లలో ఒదిగిపోయిన సమయం
మనకి కనిపించదు అనుకుంటాం కానీ..
నిజానికి.. మనం కలిస్తే..
కాలం అసూయతో పరుగందుకుంటుంది"

వాహ్!!

మనసు పలికే said...

ధన్యవాదాలు ప్రవీణ్..:)

Arun Kumar said...

చాలా బాగుంది అపర్ణగారు...మీ మనసులొ భావాలకి చక్కని రూపం ఇచ్చారు...స్నేహితులని..చాలా రొజుల తరువాత కలిస్తే...అసలు మనకి ప్రపంచమే తెలియదు కదా! మీ కవిత చాల్ బాగుంది :)