Monday, March 7, 2011

అంతర్మధనం.. ఆది అంతరంగం..

థ్యాంక్‌గాడ్.. కనీసం అక్క అర్థం చేసుకుంది నన్ను. అమ్మెందుకు అర్థం చేసుకోలేకపోతుందో, జనరేషన్ గ్యాప్ కదూ.. అక్క మాటిచ్చింది,"నేను అమ్మని ఒప్పించి నీ పెళ్లి చేస్తారా". అమ్మని ఎలాగైనా ఒప్పించి శృతినే పెళ్లి చేసుకోవాలి.

శృతి, నా జీవితంలోకి చాలా విచిత్రంగా ప్రవేశించింది. నాకు భావుకత్వం అంతగా రాదు, వచ్చుంటే ఈపాటికి తన గురించి ఒక గ్రంథం రాసేసేవాడినేమో. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉంటుంది, అందర్నీ నవ్విస్తుంది. తనని కలిసే వరకూ అసలు జీవితం ఇంత అందంగా, ఆనందంగా ఉంటుందని తెలీదు. ఇంతకు ముందంతా నాన్న లేని జీవితం, అమ్మొక్కత్తే కష్ట పడుతూ ఉంటే చూడలేని జీవితం. అలా అని అమ్మకి నేను ఏరోజూ హెల్ప్ చేసింది లేదు. ఒక్కటి మాత్రం మనసులో బాగా ఫిక్స్ అయిపోయింది, అమ్మని సుఖపెట్టాలి, ఇక ముందు కష్టం అంటే తెలియకుండా చూసుకోవాలి. ఇదే శృతికి కూడా చెప్పాను.."నాకు మా అమ్మ ఎంతో అత్తమ్మ కూడా అంతే ఆది, నువ్వేం బెంగ పడకు మనమంతా సంతోషంగా ఉంటాం" అన్నది శృతి. ఇక నా జీవితం నిజంగా సంతోషంగా గడవబోతోందని తలుచుకుంటే మనసు ఏదో తెలియని ప్రశాంతతని పొందుతుంది.

ఎలా అయితేనేం, మొత్తానికి అమ్మని కూడా పెళ్లికి ఓకే అనిపించాం, అక్క నేను కలిసి. కానీ చాలా స్పష్టంగా తెలుస్తుంది, అమ్మకి నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేదని. అయినా నాకు నమ్మకం ఉందిలే, శృతి అమ్మ మనసు మార్చేస్తుందని. నామ మాత్రంగా పెళ్లిచూపులు పెట్టిన రోజు, మా బంధువులతో, అమ్మతో ఎంతగా కలిసి పోయిందో. ఖచ్చితంగా అమ్మ మనసు మార్చేస్తుంది. ఎందుకో రాబోయే రోజులు తలుచు కుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. శృతి వాళ్ల ఊర్లోనే జరిగింది పెళ్లి, చాలా బాగా చేశారు. నా శృతి, నా భార్య అయిపోయింది. మొత్తంగా నాది అయిపోయింది. డ్యూయెట్ వేసేసుకుందామంటే పాట రాదు, డ్యాన్సూ రాదు.

కొత్త కాపురం.. స్పెషల్‌గా హనీమూన్ అంటూ వెళ్లలేదు కానీ, కొలీగ్స్ ఏదో టూర్ ప్లాన్ చేస్తే వాళ్లతో కలిసి వెళ్లాం. నా జీవితంలో మరచిపోలేని ట్రిప్ అది. ఇక ఆ ప్రదేశం అందాల్ని చూసి శృతి కవితల మీద కవితలు రాసేసి నా కొలీగ్స్ అందరికీ చూపించేస్తుంది. మొదటి సారి వాళ్లని కలుస్తుంది అన్న భావనే లేదు ఎక్కడా, ఎప్పటి నుండో స్నేహితులు అన్నట్లుగా కలిసిపోయింది వాళ్లతో. ఇంకా విచిత్రం ఏమిటంటే, పెళ్లి ఫోటోలు చూసి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారేంటి అని అడిగిన వాళ్లు కూడా ఇప్పుడు శృతి పార్టీ అయిపోయారు. తనకి నేను దొరకడం తన అదృష్టం అన్న వాళ్లంతా తనే నాకు అదృష్టం అంటున్నారు. ఐ ఎగ్రీ టు దిస్. నిజంగా శృతి నా అదృష్టం.

కొత్త కాపురం మెల్లిగా పాతబడుతున్నట్లుగా అనిపిస్తుంది, మా రొటీన్ జీవితాలతో. ఆఫీసు, ఇల్లు.. ఇల్లు, ఆఫీసు. ఇదే లోకం అయిపోతుంది. ఇటువంటి జీవితాల్లో తేడా తేవాలనేమో దేవుడు అమ్మకి శృతికి చిన్న గీత పెట్టాడు మధ్యలో. ఎవరిది తప్పు అంటే చెప్పలేను. ఒకరోజు మాత్రం అమ్మ శృతిని ఎందుకో అనరాని మాటలు అన్నది. మొదట కూల్‌గా ఉన్నా, శృతి కూడా తరువాత తగ్గలేదు. ఫైనల్‌గా నాకు అర్థమయింది ఏంటంటే; నాలో మార్పు వచ్చింది, అది శృతి కారణంగా అని అమ్మ అనుకుంటుంది. నిజానికి నేను అమ్మ కలిసి ఉండి ఐదు సంవత్సరాలు దాటింది. చదువులు, ఉద్యోగాల పేరిట బయట ఉన్నాను ఎక్కువగా. మరి ఈ మార్పు ఎలా కనిపించిందో అమ్మకి. అదే విషయం చెబుదామంటే, నేను చెప్పే విధానం కూడా అమ్మకి నచ్చడం లేదు.. కనీసం శృతి అయినా అర్థం చేసుకుంటుంది అనుకుంటే, మరి నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు అని ఎదురు ప్రశ్న వేస్తుంది. పట్టించుకోకు అని చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఇంట్లో మనశ్శాంతి మాత్రం తగ్గిపోయింది. ఎప్పుడూ గలగల మాట్లాడుతూ ఉండే శృతి, ఇంట్లో నోరు తెరవడం లేదు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఏదో వైరాగ్యాన్ని ఆశ్రయించినట్లుగా ఉంది.

శృతి గురించి అమ్మ కంప్లైంట్లు, అమ్మ చేసే పనుల గురించి శృతి కంప్లైంట్లు. మధ్యలో నేను ఎంతగా నలిగిపోతున్నానో ఎవరికీ పట్టదు.
"నాకసలు గౌరవం ఇవ్వదురా. అత్తంటే ఎంత భయం, గౌరవం ఉండాలి. కనీసం నాతో ఏదీ సరిగా మాట్లాడదు కూడా" అమ్మ చెప్పింది.
"అమ్మా ప్లీజ్.. శృతి చిన్నది. ఇంకొన్ని రోజులు పోతే దానికే అర్థం అవుతుంది." ఏదో చెప్పాలి అని చెప్పడమే, కానీ ఎంత వరకూ నిజమో, వర్క్ అవుతుందో కూడా తెలీదు.
"పెళ్లి చేసుకుంది, ఇంకా ఏంటిరా చిన్నది??"
"ఇంక ఆపమ్మా. ఎప్పుడూ ఒకటే గోల" వద్దనుకున్నా, కోపం, విసుగు గొంతు దాటి వచ్చేస్తున్నాయి.

అమ్మతో ఇలా ఉంటే.. శృతిది వేరుగా ఉంటుంది.
"ఆది, నావల్ల కావట్లేదు మీ అమ్మ ఛాదస్తంతో. నేను ఏది చేసినా నచ్చదు. ఈరోజు ఒకలా చెయ్యమంటుంది. సరే కదా మరోసారి అలాగే చేస్తే అది తప్పు అంటుంది. ఇండైరెక్ట్‌గా అనాల్సిన మాటలన్నీ అంటుంది" బాధ పడుతూ చెప్పింది ఒక రాత్రి.
"ప్లీజ్ శృతి అర్థం చేసుకో. అమ్మ చాలా కష్ట పడింది. అమ్మని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఎలా?"
"ఏది చిన్న విషయం అది..? నాకసలు ఇంట్లో ఉండాలంపించడంలేదు....
తన వాక్యం పూర్తి అయిందో లేదో కూడా తెలీదు. ఏమంటున్నానో కూడా తెలీకుండా అరిచేశాను తన మీద. ఈ అరుపులు విని అమ్మ వచ్చింది తన రూం నుండి. నా కోపం అమ్మ మీదకి పాస్ అవ్వడం సెకండ్స్‌లో జరిగిపోయింది.

రోజు రోజుకీ నాకు కోపం పెరగడం తప్ప, ఇంట్లో ఏ మార్పూ లేదు.
"అత్తమ్మ ప్రేమ అంతా నటన అని తెలిసిన రోజే నాకు తన మీద గౌరవం పోయింది. గౌరవం ఉన్నట్లు నటించడం మాత్రం నాకు రాదు" ఇది "కనీసం అమ్మ వయసుకన్నా గౌరవం ఇవ్వొచ్చు కదా శృతి.." అన్న నా ప్రశ్నకి శృతి సమాధానం. ఏంటీ జీవితం అని నా మీద నాకే అసహ్యం వేసింది. ఎక్కడ జరుగుతుంది తప్పు..? ఎవరు ఎవర్ని అర్థం చేసుకోవడం లేదు..? అమ్మ, నేను, శృతి కలిసి సంతోషంగా ఉండాలి అన్న నా ఒకే ఒక కోరిక ఇక తీరదా..? ఇలా ముగ్గురం బాధ పడుతూనే ఉండాలా.? నాకు ఇద్దరూ ప్రాణం. ఎవరెక్కువ అంటే చెప్పలేను. దేవుడా, "నీకు అమ్మ కావాలా..? శృతి కావాలా.?" అన్న పరిస్థితిని మాత్రం నాకు తీసుకు రాకు.

21 comments:

Anonymous said...

First comment naaade na?


rajkumar

ప్రవీణ said...

మనసుకు హత్తుకునేలా రాసారు..చాల ఇళ్ళలో జరిగే తంతే ఇది..ఎవరినీ తప్పు పట్టలేము

sneha said...

చాలా బాగా రాస్తున్నారు .మనసులను చదివేసినట్లు .తరువాత భాగం కొసం ఎదురు చూస్తాము

..nagarjuna.. said...

hmmm...two sides of a coin....
waiting for next part

బులుసు సుబ్రహ్మణ్యం said...

కధ బాగుంది. చాలా బాగుంది. విశ్లేషణ బాగుంది. సహజం గా ప్రతి ఇంట్లో జరిగేవే చక్కగా చెప్పారు.

మిగతా భాగాలు కూడా త్వరగా వ్రాసెయ్యండి.

kiran said...

soooooooooooooooooperu ......నాకు చాలా నచ్చింది.. :)
ఇంత లోతు గా ఆలోచిస్తున్నావో..:))
>>>డ్యూయెట్ వేసేసుకుందామంటే పాట రాదు, డ్యాన్సూ రాదు.
వచ్చినప్పుడు చేస్తే ఏమి వింత కాదు..రానప్పుడే experiments చేయాలి.. :):)
next part pleaseeeee.. :)

Sravya Vattikuti said...

అపర్ణ చాలా రాస్తున్నారు ! నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ !

హరే కృష్ణ said...

అప్పూ.కెవ్వ్!
Excellent,Waiting for the next part

వేణూరాం said...

చాలా బాగా రాస్తున్నారు మనసుపలికే గారు.. మీరు త్వరలో నవలలు రాసేస్తారనుకుంటున్నాను. తరువాతి భాగం కోసం వైటింగ్ ఇక్కడ. త్వరగా రాసెయ్యండీ మరి.

ఫస్ట్ కామెంట్ నాదే. :)

Ennela said...

బాగుంది అపర్ణా...ఎవరి వైపు నుండి వాళ్ళ కథ చక్కగా ఫ్లో అవుతోంది...ఇంక శృతి ఏమనుకుంటోందొ కూడా చెప్పెయ్యండి త్వరగా

విరిబోణి said...

Hello Aparna gaaru,

Chakkaga raasaru..entho anubhavam vunna writer laa :)andari entlo nu jarige vishayaalu eppatiki :) Keep it up, Waiting for next part?

మిరియప్పొడి said...

చాలా బాగా రాశారు అండి. ఓన్ ఎక్స్పీరియన్సా?

Sasidhar Anne said...

maa appu ena?.. namma lekunna..oka experienced writer la rasavvu appu.. way to go :)
valla manasulo matalu maatho personal share chesukuntunnatu ga vundi.. really good and so proud of you :)

శివరంజని said...

అపర్ణ చాలా బాగా మనసుకు హత్తుకునేలా రాసావు ...ఇన్నాళ్ళు పోస్ట్ చూడలేదు ....సారీ సారీ సారీ సారీ సారీ

Sasidhar Anne said...

vacchesindhi.. sorry's sivaranjani..
calling @jaya akka here

మనసు పలికే said...

రాజ్‌కుమార్ గారూ మీదే ఫస్ట్ కామెంట్:)

ప్రవీణ గారూ, హ్మ్మ్.. అవునండీ ఎవరినీ తప్పు పట్టలేం. ఒక్కొక్క విషయాన్ని నెగెటివ్‌గా ఆలోచించిన కొద్దీ ద్వేషం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ద్వేషం పెరిగిన కొద్దీ, చేసే పనులన్నీ తప్పుగానే కనిపిస్తాయి..

స్నేహ గారు, ధన్యవాదాలందీ:)

మనసు పలికే said...

నాగార్జున, హ్మ్మ్.. సెకండ్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్..:))

గురూగారూ:) ధన్యోస్మి:) మీరిలా పొగుడుతూ ఉంటే నాకు అదే బూస్ట్. బోలెడన్ని రాసేస్తా:))

కిరణ్, హహ్హహ్హా.. రానప్పుడు డ్యాన్స్ చేస్తే జనాలు గగ్గోలు పెడతారేమో;) చాలా చాలా థ్యాంక్స్ కిరణ్ టపా నచ్చినందుకు:)

మనసు పలికే said...

శ్రావ్య గారు, చాలా చాలా థ్యాంక్స్ అండీ:)

హరే, థ్యాంక్ యూ సో మచ్, I am sooo happy:)

వేణూరాం:) హహ్హహ్హా మీ వ్యాఖ్య చూసి తెగ మురిసిపోయానులే..;) మరే.. నవల రాయడం అంటే మాటలా.. ఏదో బోల్డంత కష్టపడితే కానీ ఒక కథ పూర్తి అవ్వలేదు. అయినా సరే, నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు మీకు బోలెడన్ని ధన్యవాదాలు:)

మనసు పలికే said...

ఎన్నెల గారూ, ధన్యవాదాలు:)

విరిబోణి గారు, ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు:)

మిరియప్పొడి గారు:) అయ్యయ్యో ఓన్ ఎక్స్పీరియన్స్ కాదండీ.. ఏదో ఆనోటా ఈనోటా విన్న నాలెడ్జి..

మనసు పలికే said...

శశిధర్, నీ వ్యాఖ్య చదివి ఎంత సంతోషించానో. నిజంగా వాళ్ల మనసుల్లో మాటలు నీతో షేర్ చేసుకున్నట్లు అనిపిస్తే నేను అనుకున్నది సాధించినట్లే.Thank you soooooo much my friend.

రంజనీ మనలో మనకి సారీలేందుకు చెప్పు:) నువ్వెప్పుడు చూసినా పర్లేదు. చూడు శశి ఏదో అంటున్నాడు నిన్ను;)

డేవిడ్ said...

చాలా చాలా బాగుంది....