Thursday, July 21, 2011

నీకూ నాకూ మధ్య..!!

నీకూ నాకూ  మధ్య
లెక్కే లేని అడుగుల దూరం

అయినా సరే...
కనుపాపల ముందు, రెప్పల వెనుక
నీ రూపం ప్రతినిమిషం.
మనసైతే నీతోనే సావాసం.
తలపులు నీవే, తికమకలు నీవల్లే..

ఉఛ్వాసం..
ఎక్కడి నుండో నువ్వు నాకోసం పంపిన ఊపిరి.
చిరునవ్వు..
నీ ఊహల, ఊసుల గిలిగింతల ఫలితం..

నువ్వొస్తావేమో అన్న ఊహ చాలు
వేల వాయులీనాలు నాకోసం మోగుతాయి.
ఎవరో పిలిచింది నీ పేరే అన్న అనుమానం చాలు
తనువంతా నవ్వుతుంది.

అద్భుతం..
నిన్ను వెంటబెట్టుకొచ్చిన క్షణం నా ఎదురుగా...
ఆశ్చర్యంగా.. అందంగా.. ముస్తాబయ్యి.


నువ్వు నేను..
మనసులో మాటలు సైతం వినిపించేంత దగ్గరగా..

నీ స్పర్శ తాలూకు పరిమళం
నాతోనే ఉండేంత దగ్గరగా..
నీడలు సైతం చేతులు కలిపి నడిచేంతగా..
కొత్త లోకం.. రంగుల ఇంద్రజాలం.. నీ వల్లే..

తెలియకుండా కాలం రోజుల పేజీలు తిప్పేసింది.

ఇరువురి అడుగుల్లో తెలియని తడబాటు.
నీ అడుగులు నా గమ్యాన్ని తలవవు.
నా దారి నీ తీరానికి సాగదు.

ఉన్నట్టుండి..
అగాధాలు సరితూగలేని దూరం..
మనసులు ముచ్చటించలేని మౌనం..
మదికీ మదికీ మధ్య.

26 comments:

మధురవాణి said...

అప్పూ,
నా మనసు చదివినట్టు రాశావ్! :))

geetika said...

చాలా చాలా బాగుంది...

The Chanakya said...

How girls are crazy about me I don't know..!!? :DDD

నన్ను ఊహించుకుని కవితలు కూడా రాసెస్తున్నారు. :P

Just kidding. సీరియస్‌గా తీసుకోకండి. కవిత మాత్రం బాగుంది. చెప్పాను కదా.. నన్ను ఆదర్శంగా తీసుకుని రాస్తే మీరు కూడా నా అంత గొప్ప రైటర్ అవుతారని. Keep it up.

kiran said...

appuuu...sooooooper..
tuition pls...:)

క్రాంతి కుమార్ మలినేని said...

very very nice one andi.chaala bagundi.

Padmavalli said...

అపర్ణా,
"నీకూ నాకూ మధ్య లెక్కే లేని అడుగుల దూరం
నువ్వు నేను.. మనసులో మాటలు సైతం వినిపించేంత దగ్గరగా.. "
సుపర్బ్... కాని చివరికొచ్చేసరికి గుండెలు పిండేసారు కదా..

గిరీష్ said...

Awesome!

ఈ లైన్ కేక
>>కనుపాపల ముందు, రెప్పల వెనుక నీ రూపం ప్రతినిమిషం >>

Sekhar said...

అప్పూ,nizzam ga nizam

నా మనసు చదివినట్టు రాశావ్! :))

One word..... WOW

శిశిర said...

చిరునవ్వు..
నీ ఊహల, ఊసుల గిలిగింతల ఫలితం..


Beautiful.

శోభా రాజు said...

"ఉన్నట్టుండి..
అగాధాలు సరితూగలేని దూరం..
మనసులు ముచ్చటించలేని మౌనం..
మదికీ మదికీ మధ్య."

ఏ రెండు మనసులకూ ఇలాంటి పరిస్థితి ఒక్కసారైనా అనుభవించక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ఫీల్ కానివారు చాలా తక్కువమందే. అపర్ణా సూపర్బ్‌గా రాశావు.. నాకు ఈ కవిత చాలా చాలా నచ్చేసింది... ఇలాంటి మరిన్ని కవితలు నీనుంచి ఆశిస్తూ... అభినందనలు.. .

kallurisailabala said...

ఉఛ్వాసం..
ఎక్కడి నుండో నువ్వు నాకోసం పంపిన ఊపిరి.
చిరునవ్వు..
chala bavundi
wonderful expression

ఇందు said...

అప్పు!!

చాలా బాగుంది నీ పోస్ట్! ఎంత చక్కగా చెప్పవో మనసులో మాటలూ.....ఈమధ్య నీ కవితలను మిస్ అవుతున్నా! కొంచెం కొత్తకొత్తపదాలతో..అప్పుడొకసరి రాసినట్టు మళ్ళీమళ్ళీ కవితలు రాయాలని కోరుకుంటున్న నీ అభిమాని ;)

సరేనా!

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>> నువ్వొస్తావేమో అన్న ఊహ చాలు
వేల వాయులీనాలు నాకోసం మోగుతాయి.
ఎవరో పిలిచింది నీ పేరే అన్న అనుమానం చాలు
తనువంతా నవ్వుతుంది.

చాలా బాగుంది. కిరణ్ గారితో నేను కూడా ట్యూషను కి వచ్చేస్తాను. ద.హా

..nagarjuna.. said...

బావుంది ఈ ఆవిష్కరణ Tragedy -> blissfulness -> Tragedy.
goodone aparna.

మనసు పలికే said...

మధుర,
నిజంగానా.. హహ్హహ్హ ఎంతైనా ఒకే ప్రాంతం కదా ఆమాత్రం మనసులు చదువుకోకపోతే ఎలా:)) ధన్యవాదాలు మధుర:)

గీతిక,
ధన్యవాదాలు:)

చాణక్య గారూ,
ఈ తవిక మీకు అని ఫిక్స్ అయిపోయారా? హహ్హహ్హా;).. త్వరలో నేను కూడా మీ అంత గో......ప్ప రైటర్ అయిపోవాలని కోరుకోండి ప్లీజ్..:)) ధన్యవాదాలు నా తవిక నచ్చినందుకు:)

మనసు పలికే said...

కిరణ్,
ధన్యవాదాలు తవిక నచ్చినందుకు:)

క్రాంతి కుమార్ గారు,
బోలెడన్ని ధన్యవాదాలు:))

పద్మవల్లి గారు,
అయ్యయ్యో.. గుండెలు పిండెయ్యాలన్న ఆలోచన లేదండీ.. కానీ ఎందుకో కాలం ప్రతి అనుబంధంలోనూ ఏదో ఒక సమయంలో ఇలాంటి అనుభవాల్ని రుచి చూపిస్తుంది కదా.. మనుషులు దగ్గరగా ఉన్నా కూడా మనసువిప్పి మాట్లాడుకోలేని పరిస్థితి.. అందుకు రాసా అనమాట అలా:) ధన్యవాదాలు తవిక నచినందుకు:)

మనసు పలికే said...

గిరీష్ గారు,
బోలెడన్ని ధన్యవాదాలండీ:))

శేఖర్ గారు,
చాలా చాలా థ్యాంక్స్:)

శిశిర ,
బోల్డన్ని ధన్యవాదాలు:)

మనసు పలికే said...

శోభ:)
చాలా చాలా థ్యాంక్స్:) నిజమే ప్రతి రెండు మనసుల మధ్య ఎప్పుడో ఒకప్పుడూ ఎదురయ్యే పరిస్థితేనేమో.. కానీ ఆ గ్యాప్ ని ఎంత త్వరగా పూర్తి చేస్తామన్న దాని మీదే ఆయా రిలేషన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కదా:)
చాలా చాలా థ్యాంక్స్ మీ వ్యాఖ్యకి:))

శైలు గారు,
థ్యాంక్ యూ సో మచ్:)

ఇందు,
హహహ్హ ఇందు, కొత్త పదాలతో అప్పుడు రాసినట్టు రాస్తే జనాలు భయపడిపోయి, తెలుగు శబ్దరత్నాకరం లింకులు అడిగి, తెలుగు పదాల మీద పి.హెచ్.డి. లు చేసేస్తున్నారు;) అందుకే ఈ సారి మామూలుగా రాసేసా.. అంటే మరి నా ఙ్ఞానం (ఉందా అని అడగొద్దు;)) అందరికీ పంచేస్తే ఎలా.!! హిహ్హిహ్హి..
జోకులు పక్కన పెడితే నీ వ్యాఖ్యకి బోలెడు థ్యాంకులు:)

మనసు పలికే said...

గురూ గారూ..
మీరు నన్ను కించపరుస్తున్నారు, నేను కదా మీ దగ్గరికి పలకా బలపం పట్టుకుని ట్యూషన్ కి రావాలి;) మీరు నా దగ్గరికి ట్యూషన్ కి రావడం ఏమిటి!!
నా తవిక నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు:)


నాగార్జున,
ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి:)
కానీ ఇది ట్రాజెడీ-->బ్లిస్‌ఫుల్‌నెస్-->ట్రాజెడీ కాదు కదా..
వెయిటింగ్-->బ్లిస్‌ఫుల్‌నెస్-->ట్రాజెడీ:)) నిజానికి వెయిటింగ్ అని కూడా కాదు. మనిషి ఎంత దూరంలో ఉన్నా, మనసుకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిని గురించిన ఆలోచనలు.. ఆ తరువాత మనిషి కూడా దగ్గరగా వచ్చిన క్షణం సంబరాలు.. ఇంక మనిషి దగ్గరగా ఉన్నాకూడా మనసులు దూరమైన బాధ. ఇది నా భావం:)

The Chanakya said...

అమ్మాయిలు ఎలాగూ నిజంగా నన్నూహించుకుని కవితలు సారీ.. తవికలు రాయరు. ఇలాగైనా సంతృప్తి పడనివ్వండి. అయినా ఈ మాట మీ ఆయన విన్నారంటే 'నన్ను అక్కడికక్కడే చితక్కొట్టేసి డైరెక్ట్‌గా ఆంబులెన్స్‌లో ఇంటికి తీస్కెళ్లిపోగలరు' మీ అనగనగా ఒక ప్రయాణంలో చెప్పినట్టు.. : )))

ఇంక మీరు మరీ బ్రతిమాలేస్తున్నారు కాబట్టి దీవించేస్తున్నాను పొండి. నా అంత(???) గో...........ప్ప రైటర్ అయిపోండి. : P

మనసు పలికే said...

ఆహా.. చాణక్య గారు, మీదెంత మంచి మనసండీ.. ఎంతో నిస్వార్ధంతో మీ అంత గో...ప్ప రైటర్ ని అయిపోవాలన్న మీ దీవెనకి ఎలా కృతఙ్ఞతలు చెప్పుకోను;);)

The Chanakya said...

హిహిహీ.. కృతజ్ఞతలు..! అంతా మిథ్య తల్లీ.. కేవలం పైపై మాటలు విని భ్రమపడుతుంటాం. అంతరార్థాలు ఆ పైవాడికే ఎరుక. ఓం తత్సత్.. నా అంత గొప్ప రచయిత్రి కావాలన్న ఉన్న స్థాయి నుండి ఇంకా దిగజారవలసిందే. అది తమకు సమ్మతమైనచో మిమ్ములను ఆ జగన్నాటకసూత్రధారి కూడా కాపాడలేడు. హరి ఓం తత్సత్..!!

..nagarjuna.. said...

ఓహ్ అలాగా... నేను వేరేగా అర్ధం చేసుకున్నా కవితను.
విరహంలోంచి అవతలి వ్యక్తి తాలుకు జ్ఞాపకాలిచ్చే ఆనందం, అక్కడినుండి ఆ వ్యక్తి ఎదుట లేడు అనే నిజం కలిగించే బాధ.

ప్చ్... got to improve my reading! or is it because poets are inherently difficult to be understood !

The Chanakya said...

Nagarjuna.. I guess the latter is somewhat true. ; )

మనసు పలికే said...

హహ్హహ్హా. కొత్తగా చాణక్యానంద స్వామి అవతారం ఎత్తిన చాణక్య గారూ.. మీరు కేక..:))

నాగార్జున, మొత్తానికి ఇప్పుడు అర్థం అయింది కదా:) ధన్యవాదాలు..:))

The Chanakya said...

పేరు బాలేదు తల్లీ. చాణక్యానంద అంటే ఇంకెవరో ఆనంద గుర్తొస్తాడు జనానికి. అంచేత అది తొలగించేసి ఏ చాణి బాబా అనో, చాణ్ భగవాన్ అనో పెట్టుకోండి. సాములోరు సంతోసిత్తారు.