Friday, January 20, 2012

మహాసముద్రం


నా మనసొక మహాసముద్రం..
కెరటాల్లా.. ఆలోచనలు..
ఎంత వద్దన్నా నీ వైపుకే.

అలల ఆశ, నువ్వు మహాకాశం కావాలని.
అందుకే, ఆవేశంగా పైకెగిసి..
తీరంలోనే నిన్ను చూసిన క్షణం,
ఇష్టంగా కిందికి దూకుతాయి..
ఆర్తిగా నిన్ను తడుముతాయి.

ఎందుకు నేస్తం??
తీరంతోనే నీ సాహచర్యం?
"నీకు చేరువుగా ఉండొచ్చని"
సమాధానం నాదా? నీదా?

ఇన్నాళ్లూ ఎగసి ఎగసి అలసింది
ఆకాశాన్ని అందుకోలేక కాదు,
అక్కడ నువ్వు లేవని...

ఒక్క క్షణం నింగిని తాకి చూడు.
అర్ణవాకాశాలు కలవడం చూస్తావు..

25 comments:

karthik said...

first comment?? hopefully

will comment again, after reading the post :)

SHANKAR.S said...

కవిత బావుంది
చాలా బావుంది
చాలా చాలా బావుంది
ఆకాశమంత బావుంది

MURALI said...

As I see it is the best of you :)

తృష్ణ said...

very nice !

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది...

రసజ్ఞ said...

ఇన్నాళ్లూ ఎగసి ఎగసి అలసింది
ఆకాశాన్ని అందుకోలేక కాదు,
అక్కడ నువ్వు లేవని...అద్భుతం అండీ చక్కని వ్యక్తీకరణ!

murthy said...

బావు౦ది.

ఇందు said...

Superb appu :) As usual nee trademark poetry :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> ఒక్క క్షణం నింగిని తాకి చూడు.
అర్ణవాకాశాలు కలవడం చూస్తావు

చాలా బాగుంది. నిజం గా మనసు పలికింది అనిపించింది.
ఆనందం ఆర్ణవమైతే అనురాగం అంబరమైతే అన్న శ్రీశ్రీ గుర్తుకొచ్చాడు.

kiran said...

ఆసం అప్పు (పోకిరి సినిమా లో ఇలియానా స్టైల్ లో )

గిరీష్ said...

Excellent!
చాలా బాగుందండీ..

చాణక్య said...

మీ మనసు నిజంగా మహాసముద్రమే. ఆలోచనల తరంగాలు కవితలై ఆకాశాన్నంటుతున్నాయి. మీరిలాగే రాస్తూ కవయిత్రి అప్పుగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తున్నాను. :)

రాజ్ కుమార్ said...

ఇన్నాళ్లూ ఎగసి ఎగసి అలసింది ఆకాశాన్ని అందుకోలేక కాదు, అక్కడ నువ్వు లేవని...>>

వహ్ వా..! చాలా కాలం తర్వాత మనసు పలికింది. సముద్రపు హోరు వినిపించింది నాకు.

శోభ said...

కవిత చాలా బాగుంది అపర్ణా... చాలా రోజులైంది నీతో మాట్లాడి ఎలా ఉన్నావు..?

జ్యోతిర్మయి said...

అపర్ణ గారూ చాలా బావుంది.

Anonymous said...

చాలా బాగా రాశారు. చెన్నయ్ లో లెక్కలేని సార్లు బీచ్ చూడటానికి వేళ్లాను. ఎన్నో గంటలు అలలు చూస్తూ గడిపినా నాలాంటివారికి, మీరు రాసిన దానిలో కనీసం ఒక్క భావం స్పురించలేదు.ఈ కవిత్వం చదివిన తరువాత సముద్రం కొత్తగా కంటిముందు కనిపించింది. Excellent.

SriRam

మనసు పలికే said...

కార్తీక్.. ఏంటీ? ఇంతకీ చదివావా, చదివి ఇటు రాకూడదనుకున్నావా??:(((


శంకర్ గారూ,
ధన్యవాదాలు,
చాలా ధన్యవాదాలు,
ఆకాశంలో చుక్కలన్ని ధన్యవాదాలు:)


మురళి,
చాలా చాలా థ్యాంక్స్:)

మనసు పలికే said...

హరే, తృష్ణ గారు, వేణు గారు, మూర్తి బోలెడన్ని ధన్యవాదాలు:))

రసఙ్ఞ గారు, చాలా సంతోషంగా ఉంది మీ వ్యాఖ్యకి:) ధన్యవాదాలు.

ఇందూ, చాలా చాలా థ్యాంక్స్:) నీ పోయెట్రీని ఎప్పుడు కంటిన్యూ చేస్తున్నావ్??

మనసు పలికే said...

గురువు గారూఊఊఊ:))
మీ వ్యాఖ్యకి ఉబ్బితబ్బిబ్బవుతున్న శిష్యురాలిని ఊహించుకోండి. ధన్యోస్మి:)

కిరణు, నువ్వు నన్ను తిట్టలేదు కదా;)

గిరీష్ గారు, నాగార్జున థ్యాంక్ యూ సో మచ్:)

మనసు పలికే said...

చాణక్య గారూ, అబ్బ ఎంత చల్లని కోరిక.. పైన తథాస్తు దేవతలు ఉంటే బాగుండు;) చాలా చాలా థ్యాంక్స్:)

రాజ్, బోలెడు ధన్యవాదాలు, నా తవికలో సముద్రపు హోరు విన్నందుకు:)

శోభ గారు, ధన్యవాదాలు కవిత నచ్చినందుకు:). నేను బాగున్నాను. పని వత్తిడి వల్ల ఎక్కువగా రాలేకపోతున్నాను. మీరు క్షేమమేనని తలస్తున్నాను:)

మనసు పలికే said...

జ్యోతిర్మయి గారు, ధన్యవాదాలు:)

శ్రీరాం గారు, మీ వ్యాఖ్య ఎన్ని సార్లు చూసి మురుసిపోయానో నాకే తెలీదు. అంతగా సంతోషపరిచింది మీ వ్యాఖ్య నన్ను. ధన్యోస్మి..

Krishna said...

ఇన్నాళ్లూ ఎగసి ఎగసి అలసింది ఆకాశాన్ని అందుకోలేక కాదు, అక్కడ నువ్వు లేవని...adbhutamaina vyaktikarana...Bhavukatha ante artham telidu kaani...chuste gurtu patagalanu...pai vakyam, na abhiprayam lo Bhavukatha ante idi ani chepadagga udaharana...Amazing...

Krishna

శేఖర్ (Sekhar) said...

ఇన్నాళ్లూ ఎగసి ఎగసి అలసింది
ఆకాశాన్ని అందుకోలేక కాదు,
అక్కడ నువ్వు లేవని...

ఈ లైన్ దగ్గర మాత్రం తవిక Peaks ...చాల నచ్చింది

మనసు పలికే said...

కృష్ణ గారు, బోలెడన్ని ధన్యవాదాలు, ఆ తవిక మీకు అంతగా నచ్చినందుకు. చాలా సంతోషంగా ఉంది.

శేఖర్ గారు, మీ వ్యాఖ్య దగ్గర నా సంతోషం పీక్స్ :))))) ధన్యోస్మి..

nmrao bandi said...

ఆసాంతం చాలా బాగుంది...
అభినందనలు...