Monday, August 9, 2010

నా పిచ్చి గీతలు..

అంటే.. నేను గీసిన బొమ్మలన్న మాట. ఇవి కూడా ఇప్పుడు గీసినవి కాదు లెండి. నా డిగ్రీ రోజుల్లో.. చెప్పాను కదా, నన్ను నేను కోల్పోయాను అని. ఈ విషయంలో కూడా..

ఎలా ఉంది.? ఇప్పుడు ఇంకో చిత్రం.. :))
చాలా బాగుంది  కదూ!! కానీ ఇక్కడో తిరకాసు ఉంది మరి. కింద చూడండి.
ఇంకా పూర్తవ్వలేదు.. :( ఎప్పుడో నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో మొదలు పెట్టాను. డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు అయింది.. ఇంకా ఆచిత్రం అదే దశలో ఉంది.:( చూసినప్పుడల్లా బాధగా ఉంటుంది. పోనీ అలా అని దాన్ని పూర్తి చేద్దాం అంటే పెన్సిల్ రాదు. కష్టపడి పెన్సిల్ వచ్చినా చెయ్యి రాదు.పొరపాటున ఆ చెయ్యి గీసేస్తాను అని మారాం చేసినా, మనసు మాత్రం ఖచ్చితంగా రాదండీ.. ఎక్కడ ఆ చిత్రాన్ని పాడు చేసేస్తానో అని చచ్చేంత భయం. అందుకే దాన్ని పూర్తి చెయ్యాలంటే ధైర్యం రావట్లేదు :(

అందుకే అంటారేమో.. ఎంత, పులి గడ్డి తినడం మొదలెడితే మాత్రం,  కోతి కొబ్బరి చిప్ప తినడం మానేస్తుందా అని. (ఇక్కడ మీకొక చిన్న మనవి. దయచేసి, ఈ వాక్యం అర్థం కానీ, ఇక్కడ సందర్భానికి , ఈ వాక్యానికి సంబంధం కానీ నన్ను అడగొద్దు. అది దైవ రహస్యం...)

144 comments:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

బావున్నాయండి

మనసు పలికే said...

లోకేష్ గారు! నా బ్లాగు లోకి స్వాగతం అండీ.. ధన్యవాదాలు మీకు నా పిచ్చి గీతలు నచ్చినందుకు..:)

అశోక్ పాపాయి said...

avunu bommalu bagunnai.....

Ram Krish Reddy Kotla said...

పిచ్చి గీతలా...భలే వారే..."గీతలే అని చిన్న చూపెందుకు...వాటి లోతులు చూడలేరెందుకు.."... :-)...అంతే కదా..!!

Anwartheartist said...
This comment has been removed by the author.
శిశిర said...

బొమ్మలు బాగున్నాయి. చివర్లో మీ సామెత ఇంకా బాగుంది. నేను అర్థం అడుగుదామనుకున్నా. మీరు అడగద్దని నోట్ పెట్టేశారు మరి. :)

మనసు పలికే said...

అశోక్ గారు, బహుకాల దర్శనం. ధన్యవాదాలండీ..

కిషన్ గారు, ధన్యవాదాలు. :) మంచి పాట గుర్తు చేశారు..

అన్వర్.. అంతే అంటారా..? ఇక చూస్కోండి, పాడు చెయ్యడంలో నేను దిట్టని.. :)

శిశిర గారు.. ధన్యవాదాలు. మీ లాంటి వాళ్లు అలా అడుగుతారనే ముందుగానే అడగొద్దని చెప్పేశాను:)
లేకపోతే ఏమైనా ఉందా..! దాని అర్థం నాకే తెలియదు, ఇంక మీకేం చెప్పగలను..?

మధురవాణి said...

నాకు మొదటి బొమ్మ బాగా నచ్చింది. అచ్చం అదే పెయింటింగ్ లేపాక్షి లో కొని ఒక జర్మన్ కొలీగ్ కి గిఫ్ట్ గా ఇచ్చాను. :)
BTW, Beautiful template! :)

మనసు పలికే said...

ధన్యవాదాలు మధురవాణి గారూ!! చెప్పలేనంత సంతోషం గా ఉంది మీరు నా బ్లాగులో కామెంటుతుంటే.. :) టెంప్లేట్ నచ్చినందుకు కూడా ధన్యవాదాలు. నిజానికి, మోజిల్లా లో చూస్తేనే నాకు బాగా నచ్చింది. మొన్నెప్పుడో IE లో చూస్తే అంతగా నచ్చలేదు.

శేఖర్ పెద్దగోపు said...

ఏంటీ మీకివి పిచ్చిగీతల్లా ఉన్నాయా? మరి మేము గీసే గీతలను ఏమంటారో..:)చాలా బాగున్నాయి..రియల్లీ..
ఎవరూ లేని రూం చూసుకుని బొమ్మ కంప్లీట్ చెయ్యడానికి చూడండి..ఏకాగ్రత కుదురుతుంది..ఇంకా ఎవరైనా చూస్తున్నారేమో అన్న మీమాంస కూడా తొలగిపోతుంది...ఇంతకూ మిమ్మల్ని ఎలా సంభోదించాలి? మనసుపలికే గారూ అని పిలిస్తే అంత బాగోదేమో!!:)

మనసు పలికే said...

హయ్య బాబోయ్.. శేఖర్ గారు! ధన్యవాదాలండీ.. మొదటగా మీకు నా బ్లాగుకి స్వాగతం. మీ లాంటి పెద్దోళ్లంతా నా బ్లాగు తలుపులు తడుతుంటే నాకు భలే ఆనందంగా ఉంది..:) తప్పకుండా మీరు చెప్పిన సలహా పాటిస్తాను బొమ్మని పూర్తి చెయ్యడానికి..:) నా పేరు అపర్ణ, మీరు నన్ను అపర్ణ అని సంబోధించండి.:)

..nagarjuna.. said...

how dare you call them పిచ్చిగీతలు !! have you gone sick not eating food....!!they are really good.
విటినే పిచ్చిగీతలు అంటే స్కేలు ఉపయోగించికూడా ఒక straight line గీయలేని నాలాంటోళ్ల రాతలనేమనలో మరి ??

ఎలాగైనా ఆ మిగతాబొమ్మను కంప్లీట్ చేయవా ప్లీజ్!!

హరే కృష్ణ said...

Nice Work!
అపర్ణ గారికి అన్ని కళల్లో ప్రవేశం ఉందన్నమాట
good job :)
కంటిన్యూ చెయ్యండి

హరే కృష్ణ said...

నాగార్జున కి మరియు నాకు రిప్లై ఇవ్వనందున
మీ మీద కంప్లైంట్ చెయ్యబోతున్నాం
నాగార్జున ఎవరికి చేద్దాం కంప్లైంట్ :)

మనసు పలికే said...

నాగార్జున గారు, ధన్యవాదాలు నా బొమ్మలు మీకు నచ్చినందుకు. మీరు భలే నవ్విస్తారండీ, "స్కేలు ఉపయోగించికూడా ఒక straight line గీయలేని నాలాంటోళ్ల రాతలనేమనలో మరి" and "have you gone sick not eating food....!"
డవుటు గానే ఉందండీ బాబూ sick అయ్యానేమో అని. ఈ మధ్యనే ఇంకో రెండు కేజీలు తగ్గేశాను మరి..:(

మనసు పలికే said...

హరేకృష్ణ గారు, మీరు అలాంటి కఠోర నిర్ణయాలు తీసేస్కోకండి బాబ్బాబు.. ఏదో బయట చాలా పె..ద్ద వర్షం పడుతుంటేనూ చూద్దామని వెళ్లాను అంతే.. ఇదిగో ఇలా మళ్లీ గంటకు తిరిగి వచ్చాను నా సీట్ దగ్గరికి..
మీకు కూడా ధన్యవాదాలండీ, నా బొమ్మలు నచ్చినందుకు మరియు కంప్లైంట్ ఇవ్వకుండా ఉండ బోతున్నందుకున్నూ.. :)

నేస్తం said...

చాలా బాగా వేసావ్ అపర్ణ.మరే బొమ్మలంటే పూరి గుడిస,పక్కన రెండు కొబ్బరి చెట్లు రెండు బాతుబొమ్మలు వేసుకునే మాలాంటివాళ్ళకు మరి పిచ్చి గీతలు అని టైటిల్ పెడితే వళ్ళుమండదేంటీ..

తార said...

నేస్తం గారు ఐతే మీరూ నాలా 76 తో బాతు బొమ్మ వేసే రకమేనా ఇంకా?

మనసు పలికే said...

ధన్యవాదాలు నేస్తం గారూ!! అయితే మీకు వళ్లు మండిపోయిందా..? :( అప్పుడు మేము "అలుగుటయే ఎరుంగని అజాత శతృవు అలిగిన నాడు" అని పాడుకోవాల్సి వస్తుంది.. దయచేసి మీరు అలా కన్నెర్రజేయొద్దు.. ;) ఈ సారికి క్షమించేద్దురూ..

తార గారు, మీకు ఆ 76 తో బాతు బొమ్మ వెయ్యడం వచ్చా..?? మీకో విషయం తెలుసా. నేను అది ఎలా వెయ్యాలో మర్చిపోయాను. ఇప్పుడు ప్రాక్టిస్ చెయ్యాలి. గుర్తు రాకపోతే మిమ్మల్నే అడుగుతాను సుమా, చెప్పకపోతే ఊరుకునేది లేదు..

తార said...

అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ము డజాతశత్రుడే యలిగిననాడు...

పద్యం ఏది మాకోసం మొత్తం ఒకసారి టైప్ చెయ్యరు..

పలికే గారు,(:-)))

ఓ పని చెయ్యండి, పూర్తి చెయ్యని దాన్ని అలానే ఉంచి, అలాంటిదే కొత్తది మొదటినుంచి గీసి, దాన్ని పూర్తి చెయ్యండి, సరిపోతుంది కదా!

మనసు పలికే said...

హిహ్హిహ్హి తార గారూ, నాకు ఆ పద్యం రాదండీ.. చిన్నప్పుడు మా నాన్న మా తమ్ముడి విషయం లో ఎప్పుడూ పాడుతూ ఉండే వారు. అలా గుర్తు ఆ పద్యం. అంతే.. నేను మరీ అంత తెలుగు పండితురాలిని కాదు.:) ఇక బొమ్మ విషయానికి వస్తే నేను కూడా మీలాగే ఆలోచించాను. ఎప్పటికైనా పూర్తి చేస్తాను.. ఇంకా.., మీరు నేర్పితే పద్యం నేర్చుకోడానికి కూడా నేను రెడీ..

నేస్తం said...

అయ్యో అయ్యో తారగారు భలే విషయం గుర్తుచేసారుగా నేను 96 తో వేస్తా ...7 అయితె బాతు బుర్ర గుండ్రంగా రాదు మరి ... అసలు నా బొమ్మల పాండిత్యం గురించి అప్పుడెప్పుడో ఏదో పోస్ట్లో రాసానబ్బా.. మీరు చదివి ఉండరు

..nagarjuna.. said...

@హరే కృష్ణ: లాభంలేదు బెదరు మనం ధర్నాలు చేసినా, కంఫ్లైంట్లు ఇచ్చినా ఫలితం ఉండదు. మన అభిమాన సంఘం అధ్యక్షులు రివర్సులో మనందర్ని మందలిస్తున్నారు. బయటోళ్లేమో అంతర్గత కుమ్ములాటలెక్కువైనై అంటున్నారు. ఇది తీరాలంటే మధ్యవర్తులు మంచుగారినో, తారాగారినో అంతకంటే ఎక్కువ న్యాయం ధర్మం కావాలంటే శరత్‌గారినో, మలక్‌గారినో వేడుకోవాలి

@తారా,అపర్ణ,నేస్తం: 96,76తో బాతు బొమ్మ వేయొచ్చా !!! గురువులూ, మీరు ఇలా చిన్న చిన్న హింట్లు ఇస్తూ ఉండండీ నే రెచ్చిపోతా. మన్లోమట ఇలాంటి తెలిసినవేవైనా ఉంటే ఊర్కే బయటపెట్టక నాకే చెప్పండి ఈ ట్రిక్కులన్నీ ఉపయోగించి నా masters పూర్తిచేసేస్తాను :))

మనసు పలికే said...

నాగార్జున గారు, మీరన్నది అక్షరాలా నిజం..:)
ఇంతకీ బాచిలర్స్ ఎప్పుడు పూర్తి చేశారో చెప్పారు కాదు..? ఈ 96/76 బాచిలర్స్ లోకే వస్తుంది మరి..;)

తార said...

అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
అలిగిననాడు సాగరము లన్నియు ఏకము కాక పోవు క-
ర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా-
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్

తార said...

నేస్తం గారు ఎక్కడా, ఇంకా కొత్త కధలు ఎవరూ పంపటంలేదు మరి, ఎవరైనా కక్ష గట్టి నా మీద అవి ప్రయోగిస్తే అప్పుడు మళ్ళీ జీవితం మీద ఆశ చిగురించుకోవటానికి మీ బ్లాగ్ కి వస్తాన్నన్నమాట.

తార said...

ఒహో పలికే గారు మీరూ నాలా తెలివిగా అలోచిస్తారా.. బాగున్నది..ఐతే ఈ సారి మనలో ఎవరు బాగా తెలివిగా అలోచిస్తారో పోటీ పెట్టుకుందాం..

మీరు బజ్‌లో తమిళులకి తమిళం నేర్పుతున్న టపాలో ఒక చెయ్యి (కీ బోర్డ్) వెయ్యొచ్చు అలా ఐతే..

..nagarjuna.. said...

@తారాగారు : పద్యం మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలండీ.., ఈ పద్యం దానవీరశూరకర్ణ లో అన్న NTR చెప్తుంటే ఉంటుంది నా సామిరంగా....

@అపర్ణ:తూచ్...,నాకు ఇప్పటివరకూ ఈ కిటుకులు తెలియవని చెప్తే నేనసలు బ్యాచిలర్స్‌ చేయలేదు అని అందామనే. అమ్మా...ఆశ దోశ అస్కి పుస్కి. మీరెన్ని నన్ను ఎన్ని రకాలుగా మభ్యపెట్టి నిజం రాబట్టాలని ప్రయత్నించినా 2008లో ఇంజనీరింగ్‌ అవగొట్టానని చెప్పనుగాక చెప్పను..,మనం ఒకబ్యాచ్ వాళ్లమని అనునుగాక అనను :P

తార said...

ఇక్కడ నన్నేవరో మధ్యవర్తి అని పిలిచారు??
ఆసలు నాకెంటో చెప్పకుండా నన్ను అలా పిలిచే హక్కు ఎవరికి ఇచ్చారు?

గురువు, లగువు కాదు నాయన ముందు దక్షిణ ముఖ్యం.

..nagarjuna.. said...

@తారాగారు:దానికే మాష్టారు తప్పకుండా ఉంటుంది.....మా పార్టి బిల్లు కట్టేసాక మిగిలందంతా మీదే. పండగ చేసుకోవచ్చు. లేకపోతే మీ జీవితాన్ని రోజు చిగురింపజేయటానికి శరత్‌గారితోనో, వారి బావగారితోనో కథలు రాయిస్తాం. ఏమంటారు

తార said...

తైలం లేనిదే ఏ చిలకా జోస్యం చెప్పదు నాయనా..
ఐనా నేను లేకుండా పార్టీ ఏల? నాకూ ఒక పెగ్గుడు మందు పోయాలి తప్పదు..

మంచు said...

ఇవి చదువుకురండి :-))

నేస్తం
http://jaajipoolu.blogspot.com/2009/01/blog-post_12.html

శ్రీవిద్య
http://srividyab4u.blogspot.com/2008/08/blog-post.html

గౌతం
http://thotaramudu.blogspot.com/2009/03/blog-post.html

..nagarjuna.. said...

@మంచు: శ్రీవిద్యగారి బ్లాగు పరిచయం చేసినందుకు థాంకులు భాయ్...
@తారాగారు: పార్టిలో ఎక్సైజు సంబంధిత పని నాదికాదండొయ్...దానికి ఎవరన్నా ముందుకొస్తారేమో అడుగుతానాగండి

..nagarjuna.. said...

@అపర్ణ జీ.., మీ మునుపటి పోస్టుకు 50+ వ్యాఖ్యల సందర్బంగా అభినందనలు. యమలీల సినిమాలో డైలాగు చెప్పినట్టు ఒక్క వ్యాఖ్యతో ఎంత పాపులర్ అయ్యారు మేడం... :) నాకు ఆనందంతొ కళ్లవెంట ఆనందభాష్పాలు మూసినది వరదలా (మరీ మూసీ వరదలేంటి అని అడగొద్దు నేటివిటి కోసం పెట్టెసాను) వచ్చేస్తున్నాయి

Anonymous said...

అలా అంటే ఎలా? నాకు రోజుకి ఒక పెగ్గు ఐనా దిగనిదే నిద్ర రాదు మరి..
పార్టి ఎక్కడా? హైద్రాబాద్ మాత్రం వద్దు

..nagarjuna.. said...

అంతమాటనేసావేంటి బెదరు...మా హైదరబాదుకేంటట. సరెలే మీ ఇష్టం ఎందుక్కాదనాలి. అందరికీ ఓకే ఐతే సింగపూర్‌లో పెట్టుకుందాం...నేస్తం టికెట్ల సంగతి చూసుకుంటుంది. లేకపోతే హరేకృష్ణ ముంబాయిలోనో, అపర్ణగారి గుంటూరులోనో పెట్టెసుకుందాం :)

హరే కృష్ణ said...

బాబోయ్ మళ్ళీ హాఫ్ century నా
బ్లాగు రచయత ఎవరో తెలియదేమో కదా మన కామెంట్లు చూసాక :)

హరే కృష్ణ said...

పార్టీ సింగపూర్ లో అంటే కష్టం కదా
అందరకీ టికెట్స్ స్పోన్సర్ చెయ్యడం కంటే అపర్ణ గారి పేరు చెప్పుకొని హైదరాబాద్ లో పార్టీ చేసుకుందాం
ikada వర్షాకాలం తో పాటు మలేరియా కాలం కూడా మొదలయ్యింది
పార్టీ అంటే బాంద్రా లో చేసుకోవాలి :)

Anonymous said...

హైద్రాబాద్ పేరు చెప్పి నా మీద ఎవరో కుట్ర చేస్తునట్టున్నారు..
గుంటూరా??, అదో చచ్చు ఊరు, అసలు సిసలు మిరపగాయ బజ్జీ కుడా దొరకటం లేదు, మౌర్య ముసేసాక ఆ మాదిరి అట్టు కుడా ఎక్కాడా దొరకటం లేదు, మఱ్ఱి చెట్టు హొటేలు, నాగార్జునా హొటేలు చెత్త చెదారం ఉన్నా వాళ్ళకి సరిగ్గా వంట రాదు, ఐనా గుంటురులో వెరే రాష్ట్రం వాళ్ళు వచ్చి హోటల్ పెట్టాల్సివచ్చింది..

మనసు పలికే said...

ఏమిటి.. ఏమి జరుగుతుంది ఇక్కడ..?? హైదరాబాదు అంటారు.. గుంటూరు అంటారు.. వ్యాఖ్యలన్నీ చదివి చెబుతాను...

మనసు పలికే said...

తార గారూ.. !
అంత చక్కటి పద్యం పంచుకున్నందుకు ధన్యవాదాలు. హిహ్హిహ్హి.. మనం తెలివితేటల్లో పోటీ పెట్టుకుందామా..? మీ కోరిక నేనెందుకు కాదనాలి..! కానీ తరువాత నా తెలివి తేటల్ని చూసి కుళ్లుకోకూడదు.. ;) కానీ, ఆ తమిళం సంగతి ఏమిటో నాకు అర్థం కాలేదు. :(
హహ్హహ్హ దక్షిణ మాత్రం ముందే.. చాలా మంచి విషయం గుర్తు చేశారు..:)

మనసు పలికే said...

నాగార్జున గారూ, అలా చెప్పనంటే ఎలాగండీ బాబూ. ప్లీజ్ ప్లీజ్ చెప్పేద్దురూ.. 2008 లో ఇంజనీరింగ్ పూర్తి అయిందనీ, మనం ఒక బ్యాచ్ వాళ్లమని..
నిజమమండీ బాబూ.. మీకేమిటి, నాకే కళ్లల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి (మరీ మూసీ నదిలో వరదల్లా కాదు కానీ, ప్రస్తుతానికి మా గోదావరి నదిలో వరద లాగా.) ఇదంతా నేస్తం అక్క మరియు హరే కృష్ణ చలవేనండీ.. నేస్తం అక్క సెంచరీ పూర్తి చేసినందుకు కృష్ణ గారు గొడవేస్కుందామని వచ్చారా, అక్కడ మొదలయింది..:)
మీరు మళ్లీ నా విషయంలో ఉప్పులో కాలేశారు, నాది గుంటురు కాదు. పేరు మార్చారు సరే, ఊరు కూడా మార్చాలా..? ఖండనలో త్వరలో డాక్టరేట్ తీస్కోబోతున్నాను.. సో.. దీన్ని నేను ఖండ ఖండ ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాను..:)

మనసు పలికే said...

మంచు గారూ, నేస్తం అక్క టపాలయితే నేను అన్నీ చదివేశాను..:) శ్రీవిద్య గారిది, గౌతం గారిది చదివి మీకు మళ్లీ కామెంటుతాను.

కృష్ణ గారు, నిజమేనండోయ్.. మళ్లీ హాఫ్ సెంచరీ..:) కామెంట్లు ఓపెన్ చెయ్యగానే, ఒక్క సారిగా అర్థం కాలేదు, నా బ్లాగులోకే వచ్చానా, లేదా అలవాటులో పొరపాటులా నేస్తం అక్క బ్లాగులోకి వచ్చానా అని (నా ఉద్ధేశ్యం నేస్తం అక్క బ్లాగుతో పోల్చుకోడం కాదు,దానికి నేను సరిపోను కూడా. సాధారణంగా ఇలాంటి చర్చలన్నే అక్క బ్లాగులోనే చూశాను.. అందుకే.. :))
ఏంటి మళ్లీ ఈ పార్టీ కూడా నా ఖాతా లోనేనా..? నా పేరు చెప్పుకుని హైదరాబాదు లో అంటున్నారు.. :(

హరే కృష్ణ said...

అపర్ణ గారు మీరు కూడా ఏంటండీ ఒక్కొక్కరికే ఒక్కో రిప్లై ఇవ్వొచ్చుకదా
మాతో మరో కామెంట్ రాయించుకోవడం అర్ధ century కోసం

హరే కృష్ణ said...

నాగార్జున,తార కాసేపట్లో కామెంట్ రాయబోతున్నారు :)
అదేంటి మీకు కూడా హైదరాబాద్ అంటే ఇష్టం లేదా తార లా

మనసు పలికే said...

మంచి సలహా ఇచ్చారు కృష్ణ గారు..! నాకు హైదరాబాదు అంటే ఇష్టం లేకపోవడం ఏమిటీ.. నేను ప్రస్తుతానికి ఉండేది హైదరాబాదు లోనే కదా... కాకపోతే బిల్లు నాదంటేనే కొంచెం కష్టపడాలి..;)

Anonymous said...

యూనిఫాం డిస్ట్రిబ్యూషన్ లాగా ఆరు ని. ఒక్ జవాబు పలికే గారు ఇస్టుంటే, టైపింగ్ ఈక్ అని అలోచిస్తున్నా..

మనసు పలికే said...

తార గారూ.. క్షమించాలి..:( నాకు మీ వ్యాఖ్య అర్థం కాలేదు.

హరే కృష్ణ said...

తార గారు నాకు కూడా అర్ధం కాలేదు

హరే కృష్ణ said...

congrats
50 comments :) :)

Anonymous said...

మనసు పలికే said...
August 11, 2010 11:36 PM

మనసు పలికే said...
August 11, 2010 11:40 PM

మనసు పలికే said...
August 11, 2010 11:46 PM

మనసు పలికే said...
August 11, 2010 11:52 PM

టైం చూడండి, ఒక్కో కామెంట్ కి దాదాపు ఆరు నిముషాలు గ్యాప్, యూనిఫామ్ గా, అందుకని, అంత గ్యాప్ బహుశా, టైపింగ్ లో వీక్ అవటం వలనేమో అని అన్నాను.

మనసు పలికే said...

తార గారూ! బాగా క్యాచ్ చేశారు.. కానీ అది టైపింగ్ రాక పోవడం వల్ల కాదండీ.. ఆఫీస్ లో ఉండి చేస్తున్నాను కదా, మధ్య మధ్యలో వేరే వేరే పనులు కూడా ఉంటూ ఉంటాయి. అందుకే అలా కొంచెం కొంచెం గా వ్యాఖ్యలు పెడుతూ ఉంటాను..:)

మనసు పలికే said...

కృష్ణ గారు..!! ధన్యవాదాలు. మొత్తానికి ఇదేదో కావాలని చేస్తున్నట్లుగా ఉంది, దగ్గరుండి హాఫ్ సెంచరీ పూర్తి చేపించడం..:)

Anonymous said...

ఆపీసులో బ్లాగర్లు వెరే పనులు చెయ్యకూడదండి.. తప్పు కదూ..

మనసు పలికే said...

హిహ్హిహ్హీ.. కరెక్ట్ గా చెప్పారు తార గారు. నేను మిమ్మల్నే ఫాలో అయిపోతాను ఇప్పటి నుండి..

Anonymous said...

అయ్యో నేను నిరుద్యోగినండి.....

మనసు పలికే said...

అయ్యో అవునా..! పోనీ మీ ఫిలాసఫీని (ఆపీసులో బ్లాగర్లు వెరే పనులు చెయ్యకూడదండి.. తప్పు కదూ.) ఫాలో అయిపోతా లెండి..:)

హరే కృష్ణ said...

నేస్తం గారు రెండువారాలకు ఒక పోస్ట్ తో అభిమానులను అలరించి వంద కామెంట్లు తెచ్చుకుంటే

మీరు వారానికి రెండు పోస్ట్ లు రాసి ఇంకా ఎక్కువ కామెంట్లు తెచ్చుకుంటున్నారు
దీన్ని ఏమంటారో నాగార్జున చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం!హా..!

మనసు పలికే said...

కృష్ణ గారు, ఇదంతా చేసేది మీరే. :) మళ్లీ నాగార్జున గారిని కూడ ఇంకో కామెంటుని కాంట్రిబ్యూట్ చెయ్యమంటున్నారు. దీన్ని ఏమనాలి మీరే చెప్పండి..
హా.. :D

హరే కృష్ణ said...

నాగార్జున పొద్దున్న నేను రాయమన్న కామెంట్ బాకీ ఉన్నాడు!
ఇప్పుడు మరో కామెంట్ సహా మొత్తం రెండు కామెంట్స్ బాకీ
మీరు నాగార్జున కి రెండు రిప్లైలు బాకీ :)

అపర్ణ గారు రెండు పార్టీలు కూడా బాకీ అనుకుంటా
నాగార్జునా నిజమే కదా :)

Anonymous said...

అది సరే నాకు మందు ఎవరు పోస్తున్నారు ఇంతకీ

మనసు పలికే said...

మంచు గారూ..!! మీరు ఇచ్చిన టపాలు చూశాను, ధన్యవాదాలు నాకు అంత మంచి టపాలు చూపించి ఇంకా మంచి బ్లాగర్లని పరిచయం చేసినందుకు..:)
నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది..ఇంకా నవ్వు ఆగట్లేదు, కళ్లల్లో నుండి నీళ్లు కూడా వచ్చేశాయి.. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నావి పిచ్చి గీతలు కాదని.. :D

మనసు పలికే said...

కృష్ణ గారు, మీరు పార్టీల కోసమే ఇలా కామెంట్ల కౌంటర్ పెట్టారా..? అయినా నేను ఒకటే కదా పార్టీ బాకీ, రెండోది ఎందుకు..? నాకు సమాధానం కావాలంతే..

తార గారు, మీకు ఎవరు పోస్తే బాగుంటుందనిపిస్తుంది..? ధైర్యంగా చెప్పెయ్యండి, వాళ్ల చేతే మందు పోయించేద్దాం.. :D

హరే కృష్ణ said...

అపర్ణ గారూ మళ్ళీ reason అడుగుతున్నారా!
సరే వినండి

మొదటి పార్టీ గత యాభై కామెంట్ల పోస్ట్ తిండి తిప్పలు పోస్ట్ లో discuss చేసుకున్నాం కదా
ఇక రెండో పార్టీ అంటే సింగపూర్ కి టికెట్స్ కొనలేమని చెప్పేశారు కదా
వరుస అర్ధ సెంచరీ కొట్టినందుకు,మీరు గుంటూర్ లో కూడా చేసుకోలేము అని చెప్పినందుకు, ఆ పార్టీ ని హైదరాబాద్ లోనే జరుపుకోమన్నందుకు రెండో పార్టీ
అతి కొద్ది కాలం లోనే అభిమానులు కూడా నోచుకోని బంగారం అని పిలిపించుకున్నందుకు మూడో పార్టీ ఇవ్వమన లేదు కదా
ఇచ్చేస్తానని చెప్పేయండి లేకపోతే మొత్తం మూడు పార్టీలు ఇవ్వాల్సిందే అని ధర్నా చేసినా చేస్తారు

మనసు పలికే said...

అమ్మ బాబోయ్.. బ్లాగ్లోకంలో ఇంకా అ ఆ లు మాత్రమే దిద్దుతూ లోకం పోకడం ఏమాత్రం తెలియని అమాయకురాలు అభాగ్యురాలి పైన ఇన్ని కుట్రలు, కుతంత్రాలా..? నేను దీనిని అస్సలు సహించను, భరించను, పాటించనూ.. ఇంకా, పట్టించుకోను కూడా.. హిహ్హిహ్హి..

హరే కృష్ణ said...

అపర్ణ చాలా తెలివైన వారు
మొదటి పార్టీ కూడా ఇవ్వరు అని చెప్పెస్తున్నారహో!
తార గారు మీకు గుక్కెడు మంచినీళ్ళు కూడా దక్కలేకుండా చేసారు :( :(

ఈ సందర్భంగా సామూహిక ధర్నా కు పిలుపునిస్తున్నాం
అభిమానులకు నిమ్మరసం ఇచ్చి విరమించాల్సింది గా అక్కయ్య ను కోరుతున్నాం

మనసు పలికే said...

హిహ్హిహ్హి.. కృష్ణ గారు, మరి మొదటి పార్టీ ఇస్తా అంటే విరమిస్తారా మీ సామూహిక ధర్నాని..?

మంచు said...

పార్టి ఇవ్వాల్సిందే... తప్పదు

..nagarjuna.. said...

వార్నానోయ్...అపర్ణ బ్లాగని అప్పడప్పడతాండ్ర చేసేత్తునారే జనాలు. అయినా ఇదేం లక్కు రా బాబు, బ్లాగు మెదలెట్టి 2 yeas industry అయ్యి కూడా కామెంట్ల కోసం పడరాని పాట్లు పడుతుంటే :( ఇక్కడ వరుస పోస్టులకు హాఫ్ సెంచరీలమీద హాఫ్‌ సెంచరీ కామెంట్లు పడిపోతున్నాయ్ :)

మనసు పలికే said...

మంచు గారూ.. అప్పుడెప్పుడో నేస్తం అక్క, శ్రీవిద్య మరియు గౌతం గారి పోస్ట్ లు చూపిస్తూ కామెంటారు. .మళ్లీ ఇప్పుడు వచ్చి పార్టీ కావాల్సిందే అంటున్నారు. అసలు ఏంటట అని అడుగుతున్నాను. నాకు న్యాయం కావాలి అని గోడుతున్నాను. ఏదో ఒక్క పార్టీ అంటే ఇచ్చేద్దాం లే, అది కూడా నేస్తం అక్క సెంచరీ కొట్టినందుకు అని అనుకుంటే సంఖ్య పెరిగిపోతూ ఉంది. హమ్మా.. ఇక్కడ అడిగేవాళ్లు ఎవ్వరూ లేరనేగా..?

నాగార్జున గారు, ఆ కామెంట్లూ మరియు ఆ పార్టీ లు మీరే తీస్కోండి. ఇక్కడ కృష్ణ గారు కేవలం పార్టీ కోసమే కామెంటుతున్నట్లున్నారు :). పైగా నాకు సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కామెంటు పెట్టమని..:) ఈ సలహా మీరు పాటించండి..:) All the Best..

మంచు said...

అబ్బే పార్టి నాక్కాదు... హరే కృష్ణ, నాగార్జున, తారా తదితరులకి :-))

మనసు పలికే said...

మంచు గారు, హమ్మయ్య నాకు కూడా భయపడే వాళ్లు ఉంటారని ఋజువు చేశారు..:D
అందుచేత నేను మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.. హహ్హహ్హా

హరే కృష్ణ said...

అపర్ణ గారు మీ బ్లాగ్ లోనికి స్వాగతం సుస్వాగతం
ఈ పోస్ట్లో కామెంట్లు చూసాక మీ పార్టీ కోసం బ్లాగ్ ని కబ్జా చేసినట్టు అనిపించింది
పార్టీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు...

మనసు పలికే said...

హహ్హహ్హా.. కృష్ణ గారు మీరు నిజంగా కేక..లేకపోతే నా బ్లాగులోకే నాకు స్వాగతం చెప్పాలన్న ఆలోచన మీకెలా వచ్చిందబ్బా..??
**ఈ పోస్ట్లో కామెంట్లు చూసాక మీ పార్టీ కోసం బ్లాగ్ ని కబ్జా చేసినట్టు అనిపించింది..
ఇది చేసింది మీరే కదా, గుండె మీద వీలైతే గుండు మీద( అదే జుట్టు మీద లెండి) కూడా చెయ్యి వేసి చెప్పండి.. ఇంక పార్టీ విషయానికి వస్తే మీరంతా ఎప్పుడు అంటే అప్పుడే.. :)

హరే కృష్ణ said...

పార్టీ ల కోసం ప్రపంచం లో మహా సామ్రాజ్యాలే కూలిపోయాయి
కేవలం కబ్జా అంటే చాలా చిన్నవిషయం మీరు అదృష్టవంతులు అపర్ణ
గుండె మీద చెయ్యి వేసుకుంటే లబ్ డబల్ డబల్ అంటోంది
అంటే మీరు రెండు పార్టీలు బాకీ అని చెబుతోంది అనుకుంటా

మనసు పలికే said...

కృష్ణ గారు, మీకు మీ గుండె చప్పుడు కూడా పార్టీ గురించే చెప్పిందా..? మీ గుండె చాలా గ్రేట్ అండీ, మీకు చాలా చాలా ఫేవర్ గా ఉంది:)
**పార్టీ ల కోసం ప్రపంచం లో మహా సామ్రాజ్యాలే కూలిపోయాయి
కేవలం కబ్జా అంటే చాలా చిన్నవిషయం మీరు అదృష్టవంతులు అపర్ణ
ఎంత గొప్ప సర్వే.. నాకు మాటలు రావడం లేదు కృష్ణ గారు, అంత అదృష్టాన్ని తలుచుకుని.. నా గుండె ఆనందంతో ఉప్పొంగిపోయి ఎక్కడ నాకు గుండె పోటు వచ్చేస్తుందో అని భయంగా ఉంది.. ;)

హరే కృష్ణ said...

మిమ్మల్ని బంగారం అని పిలిచినప్ప్పుడు నేస్తం అభిమానులకు ప్రియతమ తమ్ముళ్ళకు మీ వల్ల
కేవలం మీ వల్ల గుండెపోటు రాలేదా ?
ఇది కూడా అంతే
రక్తానికి రక్తం గుండె పోటు కి గుండె పోటు.. హా !

హరే కృష్ణ said...

తల మీద చెయ్యి వేసుకుంటే preportional to square of the గుండె గనుక quatraple ఇవ్వాల్సి వస్తుందేమో
తార గారు చూడండి quatraple quarter అంటున్నారు అపర్ణ గారు మీకు పోస్తారేమో కనుక్కోండి

మనసు పలికే said...

బాబోయ్.. కృష్ణ గారు, నేను మీతో పెట్టుకోలేనని ముందే చెప్పానుగా..!! అయినా తార గారికి రెండు సార్లు కాదు నాలుగు సార్లు అయినా పోస్తాను..:) మరి నాకు మంచి పద్యం చెప్పారు కదా!! మీకైతే ఒక్క సారే..;)
అది సరే గానీ, అదేంటో నేను నాగార్జున గారి బ్లాగులో వ్యాఖ్య పెట్టలేకపోతున్నాను. కామెంటు బాక్సు పోస్ట్ లో ఎంబెడ్ చేస్తే నాకు enable అవ్వట్లేదు. దీనికి మీరేమైనా solution చెప్పగలరా..?

Anonymous said...

80 comments em jarugutondi ikkada hari ni enduku tidutunnaru meeru

మనసు పలికే said...

Anonymous గారు, ఛ.. ఛ.. హరినా.. నేనా.. తిట్టడమా.. మీరు మరీనూ.. హరిని తిట్టగలిగే వాళ్లు పుట్టారంటారా..?
నేను మాత్రం తిట్టలేదండీ.. Just నా గోడు గోడుకుంటున్నాను.. అంతే.. :) ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు.

..nagarjuna.. said...

అపర్ణగారు: మీ పోస్టులో కష్టపడి సెంచరీ కామెంట్లు కొట్టిస్తుంటే మా బ్లాగులో ఒక్క కామేంటుకూడా పెట్టలేదు, ధర్నా ఖచ్చింతా చేయలనుకున్నా.....హ్మ్, బ్లాగర్‌లో ప్రాబ్లమా....ఒసారి కామెంటు వేయడానికి try చేసి వాటి screen shotsను నాకు మెయిల్ చేయగలరా..?
నా బ్లాగులో పోస్టుపైన క్లిక్ చేసాక కామెంటు బాక్స్ అటొమెటిగ్గా ఎంబెడ్ అవుతుంది. సపెరేట్‌గా చేయల్సిన పనిలేదు

మనసు పలికే said...

ideal గా అయితే అవ్వాలి. అక్కడ error కూడా ఏమీ లేదు నాగార్జున.. just కామెంట్ బాక్సు enable అయ్యి లేదు. వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి అని కింద బ్లాంక్ ఉంది.
ఇది నేను చాలా బ్లాగుల దగ్గర face చేశాను. కామెంట్ బాక్సు పోస్ట్ లో ఎంబెడ్ చేసిన వారి బ్లాగుల్లో.. ఇది నా ఆఫీస్ సిస్టం ప్రాబ్లమే. Its working in my laptop.

మనసు పలికే said...

మర్చిపోయాను నాగార్జున, మీకు కూడా ధన్యవాదాలు. హాఫ్ సెంచరీ పూర్తి చేశారుగా..:) మీ టపాలో వ్యాఖ్య పెడతాను నా అభిప్రాయం గురించి..:)

హరే కృష్ణ said...

anonymus గారు ఇక్కడ గొడవ పడటం లేదండీ
సరదాగా కామెంట్లు రాస్తున్నాం
తను నన్ను తిట్టలేదు

హరే కృష్ణ said...

@Anonymus
చెప్పడం మరిచితిని
అసలేం జరుగుతోంది అంటే
తన గొడవ+గోడు= వంద కామెంట్లు కోసం వేచి ఉన్నాం
ఇద్దరు మిత్రులు తమ తమ బ్లాగుల్లో వంద కామెంట్లు ఒకే రోజు చేసే ప్లాన్ లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది

మనసు పలికే said...

కృష్ణ గారు.. హమ్మయ్య నన్ను కాపాడారండీ.. ధన్యవాదాలు.. :) ఏంటి ఇక్కడ కూడా సెంచరీ ప్లాన్ చేశారా ఏంటి.?

హరే కృష్ణ said...

welcome
ఆహా నాకు తెలియక అడుగుతున్నాను
ప్లాన్ చెయ్యడానికి ఇదేమన్నా బిల్డింగ్ ఆ చెప్పండి :)

హరే కృష్ణ said...

వేచి ఉన్నాం అని మాత్రమే రాసా కదా
అంటే ఎవరైనా రాస్తే చూద్దామని!
ఉహు మీరు వేరే వాళ్ళ బ్లాగుల్లో కామెంట్లు రాయాల్సిందే అప్పుడే మీ వంద కామెంట్ల కల తీరుతుంది
go ahead

మనసు పలికే said...

హ్మ.. ఏదైతేనేమి.. మీరు సెంచరీ పూర్తి చేపించాలని కంకణం కట్టుకున్నారని అర్థం అయింది. మీరు సలహాలు మాత్రం భలే ఇస్తున్నారు. మీరు వేచి ఉంటూనే, తీరిక దొరికినప్పుడల్లా కామెంటేస్తున్నారుగా.. హహ్హహ్హా..

హరే కృష్ణ said...

నాగార్జున అహర్నిశలు మీ వంద కామెంట్ల కోసం శ్రమిస్తుంటే
నాగార్జున బ్లాగ్ లో మీరు కామెంట్ ఎందుకు అంత లేట్ గా పెట్టినట్టు :(

మనసు పలికే said...

ఏం చెయ్యను చెప్పండి.. ఎందుకో నాగార్జున బ్లాగులో కామెంటడం నాకు చాలా కష్టతరంగా ఉంది. ఆ కామెంటు స్టైల్ మార్చమని శెలవివ్వండి. ఇక చూస్కోండి నా తడాఖా.. నేనే ఒక అర్థ సెంచరీ ఇచ్చేస్తా నాగార్జునకి.

హరే కృష్ణ said...

ఇది అన్యాయం నా కామెంట్ మొత్తం రాయనే లేదు రిప్లై కూడా ఇచ్చేసారు!
కంకణం ఏదో అంటున్నారు....

నా కంకణం బంగారం
పార్టీ లో కంకణం డబ్బులు మీరే ఇవ్వబోతున్నారు

ప్రజలారా!
నాతో పాటు ఎవరన్నా కంకణం కట్టుకున్నారా? త్వరపడండి

మనసు పలికే said...

బాబోయ్.. ఏంటిది..? మీ కంకణం బంగారపు కంకణమా..? దాని డబ్బులు నేనివ్వాలా.?? మళ్లీ, మీ అఙ్ఞాత అభిమానులు/మిత్రులు వచ్చి నేనేదో మిమ్మల్ని తిట్టేస్తున్నానని నన్ను నిందిస్తారా..? ఇక్కడ నేను న్యాయం కోరుతున్నాను. బ్లాగర్లారా..!! మీరంతా నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేస్తం అక్క.:)

Anonymous said...

౬ వందకి, తరువాత ఇంకో వంద ఫ్రీ

హరే కృష్ణ said...

సరే చూద్దాం ఇప్పుడు మీరు యాభై కామెంట్లు రాయాల్సిందే నాగార్జున బ్లాగ్ లో
మాట తప్పారో మళ్ళీ పార్టీ అని అంటారు మిగతా వాళ్ళు :)
అపర్ణ గారు మీరు జాగ్రత్త

హరే కృష్ణ said...

నాగార్జున బ్లాగు లో మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అపర్ణ :)

Anonymous said...

96

Anonymous said...

99

Anonymous said...

vamda nAdE

హరే కృష్ణ said...

నిద్రపోతున్న ప్రజలను వాళ్ళ నిద్ర చెడగొట్టుకొని మరీ మీకు న్యాయం చెప్పమంటారా
మొన్న తిండి తిననివ్వలేదు
ఈరోజు నిద్రపోనివ్వడం లేదు
ఇది ఏంటి అని అభిమానుల తరుపున ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నా అంతే హా !

హరే కృష్ణ said...
This comment has been removed by the author.
మనసు పలికే said...

బాబోయ్ ఏం జరిగింది ఇక్కడ..?? నాకు ఏం అర్థం కావడం లేదు. కన్ను మూసి తెరిచేలోగ ఇలా 100 ప్రత్యక్షమైంది ఏంటి..?? తార గారు, మీరు కూడా కంకణం కట్టేస్కున్నారా.?

హరే కృష్ణ said...

నా వందో కామెంటు రాకుండా చేసినందుకు తార నాకు ఒక పార్టీ బాకీ
బ్లాగు owner అయిన మీరు కూడా రెండు పార్టీ లు బాకీ

ఒక పార్టీ వంద కామెంట్లు కొట్టేసినందుకు
రెండో పార్టీ వందో కామెంట్ నాకు కాకుండా చేసినందుకు

హరే కృష్ణ said...

బాబోయ్ ఏం జరిగింది ఇక్కడ..అని ప్రశ్నలకు
సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్న అపర్ణని ఏం చెయ్యాలి
గుడ్ నైట్ చెప్పి వదిలేయాలి
గుడ్ నైట్!
and congratulations :)

మనసు పలికే said...

నేనిక్కడ సుబ్బరంగా నాగార్జున బ్లాగులో కామెంటుతుంటే గుడ్ నైట్ చెప్తావా..?? అక్కడ సెంచరీ ఏమైపోవాలి మరి నేను నిద్ర పోతే..??

Anudeep - chilled life... said...

అవి పిcచి గీతలు కాదు అపర్న గారు:
అవి మీ తెలివి కి చిహ్నాలు,
అవి మీ భావాలకు సన్కెతాలు,
అవి మీ ఆలోచనలకు గుర్తులు,
అవి మీ కలా పొశనలకు మారు పేరు..

కాని, నాకు ఒక చిన్న డవుట్, మీ తెలివి, మీ భావాలు, మీ అలోచనలు, కలా పొశనలు ఇన్త గలీసు గా (యాక్) ఉన్నాయి ఎన్టన్డి??

ణన్ను క్శమిన్చన్డి, నేను ఎదైన తప్పుగ మాట్లడితె...

హొవెవెర్, గుడ్ జాబ్. కీప్ ఇట్ అప్...:)

మనసు పలికే said...

హహ్హహ్హా ధన్యవాదాలు అనుదీప్. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగు టైప్ చెయలేదని నాకు తెలుసు. కానీ ఇక్కడ కామెంట్ కోసం ట్రై చేశారు, అందుకు అభినందనలు. కొంచెం ప్రాక్టిస్ చెయండి. చాలా మంచి తెలుగు టైప్ చెయ్య గలరు..;)

హరే కృష్ణ said...

నాకు గుడ్ నైట్ చెప్పనందుకు కూడా ఇంకో breakfast పార్టీ ఫ్రీ
ఏమి ఈ భాగ్యము :)
breakfast చెప్పాలనుకునే వాళ్ళు ఇక్కడ goodnight చెప్పి సుబ్బరంగా పడుకోవచ్చు

మనసు పలికే said...

నేను గుడ్ నైట్ చెప్పకపోవడం ఏమిటీ.. గుడ్ నైట్ కృష్ణ..

హరే కృష్ణ said...

చెప్పమని అడిగాక చెప్పారు కాబట్టి రేపు టీ కాన్సిల్ చేస్తున్నాం! ఓన్లీ టిఫిన్ :)

ATM కార్డ్ పట్టుకొని వచ్చేయండి
గుడ్ నైట్

మనసు పలికే said...

కృష్ణ గారు టిఫిన్ కావాలన్నారు కదా అని, కృష్ణ గారు మాట మీద నిలబడే వ్యక్తి కదా అని, కృష్ణ గారు ఒట్టేసి ఒక మాట ఒట్టు వెయ్యకుండా ఒక మాట చెప్పరు కదా అని, కృష్ణ గారు ఒక సారి డిసైడ్ అయితే కృష్ణ గారి మాట కూడా వినరు కదా అని, కృష్ణ గారు మాటంటే మాటే కదా అని ATM card పట్టుకుని early morning నుండి Taj Banjara దగ్గర ఎదురు చూసీ చూసీ ఇక రారులే అని డిసైడ్ అయిపోయి ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇక నేను డిసైడ్ అయిపోయాను, కృష్ణ గారు మాట మీద నిలబడలేదు కాబట్టి పార్టీ కూడా cancel అని. అదేంటో నేను కూడా కృష్ణ గారి లాగానే ఒక సారి డిసైడ్ అయితే నా మాట కూడా నేను వినను.. హిహ్హిహ్హీ..

హరే కృష్ణ said...

మీరు నిద్రలేచిందే పొద్దున్న పది గంటలకి
మళ్ళా అబద్దాలు కూడా.. ఆయ్!
అందుకే మేము నిరాహార దీక్షకు పిలుపినిస్తున్నాం

మనసు పలికే said...

అమ్మ బాబోయ్.. పది గంటలకి నిద్ర లేవడమా..? మీరు పదకొండు గంటలకి లేచి ఉంటారు.. అందుకే అలా అంటున్నారు..:) నేను పొద్దున్నే లేచాను, మీ లాగా కాదు.:)

హరే కృష్ణ said...

అయినా మీరు పార్టీ ఎక్కడో చెప్పకుండా చడి చప్పుడు లేకుండా నేను తాజ్ కి వెళ్ళాను మీరు రాలేదు అంటే అర్ధం ఏంటి!
అపర్ణ గారికోసం GPS locator ఒకటి పెట్టి మేము ట్రాక్ చెయ్యాలా
ఇదేదో నాగార్జున రికార్డుని క్రాస్ చెయ్యడానికి పన్నిన
బంజారా కుట్రలా ఉంది :)

హరే కృష్ణ said...
This comment has been removed by the author.
మనసు పలికే said...

కృష్ణ గారు, మీ తెలివి తేటలు ఉన్నాయే.. అద్భుతం.. అమోఘం..:) నాకు నోట మాట రావట్లేదు. మీరు కేక అండీ.. లేకపోతే.. నాగార్జున రికార్డు బద్దలు కొట్టాలన్న ఆలోచన నాకు రాలేదు.. కానీ మీకు ఎలా వచ్చింది చెప్మా...!

హరే కృష్ణ said...

మీరు ఇక్కడ ఉండాల్సిన వారు కాదు
అందుకే హైదరాబాద్ లో ఉన్నారు

హరే కృష్ణ said...

నా కామెంట్ ని delete చేసినందుకు అభిమానులు తమ drum లు పట్టుకొని దిగి రావాల్సిందే

మనసు పలికే said...

హయ్యయ్యో.. మీ కామెంట్ ని నేను డిలీట్ చెయ్యలేదండీ.. నిజ్జం.. నాకు నిజ్జంగా తెలియదు ఏం జరిగిందో..

హరే కృష్ణ said...

ఓహ్ అవునా!
బ్లాగర్ లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటా

రాజ్ కుమార్ said...

asalem jarugutondi ikkada? naaku telisyali..teliyali...Telis teerali...
Mansupalike garu... COngratulations 4 ur Century...:)

మనసు పలికే said...

కృష్ణ.. అదే అనుకుంటా.. మీరే డిలీట్ చేశారేమో అనుకుంటున్నాను నేను ఇంతకు ముందు.
వేణురాం గారు, ముందుగా స్వాగతం నా బ్లాగు లోకి..:) ధనవాదాలండీ మీ అభినందనలకి. ఇక్కడ ఏం జరుగుతుందో, నాకంటే బాగా కృష్ణ గారే చెప్పగలరు. :):)

kiran said...

chala baga vastondi aa bomma..complete cheseyandi..prathi okkaru ilage feela vtaranna mata..ammayya..ippudu naku trupthi ga undi...endukante..navi chala work in progress state lo unnayi..!! :D

హరే కృష్ణ said...

అపర్ణ అసలు ఏం జరుగుతోంది ఇక్కడ
నేస్తం అక్క బ్లాగ్ లో రెండు వందలు కామెంట్లు చెయ్యడం మానేసి
ఇక్కడ మీ బ్లాగ్ లో కష్టపడి కామెంట్లు పెట్టిన వారికి రిప్లై లు కూడా ఇవ్వకపోవడం వల్ల
మీకు లభించిన బంగారం అనే బిరుదు ని వెనక్కి తీసుకుంటాం అని హెచ్చరిస్తున్నాం

హరే కృష్ణ said...

కిరణ్ గారు
మీకు అపర్ణ రిప్లై ఇచ్చేలా లేరు :( సరే ఆవిడ రిప్లై నేనే టైపు చేస్తున్నా

కిరణ్ గారు ముందుగా మనుసుపలికే బ్లాగులోనికి స్వాగతం సుస్వాగతం :)
బొమ్మ నచ్చినందుకు థాంక్ ఆండీ

అపర్ణ బా చెప్పానా :)

..nagarjuna.. said...

@హరేకృష్ణ: కెవ్...... :))

మనసు పలికే said...

కిరణ్ గారు, ధన్యవాదాలండీ.. క్షమించాలి రిప్లై ఆలస్యమైనందుకు. కానీ నా బదులు కృష్ణ గారు ఇచ్చేశారుగా..:) కృష్ణ.. ధన్యవాదాలు. :):)

Unknown said...

ఈ బొమ్మలు అన్నే మీరే వేసినారా
బాగుంది

మనసు పలికే said...

అపర్ణ గారూ, అవునండీ నేనే వేశాను..:) ధన్యవాదాలు నా బొమ్మలు మీకు నచ్చినందుకు..:)

Anonymous said...

అమ్మాయి బొమ్మలో ప్రపోర్షన్స్ సరిగ్గా లేవు. నుదురు మరీ చిన్నగా వుంది. సో కొంత అసహజంగా వుంది.

మనసు పలికే said...

Anonymous గారూ, అవునా! ధన్యవాదాలండీ, చాలా open గా చెప్పినందుకు..:)

Mahitha said...

బొమ్మలు బాగున్నాయ్.
నాకు నచ్చాయ్.

:)

మనసు పలికే said...

ధన్యవాదాలు మహి.. :)

వేణూశ్రీకాంత్ said...

బొమ్మలు బాగా గీశారండీ. ధైర్యంగా పూర్తి చేయండి, మరీ అంత అనుమానంగా ఉంటే ఒక రఫ్ డ్రాఫ్ట్ పై మిగిలిన భాగం ప్రయత్నించి అప్పుడు దీని మీద గీసేయండి

మనసు పలికే said...

ధన్యవాదాలు వేణు శ్రీకాంత్ గారు..:)
తప్పకుండా మీ సలహా ప్రయత్నిస్తా..

మనసు పలికే said...

:):)

హను said...

chala baga vestunnaru meeru artist kuDa anna maaTa....

మనసు పలికే said...

ధన్యవాదాలు హను గారు.. ఏదో అలా అలా..:)

Arun Kumar said...

బొమ్మలు బాగున్నాయండి. ఎలాగైనా ఆ మిగతాబొమ్మను కంప్లీట్ చేయండి ప్లీజ్!!

మనసు పలికే said...

అరుణ్ కుమార్ గారూ, ధన్యవాదాలండీ నా బొమ్మలు నచ్చినందుకు. అవి కంప్లీట్ చెయ్యడం ఏమో కానీ, కొత్తవి గీసే ప్రయత్నాల్లో ఉన్నాను:)

జ్యోతిర్మయి said...

పిచ్చి గీతలా...పిచ్చి గీతాలే ఇలా ఉంటే ఇక మంచిగీతలు ఇంకెలా ఉంటాయో.....

Ennela said...

bommalu chaalaa baagunnaayi aparnaa, 2nd bomma naakaite complete ayinatlugaane undi..

nee saametalo daiva rahasyam naaku kuudaa telusu kaanee..puli pule, kothi kothe...evari tindi vaallu tinochchannamaata...no problem!!

మనసు పలికే said...

జ్యోతిర్మయి గారు :) ధన్యవాదాలు నా పిచ్చి గీతలు కూడా నచ్చినందుకు :))


ఎన్నెల గారూ, ఆహా ఎన్నాళ్లకి నా బ్లాగులో మీ వ్యాఖ్య. ఈ రోజు ఫుల్ ఖుష్.. అంతే :)) హహ్హహ్హ మొత్తానికి నా సామెత అర్థం తెలిసిపోయిందనమాట.. నా బొమ్మలు కూడా నచ్చేశాయనమాట ధన్యోస్మి..:))