Monday, August 2, 2010

తిండి.. ' తిప్పలు '..

ఇంటి తలుపు తెరవగానే ఘుమఘుమలు.. ఇంట్లో పంచభక్ష్య పరవాన్నాలు.. సూప్ లు, సలాడ్లు, పళ్లు, స్వీట్లు ఇంకా తినదగిన ఎన్నో రకాల వంటకాలు... మీకు నోరు ఊరుతుంది కదూ!! కానీ ఇవన్నీ పడని వాళ్లు ఎవరైనా ఉంటారా..? (ఆరోగ్య రీత్యా తినకూడని వాళ్లు మినహాయింపు.). తినాల్సిన టైం అయితే చాలు, అబ్బా అర గంట ముందే కదా తిన్నది ( ఇక్కడ అర గంట అంటే ఓ నాలుగైదు లేదా ఆరు గంటలు వేసేస్కోండి.. ), మళ్లీ తినాలా అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా..? విందు భోజనాలకి వెళ్లినప్పుడు అక్కడ వాళ్లు పెట్టే రకరకాల వంటలను చూసి (నిజానికి చూడకుండానే) ఈ సారి ఏ సాకు చెప్పి తప్పించుకోవాలా అని తలకిందులుగా తపస్సు చేసినంత పని చేసేవాళ్లు ఉంటారని మీకు తెలుసా..? కడుపులో ఆకలి ఉంటుంది, చేతిలో కంచం, అందులో అన్నం with పప్పు, కూర మరియు పెరుగు కూడా భేషుగ్గా ఉంటాయి. కానీ, అతి కష్టం మీద ఆరు ముద్దలు పట్టించి ఏడో ముద్దకి ఆపసోపాలు పడే వాళ్లని చూశారా..? ఆ కంచం లో అప్పుడే ఒక నాలుగైదు కోళ్లు breakdance చేసి వెళ్లినట్లుగా ఉండటం చూశారా..?

అసలు ఏంటి ఇదంతా అని ఆలోచించకండి.. పైన అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక సమాధానం ఉంది. అవన్నీ నా గురించి ఉద్భవించిన ప్రశ్నలే.. ఇంకా చెప్పాలంటే అలా చేసేది నేనే.. హిహ్హీహ్హీ.. :) మరదే.. మరీ నన్నలా చూడకండి.. నేను ఇక బ్లాగడం మానేస్తాను మీరలా చూస్తే.
చిన్నప్పుడు మా అమ్మ ఒక కథ చెప్పింది. ఈ మానవ జన్మలని సృష్టించిన మొదట్లో.. శివుడు నంది కి చెప్పాడంట, "నువ్వు భూ మండలానికి వెళ్లి అక్కడ మనుషులు అనబడు ప్రాణులకి ఈ విధంగా చెప్పు : రోజూ తలస్నానం, వారానికి ఒకరోజు భోజనం" మరి మన నంది గారేమో, అన్ని లోకాలని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా దాటుకుంటూ, అన్ని వింతలు విశేషాలని తన్మయత్వంతో చూసుకుంటూ  వచ్చి అసలు విషయాన్ని మర్చిపోయి, శివుడు చెప్పిన ఆ రెండు ముక్కల్నీ అటు ఇటు గా ఇటు అటు గా మార్చి చెప్పిందట. అంటే, వారానికి ఒకరోజు తలస్నానం మరియు ప్రతి రోజూ భోజనం.. (మరి రోజుకు మూడు సార్లు ఎందుకు తింటున్నాం అని మాత్రం నన్ను అడగకండేం..నాకు కూడా తెలియదు) అలా నా జీవితం తారు మారు అయ్యిందండీ..  ఆ మహాపరాధానికి గాను, నంది గారికి శివుడు గారు " ప్రతి రోజూ భోజనం అంటే ఎక్కడి నుండి వస్తుంది..? నువ్వెళ్లి పొలాల్ని దున్ని సాగు చెయ్యడంలో రైతన్నలకి సాయం చెయ్యి పో" అని శెలవిచ్చారట. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ నా గురించి ఎవ్వరూ పట్టించుకోరేం..?  రోజూ మూడు పూటలు తినడం అంటే ఎంత కష్టం మీరే చెప్పండి.. నాకు ఇంత అన్యాయం చేసిన ఆ శివుడు ( చేసింది నందే గానీ, శివుడి ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదండీ.. అందుకని, ఆ మహాపరాధానికి కారకుడు ఆ శివయ్యే అని మొర పెట్టుకుంటున్నాను యువర్ ఆనర్..) పోనీలే పాపం రోజూ ఏం తింటుంది ఈ ఒక్క పూటకు తినకులే అమ్మా అని ఎవరి బుర్రలో అయినా బుద్ధి పుట్టించాడా అంటే అదీ లేదు. ఎంత సేపూ తిను అని అరిచే వాళ్లే గానీ ఈ రోజుకి వద్దులే అనే వాళ్లు ఒక్కళ్లు కూడా లేకపోవడంతో నా చిన్ని మనసు ఎం...తో... గాయపడి పోయి బయటకొచ్చిన రక్తం కాస్తా కన్నీళ్ల రూపంలో ఆ నలుగురినీ మారుస్తుందనుకుంటే.. అది కూడా నా అత్యాశే అయింది.:( ఎంతో సత్కారణం గల నా ఏడుపుని కించ పరిచి పగిలిన నా గుండె ని ముక్కలు ముక్కలు గా చేసేశారు.
అలా భారమైన నా గుండె కి ఎడారిలో ఒయాసిస్సు  లాగా.. చలికాలం లో వేణ్ణీళ్ల లాగా.. ఇంకా చెప్పాలంటే నడి రాతిరిలో టార్చి లైట్ లాగా.. నాకు ఒక నేస్తం దొరికింది.  అవి, నా నేస్తం నేను ఒకే హాస్టల్ ఒకే రూం లో ఆడుతూ పాడుతూ ఉండే రోజులు. చాలా విషయాల్లో మా అభిప్రాయాలు కలిసేవి. ముఖ్యంగా తిండి తినేటప్పుడు తిప్పలు పడే విషయంలో..అందరూ మా అన్యోన్యతను చూసి కుళ్లుకుని మమ్మల్ని తిట్టే వాళ్లు, అన్నం సరిగ్గా తినట్లేదన్న వంకతో.. అయితే మాత్రం, అంత చిన్న విషయం కూడా మాకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది..? మేము మాత్రం మాకు ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా ఎంత మంది మమ్మల్ని వారించినా.. అన్నం తినడం అనే కార్యక్రమాన్ని మినిమం గంటన్నర కూడా లేకుండా పూర్తి చెయ్యలేదెప్పుడూ.. అలా ఎంతో ఆనందంగా గడిచిపోయే రోజుల్లో ప్రశాంతంగా ఉన్న సముద్రంలో సునామీ వచ్చినట్లుగా నా జీవితం లో కూడా ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన నా జీవితంలో నాకు నచ్చని(అప్పుడు నచ్చని) ఎన్నో మార్పులను తెచ్చింది. ఇప్పుడు ఆ సంఘటన మీకు చెప్తాను. దయచేసి మీరు కన్నీరు కార్చొద్దు నాకోసం.
మరేమో నాకు ఇంకో నేస్తం ఉండేది. నాకు పూర్తి విరుద్ధమైన నేస్తం. అప్పట్లో ఎన్నో సార్లు అనుకునే వాళ్లం , అసలు మన ఇద్దరికీ ఎలా సఖ్యత కుదిరిందబ్బా అని.. కానీ ఇది కూడా శివయ్య పనే అని తర్వాత తెలిసింది. నన్ను లావు చెయ్యడమే తన జీవిత పరమావధి గా పెద్ద కంకణం కట్టేస్కుని వాళ్ల ఇంట్లోనే ఉండమని చెప్పేసింది. అంటే నాకు అప్పటికి ఆ కంకణం సంగతి సరిగ్గా తెలియక నేను కూడా చాలా ఆనంద పడి పోయి వెంటనే పెట్టె బేడా సర్దుకుని వెళ్లిపోయాను.  చూస్తే ఏముంది, ఆంటీ నర్సు, అంకుల్ నర్సెస్ కో-ఆర్డినేటర్.. అంతా ఆరోగ్య మయం.. అది తిను , ఇది తిను.. అప్పుడు అర్థం అయింది, కంకణం నా నేస్తం మాత్రమే కట్టుకోలేదు, ఆంటీ, అంకుల్ కూడా చాలా బలంగా కట్టేస్కున్నారని. ఇంకేముందీ, వాళ్లందరి బలమైన కంకణ బలం ముందు నా బలహీనమైన్ సంకల్ప బలం చాలా చిన్నదైపోయింది. అంతే కాదు చాలా చాలా దారుణంగా ఓడిపోయింది..:(  ఆ కంకణాలను చూసి మా అమ్మ నాన్న మాత్రం ఎంతో సంతోషపడిపోయారు. నేను మాత్రం అలా ఓడిపోయిన బాధతో అన్నీ తినేస్తూ కాలం గడిపేశాను. అలా నన్ను మార్చే క్రమంలో ఒకరోజు జరిగిన చిన్న సంఘటన ఇంకా నా మదిలో పదిలంగా ఉంది. ఒకరోజు రాత్రి నేను అన్నం తినకుండా నిద్ర పోతూ ఉంటే, ఆంటీ వచ్చి లెగమ్మా కొంచెం అన్నం తిని పడుకో అని బ్రతిమిలాడుతూ ఉన్నారు. నేనేమో ఊర్మిళా దేవి తోబుట్టువులా నిద్రపోతూనే ఉన్నాను. పాపం పిలిచీ పిలిచీ విసిగిపోయిన ఆంటీ "నేను నా కూతురిని కూడా ఎప్పుడూ ఇంతగా బ్రతిమిలాడలేదు. లేమ్మా.. తిని పడుకో" అన్నారు. అంతే, చటుక్కున లేసి తినేసి పడుకున్నాను.:) 

ఆ తర్వాత నా డిగ్రీ అయిపోవడం, ఉద్యోగం వచ్చేయడం, ఇల్లు మారిపోవడం చక చకా జరిగి పోయాయి. కానీ ఇప్పటికీ కలుస్తూ ఉంటాను ఆంటీ, అంకుల్ ని. ఎప్పుడు ఫోన్ చేసినా ఒకటే ప్రశ్న, ఎమైనా లావు అయ్యావా అని. కలిసినప్పుడు మాత్రం, ఇక నువ్వు లావు అవ్వవులే అన్న నమ్మకమైన చూపు.:(  ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తూ ఉంటుంది. కానీ, నిజానికి ఇప్పుడు నేను చాలా health conscious అయ్యాను అంటే అది మాత్రం ఆంటీ, అంకుల్ వల్లనే.. నేస్తం..నాకు అటువంటి మంచి ఆంటీ, అంకుల్ ని ఇచ్చినందుకు నీకు నా ధన్యవాదాలు.:)

63 comments:

sreelatha said...

atuvanti frend!! naku ... atunvanti ane kante aah nestame naku tagilindhi :P nenu na manana diet conscious ani peru petukoni thintunte.... aah deekshani bagnam chesi.. malli addamina gaddi thine la chesindhi...

sreelatha said...

srry if my comments were not clear!! request owner to update the comments clearly!! coz in pvt(private) chat i explained!!! :)) :D but never ll 4get that nestam.. who has kankanam katukonigns to make me eat well!!!

Pinty said...

Hey Poo.. nice one.kani laavu ayyava inka aalagey unnava thalli.. ee saari kalisi nappudu kanisam koncham healthy ayina kanipinchu..

మనసు పలికే said...

ధన్యవాదాలు శ్రీ.. ఏం చేస్తాం.. మనకి అలాంటి గొప్ప నేస్తం దొరికినందుకు గర్వపడటం తప్ప. నీ పిచ్చి గానీ, మనం ఎలా మర్చిపోతాం.? అసలు ఎలా మర్చిపోగలం చెప్పు..?

మనసు పలికే said...

ఆహా.. పింటీ.. నా నేస్తం.. వచ్చేశావా..? నువ్విచ్చిన స్ఫూర్తి తో దొరికినవన్నీ తినేస్తున్నా.. :P

Pinty said...

Ahh sree iroju nadustundi ...ala matladaniki karanam kuda neny..or else ee patiki kallu tirigi padipoyi undedi... Dieting peru tho nana thippallu padadam avasarama..!!!

సవ్వడి said...

hahaha...
baagundi.

మనసు పలికే said...

సవ్వడి గారూ..! ధన్యవాదాలు.

Pranav Ainavolu said...

అయితే ఇవి తిండి.. తిప్పలు కావు...
తిండి తెచ్చిన తిప్పలన్న మాట! :)

ఒక్క విషయం లో మాత్రం నా ఓటు మీకే [ఎందుకంటే మనం కూడా గంటకు తగ్గకుండా భోంచేస్తాము] :D

మనసు పలికే said...

ధన్యవాదాలు ప్రణవ్ గారూ! నా మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది:). నాలా ఇంకొకరు ఉన్నారు కదా మరి..
కానీ ఇప్పుడు అరగంటలో భోజనం ముగించెయ్యాల్సొస్తుందండీ..:(

నేస్తం said...

నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఒక్క తప్పులేకుండా రాసావ్.. ఇదే నెనైతేనా తప్పుడు తప్పుడు తాళాలే..ఇక తిండి విషయం లో ఇప్పుడు నువ్వు చేస్తున్న పనే కరెక్ట్ ... నేను అలా మాట వినకే ఇప్పుడు అమ్మో నీరసం బాబోయ్ నీరసం అంటున్నా :)

మనసు పలికే said...

ఆహా..!! కల నిజమాయెనే... కో..రిక తీరెనే..
ధన్యవాదాలు నేస్తం గారూ. మీరు ఇలా నాకు Encouragement ఇస్తే చాలు, అల్లుకుపోతాను.:)
అప్పుడెప్పుడో కొత్తపాళీ గారు నా బ్లాగు నందు అడుగు పెట్టి, వారి బ్లాగు లో కామెంటారు, నా ఐటి వ్యవసాయం బాగుందని. అప్పుడు కడుపు నిండింది, మళ్లీ ఇప్పుడు.

nagarjuna said...

నేస్తం బ్లాగులో వ్యాఖ్యచూసి మీ బ్లాగు ఓపెన్ చెసానండి. బాగా రాస్తున్నారు. రెండు బ్లాగులను నిర్వహిస్తున్నారు రెండిట్లో వేర్వేరు విషయాలు రాస్తున్నరా లెక బ్లాగు సవ్యసాచి అవుదామనా

nagarjuna said...

ఓహ్..రెండొ బ్లాగు సిరివెన్నల గారికి అంకితమన్నమాట.
నాకు ఆయన పాటల్లో సిరివెన్నల సినిమాలోని ’విరించినై’, గమ్యంలో ’ఎంతవరకు ఎంతవరకు’ చాలా ఇష్టం

మనసు పలికే said...

నాగార్జున గారూ! ముందుగా మీకు నా బ్లాగులోకి స్వాగతం. హృదయ పూర్వక ధన్యవాదాలు నా బ్లాగు మీకు నచ్చినందుకు.
నిజానికి ముందుగా సిరివెన్నెల బ్లాగు మొదలు పెట్టానండీ, కేవలం అది సిరివెన్నెల గారు రాసిన పాటల గురించే. ఒక నెల రోజుల తరువాత ఆలోచన వచ్చింది, నా ఆలోచనలు అనుభవాలని కూడా పంచుకోవచ్చు కదా అని. ఆలోచన వచ్చిందే తడవు, మనసు పలికే మొదలు పెట్టేశాను.

మనసు పలికే said...

ఓ అలాగా..! అలాగే ఇంకా ఏమైనా మంచి పాటలు ఉంటే ఇలా నా చెవిన వేద్దురూ!! నాకైతే ఆయన రాసే ప్రతి మాటా అద్భుతం గానే కనిపిస్తుంది.

హరే కృష్ణ said...

నేస్తం బ్లాగులో వ్యాఖ్యచూసి మీ బ్లాగు ఓపెన్ చెసానండి.
మీరు వందో కామెంట్ కొట్టేసారని గొడవ వేసుకోవడానికి వచ్చాం

మీ పోస్ట్ చదివాక అభినందించకుండా ఉండలేకపోతున్నాం
బాగా రాసారు.. అభినందనలు అపర్ణ గారు!

good one

మనసు పలికే said...

ధన్యవాదాలు కృష్ణ గారూ!! చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా నా బ్లాగులో కామెంటినందుకు (అంత కన్నా ఎక్కువగా 100వ కామెంటు నేను పెట్టినందుకు). ముందుగా మీకు నా బ్లాగులో కి స్వాగతం:)
ఏమిటేమిటీ గొడవెట్టేసుకుందామని వచ్చారా..? నేస్తం అక్క శివాలెత్తేస్తారు అక్కడ నన్నేమన్నా అంటే.. :)

హరే కృష్ణ said...

హేమిటో
నేను శశి ,పవన్,రాజకుమార్,నాగార్జున
అక్కడ 2 years industry
ముందు వచ్చ్సిన ఫాన్స్ కంటే వెనుక వచ్చిన అపర్ణ ముద్దు అని ఊరికే అనలేదు

ఇది నేస్తం గారి బ్లాగులో నే న్యాయం అడుగుదాం హా!

మనసు పలికే said...

హిహ్హిహ్హీ.. అవును అక్కడే తేల్చుకుందాం... మనం ఇలా అడిగితే, "నాకు అందరూ సమానమే" అని నేస్తం గారు మాట దాటేసే ప్రమాదం ఉంది. మనం ఏ మాత్రం తగ్గకూడదు. ఏమంటారు..?

హరే కృష్ణ said...

అక్కా!
అపర్ణ కావాలో అభిమానులు కావాలో తేల్చుకోండి అని ప్రశ్న వెయ్యాలంతే

nagarjuna said...

బాబు కృష్ణ, కామెంటు మీటర్ మెల్లిగా కదులుతుంటే వందవ కామెంటు అభిమానులే వేస్తారనుకున్నా....ప్చ్ సడెన్‌గా అపర్ణగారొచ్చేసి ప్లాన్‌ను హైజాక్‌ చేసేసి బంపరాఫర్‌ కొట్టేసింది.....బద్దకమెంత పనిచేసెరా దేవుడా!!

పార్టిలో అభిమానులందరం ఉందాం. పాతవాళ్లకు కాకుండా కొత్తగా వచ్చి క్రెడిట్ కొట్టేసింది కాబట్టి ఆ పార్టిబిల్లు అపర్ణగారు కట్టాలి, ఈ ప్రపోజల్‌ కూడా నేస్తంగారి దగ్గర పెడదాం

హరే కృష్ణ said...

బిల్లు పాస్ చెయ్యాల్సింది మనమే
కట్టాల్సింది అపర్ణ
నేస్తం గారు చాలా మంచి వారు వాళ్ళ తమ్ముళ్ళకోసం ఆ మాత్రం చెయ్యలేరా చెప్పు !

హరే కృష్ణ said...

కామెంట్ approval కూడా కాస్త లేట్ అయ్యింది
పది నిమిషాల్లో పన్నెండు కామెంట్లు రాసి కొంప ముంచారు అపర్ణ గారు
డిన్నర్ కూడా prepare చెయ్యనివ్వకుండా మా వందవ కామెంట్ ను ఎత్తుకుపోయారు
ఇందుమూలంగా మీ బ్లాగ్ లో సామూహిక ధర్నా నిర్వహిస్తున్నాం

మనసు పలికే said...

హేవిటేవిటీ..?? మీరంతా అభిమానులా..?? మరి నేనో.?? ఈ విషయం కూడా అక్కడ పెట్టెయ్యాలంతే.. ఆ తరువాత జడ్జి గారు ఏ తీర్పు చెప్పినా మనమంతా శిరసావహించాలి.. అలా ఐతేనే నేను కూడా పార్టీ బిల్లు కట్టడానికి సిద్ధం. :)
మొత్తానికి నేను చాలా సంతోషంగా ఉన్నానండీ.. నాగార్జున గారు నా పేరు గుర్తు పెట్టేస్కున్నారు.

హరే కృష్ణ said...

మీరు అభిమానులు మాత్రమే
మేమంతా తమ్ముల్లం అన్నమాట
శశిధర్, ఇంద్రేష్ ని అడగండి కావాలంటే

మనసు పలికే said...

ఇక చాలు బాబోయ్.. నవ్వలేక ఛస్తున్నా ఇక్కడ.. :D
"నేస్తం గారు చాలా మంచి వారు వాళ్ళ తమ్ముళ్ళకోసం ఆ మాత్రం చెయ్యలేరా చెప్పు !" ఏంటి..? నేస్తం గారికి సోప్ వేస్తున్నారా..? ఇక్కడ ఆ పప్పులు ఉప్పులు ఏమీ ఉడకవు. నేస్తం గారు నిస్పక్షపాతంగా తీర్పు చెప్తారు.
మీరంతా కేవలం అభిమానులు + తమ్ముళ్లు.
నేను, అభిమాని + చెల్లి + బంగారం.. :)

మంచు said...

హ్మ్మ్... నేస్తం గారు అస్తిలొ నాకు సగభాగం రాసిస్తాన్నారు .. అది మీకింకా తెలీదు పాపం :-))

హరే కృష్ణ said...
This comment has been removed by the author.
హరే కృష్ణ said...

రెండు సంవత్సరాల ఇండస్ట్రీ ఇక్కడ
ఓరీ మ్రేచ్యుడా డైలోగ్ వదిలేస్తాం అంతే !
ఇక్కడ మేము హార్డ్ కోర్ ఫాన్స్ + తమ్ముళ్ళం +ప్లాటినం

హరే కృష్ణ said...

అవును నాగప్రసాద్ కి కూడా పావుభాగం వాటా ఇస్తా అన్నారు
మేము మాత్రం మాకే ఏమీ వద్దు మీ ప్రేమ చాలు అని వచ్చేసాం
చూసారా ఎంత మంచి వాళ్ళమో

మనసు పలికే said...

మంచు గారూ!! మీరు ఏమవుతారండీ నేస్తం గారికి..? ఇది తూచ్..
ఏదో సామెత ఉంటుంది కదా, ఛ.. గుర్తు రావట్లేదు. అయినా సరే నేను ఏడుస్తున్నాను ఇక్కడ.. వ్వా..ఆ..
అసలు మీకు నా బ్లాగుకి స్వాగతం చెప్పలేదు కదూ!! స్వాగతం సుస్వాగతం మంచు గారూ.. :)

మనసు పలికే said...

అవునూ.. కృష్ణ గారూ!! మిమ్మల్ని నేస్తం అక్క ప్లాటినం అని ఎప్పుడు అన్నారు..? నాకు details కావాలంతే..

తార said...

మంచు గారికి ఎదో ఆస్థి కలిసి వస్తున్నది అంటే విని నేను ఇక్కడికి వచ్చాను..

మంచు గారు ఎమైనా సినిమా తీస్తారా? కొత్త ఆస్థితో

హరే కృష్ణ said...

ప్లాటినం అని చెప్పిన పోస్ట్ ఇదే

కావాలంటే మీరూ చూడండి
http://jaajipoolu.blogspot.com/2010/04/blog-post_30.html

హరే కృష్ణ said...

వాళ్ళ తమ్ముళ్ళకోసం ఆ మాత్రం చెయ్యలేరా చెప్పు !" ఏంటి..? నేస్తం గారికి సోప్ వేస్తున్నారా..?

నేస్తం గారు నిస్పక్షపాతంగా తీర్పు చెప్తారు.
ఇక్కడ మీరు సోప్ ఫాక్టరీ నే వేసేస్తున్నారు కదా హా!

మనసు పలికే said...

హహ్హా.. ఎక్కడో, మనసు పలికే బ్లాగులో, హరే కృష్ణ గారికి అపర్ణ అనబడు నాకు మధ్య మొదలైన ఒక చిన్న యుద్ధానికి, ఇలా మీ నెట్ వర్క్ మొత్తం కదిలొస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది.. నాగార్జున గారు, మంచు గారు ఇప్పుడు తార గారు.
తార గారు! మీకు కూడా నా బ్లాగులోకి స్వాగతం.. సుస్వాగతం.. :)
కృష్ణ గారూ!! అబద్ధం.. పచ్చి మోసం.. మిమ్మల్ని ప్లాటినం అన్నారని అబద్ధం చెప్పారు. అన్ని వ్యాఖ్యలూ చూశాను, మరి నాకైతే ఎక్కడా కనిపించలేదు..
హహ్హ్హహ్హా బ్రతికి పోయాను. లేకపోతే ఇంక ఏమైనా ఉందా.. నాకు ఉన్న ఆ ఒక్క plus point కూడా ఉండేది కాదు..

హరే కృష్ణ said...

she deleted tht post
i can send you the screen shot too!
still i have it! :)

తార said...

ఇప్పుడు చదివాను మీ టపా..

మొదటి పేరాలో మీరు చెప్పినవి అన్నీ మాకు బాగా అలవాటే, అదీ మంచు గారికి ఇంకా బాగా అట.

మీది గుంటూరు జిల్లానా? శివుడు నంది కధ, ఆ జిల్లాలో బాగా ప్రచారంలో ఉన్నది.

ఐతే లంకణం అనే మీ కంకణం అలా పోయిందన్నమాట..

లెగువు అనే పద వాడకం ఎక్కువ ఐపోతున్నది, అది మార్చగలరా టపాలో, లేక కావాలని వాడారా?

నేను మంచు గారిని చూసి వచ్చానమ్మ, ఆ హరే కృష్ణ తో పెద్ద పరిచయం లేదు.

nagarjuna said...

వార్నానోయ్...కామెంటు వేసి మాలికలో చకొరపక్షిలా ఎదురుచూస్తున్నాను ఇంతవరకు, అపర్ణగారు ఎపుడు బదులిస్తారా అని. ఎంతకీ reply లేకపోవడంతో అమాంతం ఇలా బ్లాగే ఒపెన్ చేసాను. అయ్యబాబోయ్ హరేకృష్ణగారు మాం.....చి కసిమీదే ఉన్నట్టున్నారు. కాబట్టి అపర్ణ జీ మీకో free ఉచిత సలహా ఏంటంటే నూరవ కామెంటు కొట్టేసినందుకు శిక్షలా కాకపోయినా మీరు దొరక్కబుచ్చుకున్న బంపర్‌లాటరీ కోసమైనా పార్టి ఇవ్వుడి..లేకపోతే కృష్ణగారి రెండేళ్ళ ఇండస్ట్రీ చిన్నబుచ్చుకుంటుంది...నిజంగా ధర్నాకు దిగినా దిగుతాం ;)

@తారాగారు: ఆస్తిలాంటిది వచ్చినా మంచుగారు సినిమా తీస్తారని నేననుకోను ఏ రీసర్చు లాంటిదో చేస్తారు. ఎవరిమీద ? దేనిమీద? అనిమాత్రం అడగొద్దు. అది నేనుఇక్కడ చెప్పకూడదు. కావాలంటే ఈ లింకు సూసుకొండి
http://manchupallakee.blogspot.com/2010/06/blog-post_21.html

nagarjuna said...

అపర్ణగారు మీరు నన్ను క్షమించాలి, మీరు పేరు చెప్పాక కూడా నేస్తం బ్లాగులో వేరే పేరుతో పిలిచాను మిమ్మల్ని....ఏమిటొ ఈ మధ్యన అమ్నీషియా పట్టేసింది :D

Sai Praveen said...

అపర్ణ,
అక్కడ సెంచరీ సంగతి ఎలా ఉన్నా ఈ గొడవ వల్ల మీ బ్లాగులో హాఫ్ సెంచరీ పూర్తయిపోయేలా ఉంది.

హరే కృష్ణ said...

అపర్ణ గారు
మీరు ఇక్కడ అడిగిన ప్రశ్న కి సమాధానం ఇవ్వలేదు
అందుకే మీకు అక్కయ్య బ్లాగులో నే సమాధానం చెబుతాను

హరే కృష్ణ said...

బ్లాగ్లోకం లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు, కరెక్ట్ గా follow up అయ్యామా లేదా అన్నదే ముఖ్యం (పోకిరి గుర్తు తెచ్చుకోండి) :)

హన్నా! ఇన్నన్ని మాటలంటారా


హేమిటి నా తోనే పోకిరి సినిమా తో పోటీనా!
కాచుకోండి

తిట్టి తిట్టి ప్లాటినాన్ని తిట్టి బంగారం బతికేస్తది
పట్టి పట్టి మా నరాలు మెలేసి బ్లాగులోకి లాగేస్తది
అసలేమయింది తెలియకుంది బాబోయ్
రాతిరంతా కునుకులేదు కామెంట్ పెట్టానురోయ్

ప్రసీద గారు ఎక్కడున్నా పీడి పెడతారురోయ్
పోకిరీ తో పిండుతోంది ఈ ఈ...

మనసు పలికే said...

తార గారూ! ధన్యవాదాలండీ.. అవునా "లెగువు" అన్న పదం ఎక్కువగా వాడానా..? ఆంటీ అలాగే అనేవాళ్లని బాగా గుర్తండీ. అందుకే అలా వచ్చేసి ఉంటుంది.:) మాది గుంటూరు జిల్లా కాదండీ..
నాగార్జున గారూ! హన్నా... హెంత మాట హెంత మాట.. క్షమించమని అడగడటమా..? మీరు అంత తప్పు ఏమీ చెయ్యలేదు లెండి.. నిజానికి మీరు నాకు పెట్టిన పేరు చాలా బాగుంది. కానీ నన్ను గుర్తు పెట్టుకోలేదే అన్న బాధతో అలా అన్నాను అంతే.. ఇక పార్టీ విషయానికి వస్తే, తప్పకుండా ఇస్తానండీ, మీ పార్టీ కి బిల్లు :). చాలా సంతోషంగా ఉందని చెప్పానుగా, మరి ఆ సంతోషాన్ని మీలాంటి స్నేహితులతో కాకపోతే ఎవరితో పంచుకుంటాను..?

మనసు పలికే said...

కృష్ణ గారూ!! మీరు సూ...పర్ అండీ..అద్భుతం.. ఏదో సరదాకి మొదలైన ఈ గొడవని కూడా పాటగా రాసేశారంటే, మీ గురించి మీ పోకిరి గురించి బాగా అర్థం అయిపోయింది.. ఇంత తెలిసి కూడా నేను మీతో పోటీ పడతానా..?? లేదు లేదు.. బుద్ధుడికి బోధి చెట్టు కింద ఙ్ఞానోదయం అయినట్లు నాకు నా బ్లాగు వ్యాఖ్యల్లో ఙ్ఞానోదయం అయింది.. :)

మనసు పలికే said...

సాయి ప్రవీణ్ గారూ!! మీరు కౌంటర్ చాలా బాగా maintain చేస్తున్నారు.. ధన్యవాదాలు ధన్యవాదాలు గుర్తు చేసినందుకు.. :)

Sai Praveen said...

హహ. నేస్తం గారి బ్లాగ్ లో వాపోతూ మీరు ఇచ్చిన లింక్ చూసి ఇక్కడికి వచ్చాను. ఈ గొడవ అంతా చూసి ఎన్ని కామెంట్స్ అని చుస్తే 40+ ఉన్నాయి. :)
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. discussion చాలా interesting గా ఉంది :)

హరే కృష్ణ said...

thank you thank you :)

హరే కృష్ణ said...

50 comments!
congrats :-)

తార said...

లెగువు అన్నది లేచి అన్న దాన్ని ఖునీ చెస్తే వచ్చేది.
వాడుట తగ్గించుకోగలరు.

మంచు said...

ఎంటి ఇంకా జరుగుతుందా డిస్కషన్ ...

మనసు పలికే said...

సాయి ప్రవీణ్ గారు, మీ ఊహ నిజమైంది. హాఫ్ సెంచరీ పూర్తి అయింది.. :)

హరే కృష్ణ గారు, ధన్యవాదాలు. అయినా ఇదంతా మీరే కదా మొదలెట్టింది. కాబట్టి ఈ క్రెడిట్ మీదే.

తార గారు, తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదాలండీ. తప్పకుండా తగ్గిస్తాను.

మంచు గారూ! ఏమిటి మీ ఉద్దేశ్యం.. ఇలా అభిమానగణం అంతా గొడవ పడుతూ ఉంటే సర్ది చెప్పడమో, లేదా మీరు కూడా ఎవరో ఒకరికి వంత పాడటమో పోయి ఇలా అంతా అయిపోయాక వచ్చి " ఇంకా జరుగుతుందా డిస్కషన్" అంటే దాని అర్థం ఏమిటి అని నిలదీస్తున్నాను యువర్ ఆనర్.

మంచు said...

ఆ... బ్లాగుకి స్వాగతం అని పిలిచి ..కనీసం కాఫీ టిఫిన్ కూడా ఇవ్వలేదని అలిగి వెళ్ళిపొయా

మనసు పలికే said...

మంచు గారూ!! ఏకంగా నేస్తం అక్క బ్లాగులో నేను పార్టీ ఇచ్చేస్తుంటే మీరు మరీనూ, కాఫీ టిఫిన్ల కోసం అలిగేసి వెళ్లి పోతారా..? తప్పు కదూ!

Sai Praveen said...

క్రిందటి సారి వచ్చినప్పుడు వ్యాఖ్యలు చదివాను కాని టపా చదవలేదు :)
భలేగున్నాయి మీ తిండి తిప్పలు. అయినా తినాలని బోల్డంత ఆశ ఉన్నా ఒళ్ళు కోసం డైటింగ్ చేయాల్సి వస్తోందని చాలా మంది బాధపడుతోంటే మీకు తినడానికి ప్రాబ్లెం ఎంటండి? :)

మనసు పలికే said...

సాయి ప్రవీణ్, ఏం చేస్తాం చెప్పండి.. కొన్ని బద్ధకపు జీవితాలు అంతే.. సరే అందరూ అలా తిడుతున్నారు కదా అని ఏదో కష్టపడి తింటానా.. ఎంత తిన్నా అంతే.. ఏదో ఒకరోజు నేను కూడా లావయ్యి చూపిస్తా అని ఎన్ని శపథాలు చేశాననుకున్నారు..? ఇప్పటికైతే నెరవేరలేదు మరి. ఎప్పటికైనా నెరవేరుతుందో లేదో చూడాలి మరి.

Ramakrishna Reddy Kotla said...

హ హ ...ఏంటో ఈ టపాకి సంబంధించిన వ్యాఖ్యల కంటే, నేస్తం ఫాన్స్ అసోసియేషన్ లో అంతర్గత కుమ్ములాట వ్యాఖ్యలు ఎక్కువ అయ్యాయి...కామెంట్స్ ఆద్యంతం అలరించాయి :-))

మనసు పలికే said...

కిషన్ గారు, మీరన్నది నిజం. అసలు టపా కి సంబంధించిన వ్యాఖ్యల కంటే, నేస్తం గారి అభిమానగణం కుమ్ములాట ఎక్కువైపోయింది. ఇదంతా హరే కృష్ణ గారి చలవే.. కానీ, ఈ గొడవ జరిగేంత సేపూ కడుపు నొప్పి వచ్చేంతలా నవ్వాను నేను మాత్రం.:)

మధురవాణి said...

బాగున్నాయండీ మీ తిప్పలు. డిగ్రీలోకి వచ్చేదాకా నావీ ఇంచుమించుగా ఇలాంటి తిప్పలే! ఇప్పుడేమో అన్నీ రివర్స్ తిప్పలు. అనే, సన్నగా అవ్వడానికన్నమాట! :( నందీశ్వరుడి కథ బాగుంది. నాకిప్పుడే తెలిసింది ఈ కథ! :)

మనసు పలికే said...

హహ్హహ్హ.. మధురవాణి గారూ, నేను మీ "బరువు బాధ్యతలు" టపా చూశానండీ.. సో మీ కష్టాలు నాకు తెలుసు.. :( బాధ పడకండి, Fat transformation కి ఏదైనా ఉపాయం ఘాట్టిగా ఆలోచించేసి మీ బరువు నాకు కొంచెం ఇచ్చెయ్యండి. అప్పుడు ఇద్దరి బాధలూ తీరిపోతాయి.. ఏమంటారు..?

Sasidhar Anne said...

baga rasaru.. naa cousin kooda inthey tinadu.. nene dagagravundi.. Tinipistha...
Nannu enni sarlu tittukonivuntundo..:)

మనసు పలికే said...

శశిధర్ గారు, ముందుగా నా బ్లాగుకి స్వాగతం:) ధన్యవాదాలు నా "తిప్పలు" మీకు నచ్చినందుకు.
నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా.. నాలాగా చాలా మంది ఉన్నారని తెలియగానే :) మీ cousin కి ధన్యవాదాలు చెప్పండి, నాకు తోడుగా ఉన్నందుకు.