Wednesday, September 8, 2010

"నేను" నేనే..

మరిప్పుడేమో.. నేను ఎప్పుడో ఇంటర్ లో ఉన్నప్పుడు రాసుకున్న కవిత ఒకటి మీ మీదకి వదులుతానంట.. మీరంతా దాన్ని చకా చకా చదివేసి నన్ను పొగిడెయ్యాలంట..;) లేకపోతే నేను కచ్చే అంట..:)

ఎవరి రంగంలో వారు గొప్పవారే..
ఒక కృష్ణ శాస్త్రి.. ఒక ఐన్ స్టీన్..
ఒక డావిన్సీ.. ఒక మదర్ థెరిస్సా..

ఎవరి దృక్పథంలో చూస్తే వారిది మంచే..
ఒక అరుణ్ శౌరి.. ఒక బిన్ లాడెన్...
ఒక దేవదాసు.. ఒక నేను..

ఎన్ని సార్లు అనుకున్నానో.. సాహిత్యంలో కృష్ణ శాస్త్రినవ్వాలని..
ఇంకెన్ని సార్లనుకున్నానో.. ఐన్ స్టీన్ గుర్తింపు నాకుండాలని..
డావిన్సీ కుంచె నాచేతికొస్తే బాగుండుననుకున్న సందర్భాలు లెక్క లేవు..
ఎన్నో సార్లు థెరిస్సాకే అమ్మనవ్వాలనిపించింది..

ఒకనాటి కృష్ణ రజనిలో..
నా కనుపాప నిశ్శబ్ధంగా..
కను రెప్పల చాటు నుండి స్వప్నాలను ప్రసవిస్తుంది..
తనకే సంబంధం లేదన్నంత అమాయకంగా..
ఆ కలల పరంపరలోనే..
అందర్నీ చూస్తాను నాలా..
నన్ను చూసుకుంటాను అందరిలా..

అంతలోనే కనుపాప ఏదో గుర్తొచ్చిన దానిలా.. చప్పున కళ్లు తెరుస్తుంది..!
తన లోగిలిలో ఏముందో చూద్దామనేమో..
అదేంటో నేను, నేనుగానే ఉంటా..
రాత్రి తాలూకు స్వప్నాలను ఏరుకోవడం కోసం విఫలయత్నం చేస్తూ ఉంటాను..
స్వప్నాలు కదా..! దొరకవు.

మొదట.. నిరాశగా.. తరువాత.. రాజీ పడుతూ..
ఆ తరువాత అమితానందంతో..
"నేను"..
నేనుగానే ఉంటాను..
నేను నేనుగానే ఉండాలనుకుంటాను..
తెలుసు కదా.. ఎవరికి వారు గొప్పే..:):)

51 comments:

Anonymous said...

నేను మూర్చపోయా.. తెలివి వచ్చాక పొగుడుగా

హరే కృష్ణ said...

ఫస్ట్ కామెంట్ నాదే
మరో వందకి సిద్ధం కండి :)

ఇందు said...

బాగుందండీ మీ ఇంటెర్ లో వ్రాసిన కవిత ....ఎవరికి వారు గా ఉండబట్టే కృష్ణశాస్త్రి గరికి,ఐన్ స్టీన్ కి,థెరిసా కి గుర్తింపు వచ్చింది...మీకు మీరుగా ఉన్నందువల్ల మీకు ఎప్పటికైన గుర్తింపు వస్తుందిలెండి :)

Anonymous said...

Baagundi....Andaru great eee

sivaprasad said...

super sooper

వేణూశ్రీకాంత్ said...

"మరిప్పుడేమో.. నేను ఎప్పుడో ఇంటర్ లో ఉన్నప్పుడు రాసుకున్న కవిత ఒకటి మీ మీదకి వదులుతానంట.. "

అప్పుడు మేమేమో పైన బొమ్మలో చూపిన అమ్మాయి లాగా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతామంట.. :P

ha ha Jokes apart, కవిత బాగుంది.

చందు said...

stop not till the goal is reached !!!
prayatna lopam vundakudadu kada !

:-)

..nagarjuna.. said...

ఒకనాటి కృష్ణ రజనిలో..
నా కనుపాప నిశ్శబ్ధంగా..
కను రెప్పల చాటు నుండి స్వప్నాలను ప్రసవిస్తుంది..
తనకే సంబంధం లేదన్నంత అమాయకంగా..



ఈ లైన్లు బావున్నయ్...Keep it up

3g said...

నాలుగవ పేరా బాగుంది...(పేరా అనకూడదేమో).. అంటే మిగతావి బాగోలేదనుకొని కచ్చాలు అవి అనకండి. ఇది బాగా నచ్చిందంతే!!
Q: ’కృష్ణ రజనిలో’ అంటే ఏమిటి? వివరింపుడు?

srikanth jessu said...

మీ కవిత చాలా బాగుంది.. :)
"థెరిస్సాకే అమ్మనవ్వాలనిపించింది.." - Its an amazing dream/thouhght..


నాకు నా చిన్న నాటి కల గుర్తుకోచింది.. " నేను బిల్ గేట్స్ తో పోటి పడాలని అనుకునే వాడిని "..

నీహారిక said...

మీరు మీలాగే ఉండగలగడం ముఖ్యం. నాకు నచ్చింది మీ కవిత.

శే.సా said...

సూపరు గా ఉంది కవిత. భలే రాసారు.
పదాలు, భావము, అర్థము కేక.

(హమ్మయ్య బాగా పొగిడేసా. మరి పార్టి ఎప్పుడు? )

శే.సా said...

>> కను రెప్పల చాటు ..
..నన్ను చూసుకుంటాను అందరిలా..

నాకు బాగా నచ్చింది :)

హరే కృష్ణ said...

మొదట కామెంట్ నాది కాదు :( :(
యూ బ్లా స తరుపున నాకు ఎవరో ఒకరు అపాలజీ చెప్పాల్సిందే!

మనసు పలికే said...

అయ్యయ్యో.. తారగారూ.. తారగారూ... ఉన్నారా..?? ఇంకా లేవలేదా..:(

@కృష్ణ.. హహ్హహ్హా.. నీది మొదటి కామెంట్ కాదు కదా.. సో.. నో వంద..:)

@ఇందు గారూ.. ఏదీ నోరు తెరవండి.. చెక్కెర పోస్తాను..ఇంత చల్లటి వార్త చెబితే నోరు తీపి చెయ్యకుండా ఎలా ఉంటానండీ..! ధన్యవాదాలండీ..:)

@ Anonymous గారూ.. ధన్యవాదాలు నా కవిత నచ్చినందుకు..:)

@ శివప్రసాద్ గారూ.. ధన్యవాదాలండీ.:)

@ వేణు శ్రీకాంత్ గారూ.. హహ్హహ్హా. ధన్యవాదాలు..:)

@ సావిరహే గారూ. మీరు చెపింది నిజమండీ ప్రయత్న లోపం ఉండకూడదు.:) తప్పకుండా ప్రయత్నిస్తా.. ధన్యవాదాలు..

@ నాగార్జున..:) ధన్యవాదాలు my firend..

3g గారూ..:) ధన్యవాదాలు. నిజానికి నేను రాసింది కవితో కాదో కూడా నాకు తెలియదు. :( సో మీరు దానిని ఏమన్నా పర్వాలేదు..;)
కృష్ణరజని అంటే దట్టమైన చీకటి/రాతిరి. ఇది నాకు తెలిసిన అర్థం, అదే అర్థం లో వాడాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే పెద్దలు తెలుపగలరు..:)

@ శ్రీకాంత్ గారూ, ధన్యవాదాలు..:). మరి పోటీ ఎంతవరకు వచ్చింది.. సావిరహే గారు చెప్పినట్లు ప్రయత్న లోపం ఉండకూడదు.

@ నీహారిక గారూ ధన్యవాదాలు..:)

@ శేషేంద్ర సాయి గారూ, పార్టీ కోసం పొగిడారా...:(
అయినా పర్వాలేదు, నేను నిజంగా పొగిడినట్లే తీసుకుంటాను..:)) ధన్యవాదాలు..

@ కృష్ణ.. ఎవరు చెప్పాలి చెప్పు..

అందరూ ఇది చదివి తార గారి లాగా మూర్ఛపోతారనుకున్నాను..:) అందరికీ నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది..:) హమ్మయ్య.. నా కడుపు నిండిపోయింది..

హరే కృష్ణ said...

నాకు కాటు బెల్లం కావాలి

నేను said...

headerloni photo baavundi.

అరుణాంక్ said...

నేను నేను గా నే ఉండటం " ఉందాలను కుంటాం.కాని సమాజంలొ ఎన్నొ శక్తులు మనలను ప్రభావితం చేస్తాయి.అవినీతి లొ పాలు పంచు కొ కూదదు అని కుంటాం .కానీ రెవెనుఎ అఫిస్ లో నో ఆర్ టి ఒ ఆఫిస్ లో నొ తలదించక్ తప్పదు.
మీ కవిత చాల బాగుంది .రాస్తుండండి.

శిశిర said...

అవును. ఎవరికి వారు గొప్పే. :) చాలా బాగా రాశారు.

సంతోష్ said...

..
bagundi..
nice

:-)

మనసు పలికే said...

@ హరే కృష్ణ.. నాకు కాటు బెల్లం అంటే తెలియదు. అదేంటొ చెప్పు, అప్పుడెప్పుడో తార గారికి ఇంకా శివరంజని కి కొరియర్ చేసినట్లు నీకు కూడా చేసేస్తాను..:)

@ బద్రి గారు, ధన్యవాదాలు..:)

@ అరుణాంక్ గారు, మీరు చెప్పింది అక్షరాలా నిజం.. తల దించక తప్పదు.:( కానీ మన వంతు ప్రయత్నం ఉండడంలోనే కదా జీవితానికి అర్థం దాగుంది.:)

@ శిశిర గారు, ధన్యవాదాలండీ..:)

@ సంతోష్ గారు, ధన్యవాదాలు..:)

బులుసు సుబ్రహ్మణ్యం said...

పొగుడుతూ మిమ్మలని
రాద్దామనుకున్నాను ఓ కవిత
భాషా లేదు కవిత్వమూ రాదు
అయినా
అందుకోండి నా అభినందనలు

మనసు పలికే said...

సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలు.చాలా సంతోషంగా ఉంది. ఈరోజుకి ఈ పొగడ్తలు చాలు. కడుపు నిండిపోయింది..:) మళ్లీ రేపు పొద్దున్నే ఎవరైనా పొగిడెస్తే బాగుండు, బ్రేక్ ఫాస్ట్ తినే బాధ కూడా తప్పుతుంది..:)))

హరే కృష్ణ said...

అందుకే నేను పొగడలేదు
నువ్వు లోకం మర్చిపోయి అన్నం తినడం మానేస్తున్నావ్
ఇదేం బాగాలేదు అపర్ణ :)

నేను కూడా మూర్చపోయాను
నన్ను ఇంకా తారను మోసుకెళ్ళడానికి నువ్వు అన్నం తినడం మర్చిపోకేం :)

అశోక్ పాపాయి said...

ayyoyyo nenu eppude choosa......

మనసు పలికే said...

కృష్ణ.. ఇది అన్యాయం. నేను దీనిని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను.. నిన్ను తార గారిని నేను మోసుకెళ్లాలా..?? పాపం అనిపించడం లేదూ నన్ను చూస్తే..??:(


అశోక్.. నువ్వెప్పుడు చూసినా పర్వాలేదు. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నన్ను పొగుడుతావని..:))) ఎప్పుడు పొగిడావన్నది important కాదు. పొగిడావాలేదా అన్నదే important..:)) హిహ్హిహ్హీ..

..nagarjuna.. said...

వేణూ శ్రీకాంత్‌ గారి కామెంట్ రచ్చో రచ్చ....చదివాక నవ్వాగలేదు. బుడుగు మాట్లాడుతున్నట్టే ఊహించుకున్నా... :) :)

@హరే: యుబ్లాస లో అప్పాలజీలు నిషేదించామోయ్...మిగతావాళ్లు మనల్ని అసలు సీరియస్‌గా తీసుకోవట్లేదు.

అశోక్ పాపాయి said...

ఆ కవిత వ్రాసి మీకు మీరే గొప్ప అని నిరుపించుకున్నారు మీరు అలాగె వ్రాస్తూ వుండండి ఎదో చిన్నవాడినైన నా నుండి మంచి గుర్తింపు వుంటుంది...నాకు సాటి లేదు పోటి అనక నాకు నేనే సాటి అంటున్నారు that's good

Sai Praveen said...

చాలా బాగుంది అపర్ణ. keep it up.
ఇంటర్ చదివే వయసు లోనే ఇంత మంచి కవిత రాయడం చాలా గొప్ప విషయం.
ఇక పొతే ఆ యు.బ్లా.స అనగానేమి. అది ఎప్పుడు ఏర్పడినది? అందులో నేను ఉన్నానా లేనా?
ఏంటో కొన్ని రోజులు బిజీ గా ఉండేసరికి నాకు తెలియకుండానే ఏంటేంటో జరిగిపోతోంది ఇక్కడ.

భాస్కర రామిరెడ్డి said...

మనసు పలికే గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

హారం

నేస్తం said...

అపర్ణ మొన్నే చదివా నీ కవిత..కాని కొద్దిగా పని ఉండి కామెంట్ లేటు... చాలా బాగా రాసావు... బాగుంది :)

మనసు పలికే said...

నాగార్జున..:(((

అశోక్.. ధన్యవాదాలు..:))

సాయి ప్రవీణ్ గారు, హహ్హ.. ఎంత ఆనందంగా ఉందో మీ వ్యాఖ్య చూశాక..:) ధన్యవాదాలండీ..
ఇక యు.బ్లా.స. గురించి నాకన్నా కృష్ణ లేదా నాగార్జున అయితే బాగా చెప్పగలరు..:))

భాస్కర రామిరెడ్డి గారు, క్షమించాలి ఆలస్యంగా శుభాకాంక్షలు చెబుతున్నందుకు. ధన్యవాదాలండీ.. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు..:)

నేస్తం అక్కా..:))) ఎప్పుడు వ్యాఖ్య పెట్టినా పర్వాలేదక్కా..:)) మీరు నన్ను పొగిడారు అది చాలు..హిహ్హి.:) చాలా చాలా థ్యాంక్స్ అకా..:)

శివరంజని said...

అపర్ణ : హాలిడేస్ అని ఊరికి వెళ్ళాను అందుకే నీ పోస్ట్ చూడ లేదు ........ చాలా చాలా బాగుంది . నీకో విషయం తెలుసా నకస్సలు కవితలు రావు ..అలాంటిది నువ్వు ఇంటర్లోనే ఇంతా బాగా రాసావు పైగా డిగ్రీ లో అంత బాగా పెయింటింగ్స్ వేసావు ... .... నీలో చాలా టాలెంట్ ఉంది ... .మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను సుమా ..i feel jealousy

మనసు పలికే said...

హమ్మయ్య.. శివరంజనీ వచ్చేశావా..:) నీగురించే అనుకుంటూ ఉన్నాను ఎక్కడికెళ్ళిపోయావా అని :))
ఆహా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నువ్విలా పొగుడుతూ ఉంటే..;) ఈరోజు కూడా నాకు భోజనం అవసరం లేదు.
కవితలు రావా.. నువ్వు రాసెయ్యి. ఎవరు పొగడరో నేను చూస్తాను. నాకు మాత్రం వచ్చా ఏంటి. ఏదో ఇలా రాసేస్తే చూడు ఎంత మంది పొగిడేస్తున్నారో..హిహ్హిహ్హీ..

Sasidhar Anne said...

bane vundi , bagoledu ani cheppalenu... intial lines lo continuation ledu.. kani chivarlo mee bhavam baga chepapru..
i know inter lo antha intellectual ga rayatam kastam.. anyway good one.. keep going..

ps:- inter lo chadivini.. physics patale gurthulu meeku appudu rasina kavithalu kooda gurthuvuynnaya..?

మనసు పలికే said...

శశిధర్ గారు, ధన్యవాదాలు.:) చాలా సంతోషంగా ఉంది ఫ్రాంక్ గా చెప్పినందుకు..:) హిహ్హ్హి.. మీ డవుట్ నాకు అర్థం అయింది. నాకు గుర్తు లేవండీ బాబూ నేను నా కవితలు కథలు అన్నీ కలిపి ఒక డైరీ లో రాసుకునేదాన్ని ఎప్పటికప్పుడు. ఆ డైరీ దాచిపెట్టుకున్నాను. సో.. అప్పుడప్పుడూ మీ అందరి మీదకి ఇలా అవన్నీ వదలాలని నా కుట్ర. బ్లాగు లో అయితే ఎప్పటికీ ఉండిపోతాయి కదా.. డైరీ అంటే నేను పారేసుకోవచ్చు.. అందుకే.. :))

సవ్వడి said...

అపర్ణ! చాలా బాగా రాసావు.
నీ బ్లాగు చూద్దామని అనుకుంటూనే ఉన్నాను. కాని కుదరలేదు. ఇప్పుడు చూసాను.
నేను కవిత లో "క" కూడా రాయలేను.
నీ కవిత బాగుంది. కొత్తవి కూడా రాయాలి మరి.

మనసు పలికే said...

@ సవ్వడి, చాలా సంతోషంగా ఉంది నీకు నా తవిక నచ్చినందుకు..:)) నిజానికి నాకు కూడా 'క' రాదు, అందుకే 'త' తో మొదలు పెట్టాను..:)) కొత్తవంటే చూడాలి మరి. నా మొదటి టపాలోనే పెట్టాను కదా నన్ను నేను కోల్పోయాను అని..:( మీ అందరి ప్రోత్సాహం ఉంటే తప్పకుండా ప్రయత్నిస్తాను రాయడానికి.

Anonymous said...

ఎన్నో సార్లు థెరిస్సాకే అమ్మనవ్వాలనిపించింది..
>>

అమ్మ'నవ్వా'లనిపించడం ఏమిటో..
అమ్మన్యవ్వాలనిపించి కరెక్ట్ అనుకుంటా..
(అమ్మని అవ్వాలనిపించింది = యణాదేశ సంధి) మరి పెద్దలు చెప్పాలి...

మనసు పలికే said...

తార గారు,
>>అమ్మ'నవ్వా'లనిపించడం ఏమిటో..
అమ్మన్యవ్వాలనిపించి కరెక్ట్ అనుకుంటా.

ఇంత అర్థం ఉందని నాకు తెలియదండీ.. ఏదో మిడి మిడి ఙ్ఞానం..:( క్షమించేద్దురూ..:)
తప్పుని తెలియ జేసినందుకు ధన్యవాదాలు.:)

..nagarjuna.. said...

’అమ్మన్యవ్వాలని’...నేనెక్కడా వినలేదు కొత్తపదం క్రింద పదకోశంలో చేర్చుకుందామంటే వాకే...., ’అమ్మనవాలనిపించింది’ అంటారు జనరల్‌గా

..nagarjuna.. said...

బ్లాగుల్లోనే ఎక్కడో చదివాను ’అమ్మని’ అని తెలుగులో ఉండదు, అది నవాబుల కాలంలో మనపై పడిన ప్రభావం. తెలుగులో ’అమ్మను’ అనాలట

Anonymous said...

>>’అమ్మని’ అని తెలుగులో ఉండదు,

బాగా పట్టావు..

అమ్మను+అవ్వాలి, ఇప్పుడు సరిగ్గా పలుకుతుంది, కానీ అది కలిపితేనే అక్కడో తేడా అర్ధం వస్తుంది..
కానీ అది నేను తీయడం భావ్యం కాదు అని, ఇలా చెప్పాను.

నాగ్ ఏ సంధో కుడా చెప్పు మరి..

Anonymous said...

>>’అమ్మన్యవ్వాలని’...నేనెక్కడా వినలేదు
ఇంతవరకూ బానే ఉన్నది.

>>కొత్తపదం క్రింద పదకోశంలో చేర్చుకుందామంటే వాకే
దీనర్ధం ఏమి నాగ? అంటే నీకు తెలియని పదాలు అన్నీ కొత్తవనా? లేక నీకు తెలుగులో ఉన్న పదాలు అన్నీ తెలుసనుకోవాలా?

పదకోశంలో చేర్చక్కర్లేదు, ఇది కొత్తపదం కాదు, మరి దీని అర్ధం తెలుసుకోగలవేమో ప్రయత్నించు.

Anonymous said...

అమ్మని,అమ్మణి, అమ్మను, మూడు తెలుగు పదాలూ ఉన్నాయి, కానీ వేరు వేరు అర్ధాలతో..

మనసు పలికే said...

అయ్యబాబోయ్.. ఇవన్నీ నాకు కొత్త విషయాలే.. తార గారు, నాగార్జున.. చాలా చాలా థ్యాంక్స్ ..:)

Anonymous said...

అమ్మను + అవ్వాలనివుంది = అమ్మనవ్వాలనివుంది
ఉకారసంధి.
ఇంక తేడా అంటారా - అమ్మ + నవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఇలాగైతే తెలుగు పద్యాలు ఏం చదువుతారు?

..nagarjuna.. said...

అమ్మణి = అమ్మాయి (?)
అమ్మను = తల్లిని, సరుకు అమ్మను అనే అర్ధంలో
అమ్మని = అంటే నాకు తెలవదు... :(

పైదే తెలియదు. ఇక దానితో సంధి కుదుర్చుకొని తయారైన ’అమ్మన్యవ్వాలని’ అంటే అసలే తెలియదు....పండితులు, ధర్మప్రభువులు ఎవరైనా చెప్పండయ్యా....

మనసు పలికే said...

పెద్దలు, పండితులు, ధర్మప్రభువులు.. ఎవరో గాని, కాస్త నాకు కూడా చెప్పండయ్యా.. ఇంతకీ నేను రాసింది తప్పా..? కాదా..?? అంటే మళ్లీ వాడాలంటే కాస్త జాగ్రత్త పడాలి కదా..:)

3g said...

అపర్ణ గారూ ఎంతఎత్తుకి ఎదిగిపోయారండీ..... మీతవికలో పదాల్ని పట్టుకొని పరిశీలించి, పరిశోదించి ఒక్కొక్కళ్ళు పి.హెచ్ డి లు చేసేసి డాక్టరేట్ లు తీసేసుకొనేలా ఉన్నారు.

Arun Kumar said...

.చాలా బాగా రాసావు... బాగుంది :)