Tuesday, September 21, 2010

నేను - నామనసు

టపా రాయాలి. చాలా రోజులు అయిపోయినట్లుంది నా "మనసు పలికి". కానీ, ఏం రాయాలో ఎలా రాయాలో  అసలు ఎందుకు రాయాలో అర్థం కాక; అదేదో సినిమాలో బాబూమోహన్ అనుకున్నట్లుగా "ఎందుకు? ఏమిటి? ఎలా?" అన్న ప్రశ్నలు టక టకా అడిగేసుకున్నాను నా మనసుని. కానీ నా మనసేమన్నా చాకోలేట్స్ తినే చిన్న పిల్లా ఇలా బుజ్జగించి అడిగితే చెప్పెయ్యడానికి. నేనంటే మహా కోపం దానికి.. అది చెప్పిన మాట విననని. అందులోనూ,  చాలా రోజులుగా పలికించకపోయేసరికి నా మనసు బద్ధకరత్న బిరుదుని సంపాదించుకుని హాయిగా ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. పది రోజులకేనా అని నోరెళ్లబెట్టకండి. బద్ధకం ఆపాదించుకోడానికి 10 రోజులు చాలా తక్కువ సమయం అని తెలిస్తే నా మనసు ఇగో చాలా హర్ట్ అవుతుంది..
అంత బద్ధకంగా వర్షాకాలంలో ముసుగుతన్ని నిద్రపోతున్న నా మనసుని ఇలా హఠాత్తుగా నిద్ర లేపి పలకమంటే ఏం పలుకుతుంది పాపం..? కాస్త ఆలోచించుకోవాలి కదా.
అందుకే.. నాకు ఎలా సమాధానాలు చెప్పాలో అలాగే చెప్పింది.
మరే.. ఎందుకు రాయాలి అని చాలా మర్యాదగా, సవినయంగా అడిగి చూశాను. పనీ పాటా లేక అని సమాధానం వచ్చింది..:(
పోనీ రెండో బాణం అన్నా తగలక పోతుందా అని "ఏమిటి?" అని అడిగేసి ఎంత పొరపాటు చేశానో తరువాత కానీ అర్థం కాలేదు.

కథలు*** ఎబ్బే.. మనకి సరిపోవు. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద బ్లాగరులు బ్లాగరిణి లు కథల మీద కథలు రాసేసి కామెంట్ల మీద కామెంట్లు కొట్టేసి అందులో తల, బ్లాగు పండి పోయి ఉన్నారు. ఇక నువ్వు మొదలెట్టావనుకో ఆ బ్లాగే వాళ్లకంతా కథల మీద విరక్తి వచ్చెయ్యొచ్చు..

పాటలు *** మరద్దే.. ఎకసెక్కాలంటే.. పాటల పరువు తియ్యకు. (నీ జీవితానికి పాటలు రాయడం ఒక్కటే తక్కువ ఇప్పుడు అన్నట్లు) వచ్చేసింది కదా సమాధానం... ఇంకేం చూస్తున్నారు..:(

జోకులు*** హిహ్హిహ్హ్హి.. నువ్వు జోకులు టపా చేస్తున్నావంటేనే నవ్వు వచేస్తుంది. తరువాత ఎవ్వరికీ నవ్వు రాకపోవచ్చు.. లైట్ తీస్కో...

సినిమా రివ్యూలు*** ముందు కొత్త కొత్త సినిమాలు మొదటి రోజో మొదటి వారం లోనో చూడటం నేర్చుకో.. తరువాత రాద్దువులే రివ్యూలు..

బొమ్మలు?? ***  వెయ్యక వెయ్యక రెండు బొమ్మలు వేసి పెట్టావ్.. ముందు పూర్తి కాని ఆ బొమ్మని పూర్తి చెయ్యి.. లేదా ఇంకో నాలుగు కొత్త బొమ్మలు వేసి అప్పుడు పెట్టు "నీ పిచ్చి గీతలు" టపా.

ఫోటోలు *** తార గారన్నట్లు రెండు లక్షలు కొట్టు కెమెరా పట్టు.. పోస్ట్ పెట్టు.. (నా ఆర్థిక స్థోమత తెలిసి కూడా...)

పోనీ.... క..వి..త..లు.. *** వద్దమ్మా వద్దు.. నువ్వు కవితలని మొదలెడితే అవి కాస్తా తవికలయ్యి కూర్చుంటున్నాయి..దయచేసి అంత సాహసం చెయ్యొద్దమ్మా..

ఇదంతా కాదు, అసలు నిన్నడిగేదేంటని నా ఙ్ఞాపకాలు స్మృతులు అన్నీ కలిపి ఒక దండగా పేర్చేసి మీ అందరి ముందు ఉంచేద్దామనుకున్నానా.. మరి మనసనే దారం లేకుండా ఎలా.?? :( మాయాబజార్ సినిమాలో యస్.వి.రంగారావు లాగా.. యమలీలలో సత్యనారాయణ లాగా ఒక పెద్ద నవ్వు నవ్వేసి నా మనసు నన్ను కించ పరిచేసి గాయ పరిచేసి ముక్కలు ముక్కలు చేసేసింది..
సామాన్య, సాంఘిక, గణిత, అర్థ, జీవ, పౌర, భౌగోళిక, ఇంకేదైనా శాస్త్రాలు, చరిత్ర సహాయం చేస్తాయేమో అని కూడా చూశాను. అబ్బే.. అవన్నీ చదివేసి చాలా యుగాలు గడిచిపోయినట్లు ఉంది. ఇక రాజకీయం, మన ఒంటికి/ఇంటికి పడదు.. ఇంకేం చేస్తాం..? నోరు మూసుకుని, చెవులు తెరుచుకుని మనసు చెప్పింది వినడం మొదలెట్టాను.
ఎంత విన్నా ఏం లాభం చెప్పండి. చెప్పే మనసుకి వినే మనుషులు లోకువన్నట్లు.. అన్నీ అవకతవకలే.. అన్నీ బ్లాగర్లు భయపడి పారిపోయే ఆలోచనలే.. ఒక్కటైనా సరిగా చెప్పవు కదా నువ్వు అనుకుంటూ(తిట్టుకుంటూ) వింటూ ఉన్నాను.
ఇంత కష్ట పడి వింటూ ఉన్నానా..? కొంచెమైనా జాలి పడాలి కదా.. ఉహు.. ఇంతా చేసి, ఇప్పుడు మత్తులోంచి బైటికి వచ్చినట్లుంది. సినిమాల్లో హీరోకో హీరోయిన్ కో ఆక్సిడెంట్ అయ్యి తలకి పెద్ద గాయం తగిలి "ఎవరు నేను..? ఎక్కడున్నాను..?" అన్నట్లుగా "అసలేం జరిగింది ఇప్పటి వరకూ..? నువ్వు నన్నేమైనా హింసించావా..?" అని నన్నే హింసించడం మొదలెట్టింది..:(
ఇంకేం చేస్తాను.. ఈ సారి చెవులు కూడా మూసేస్కుని పరుగందుకున్నాను..
ఇదిగో.. మిమ్మల్నే..
పెద్ద పెద్ద.. గొప్ప గొప్ప బ్లాగర్లూ.. కాస్త సాయం చేద్దురూ..
" ఏం రాయాలి..? ఎలా రాయాలి.? ఎందుకు రాయాలి..?"
మీ ఋణం వెంటనే తీర్చుకుంటాలే.. మీ టపాల్లో కామెంటేసి..;-)

57 comments:

రాజ్ కుమార్ said...

first comment naade...

రాజ్ కుమార్ said...

ఘటోత్కచుడు సినిమాలో యస్.వి.రంగారావు.
ఘటోత్కచుడు కాదండి.. మాయ బజార్ లో యస్.వి.రంగారావు...:)
ఘటోత్కచుడు లో కూడా సత్తి బాబే చేసేడు..
తార గారన్నట్లు రెండు లక్షలు కొట్టు కెమెరా పట్టు.. పోస్ట్ పెట్టు.. ఏమిటి మిమ్మల్ని కూడా అడుగుతున్నార ? :)
ఏమి రాయాలో తెలియటం లేదని టప వేశార? బాగు..బాగు ..

మనసు పలికే said...

హహ్హహ్హ.. తార గారు నన్ను అడగలేదు వేణురాం గారు, మిమ్మల్నే అడిగారు. అది చూసే రాశాను..:)
మీ టపాలో కమెంటలేకపోతున్నాను. కొంచెం ఆ కామెంట్ బాక్స్ స్టైల్ మార్చకూడదూ... మీకు వీలైతేనే లే.
భలే చెప్పారు. నిజమే కదూ, మాయాబజార్ లో కదూ యస్.వి.రంగారావు. మనసు నిద్దరోతే ఇలాగే ఉంటుంది.. ధన్యవాదాలు..:)

హరే కృష్ణ said...

:-) :-)

బులుసు సుబ్రహ్మణ్యం said...

వ్రాయడానికి ఏమీ లేదంటూనే ఓ టపా వేసేసి, పైగా మమ్మలని, What, why, how అంటూ డబాయించేయడం ఏంబాగాలేదని నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఇది చూసింతర్వాత నేనుకూడా ఇల్లాగే ’నే నెందుకు వ్రాస్తున్నాను, మీబుర్రలు తినడానికి’ అని ఓ టపా వేసేయ్యాలని డిసైడైపోయాను. థాంక్శ్ ఫర్ ది ఐడియా.

భాను said...

బాగుందండి, మీ బ్లాగు ప్రహసనం..మొత్తానికి ఏదో బ్లాగేశారు చివరికి.. బాగుంది.

హరే కృష్ణ said...

మిగిలిన ఒకే ఒక్క మార్గము
స్కాన్లు తీసి పెట్టేసేయ్ నువ్వు చదివిన పుస్తకాలూ రాసుకున్న నోట్సులు :)

రెండు లక్షలు కాదు అపర్ణ
మూడు లచ్చలు కెమెరా విలువ


పెద్ద పెద్ద.. గొప్ప గొప్ప బ్లాగర్లూ.. కాస్త సాయం చేద్దురూ..
మేము చాలా చిన్న బ్లాగర్లముఈ పోస్ట్ కి కామెంట్ రాసే అర్హత లేదు అని కామెంట్లు రాయడం లేదు చాలా మంది ఆ లైన్ తీసెయ్ :)

experts ని అడగాల్సిందే :)

..nagarjuna.. said...

అప్పుడెపుడో క్రీస్తు పూర్వం ఇలాంటి పరిస్తితుల్లోనే బ్లాగారాం గాడు నాకు ఇచ్చిన సందేశం ఇది, నీకు పనికొస్తుందేమో...
"ఇనప ముక్క, వలపు చెక్క, మనిషి తిక్క కాదేది బ్లాగుకనర్హం...........కావాలోయ్ బ్లాగావేశం......కాబట్టి నే చెప్పొచెదేటంటే.....నువ్వు ఇది అది అని లేకుండా నీకు తోచింది బ్లాగిపారెయి....."

..nagarjuna.. said...

కాంప్లిమెంట్లు గట్రా ఇద్దామంటే 'LOOOOOOL' ను రౌడిగారు, LOl100, LOl40 గట్రా కృష్ణప్రియగారు, మంచుగారు పేటెంటు తీసుకున్నారు....హ్మ్...ఇక నేను సరికొత్తగా తెలుగులో నవ్వుతాను...

లో.....ళ్లు :) (లో పక్కన 5 చుక్కలతో లోళ్ )

శిశిర said...

:) మనలో మన మాట. పెద్ద పెద్ద గొప్ప గొప్ప బ్లాగర్లు ఎవరైనా మీకు చెప్తే నాక్కూడా చెప్పండే. నేను కూడా మీ ఋణం తీర్చేసుకుంటా.. :)

శ్రీను .కుడుపూడి said...
This comment has been removed by the author.
Sai Praveen said...

నేనో సూపర్ ఐడియా చెప్పనా?
'సాయి ప్రవీణ్ నెల నుంచి కొత్త టపా ఎందుకు రాయట్లేదు' అన్న విషయం మీద కొంచెం పరిశీలన ,పరిశోధన చేసి ఒక టపా రాయి. నాకు ఉపయోగపడచ్చు :D
@నాగార్జున
"ఇనప ముక్క, వలపు చెక్క, మనిషి తిక్క కాదేది బ్లాగుకనర్హం"
అదిరింది :)

రహ్మానుద్దీన్ షేక్ said...

బావుంది బ్లాగు ఎ విషయమై రాయాలి, అంటూనే మా వంటి కొత్త బ్లాగర్లకు ఒక బ్లాగు ఎలా రాయాలో చెప్పకనే చెప్పారు
థ్యాంక్లు

3g said...

>>జోకులు*** హిహ్హిహ్హ్హి.. నువ్వు జోకులు టపా చేస్తున్నావంటేనే నవ్వు వచేస్తుంది

అవును నిజమే.....లోళ్ళూ.

ఏంరాయాలో తోచకపోతే ఏమీరాయకండి. ఓకెమేరా ముందేసికొని భరతనాట్యమో, బ్రేక్ డేన్సో చేసి అప్లోడ్ చేసిపడెయ్యండి జనం ఎందుకుచూడరో చూసుకుందాం.

శే.సా said...

మొన్న రాసిన తవికల్లాంటివి రెండు రాయండి :)

Unknown said...

చాల బగనె రసెసి ఎమిరయలొ తలియలెదు అనడములొ మిరె బెస్టు సుమి

Unknown said...

చాల బగనె రసెసి ఎమిరయలొ తలియలెదు అనడములొ మిరె బెస్టు సుమి .

శివరంజని said...

నాకు ఏమి రావు రావు అంటూనే ఇంత బాగా రాసేస్తున్నావు ...ఇంకా ఏమి కావాలి అంత ఆశ పని చేయదు అపర్ణ ....

పెద్ద పెద్ద గొప్ప గొప్ప బ్లాగర్లు ఎవరైనా నీకు సాయం చేస్తే నాకు కూడా చెప్పవా ...

నువ్వు చెప్పావనుకో నీకు రెండు లక్షలు కాదు పది లక్ష (సోప్స్) లు ఇస్తాను… ఆ లక్స్ సోప్స్ కి వచ్చిన గోల్డ్ కాయిన్స్ కూడా నీకే ఇస్తాను ..డీల్ ఓకే నా

రాజ్ కుమార్ said...

మనసుపలికే garu కామెంట్ బాక్స్ స్టైల్ marchitini. :)

Sasidhar Anne said...

emi rayali emi rayali ani chalane rasaru..:)

nagarajuna garu cheppinatte ...
Arati thokka, kobbari chippa, thadi matta kadedhi blog ki anarham.. raseyandi edo okati..

మనసు పలికే said...

@ బులుసు సుబ్రహ్మణ్యం గారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా..??:(
>>’నే నెందుకు వ్రాస్తున్నాను, మీబుర్రలు తినడానికి’
హిహ్హిహ్హి.. సూ..పర్ ఐడియా..

@ భాను గారు, ధన్యవాదాలు..:) నిజమే మొత్తానికి ఏదో బ్లాగేశాను..

@ కృష్ణ..
>>స్కాన్లు తీసి పెట్టేసేయ్ నువ్వు చదివిన పుస్తకాలూ రాసుకున్న నోట్సులు :)
నిజం చెప్పు. నీ టపాలో పెట్టిన ఆన్సర్ పేపర్ నీదే కదూ..;)
నువ్వు కూడా Expert కదా.. సహాయం చెయ్యొచ్చు కదా కొంచెం..

@ నాగార్జున, మీ బ్లాగారాం భలే ఐడియా ఇచ్చాడు.. అంతే అంటావా.. అలా తోచింది రాసేస్తే బ్లాగర్లు చదివేస్తారా..? :(
ఎంతైనా వ్యాఖ్య పెట్టడంలో నీకు నువ్వే సాటి..:) నీ తెలుగు నవ్వు చాలా బాగుంది..:)

@శిశిర గారు, తప్పకుండా..:)) అలా గొప్ప గొప్పోళ్లంతా ఇచ్చిన సలహాలతో మనిద్దరం కూడా గొప్ప బ్లాగర్లైపోదాం..

@ తువ్వాయి గారు, ఇది మీ విషపు చుక్కలు టపాలో పెట్టవలసిన వ్యాఖ్య కదూ..:)

@ సాయి ప్రవీణ్.
>>'సాయి ప్రవీణ్ నెల నుంచి కొత్త టపా ఎందుకు రాయట్లేదు' అన్న విషయం మీద కొంచెం పరిశీలన ,పరిశోధన చేసి ఒక టపా రాయి. నాకు ఉపయోగపడచ్చు :D
కేక.. :)

@రహ్మనుద్దీన్ గారు, నేనా..? బ్లాగు ఎలా రాయాలో చెప్పకనే చెప్పానా..?? ఎప్పుడబ్బా...!

@ 3g గారు,
>>ఓకెమేరా ముందేసికొని భరతనాట్యమో, బ్రేక్ డేన్సో చేసి అప్లోడ్ చేసిపడెయ్యండి జనం ఎందుకుచూడరో చూసుకుందాం
నా మీదకి టమాటాలు, గుడ్లు విసురుతారేమొ..:(

@శేషేంద్ర సాయి గారు, మరి మీరు తప్పకుడా చదవాలి.. :)

@ సురేష్ గారు, హిహ్హిహ్హి.. ధన్యవాదాలు..

@ రంజని, నీకు భలే భలే గొప్ప ఐడియాలు ఎలా వస్తాయబ్బా..? నాకు కూడా చెప్పవూ.. నాకేవరైనా గొప్ప గొప్ప బ్లాగర్లు సలహాలు ఇస్తే శిశిర గారితో పాటు నీకు కూడా చెప్పేస్తా..:)

@ వేణురాం గారు, ధన్యవాదాలు..:)

@ శశిధర్ గారు, మీరింతగా చెప్పాలా.? ఇక చూస్కోండి నా తడాఖా.. :)

నేస్తం said...

నాక్కూడా కామెంట్ అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలీ అని డవుటొచ్చింది చివరకు ఎందుకు?ఏమిటి? ఎలా? అని ఆలోచించడం కంటే అదంతే!! అనుకోవడం లో గొప్ప సంతృప్తి ఉంది అని ఇలా రాసేస్తున్నా :)

మనసు పలికే said...

హహ్హాహ్హా.. నేస్తం అక్కా మీరు కామెంట్స్ పెట్టి కూడా నవ్వించేస్తారు.. ఇంతకీ చాలా సంతృప్తి పొందినట్లున్నారు ఎందుకు ఏమిటి ఎలా అన్న ప్రశ్నలు వేస్కుని :))

..nagarjuna.. said...

ఆఖరకు వేణురాంతో కూడా కామెంట్‌ బాక్స్ మార్పించావా...(ఈ సంధర్భంగా నీకు ’మార్పుశిఖామణి’ అవార్డు వస్తుందేమో కనుక్కో )!! హుమ్....ఇలాకాదుగాని మీ అఫీసువాడెవడో చెప్పు, శివరంజని ఇస్తానన్న ఆ రెండులచ్చలు, తారగారి ఇంకో రెండు లచ్చలు ఆఫీసోలకిచ్చి ఆళ్లనే మార్చేయమంటే సరి...

ఆ.సౌమ్య said...

మరీ మీరలా మొహమాటపెట్టేస్తే చెప్పక తప్పేలా లేదు. ఏం చేస్తాం పెద్ద బ్లాగర్లు అని మమ్మల్ని పిలిచీసేరుగా :).....కానీ చెప్పాలంటే మరి కూసింత కర్సవుద్ది, తట్టుకోగలవా పిల్లా?????

హరే కృష్ణ said...

ఖర్చు అంటే మూడు లక్షలు అవుతుంది :)

మార్పుశిఖామణి గారి నాయకత్వం వర్ధిల్లాలి

Anonymous said...

నా కెమెరా రెండు లక్షలు కాదు, మూడున్నార, పైన లెన్స్ కి ఒక లక్ష..

రెండు లక్షలు - వేణురాం.
ఒక లక్ష - మంచు పల్లకీ
ఒక లక్ష - నేస్తంగారు
మిగతాచిల్లర యాభైవేలు ఆ.సౌ.

వీళ్ళు ఇస్తారేమో అని కొత్తగా ఒక ఎకౌంట్ కుడా తెరిచి పెట్టాను, (పాతది ఆంధ్రా బ్యాంక్ వాడికి ఆన్లైన్లో అవుతుందో అవదో వాడికే తెలియదు అందుకని ఐ.సి.ఐ.సి.ఐ లొ తెరిచా).

తీరా ఇప్పుడు వేణురాం ఏమో కట్నం డబ్బులు రాగానే అంటున్నాడు, ఆ కొరియా వాళ్ళు ఇస్తారో లేదో మరి కట్నం.

మంచు ఎమో వేణు తనకి ఎదో కెమెరా తెస్తానన్నాడు అది వచ్చాక, వందకి రెండొందల డాలర్లు తిసుకోని ఫొటోలు తీసి పోగేసి అంటున్నాడు.

నేస్తంగారు మైసూర్ పాక్ ఒంగోలుది పంపితే అప్పుడు అని, ఆ.సౌ. ఎమో డబ్బులు అప్పు అనగానే శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు అని పాట ఒకటి వినిపిస్తున్నారు..

చూశావా మరి, ముందు మాట ఇచ్చి, డబ్బులు ఇచ్చే సమయానికి ఎలా దాటేస్తున్నారో..

మనసు పలికే said...

@ నాగార్జున,
>>ఈ సంధర్భంగా నీకు ’మార్పుశిఖామణి’ అవార్డు వస్తుందేమో కనుక్కో
సూ..పర్ ఐడియా.. ఇస్తారంటావా..?? నేను రెడీ తీసుకోడానికి.. :)

@ సౌమ్య గారు, హహ్హ.. తప్పకుండా తట్టుకోగలను.. మీరలా సలహాలు పడేసుకోండి, ఖర్చు సంగతి నే చూసుకుంటా.. :)

@ కృష్ణ, 3 లక్షలా..? నేను రెడీ అని చెప్పేశానుగా.:)
>>మార్పుశిఖామణి గారి నాయకత్వం వర్ధిల్లాలి
ఇంకో సారి అనవా బాగుంది..;)

@ తార గారు,
>>చూశావా మరి, ముందు మాట ఇచ్చి, డబ్బులు ఇచ్చే సమయానికి ఎలా దాటేస్తున్నారో
అంతేనండీ అంతే.. ఇప్పుడు నేను కూడా పైన ఇచ్చిన మాట మీద నిలబడతాననుకున్నారా..?? ష్.. చెప్పకండి ఎవరికీ. నేను కృష్ణ కి, సౌమ్య గారికి ఇవ్వను డబ్బులు..:))

హరే కృష్ణ said...

మూడు లక్షలు గురించి మీ రాక్షసి కి చెప్పొద్దు సరేనా :-)
ఇద్దరు ఉన్నారని మరో లక్ష పెంచినా పెంచేస్తారు

నా స్వరపేటిక నా చేతులు అరిగిపోతున్నాయి
అయినా కూడా అంటున్నా
మార్పుశిఖామణి గారి నాయకత్వం వర్ధిల్లాలి

మనసు పలికే said...

శివా.. రంజనీ.. ఎక్కడున్నావు..? నిన్ను మన కృష్ణ ఎంత మాట అన్నాడో చూశావా..? నేనే తిట్టేద్దాం అనుకున్నాను కానీ, నేను అడిగినందుకు పాపం తన స్వరపేటిక అరిగిపోతున్నా కూడా "మార్పుశిఖామణి గారి నాయకత్వం వర్ధిల్లాలి" అంటున్నాడు..:):)

అశోక్ పాపాయి said...

I have some answers for your Q and hopefully for you

You can if you want about anything.Just start writing and see what happens as you write. amazing topics can come to mind if you just start writing your thoughts

inspiration and motivation comes from many places.why not your blog? blog about something that inspired and motivated you but also find ways to write to inspire others. challenge your readers way of thinking.Change their minds. also You have good opportunity Change your things

don't think iam not a good writer share your pains and gains with blog readers. you have good opportunity become a blog guru:-)

మనసు పలికే said...

అశోక్.. నాకొక కొత్త కోణాన్ని చూపించేశావ్..:) ధన్యవాదాలు..:)
అయితే నన్ను బ్లాగు గురు అయిపోమంటావా..? నువ్వలా ప్రోత్సహిస్తూ ఉండు. ఖచ్చితంగా అయిపోతాను..
నిజానికి నేను బ్లాగుని ఇంత సీరియస్ గా ఎప్పుడూ తీసుకోలేదు.. సరదాగా మొదలు పెట్టాను.. అలాగే కంటిన్యూ చేస్తున్నాను. కానీ బ్లాగు ద్వారా కూడా చాలా మంచి పనులు చెయ్యొచ్చని అర్థం అయింది :)
ధన్యవాదాలు అశోక్..

శివరంజని said...

అయ్య్ నన్నెవరు ఇక్కడ రాక్షసి అని అంటా ....నేను వర లక్ష్మీ దేవి ప్రతిరూపం అని ఎన్నిసార్లు చెప్పాలి అంటా ????

Unknown said...

Proof lu emaina unnaya sivaranjani garu

శివరంజని said...

@బ్లాగ్ చిచ్చు గారు: హ... హ... హ....
"ఫ్రూప్ లు " లేవు నా దగ్గర బంగారం తో చేయించిన వరలక్ష్మి దేవి "రూపులు" ఉన్నాయి ....
ఇప్పుడైనా ఒప్పుకుంటారా నేను వరలక్ష్మి దేవి ప్రతి రూపమని

Unknown said...

Bangaram unda meere oka bangaramaa naku icheyandi 3 lakhs tara ki ichi migata money nenu aparna garu panchukuntam

Unknown said...

Blogsikhamani ani pilichiNa hare ki 2 lakhs aparna ichestaru

మనసు పలికే said...

బ్లాగ్ చిచ్చు గారు, మీరు ఎన్ని చెప్పినా నేను శివకి వ్యతిరేకంగా మాట్లాడేది లేదు..:)
కానీ మనిద్దరం పంచుకుందాం అంటుంటే మధ్యలో కొంచెం టెంప్ట్ అయ్యాను. కానీ మళ్లి కృష్ణకి ఇచ్చెయ్యమన్నారు కాబట్టి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీకు సపొర్ట్ ఇవ్వాలా శివకి ఇవ్వాలా అని... హిహ్హిహ్హీ..

Unknown said...

Siva ki support ivvandi siva bangaram ni naku ivvandi hare tara meeru panchukondi

మనసు పలికే said...

హహ్హహ్హ.. బ్లాగ్ చిచ్చు గారు, బాగుంది మీ ఐడియా.. ఎవరి మనోభావాలు దెబ్బతినవు అప్పుడైతే..:)

కొత్త పాళీ said...

కొంచెం కష్టమే, మనసు కోఆపరేషన్ లేకుండా బ్లాగు రాయాల్నంటే.
మనసు సహకరించకపోతే సహాయం చేసేందుకు ఇంకోడున్నాడు - బుర్రగాడు. కానీ వాడసలు మహా బద్ధకిస్టు. వాడితో పడలేక చివరికి మనసే నయమని దాన్నే బతిమాలుకుంటారు :)
Keep writing.

PS. Can you do anything about removing the ads that popup while commenting? Thanks

మనసు పలికే said...

ఆహా.. కొత్తపాళీ గారు, నా బ్లాగు పావనమయ్యింది..:)) బోలెడన్ని ధన్యవాదాలు కామెంటినందుకు..
>>వాడితో పడలేక చివరికి మనసే నయమని దాన్నే బతిమాలుకుంటారు :)
అంతేనంటారా..? :(
>>PS. Can you do anything about removing the ads that popup while commenting? Thanks
నాకు మీరు చెప్పింది సరిగా అర్థం కాలేదు.. అంటే, మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఏవైనా Adds వస్తున్నాయా.? క్షమించాలి.. అవి ఎలా తియ్యాలో నాకు తెలియదు కొత్తపాళీ గారు, ఏదైనా సహాయం చెయ్యగలరా..?

రాధిక(నాని ) said...

:)మీ టపాలన్నీ చాలా బాగున్నాయండి.

జ్యోతి said...

అపర్ణగారు,

ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు. సమయానికి తగు అన్నట్టుగా మనసు ఎలా చెప్తే అలా చేసేయండి.
మీరు పెట్టిన widgeo విడ్జెట వల్ల పాపప్స్ వస్తున్నాయి. అది తీసేయండి.

మనసు పలికే said...

@ రాధిక గారు, నా బ్లాగులోకి స్వాగతం అండీ..:) ధన్యవాదాలు నా టపాలు(అన్నీ) మీకు నచ్చినందుకు.. :))

@ జ్యోతి గారు, మీకు కూడా స్వాగతం అండీ నా బ్లాగులోకి.. అంతే అంటారా..? మనసు చెప్పినట్లు విని బుద్ధిమంతురాలి లాగా నడుచుకోమంటారా..? మరి మీరంతా నా మనసు చెప్పే సోది వింటా అంటేనే సుమా..;) ధన్యవాదాలు జ్యోతి గారు..
ఒక గాడ్జెట్ తీసేశాను.. ఇప్పుడు రాకపోవచ్చు అనుకుంటున్నాను పాపప్స్.. ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య ఎదురైతే నాకు తెలుపగలరు.. అలాగే దానికి సొల్యూషన్ కూడా.;)

..nagarjuna.. said...

’బ్లాగ్ గురువు’గారితో బ్లాగు ’మార్పుశిఖామణి’ గారికి తర్ఫీదు..., బాగు బాగు :)

మనసు పలికే said...

నాగార్జునా.. నాకిప్పుడే ఒక మహత్తరమైన ఐడియా వచ్చింది.. మీరంతా కలిసి నాకు ఇచ్చిన బిరుదు బాగుంది. నా ప్రొఫైల్ పేరు కూడా మార్చేస్తా అదే పేరుతో..:)))
హిహ్హిహ్హీ..

హరే కృష్ణ said...

ఇక్కడ రిప్లై ఎవరు ఎవరికి ఇస్తున్నారు :)

హరే కృష్ణ said...

50th కామెంట్ ఎవరిదీ

హరే కృష్ణ said...

సరే అందుకో ఆభినందనలు
:)

కొత్త పాళీ said...

ఈ సారి పాపప్ రాలేదు. ధన్యవాదాలు.
You might benefit from this
http://te.chavakiran.com/blog/?p=1105

The key is to keep writing. Write regularly and consistently.

మనసు పలికే said...

ధన్యవాదాలు కృష్ణ.. ఇంకెవరిదీ.. 50/100/200 అనగానే ప్రత్యక్షమైపోతావుగా..:))) నీదే..

కొత్త పాళీ గారు, హృదయపూర్వక ధన్యవాదాలండీ.. మీరిలా సలహాలిస్తూ ఉండండి.. నేను అల్లుకుపోతాను..:) చావా గారి టపా ఇంకా చదవలేదు.. చదివి మళ్లీ వ్యాఖ్య పెడతా.. :))

శ్రీను .కుడుపూడి said...

Sorry andi..

సవ్వడి said...

నాకూ అదే డౌట్ సుమా! ఎందుకు? ఏమిటి? ఎలా?
ఏం పోస్ట్ పెట్టాలి అని ప్రతి నెల ఆలోచిస్తూనే ఉంటాను. కాని వెంటనే సమాధానం దొరకదు.:)

స్నిగ్ధ said...

అపర్ణ గారు, సారి చాలా చాలా ఆలశ్యం గా మీ బ్లాగులో కామెంటుతున్నాను...మీ టపా అదుర్స్...చదువుతున్నంతసేపు నేను ఆలోచించింది పేపర్ సారీ ఇక్కడ బ్లాగులో పెట్టినట్లు అనిపించింది..:) ఇప్పుడు నేను మీ దగ్గర సలహా తీసుకోవచ్చన్నమాట...

మనసు పలికే said...

స్నిగ్ధ గారు.. ముందుగా మీకు బోలెడు బోలెడు ధన్యవాదాలు, ఎక్కడో లోపల ఉన్న టపాని పట్టుకుని మరీ వ్యాఖ్య పెట్టినందుకు:) అదేంటండీ.. నా టపా అంతా చదివి, అర్థం చేసుకుని మరీ మళ్లి నన్ను సలహాలు అడుగుతారు ఏం రాయాలి అని ;) అది తెలియకే కదా ఇది పెట్టింది :))))

స్నిగ్ధ said...

మీ బ్లాగుని తరచూ చూస్తుంటాను ఏం చేతనో కామెంటడం కుదరలేదు..అందుకని సారి...:)
ఇహ పోతే మీరు ఏం రాయాలో తెలియక ఈ టపా రాసారు..దానికి మన బ్లాగ్లోకపు ఎక్స్ పర్ట్స్ సలహాలు ఇచ్చారు..ఆ ఙ్ఞానాన్ని(అన్ని సలహాలు రంగరించిన) కొంచెం నాకు పాస్ చేస్తారని అడిగా...:) నా బ్లాగుని దర్శించినందుకు ధన్యవాదాలు...