నా హృదయం ప్రార్ధిస్తోంది నా హృదయ స్పందన విను
జీవితం అనే కాలం లో కొన్ని మధురమైన క్షణాలను నీకు అందిస్తా
నేను శ్వాసిస్తున్న ఊపిరిని నీతో పాటు పంచుకుంటా
నీ కోసం ఎవరైనా గాలిస్తే ..నా కళ్ళల్లో వెతకమని చెప్పు..
ప్రతి కదలిక లో పుడుతుంది ఒక కొత్త దారి
వెళ్తున్న ప్రతి దారీ కావచ్చు మరొక కొత్త మలుపు
నీ పరిచయం అయ్యాక తెలుసుకున్నా నువ్వే నా మజిలీ
కవిత్వం లో నిశబ్దం గుర్తెరిగిన అనుభూతి నీ తోడు.
నా హృదయం అనే గది లో వెదజల్లు పరిమళం నువ్వై..
నువ్వే నా అపూర్వం .. నువ్వులేని నేను అసంపూర్ణం..
30 comments:
మొదటి భాగం బాగా అర్దమయింది & బావుంది...రెండొదాంట్లో భావుకత్వం అర్ధంకాలా..ఎంతైనా ఇంజనీరు బుఱ్ఱ కదా :)
>>నీ కోసం ఎవరైనా గాలిస్తే ..నా కళ్ళల్లో వెతకమని చెప్పు.. <<
:) :)
...............
చాల బాగుంది కవిత ఫోటో కూడ సూపర్...మీరు కవితలు కూడ వ్రాస్తారా??
baagundandi mi kavita .
బాగుంది చివరి లైన్ నువ్వే నా అపూర్వం .. నువ్వులేని నేను అసంపూర్ణం....నాకు నచ్చింది. ఇకపోతే. "నేను శ్వాసిస్తున్న ఊపిరిని నీతో పాటు పంచుకుంటా" శ్వాసిస్తున్న ఊపిరే తనయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా.. మీ కవిత బాగుంది
hey! baagundi mee poetry. Nice feelings... :)
>>>>>>>>>>>>>>>>>>>>>>>
శానా బావుంది
కాస్త పెద్దగా రాస్తే నీ సొమ్ము ఏం పోయింది ..నా మూడు లక్షలు ఎలానో పోయాయి కదా ofcourse
నాగార్జున రాసిన వాళ్లకి అర్ధమైతే పర్లేదా :))
>> నా హృదయం అనే గది లో వెదజల్లు పరిమళం నువ్వై..
నువ్వే నా అపూర్వం .. నువ్వులేని నేను అసంపూర్ణం..
These lines are wonderful.
చాల బాగుంది
bagundi,last line inka bagundi
this is chakradhar
http://namanobavalu.blogspot.com/
mee mail id aenti sir?
నాగార్జున ధన్యవాదాలు..:)
3g గారు, "......" అర్థమేమి చెప్మా..!!
అశోక్ గారు, ధన్యవాదాలు.. ఏమోనండీ నేనేదో రాద్దామని కూర్చుంటే అది ఇంకేదో అవుతుంది..
రాధిక గారు, ధన్యవాదాలండీ..:)
శివ ప్రసాద్ గారు, ధన్యవాదాలు.
భాను గారు, ధన్యవాదాలు..:) ఆహా భలే మంచి లైన్ చెప్పారు..:)) మళ్లీ ధన్యవాదాలు..
ఇందు గారు, చాలా థ్యాంక్స్..
హరే, ధన్యవాదాలు..:) ఏమో అలా రాసేశాను..
భాస్కర రామి రెడ్డి గారూ, ధన్యవాదాలండీ..:)
చిన్ని గారు, థ్యాంక్స్ అండీ..
చక్రధర్ గారు, ధన్యవాదాలు..:)
>>"......" అర్థమేమి చెప్మా..!!
అంటే ఏం చెప్పాలో అర్ధంకావట్లేదు అని అర్ధమండి.
>>>నీ కోసం ఎవరైనా గాలిస్తే ..నా కళ్ళల్లో వెతకమని చెప్పు..
Beautiful. చాలా బాగుంది.
నువ్వే నా అపూర్వం .. నువ్వులేని నేను అసంపూర్ణం.
అద్భుతం గా ఉంది మనసుపలికే..!
ముక్కలు ముక్కలుగా చదివితే బానే వుంది.
"జీవితం అనే కాలం లో కొన్ని మధురమైన క్షణాలను నీకు అందిస్తా ", "నీ పరిచయం అయ్యాక తెలుసుకున్నా నువ్వే నా మజిలీ " ఈ lines గురించి మాత్రం నేను మాట్లడను :P
మనసు పలికే గారు ఈ విధంగా కూడా పలుకుతున్నారా.
గుండె లోతుల నుండి గీతాలు పలికిస్తున్నారు. శుభం. ఇంకా కొన్ని పలికిస్తారని ఆశిస్తున్నాం
3g గారు,
............. (నాక్కూడా అర్థం కాలేదు మరి ఏం రాయాలో..):D
శిశిర గారు, ధన్యవాదాలు..:)
వేణురాం.. ధన్యవాదాలు..:)
బద్రి గారు, అయితే ముక్కలు ముక్కలు గానే ధన్యవాదాలు..;)Just kidding..:)
మీకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదా.? :(
సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలండీ.. ఏదో ఇలాక్కూడా పలికించడానికి ట్రై చేస్తున్నాను..:)
అపర్ణ! బాగుంది.
<< కవిత్వం లో నిశబ్దం గుర్తెరిగిన అనుభూతి నీ తోడు. >>
ఈ లైన్ ని కాస్త వివరించవా....
అపర్ణగారు,
దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి శుభాకాంక్షలు అపర్ణ గారు.
మనసు పలికే గార్కి,
కొంచెం, ఒక రోజు ఆలస్యం గా చెబుతున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ పాఠకులకి అందరికి దీపావళి శుభా కాంక్షలు.
నా అర్ధం కాకపోవటాన్ని మీరు అపార్ధం చేసుకొన్నట్టున్నారు.నిజానికి మీరు రాసింది చదివింతర్వాత చాలా చాలా బావుందనిపించింది. సౌండ్ లేదని చెప్పాటానికి సింబాలిగ్గా అలా పెట్టానన్నమాట.
ఇక మీ శుభాకాంక్షలకి నా ప్రతి శుభాకాంక్షలు. మీరుకూడా దీపావళి కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకొని ఉంటారని ఆశిస్తున్నాను.
అపర్ణ మంచి కామెడీ పోస్ట్ లు ,అందమైన ఫొటోస్,పెయింటింగ్స్, కవితలు.... ఏమి అని చెప్పాలి నీ గురించి ... నీకు రానిది ఎదయినా ఉంటే చెప్పు తల్లీ అది నేను ట్రై చేస్తా ????????
Wow.. bavundi.. general ammayila kosam abbayila rase kavithalu chala chadivanu..
first time oka ammayi rasina kavitha ni chusthunna.. lines anni bavunnayi :)
@siva ranjani.. aparna ki vantalu ravu ani talk avi try cheyandi..
>>>>నీకు రానిది ఎదయినా ఉంటే చెప్పు తల్లీ అది నేను ట్రై చేస్తా ????????
అపర్ణ కి సారీలు చెప్పడం రాదంట..
సవ్వడి గారు, ధన్యవాదాలు..:) అలాంటివి అడక్కూడదమ్మా..;)
శిశిర గారు, వేణు శ్రీకాంత్ గారు, సుబ్రహ్మణ్యం గారు ధన్యవాదాలు..:) దీపావళి చాలా సంతోషంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను..
3g గారు, అలాగా.. అయితే ఓ.కే..:) చాలా చాలా థ్యాంక్స్..:)
రంజనీ.. ఇది అన్యాయం కదూ.. అసలు నీ కొత్త పోస్ట్ ఎక్కడ..? నీ శైలి నాకు ఎలా వస్తుంది చెప్పు.. నీ పోస్ట్‌లకు కడుపు నొప్పి వచ్చేలా నవ్వుకోడమే మాకు వస్తుంది..:))
శశిధర్ గారు,
>>first time oka ammayi rasina kavitha ni chusthunna.. lines anni bavunnayi :)
ఇది దారుణం.. అయినా సరే ధన్యవాదాలు కవిత నచ్చినందుకు..:)
>>aparna ki vantalu ravu ani talk avi try cheyandi..
ఎవరది.. ఎవరది.. చెప్పింది నాకు వంటలు రావని.. అయ్.. నేను గానీ గరిట గానీ తిప్పానంటే.. :))
కృష్ణ.. హహ్హహ్హా.. ఇంకా మూడు లకారాల చెక్కు కొరియర్ చెయ్యడం కూడా కదూ..;)
కనులుమూసుకొనుంటే కలల్లో వేదకాలేమో ....అవునాండీ :) మీ కవిత చాలా బావుంది.
పరిమళం గారు, హహ్హహ్హా భలే చెప్పారు..:) ధన్యవాదాలు..:))
Post a Comment