అటకటా.. అసలు నాకు బ్లాగుల గురించి ఎందుకు తెలియవలె.. తెలిసినదే పో.. వాటి గురించి నేనెందుకు పట్టించుకోవలె..? పట్టించుకుంటినే పో.. నాకు కూడా ఒక బ్లాగు ఉండవలెనని నాకేల అనిపించవలె..? అనిపించనదే పో.. ఆలోచన వచ్చిందే తడవుగా ఎందుకు మొదలు పెట్టవలె.. పెట్టితినే పో, ఆవేశం ఆగక అందరికీ ఎందుకు దండోరా వేయించవలె.. హయ్యో హత విధీ.. ఈరోజు ఇటుల ఎందుకు చింతించవలె..
అసలు ఇలాక్కాదు... అతను మా ఆఫీసులోకే ఎందుకు రావలె.? వచ్చినా మా ప్రాజెక్టు.. ఇంకా నా పక్క సీటే ఎందుకు ఎంచుకోవలె.? దీని పేరే కదూ ఖండ కావరం.. (కాదని చెప్పకండి.. చెప్పిన వాళ్లందరికీ ఒక్కో తిట్టు..)
నాకు తెలుసు మీరంతా ఏమి ఆలోచిస్తున్నారో. అసలు ఉపోద్ఘాతం ఏమీ లేకుండా ఇలా మాటర్లోకొచ్చేసి మీకు ఏమీ అర్థం కాని గోండు జాతి భాష సినిమా చూపించేస్తున్నాను కదూ.. చెబుతాను వినుకోండి. మరేమో మనకి కొంచెం ఆవేశం, ఆతృత, ఆశ, అత్యుత్సాహం ఇంకా అవీ ఇవీ ఎక్కువ కదా.. మన బలాగు సంగతి నాకు తెలిసిన వారికీ, తెలియని వారికీ, తెలిసీ తెలియని వారికీ బట్టీ కొట్టిన పాఠం లాగా అప్పజెప్పేశానా.. అదేంటో అందరూ నాకు మంచోళ్లే తగులుతారు.. ఎక్కువ మంచి కాని వాళ్లు తగులుతారు (అదేనండీ చెడ్డోళ్లు..). అలాంటి ఒక మంచి కాని పిచ్చోడి పేరు రాంబాబు.. ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక పేరు రాంబాబు.. గుర్ర్‌ర్ర్‌ర్ర్ (పేరు మార్చడమైనది )
పోనీలే పాపం, ఏదో ఫ్రెండే కదా అని మన బ్లాగు చదివే సదవకాశం ఉచితంగా చాలా సహృదయంతో ప్రసాదిస్తే దానిని సద్వినియోగ పరుచుకోకుండా ఇలా నన్ను నానా మాటలని, నన్ను నా బ్లాగుని ఇంకా చెప్పాలంటే బ్లాగుల్లో ఉన్న మన అక్కలూ అన్నలూ అందర్నీ కించపరిచేశాడు. మాట్లాడితే "మనసు పలుకుతుందా" అమ్మాయి ఉరుకుతుందా, ఎన్ని సంవత్సరాలైనా ఆ అమ్మాయి గమ్యం లేకుండా అలా పరిగెట్టేస్తూ ఉంటుందా, బ్లాగర్ సర్వర్ క్రాష్ అయిపోయే దాకా నీ మనసు పలుకుతూనే ఉంటుందా, అసలు అలసట రాదా... ఇలాంటి ప్రశ్నలు. ఒకవైపు ఆఫీసులో ఇష్యూస్కే టైం లేక ఇవాల్సిన అప్డేట్లు ఇవ్వకుండా ఉండిపోతుంటే రెండు బ్లాగుల్ని మేనేజ్ చేసే టైం ఎక్కడ దొరుకుతుంది.. ఇలాంటి ధర్మ సందేహాలు. మీరే చెప్పండి ఇదేమన్నా భావ్యమా..?
పనిలో ఉన్నప్పుడో, భోజనాలు చేస్తున్నప్పుడో ఏదో ఒక టాపిక్‌లో మొదలెట్టేస్తాడు.. మనసు పలికిందా అని. నా జీవిత కాలంలో ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక ఘడియలో నేనైనా మర్చిపోవచ్చేమో అసలు నాకంటూ ఒక బ్లాగు ఉందనీ, అందులో నేను అవీ ఇవీ గెలుకుతూ ఉంటానని. కానీ అతను మాత్రం మర్చిపోను గాక మర్చిపోడు. మనసు అన్న పదం కనిపిస్తే చాలు మనసు పలికే, ఆ వెనువెంటనే నేను కూడ గుర్తొచ్చేస్తాను. పోనీ అంతటితో ఊరుకుంటాడా అంటే, అది కాదే... నాకు గుర్తు చేసేసి, నన్ను కించపరిచేసి, ఏడిపించేసి, నా బ్లాగు ఫోటోలో ఉన్న అమ్మాయిని నానా మాటలనేసి గానీ వదలడు. అనేది నన్నొక్క దాన్నేనా..!! మన బ్లాగ్లోకాన్నంతా అనేస్తాడు.. నాకో డవుట్.. అసలిదంతా ప్రతి పక్షాల కుట్రా..? తీవ్రవాదుల చర్యా..? ఆల్‌ఖయిదా మతోన్మాదమా..? కాదు కాదు ఇదంతా పురుషాహంకారమే అని సవినయంగా మనవి చేసేసుకుంటున్నాను.
మీకిక్కడ మరో విషయం చెప్పాలి. ప్రపంచంలో చెడ్డ మనుషులెవరూ ఒక్కరే ఉండరు. వారికి ఒక కుడి భుజం ఉంటుంది. ఆ భుజం పేరు సోంబాబు (పేరు మార్చడమైనది ). ఎంచక్కా నా మిగతా స్నేహితులంతా చక్కగా చదివేసి "సూ..పరు, కేక, కెవ్వు, కత్తి, చాకు, బ్లేడు" ఇంకా వీలైతే "గునపం, గడ్డపార, ఱంపం" అని పొగిడేస్తూ ఉంటారా.. వీళ్లిద్దరేమో నన్ను నానా రకాలుగా హింసించేస్తూ ఉంటారు. వా..వా..:(:( ఏమన్నా అంటే ఎప్పుడూ పొగడ్తలనే కాదు విమర్శల్ని కూడా తీసుకోవాలమ్మా అంటారు..:( పోనీ చదివి విమర్శిస్తారా అంటే, విమర్శిస్తారు కానీ చదవరు. మొన్నొక రోజు పొరపాటున మన దగ్గర ఉన్న బ్రహ్మాస్తం వదిలా "మడిసన్నాక కూసింత కళా పోషణ ఉండాలి" అని. అనేసి ఎంత తప్పు చేసానో నాకు రోజుకి తొంభై ఆరు సార్లు తెలుస్తుంది (అదేం సంఖ్యా అని ఆలోచించకండి. పెద్ద లాజిక్కు ఏమీ లేదు. ఏదో అలా పెట్టేసా..) "మమ్మల్ని పోషించుకోవడమే కష్టంగా ఉంది.. ఇంక ఏ కళనని పోషించాలి.." అన్నది ఆ సమయానికి వచ్చిన సమాధానం (మరే.. ఇద్దరూ ఎముకల గూడు మీద తోలు కప్పినట్లుగా ఉంటారులే..) ఇంక ఆ తరువాత జరిగిన ప్రతి సంభాషణ లోనూ దీన్నేనా కళ అంటారు..? దాన్నేనా కళ అంటారు.. అంటూ వెధవ ప్రశ్నలు. వదిలెయ్యండి మహాప్రభో అంటూ అరిచి గగ్గోలు పెట్టినా నా గోడు విన్న పాపాన పోలేదు..చివరికి మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటూ ఉన్నా కూడా ఇది కూడా ఒక కళేనా.. ఏం పేరబ్బా అని ఎగతాళి చేస్తూ ఉంటారు..:( అలా వినీ వినీ ఈ మధ్య కళ అన్న పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నాను..

కోపంతో, నీ మీద పగ ప్రతీకారం తీర్చుకుంటానుండు అని చెప్పి, ఇదిగో ఇలా మనదైన స్టైల్లో కోపాన్ని వెళ్లగక్కుతున్ననమాట.. :((
హ్మ్.. ఇంతా తిట్టేసి, టపా రాసేసి ఇదిగో మీ గురించి ఈ టపా రాసాను అని చెబితే, విచ్చలవిడిగా సొంత పేరే రాసేసి టపా పెట్టుకో మళ్లీ దానికి అలియాస్ పేర్లు ఎందుకు ..అని నన్ను తీవ్రంగా కించపరిచేశాడు.
ఎంత ఖండ కావరం..!!!!!!!!
53 comments:
అమ్మోయ్, బాబోయ్ అనే మీ వ్యాఖ్యలగురించి వాళ్లకింకా తెలీదనుకుంటా. ( చెప్పేశానోచ్!)
మనలో మన మాట, ఇలా అంటారనే నేనెవరికీ చెప్పను.
హా హా..బాగున్నై మీ కళ కొచ్చిన కష్టాలు.. సుమన్ కి చెప్తే..కళంకిత2 తీస్తాడు.. :)
"అక్కలూ అన్నలూ అందర్నీ కించపరిచేశాడు" అవునా....? ఒరేయ్..రాంబాబు నిన్ను వేయిన్చేస్తాన్రా....
" ఖండ కావరం." అనగానేమి?
పోస్టు.. సూ..పరు, కేక, కెవ్వు, కత్తి, సుత్తి, చాకు, బ్లేడు గునపం, గడ్డపార, ఱంపం, బాణం, బల్లెం :) :)
హహహ వేణు రాం ఎక్కడినుండి వస్తాయి నీకు ఇలాంటి మాటలన్నీ .. కనబడవు కాని నువ్వు ....హన్నా
అయ్యయ్యొ! అపర్ణగారు...ఎన్ని కష్టాలొచ్చాయండీ...ఇలాంటివారు ఉంటారండీ...నేను తెలుగుబ్లాగ్ రాస్తున్నా అని తెలిసిన కొంతమంది ఇంగిలిపీసు మహానుభావులు...'అమ్మో! ఆ తెలుగు చదవడం మావల్ల కాదు...అయినా...ఏ పుస్తకాలో చదువుకుంటూ,పాటలు వింటూ ఉండక నీకెందుకు ఈ బ్లాగు గోల అవసరమా? ' అని కూడా అన్నారు.ఇంకొంతమంది....'ఏమ్మా! ఈమధ్య తీరిక బాగా ఎక్కువైనట్టు ఉంది..ఎడాపెడా తెగ రాసెస్తున్నవ్? ఇంకెన్ని బ్లాగులు పెట్టవేంటి?' అని వెటకారం చేసారు.అవన్ని పట్టించుకుంటే కష్టమండీ.వదిలేయండీ...అంతగా ఐతే...'నా బ్లాగు నా ఇష్టం..మీకేంటి కష్టం?' అని అనేయండీ...మనం మెత్తగా ఉంటే మొట్టేవాళ్ళు ఉంటూనే ఉంటారు.లేదంటారా..వీళ్ళింతే అని లైట్ తీసుకోండీ :)
ఇంకో ముఖ్య విషయం.మనం ఎప్పుడూ..ఎవరికీ సంజాయిషీ/వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..మనం ఏంటో తెలిసినవరికి అది అక్కర్లెదు...మనల్ని నమ్మని వారికి అది చెప్పినా ఉపయోగం లేదు.ఇది నేను పాటించే సూత్రం :)
very good, very nice
అయ్యో పాపం అన్ని కష్టాలొచ్చాయా?
రాంబాబుగాణ్ణి కొట్టేద్దాంలే అమ్మా, నువ్వూరికే పళ్ళునూరుకోమాకు, అసలే ముత్యాల పళ్ళు అరిగి పోగలవు.
ఉంటారు అపర్ణా కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళని ఏమి చెయ్యలేము.
>>ఇదంతా పురుషాహంకారమే అని సవినయంగా మనవి చేసేసుకుంటున్నాను.
ఈ ముక్క నాకు అస్సలు అర్ధం కాలేదని సవివరంగా మనవి చేసుకుంటున్నాను.
నా అనుభవాలు చెప్తే నువ్వు అభిప్రాయం మార్చుకుంటావు అని కూడా తెలియజేసుకుంటున్నాను.
ఒక సారి మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి నా బ్లాగు చూపిస్తే, ' ఏంటి సాయి, పని పాట లేక బ్లాగులు రాసుకుంటున్నావా' అంది. తను అన్న ఇంకొన్ని మాటలు ఇక్కడ రాస్తే....... ఎందుకులే.
ఇంకో అమ్మాయికి నా 'నగర జీవనం' కవిత చూపిస్తే 'హర్మ్యాలు' అని ఉన్న చోట 'ఇంటిదీ?.. హార్మోన్లా?' అనేసి హి హి హి అని ఇకిలించింది. ఆ క్షణం... నేను హంతకుడిని కాకుండా ఉండడానికి ఒకే ఒక్క కారణం నేను పూనేలో తను బెంగళూరులో ఉండడం.
అన్నట్టు అది ఖండ కావరం కాదు. కండ కావరం.
వేణురాం,
నీ డౌట్ చూసి నేను బ్రౌన్ నిఘంటువులో చూడగా తెలిసిందేంటయా అంటే... కావరము అంటే కొవ్వు. కండ కావరము అంటే పొగరు.
అక్కా,
వేణురాం కనిపించకపోవడం ఏంటి? తను వ్యాఖ్యల్లో రాసిన పంచ్ డైలాగులు అన్నీ కలిపి రాస్తే తోటరాముడి టపాని మించిన కేక లాంటి టపా తయారవుతుంది. :)
వాళ్ళు మాటల్తో మీతో పెట్టుకుంటే మీరు వాతల్తో (ర వత్తు కావాలనే రాయలే) పెట్టుకుంటున్నారన్నమాట :) And vice versa :))
ప్చ్ ప్చ్ ప్చ్....అసలు వాళ్ళకెందుకుటా....ఇక నుంచి నీ పని చూసుకోవోయ్....అనేసేయండి. అంతే మరి ఇంకేం చేస్తారు. అందుకే మన బ్లాగ్ లు బ్లాగ్లోకంలో మాత్రమే ఉండాలి.
ha ha..blog maintain chesthe ee mathram kastalu tappavu.. Nenu bangalore vacchaka.. ikkada maa project leader, telugu vade.. relocation details fill chesthu.. sasidhar anne ante nuvvu myreviews4all blog needena annaru . nenu ya anagane.."reviews baga rasthavoy.. nenu chaduvutha anagane"..
nenu recchipoyi thanks anna.. hmm anthe akkada nunchi mana bad luck start ayyindhi.. friday evening twaraga veldam ani ready avuthunte.. cinema ke ga repu vellavoy ani work ivvatam.. prathi one hour ki okasari.. ping chesi mari work chesthunna.. blogging aa ani question veyatam.. hathosmi.. enduku cheppa ra vadiki ani badha padani rooju ledu..
:) బాగా రాశారు. Good post.
రాంబాబు కి సొంబాబు కుడిభుజం అయితే మంచు బాబు ఎడమభుజం. ఎందుకొ నీకు తెలుసుగా :-)
మాట్లాడితే "మనసు పలుకుతుందా" అమ్మాయి ఉరుకుతుందా, ఎన్ని సంవత్సరాలైనా ఆ అమ్మాయి గమ్యం లేకుండా అలా పరిగెట్టేస్తూ ఉంటుందా..
తిట్టకండి కానీ దీనికి నేను చాల నవ్వుకున్నా.. చిత్రాలు కూడ బాగున్నాయి.ఇనా వదిలేయండి పాపం అలకమాని మీరు కూడ కొంచెం కిల కిలా నవ్వుదురూ :))
:D..enni kastalandi...
post bagundi..nannu chala mandi adugutharu..office lo neeku emi pani undadu kadaa...ani..chuste..maku office lo blogs block...vallandariki kullandi..manaku inni kalalu unnayi ani.. :P
కళా హ్రదయం లేని రాంబాబు , సోంబాబు , హమ్ :)
వాళ్ళపాపాన వాళ్ళు పోతారులే :)
నువ్వు భాదపడకమ్మాయ్
అపర్ణ కళా హృదయం లేని రాంబాబు ని సోంబాబునే కాదు వాళ్లని సపోర్ట్ చేసే మంచు బాబు పని కూడా చెప్పేద్దాం నీకు తోడు గా నేను సౌమ్యా ఉన్నాం
@వేణురాం గారు మీ కామెంట్ సూ..పరు, కేక, కెవ్వు, కత్తి, సుత్తి, చాకు, బ్లేడు గునపం, గడ్డపార, ఱంపం, బాణం, బల్లెం :) :)
ఎముకల గూడు మీద తోలు కప్పినట్టుండే వాడికి అంత ఖండ ఖావరము ఎక్కడి నించి వచ్చిందబ్బా? హాచ్చెర్యమాచ్చెర్యము.ఈ రాంబాబు మా పక్కింటి పంకజాక్షి కన్నా నయమే. "ఈ పిచ్చోడు బ్లాగుల్లో ఏదో బరికేస్తే చదివే వెర్రోళ్లు కూడా ఉంటారా?" అని ఆశ్చర్య పడిపోతుంది నన్ను చూసి.
మీటపాకి రెండు గునపాలు, ఓ గడ్డపార
అదే కదా సాయి.. "కండ కావరం " అంటే తెలుసు కానీ "ఖండ కావరం " ఏమిటి?? ఈ మనసు పలికే గారికి భాస్కర్ రామరాజు గారితో ప్రైవేటు చెప్పించాలి...
నేనా? పంచ్ లా?? మనకంత సీనుందా? :) :) ఏదో నీ అభిమానం...
శివరంజని గారు థాంక్స్ అండి..:)
సుబ్రహ్మణ్యం గారు... కామెంట్స్ కేవ్వుమనిపించారు..
శివరంజని గారు .." మంచు బాబు పని కూడా చెప్పేద్దాం" అదంతా వీజీ కాదు..
మంచు బాబు తో జాగరత్త.. ముంచేస్తారు.. :) ముందా సోంబాబు సంగతి సూడండి... ఆడిని ఏటి సెయ్యాలి చెప్మా? ఆ... బలుసు గారిచ్చిన గునపాలు ఉన్నాయ్ కదా.. ఎసేయ్యండి.. ఏమైనా అయితే హరేకృష్ణ చూసుకుంటాడు.. :)
@ Bulusu .. ఈ గునపాలు గడ్డపార ఏంటి సార్? కొత్త రేటింగు సిస్టమా?
నువ్వేం బాధపడకు అప్పూ, ఆ రాంబబు, సోంబాబు సంగతి మనం చూద్దం. రౌడిలని పంపించి వాళ్ళ చర్మతో చెప్పులు కుట్టిద్దాం. కలా పోసన లేని విగతజీవులు. వాళ్ళ సంగతి త్వరలో తేలుద్దాం. ముందు ఎడమభుజం సంగతి చూద్దాం. రంజని చెప్పేసిందిగా...మనం ఓ పట్టు పడదాం. మంచు ని తీసుకెళ్ళి పెనం మీద పెట్టేద్దాం. జారుతుందంటావా? జారితే పొయ్యిలో పడుతుంది అంతేగా. అలా కరిగి నీరై కన్నీరు మున్నీరవ్వలి. మనం వాళ్ళ సంగతి, ఇతగాడి సంగతీ కూడా చూద్దాం. నువ్వేం బాధపడకు.
రంజని, గోదారోళ్ళు గోదారోళ్ళు అంటావుగానీ ఇప్పటికైనా తెలిసిందా ఆ మంచు బాబు సంగతి. ఇలా నీకు తెలియడం రెండోసారనుకుంటా...జాగ్రత్త తల్లీ!
ఎమన్నా అన్నాం అంటే అన్నాం అంటారు కానీ.... మౌనరాగం కాదట మనసు పలుకుతుంది అంట... ఇప్పటి వరకూ పలికిందా ...నాకేం వినపడలేదే.... ఎప్పుడు పలుకుద్దట ? ఇక ఆ ఫొటొలొ అమ్మాయి నా చిన్నప్పటినుండి ఆ సూర్యొదయం వైపు పరిగెడుతూనే ఉంది....
ఆ బ్లాగులొ ఎప్పటికీ తెల్లవారదు.... ఆ అమ్మాయి పరిగెట్టడం ఆపదు.... ఈ అమ్మాయి మనసు పలకదు...
ఇప్పుడు చూడండీ... కళ కొచ్చిన కస్టాలు అంటే...ఎవరొ కళ అనే అమ్మాయికొచ్చిన కస్టాలెమో పాపం వినిపెడదాం అని వస్తే ఎంత నిరాశపరిచిందొ ..
ఈ త్రిమూర్తులు ... అదే బాబు త్రయం ( మంచుబాబు (L) - రాంబాబు (M) - సొంబాబు (R)) ల పనిపట్టడం అంటే అంత వీజీనా....
అ అ సం (అఖిలాంద్ర అప్పలమ్మల సంఘం) మీటింగ్ పెట్టుకున్నారంటే ఎందుకొ అనుకున్నా....నా గురించేనా ? అప్పలమ్మ సౌ గారు.... నన్ను పొయ్యిమీద పెడితే పొయ్యి ఆరిపొవాలి కానీ నాకేం కాదు.
రంజనీ .... నువ్వు వీళ్ళ మాటలు నమ్మకు ...మనం మనం ఒకటి... గొదావరి గొదావరి ... మన ఐకమత్యం చూసి సౌ కి కుళ్ళు
బులుసు గారు.. మీరు గునపాలు గడ్డపార లాంటివి ఇస్తే ఎలాగండీ..... ఈ అప్పు ... వాటితొ తన డెస్క్ క్రింద తవ్వేసి తొక్క తొటకూర పెంచుతుంది. (తన ఆఫీసు సెకండ్ ఫ్లొర్ లొ ఉన్నా సరే)
కళ అంటే ...."కండ కావరం" ని "ఖండ కావరం" అని రాయడేమేనా ...
@కొత్తపాళీ గారు,
>>ఎంచక్కా నా మిగతా స్నేహితులంతా చక్కగా చదివేసి "సూ..పరు, కేక, కెవ్వు, కత్తి, చాకు, బ్లేడు" ఇంకా వీలైతే "గునపం, గడ్డపార, ఱంపం" అని పొగిడేస్తూ ఉంటారా...
చాకులు నాకు చాలవు అని ఆవిడ అంత స్పష్టంగా చెప్పితే మరి తప్పదు గదా సారూ.
@వేణూరాం గారు,మంచు గారూ,
కండ గల వాడికి ఉండేది కండ కావరం, కండ లేనివాడికి ఉండేది ఖండ ఖావరం అని మా భావం. అర్ధం చేసుకోండీ.
@ మంచు గారు,
ఆ బాబు లని తవ్వి పాతరేయాలంటే మరి ఈ గునపాలు గడ్డపార అవసరమే కదా సారూ. మరి అపర్ణ గార్కి తోటకూర అంటే అంత ఇష్టం అని, దానికోసం అంత సాహసం చేస్తారని ఊహించలేదు.
నీకొక జీవితసత్యం చెపుతాను అపర్ణ బంగారం, అలా పరిగెత్తకుండా నిలబడి విను....మనల్ని విమర్శించిన వారే మనకి నిజమైన మిత్రులు. మన తప్పొప్పులు తెలియచేస్తారు, ఆ రకంగా మనకు మేలు చేస్తారు. "విమర్శ అంటే వేషం మార్చుకొచ్చిన ప్రశంస" అని బాగా గుర్తుపెట్టుకో. కాకపోతే నీ విషయం లో చదవకుండా విమర్శిస్తున్నారంటే నీమీద అసూయ అన్నమాట. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.
అందరూ నన్ను ఏడిపిస్తున్నారు , కాస్త మీరు సపోర్ట్ రండి అని అంటే , పాపం మంచుకొండ అని వచ్చా . చూస్తే ఇక్కడి పరిస్తితి వేరుగా వుందే :)
అమ్మో భలే కోపంగా వున్నారు ఇక్కడ వారు ఎవరో కాని ఇంక ఇత్తడే. :))))
hahaha ROFL!!!
మంచు గారూ,
దీనిలో అపర్ణ తప్పేమీ పెద్దగా కనిపించడం లేదు.. చూడగా ఇదంతా వేరే ఎవరో చేయిస్తున్నారనిపిస్తోంది.. మీకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వస్తున్నాయి అంటే ఎవరో తెలుసు కదా?? ఇదంతా మీరు సీమబిడ్డలకిస్తున్న మద్దతును చూసి తట్టుకోలేక జరుపుతున్న కుట్ర.. మీరు నడుం బిగించి ముందుకు సాగిపొండి.. మీకు తోడుగా సీమ సింహాలన్నీ రంగం లోకి దిగుతాయి..
రేయ్ ఎవర్రా అక్కడ.. నా కొడవలికి పదును పెట్టండి.. మన బళ్ళన్నిటికీ పెట్రోల్ పట్టించండి(మంచు గారి సౌజన్యం తో :))
మరొక మాట, ఇది అఖిలాంధ్ర అప్పలమ్మల సంఘం కాదండీ.. ఇది అఖిలభారత అప్పలమ్మల సంఘం..
అపర్ణ !
కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా చెప్పు !
నీ కష్టాలు చూసి నేను మాత్రం నవ్వుకున్నాను.:):)
వ్యాఖ్యలు పెట్టిన ప్రియ మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలన్నీ చూసి ఎంత సంతోషమేసిందో:)).. వీలు కుదరక ఆలస్యంగా రిప్లై ఇస్తున్నాను.
మందాకిని గారు, హహ్హహ్హా.. మంచి పని చేసారు..:)
వేణూరాం..
>>సుమన్ కి చెప్తే..కళంకిత2 తీస్తాడు.. :)
ఎంతైనా నీ వ్యాఖల స్టైలే వేరులే. భలే పెడతావు..:)
>>ఒరేయ్..రాంబాబు నిన్ను వేయిన్చేస్తాన్రా...
హహ్హహ్హ.. నువ్వు నిజమైన బ్లాగర్వి..;)
"ఖండ కావరం" అసలు అర్దం తెలుసు కదా.. మరేమో క కి వత్తు పెడితే కొంచెం effective గా ఉంటుందని అలా పెట్టాననమాట.
నేస్తం అక్కయ్యా.. నిజం. వేణూరాం వ్యాఖ్యలు చూసి నేను తెగ నవ్వేసుకుంటాను..:)
ఇందు గారు, హ్మ్.. అయితే మీకు కూడా ఉన్నాయన్న మాట ఇలాంటి కష్టాలు..
>>మనం మెత్తగా ఉంటే మొట్టేవాళ్ళు ఉంటూనే ఉంటారు.
నిజమేనండోయ్.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.:)
వోలేటి గారు, ధన్యవాదాలు..:)
కొత్త పాళీ గారు,
>>అసలే ముత్యాల పళ్ళు అరిగి పోగలవు.
ధన్యవాదలు మీ వ్యాఖ్యకి..:)))
సాయి ప్రవీణ్..
హ్మ్.. నీ స్టోరీ విన్న తరువాత నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను.
>>ఇంకో అమ్మాయికి నా 'నగర జీవనం' కవిత చూపిస్తే 'హర్మ్యాలు' అని ఉన్న చోట 'ఇంటిదీ?.. హార్మోన్లా?' అనేసి హి హి హి అని ఇకిలించింది.
హహ్హహ్హా.. ఎంత నవ్వొచ్చిందో ఇది చూసి..;)
>>కావరము అంటే కొవ్వు. కండ కావరము అంటే పొగరు.
ధన్యవాదాలు..:)
లలిథ గారు, హహ్హహ్హా.. నిజమే. వాతల్తో (వ్రాతల్తో) పెట్టుకుంటున్నాను..
జయ గారు.. అవునండీ మన బ్లాగులు బ్లాగ్లోకంలోనే ఉండాలి.. ధన్యవాదాలు..:)
శశిధర్ గారు, బాబోయ్ మీ కష్టాలు నిజంగా ఎవరికీ రాకూడదండీ..;) పోయి పోయి మేనేజర్ చేతిలో పడ్డారా.. హహ్హహ్హా.. ధన్యవాదాలు వ్యాఖ్యకి..:)
శిశిర గారు ధన్యవాదాలు..:)
అశోక్.. అలాగే.. :) ధన్యవాదాలు.
ఎడమ భుజం గారు, సారీ మంచు గారు,
ఏమిటో.. రాంబాబు సోంబాబు నా ఒక్క బ్లాగు గురించే అనలేదండీ.. మీరు కూడా బ్లాగు రాస్తున్నారుగా.. దానికి ఏమంటారు మరి..;)
కిరణ్ గారు, అయ్యయ్యో.. block చేసేశాడా.. హ్మ్. ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు..
మాలా కుమార్ గారు, ధన్యవాదాలండీ..:)
రంజని, ధన్యవాదాలు రంజని,
>>నీకు తోడు గా నేను సౌమ్యా ఉన్నాం
థాంకులు...:)
సుబ్రహ్మణ్యం గారు,
>>ఎముకల గూడు మీద తోలు కప్పినట్టుండే వాడికి అంత ఖండ ఖావరము ఎక్కడి నించి వచ్చిందబ్బా?
హహ్హహ్హా.. భలే ప్రశ్న. మీ వ్యాఖ్య సూ..పర్..:) ధన్యవాదాలు మీ గునపాలకి, ఇంకా గడ్డపార కి..
వేణూరాం..
>>బలుసు గారిచ్చిన గునపాలు ఉన్నాయ్ కదా.. ఎసేయ్యండి.. ఏమైనా అయితే హరేకృష్ణ చూసుకుంటాడు.. :)
అంతే అంటావా..?
సౌమ్య గారు,
>>రౌడిలని పంపించి వాళ్ళ చర్మతో చెప్పులు కుట్టిద్దాం.
హహ్హహ్హా.. మంచు ని పెనం మీద పెడదామా..
భలే అయిడియా. ధన్యవాదాలు సౌమ్య గారు.
సుబ్రహ్మణ్యం గారూ..
>>కండ గల వాడికి ఉండేది కండ కావరం, కండ లేనివాడికి ఉండేది ఖండ ఖావరం అని మా భావం. అర్ధం చేసుకోండీ.
ఆహా.. ఎంత బాగా చెప్పారు..:) మీకు అయితే గునపాలు గడ్డపారలూ సరిపోవు..:)
నీహారిక గారు,
>>"విమర్శ అంటే వేషం మార్చుకొచ్చిన ప్రశంస"
బాగా చెప్పారు, ధన్యవాదాలు మీ జీవిత సత్యానికి..:)
కార్తీక్ గారు, హహ్హహ్హా.. కొడవలి నూరిపిస్తున్నారా..? సుమోలు లేపేస్తారా..? భలే ఉంది మీ వ్యాఖ్య..;)
సవ్వడి గారు, ప్చ్.. ఏం చేస్తాం చెప్పండి. అలాగే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడూ కష్టాలు..:(
పాపం ఎన్ని కష్టాలు అపర్ణగారు..
టపాబాగుంది. మంచిపేర్లు పెట్టారు.
ఓహో.... ఈ మధ్య ఇంతపని జరిగిందన్న మాట. నా తరపున రాంబాబుకి ఒక "ఓ.." ఏసుకోండి.:)
వేణురాం:సుమన్ కి చెప్తే..కళంకిత2 తీస్తాడు :):):)
ప్రవీణ్:ఆ క్షణం... నేను హంతకుడిని కాకుండా ఉండడానికి ఒకే ఒక్క కారణం నేను పూనేలో తను బెంగళూరులో ఉండడం.:):):)
వేణు శ్రీకాంత్ గారు, మరే..:( ఎన్ని కష్టాలో..
ధన్యవాదాలు.
3g గారు, మీ వ్యాఖ్య సారం నాకు అయితే అర్థం కాలేదు. కొంపతీసి రాంబాబుకి గునపమో గడ్డపారో కాదు కదా.. అలా కాకపోతే థాంకులు. అలాగే అయితే నో థాంకులు..;)
హహహ గోదావరి వాళ్ళు గోదావరి వాళ్ళు ఒకటే ...నేను సపోర్ట్ చేసింది అపర్ణ బంగారాని కి
@ మంచు గారు : నేను వాళ్ళ మాటలు నమ్మలేదు ..... గోదావరి వాళ్ళు గోదావరి వాళ్ళు ఒకటే ఎవరు ఎన్ని చెప్పిన ఎవరు విడదీయలేరు ...
ఆ కళా హృదయం లేని రాంబాబు సోంబాబు ఉ.కో వాళ్ళట .. ఉంటే గింటే వాళ్ళకి సపోర్ట్ గా సౌమ్య గారు ఉండాలి కాని
వాళ్ళకి ఎడమ భుజంగా మన గోదావరి వాళ్ళు ఉంటే కోపం రాదా ..అందుకే అపర్న నేను సౌమ్య కి సపోర్ట్ చేసాం...
ముందు ఆ రాంబాబు సోంబాబు ని సౌమ్య కిచ్చి ఇలా వచ్చేయండి ..అప్పుడు మిమ్మల్నే సపోర్ట్ చేస్తాం
అంతే అంటావా రంజని. అక్కడికీ పైన కార్తీక్ తన కామెంట్ లొ చెప్పాడు కానీ నేను నమ్మలేదు సుమా... మరి బాబు త్రయం అని గొప్ప బిల్డప్ ఇచ్చేనే ఇప్పుడు వదిలేస్తే ఎలా ....
సరే నేను... నాతొ పాటు 3జి ని కూడా మన జిల్లా వైపు తీసుకొస్తున్నా ... :-)))
50 ?
రంజనీ..:) ఎంత మంచిదానివో.. మంచు గారిని కూడా మార్చేసావు..:) వాళ్లని సౌమ్య గారికి అప్పగించడం ఎందుకులే. మన బ్లాగర్స్ అంతా కలిసి ఏసేద్దాం..;) వేణూరాం ప్లాన్ చేసేస్తున్నాడు కూడా..
>>ఒరేయ్..రాంబాబు నిన్ను వేయిన్చేస్తాన్రా..
మంచు గారూ.. అవునవును మీదే 50..:)
chaala days tharvatha Jandhyala Film chusinattu undi me post chaduthunte....masthundi...
haayiga navvukunnanu.....i bacame a fan of urs after readin this...!!
వివేక్ గారు, జంధ్యాల చిత్రం చూసినట్లుగా ఉందా నా పోస్ట్ చదువుతుంటే. మీ వ్యాఖ్య చూసి ఎంత సంతోషించానో:) బోలెడన్ని ధన్యవాదాలు.
Post a Comment