Thursday, December 23, 2010

వేదమంటి మా గోదారి..

కింద చూస్తే నీళ్లు.. పైన చూస్తే ఆకాశం.. పక్కనంతా పచ్చని కొండలు.. అదొక కొత్త ప్రపంచం.. ఆ అందాల్ని వర్ణించడం చాలా కష్టం. ఎవరన్నారు నీటికి రంగు, రుచి, రూపం లేవని..? ఖచ్చితంగా చూసి ఉండరు మా గోదావరి తల్లిని. గలగలమని పరవళ్లు తొక్కుతూ ఎంత అందంగా వయ్యారంగా నడుస్తూ ఉంటుందనీ.. ఆ అందాన్ని వర్ణించతరమా.. ఎన్నెన్ని కథల్ని, ఊసుల్ని, ఆనందాల్ని, విషాదాల్ని తనలో దాచుకుని అవేమీ బయటకు కనిపించకుండా గంభీరంగా , ముగ్ధలా సాగుతూ ఎందరిని అలరిస్తుందనీ.. మౌనంగా ఎన్నెన్ని ఊసుల్ని మనసుల్లోకి జొప్పిస్తుందో , మన ప్రమేయం లేకుండానే.. అంత గొప్ప గోదారి ఎంత ఒద్దిగ్గా ఉంటుందనీ.. ఇక తనపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఆ తల్లి ఒక అమృతవర్షిణే.. ఎందరి జీవితాలను తన చుక్కానితో నడిపిస్తుందనీ..

ఆ గోదారమ్మ అలల హొయల పరుగు, అబ్బా.. మాటలు సరిపోవట్లేదు. ప్రకృతి మాత తన సింగారాన్ని గోదారి పైటతో అలంకరించుకున్నట్లు.. ఎంత అందమైన అలంకరణో తెలుసా.. లోతైన గంభీరమైన అద్భుతమైన అలంకరణ. ఎవ్వరినీ కదిలించకుండా తన దారిన తాను, చిన్ని చిన్ని అలలతో సున్నితంగా కొండల్ని తడుముతూ..తడుపుతూ.. ముద్దాడుతూ.. తనలో తను కలుస్తూ.. తనతో తను విడివడుతూ.. ఎంత అద్భుతమైన అందం.. ఎంత అందమైన నిజం.. వెరసి నా పాపికొండలు ప్రయాణం.. ఒక్కసారిగా కృత్రిమత్వానికి దూరంగా సహజత్వంలోపలికి గోదారి తల్లి నన్ను భద్రంగా తీసుకెళ్తున్న భావన.
భద్రాచలం నుండి పేరంటాళ్ల పల్లి వరకు సాగిన ఆ ప్రయాణం నేను జన్మలో మర్చిపోలేనిదనే చెప్పుకోవాలి. అదృష్టం.. పంచభూతాలూ సహకరించాయి మా ప్రయాణమంతా..:)

పాపి కొండల మధ్యలో పాపిటంత గోదారి  
 



చుక్కల్లా మారిన సూర్యుడి జలకాలాట

గోదారి తల్లి సన్నిధిలో వెన్నెల రాత్రి గడుపుతారా..

పడమర పొత్తిళ్లలో సూరీడు..


అలల లయలు..
లయల అలలు..
అలల్లో దాగిన లయలు..
లయలతో సాగే అలలు..

అలపై అల దూసుకు వస్తూ..
అల కింద అల నలిగిపోతూ..
అల పక్కన అల స్నేహంగా..

అలతో అల కలిసిపోతూ..
అలతో అల విడివడుతూ..
అలను అల తోసుకుంటూ..

మొత్తంగా

అలల లయలు..
లయల అలలు..
అలా అలా సాగుతూ..

వెళ్లొస్తా నేస్తం..


వెన్నెల రాత్రి బసకి వెదురు బొంగుల విడిది..

హైలెస్సా.. హైలెస్సా..


ఇదంతా నాణేనికి ఒకవైపు. రెండో వైపు నాకు నచ్చని అంశాలున్నాయి.ముఖ్యంగా ప్లాస్టిక్ చెత్త గోదావరిలోనే పారెయ్యడం, నాకు చాలా బాధ కలిగించిన విషయం. :(
ఎంత మందికని చెప్పగలను.. నా వరకు నేను మాత్రం అందులో ఏమీ పారెయ్యకుండా చూసుకున్నాను. మనం ఇలా ప్రకృతికి హాని కలిగిస్తున్నందుకే కదా ప్రకృతి మన మీద కన్నెర్రజేస్తుంది... నాకో బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది. అలా చెయ్యొద్దూ ఇలా చెయ్యొద్దూ అని ఎంత చెప్పినా మనం వినం. ప్రకృతికి మనం ఎంత హాని కలిగిస్తే అంత మన జీతాల్లోంచి కట్ అని ఏదైనా చట్టం వస్తే బాగుండు.;)  ఏమంటారూ..?

48 comments:

శివరంజని said...

హే.........య్ ...ఫస్ట్ కామెంట్ నాదేనోచ్

శివరంజని said...

2

శివరంజని said...

3

శివరంజని said...

4

శివరంజని said...

హహహహహ మొదటి 5 కామెంట్స్ కూడా నావేనోచ్

శివరంజని said...

హమ్మా నీ ఫొటోస్ సూపర్ గా ఉన్నాయి ...టైటిల్ కెవ్వు కేక ...

భాను said...

beautiful...nenarlu

రాజ్ కుమార్ said...

వావ్ .. అద్భుతం గా ఉన్నాది గోదావరి.. ఫొటోస్ చాలా బావున్నై.. మీ వ్యాఖ్యానం లాగా ..! ఆ మూడవ ఫోటో సూపర్ డూపర్ గా ఉంది..
మొత్తానికి మాతో పాపికొండల ట్రిప్ వేయించారు..

nice post.. :)

రాజ్ కుమార్ said...

శివరంజని గారు.. మీ కామెంట్లు ఏమిటండీ ? బుల్లెట్లు లేని తుపాకీ లాగ ప్రేలుతున్నై ? :) :)

ఆ.సౌమ్య said...

wow beautiful!

Anonymous said...

super

Anonymous said...

Beautiful photos.

3g said...

ఏంటా ఈ మధ్య మనసు పలకట్లేదనుకున్నా ఇదన్న మాట విషయం. మూడవ ఫొటోమాత్రం ఎక్సలెంట్.

//ప్రయాణం నేను జన్మలో మర్చిపోలేనిదనే చెప్పుకోవాలి// నిజంగానండీ నాక్కూడా అలానే అనిపించింది, నేను వెళ్ళక ముందు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు కాని చూస్తున్నప్పుడు మాత్రం వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టనిపించింది.

నేస్తం said...

అప్పూ మొదటి పేరాల మధ్య గ్యాప్ పెట్టు

అలపై అల దూసుకు వస్తూ..
అల కింద అల నలిగిపోతూ..
అల పక్కన అల స్నేహంగా..


అలతో అల కలిసిపోతూ..
అలతో అల విడివడుతూ..
అలను అల తోసుకుంటూ

అసలు ఎలా వస్తాయి ఇలాంటి మంచి పదాలు నీకు :)

అద్భుతం

మధురవాణి said...

Simply superb! :)

మనసు పలికే said...

రంజనీ.. మొదటి వ్యాఖ్య నీదే కానీ, ఇదేంటి కొత్తగా మొదటి ఐదు వ్యాఖ్యలకి పోటీ వచ్చేసిందా..:))
టైటిల్ ఇంకా ఫోటోస్ కూడా నచ్చినందుకు ధన్యవాదాలు..:)

భాను గారు, ధన్యవాదాలు..:)

వేణూరాం.. హహ్హహ్హా అయితే నువ్వు కూడా వచ్చేసావా పాపికొండలు..:) ధన్యవాదాలు టపా నచ్చినందుకు..:)

సౌమ్య గారు, ధన్యవాదాలు..:)

మనసు పలికే said...

అఙ్ఞాత గారు ధన్యవాదాలు..

హరేఫాల గారు, ధన్యవాదాలు..:)

3g గారు,
>>ఏంటా ఈ మధ్య మనసు పలకట్లేదనుకున్నా
హహ్హహ్హా.. అవునండీ మా ఊరెళ్లాను. అలాగే పాపికొండలు కూడా వెళ్లాను..:)
మీరన్నది నిజం. ఏదో వేరే లోకంలోకి వెళ్లినట్లు అనిపించింది. ముఖ్యంగా తిరుగు ప్రయాణంలో.. అప్పుడే సూర్యాస్తమయం అవుతూ..చల్ల గాలి.. ఎంత బాగుందో..

మనసు పలికే said...

నేస్తం అక్కా.. మీరన్నట్లుగానే పెట్టాను గ్యాప్..:)
ధన్యవాదాలు అక్కా మీ వ్యాఖ్యకి. చాలా సంతోషంగా ఉంది మీకు అంతగా నచ్చినందుకు..:))

మధుర గారు, ధన్యవాదాలు..:)

శిశిర గారు, ధన్యవాదాలు..:)

sivaprasad said...

super ga undi

బులుసు సుబ్రహ్మణ్యం said...

అద్భుతంగా ఉన్నాయి రచన, గేయం. ఫోటోలు కూడా చాలా బాగున్నాయి.

ఉప్పొంగిపోయింది గోదావరి - తాను
తెప్పున్న యెగిసింది గోదావరీ
.........
అడివి చెట్లన్నీని
జడలలో తురిమింది
ఊళ్ళు దండలగుచ్చి
మెళ్ళోన తాల్చింది ..... ఉప్పొంగి..
.......
శంఖాలు పూరించి
కిన్నెర్లు మీటించి
శంకరాభరణ రా
గాలాప కంఠి యై ...... ఉప్పొంగి..
అడవి బాపిరాజు గారి గేయం గుర్తుకొచ్చింది.

Sai Praveen said...

ఫోటోలు , వ్యాఖ్యానం రెండూ బాగున్నాయి.

ఇందు said...

వావ్..ఏమి వర్ణన అపర్ణగారూ! ఆ 'అలలు ' మీద చిన్ని కవిత నాకు బాగ నచ్చింది.అటు తిప్పి..ఇటు తిప్పి అలలమీదే వ్రాసారు..చాలా బాగుంది.నాకు ఆ సూర్యుడి పిక్..అదే ఐదవది నచ్చింది.....నాకు పాపికొండలు చూడాలని ఎప్పటినించో! హ్మ్! ఎప్పటికి తీరేనో నా కల! నేను ఒకవేళ వెళ్ళినా మీఅంత అందంగా మాత్రం వర్ణించలేను....చాలా బాగుంది టపా...ఆహ్లాదంగా..హాయిగా....గోదారిలా...

హరే కృష్ణ said...

అపర్ణ గారు..గోదావరి బావుంది
అలలా...అల్లలల్లల్లా ..ఏ అల్లా
గోదారి ఇంత బావుంటుందని తెలిస్తే ఎప్పుడో దూకేసేవాడిని.. మరేం పర్లేదులే ఈ పోస్ట్ చూసా కదా హాయిగా దూకేస్తా

వేణూశ్రీకాంత్ said...

వావ్ చాలా బాగుంది ఆప్పు, మీ వర్ణన అద్భుతం. అలలపై చిన్ని కవిత ఎంత బాగుందో... ఫోటోలు కూడా చాలా బాగా capture చేశారు.

మంచు said...

నీకూ టాలెంట్ ఉందని ఒప్పుకొవాలంటావ్.... చ గొదావరి తొ కొట్టావ్ ఎం చేస్తాం మరి.... తప్పుతుందా :-))

ఫొటొలు, వర్ణన, అందరూ మెచ్చుకునే నాకు అర్ధంకానే కవిత అన్నీ బాగున్నాయి... మొదట ఐదు కామంట్లు గొదావరికి దక్కడం కూడా చాలా చాలా బాగుంది.

Sasidhar Anne said...

vedmanti maaa godari.. Title chudagane yakkuna aa song gurtukuvacchesi alaa padesa.. Veturi gariki maro sari jaijailu..

alalu.. kavitha bale vundi.. :)

nenu godavari trip ki 4 years nunchi planning kani workout kavatam ledu.. denikaina time ravali emo :)

kiran said...

అబ్బా...!! సూపర్..!!
మా శేకర్ కమ్ముల గోదావరి చూసినప్పుడు కలిగిన ఫీలింగ్..మళ్ళి....మీ పోస్ట్ చదివాకా అదే ఫీలింగ్...!!
ఆ తెలుగు...ఆ వర్ణించిన విధానం..చాల చాల బాగున్నాయి అండి.. :)
ఏంటో అందరు..ఒకొక్క...ప్రాంతం గురించి...ఎక్ష్ప్లైన్ చేసేస్తున్నారు..!!
మొన్న ఇందు ఏమో అరకు..మీరేమో గోదావరి...
నేను చూడాల్సిన లిస్టు పెరిగిపోతోంది.. :)

అశోక్ పాపాయి said...

is's one most beautiful place in AP. Extremely peaceful and relaxing we always enjoyed visit your blog. very nice Thanks for your posting..

తృష్ణ said...

మన గోదారి ఫోటోలు ఎంత బాగున్నాయో...

మనసు పలికే said...

శివప్రసాద్ గారు, ధన్యవాదాలు:)

సుబ్రహ్మణ్యం గారు, మీకు మీరే సాటి అండీ. ఎంత సంతోషం వేసిందో మీ వ్యాఖ్య చూసి. నా మనసు కూడా మన గోదారిలా ఉప్పొంగిపోయింది:) బోలెడన్ని ధన్యవాదాలు..:)

ప్రవీణ్, ధన్యవాదాలు..:)

మనసు పలికే said...

ఇందు గారు, ఇది అన్యాయం అండీ..:(
>>నేను ఒకవేళ వెళ్ళినా మీఅంత అందంగా మాత్రం వర్ణించలేను
ఇది నిజంగా మీరు నా మీద పన్నే కుట్రే కదూ.. మరి ఏమిటండీ.. అసలు మీ కథ చదివిన తరువాత ఎవ్వరూ దీనికి ఒప్పుకోరు. మీది అంత అందమైన శైలి..:)
ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు.:) ఓ రెండు రోజులు ఖాళీ చేసుకుని నాకు చెప్పండి. నేనే దగ్గరుండి తీస్కెళ్తా మిమ్మల్ని..:)


కృష్ణ..
>>.ఏ అల్లా
గోదారి ఇంత బావుంటుందని తెలిస్తే ఎప్పుడో దూకేసేవాడిని..
ఎంత నవ్వుకున్నానో తెలుసా;) భలే రాస్తావు నువ్వు ఏదైనా. ధన్యవాదాలు టపా నచ్చినందుకు:) అలా అని దూకెయ్యకండి ప్లీజ్:( గోదారి చూడానికే బాగుంటుంది, దూకితే కాదు. ఈత రాకపోతే అసలే కాదు.


వేణు గారు, ధన్యవాదాలండీ వర్ణన నచ్చినందుకు:) ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి నాదగ్గర. కానీ మరీ మన క్రియేటివిటీ జనాలు తట్టుకోలేరని కొన్నే పెట్టాను.;)

మనసు పలికే said...

మంచు గారు,
>>నీకూ టాలెంట్ ఉందని ఒప్పుకొవాలంటావ్
ఏమిటండీ మీ ఉద్దేశ్యం..అయ్;)
ఏదైతేనేమి, మీకు నచ్చిందని చెప్పారు కదా ధన్యవాదాలు అందుకు.:P

శశిధర్ గారు, నాక్కూడా గోదావరి పేరు వింటే ఆ పాటే గుర్తొచ్చి పాడేసుకుంటాను:) వేటూరి గారికి మనస్పూర్తిగా జేజేలు.
మీరు కూడా ప్లానింగేనా.. అయ్యో.. నాకు ముందుగా చెప్పి వచ్చెయ్యండి. మీకు చూపించే వంకతో నేను మరోసారి చూసేస్తాను:)) ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)

మనసు పలికే said...

కిరణ్ గారు, మీ వ్యాఖ్య మళ్లీ మళ్లీ చూసుకున్నాను:)
>>మా శేకర్ కమ్ముల గోదావరి చూసినప్పుడు కలిగిన ఫీలింగ్..మళ్ళి....మీ పోస్ట్ చదివాకా అదే ఫీలింగ్...!!
బోలెడన్ని ధన్యవాదాలు:) నేను కూడా అరకు చూడలేదండీ:( ఇందు గారు తన వర్ణనతో చూపించేసారనుకో అరకు:)

అశోక్,
నిజమే. చాలా అందమైన ప్రదేశం:) ధన్యవాదాలు..

తృష్ణ గారు, ధన్యవాదాలండీ:)

Anonymous said...

బాగా చెపారు, ఫోటోలు బాగున్నాయ్. మొదటి కామెంట్లు చూడగనే, మళ్ళీ చివరి పేరాలో చెప్పినట్టు గోదాట్లో తేలుతున్న మినరల్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులూ గుర్తొచ్చాయ్. ప్చ్..,

ఇందు said...

అపర్ణగారూ! నాకంత దృశ్యం లేదండీ...నిజ్జంగా మీరు చాల బాగా వ్రాసారు! ఐతే నాకు,మా చందుకి మీరు గోదారి..పాపికొండలు చూపించేస్తారన్నమాట.రాధికగారు తన ఊరు చూపిస్తే...మీరు గోదారి :) ఎన్నెల గారేమో కెనడా! వావ్! నాకు భలే భలే ఇన్విటేషన్స్ వస్తున్నాయోచ్! :)

మనసు పలికే said...

snkr గారు, ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి:)
హ్మ్.. నాకైతే చాలా బాధగా అనిపించిందండీ.. చెత్త మొత్తం గోదావరిలోనే వేసేస్తున్నారు. సహజసిద్ధమైన చెత్త వేస్తే పర్వాలేదు, కొంతకాలానికి కలిసిపోతాయి మట్టిలో. కానీ ఇలా కృత్రిమమైన పదార్థాలే..

ఇందు గారు, అమ్మో అమ్మో.. మీ అరకు గురించి చదివాక నేనైతే అస్సలు ఒప్పుకోను మీకంత దృశ్యం లేదంటే..:)
తప్పకుండా.. చందు గారిని కూడా వెంట తెచ్చేయండి:)) మంచి ఆతిథ్యం ఇంకా పాపికొండలు, భద్రాచలం, పర్ణశాల ప్రయాణం.. ఎంచక్కా ఎంజాయ్ చెయ్యొచ్చు:)

గీతిక బి said...

ఓహ్ లాస్ట్ కామెంట్ నాదేనన్నమాట..

ఈ మధ్య బ్లాగులసలు చూడలేదు. అందుకే మిస్సయినట్టున్నాను.

గోదావరి దగ్గరే ఉంటూ ఇంకా నేను చూడలేదు. కానీ చూసిన ఫీలింగ్ కలిగింది నీ పోస్ట్ చదివాక. చాలా బాగా వ్రాశావ్. ఫొటోస్ అద్భుతంగా ఉన్నాయి.

మంచి పోస్ట్ వేశావ్ అపర్ణా...

మనసు పలికే said...

గీతిక,
చాలా సంతోషంగా ఉంది పోస్ట్ నచ్చినందుకు:). ధన్యవాదాలు..

Anonymous said...

కవిత బావుంది... ఫొటోలు కూడా :)

మనసు పలికే said...

ధన్యవాదాలు అఙ్ఞాత గారు..:)

శివరంజని said...

Aparna మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

రాధిక(నాని ) said...

ఫొటోస్ అన్ని చాలా బాగున్నాయి.అలాగే మీ కవిత కూడా! నేనూ వెళ్లి రెండేల్లైంది.మళ్ళి వెలదామనుకున్నాము కానీ మిస్సైంది.నాకు చక్కగా ఫొటోస్ లోనే పాపికొండల్ని చూపించేశారు థాంక్స్ అండి.

గిరీష్ said...

naku godavari chudalanna picchi eppudu thagguthundo..emo. nice article

మనసు పలికే said...

రంజని, ధన్యవాదాలు. మరి నా శుభాకాంక్షలు కూడా అందుకో:)

రాధిక గారు, మళ్లీ వచ్చెయ్యండి, నేను దగ్గరుండి చూపిస్తాను:) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..

గిరీష్ గారు, ఒక సారి చూసెయ్యండి గోదావరిని:) చూడాలన్న పిచ్చి తగ్గను గాక తగ్గదు. పెరుగుతుంది:)) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..

Ray Lightning said...

తూర్పుగోదావరి జిల్లాలో ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ చేశారు. కానీ, అంతకంటే ముఖ్యమైన పవిత్ర గోదావరి నది, అటవీ పరిసరాలను రక్షించుకోవడానికి ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లను నిషేదించాలి.

ఎవరైనా చొరవ తీసుకుంటే బాగుణ్ణు. నిన్న మా కుటుంబం పాపికొండల బోటు ప్రయాణానికి వెళ్ళాం. నా మనసంతా విపరీతంగా కళతచెందింది ఈ ప్లాస్టిక్ చెత్తని గోదార్లో పడెయ్యడం చూసి. బోటువాళ్ళు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోడానికి ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు ఇస్తున్నారు. వారి కక్కుర్తి వళ్ళ గోదావరి చెత్తకుండీలా తయారవుతోంది !

ప్లాస్టిక్ని నదిలో విసిరేసేవాళ్ళ పాపం ఊరకనే పోదు. ఇది పైశాచికపోషణ. ఈ కర్మఫలం తప్పక అనుభవిస్తారు ఎవ్వరైనా, ఎప్పటికైనా.

మనసు పలికే said...

Ray Lightning గారూ, నిజమేనండీ.. ఆ ప్లాస్టిక్ వాడకంతో గోదావరి చెత్త కుండీ లాగానే తయారవుతుంది. బోటు వాళ్లు అలాగే ఉన్నారు , ప్రయాణీకులూ అలాగే ఉన్నారు. అవేర్‌నెస్ లేక అన్ని కవర్లూ గోదావరీ లోనే పడేస్తున్నారు. చాలా బాధగా అనిపించింది..:(
ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి

Arun Kumar said...

Simply superb! :)

మనసు పలికే said...

చాలా ఓపికతో నా అన్ని టపాలు చదివి వ్యాఖ్యలు పెట్టినందుకు ధన్యవాదాలు అరుణ్ గారు.. ప్రతి టపాలో వ్యాఖ్యకి రిప్లై ఇవ్వనందుకు క్షమించండి. చాలా సంతోషంగా ఉంది మీకు నా టపాలు, నా తెలుగు నచ్చినందుకు. మరోసారి మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.