Tuesday, January 25, 2011

నా పేరు అపర్ణ కాదు..

విశాలమైన, అన్ని వసతులు కలిగిన తరగతి గది (హైలీ సోఫిస్టికేటెడ్ ని ఎలా తెనుగీకరించాలి..?) అంటే, రెండు ప్రొజెక్టర్లు, రెండు పెద్ద పెద్ద స్క్రీన్లు, మంచి లైటింగ్ సిస్టం (నిద్ర పోడానికి అనువుగా), ఒక్కో వరుస ఒక్కో మెట్టుపై ఉండేలా ఫిక్స్డ్ టేబుల్స్ .. చెయిర్స్.. ఇంచు మించుగా మంచి సినిమా హాల్‌లో లాగా. ఇక ఏ.సి. గురించి వేరేగా చేప్పేదేముంది..?

ఆదివారం, మధ్యాహ్నం భోజనం తరువాత సెషన్. క్లాస్‌లోకి రాగానే అందరి పేర్లు, వివరాలు అడిగి తెలుసుకుని ఏదో టాపిక్ చెప్పడం మొదలెట్టారు, సాధారణంగా అర్థ గంట క్లాస్‌కి ప్రెపేర్ అయి వచ్చి దాన్నే రెండు గంటలు చెప్పడానికి ప్రయత్నించే ఆ ప్రొఫెసర్ (ఈయన గురించి మీకు బోలెడన్ని చాడీలు చెప్పాలి.) అలా జూం చేస్తే పై నుండి (అంటే చివరి నుండి) రెండో వరుసలో కూర్చున్న ఒక అమ్మాయి, కుర్చున్నట్లుగా నటిస్తూ నిద్రిస్తున్న అమ్మాయి. నిద్రల యందు తరగతి గదిలో నిద్ర వేరయా అన్నట్లుగా, కలల లోకంలో అలా అలా తేలిపోతూ ఉంది.

మధ్యలో ఎవరో అపర్ణా అని పిలిచినట్లుగా అనిపించి చప్పున కళ్లు తెరిచి చూసింది. ఎవరా ఆ నిద్ర పోయేది అని చూస్తున్నారా...? హిహ్హిహ్హి అది నేనే.. అప్పటి వరకూ బాగా నిద్రలో ఉన్నానేమో, అసలు ఆ పిలుపు కలలోనా ఇలలోనా అన్నది అర్థం కాలేదు;) అలా ప్రొఫెసర్ పిలిస్తే పలకనప్పుడు కనీసం పక్క జనాలైనా మన వంక చూస్తారు కదా అని అటు పక్క ఇటు పక్క కింద పైనా అన్నీ దిక్కులూ చూసాను. ఎవరూ నావైపు చూడటం లేదు. పోనీ మన నిద్ర సంగతి తెలిసి పోయి పిలిచారేమో ఆయన అనుకుంటే, అసలు ఏ మాత్రం కనిపించడానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీ గా పడుకున్నానన్న విషయం గుర్తొచ్చి నా నిద్రాత్మ కసిరింది.

ఇదంతా భ్రమే అని ఘాట్టిగా ఫిక్స్ అయిపోయి(ఈ మధ్య భ్రమలు ఎక్కువైపోయాయిలే) మళ్లీ కలల లోకం లోకి పారిపోదామా అనుకునేంతలో మళ్లీ అదే స్వరం.."Is there anybody named Aparna" అంటూ.. బాబోయ్.. అప్పుడర్థమయింది. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఒక సబ్జెక్ట్ చెప్పి మళ్లీ ఇప్పుడు వచ్చారు మా క్లాస్‌కి ఆ ప్రొఫెసర్. ఎనభై మందిలో నా పేరు+నేను గుర్తుండడం అన్నది నిజంగా కష్టం (బోల్డంత చదివేసి, చక చకా సమాధానాలు చెబితే తప్ప) కాబట్టి నేనే అపర్ణ అన్న విషయం ఆయనకి తెలియదు. ఒక అర్థ గంట ముందే చెప్పాము అందరి పేర్లు కానీ, అంత మందిలో నేను ఏం పేరు చెప్పానో కూడా గుర్తుండడం కష్టమే ఆయనకి.

కాబట్టి ఇప్పుడు తెలిసొచ్చిన విషయమేమనగా, ఆయనకి నేనే అపర్ణ అన్న విషయమే గుర్తు లేదు, ఇంక నేను పడుకున్నాను అన్న విషయం ఎలా తెలుస్తుంది..? అసలు అక్కడ ఒక వ్యక్తి కుర్చున్నట్లు ఆయనకి కింద నుండి కనిపించదు గాక కనిపించదు. అంత బాగా సెట్ చేసుకున్నాను మరి మన ప్లేస్‌ని;)  ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవన్నీ ఆలోచించుకునే లోపే మరో సారి వినిపించింది.."So there is no Aparna in this class, is it? "  అని.. ఇక నా బుర్ర పాదరసం లా పని చేసింది. మొదటి రెండు సార్లు పలకకుండా మూడో సారి పలికెతే.. హమ్మ బాబోయ్.. తెలిసిపోతుంది. పైగా ఆయన ఏం టాపిక్ చెబుతున్నారో కూడా తెలీదు. అందులో ఏమైనా అడిగి, మన తెల్ల మొహం సమాధానంగా కనిపిస్తే.. ఇక నా తలని, మొహాన్ని ఎక్కడ పెట్టుకునేదీ..? ఎందుకైనా మంచిదని పక్కన అబ్బాయిని అడిగాను."Is he calling me..?" "yes, he is putting some questions to everybody. don't worry, he didn't realise that you are here" అని చెప్పాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చేసుకున్నాను.కానీ, అంత మంచి నిద్ర దూరంగా వెళ్లి ఆకాశంలో కూర్చుంది :( సరేలే ఏదో ఒకటి వినడానికి ప్రయత్నిస్తున్నాను.

ఏమైందో మాస్టారుకి, ఉన్నట్టుండి లాస్ట్‌కి వచ్చారు. అక్కడ ppt లో రాసింది నోట్ చేసుకోండి అని అందరి దగ్గరా ఆగి మరీ చెబుతున్నారు. ముందే చెప్పాను కదా, అర్థ గంట చెప్పాల్సిన దాన్ని రెండు గంటలు చెప్పాలంటే ఇలాంటి మార్గాలు తప్పనిసరి. అప్పుడు భయం మొదలయింది. కొంపతీసి నా దగ్గరికి వచ్చి నీ పేరు అపర్ణే కదూ అని అడుగుతారేమో అని. "చి చి నా పేరు అపర్ణ కాదు, అర్చన" చెప్పేద్దాం అని డిసైడ్ అయిపోయాను;) కానీ నా చేత ఒక అబద్దం ఆడించకుండా బ్రతికించిన ప్రొఫెసర్ గారూ.. ధన్యవాదాలు:)))

నాకు వచ్చిన ఒక ఫన్నీ S.M.S.
If all the Musicians of this world join together and make a sweet Melody to Facilitate Sleep. They still can't win against our lecturers and class books :)

28 comments:

Geetika said...

ఎందుకమ్మా అపర్ణా ఇలాంటి షాకులిస్తావు. (అసలే ఖాళీ టైం లేకపోతుంటే)

పోనీ విషయం ముందు చెప్పావా... బోల్డంత మ్యాటర్... విషయమేమో చివర్న... బాగుంది.

Geetika said...

baagumdi Post...

kiran said...

అప్పు .. :)..బాగుంది...
నా కాలేజీ డేస్ గుర్తోచాయ్...
మనం దాక్కోవడం ఈజీ లే.. :)..ఇంతే ఉంటాం గ,...:P
మొత్తానికి దొరక్కుండా సేఫ్ గ వచావ్..సెబాష్.. :)r

నైమిష్ said...

To be frank title చూసి ఇది గీతాచార్య పార్ట్ - 2 ఎపిసోడ్ ఎమో అనుకున్నా!!

'Padmarpita' said...

good one.

సత్య said...

mottam meeda o abaddam save ayyidi...nice post

వేణూరాం said...

హాహ... బావుందండి.. ఇలాంటి అనుభవాలు అందరికీ కామన్ అనుకుంట. :)

అశోక్ పాపాయి said...

టైటిల్ చూసి చాల భయమేసింది ఎటువంటి షాక్ ఇస్తారో అని..హ హ హ...మొత్తానికి బాగుంది మీ పోస్ట్

మనసు పలికే said...

గీతిక, హహ్హహ్హా.. అసలు మీ వ్యాక్య చూసే దాకా నాకు ఆ అనుమానం రాలేదు, ఈ టైటిల్ ద్వంద్వార్థాన్ని ఇస్తుందని;) ఇది పూర్తిగా నాకు జరిగిన ఒక విషాద(????) సంఘటన ;) ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)

హహ్హహ్హ కిరణ్.. అందుకే కదా అంత ఈజీగా దాక్కోగలిగింది. మనకి అదో బెనిఫిట్ నిజంగా;) ధన్యవాదాలు నీ సెభాష్‌కి:)))

నైమిష్ గారు, హ్మ్.. అదేమీ కాదండీ..:)

పద్మార్పిత గారు, ధన్యవదాలు:)

మనసు పలికే said...

అవునండీ సత్య గారు, ఒక అబద్దం సేవ్ అయింది మా ప్రొఫెసర్ మంచితనం కారణంగా;) ధన్యవాదాలు మీకు నచ్చినందుకు.

వేణూరాం గారు, హహ్హహ్హా.. అవుననుకుంట:) ధన్యవాదాలు నచ్చినందుకు.

అశోక్,
నువ్వు కూడా భాయపడ్డావా..? హ్మ్.. ధన్యవాదాలు నచ్చినందుకు:)

ఇందు said...

Aparna garu naku same Naimish ki,Ashok gariki vachina doubt ye vachindi.Geetacharya part-2 emo ani :P Anywayz successful ga mee lecturer ki dorakananduku happies.nenu anthe class lo :)) abbooo enni sarlu nidrapoye dannoo!! rendu,moodu sarlu pattubade time lo pencil kinda padesi....adi teestunnattu actions..alaa..nenu attentive gane unnaa ani cheppe prayatnalu enni chesedanno :P

Gud post Appu :)

శిశిర said...

ఇదా విషయం. నేనింకా ఏమిటో అనుకున్నాను. :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

శీర్షిక చూసి మీరు ఏం ట్విస్ట్ ఇస్తారో అని భయపడ్డ మాట వాస్తవం. కానీ చివర దాకా చదివిన తరువాత all హాపీస్ అన్నమాట.
M.Sc. అయిన వెంటనే ఓ కాలేజీ లో లెక్చరర్ గా చేరాను. 45 నిముషాల ఉపన్యాసం బట్టిపట్టి, 10 నిముషాలు అప్పజెప్పెటప్పటికి నాకు నిద్ర వచ్చేసేది. పాపం కుర్రాళ్ళు టైమ్ అయినతర్వాత లేపి, "మాస్టారూ ఫిజిక్స్ మాస్టారు వచ్చి నిద్రపోయే టైము అయింది. మీరు వెళ్ళండి." అని చెప్పేవారు.:)

శివరంజని said...

భలే ఉంది పోస్ట్ ... ఏమిటో అపర్ణ మిగతా టైం లో నిద్రవచ్చినా రాకపోయినా క్లాస్ రూం లో యే మహత్యం ఉంటుందో గాని తెగ నిద్రొచ్చేస్తుంది లే

Ennela said...

హహహ....మా స్నేహితురాలు నిద్ర లేమితో బాధ పడుతోంది..కొంచెం ఆ ప్రొఫెసర్ గార్ల అడ్రెస్స్ ఇద్దురూ...

మనసు పలికే said...

హహ్హహ్హ ఇందు గారు, మీరు కూడా పప్పులో కాలేసారా..? హ్మ్.. బాగున్నాయి మీ ఙ్ఞాపకాలు:)) ధన్యవాదాలండీ టపా నచ్చి వ్యాఖ్య పెట్టినందుకు..

శిశిర గారు, హహ్హహ ఇదే విషయం.. ఖచ్చితంగా ఇదే అండీ:)

గురువు(సుబ్రహ్మణ్యం) గారూ.. హహ్హహ్హా.. మీ అనుభవం మాత్రం విభిన్నమైనది. మీరే క్లాస్ చెబుతూ మీరే నిద్ర పోయారంటే.. ఆహా;) ధన్యవాదాలండీ వ్యాఖ్యకి:)

మనసు పలికే said...

రంజని, హహ్హహ్హ నిజమే మరి. ధన్యవాదాలు:)

ఎన్నెల గారు, నిద్ర లేమితో బాధ పడుతున్నారా మీ స్నేహితురాలు. హ్మ్.. అయితే తప్పకుండా ఇస్తా అడ్రస్:)

సుమలత said...

hello aparna garu yedo vishayam vundani chadivite last daga tension pettimcharu ayena bagundi.

మాలా కుమార్ said...

పేరు మార్చుకున్నారా అనుకున్నాను :)
బాగుంది పోస్ట్ .

Sasidhar Anne said...

Appu , client calls lo inthey nidra vasthundi kada :) .
repoddhuna promotion list cheppe mundu kooda oka 2 hours company gurinchi soodi cheppi, manaki list istharu.. appudu kooda nuvvu padukoni.. nenu aparna kada annava.. ika mana promotion pani govinda govinda........

మనసు పలికే said...

సుమలత గారు, హహ్హహ్హా:) ధన్యవాదాలు.

మాలాకుమార్ గారు, అప్పటికి మార్చేసుకుందామనే అనుకున్నానండీ మరి:(
ధన్యవాదాలు:))

శశిధర్, హహ్హహ్హా బాగా చెప్పావు:) నీకో విషయం తెలుసా, డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు కాంపస్ సెలెక్షన్స్ కోసం ఓ రెండు మూడు కంపెనీలు వచ్చాయి. నేను రెండు ఇంటర్వ్యూలకి వెళ్లాను. మనతో పాటు చాలా మంది ఉంటారు కదా, సో చాలా సేపు ఎదురు చూపులతో సరిపోయేది. సమయమెందుకు వృధా అని అప్పుడు కూడా నిద్ర పోయేదాన్ని;) అయినా రెండిట్లోనూ సెలెక్ట్ అయిపోయాను. అందుకే నిద్రెప్పుడూ నాకు మంచే చేస్తుందని నా ఫీలింగ్;) ఇక ఉద్యోగం లో చేరాక మాత్రం అసలు ఉండాల్సిన నిద్ర కూడా కరువయ్యింది:(

హరే కృష్ణ said...

అపర్ణ చాలా లేట్ గా చూసాను పోస్ట్
హై అంటే ఎత్తుగా
లీ అంటే బ్రెట్ లీ
సోఫి సోఫా ని తిరగేసేయ్
స్టిక్ అంటే అతుక్కుపోవడం
టెడ్ అంటే టెడ్డీ

ఎత్తుగా బ్రెట్ లీ లా సోఫాలు తిరగేస్తూ అతుక్కుపోయే టెడ్డీ ని highly sophisticated అంటారు :)

మనసు పలికే said...

హరే, బాబోయ్.. అసలు నీ తెలివితేటలు ఉన్నాయి చూసావూ.. అద్భుతం :)))
>>హై అంటే ఎత్తుగా
లీ అంటే బ్రెట్ లీ
సోఫి సోఫా ని తిరగేసేయ్
స్టిక్ అంటే అతుక్కుపోవడం
టెడ్ అంటే టెడ్డీ

నాకు తెలిసి ఇంత బాగా ఎవరూ డిస్క్రైబ్ చెయ్యలేరు హైలీ సోఫిస్టికేటెడ్ ని. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

..nagarjuna.. said...

బాబూ!! హరే!!...నీ కామెంటు, సారి ఆధునిక నిర్వచనం చూసాక నా ఝాటర్ ఢమాల్ అయ్యిందయ్యా...పాహిమామ్ పాహిమామ్

వేణూరాం said...

@Nagarjuna gaaru... BINGo...

ఆహ్లాద said...

అపర్ణ నువ్వు కేకెహె :):) !!!
మేము కూడ నిద్రపొతాం క్లాసులో
మేము మరీ దారుణం ఫస్టు సెషన్ కే బజ్జుంటాం

మనసు పలికే said...

నాగార్జున,
>>ఝాటర్ ఢమాల్
చూసి ఎంత సేపు నవ్వుకున్నానో.. నీకు అప్పుడే వ్యాఖ్య పెట్టేసాను అనుకున్నాను. పెట్టలేదనమాట:( క్షమించేసేయ్:))

వేణూరాం, BINGO BINGO..:)

ఆహ్లాద గారు, హహ్హహ్హా.. అయితే మీరు కూడా కేక అనమాట:) మీకొక కాంప్లిమెంట్. "ఆహ్లాద" పేరు వింటే ఎంత బాగుందో:))

..nagarjuna.. said...

ఏంటి అపర్ణ నువ్వు శివరంజని రోల్ తీసుకున్నావా... :P ఈమధ్యన సారీలు ఎక్కువ చెప్పేస్తున్నావ్... :P