Thursday, February 17, 2011

నా సంగీత సాధన

అవి నేను డిగ్రీ చదివే రోజులు. అభిమాన గణంలో మనకున్న పేరేంటంటే, ఏ కళనీ మనం పోషించకుండా ఉండమని;) అదిగదిగో ఏదో గొణుక్కుంటున్నట్టున్నారు మీలో మీరే..? ఎవరేమంటే నాకెందుకు లెండి. నన్ను ఫాలో అవుతున్న ఆ 23 మంది మాత్రం చచ్చినట్లు భరించాల్సిందే కదా. సరే ఇక విషయానికొద్దాం. డిగ్రీ కాలేజీ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, మధ్యాహ్నం 3 గంటలకల్లా గంట కొట్టేస్తారని:) ఇక ఆ తరువాత సంగతి..? నిద్ర పోయే అలవాటు ఉన్న వాళ్లు నిద్రపోతారు. బాతాఖానీ కొట్టేవాళ్లు ఆ పనిలో ఉంటారు. మరి జనాల్ని పీడించుకు తినాలి అనుకునే వాళ్లు..??(ఏంటి దిక్కులు చూస్తారు..? నే చెప్పింది నా గురించే) ఏదో ఒక విధంగా ప్రపంచానికి పనికొచ్చే పని చెయ్యాలని ఆరాటపడతారు. అవ్విధమ్ముగా నేనెంచుకున్న మార్గాలు మూడు (మరి డిగ్రీ మూడు సంవత్సరాలు కదా). ముందు రెండో సంవత్సరంతో మొదలెడదాం. మనమంతే, దేన్నీ సవ్యంగా సాగనివ్వం. హిహ్హిహ్హ్హీ..

సంగీతం ఒక సముద్రం.. ఆ సముద్రాన్ని అనుభవిస్తూ ఈదాలి అప్పుడే అందులోని అందం/ఆనందం అర్థం అవుతుంది.. "ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒకలా అంటాడు, దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని ఇంకోలా అంటాడు, ఏడుస్తున్న బిడ్డ మరోలా అంటాడు. సంతోషంతో అమ్మా అన్న పిలుపు మరోలా ఉంటుంది" లాంటి శంకరాభరణం డయిలాగులు వినేసి ఆ సంగీత సాగరాన్ని మనం కూడా ఈదేద్దాం అని ఈతకు సరిపడే కొలను కోసం హైదరాబాదు అంతా తిరిగేసాను. శంకరాభరణం, సాగర సంగమం, స్వర్ణ కమలం లాంటి సినిమాలు వస్తే మన చెవికి ఇంకేమీ ఎక్కదు, అంత ఇష్టం. అన్నట్టు, నేనొక్కదాన్నే కాదండోయ్.. తిండి తిప్పలు లో నాకు దొరికిన నాలాంటి నేస్తం కూడా. వెతకగా వెతకగా, మన బడ్జెట్‌లో, మనం ఖాళీగా ఉండే టైంలో మనకి సంగీతం నేర్పించగల అదృష్టం ఒక కాలేజికి దక్కింది. అదే కోఠి లోని "త్యాగరాజ సంగీత నృత్య కళాశాల" అక్కడికెళ్ళి విచారించగా తెలిసిన విషయమేంటంటే, వోకల్ నేర్చుకుంటే ఓన్లీ వోకల్ మాత్రమే ఉంటుంది. అదే ఏదైనా వాయిద్యం నేర్చుకుంటే దాంతోపాటూ వోకల్ కూడా కొన్ని రాగాలు నేర్పిస్తారు అని. ఏం చేసినా ఎఫెక్టివ్‌గా ఎఫీషియెంట్‌గా చెయ్యాలి అనుకునే నాలాంటి వారు దేన్ని ఎంచుకుంటారు అనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదేమో కదూ..

ఆ విధంగా వయొలిన్ నేర్చేసుకుందామని, అందులో పట్టా పుచ్చేసుకుందామని ఘాట్టిగా ఫిక్స్ అయిపోయామనమాట ఇద్దరం. ఇంకేముందీ కట్ చేస్తే ఆ తరువాత రోజు నుండీ మొదలు వయొలిన్ క్లాసులు. రోజుకో గంట క్లాసు 5 నుండి 6 వరకు సాయంత్రం. మేమున్న హాస్టల్ నుండి గంట ప్రయాణం. 
 శివరంజని చెప్పినట్లుగా అందమైన, అనువైన, అద్భుతమైన ఆర్.టి.సి. సిటి బస్సులో ప్రయాణం. చాలా సార్లు ఫుట్‌బోర్డింగ్ కూడా చేసే వాళ్లం:( అయినా పట్టు వదలని భగీరథుల్లా సంగీత సముద్రాన్ని ఈదెయ్యాలని 4:45 అయ్యేసరికి కాలేజిలో ఉండే వాళ్లం.

ఒక వైపు నుండి, మృదు మధురంగా అలవోకగా మురళి నుండి బైటికి వచ్చే వినసొంపైన సంగీతం. మరోవైపు నుండి గుండెల్లోనే మృదంగం వాయిస్తున్నట్లుగా అనిపించేది, ఆ మృదంగ వాయిద్యం వింటుంటే. ఇంకోవైపు నుండి సా..రీ..గా..మా.. అంటూ కోరస్‌లో వోకల్ పాఠాలు మనసుని ఉర్రూతలూగించేవి. ఇక వీణ గొప్పతనం చెప్పనలవి కాదు. చెవుల్లో తేనె పోసినట్లుగా ఉండేది. ఏమో అసలు అంత కష్ట పడి చేసిన ప్రయాణం బడలిక అంతా ఇట్టే తీసేసినట్లుగా అనిపించేది. సంగీతం మహత్యం గురించి అందరూ చెబుతుంటే ఏమో అనుకున్నాం కానీ అప్పుడు మాత్రం నిజం గా అనుభవంలోకి వచ్చింది. అలా కాలేజి ఎంట్రన్స్‌లోనే మా మూడ్ అంతా మారిపోయేది:) వయొలిన సౌండ్ మాత్రం మా క్లాస్‌రూంలోకి వెళ్తేనే గానీ వినిపించేది కాదు :( అయినా ఎంత బాగుండేదో.

మరి మా వయొలిన్ గురువుగారి గురించి చెప్పాలి కదా. చాలా పెద్దావిడ లే, (పోయిన సంవత్సరం రిటైర్ అయ్యారు) అచ్చు M.S.సుబ్బలక్ష్మిలా ఉంటారు. విచిత్రం, ఆవిడ పేరు కూడా సుబ్బలక్ష్మే :))) వయొలిన్ ఎలా పట్టుకోవాలి దగ్గరి నుండి, స్వరాలెన్ని, వాటిని ఎక్కడ వేలు పెట్టి వాయించాలి.. ఇక మధ్యలో మధ్యలో కోరస్‌లో వోకల్ నేర్పించడం. ఇవన్నీ మొదట్లో చెప్పిన క్లాసులు. అప్పటికి మాకు అక్కడ సీనియర్లు పరిచయం అయిపోయారు (అక్కడ ర్యాగింగ్, ఫ్రెషర్స్ డే ఇలా ఉండవు. గురు పౌర్ణమితో మొదలు పెడతారు ప్రతి సంవత్సరం తరగతులు) పాపం అందులో ఒక సీనియర్‌కి ఎందుకో మా ఇద్దరి గొంతులు పరీక్షించాలనిపించింది. ఇంకేముందీ, మా పాటల పాండిత్యం అంతా ప్రదర్శించేసాం. నీ గొంతులో ఈ క్వాలిటీ ఉంది, నీ గొంతులో ఆ ఫ్రెష్‌నెస్ ఉంది అని ములగ చెట్టు ఎక్కించేస్తే, తెగ ఆవేశ పడిపోయాంలే. ఆ తరువాత రోజే కచ్చేరీ ఇచ్చేద్దామా అని కూడా అనేసుకున్నాం, అంతలోనే ఫిట్టింగ్ పెట్టకపోతే; వోకల్ బాగా ప్రాక్టిస్ చెయ్యండి ఇద్దరూ రోజూ పొద్దున్నే, అప్పుడైతే నోట్స్ బాగా క్యాచ్ చెయ్యగలరు అని.

ఇక చూడండి మా ప్రయత్నాలు. పొద్దున్నే 5 గంటలకల్లా నిద్రలేచి, సంగీత సాధన మొదలు పెట్టేవాళ్లం;) హాస్టల్ టెర్రస్ మా సాధనకి ని(ఆ)లయమైంది. మా సీనియర్ అంతలా పొగిడారు అంటే అంతో ఇంతో విషయం ఉందనేగా అర్థం. కానీ అదేంటో మా హాస్టల్ పిల్లలు మాత్రం పొద్దున్నే కాకిగోల మొదలైంది బాబోయ్ అని తిట్టుకునే వాళ్లు:( మేము త్వరలో కచ్చేరీ చేసేస్తాం అని కుళ్లు.. అలా ఒక నె....ల రోజులు సాధన చేసాం. కచ్చేరీ సంగతేమో కానీ, (డిగ్రీ) కాలేజీ లో మాత్రం నిద్రొచ్చేది. ఎందుకులే రిస్క్ అని మానేసాం, ప్చ్ :( సరే కాలేజీలో అయితే వయొలిన్ నేర్చేసుకుంటున్నాం ఏకధాటిగా. మరి ప్రాక్టిస్ సంగతో..? అందుకే ఇంట్లో అరిచి, గోలపెట్టి, అన్నం మానేసి, పోరాడి మొత్తానికి డబ్బులు సంపాదించేసాం వయొలిన్ కొనుక్కోడానికి. ఇద్దరం చెరొక వయొలిన కొనుక్కున్నాం. అప్పటి నుండి వయొలిన్ సాధన టెర్రస్ మీద:)) ఇలా అయితే కష్టం, జనాలు మనల్ని ప్రాక్టిస్ చేసుకోనివ్వరు అని హాస్టల్ ఖాళీ చేసి ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాం.

అలా అలా, దాటు స్వరాలు, జంట స్వరాలు, మాయా మాళవ గౌళ రాగం, ఇంకా కొన్ని రాగాలు నేర్చుకున్నాం, గుర్తు లేదు ప్రస్తుతానికి ఏమేం రాగాలు నేర్చుకున్నామో:((. నా నేస్తం మాత్రం మధ్యలోనే మానేసింది:(. అలాగే ఒక సంవత్సరం గడిచిపోయింది. పరీక్షలు కూడా అయిపోయాయి. మా సుబ్బలక్ష్మి టీచర్ దగ్గర మాత్రం నాకు మంచి పేరొచ్చింది (ఇది నిజ్జంగా నిజ్జం) ఈ అమ్మాయి బాగా వాయిస్తుంది వయొలిన్ అని.

కాలానికి నాపై కన్ను కుట్టింది. 2వ సంవత్సరం క్లాసులు 4-5 వరకు ఉండేలా ప్లాన్ చేసింది అందుకే. అదే టైంకి నా డిగ్రీ కాలేజీ 4 వరకు ఉండేలా చేసింది ఈ కాలం:(( అందుకే ఈ కాలానికి నేను బద్ధ విరోధిని. పనిలో పనిగా ఈ తుఛ్చ కాలానికి ఏంటిచ్చేది విలువ అని ఇవ్వడం మానేసాను కూడా.

ఇక తర్వాత అప్పుడప్పుడూ మా సీనియర్ దగ్గరికెళ్లి నేర్చుకునేదాన్ని కానీ ఆ తరువాత పూర్తిగా మానేసాను. అతను మాత్రం చెబుతూ ఉండేవాడు, సుబ్బలక్ష్మి టీచర్ నిన్ను గుర్తు చేస్కుంటూ ఉంటారు అని;) పాపం ఆవిడ గానీ ఇప్పుడు నా వయొలిన్‌ని, దాని తుప్పు పట్టిన తీగల్ని చూస్తే మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తారేమో...

33 comments:

శివరంజని said...

hammayya .......first comment naade ....... chadivaaka malle comment pedataa ..konchem work busy

శివరంజని said...

2

శివరంజని said...

3

శివరంజని said...

4

శివరంజని said...

5

శోభా రాజు said...

హ.. హ... హ.... బాగుంది. నా కాలేజీ రోజులను గుర్తుకుతెచ్చిందీ పోస్టు అపర్ణా. అభినందనలు.. :)

..nagarjuna.. said...

హ్హి హ్హి హ్హి.....ఈ విషయంలో నాదైతే జస్ట్ one day batting...

బులుసు సుబ్రహ్మణ్యం said...

సంగీత సామ్రాట్టు కి స్వాగతం, అభినందనలు . ఎక్కువుగా ఏమైనా అంటే వాయించేస్తారేమో నని భయం.:):)
అనగ అనగ రాగ మతిశయిల్లు అన్నారు. మళ్ళీ మొదలుపెట్టి వాయించేస్తుండండి. విన్న వాళ్ళు కెవ్వు కెవ్వు మనాలి.అంతే.

Sai Praveen said...

నువ్వు కూడా నా టైపేనా :)
మనం కూడా ఇంజినీరింగ్ లో కొన్నాళ్ళు గిటార్ పట్టుకుని దుమ్ము రేపాం (అంటే నిజంగా ఇరగదీసేయ్య లేదు. ఏదో కొంచెం నేర్చుకున్నా). ఇప్పుడు కనీసం దానికి దుమ్ము దులపటానికి కూడా కుదరట్లేదు :)
మొన్నే మా ఫ్రెండ్ గిటార్ కొనుక్కున్నాను, ఎవరైనా నేర్పించేవాళ్ళు తెలుసా అని అడిగి నాలో నిద్రపోతున్న సంగీతకారుడిని డిప్పకాయ కొట్టి నిద్ర లేపాడు. రెండు రోజుల నుంచి కనులు తెరిచినా కనులు మూసినా గిటారే గుర్తొస్తోంది. ఇప్పుడు నీ టపా. ఇవన్నీ ఏవో అదృశ్య శక్తులు అందిస్తున్న పిలుపులుగా నేను భావించుచున్నాను. సంగీత సాధన మరల ప్రారంభించుటకు సమయము ఆసన్నమైనది :)

భాను said...

సిరివెన్నెల చూసి ఆవేశంలో దుకాణాలు వడపోసి ఓ పెద్ద సైజ్ :) ఫ్లూట్ కొనేసి , మనతో పాటో ఇంకో మిత్రుడు కూడా అనుకోండి, మనల్ని మనం కొన్ని రోజులు హరిప్రసాద్ చౌరాశియో లెవెల్లో ఊహించేసుకొని, నేర్పే వాళ్ళ కొరకు వెతికే లోపు , మనల్ని ఆవహించిన ఆవేశం ఫ్లూట్ రంద్రాల్లోంచి గాల్లోకలిసిపోయింది. మీ టపా చదివితే ఆ రోజులు గుర్తుకొచ్చాయి.

విరిబోణి said...

hai aparna,
అంత చక్కగా వాయించడం నేర్చుకుని , ఎందుకు అలా పక్కన పెట్టారు ? నేను ఇండియా లో వున్న టైం లో ఎందుకు నేర్చుకోలేఖ పోయాన అని ఇప్పటికి తెగ బాదపడిపోతుంటా , నా next 2 years లో తప్పకుండా నేర్చుకుంటా, మీ లాంటి వాళ్ళని అందరిని చూసినప్పుడు నేను తప్పకుండ నేర్చుకోవాలి అనే పట్టుదల వస్తుంది :)) టపా బావుంది :) మళ్ళా మీ సాధన ప్రారంబించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా :))

ఇందు said...

అయ్యో అప్పూ! కొనసాగించాల్సింది.....నా ఫ్రెండుకి వయోలిన్ వచ్చు అని చెప్పుకునేదాన్ని :( నాకు సంగీతం,భరతనాట్యం అంటే ఎంత ఇష్టమో!! నాకు నీలాంటి స్టోరీయే ఉంది కానీ...కొంచెం డిఫరెంట్ అనుకో! హ్మ్!! మా ఇంట్లో గిటార్ ఉంది :) చందు కి కొంచెం వచ్చు కానీ నాకు అస్సలు రాదు!! :( టింగ్..టింగ్..టింగ్ అని తప్ప!! :( కాస్త నా గిటార్ ని నీ వయొలిన్ అనుకుని నాకు ఆన్లైన్ పాఠాలు నేర్పవూ!! గురుదక్షిణ నీకు పాపికొండల ట్రిప్లో ఇచ్చేస్తా :) ఇద్దరం బోట్లో కచేరీ చేద్దాం! ఏమంటావ్! డీల్ ఓకే నా??

జయ said...

అబ్బో సంగీతవాద్యాలంటే నాకెంత ఇష్టమో. ఇంతకీ మకెప్పుడు వినిపిస్తున్నారు.

kiran said...

శంకరాభరణం dialogues ..కేక..:D ...
సరే ఎలాగో సాధన ఆపేసావ్ కదా...నేను నేర్పిస్త చూడు...
స..రి...గ..మ...ప....ఏది repeat చెయ్యి....హ్మ్న్న్..పర్లేదు...టాలెంట్ ఉంది..ఇంకాస్త సాధన చెయ్యి..మీ డాబా మీదే..మా ఇంటికి వద్దు..:P(jk)
violin ఆ..గుడ్..నాకు చాలా ఇష్టం ఏదో ఒక సంగీత వాయిద్యం నేర్చుకోవాలి అని..త్వర లో ఆ పని లో పాడుతా..:):)
నీ తెలుగు..నీ టపా..ఎప్పటి లాగ కేకే..:)

కౌటిల్య said...

హ్మ్...నాది కూడా మీలాంటి స్టోరీనే..చూస్తుంటే చాలామందికి ఇలాంటి స్టోరీనే ఉందిలా ఉంది....చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న వీణ...తర్వాత కాసింత గాత్రం...మెడిసిన్ చేసేప్పుడు కాళ్ళు ఖాళీగా ఉండనివ్వక కూచిపూడి వేపు పరిగెట్టిస్తే, చేతులు వయొలిన్ మోగించమన్నాయి...కాని ఏం చేస్తాం, మీరన్నట్టు కాలం ఆ రెంటికీ, నా హాస్పటల్ డ్యూటీలకీ,చదువుకీ పొంతన కుదరనివ్వలా....అలా,అన్నయ్య అపురూపంగా బహుమతిచ్చిన వయొలిన్ అటకెక్కింది, కనీసం శృతి చేసే చేతులులేక...అప్పుడప్పుడూ బుద్ధి పుట్టి నాలుగు స్వరాలు వాయిద్దామా అంటే, శృతిలేక కుయ్యోఁమంటుంది....ః)....కాళ్ళు మాత్రం కూచిపూడిని వదల్లేక అప్పుడప్పుడూ మా కింద పోర్షన్ వాళ్ళ గుండెల్లో ఢంకాలు బజాయిస్తుంటాయి...ః)

హరే కృష్ణ said...

త్యాగరాజ సంగీత నృత్య కళాశాల...త్యాగరాజు పేరు చెప్పుకొని నృత్యం పేరు పెట్టాక కూడా నీకు బల్బ్ వెలగలేదా అప్పూ
పేరు లోనే కంఫ్యూసన్ ఉంది మానేసి మంచి పని చేసావ్ లేకపోతే జీవితాంతం ఆందోళన రాగమే

కావ్య said...

ఇదిగో అప్పు .. నాలోని ఆలోచనల్ని నిద్ర లేపి నన్ను బాధ పెట్టావ్ ..

చిన్నప్పుడు .. స్వాతి కిరణం సినిమా చూసి .. వాణి జయరాం అంత గొప్ప సింగర్ అవ్వాలని .. గోల చేసి గీ పెట్టి .. శాస్త్రీయ సంగీతం లో చేరి .. నెల కూడా అవ్వకుండా మానేసిన గ్రేట్ పర్సన్ ని నేను ..

తర్వాత అన్నమ చార్య కీర్తనలు కొన్నాళ్ళు నేర్చుకున్న .. ఇవి కాస్త బెటర్ ఏ లే .. ఇప్పుడు నా కన్ను గిటార్ మీద పడింది :) .. త్వరలో అది మొదలెట్టబోతున్నగా :) ... ఉహహ్హహ్హహహ ...

త్వరలో నా బ్లాగులో ఆడియో పోస్టులు చూస్తారు మీరంతా .. కెవ్వ్ కెవ్వ్ అని కేకలు పెట్టాలి అంతే

శిశిర said...

మీకు వీలైనంత వరకూ చాలా సంగీతమే నేర్చేసుకున్నారు కదా. :)

శివరంజని said...

అయ్యో అప్పు నువ్వు నా టైపే నా నేను డిగ్రీ లో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి వెళితే అక్కడందరూ చిన్న పిల్లలే వాళ్ళాందరూ నానా అల్లరి చేసేవారు నా వంక తేరి పారా చూస్తుంటే కొన్ని రోజులు వెళ్ళి వాళ్ళ గోల భరించలేక మానేసాను

మనసు పలికే said...

రంజనీ.. ఇంతకు ముందు హరే కొట్టేసేవాడు ఫస్ట్ కామెంట్స్ అన్నీ. ఇప్పుడు నువ్వా..? నాకు రహస్యం తెలియాలి ఎలా ఫస్ట్ కామెంట్స్ కొట్టేస్తున్నారా అని:))
మొత్తానికి పిల్లల గోల భరించలేక మానేసావా:( అయ్యయ్యో.. మళ్లీ ప్రయత్నం చెయ్యి, ఈ సారి పెద్ద వాళ్లతో:) ధన్యవాదాలు..


శోభా రాజు గారు, ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు:). అయితే మీకు కూడా ఇలాంటిదేదో ఫ్లాష్‌బాక్ ఉందన్నమాట:)

నాగార్జున.. నువ్వు కేకలే. ఏంటి, ఒక్కరోజులోనే నేర్చేసుకున్నావా..?;)

వేణూరాం said...

చాల బావుంది మనసుపలికే గారు. మీరు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారిదగ్గర నేర్చుకున్నారా సంగీతం? సూపరు.. :)
అందరిలాగానే నాకు కూడా చిన్న ఫ్లాష్ బాక్ ఉంది. బీ.టెక్ లో ఉన్నపుడు ఒక ఫ్లూట్ కొనుక్కున్నా.(వయోలిన్, గిటార్ అంటే బడ్జెట్ సరిపోదు మరి ). నేను చాల బాగా ప్లే చేసేవాడిని. కానీ ఎందుకో రెండు నిమిషాలు వాయిన్చాక తలనొప్పి వచ్చ్చేది. అమ్మ, నాన్న కూడా ఇదే మాటనేవారు. అయినా సరే నేను హిట్టు సినిమా తియ్యలనుకునే బాలయ్య లాగా పట్టు వదలకుండా ఖాళి ఉన్న్పుదల్లా ఊదేవాడిని. ఈ ఎదవ గోల ఆపక పొతే ఫ్లూట్ పొయ్యిలో పెట్టి కాఫీ పెట్టేస్తా అని అమ్మమ్మ బెదిరించాక ఆపెయ్యక తప్పలేదు. :( :( అలా నాలోని కళాకారుణ్ణి మొగ్గగా ఉన్నపుడే తున్చేసారండీ.. తున్చేసారు..

మనసు పలికే said...

గురూగారూ..
>>సంగీత సామ్రాట్టు కి స్వాగతం
ఆహా మీరలా అంటుంటే నా మనసు ఎంతలా ఉప్పొంగిపోతుందో తెలుసా.. ఈ సందర్భంగా నాకు ఒ....క్క సారి నా వాయులీన వాయిద్యం మీకు వినిపించాలని నా మనసు వువ్విళ్లూరుతుంది;)
మరి మీరు కెవ్వుమంటారో లేదో..:)))

సాయి,
>>ఇవన్నీ ఏవో అదృశ్య శక్తులు అందిస్తున్న పిలుపులుగా నేను భావించుచున్నాను. సంగీత సాధన మరల ప్రారంభించుటకు సమయము ఆసన్నమైనది :)
హిహ్హిహ్హీ.. ఎప్పుడు మొదలు పెడుతున్నావు మరి..? నాక్కూడా చెప్పు, నేను కూడా మొదలు పెట్టేస్తా. ముందుగా వెళ్లి ఆ తుప్పు పట్టిన తీగల స్థానంలో కొత్త తీగలు తెచ్చుకోవాలి :(

భాను గారు,
హహ్హహ్హా. ఏంటో అనుకున్నాను. ఇక్కడ అందరూ సంగీత సామ్రాట్టులే అనమాట.
>>మనల్ని ఆవహించిన ఆవేశం ఫ్లూట్ రంద్రాల్లోంచి గాల్లోకలిసిపోయింది.
కెవ్వూ..:D:D

మనసు పలికే said...

విరిబోణి గారు,
ఏం చేస్తాం చెప్పండి.. ఆ సమయానికి నాకు టైం అలా అడ్డుపడింది:( ఇక మళ్లీ ఆ దారిలో ఆలోచించడానికి కుదరలేదు (డిగ్రీ తరువాత జాబ్‌లో జాయిన్ అయిపోయా). ఐ.టి. సంగతి తెలిసిందే కదా.. తప్పకుండా మళ్లీ సాధన మొదలు పెట్టాలనే ఉంది. మీ ప్రోత్సాహానికి బోలెడు ధన్యవాదాలండీ. మీరు కూడా తప్పక సంగీతం నేర్చుకుని ఆ సౌరభాల్ని ఆస్వాదించాలనిమనస్పూర్తిగా కోరుకుంటున్నాను:)

ఇందు,
హహ్హహ్హ్హ.. నీ వ్యాఖ్యలో నాకు బాగా నచ్చిన వాక్యం ఏంటో తెలుసా.? "ఇద్దరం బోట్లో కచేరీ చేద్దాం!"
కెవ్వ్.. మన కచ్చేరీ కోసం అయినా సరే నేను మళ్లీ మొదలు పెట్టేసి, నీకు కూడా ఆన్లైన్లో నేర్పించేస్తా:))) ఇప్పటి వరకూ ఒక్క కచ్చేరీ కూడా ఇవ్వలేదు మరి:( ఎప్పటైకైనా ఇవ్వాలని ఉంటుంది. ఇక మనం ఎక్కడా తగ్గొద్దు:))

జయ గారు,
మీరెంత మంచివారండీ:) నా వాయిద్యం వినాలని అనుకుంటున్నారు. ఏదో ఒకరోజు తప్పకుండా వినిపిస్తా అండీ.. తప్పకుండా:)

మనసు పలికే said...

కిరణ్,
థ్యాంక్ యూ కిరణ్ థ్యాంక్ యూ..:) పనిలో పని ఇందుకి కూడా నేర్పించెయ్యవా..?;) ఎక్కడైనా శిష్యుడి ఇంటికి గురువు వస్తాడా..? గురువు దగ్గరికి శిష్యుడు వెళ్తాడా..? అందుకే ఇందు, నేను కలిసి మీ ఇంటికే వచ్చేస్తాం.;)
తొందరగా నేర్చేసుకో వాయిద్యం:) అప్పుడు ముగ్గురం కలిసి ఇచ్చేద్దాం కచ్చేరీ:)))

కౌటిల్య గారు,
మీ వ్యాఖ్య నాకు భలే నచ్చింది:) ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి.
అయితే మీరు సకల కళా వల్లభురాలు అనమాట:) నిజానికి నా వయొలిన్ పరిస్థితి కూడా అదే.. శృతి చేసే వాళ్లులేక అది అలా మూలన పడింది:( మీరు మాత్రం కూచిపూడిని ఆపొద్దు..

హరే,
ఆందోళన రాగమా..? హహ్హహ్హా.. ఏం చేస్తాం బాబూ, ఆ మాత్రం బల్బులే ఉంటే ఇలా ఇక్కడ ఉండేదాన్నా..!!

మనసు పలికే said...

కావ్యా..
నీ బ్లాగు ఆడియో పోస్టులతో అప్డేట్ చేసేముందు కాస్త చెప్పమ్మా, కమింగ్ సూన్ అని.. కాస్త మేము ప్రెపేర్ అవ్వాలి;)
వావ్.. అయితే నీకు అన్నమాచార్య కీర్తనలు కూడా వచ్చా..??? నేను అంతవరకూ నేర్చుకోలేదు:(( ఓ పని చెయ్యి.. ఇందు, కిరణ్, నేను కలిసి కచ్చేరీ ఇస్తున్నాం పాపికొండలు బోట్‌లో. చందు గారు గిటార్ వాయిస్తారు ఇందు రిక్వెస్ట్‌తో.. నువ్వు కూడా జాయిన్ అయిపోకూడాదూ:))

శిశిర గారు,
అవునండీ. వీలున్నంతవరకూ అయితే వదలలేదు. ధన్యవాదాలు వ్యాఖ్యకి:)

sneha said...

వచ్చిన కళను మధ్యలో ఆపకూడదండి .వీలు చూసుకుని కొనసాగించండి

మనసు పలికే said...

స్నేహ గారు, తప్పకుండా కొనసాగించడానికి ప్రయత్నిస్తానండీ:) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..

Ennela said...

అపర్ణా..సారీ లేట్ అయిపోయా చాలా...
మీకు సేం పించీ....నేను కూడా కోటీ ఏరియాలో తిరుగుతున్నాప్పుడు ఆ కాలేజీలో చేరిపోయి..సుబ్బ లక్ష్మి గారి లెవెల్లో పాడేయాలనీ తెగ డ్రీంసులు . మా అమ్మ, అక్క మారెడ్పల్లి లో వోకల్ పూర్తి చేసారు...చెల్లి వీణలో చేరి..ఒక సంవత్సరం పాటు మాస్టార్ల గుండెల్లో ట్రంపెట్స్ మోగించి వదిలిందిలెండి..మనమే డ్రీంస్ దాటి ముందుకి సాగలే..ఇంకా అక్కడే..

సుమలత said...

అపర్ణ గారు బాగుందండి ...కొనసాగిచండి మి కలను...

మనసు పలికే said...

ఎన్నెల గారూ.. నేను కూడా సారీ, లేట్‌గా రిప్లై ఇస్తున్నందుకు:))
హహ్హహ్హా అయితే మీ ఫ్యామిలీ అంతా కళాపోషకులే అనమాట. అయితే మన కలలు మాత్రం ఎందుకు అలా దుప్పటి కిందకి నెట్టెయ్యడం..?? బైటికి తీసుకు రండి ఎన్నెల గారూ.. మీ వెంట మేమున్నాం;) ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి:))))

సుమలత గారు, తప్పకుండా ప్రయత్నిస్తా అండీ.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)

Ennela said...

అప్పట్లో "to let"బోర్డ్ ఉండేది అపర్ణా, ఇప్పుడది "too late" అయిపోయింది..హహహ్

మనసు పలికే said...

ఎన్నెల గారూ.. హహ్హహ్హా.. లేట్ మళ్లీ లెట్ గా మారాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను:)

vivek said...

కచ్చేరీ సంగతేమో కానీ,కాలేజీ లో మాత్రం నిద్రొచ్చేది,rtc bus lo foot boardin,.....ilanti konni lines bagunnay lively ga,...its gud..:)