సమయం : సుమారు ఓ రెండు దశాబ్దాల క్రితం..
ప్రశ్న : పాపా ఏం చదువుతున్నావు..?
జవాబు : ఒకటో తరగతి.
మళ్లీ ప్రశ్న : పెద్దయ్యాక ఏమవుతావు.?
మళ్లీ జవాబు : టీచర్.
ప్రశ్నలు ఎవరడిగినా సరే నా సమాధానం అదే. ఎందుకు అంటే చెప్పలేనేమో.. ఏమో, ఊహ తెలిసాక అమ్మ నాన్న చుట్టాలు పక్కాలు కాకుండా పరిచయం అయిన మొదటి బయటి వ్యక్తి టీచర్ అయిన కారణం గానో.. పిల్లలంతా సదరు టీచర్ అనే వ్యక్తికి భయభ్రాంతులయ్యి ఉండడం వలనో.. ఒక మంచి జాబ్ చేస్తూ గౌరవనీయమైన స్థానంలో ఉన్న మా నాన్న, మా స్కూల్ లో టీచర్స్ కి అంతు లేని విలువ ఇవ్వడం కారణం గానో.. ఏమో తెలీదు. ఫైనల్ గా నేను మాత్రం టీచర్ అయిపోవాలనే నిర్ణయించుకున్నా.
అలా టీచర్ అయిపోయినట్లు ఊహించేసుకుంటూ కలల్లో తేలియాడుతూ చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలకి (నా కంటే చిన్న పిల్లలకి;)) చదువు (?) చెబుతూ నాలోని పంతులమ్మని పెంచి పోషిస్తూ ఉండేదాన్ని. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. ఈ "పంతులమ్మ" అని నన్ను మా తాతమ్మ ఎక్కువగా పిలుస్తూ ఉండేది. ఆవిడతో నాకు చాలా అనుబంధం ఉండేది. నా 4వ తరగతి లో మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. కానీ నాకు ఆ ఙ్ఞాపకలు మాత్రం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి.
ప్రతీ రోజూ.. కళ్లజోడు పెట్టుకుని పుస్తకాల్లో పాఠాల్ని మస్తిష్కాల్లోకెక్కించే టీచర్లా కాకుండా, ఎక్కాలు అప్పజెప్పలేదన్న కారణంగా గోడ కుర్చీ వేస్తూ, సామాన్యశాస్త్రాన్ని అతి సామాన్యంగా తీసుకుని చేతులు ఎరుపెక్కేలా బెత్తంతో దెబ్బలు తినే స్టూడెంట్ లాగానే స్కూల్ కి వెళ్లినా.. టీచర్ అయిపోవాలన్న నా జిఙ్ఞాస మాత్రం లెక్కల్లో ఎక్కమంతైనా తగ్గలేదు(లాజిక్కులు అడగొద్దు). నేను టీచర్ అయిపోయి పిల్లల్ని హింసించడానికా అన్న ప్రశ్న మీకు అస్సలు రాకూడదు. మొగ్గగా ఉన్నప్పుడే నాలోని పంతులమ్మని గుర్తించి, మా టీచర్లు, నా తోటి విద్యార్థులకి నాచేత పాఠాలు చెప్పించేవారు. (మీకు తెలీదా, క్లాసులో నిద్ర పోతూ ఉంటే ఆ రోజు చెప్పిన పాఠాన్ని ఆ తరువాత రోజు చెప్పమనే వారు. అలా నాలోని పంతులమ్మని బోలెడన్ని సార్లు నిద్ర లేపాల్సి వచ్చింది నేను క్లాసులో నిద్రపోయి;))
నేను పెరుగుతున్న కొద్దీ నాకు ఇంకా పెరిగిన పెద్ద పెద్ద టీచర్లు దొరికి నాలోని పంతులమ్మని కూడా ఇంకా పెంచి పెద్దది చేసారు. అంటే పరీక్షలు పెట్టే స్థాయికి ఎదిగిందనమాట పంతులమ్మ. ఆ రోజులే వేరులే. 9వ తరగతిలో మా లెక్కల మాస్టారు లెక్కల్లో మన ప్రావీణ్యాన్ని గుర్తించి నలు దిక్కులా వ్యాపింపజేసి, పూ......ర్తిగా నమ్మకం పెంచేసుకుని, పక్కన విద్యార్థులని పరీక్షించమని ఆర్డర్స్ వేసి బయటికి వెళ్లిపోయేవారు ఎంచక్కా.. కాకా పట్టించుకోవడం అంత బాగుంటుందని తెలిసిన మొదటి రోజులవి. "అప్పు, ఈ సిద్ధాంతం వద్దు అప్పు, అది ఇవ్వు. ఈ లెక్క అస్సలు వద్దు ప్లీజ్ ఈజీ ది చూసి ఇవ్వు." ఆహా ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే భలే సంతోషంగా ఉంటుందిలే ;)
అలా పెరిగి పెరిగి నాలోని పంతులమ్మ డిగ్రీలోకి వచ్చింది. ఈసారి అత్య్తుత్సాహంతో, ఒక ట్యుటోరియల్ లో చిన్న పిల్లలకి పాఠాలనమాట:) నిజంగా అవి మాత్రం బంగారు రోజులు (ఇదిగో అమ్మాయిలూ గాజులు కాదు రోజులు). 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకూ అనమాట. 2 గంటల పాటు వాళ్లకి అన్నీ నేనే చెప్పాలి. వాళ్ల హోం వర్క్ చేయించాలి ఒక 15 మంది పిల్లలు. భలే ఉండేవాళ్లు ముద్దు ముద్దుగా.. కానీ ఒకటే బాధ, హైదరాబాదు స్కూల్స్ కదా తెలుగు రాదు ఎవరికీ :(. తెలుగు తల్లిని బ్రతికించడానికి నావంతు కృషిగా వాళ్లకి తెలుగు బాగా నేర్పించడానికి కష్టపడ్డాను. వాళ్లకి బాగా వచ్చిందనైతే చెప్పను కానీ అంతకు ముందు కంటే కాస్త మెరుగు అని చెప్పడానికి గర్వపడుతున్నాను:) వాళ్లు నన్ను టీచర్ టీచర్ అని పిలుస్తూ ఉంటే భలే ముచ్చటగా అనిపించేది:) నేను నిజంగా ఒక టీచర్ అయితే నా విద్యార్థులకి ఏమేమి బుద్దులు నేర్పాలో, చదువొక్కటే ముఖ్యం గమ్యం కాదు అంతకు మించిన విలువలు ఎన్ని ఉన్నాయో ఎలా వాటిని పాటించాలో ఇవన్నీ వాళ్లకి చెప్పడానికి ప్రయత్నించేదాన్ని వాళ్ల వయసుకు తగ్గట్టుగా. ఒక సంవత్సరం పాటు చెప్పినా ఒక్క రోజు కూడా ఎవ్వరినీ కొట్టలేదు, నేనంటే భయం కాకుండా గౌరవం ఏర్పడేలా చెయ్యడానికి ప్రయత్నించాను. నిజంగా నాకు చాలా నచ్చిన రోజులు అవి. ఇక ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా, క్యాట్ ప్రిపేర్ అయ్యే ఒక అమ్మాయికి హోం ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాను. నేను పదిలపరుచుకోవలసిన గొప్ప ఙ్ఞాపకాలు అయితే ఏమీ లేవు ఆమెతో:)
అసలిప్పుడీ గోలంతా మాకెందుకు తల్లీ అంటున్నారా??? మరేమో ఈ మధ్యనే దేవుడిచ్చిన ఒక అన్నయ్య అమ్మా నాన్నతో పరిచయమయిందనమాట:) అంటే మా పెద్దమ్మ పెదనాన్నతో:) అయితే మాకేంటీ అంటే బెత్తంతో కొట్టేస్తా అంతే.. ఎంచక్కా, పెద్దమ్మా పెదనాన్నా ఇద్దరూ ఉపాధ్యాయులే.. నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయమేమనగా అటు పెద్దమ్మ వాళ్లింట్లో ఇటు పెదనాన్న వాళ్లింట్లో అందరి వృత్తీ అదే:) చాలా సంతోషకరంగా అనిపించిన విషయమేమనగా, వారి వృత్తి పట్ల వారికున్న గౌరవం, అంకిత భావం. మాటల్లో చెప్పలేనంత గౌరవం పెరిగిపోయింది వారి మాటలు వింటూ ఉంటే. అవే మాటలు నిద్రపోతున్న నా చిన్నతనపు ఙ్ఞాపకాలని తట్టి లేపాయి. మామూలుగానే నాకు ఉపాధ్యాయ వృత్తి పట్ల చాలా ఇష్టం గౌరవం ఇంకా చాలా ఉన్నాయి:) ఇంక పెదనాన్న మాటలు వినగానే అవన్నీ, వర్షాకాలంలో మా ఊరి గోదారిలా ఉప్పొంగి పోతున్నాయి. ఒక్కసారిగా టీచర్ అవ్వాలన్న కోరిక మళ్లీ నన్ను బలంగా తాకింది.
చేసే పనిని ఒక ఉద్యోగంలా కాకుండా, ఒక సేవగా సమాజం పట్ల తమవంతు బాధ్యతగా చేస్తూ దాన్నే ఇష్టపడుతూ, గర్వంగా చెప్పుకోవడం.. నాకు భలే అనుభూతినిచ్చింది:). ఒక్కసారి నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఎన్ని సార్లు నేను చేసే పనిని ఒక సేవలా సంతోషంగా చేసాను? బహుశా అసలు ఒక్కసారి కూడా లేదేమో.. మనం నీతిగా చేసే పని ఏదైనా సరే, దాని పట్ల మనకి గౌరవం ఉండడం కదా ముఖ్యం. ఏంటో.. ఏదో మొదలు పెడితే అది ఇంకేదో అయ్యేలా ఉంది.
సాధారణంగా మారుమూల పల్లెటూర్లలో ఉన్న పాఠశాలల్లో పని చేసే టీచర్లు ఎంతమంది ప్రతి రోజూ వెళ్లి పాఠాలు చెబుతారు? అసలు చెకింగ్లు గట్రా జరగవు అని తెలిస్తే ఇక స్కూల్ అన్నది ఒకటి ఉందన్న విషయమే మర్చిపోతారేమో. అదే అభిప్రాయంతో ఉన్న నేను అన్నయ్య మాటలతో కళ్లు తెరిచి, ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఒక చిన్న పాఠశాలకి కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకుని దాని అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మా పెదనాన్న నిబద్ధతని చూసాను.
మాటల మధ్యలో పెదనాన్న అన్నారు "మా అబ్బాయిని కూడా ఒక మామూలు గవర్నమెంట్ స్కూల్ లోనే వేశామమ్మా. అందరూ అడిగారు, స్థోమత ఉండి కూడా ఇలా గవర్నమెంటు స్కూల్ లో తెలుగు మీడియంలో వేస్తే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? కాన్వెంటులో చేర్పించొచ్చు కదా అని.. కానీ తల్లి.., నేను నా భార్య గవర్న్మెంటు స్కూల్ లో ఉపాధ్యాయులం. మా పిల్లల్నే బయట చేర్పిస్తే మమ్మల్ని మేము అవమానించుకున్నట్లే కదా.." అని. మాటలు కరువైన మనసు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉందంటారా!!!
శ్రేయోభిలాషులంతా భయపడ్డట్లు మా అన్నయ్య భవిష్యత్తుకి ఏమీ కాలేదు. ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి, అంతకన్నా మంచి పేరుని సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా చాలా మంచి వ్యక్తిగా ఎదిగాడు :))
నేను మర్చిపోయిన నా ఇష్టాన్ని, చిన్నతనపు ఙ్ఞాపకాల్ని పరోక్షంగానైనా గుర్తు చేసి.. యాంత్రికమైపోయిన జీవితంలో ఆశల చిగుళ్లని మళ్లీ మొలకెత్తించిన పెద్దమ్మ, పెదనాన్నలకి ప్రేమతో అంకితం..:))

24 comments:
పాఠం బాగా అర్ధమయింది టీచర్
నైస్ ఆర్టికల్. ఇంతకీ మీరిపుడు పంతులమ్మ అవలేదా!!!
cool
పంతులమ్మ అంటే పదహారేళ్ళ వయసు శ్రీదేవి గుర్తొస్తుంది. ఆ టీచర్ నా రోల్ మోడల్ అన్నమాట. నాక్కూడా పాఠం బాగానే అర్ధమయింది టీచర్. వ్యర్ధం కాలేదు:)
టీచర్, టీచర్!
భలే బాగా చెప్పారు. కానీ, టీచర్ల కష్టాలు టీచర్లవి! టీచర్ కడుపులో పుడితే కానీ తెలియనివి కొన్ని వున్నాయి. అవి పాఠం వినని పిల్లల్లాంటివి.
మీ కథనం బాగుంది, మరిన్ని కథలు వినిపించండి.
అప్పూ! నేను నీ బ్లాగ్ ఫాలో అవుతున్నా ఎందుకో నీ పోస్ట్‌ల అప్డేట్స్ నాకు రావట్లేదు. అలా లాస్ట్ పోస్ట్లన్నీ మిస్ అయ్యా! ఈ పోస్ట్ కూడా నీ బ్లాగ్ అడ్రస్ కొట్టి చూస్తే కాని తెలీలేదు :( ఏం జరుగుతోందీఈ :(((((((((((
బహుసా పిల్లలందరి మొదటి కోరిక టీచర్ కావాలనే . మీకు ఇప్పటికి ఆ కోరిక సజీవం గా వుందన్నమాట :)
మీరు చాలా బాగా రాసారు అపర్ణ .మీ బ్లాగ్ చాలా ఇష్టం అండి .
ఈ ప్రపంచంలో నాకు నచ్చని ఓకే ఒక్క పదం "టీచర్". మా అటు తాతగారు, ఇటు తాతగారు, మా ఐదుగురు అత్తలు, మా పెదనాన్న గారు, వాళ్ళ అందరు కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మా పెద్దమావయ్య, మా అమ్మగారు, ఒకప్పుడు మా తమ్ముడు ఇలా కొంపలో టీచర్లని చూసి చూసి విరక్తి వచ్చేసింది. టీచర్లతో ఇంకో తలనొప్పి ఏంటంటే వాళ్ళు రిటైరయ్యాక ఇంట్లో వాళ్ళు కూడా స్టూడెంట్స్ లాగే కనపడి ప్రతీదానికీ క్లాస్ పీకుతారు.
అప్పూ సేం పించ్...చిన్నప్పటినుండీ తెలుగు టీచర్ అవ్వాలని నా కోరిక. మా స్కూల్ లో తెలుగు టీచర్లని నేను ఇష్టపడ్డాను అని చెప్పుకుంటే చిన్న మాట...ఆరాధించేదాన్ని. వాళ్లని చూసి నేనూ తెలుగు టీచర్ అయిపోవాలనుకునేదాన్ని. కొన్నాళ్ళయ్యాక తెలుగు కాకపోయినా టీచర్ అయిపోవాలి అనుకునేదాన్ని. ఆ కోరిక నాలో ఇప్పటికీ రగులుతున్నాది. నేను త్వరలో అవుతాను కూడా...ఉపాధ్యాయ వృత్తే నా ధ్యేయం...అదే నాకు ఇష్టం కూడా.
మొన్ననే ఒక స్నేహితుడు కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ గా పని చేస్తున్నాడు. తను ఒక మాటన్నాడు. "నేను క్లాసులోకెళ్ళగానే పిల్లల మొహాల్లో సంతోషం...ఏదో ఆనందం...అది చూస్తే నాకు కడుపు నిండిపోతుంది. నాకోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారనే ఊహే గొప్పగా ఉంటుంది" అని.
అలాగే నా చిన్నప్పుడు మా మావయ్య ఒకాయన ఒక మాట చెప్పారు. మనం లాయర్ దగ్గరకో, డాక్టర్ దగ్గరకో ఒక సమస్యతో వెళతాము. కాని ఒక్క టీచర్ దగ్గరకే సమస్యలతో వెళ్ళం more over నేర్చుకోవడానికి వెళతాం...అదీ టీచర్ గొప్పతనం" అని. ఆ మాటలు మనసులో నాటుకుపోయాయి.
అమ్మో ఇది చూస్తుంటే నీ టపా కన్నా పెద్ద కామెంటు రాసేలా ఉన్నాను. ఈ పొస్ట్ చదవగానే నాలో టీచరమ్మ బయటకు దూకింది మరి! :)
మా ఇంట్లో కూడా చాలామంది ఉపాధ్యాయులే కాకపొతే కాలేజీలో, స్కూల్లో కాదు.
బావున్నాయి పంతులమ్మ గారూ.. మీ జ్ఞాపకాలు.. :)
నేను చిన్నప్పుడు లారీ డ్రైవరు కానీ జట్కా తోలేవాడు కానీ అవాలను కున్నాను. ఆ తరువాత రైలు కానీ విమానం కానీ తోలుదా మను కున్నాను. టీచర్ అవాలని అనుకోలేదు. కానీ M.Sc. అయిన వెంటనే ఒక 7 నెలలు లెక్చరర్ గా చేశాను. ఆ తరువాత కధ మారిపోయింది.
టీచర్ గారింట్లో పుట్టాను కాబట్టి టీచర్ అవాలను కోలేదు. ఈ కాలం లో టీచర్ లకి ఫరవాలేదు అనుకుంటాను. కానీ మా నాన్న గారు 1968 లో రిటైరు అయినప్పుడు ఆయనకి Rs.200/ వచ్చేది అనుకుంటాను.
మీ టపా చూసిన తరువాత ఇవన్నీ గుర్తుకు వచ్చాయి.
టీచర్ గారు టీచర్ గారూ మీరు చెప్పిన పాఠాలు అర్ధం ఆయాయి కానీ ... బుర్ర గోక్కుంటున్న నేను.
నా జీవితం లో ఇప్పటివరకూ ప్రతీ దశ లోనూ ఉన్న మంచీ, చెడ్డా అనుభవాలన్నీ టీచర్లతోనే. నన్ను కన్నోళ్ళూ తిట్టినోళ్ళూ,కొట్టినోళ్ళూ, పొగిడీనోళ్ళూ అందరూనూ. ఈ ప్రభావం వలనే అనుకుంటా చిన్నప్పుడూ నా లక్ష్యం కూడా టీచర్ అవ్వాలనే ఉండేదీ. ఇదే చెప్తే ఒకసారి మా లెక్కల మాష్టారు క్లాస్ పీకారు."బతకలేక బడి పంతులు రా.. నీ ఎయిమ్ పెద్దదిగా ఉండాలీ అనీ.." హ్మ్మ్... మైన్ ట్రాక్ వదిలేస్ సైడ్ ట్రాక్ లోకొచ్చి పడ్డాను. అప్పటి సంగతేమోగానీ ఇప్పుడు మాత్రం గవర్న్మెంట్ టీచర్ జాబ్ కి ఉన్నంత కాంపిటీషన్ ఏ జాబ్ కీ లేదు. ;) ;)
మీరన్నట్టూ ఉపాధ్యాయ వృత్తంత పవిత్రమయిన వృత్తీ, గౌరవనీయమయిన వృత్తీ వేరేదీ లేదు.చాలా బావున్నాయండీ మీ అనుభవాలూ, మీరు చెప్పిన తీరూ, టోటల్ గా మీ పోస్టూనూ..
చాలా బాగుంది అప్పు..
మీరు ఎప్పుడో ఒకప్పుడు టిచర్ అవుతారండి తప్పకుండ అవుతారు ....
బాబోయ్ నీలో అపరిచితమ్మ ని మాత్రమే చూసిన మాకు ఈ అవకాశం కూడా కల్గిన్చినందుకు ధన్యోస్మి ధన్యోస్మి
>>>నేను చిన్నప్పుడు లారీ డ్రైవరు కానీ జట్కా తోలేవాడు కానీ అవాలను కున్నాను
నేను కూడా లారీ డ్రైవర్ నే అవ్వాలని అనుకున్నాను గురువు గారు నేను ఐదో తరగతి లో ఉన్నప్పుడు ఆ దొంగ మొహం బాలకృష్ణ గాడు ఆ పేరు తో సినిమా తీసి విజయశాంతి ని చంపేసాడు :((
జట్కా డ్రైవర్...అవుదామంటే పేటా వాళ్ళు కేస్ వేస్ వేస్తున్నారు
లలిత గారు, అద్ది, అలా పాఠాలు మంచిగా అర్థం చేసుకుంటే మీరు కూడా టీచర్ అవుతారు;);)
ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి:)
రాజేష్ గారూ, ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు. నేనెక్కడ పంతులమ్మ అయ్యానండీ, సాఫ్ట్వేర్ అమ్మ అయ్యాను:((
అఙ్ఞాత గారు, ధన్యవాదాలు.
జయ గారూ,
హహ్హా అయితే మీరు కూడా లలిత గారిలాగా టీచర్ అయిపోతారు;) ధన్యవాదాలండీ వ్యాఖ్యకి:))
అఫ్సర్ గారూ,
ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు:) మీరన్నది నిజమే, టీచర్ల కష్టాలు టీచర్లవి. కానీ ఇష్టమైన వాటిలో కష్టాలు కూడా ఇష్టంగానే ఉంటాయి కదండీ :))
మీ వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలు:)
ఇందు, ఇప్పుడు ఓకే నా.. నా బ్లాగు ఫీడ్ రీడర్ ని రీస్టార్ట్ చేసా;)
మాలా కుమార్ గారూ, హ్మ్మ్ నిజమే కావచ్చు:) చాలా మంది మొదటి కోరిన టీచర్ కావాలనే ఉంటుంది. అవునండీ, నా కోరిక ఇంకా సజీవంగా ఉంది. ఎప్పటికైనా ఖచ్చితంగా అవుతాను:))
అఙ్ఞాత గారు, ధన్యవాదాలండీ..
శంకర్ గారు, హహ్హహ్హా.. మీ ఇంట్లో అందరూ టీచర్లేనా, భలే భలే:) మా ఇంట్లో ఎవ్వరూ లేరు:( ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)
సౌమ్య గారూ, ముందుగా శ్రమపడి ఇంత పెద్ద వ్యాఖ్య పెట్టినందుకు బోలెడు ధన్యవాదాలు:)
"నేను క్లాసులోకెళ్ళగానే పిల్లల మొహాల్లో సంతోషం...ఏదో ఆనందం...అది చూస్తే నాకు కడుపు నిండిపోతుంది. నాకోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారనే ఊహే గొప్పగా ఉంటుంది" అద్భుతం కదా:)) నాక్కూడా ఈ సంతోషమే కావాలి సౌమ్య గారు. ఖచ్చితంగా సాధిస్తానుకోండి:))
మధుర, ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి:)
గురూ గారూ, హహ్హ జట్కా తోలుదాం అనుకున్నారా:) నాకు జట్కా బండి భలే ఇష్టం గురూ గారూ:) మీరు 7 నెలలు ఏంటీ, ఇప్పుడు కూడా గురువుగారే కదా..ఎక్కువగా గోక్కోకండి బుర్ర, మళ్లి నాకు మీరు బోలెడు పాఠాలు చెప్పాలి..హహహ్హ...వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలు:))
రాజ్, "ఇప్పుడు మాత్రం గవర్న్మెంట్ టీచర్ జాబ్ కి ఉన్నంత కాంపిటీషన్ ఏ జాబ్ కీ లేదు." నిజ్జం నిజ్జం నిజ్జం :))) చాలా చాలా థ్యాంక్స్ రాజ్, టపా నచ్చినందుకు,నీ వ్యాఖ్యకి:))
వేణు గారు, ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి:)
బంతి గారు, హహ్హహ్హ ధన్యవాదాలు వ్యాఖ్యకి:)
హరే, బోలెడు ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి:) ఈ అపరిచితమ్మ ఏంటీ????;)
అపర్ణ టీచర్....essay బాగా రాసారు...!!
మీ పెదనాన్న గారి అంకిత భావం కేక..:)
ఇక మీ అన్నయ్య మంచి పోసిషన్ లో ఉండటం ఆనందదాయకం..:)
మిమ్మల్ని ఓ కాట్టన్ చీర...పెద్ద కొప్పు....కళ్ళ జోడు..చేతిలో కర్ర తో ...ఉఉహించుకుంటున్న
అపర్ణా పంతులమ్మ కథనం చాలా బాగుంది.. టీచర్ అవ్వాలని అవలేక, ఇలా గుర్తుకు తెచ్చుకుని అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషం. నీకు ఇంకా సంతోషం కలిగించే మాట చెప్పనా... త్వరలోనే నేను పంతులమ్మను అవబోతున్నా.. అయ్యాక మొట్టమొదటగా నీకే చెబుతాను సరేనా... :)
కిరణ్.. హహ్హహ్హా, బాగా ఊహించుకో నన్ను టీచర్ లా. ఏదో ఒక రోజు నీకే టీచర్ లాగా వస్తా ;) ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి:))
శోభ గారు,
నిజమా మీరు పంతులమ్మ అవుతున్నారా??? మరి నేనో..?? :( నన్ను కూడా తీస్కెళ్లండీ.....
మొత్తానికి అనుకున్నది సాధిస్తున్నందుకు అభినందనలు:) మీరు టీచర్ అయ్యే క్షణం త్వరగా రావాలని కోరుకుంటున్నాను:))
Post a Comment