మనం ఎప్పుడైనా ఒక అందమైన వస్తువుని చూసినప్పుడో.. అందమైన దృశ్యాన్ని చూసినప్పుడో.. అందమైన అబ్బాయిని/అమ్మాయిని చూసినప్పుడో.. ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోతాం. అలా ఏదైనా అందంగా కనిపించినప్పుడు కనీసం ఒక్క క్షణమైనా చూడకుండా ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. అంతెందుకు, ఉన్నంతలో అందంగా కనబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందమంటే అంత ఇష్టం. ఆ అందానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాం అంటే అందంగా ఉంటే జీవతం అంతా ఆనందంగా ఉండిపోగలం అన్నంతగా (డవుటా..? ఈ పాట వినండి "అందమె ఆనందం.. ఆనందమె జీవిత మకరందం..") తలా తోక లేని ఈ ఉపోద్ఘాతం ఏంటా అని చూస్తున్నారా.? మరదే.. చెప్పేది calm గా వింటానంటేనే చెప్తాను. లేదంటే కచ్చే.. హహ్హ.. అదీ అలా రండి దారికి.
నేను డిగ్రీ చివరి సంవత్సరం లో ఉన్నప్పుడు అనుకుంటా.. నా ఒకానొక నేస్తం బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటే, నేను కూడా తోకలా తన వెంట వెళ్లాను. నేను ఒక చిన్న పల్లెటూరి నుండి రావటం వలన , హైదరాబాదు కి వచ్చి మూడు సంవత్సరాలు అయినా చదువు మీద(??) ఇతరత్రా విషయాల మీద ( అంటే చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్పడం, ఏదో కొంచెం సంగీతం పట్ల కూడా అవగాహన కలిగించుకుందాం అన్న సదుద్దేశంతో వయొలిన్ పాఠాలు నేర్చుకోవడం, తెలుగు నవలలు కథలు చదువుకోవడం లాంటివన్నమాట.) ధ్యాస పెట్టడం వలన అప్పటి వరకూ బ్యూటీ పార్లర్ ముందున్న మొదటి మెట్టు మీద కూడా అడుగు పెట్టలేదు. కానీ నా దురదృష్టమో అదృష్టమో.. ఆరోజు.. అందమంటే ఎంత బాధో నాకు తెలిసి రావాల్సిన రోజు.. అలా నా నేస్తంతో బ్యూటీ పార్లర్ కి వెళ్లాను. సరే వెళ్లాను, కానీ ఎంచక్కా తన పని తను కానిస్తూ ఉంటే, ఒక మూల కూర్చుని చూస్తూ ఆనందించవచ్చు కదా. ఉహు.. అలాక్కాదు. నాకు కూడా ఫేషియల్ చేసెయ్యమని ఆర్డర్ ఇచ్చేశాను. "ఏ ఫేషియల్?" అన్నది ఆ పార్లర్ హెడ్ ప్రశ్న. నా నేస్తం మాత్రం ఏదో చెప్పేసింది. నాకు వినిపించలేదు. మరి తెలియదు అంటే పరువు పోతుంది కదా. అందుకనే చాలా తెలివిగా "ఏమేమి ఉన్నాయి?" అని నా బాణాన్ని సంధించాను. నార్మల్,******,గోల్డ్. అయ్యబాబోయ్.. ఇదేంటి?? చిత్రగుప్తుడు తప్పుల చిట్టా చదివినట్లు చదువుతుంది అని అనుకునేలోగా ఒక పేరు మాత్రం నన్నాకర్షించింది. ఫ్రూట్ ఫేషియల్. మళ్లీ ఎక్కడ మర్చిపోతానో అని ఠక్కున చెప్పేశా.. సరే పేరు చెప్పేశాం. మరి తరువాత సంగతి? మెళ్లో గొలుసు, చెవుల జూకాలు తీసెయ్యమని చెప్పింది. సరే పాపం అని తీసేశా. ఎంచక్కా ఒక పెద్ద ఈజీ చెయిర్ మీద కూర్చోబెట్టింది. జుట్టంతా పైకి కట్టేసింది. ఆహా ఎంత గొప్ప మర్యాద అనేస్కున్నాను మనసులో. ఇక మొదలు పెట్టింది ఫేషియల్ ప్రహసనం. నన్ను మాత్రం కళ్లు మూసుకో అని చెప్పి నాకు మొదటి సారి జరిగే ఆ మహత్కార్యాన్ని నేను చూస్కోకుండా చేసింది. పోనీలే పాపం అని ఈ విషయంలో కూడా కళ్లు మూసేస్కోని త్యాగం చేసేశాను. ఏదో నీళ్ల లాంటి ద్రావకంతో మొహమంతా కాటన్ తో క్లీన్ చేసింది. (దీన్నే Cleansing అంటారని నాకు తరువాత తెలిసింది..:) ) ఎంచక్కా తను అలా సుతారంగా కాటన్ తో తుడుస్తూ ఉంటే.. ఆహా నా మనసు ఎక్కడెక్కడికో ఎగిరిపోయింది. ఆ తరువాత ఏదో పదార్దం తో మసాజ్ చెయ్యడం మొదలెట్టింది. నాకు ఆ క్షణంలో "అనుభవించు రాజా.." పాట గుర్తు రావడం ఇప్పటికీ గుర్తుంది:) అలా అలా స్వర్గలోకపుటంచులదాకా వెళ్లాను. అదిగో అప్పుడే మసాజ్ చెయ్యడం ఆపేసి మళ్లీ కాటన్ తో తుడిచేసింది. మరేమో అప్పుడు నాకు చాలా కోపమొచ్చేసింది. ఎందుకంటారేమిటి..? అలా స్వర్గాన్ని ఆశ చూపించి చివరి నిమిషంలో ఇలా లెఫ్ట్ లెగ్ పట్టుకుని లాగెయ్యడం ఏమైనా బాగుందా..? అప్పుడు మొదలయింది నా మొహానికి ఏదో వేడిగా తగలడం. ఆ వేడి కొంచెం కొంచెం గా ఎక్కువ అవుతూ ఉంది. (కళ్లు మూస్కున్నాను కదా నాకు అక్కడ ఏం జరుగుతుంది అని తెలియదు. అది స్టీం అట. తరువాత తెలిసింది). బాబోయ్ అది చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. ఆపవే బాబూ అని మనసులోనే అభ్యర్ధిస్తూ నా ముఖ కవళికలతోనే ఆ బ్యూటీషియన్ కి చెబుతూనే ఉన్నాను. అప్పుడే Koktail jiuce అనుకోని ఒక లీటరు ఆముదం తాగినట్లుగా పెట్టాను నా మొహం. అయినా అర్థం చేస్కోదే..! బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది , కాస్త తప్పించవే ఆ వేడిని అనుకుని నా మొహాన్ని అటు ఇటు తిప్పడం మొదలెట్టాను. అప్పటికీ కరుణించదే.. అలా బరువుగా భారంగా మంటగా చాలా సుదీర్ఘ ఘడియలు గడిచిన పిదప, ఆ దేవుడు నా మొర ఆలకించి ఆ బ్యూటీషియన్ చెవిలో నా గోడును వేసినట్లున్నాడు. ఆపేసింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నానా. అంతలోనే మళ్లీ ఏమైందో.. దేనితోనో నా ముక్కుని గిల్లడం మొదలెట్టింది (removing black/whiteheads అట.). బాబోయ్.. ఈ సారి ఆముదం ఒక్కటే కాదు అన్ని రకాల నూనెలు, కూల్ అండ్ హాట్ డ్రింకులు ఇంకా ప్రపంచంలో ఎన్ని రకాల ద్రావకాలు ఉన్నాయో అన్నీ కలిపి కడుపులో పోసినట్లుగా పెట్టాను మొహం. కళ్లు మూసుకోవడం వల్ల ఆ పరికరం ఏంటో చూడలేకపోయాను కానీ, ఆ క్షణానికి మాత్రం మళ్లీ ఆ శివయ్యే నాకు శతృవులా కనిపించాడు, తన త్రిశూలాన్ని ఈ బ్యూటీషియన్ చేతికి ఇచ్చి. ముక్కంతా నొప్పి, మంట. ఎన్ని రకాల హావభావాలు ప్రదర్శించినా పట్టించుకోదే..! అదిగో.. సరిగ్గా అప్పుడే.. అప్పుడే అర్థమైంది. అసలు అందం కోసం ఎంత బాధ పడతామో.. అందంగా కనిపించడం కోసం ఎంత బాధ పడతామో.. నాకు తెలిసినంత వరకూ అందంగా ఉన్న తర్వాత కూడా ఎదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. అసలు అందమంటేనే బాధ అన్న విషయం అప్పుడే అర్థమైంది.. ఇక లాభం లేదని మనసులో బోల్డన్ని తిట్లు తిట్టేస్కున్నాను. ఓయీ పాపాత్మురాలా. దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట దుర్మదాంధురాలా... ఎంతో సున్నిత సుకుమారమైన ఈ యువరాణివారి ముక్కుని ఇవ్విధమ్ముగా హింసించెదవా..! రేపు సూర్యోదయం కల్లా నీ ముక్కు మీద వెయ్యి కాదు కాదు లక్ష black/whiteheads వచ్చి గంట సేపు నిన్ను ఇలాగే కూర్చోబెట్టి ఇదే త్రిశూలంతో నీ ముక్కుని మరో బ్యూటీషియన్ హింసించు గాక. హ్హ. అసలు నా ఈ తిట్లన్నీ వింటే నన్ను ఇంకో గంట అలాగే కూర్చోబెట్టేదేమో.. :( అసలే అందరికీ అందమంటే ప్రాణం. లక్ష blackheads రావాలి అని మొక్కుకున్నాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా..! అలా ఎంతో కష్టపడిన తరువాత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అదృష్టం, ఈ సారి నా చేత ఇంకేమీ తాగించలేదు. మళ్లీ మసాజ్ మొదలు పెట్టింది. తెలుసు కదా, మళ్లీ స్వర్గలోకపుటంచుల దాకా వెళ్లొచ్చాను. ఆ తరువాత ఏదో ఫేస్ ప్యాక్ అని ఒక 20 నిమిషాలు కూర్చోబెట్టి ఫేషియల్ అన్న బృహత్కార్యాన్ని పూర్తి చేసింది.
ఆరోజు మాత్రం మంగమ్మ శపథం , భీష్మ ప్రతిఙ్ఞ లాంటివి ఎన్నెన్నో చేసేస్కున్నాను మళ్లీ బ్యూటీ పార్లర్ తలుపులు తట్టొద్దని (జుట్టు కత్తిరించుకోడానికి తప్ప). ఆ తరువాత ఈరోజు వరకూ వెళ్లలేదు ( ఒక రెండు సార్లు వెళ్లాను- ఫేషియల్ కే.. ;) హిహ్హి)
సో.. తోటి బ్లాగర్లారా..! అర్థం అయింది కదా, ఇక్కడ మీరు నన్ను కాక ఆ బ్యూటీషియన్ ని సపోర్ట్ చేస్తే, ఆ శాపం మీకు కూడా వర్తిస్తుంది. హహ్హహ్హా..
P.S.: టైటిల్ లేదా ఇంకే విషయంలోనైనా, ఏదైనా సలహా ఉంటే ఇటు పడేసి మీరు శాప విముక్తి పొందొచ్చు..:):)
నేను డిగ్రీ చివరి సంవత్సరం లో ఉన్నప్పుడు అనుకుంటా.. నా ఒకానొక నేస్తం బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటే, నేను కూడా తోకలా తన వెంట వెళ్లాను. నేను ఒక చిన్న పల్లెటూరి నుండి రావటం వలన , హైదరాబాదు కి వచ్చి మూడు సంవత్సరాలు అయినా చదువు మీద(??) ఇతరత్రా విషయాల మీద ( అంటే చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్పడం, ఏదో కొంచెం సంగీతం పట్ల కూడా అవగాహన కలిగించుకుందాం అన్న సదుద్దేశంతో వయొలిన్ పాఠాలు నేర్చుకోవడం, తెలుగు నవలలు కథలు చదువుకోవడం లాంటివన్నమాట.) ధ్యాస పెట్టడం వలన అప్పటి వరకూ బ్యూటీ పార్లర్ ముందున్న మొదటి మెట్టు మీద కూడా అడుగు పెట్టలేదు. కానీ నా దురదృష్టమో అదృష్టమో.. ఆరోజు.. అందమంటే ఎంత బాధో నాకు తెలిసి రావాల్సిన రోజు.. అలా నా నేస్తంతో బ్యూటీ పార్లర్ కి వెళ్లాను. సరే వెళ్లాను, కానీ ఎంచక్కా తన పని తను కానిస్తూ ఉంటే, ఒక మూల కూర్చుని చూస్తూ ఆనందించవచ్చు కదా. ఉహు.. అలాక్కాదు. నాకు కూడా ఫేషియల్ చేసెయ్యమని ఆర్డర్ ఇచ్చేశాను. "ఏ ఫేషియల్?" అన్నది ఆ పార్లర్ హెడ్ ప్రశ్న. నా నేస్తం మాత్రం ఏదో చెప్పేసింది. నాకు వినిపించలేదు. మరి తెలియదు అంటే పరువు పోతుంది కదా. అందుకనే చాలా తెలివిగా "ఏమేమి ఉన్నాయి?" అని నా బాణాన్ని సంధించాను. నార్మల్,******,గోల్డ్. అయ్యబాబోయ్.. ఇదేంటి?? చిత్రగుప్తుడు తప్పుల చిట్టా చదివినట్లు చదువుతుంది అని అనుకునేలోగా ఒక పేరు మాత్రం నన్నాకర్షించింది. ఫ్రూట్ ఫేషియల్. మళ్లీ ఎక్కడ మర్చిపోతానో అని ఠక్కున చెప్పేశా.. సరే పేరు చెప్పేశాం. మరి తరువాత సంగతి? మెళ్లో గొలుసు, చెవుల జూకాలు తీసెయ్యమని చెప్పింది. సరే పాపం అని తీసేశా. ఎంచక్కా ఒక పెద్ద ఈజీ చెయిర్ మీద కూర్చోబెట్టింది. జుట్టంతా పైకి కట్టేసింది. ఆహా ఎంత గొప్ప మర్యాద అనేస్కున్నాను మనసులో. ఇక మొదలు పెట్టింది ఫేషియల్ ప్రహసనం. నన్ను మాత్రం కళ్లు మూసుకో అని చెప్పి నాకు మొదటి సారి జరిగే ఆ మహత్కార్యాన్ని నేను చూస్కోకుండా చేసింది. పోనీలే పాపం అని ఈ విషయంలో కూడా కళ్లు మూసేస్కోని త్యాగం చేసేశాను. ఏదో నీళ్ల లాంటి ద్రావకంతో మొహమంతా కాటన్ తో క్లీన్ చేసింది. (దీన్నే Cleansing అంటారని నాకు తరువాత తెలిసింది..:) ) ఎంచక్కా తను అలా సుతారంగా కాటన్ తో తుడుస్తూ ఉంటే.. ఆహా నా మనసు ఎక్కడెక్కడికో ఎగిరిపోయింది. ఆ తరువాత ఏదో పదార్దం తో మసాజ్ చెయ్యడం మొదలెట్టింది. నాకు ఆ క్షణంలో "అనుభవించు రాజా.." పాట గుర్తు రావడం ఇప్పటికీ గుర్తుంది:) అలా అలా స్వర్గలోకపుటంచులదాకా వెళ్లాను. అదిగో అప్పుడే మసాజ్ చెయ్యడం ఆపేసి మళ్లీ కాటన్ తో తుడిచేసింది. మరేమో అప్పుడు నాకు చాలా కోపమొచ్చేసింది. ఎందుకంటారేమిటి..? అలా స్వర్గాన్ని ఆశ చూపించి చివరి నిమిషంలో ఇలా లెఫ్ట్ లెగ్ పట్టుకుని లాగెయ్యడం ఏమైనా బాగుందా..? అప్పుడు మొదలయింది నా మొహానికి ఏదో వేడిగా తగలడం. ఆ వేడి కొంచెం కొంచెం గా ఎక్కువ అవుతూ ఉంది. (కళ్లు మూస్కున్నాను కదా నాకు అక్కడ ఏం జరుగుతుంది అని తెలియదు. అది స్టీం అట. తరువాత తెలిసింది). బాబోయ్ అది చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. ఆపవే బాబూ అని మనసులోనే అభ్యర్ధిస్తూ నా ముఖ కవళికలతోనే ఆ బ్యూటీషియన్ కి చెబుతూనే ఉన్నాను. అప్పుడే Koktail jiuce అనుకోని ఒక లీటరు ఆముదం తాగినట్లుగా పెట్టాను నా మొహం. అయినా అర్థం చేస్కోదే..! బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది , కాస్త తప్పించవే ఆ వేడిని అనుకుని నా మొహాన్ని అటు ఇటు తిప్పడం మొదలెట్టాను. అప్పటికీ కరుణించదే.. అలా బరువుగా భారంగా మంటగా చాలా సుదీర్ఘ ఘడియలు గడిచిన పిదప, ఆ దేవుడు నా మొర ఆలకించి ఆ బ్యూటీషియన్ చెవిలో నా గోడును వేసినట్లున్నాడు. ఆపేసింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నానా. అంతలోనే మళ్లీ ఏమైందో.. దేనితోనో నా ముక్కుని గిల్లడం మొదలెట్టింది (removing black/whiteheads అట.). బాబోయ్.. ఈ సారి ఆముదం ఒక్కటే కాదు అన్ని రకాల నూనెలు, కూల్ అండ్ హాట్ డ్రింకులు ఇంకా ప్రపంచంలో ఎన్ని రకాల ద్రావకాలు ఉన్నాయో అన్నీ కలిపి కడుపులో పోసినట్లుగా పెట్టాను మొహం. కళ్లు మూసుకోవడం వల్ల ఆ పరికరం ఏంటో చూడలేకపోయాను కానీ, ఆ క్షణానికి మాత్రం మళ్లీ ఆ శివయ్యే నాకు శతృవులా కనిపించాడు, తన త్రిశూలాన్ని ఈ బ్యూటీషియన్ చేతికి ఇచ్చి. ముక్కంతా నొప్పి, మంట. ఎన్ని రకాల హావభావాలు ప్రదర్శించినా పట్టించుకోదే..! అదిగో.. సరిగ్గా అప్పుడే.. అప్పుడే అర్థమైంది. అసలు అందం కోసం ఎంత బాధ పడతామో.. అందంగా కనిపించడం కోసం ఎంత బాధ పడతామో.. నాకు తెలిసినంత వరకూ అందంగా ఉన్న తర్వాత కూడా ఎదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. అసలు అందమంటేనే బాధ అన్న విషయం అప్పుడే అర్థమైంది.. ఇక లాభం లేదని మనసులో బోల్డన్ని తిట్లు తిట్టేస్కున్నాను. ఓయీ పాపాత్మురాలా. దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట దుర్మదాంధురాలా... ఎంతో సున్నిత సుకుమారమైన ఈ యువరాణివారి ముక్కుని ఇవ్విధమ్ముగా హింసించెదవా..! రేపు సూర్యోదయం కల్లా నీ ముక్కు మీద వెయ్యి కాదు కాదు లక్ష black/whiteheads వచ్చి గంట సేపు నిన్ను ఇలాగే కూర్చోబెట్టి ఇదే త్రిశూలంతో నీ ముక్కుని మరో బ్యూటీషియన్ హింసించు గాక. హ్హ. అసలు నా ఈ తిట్లన్నీ వింటే నన్ను ఇంకో గంట అలాగే కూర్చోబెట్టేదేమో.. :( అసలే అందరికీ అందమంటే ప్రాణం. లక్ష blackheads రావాలి అని మొక్కుకున్నాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా..! అలా ఎంతో కష్టపడిన తరువాత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అదృష్టం, ఈ సారి నా చేత ఇంకేమీ తాగించలేదు. మళ్లీ మసాజ్ మొదలు పెట్టింది. తెలుసు కదా, మళ్లీ స్వర్గలోకపుటంచుల దాకా వెళ్లొచ్చాను. ఆ తరువాత ఏదో ఫేస్ ప్యాక్ అని ఒక 20 నిమిషాలు కూర్చోబెట్టి ఫేషియల్ అన్న బృహత్కార్యాన్ని పూర్తి చేసింది.
ఆరోజు మాత్రం మంగమ్మ శపథం , భీష్మ ప్రతిఙ్ఞ లాంటివి ఎన్నెన్నో చేసేస్కున్నాను మళ్లీ బ్యూటీ పార్లర్ తలుపులు తట్టొద్దని (జుట్టు కత్తిరించుకోడానికి తప్ప). ఆ తరువాత ఈరోజు వరకూ వెళ్లలేదు ( ఒక రెండు సార్లు వెళ్లాను- ఫేషియల్ కే.. ;) హిహ్హి)
సో.. తోటి బ్లాగర్లారా..! అర్థం అయింది కదా, ఇక్కడ మీరు నన్ను కాక ఆ బ్యూటీషియన్ ని సపోర్ట్ చేస్తే, ఆ శాపం మీకు కూడా వర్తిస్తుంది. హహ్హహ్హా..
P.S.: టైటిల్ లేదా ఇంకే విషయంలోనైనా, ఏదైనా సలహా ఉంటే ఇటు పడేసి మీరు శాప విముక్తి పొందొచ్చు..:):)
158 comments:
మీరు ఎంత చెప్పినా మేము ఆ బ్యూటిషియన్ నే సపోర్ట్ చేస్తున్నాం
good one :P
కృష్ణ గారు ధన్యవాదాలు.
అయితే మీరు కూడా బ్యూటీ పార్లర్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి.. :D
హహ. బాగా రాసారు.
నేను కూడా ఆ బ్యూటిషియన్ నే సపోర్ట్ చేస్తున్నాను.
అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఏమీ ఆలోచించకుండా వెళ్ళిన మీదే తప్పు :)
@సాయి ప్రవీణ్ గారు ధన్యవాదాలు నచ్చినందుకు :)
సాయి ప్రవీణ్ గారు, కృష్ణ గారు మీ ఇద్దరితో కచ్చి. ఆ బ్యుటీషియన్ కి సపొర్ట్ చేసి నన్ను కించపరుస్తారా..? మీరిద్దరూ నా శాపగ్రస్తులే ఇప్పుడు.
ఆ టైటిల్ లో 'వ్వా' తీసెయ్యండి.
శాప విమోచనం succesful. :)
మీరు ఎన్ని చెప్పిన దీనిలో ఆ బ్యుటిశియాన్ తప్పు ఏమి కనిపించట్లేదు. మరి తప్పు మీదేనేమో ? హ హ శపించకండి
సాయి ప్రవీణ్ గారు, టైటిల్ లో "వ్వా" అని కావాలనే పెట్టానండీ. మరి నాకు అందంలో ఆనందం కనిపించలేదు. కాబట్టి మీ సలహా తిరస్కరించడమైనది. హన్నా.. ఒక సలహా ఇచ్చేసి శాపవిమోచన పొందేద్దామనే...!
భాను గారూ! మీరు కూడానా..? :(
ముందే చెప్పాను కదా.. ఆ బ్యుటీషియన్ కి అనుకూలంగా మాట్లాడారో.. నా శాపగ్రస్తులు కావాల్సిందే..
The clause of తిరస్కారం was not included in the conditions.
"ఏదైనా సలహా ఉంటే ఇటు పడేసి మీరు శాప విముక్తి పొందొచ్చు" - పడేయడం వరకే మా పని. మీరు ఏరుకున్నారో లేదో అన్నది మాకు సంబంధం లేని విషయం. :)
ఆ బ్యుటీషియన్ కి అనుకూలంగానే మాట్లాడాలని జాజిపూలు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం!
ప్లాటినం తమ్ముల్లందరూ సిద్ధం కావాలని ఈ సందర్భం గా పిలుపునిస్తున్నాం :) :)
సాయి ప్రవీణ్ గారూ!! మీరు భలేవారే.. అన్ని రకాల ప్రతిఙ్ఞలు చేసేస్కునే రెండు సార్లు వెళ్లాను బ్యూటీ పార్లర్ కి ఫేషియల్ కోసం. ఇక మీకు శాప విముక్తి ఇప్పించేస్తానన్న మాట ఎలా నమ్మారండీ..! హహ్హహ్హా.. :D
కృష్ణ గారు.. ఇది అన్యాయం కదూ.. ఎంత మీరు ప్లాటినం తమ్ముళ్లు నేను గోల్డెన్ సిస్టర్ అయితే మాత్రం ఇలా మనం కొట్టేస్కుంటే అక్క ఎంతగా బాధ పడిపోతారు..? మనమంతా ఒకేతాటి పైన నడుద్దాం ఇప్పటి నుండి. అందుకే నాకే సపోర్ట్ చెసెయ్యండి.. ఎంచక్కా మనమంతా కలిసి నేస్తం అక్క ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేద్దాం..:)
nice post
నాలాంటి డైమండ్ కాటగిరి తమ్ముళ్లని, చెల్లెమ్మలను పిలవరా. వా..... :(
నేను బ్యూటిషిన్ని కాదు, అపర్ణనుకాదు సాయి ప్రవీణ్‌ను సపోర్ట్ చేస్తున్నా. ఇలా మాటిమాటికి terms and conditions మారుస్తానంటే ఎట్టాగమ్మాయ్ !!
హస్యంతో పాటు చాల చక్కగ రాశారు టపాని నేను మీకే
సపోర్ట్ చేస్తున్నాంనండి. ఏటండి మరి అంతల తిట్టేస్తున్నారు ఆ బ్యూటి పార్లల్ వాళ్లని
where is nagarjuna's comment
Anonymous గారు.. ధన్యవాదాలు.:)
నాగార్జున.. నువ్వు చాలా తెలివిగల వాడివని నాకు తెలుసు :) ఇలా నన్నూ కాక బ్యూటీషియన్ ని కాక సాయి ప్రవీణ్ ని సపోర్ట్ చేస్తావా..?? దానర్థం బ్యూటీషీన్ ని సపోర్ట్ చేస్తున్నట్లేగా..?? నేను అలిగాను.
అశోక్ గారు, చాలా చాలా ధన్యవాదాలండీ.. నన్ను సపోర్ట్ చెయ్యడానికి మీరు ఒక్కళ్లు ఉన్నారు చాలు :) ఇక చూస్కోండి అందర్నీ ఎలా ఖండించేస్తానో.. ;)
ఇక తిట్టడం అంటారా..! ఆ సమయానికి ఆ బాధని తట్టుకోలేక అలా తిట్టేస్కున్నానండీ(అంతకు మించి ఏమీ చెయ్యలేము కదా:( ).
కృష్ణ.. ఇప్పుడు హ్యాపీ ..? :)
నేను హరేకృష్ణ ని , సాయిప్రవీణ్ ని సపొర్ట్ చేస్తున్నాను
మంచు గారి మీద కూడా అలిగాను.. ;)
హ హ. అలిగితే బుజ్జగించేవారు ఎవరు లేరోచ్చ్! సపోర్ట్ అంతా ఎటు ఉందొ తెలుస్తూనే ఉంది కదా :)
మీది గొదావరి జిల్లానా ?
సాయి ప్రవీణ్ గారు..! :( :( ఇప్పటికే ఇక్కడ రెండు బకెట్లు నిండి పోయాయి..
మంచు గారు, మాది గోదావరి జిల్లా కాదండీ.. కాకపోతే గోదావరి మా ఊరిలో కూడా ప్రవహిస్తుంది.. :)
i am not happy :)
అయ్యయ్యో.. కృష్ణ.. ఎందుకలా..? అక్కడ నేస్తం అక్క బ్లాగుని చాలా మంది కబ్జా చేసేశారు.. మనకి రెండు రోజులు కుదరకపోయే సరికి. మనం దీన్ని తీవ్రంగా ఖండించేసెయ్యాలి..
అంటే అంటారా సరే !
మీరు చూడలేదు ఏమో అని అనుకున్నా
రాజ్ కుమార్ హవా కొనసాగుతోంది నేస్తం అక్క బ్లాగ్ లో గత రెండు రోజులుగా :)
కబ్జా కాదు అభిమానం అనాలి కదా :)
మీరు ఏంటి అసలు కామెంట్ రాయకపోవడం
బంగారం ప్లాటినం రెండు రోజులు తర్వాత కామెంట్ రాయడం హతవిధీ !
అపర్ణ ఇంకా ఎంతసేపు మీరు కామెంట్ రాయలేదు నేస్తం అక్క బ్లాగ్ లో
i :( :(
కృష్ణ.. నేను కామెంటు రాసేశాను.. అక్క ఇంకా పబ్లిష్ చెయ్యలేదు.. :(
నిజానికి నేను ఈ రెండు రోజులు పని వత్తిడి వల్ల అసలు బ్లాగులు చూడలేదు. ఇదిగో ఈరోజు చూసేసరికి ఇంకేముంది.. అక్క బ్లాగు అంతా వ్యాఖ్యల మయం :(
baga rasaru.. oka software ammayi ippati daka rende sarlu beauty parlour ki vellindhi ante nammanu gaka nammanu..
ధన్యవాదాలు శశిధర్ గారూ, నా టపా నచ్చినందుకు..
ఏదో అప్పుడప్పుడూ అబద్దాలు చెబుతాను కానీ మరీ ఎప్పుడూ అదే పని కాదండీ.!;) రెండు సార్లు వెళ్లింది ఫేషియల్ కే, జుట్టు కత్తిరించుకోడానికి చాలా సార్లే వెళ్లాను..:) హిహ్హి
@sasidhar: LOOOLLLL :)
@కృష్ణ,అపర్ణ:నేను అలాగే అనుకున్నాను పోస్టు పడ్డాక ఇంతసేపైనా బంగారం, ప్లాటినం ఇంకా రాలేందేటి అని. ఒకరికి వర్క్ ప్రాబ్లం, ఇంకొకరికి హెల్త్ ప్రాబ్లం.... ప్చ్
Time bad
ఏం చేస్తాం నాగార్జునా. వేదం సినిమాలో అల్లు అర్జున్ అన్నట్లు "అదృష్టం బాగోకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది" అలాగే ఇక్కడ మా అదృష్టం బాగోలేక, ఎన్ని సార్లు చూసినా పాత టపానే కనిపించే అక్క బ్లాగులో మేమిద్దరం అలా మాయం అవగానే కొత్త టపా ప్రత్యక్షమయింది.. :(
కొన్ని కొన్ని అందాలు సహజంగానే బాగుంటయి అండి, వాటిని కృత్రిమంగా ఇంకా అందంగా చెయ్యాలనుకుంటే అది పొరపాటే అవుతుంది.......
హను గారూ.. మీరు చెప్పింది అక్షరాలా నిజం..:) కొన్ని అందాలు సహజంగానే బాగుంటాయి..
హేయ్ అపర్ణ: సారీ అంత అవసరమా?అవసరమా ?? అని అడుగుతున్నా ... అయినా నువ్వు పెట్టిన కామెంట్ లో తప్పేమి కనిపించడం లేదు నాకు ... నువ్వు అనవసరం గా ఫీల్ కాకు... పైగా నా సారీ ల వ్రతం నువ్వు తీసుకున్నావా? ఏమిటీ ? నీ కామెంట్ కి రిప్లై పెట్టడానికి లేట్ అయ్యింది అందుకు నేనే చెప్పలి సారీ...
నాకు ఓన్ Laptop లేదు .. పైగ పవర్ ప్రోబ్లం అందుకే లేట్ రిప్లై ... ఏమి అనుకోకు . నేను లేట్ గా కామెంట్ పబ్లిష్ చేసినా లేట్ గా రిప్లై ఇచ్చిన ఇదే కారణం
నిజమే మీరు కరెక్ట్ గా చెప్పారు . అందమే ఆనందం అందుకేనేమో అద్దంలో అస్తామాను చూసుకుని ఆనందపడుతుంటాము. అయ్యో నేనెప్పడినుండో ఫేషియల్ చేయించుకుందాము అని అనుకుంటున్నా ... కాని నాకు డౌట్స్ ఎక్కువ ...స్టెరిలైజ్ చేయకుండా అవే ఐటెంస్ అందరికి యూజ్ చేస్తారేమోనని నా అనుమానం ...మీరింకా బయ పేట్టేసారే
:)) బాగా వర్ణించారు. మనలో మన మాట, శశిధర్గారు అన్నది నిజమేనేమో. :)
asalu meer great andi..!! :)
antha ibbandi padi malli...2 sarlu vellara??...
nenu na frns tho thodu vellinanduke...asalu okka sari kuda na kosam nenu vellaledu...
post bagundi...
nenu meeke support..
varaalu emaina unnaya.. :P
హహ్హహా.. శివరంజనీ, నా అనుభవం చూసి మీరు భాపడొద్దులే..:) ఒక సారి మీరు ఆ అనుభవాన్ని పొందండి..;)
@ శిశిర మీరు కూడానా..:( ఇది అన్యాయం.
@ కిరణ్ గారు, మీరు చాలా తెలివైన వారు కదూ! అలా చూసే అర్థం చేసేస్కున్నారు. మరి నాకు 2, 3 సార్లు వెళ్తే గానీ అర్థం కాలేదు..:( ధన్యవాదాలండీ.. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు..:)
సూపర్ గా ఉంది పోస్టు. ఎలా మిస్సయ్యానో!!!!!!!!
ఏదేమైనా మీరు గోదవరమ్మాయ్ కాకపోయినా మీ ఊళ్ళోంచి గోదావరి గల గలా వెళుతుంది కాబట్టి నా సపోర్ట్ మీకే....... ఒక్క విషయంలో తప్ప.
3G గారూ.. ధన్యవాదాలండీ..:) మీ సపోర్ట్ నాకేనా..? ఆహా ఎంత చల్లటి వార్త చెప్పారు..:) కానీ సపోర్ట్ చెయ్యని ఆ ఒక్క విషయం ఏదో శెలవిచ్చారు కాదు..:(
Thank you Venuram..:)
నీ బ్లాగ్ టైటిల్ ఫొటొలొ పరిగెత్తేది నువ్వేనా ????
మంచు గారూ!! నాలాగే ఉందా..? ;)
నేను కాదండీ.. గూగులమ్మ ప్రసాదం అది..:)
ఆ ఫొటొలొ వున్న అమ్మాయి కూడ నీలా ... ఎమి తినదనకుంటా ... అందుకే సందేహం వచ్చింది :-)))
మంచు గారూ!! అయ్య బాబోయ్ ఇలా ఇచ్చారా ట్విస్ట్..!!
మంచు గారు,
కొన్నాళ్ళ క్రితం అపర్ణ ప్రొఫైల్ లో తన ఫొటోనే పెట్టింది చూడలేదా? ఆ పై ఫోటో లో పరిగెడుతున్న అమ్మాయి చాలా బెటర్ :)
సాయి ప్రవీణ్ గారూ..!! నేను దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నా.. నా మనోభావాలని గాయ పరిచేశారు మీరు. మీతో కచ్చి అంటే కచ్చే..;)
శెలవివ్వమంటారా........ ఐతే కాస్కోండి. చక్కగా బిగించి జడ వేసుకొని బుట్టబొమ్మల్లా ఆఫీసుకెల్తుంటే చూడముచ్చటగా ఉంటుంది కాని ఇలా బ్యూటీ పార్లర్ కెళ్ళి జుట్టుకత్తిరించుకోవడమేంటండి. ఈ విషయం లో మాత్రం మీకు మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం.
నేస్తం గారు ఎక్కడున్నాసరే వచ్చి ఈ విషయాన్ని ఖండ ఖండాలుగా ఖండించాలని కోరుకుంటున్నాను.
అవునా ... నేను గమనించలేదు.. బహుశ మరీ సన్నగా వుండటం వల్ల కనిపించకపొయివుండొచ్చు... నువ్వు చెప్పింది కరెక్టే సాయిప్రవీణ్..
చక్కగా బిగించి జడ వేసుకొని బుట్టబొమ్మల్లా ఆఫీసుకెల్తుంటే అప్పుడు జడ మాత్రమే కనిపిస్తుంది. అపర్ణ కనిపించదు :-))) అయినా ఆ జడ బరువుని మొయ్యాలి అంటే కాస్త తినాలి కదా...అది అపర్ణ కి చేతకాదు కదా :-)))
3g గారూ!.. అదా మీ బాధ. ఏం చేస్తాం చెప్పండి. ఈ హైదరాబాదు పోల్యూషన్ కి వారానికి రెండు , వీలైతే మూడు సార్లు తలస్నానం చెయ్యకపోతే, ఇక కత్తిరించుకోడానికి కూడా జుట్టు మిగలదు..:( మన ఐటి ఉద్యోగాల పుణ్యమా అని అలా పెద్ద పెద్ద జడలకి అన్ని సార్లు సేవలు చెయ్యడం కష్టతరమైపోతుంది. కష్ట పడి తలస్నానం చేసినా జుట్టు ఆరదు..:( అందుకే ఇలాంటి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నాం.
ఇప్పుడు చెప్పండి.. సాటి పొల్యూషన్ బాధితులుగా ఇంకా ఖండించడమే కరెక్ట్ అని భావిస్తున్నారా..!! :(:(
మంచు గారు, :(:(:(
మీరు నా మనోభావాలని పూర్తిగా దెబ్బ తీసేశారు. మీతో కూడా కచ్చి. మీకు శాప విముక్తి లేదు పొండి..
;)
మరి పార్టీ ఇవ్వకుండా తప్పించుకుంటుంటే ఇలానే అంటారు కదా.. నువ్వే చెప్పు.
మళ్లీ పార్టీ కి లింకు పెట్టారా..? ఇస్తా అని చెప్పాను కదా..:(
సరే అయితే... శరత్/తార చేత అపాలజి చెప్పిస్తాలే...:-)))))
హహ్హహ్హా.. శరత్ గారి సంగతి నాకు సరిగ్గా తెలియదు కానీ, తార గారు అపాలజీలు అడుగుతారనే నాకు తెలుసు. చెబుతారంటారా..!! :D :D
చూద్దాం.. ఇక ఎవరూ చెప్పకపొతే మన శివరంజనే చెప్పాలి :-))
హయ్యయ్యో.. మళ్లీ పాపం శివరంజని.. సారీలు చెప్పడానికి పుట్టిన కారణ జన్మురాలిలాగా చేసేశారు తనని..;)
ఈ సమస్య solve కావడానికి ఒక్కరే దిక్కు
వివరాలకు సవరాల శర్మ ని కన్సల్ట్ చేయండి
Ph: 08942-278374, 08942-645664
చంద్ర గారు, ధన్యవాదాలు నా బ్లాగుకి విచ్చేసినందుకు..:)
ఖచ్చితంగా పరిష్కారమైపోతుందంటారా..!!
తార సారి, రెండూ కనపడ్డాయి, ఇక్కడ నాకు ఎవరైనా సారీలు చెప్పారా?
తార గారు.. ఇక నాకు నవ్వే ఓపిక లేదండీ.. :):)
ఏ బ్లాగులో ఎక్కడ సారీ అన్న పదం కనబడినా మీకు email allerts వచ్చేలా ఏమైనా settings పెట్టుకున్నారా..?
నన్ను పూర్తిపేరు తో పిలవనందుకు ఎంత ఖండఖావరం
ఈ చంద్ర చూడామణి సాక్షిగా చెబుతున్నా
మీ తల చుండ్రు పట్టిపోతుంది నన్ను మొత్తం పేరుతొ పిలవనందుకు
మళ్ళీ మొత్తం పేరు తో పిలవక పొతే శివరంజని సారీ లు చెప్పిన ప్రజలందరి చుండ్రు కూడా వచ్చి చేరుతుంది
లేదమ్మాయ్, అవి అన్ని కమ్యూనిష్ట్ రహస్యాలు, బయటకి చెప్పకూడదు..
తలనిండా చుండ్రు చూడామణిగారు, పాపం కొత్త పిల్ల, ఇలా మీరు శపిస్తే ఎలాగండి? ఎదో పెద్దమనసుతో కాస్త మెల్లగా చెప్పాలి కానీ..
అయ్యయ్యో.. అంత తప్పిదం చేసేశానా.. క్షమించండి చంద్ర చూడామణి గారు.. ఈ సారికి దయచేసి క్షమించెయ్యండి.:( అలాంటి శాపాలు మాత్రం పెట్టెయ్యకండి. అసలే నేను జుట్టు కత్తిరించేసుకుంటున్నానని 3g గారు ఇందాక చాలా చాలా బాధ పడిపోయారు. ఇప్పుడు మీరు చుండ్రు పేరు చెప్పి నా జుట్టు మొత్తం ఊడిపొయ్యేలా చెయ్యకండి..:(
తార గారూ!! కమ్యూనిస్ట్ రహస్యాలా..? జాజిపూలు అభిమానులకి కూడా చెప్పకూడదా..? మిమ్మల్ని బలవంతం చెయ్యనులెండి..
హమ్మయ్య మీరు నాకు అండగా ఉంటే కొండంత ధైర్యంగా ఉంది..:)
అలా జరగకుండా ఉండాలంటే
వల్లభ మందస కి శివరంజని బ్లాగు ముఖం గా అపాలజీ చెప్పాల్సిందే
మీరేం చేస్తారో తెలీదు
ఓహో అలా జరుగుతుందా........ ఐతే తిరిగి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం.
మంచు గారు.... హెడర్ లో ఫొటో చూసి నేను కూడా ఇదేఅడుగుదామనుకున్నా ఇంతకుముందు ప్రొఫైల్ లో పెట్టిన ఫొటోతో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి.
బుట్టబొమ్మలో జడతో పాటు అపర్ణ గారు కూడా కనిపించాలంటే రోజుకొక పార్టీ డిమాండ్ చెయ్యాలి.
చంద్ర చూడామణి గారు.. మా హరేకృష్ణ ఎక్కడొ తప్పిపొయాడు...మీరు కాని చూసారా??
ఎంటబ్బా.. ఆ ప్రొఫైల్ ఫొటొ నేను చూడకుండా... ఇప్పుడు కళ్ళు మూసుకుని ఎంత గుర్తుతెచ్చుకుందామన్నా ఈ పిల్లే (ప్రస్తుత ప్రొఫైల్ ఫొటొలొ వున్న పిల్లి) గుర్తొస్తొంది.. ఆ ఫొటొ ఎక్కడ వుంది ??
చంద్ర చూడామణి గారూ!!
>>వల్లభ మందస కి శివరంజని బ్లాగు ముఖం గా అపాలజీ చెప్పాల్సిందే
క్షమించాలి..ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటి..?? :(
3g గారూ!! మా బాధని అర్థం చేస్కుని తిరిగి పరిశీలిస్తున్నందుకు ధన్యవాదాలు..:) నేను రెడీ రోజుకొక పార్టీ అంటే. ఇంతకీ ఎవరెవరు ఇస్తున్నారు రోజూ పార్టీలు..?;)
మంచు గారు, నిజమండీ.. కృష్ణ ఇంకా శివరంజని కూడా.. పోనీ నాగార్జున అన్నా వస్తాడా అంటే అదీ లేదు.. వాళ్లొస్తే కాస్త నన్ను సపోర్ట్ చేస్తారేమో.. ;)
ఎం జరుగుతుంది ఇక్కడ మాలిక లో ఒక పక్క అంతా మనసే పలుకుతుంది ??
మంచు గారూ!! మీకు నా పాత ఫొటో కావాలంటే నా పాత కమెంట్స్ చూడండి..;) మరి నన్ను ఏమీ అనకూడదు..;)
శ్రీనివాస్ గారూ.. నాకు కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఇక్కడ..:(
ఇప్పుడే గమనించిన తాజా వార్త..... ఇక్కడ 50వ కామెంట్ నాదే!!!!!!!!!!!.
చాలారోజుల తరువాత సాధించిన మైలురాయి........ నాయీ విజయాన్ని మీరు ఫేషియల్ చేయించుకున్న బ్యూటిపార్లల్ కి అంకితం చేస్తున్నాను.
కెవ్వ్వ్... ఇది చూసా.... సాయి ప్రవీణ్, 3జి కరెక్టే :-))))))))))))))))
హహ్హా.. 3g గారూ!! 75 వ్యాఖ్యలయ్యాక, 50 దగ్గరికి వెళ్లి చూస్కున్నారా!! ఇంకా అది తాజా వార్తా..?? మీ విజయోత్సాహాన్ని కించపరిచానని నాకు తెలుసు..;) క్షమించెయ్యండి ప్లీజ్..
అది కూడా ఆ బ్యూటీ పార్లర్ కి అంకితమా..?? :(
మంచు గారూ!! నన్ను ఏమీ అనొద్దని చెప్పాను కదా.. :(:(:(:(:(
>>ఇంతకీ ఎవరెవరు ఇస్తున్నారు రోజూ పార్టీలు..?;)
ఈ విషయం మంచు గారు ఇప్పటికే డిసైడ్ చేసేసారు. ఎవరు పార్టి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారో, ఎవరు సన్నగా ఉండి కనిపించకుండా పోతున్నారో వాళ్ళే...వాళ్ళే...
కమ్యునిష్ట్ పొలిట్ బ్యూరోలో తిసుకున్నవి బయటకి చెప్పకుడదు, అందులోనూ నాలాంటి నిఖార్సైన కమ్యునిస్ట్ అంటే ఎంత ధీక్షగా ఉండాలి మరి..
అలా జాజిపూలు, అని టెంప్ట్ చెస్తే ఎలా? హౌ?
నేను కూడా కెవ్వ్వ్....... నా విజయాన్ని కించపర్చినా అపర్ణ గారి దగ్గరినుండి నాకు "సారి" దొరికిందో........చ్.
ఇక పార్టీ ఒకటే బాకి.
3g గారూ!! మరీ ప్రతి రోజూ నేనే ఇవ్వాలా పార్టీ..:( ఆ హరి హరులు ఎక్కడ ( కృష్ణ, శివ)..?? పోనీ నాగార్జునా.. ఎవ్వరూ నాకు సపోర్ట్ ఇవ్వడానికి రారేమి..??
తార గారూ!! హిహ్హి.. మరి చెప్తారా లేదా..? లేదంటే ఇక్కడ జాజిపూలు అభిమాన సంఘం మనోభావాలు దెబ్బ తింటాయి..;)
ఆ...ఆఅ ఏదొ చిన్న పని ఉందని అలా డిపార్ట్మెంట్ వెళ్ళొస్తే ఇలా వ.బ్లా.స క్రియాశీల సభ్యులు లేకుండానేవ్ కామెంట్లు కొట్టేసుకుంటున్నారా హన్నా...
తారగారు...ప్రమాదవనంలో పడి మీరు కమ్యునిష్టు అని ఒప్పేసుకున్నారా, కృష్ణ గారికి చెప్తే ఎంత సంతోషిస్తాడో :)
అపర్ణ పార్టి ఇవ్వాల్సిన మెంబర్స్ జాబితాలో 3g గారు కూడా చేరారా భళి భళి!!...మీకు సాదర స్వాగతం 3g గారు.
అయినా మంచుగారేంటి సడన్‌గా ఇలా ట్విస్టులిస్తున్నారు. ఎప్పుడు ఆపద్భాందవుడిలా ఉండేవారు
నువ్వేమి భయపడకు బాలికా.... మన సంఘం సభ్యులను కాపాడుటకు మేము సర్వదా లభింతుము.
అయినా పెద్దలను వెయిటింగ్ మోడ్‌లో పెట్టడం అంతబాగొదు...పైగా మంచుగారిని మన మీడియా ప్రతినిధిగా, తారగారిని ఆడిటర్‌గా ఉండాలని అడుదామనుకుంటున్నా....పార్టి ఇవ్వకపోతే కదిలేలా లేరు వీళ్లు ;)
నాగార్జున (గారు??) మీస్వాగత సత్కారాలకు ధన్యుణ్ణి (ఎక్కువైందా????). పార్టీలో కలుసుకుందాం.
@ గారు: నాకు ఇప్పుడున్న అనుమానాలు చాలునండి, మీరిప్పుడు కొత్తగా ?? పెడితే వాటికి సమాధానాలు వెతుక్కొలేక, ఇక్కడ కామెంటలేక ఇబ్బందిపడాలి. సగంశతక కామెంటు రాసినందుకు పూర్తి అభినందనలు :)
నాగార్జునా..
>>నువ్వేమి భయపడకు బాలికా.... మన సంఘం సభ్యులను కాపాడుటకు మేము సర్వదా లభింతుము.
ధన్యవాదాలు..:)
నేను పార్టీ ఇస్తా అనే చెబుతున్నాను కదా.. కానీ మరీ రోజూ ఇవ్వాలా..?? నా ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. :P
తారగారు, మంచుగారు రోజు పార్టి పార్టి అని ఎందుకు కలవరిస్తున్నారో నాక్కొంచెం ఫ్లాష్ అవుతుంది. మనం పార్టి ఎప్పుడు చేసుకున్నా ప్రాబ్లం లేదు. కాని ఇంకొన్నాళ్లు సమయం తీసుకుంటే ABC అని వాళ్లని రానివ్వమేమోనని అనుమానం కాబోలు ;) :D
ఆ తోకలేని పిట్టలాగా పేరులేని ’గారు’ 3g గారిది. బ్లాగర్లు గమనించగలరు
నాగార్జునా.. ఇది కూడా కమ్యూనిస్ట్ రహస్యమా..?? నాకు కొంచెం కూడా అర్థం కాలేదు..:(
అర్థం కానిది ఏమిటి....?
>>తారగారు, మంచుగారు రోజు పార్టి పార్టి అని ఎందుకు కలవరిస్తున్నారో నాక్కొంచెం ఫ్లాష్ అవుతుంది. మనం పార్టి ఎప్పుడు చేసుకున్నా ప్రాబ్లం లేదు. కాని ఇంకొన్నాళ్లు సమయం తీసుకుంటే ABC అని వాళ్లని రానివ్వమేమోనని అనుమానం కాబోలు ;) :D
అర్థం కాలేదు..:(
@శ్రీనివాస్: ఏంలేదు భయ్యా... చాలా సింపులు. ఇది రౌడి Vs మనసు గోల
నాగార్జున.. నాకు మళ్లీ డవుటు..:) ఈ రౌడీ ఎవరు కొత్తగా..??
http://durgeswara.blogspot.com/2010/08/blog-post_27.html#comment-6674462622486073802
తారగారి గురించి, మంచుగారి గురించి నేనేమి చెప్పలేదు బాబు....
హేమిటో ఈ అమ్మాయి....మాలికాలో పెట్టేసికోగానే తతంగం ఐపోయిందనుకుంటుంది. అస్సల జనరల్ నాలెడ్జి లేకపోతే ఎలాగ. తారగారు నీలుకి లింకు ఇచ్చినట్టు అపర్ణకు కూడా రౌడిని పరిచయం చేయండి
97
100 naade
నిజమే నాగార్జున.. నాకు జనరల్ నాలెడ్జ్ తక్కువే..:(
సరైన సమయానికి వచ్చి వంద చేసాను :)
వరుస సెంచరీలు చేసిన అపర్ణ కి ఆభినందనలు
కృష్ణ.. వచ్చేశావా..!! హమ్మయ్య..;)
ధన్యవాదాలు నీ అభినందనలకు..
జై వ బ్లా స
జై జై యు బ్లా స
హమ్మనా హరేకృష్ణోయ్....ఇక్కడే దాసుకొని సెంచరీ కొట్టేసావా దేవుడొయ్, నా ఛాన్సు నువ్వు ఎగరేసుకుపోయావా నాయనోయ్.....
మలక్ ఝలక్ చిలక్ అలియాస్ మలక్‌పేట్ రౌడీ
నాగ్, నేను ఎప్పటినుంచో కమ్యూనిష్ట్ ని బాసు..
ప్రమాదవనంలో నేను కమ్యూనిష్ట్ సిద్ధాంతాల గొప్పతనం గురించి చెప్తుంటే నువ్వు మరీను..
నేను ABC ఏంటబ్బాయ్, అన్న నన్ను హిరోగా పెట్టి కధ రాస్తుంటేను, నాకు మూడో, నాలుగో పెళ్ళిల్లు చేసేస్తాడు, ఐనా నాకేమంత వయసు ఐపోయింది అని, జస్ట్ 35 ఏ గా..
ఔమల్ల
జై వబ్లాస
జైజై యుబ్లాస
హహ్హా.. నాగార్జునా. ఇప్పుడే హరిసేవ బ్లాగు చూశాను..:) అర్థం అయింది ABC అంటే.. ధన్యవాదాలు..:)
ఇక మలక్ పేట్ రౌడీ గారి బ్లాగు చూడాలి.. కాస్త లింకు ఇద్దురూ..
తార గారు, ఎప్పటి నుండో చెబుదామని అనుకుంటూ ఉన్నాను. నేను మీ బ్లాగులో కూడా కామెంటలేనండీ, కామెంట్ బాక్స్ పోస్ట్ లో ఎంబెడ్ చేసినందుకు.. కారణం తెలియదు. నా సిస్టం లో కామెంట్ బాక్స్ enable అయ్యి ఉండదు, ఒకవేళ పోస్ట్ లొ ఎంబెడ్ చేస్తే..
@నాగార్జున: బ్లాగర్లు గమనించేసినట్టున్నారండి ఎవరూ లెక్క చెయ్యట్లేదు. మీతో నేరుగా ఇదే మాట్లాడ్డం కదా అందుకే గారు ఉంచాలా వద్దా అనే డౌట్ తో అలా పెట్టాను.
@తారగారు: మిరు చీక్కుళంలో ఎప్పటినుండి ఫేమస్ అయ్యారు ?
@అపర్ణ: http://maalika.org/maalika_telugu_blogs_comments.php
ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను
@అపర్ణ: >>ఈ రౌడీ ఎవరు కొత్తగా..??
లాభం లేదండీ మీరో సీనియర్ బ్లాగర్ తో ట్యూషన్ చెప్పించుకోవాలి.
నాగార్జునా.ఆ అది చాలు లెండి..:) ధన్యవాదాలు..:)
3g గారూ.. నిజమేనండోయ్.. బాబ్బాబు.. అదేదో మీరే తీసేస్కుందురూ ఆ KT Sessions..:)
@3g: మీకు ఇది మొదటిసారేమోగాని నేనక్కడ మీ శీనుగాడితో, వేణుగాడితో,బానుగాడితో పండక సేస్కుంట్నాను
చ.... వందో కామెంట్ కూడా నేనే చేద్దామని ఆఫిస్ నుండి వెళ్ళకుండా కామెంట్ కామెంట్ కూడాబెట్టూకుంటూ వస్తుంటే ఇంత అన్యాయం జరిగింది. దీనికి ’సారి’ ఎవరు చెబుతారో నాకు తెలియాలి. (ఈ సారీల వైరస్ నాక్కూడా తగులుకున్నట్టుంది)
నాకు సరిగ్గా అర్ధం కాలేదు. స్రీన్ షాట్ తీసి కాస్త మెయిల్ చెస్తే సొల్యూషన్ చెప్పగలను..
ఇది పని చేయకపొతే,
Incase of fire fox.
Right click on comment box, This frame -> Open Frame in New Tab or New window.
Incase of Chrome.
I dont know.
Incase of IE..
Still using IE? God save this poor girl..
నాగ్, అసైన్సు పెట్టినప్పటినుంచి, ఆ తరువాత అన్న వ్రాసిన పుస్తకాలు నాకు పంపమని/అమ్మమని వెనకాల పడినప్పటినుంచి.. శ్రీకాకుళంలో బాగా ఫేమస్
@తారగారు: బహుశా ఇది అపర్ణ ఒక్కరి ప్రాబ్లం కాదేమో. పోస్టులో కామెంట్ బాక్స్‌ను Embed చేస్తే ఆఫీస్నుండి(only software employees ??) కామెంటలేకపోతున్నారు చాలామంది. క్రిందటిసారి నా బ్లాగులో వ్యాఖ్యానించడానికి ట్రై చేస్తే అపర్ణకు, కృష్ణప్రియగారికి ఇటువంటిదే ఎదురైంది.
అయినా...అపర్ణ, ఒకసారి తారగారు చెప్పిన మొథడ్ ట్రైచేసి చూడు. ఎంబెడెడ్ కామెంట్ బాక్స్‌ను కొత్త టాబ్లో ఓపెన్ చేస్తే ఎమన్నా ఫలితం ఉంటుందేమో
తార గారు. స్క్రీన్ షాట్ రెడీ.. మెయిల్ ఐడి ఇవ్వగలరా..!! I am using Firefox only. I tried "Right click on comment box, This frame -> Open Frame in New Tab or New window." But no luck. :(
నాగార్జున. కరెక్ట్.. దాని కారణంగానే నీ చేత ఇంకా అశోక్ చేత కూడా కామెంట్ బాక్స్ మార్పించేశాను..:)
ట్రై చేశాను నాగార్జున..:( సేం బ్లాంక్ స్క్రీన్.. (కొత్త విండో/ట్యాబ్ కదా.. కొంచెం పెద్దగా..)
3g గారూ! ఇంతకీ ఎవరితొ సారీ చెప్పించుకుందామని డిసైడ్ అయ్యారు..? ;)
LOOOL
మీరిక్కడ కొత్తా? అయితే నా బ్లాగు వెనకనుండి చదువుకురండి, ముందునుండి చదివితే భయపడతారు :P
రౌడీ గారూ!!క్షమించాలి..:(
నేను కొత్తే బ్లాగ్లోకానికి... అంటే వచ్చి రెండు నెలలు అయిపోయిందనుకోండి...;) కానీ అదేంటో మీ గురించి ఎవ్వరూ చెప్పలేదు..:P
3g గారు నాకు KT ఇస్తా అన్నారు కదా.. సో ఇక బాగుంటుంది అంతా..
మీరు చెప్పారు కదా.. తప్పకుండా వెనుక నుండే చదువుతా.. నిన్న మొదలు పెట్టా (ముందు నుండే... మార్చెయ్యాలి డైరెక్షన్)
ఏంటండి KT ఇచ్చేది........ నేనేదో సీనియర్ బ్లాగర్ని అడగమంటే మీరు నన్ను అడుగుతున్నారు..... ఇరికించేద్దామనే..... హమ్మా...
కావాలంటే మంచు గారినడగండి ఆయనకి బాగా తెలుసు ఈ టాపిక్‌లు.
తూచ్.. ఇదేంటీ.. మీకు రౌడీ గారు తెలుసనే కదా నాకు చెప్పారు. మరి అలాంటప్పుడు నాకు తెలియనివి మీకు చాలా తెలుసుననేగా..;) మరి KT ఇవ్వాల్సిందే.. పోనీ మీరే మంచు గారికి రికమండ్ చెయ్యండి నా పేరు..:):)
అపర్ణ .. వర్క్ ఎక్కువగా గా ఉండడం వల్లన నీ బ్లాగ్ చూడలేదు ...సెంచరీ దాటినందుకు కంగ్రాట్స్ . నా వర్క్ ఫినిష్ అయ్యేటప్పడికి నువ్వు డబుల్ సెంచరీ చెయ్యాలి ...
హేమిటో ఈ సారీ లు ... దీనిని ఖండించేవారే లేరా??????
అందరికి మనోభావాలు గాయపడిపోవడమేమిటో ? దానికి నేను సారీ చెప్పడం ఏమిటో ? నేను చెప్పే సారీ కి మీ మనోభావాలు బాగుపడతాయా ఏమిటి ? అలా అయితే మనోభావాలు అల్రేడీ గాయపడిన వారికి , పడుతూ ఉన్నవారికి , పడబోయేవారికి కూడా సారీ లు ...
శివరంజనీ.. వచ్చేశావా.. హమ్మయ్య:)
ఇంకా వర్క్ ఉందా అయితే..? నువ్వు వర్క్ ఫినిష్ చేసేస్కో.. డబుల్ సెంచరీ మాట ఎలా ఉన్నా మనోభావాల సంగతి ఏమిటో చూసి వీలైనంత వరకు ఖండించి నీకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తాను..;)
ఇట్టా గుంపాగుత్తగా సారీలు చెప్తే నాకు కుదరదు, నాకో సింగిల్ కామెంట్ పడాల్సిందే, అపాలెజీ చెప్తు..స్పెషల్ గా నాకే...
>>తూచ్.. ఇదేంటీ.. మీకు రౌడీ గారు తెలుసనే కదా నాకు చెప్పారు
ఇప్పుడూ....... రోశయ్య మీకేమవుతాడంటే ఏం చెప్తారు? CM అవుతాడని చెప్తారు కదా!! ఇదీ అంతే!!
అయినా ఇప్పుడు మంచు గారి అవసరం లేదనుకుంట డైరెక్ట్ గా రౌడీనే వచ్చారుగా......
నేను చెప్పాలంటే ఖర్చవుద్ది మరి.. ఒకే నా :-))
@3g గారూ..అంతా తొండి.. రోశయ్య ఎవరు అంటే నాకు తెలుసు మీకు తెలుసు. నాకు ఒకవేళ రోశయ్య తెలియదు అంటే మీరు చెప్పేవారు మన CM అని. మరి అలాంటప్పుడు నేను మన్మోహన్ ఎవరు అంటే అది కూడా మీరే చెప్పాలిగా..;):):)
@ మంచు గారూ.. భేషుగ్గా. ఏం కావాలి చెప్పండి గురుదక్షిణగా.. ఓ వంద సారీలా లేక రెండు వందల పార్టీలా.??
@ All: KT అనగానేమి ? వివరింపుడి - 10 కామెంట్ల ప్రశ్న
@భరద్వాజ: రౌడిగారు, క్షమించాలి మామూలుగా మా అపర్ణ తన బ్లాగుకి ఎవరైనా కొత్తవారు వస్తే స్వాగతం చెప్పి రిప్లై ఇస్తుంది. ఈసారి మర్చినట్లుంది. తన తరఫున మేం(వ.బ్లా.స) చెబుతున్నాం ’మనసు పెలికే..’ కి స్వాగతం
@శివరంజని: ఈ అమ్మాయ్ నాకస్సలు అర్థంకాదు...చూడబోతే భూమికకు జాయింట్ పార్ట్నర్లా, ఏకలింగంగారికి కజిన్ సిస్టర్లా ఉంది. అడిగినవాళ్లకు, అడగనివాళ్లకు ఎక్కడపడితే అక్కడ సారిలు ఇచ్చేస్తుంది. ఇంతకీ అమ్మాయ్ నువ్వు ఖుషి సినిమాను ఎన్నిసార్లు చుసావు అన్న నా ప్రశ్నకి ఇంకా సమాధానం ఇవ్వలేదు సుమీ...
@అపర్ణ: నిన్నటిదాకా ఇన్ని పార్టిలివ్వాలా అన్నావు...ఇప్పుడేంటి అడక్కుండానే రెండొందలు ఇస్తానంటున్నావ్ !! సాలరీ స్లిప్పు చేతిలో పడిందా ?
నాగార్జున.. నీ 10 కామెంట్ల ప్రశ్నకి నా ఒక కామెంట్ సమాధానం..
KT అనగా Knowledge Transition. ఐటి లో జరిగే ట్యూషన్ అనమాట..:))
ధన్యవాదాలు నాగార్జునా. స్వాగతం సంగతి నేను మర్చిపోయినా మన సంఘం అధ్యక్షుడిగా గుర్తుంచుకుని మరీ రౌడీ గారిని స్వాగతించినందుకు..:) నేను నీకు ఎంతగానో ఋణపడి ఉన్నానని అనుకుంటున్నాను..;)
ఇంకా లేదు నాగార్జునా. రేపొచ్చేస్తది..;) అయినా అది కాదు కారణం. మరి నాకు KT ఇస్తా అన్నారు కదా.. :):)
కనుగొంటిని మంచుగారు కనుగొంటిని....తీగలాగి డొంక పట్టుకొంటిని. wireless tech. పేరు పెట్టుకొని ఆ ముసుగులో 3gగారు చేస్తున్నది సాఫ్ట్వేర్ పని....KT అనే రెండక్షరాల పదం ఎన్ని రహస్యాలు చెప్పిందో చూసారా...
నాగార్జునా.. పప్పులో కూడా కాదు.. బ్యూటీషియన్ మసాజ్ చెయ్యడానికి ఉపయోగించే పదార్థంలో కాలేశావ్.. అది నేను చెప్పిన పదం. అంటే నేను ఐటి లో చేస్తున్నట్లు. పాపం 3g గారికి దీనితో ఎలాంటి సంబంధం ఉందో నాకైతే తెలియదు.
హ్హ హ్హా హ్హ నాగార్జున.... మీరు హడావిడిలో రాంగ్ తీగ లాగేసారు.
ఇంకో విషయం ఏమిటంటే నేను KT అంటే వేరోఏదో అనేసుకొని ఇప్పటిదాకా తెగ వాడేశాను ఆ పదాన్ని.
KT -> knowledge transfer
మంచు గారూ!! అవునా. అయ్యయ్యో.. చూశారా.. నా బ్రెయిన్ ఎంత బాగా పని చేస్తుందో..:( అర్థాలు కూడా మార్చేస్తున్నాను..:'(
హి హ హ్హహ....చూశారా..నేనేదొ ఒక తీగలాగబట్టే కదా KT అంటే Knowledge Transfer అని, అపర్ణ ఇంకా 3g గారు దాన్ని అపార్థం చేసుకున్నారని తెలిసింది (ఎందుకు ఏమిటి ఎలా బాబుమోహన్ టైపులో.. :) )
meeru kooda nestam akka lane , comments ni kummesthunnaru ga..
congos..
నాగార్జునా... మరే... ఎంతైనా మీరు గొప్పోళ్లు..:)
శశిధర్ గారూ!! ఆహా ఏమి నా అదృష్టం.. సరే గానీ మీరు శివరంజని బ్లాగు చూశారా.. అప్పుడు నా బ్లాగుకి వచ్చి ఈ మాట అనుండేవారు కాదేమో..:))
అసలేం జరుగుతోంది ఇక్కడ. ఒక వారం రోజులు నేను బిజీ గా ఉంటే ఇక్కడ ఇన్ని కామెంట్లా? అసలు ఏ విషయం పైన చర్చ జరిగింది? ఇన్ని కామెంట్లలో ఏం మాట్లాడేస్కున్నారు. ఎవరైనా మూడు ముక్కలకు మించకుండా వివరించుము.
సాయి ప్రవీణ్ గారూ.. పైన చర్చ అంతా "కట్టె కొట్టె తెచ్చె" లాగా చెప్పమంటారా..?? అయితే వినండి..
1> 3g గారు నాకు KT ఇవ్వబోతున్నారు బ్లాగ్లోకం గురించి.
2> ఇక్క వ్యాఖ్య పెట్టిన అందరికీ నేను ఒక పార్టీ బాకీ
3> మొదటి నుండీ లేకుండా 95 వ్యాఖ్యలు దాటాక వచ్చిన కృష్ణ బాల్ తో నా సెంచరీ పూర్తి అయింది...
:)))
మిత్రులారా.. ఏమైనా తీసివేతలు.. లేదా కూడికలు..;)
1> 3g గారు నాకు KT ఇవ్వబోతున్నారు బ్లాగ్లోకం గురించి.
ఇదేంటి మీకు మీరే డిసైడ్ చేసేస్తారా..... ఇంకా మీకు అడ్మిషన్ ఇవ్వలేదు, ట్యూషన్ ఫీజు గొడవ తేలనేలేదు. ఇవన్నీ అయ్యాకే KT గురించి ఆలోచించేది.
2> ఇక్క వ్యాఖ్య పెట్టిన అందరికీ నేను ఒక పార్టీ బాకీ
ఇది ఓ.కె agreed
3g గారూ
>> ఇదేంటి మీకు మీరే డిసైడ్ చేసేస్తారా..... ఇంకా మీకు అడ్మిషన్ ఇవ్వలేదు, ట్యూషన్ ఫీజు గొడవ తేలనేలేదు
హిహ్హిహ్హ్హి..ఏదో మీదయ మాప్రాప్తం.. మీరు ఎలా అంటే అలానే..
వా ఆ
వా ఆ
ఏంటండీ... 150 వ కామెంట్ చేసిన ఆనందం పంచుకోటానికి ఎవరూ రావట్లేదు.
హరే కృష్ణ గారి "వా ఆ" ఎక్స్ప్రెషణ్ 150 వ కామెంట్ మిస్ అయినందుకే అనుకుంట.... హి హి హి
నూట యాభై కామెంట్లు పూర్తీ చేసుకున్నందుకు అభినందనలు అపర్ణ
150th comment బ్లాగ్ owner కి వెళ్ళడం పట్ల యు బ్లా స తరపున అభినందనలు :)
Congrats buddy... :) :)
3g గారూ!! మరేనండీ.. అందరికీ బోరొచ్చేసిందేమో సెంచరీలు చేసీ చేసీ చూసీ చూసీ..:)
@ కృష్ణ.. ధన్యవాదాలు..:) ఇంతకీ ఆ Expression కి అర్థం ఏమిటి..? 3g గారు చెప్పింది నిజమేనా..?? ;)
నాగార్జునా.. ధన్యవాదాలు..:)
కృష్ణ.. 150 వ్యాఖ్య 3g గారిది కదా..
బాగుందండి మీ బ్యుటిపార్లర్ గాథ :)
శేషేంద్ర సాయి గారూ. ధన్యవాదాలు..:) మొదటగా నా బ్లాగుకి విచ్చేసినందుకు, తరువాత నా టపా నచ్చేసినందుకు..:))
నా బ్లాగ్ బర్త్ డే..... కావాలి మీ అందరి స్వీట్ విషెస్
Post a Comment