ఇంకేంటి..? టైటిల్ చూసాక అర్థం అయిపోయింది కదా. రండి, వరుసలో నిలబడండి. అదిగో ఎవరో లైన్ తప్పుతున్నారక్కడ.. అద్గదీ అలా రండి క్యూలో.. హ్మ్.. అన్నల్లారా అక్కల్లారా.. ఇందు మూలంగా యావన్మంది బ్లాగ్మహాజనులకు తెలియజేయునదేమనగా.., మీరందరూ తమ తమ బ్లడ్ గ్రూప్ ఏది అని కూడా ఆలోచించకుండా వీలైనంత మంది తమకు వీలైనంత కొవ్వుని దానం చేయ ప్రార్థన. బదులుగా, కాసింత కృతఙ్ఞత, మరి కాస్త ఆప్యాయత తీసుకెళ్ల మనవి. అంతే కాకుండా నా సంకల్పంతో మొదలైన ఈ కార్యక్రమం సజావుగా సాగితే " దానాల్లో కెల్లా కొవ్వు దానం మహాదానం" అని స్లోగన్ మన జాతీయ స్లోగన్ గా ఆమోదింపజేసి, దానికి తగిన హోదాని కల్పించేలా చేస్తానని మనవి చేసుకుంటున్నాను.
ఆహా.. "కొవ్వుదానం" ఎంత గొప్ప పదం. వినడానికే చాలా హాయిగా ఉంది. మరీ నన్ను విచిత్రంగా చూడకండి. కాస్త కొవ్వు పెంచుకోడానికి నేను పడే అష్ట కష్టాలూ చూస్తే మీకే అర్థమవుతుంది నేనెంత సముచితంగా ఆలోచిస్తున్నానో. మరే.. రోజుకొక ఉడకబెట్టిన కోడి గు డ్డూ, ఆలుగ డ్డా, పాలు, పళ్లు, ఇవి కాక మామూలుగా తీసుకునే మూడు పూట్ల భోజనం, వాటి మధ్యలో అలా అలా కడుపులో కాస్త అవీ ఇవీ పడేస్తూ.. ఇంకా వీలైనప్పుడు మొలకలు కూడా..
అయినా నాకు తెలియక అడుగుతాను.. అసలు కష్టం అంటే మీకు తెలుసా.. రోజుకి నాలుగు పూటలు తిన్నా అసలు తిన్నదంతా ఎటు పోతుందో అర్థం కాక వెర్రి మొహం వేసుకోవడం ఎలా ఉంటుందో మీకు తెలుసా.. లావు అవ్వాలి లావు అవ్వాలి అని కంకణం కట్టుకుంటున్న సమయంలో, కనిపించిన వాళ్లంతా ఏంటమ్మా డైటింగ్ చేస్తున్నావా అని అడిగితే ఆ క్షణం ఎవరిని దేనికి తిట్టుకోవాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా.. మామూలుగా సలహాలు తీసుకోడం అలవాటు లేకపోయినా ఈ విషయంలో మాత్రం కనిపించిన వాళ్లు నోటికొచ్చిన సలహా ఉచితంగా సహృదయంతో పారేసినా, ఏమోలే ఏ పుట్టలో ఏ పాముందో అని ప్రతి సలహానీ ఏరుకుంటున్న క్షణం ఎలా ఉంటుందో తెలుసా.. అసలు ఇదంతా కాదు. అలా దొరికిన ప్రతి సలహానీ ఫాలో అయిపోయి, దొరికిన చెత్త అంతా తిని, అయినా లాభం లేక, దొరికిన సలహా తప్పో, ఇచ్చిన మనిషి తప్పో, తిన్న శరీరం తప్పో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా..
హ్మ్.. అదీ నా బాధ. అసలు ఈ "తినడం" అనే పని ఉంది చూసారూ.. అబ్బో.. చాలా కష్టం సుమా.. నాకైతే ఒక మహత్తరమైన ఆలోచన ఉండేది నేను హాస్టల్లో చదివే రోజుల్లో.. ఇలా కష్టపడి రోజుకి రెండు రకాల కూరలు, అన్నం, అల్పాహారం, స్నాక్స్.. ఇలా ఇన్ని తినే బదులు, మన కడుపుకే ఒక తలుపు పెట్టేసుకుని, మనకి అవసరమైనప్పుడు అలా కాస్త భోజనం, తలుపు తీసేసి అందులో వేసేసి... భలే ఉంటుంది కదా.. జీర్ణం ఎలా అవుతుంది లాంటి ప్రశ్నలు అడగొద్దు. అప్పట్లో నాకున్న బ్రెయిన్‌కి ఇది చాలా గొప్ప ఆలోచన.. మనకి ఎప్పుడైనా రుచికరంగా తినాలి అనిపించినప్పుడు అంటే హాస్టల్ నుండి ఇంటికెళ్లినప్పుడన్న మాట, ఎంచక్కా మామూలు పద్ధతిలో తినగలిగేలాగా .
ఇది తిండి విషయంలో ఉన్న మహత్తరమైన ఆలోచన అయితే ఫ్యాట్ విషయంలో ఇంకో బృహత్తరమైన ఆలోచన ఉంది. "కొవ్వుదాన శిబిరం.. కొన్ని టెంట్లు.. వందల కొద్దీ కొవ్వు డోనార్లు.. నాలాంటి కొన్ని అభాగ్యపు యాక్సెప్టర్లు..ఒక వైపు డోనార్ బెడ్డు, మరో వైపు యాక్సెప్టరు బెడ్డు. మధ్యలో ఒక ఫ్యాట్ కంటెయినర్, దాన్ని తగిలించడానికి ఒక హోల్డర్. డోనార్ నుండి యాక్సెప్టర్ కి కొవ్వు రవాణా.." అసలా చిత్రం ఊహించుకుంటుంటేనే మనసు ఉర్రూతలూగుతూ ఉంది. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ, నాకు దొరికే స్నేహితులంతా కూడా నాలాగే ఉంటారు, ఎవరో ఒకరిద్దరు తప్ప; చూసి చూసి స్నేహం చేస్తున్నానేమో అని నాకే అనుమానం వచ్చేలాగా..హ్మ్.. ఏం చేస్తాం.. అంతా దైవలీల మరి. పెళ్లిళ్లు స్వర్గాల్లో నిశ్చయమయినట్లుగా స్నేహాలు కూడా అక్కడే రూపు దిద్దుకుంటాయేమో. ఒక్క నేస్తం మాత్రం ఉంటుంది కాస్త లావుగా. నాకు కాస్త కొవ్వుని ప్రసాదించి పుణ్యం కట్టుకోవే అంటే.."అబ్బ చా.. ఎంత కష్ట పడితే ఇంత అయ్యాను. అప్పణంగా ఇచ్చెయ్యమంటే ఎలా ఇస్తాను..?" అంటుంది..
ఓహ్.. ఏదేదో చెప్పేస్తూ విషయాన్ని పక్క దారి పట్టించేస్తున్నాను. అసలు విషయం ఏమిటంటే, మీలో ఎవరెవరు కొవ్వు దానానికి సిద్ధంగా ఉన్నారు చేతులెత్తండి.. ముఖ్య గమనిక, ఉన్న రెండు చేతులూ కాళ్లు కూడా ఎత్తినా సరే, ఒక్క తలకి ఒకటే ఓటు.. హిహ్హిహ్హీ.. అక్కడెవరో రెండు చేతులు ఎత్తేస్తున్నారు మరి..

46 comments:
1
3
4
5
హహహ చదివి మళ్ళీ ఇంకో 5 కామెంట్స్ పెడతా
అప్పు ..కెవ్వ్ కదా...పోస్ట్...:)
నీకు తెల్సా..నీకు తెల్సా...అని అడిగావ్ కదా..నాకు బాగా తెలుసు అప్పు... :)
హే 1st బెంగుళూరు లో శిబిరం ఏర్పాటు చెయ్యి...నేను 1st వస్తా..
ఒక చెయ్యే ఎతాను .. అదిగో ముందున్న చూడు..1st రో లో 1st personi ni.. :P
anni danulu kella uttam ayina danam kovvu danam,, :))))
sivarajani garu congrats for frist comment
అందరూ కొవ్వుని తగ్గించుకొని జీరో సైజ్ అని పాట్లు పడుతుంటే మీరేంటి రివర్స్ గేర్ లో వెళుతున్నారు :)
మీరు తెలివైన వారు అనే అపోహ ఉండేది నాకు. ఈ వేళే నా కళ్ళు తెరుచుకున్నాయి. బ్రిలియంట్, జీనియస్, ఇల్లాంటివి కూడా మీ తెలివితేటలకి తక్కువే. కడుపు కో తలుపు, డోనారు నుంచి ఆక్సెప్టరు కి కొవ్వు రవాణా, కొవ్వు బాంకు, మీ కంటే భారతరత్న కి అర్హులెవరు. నేను బక్కగానే ఉంటాను అయినా సరే ఓ 100gms. దానం చేసేస్తాను అంతే.
బావుందండి మీ కష్టం,
మా ఫ్రెండ్ కూడా మీ లాగే లావు అవ్వలని వెన్నపూస తో సహా తినేది అయినా ఇప్పటికీ అలాగే ఉంది.
ప్చ్, ఒక్కొక్కరిది ఒకో బాధ
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్... నువ్వు తొక్క తోటకూర పది పూటలు తిన్నా ఇలానే ఉంటావ్... సరే ఎన్ని కేజీలు/లీటర్లు కావాలొ చెప్పు :-)
I want to know how do you feel on this post two year later :)
ilanti sibiram unte nakantu emi vaddu mottam kovvu meeke,,chastunna ela tagginchalo teliyaka,,
kovvu graheetha meeru kooda sukheebava..baagundi tapaa.. :-)
well, coming to the point..lavavvadam anthakastam em kadandi..atleast sannabadatam kanna kaadu..kakapothe meeru thine prathi daanni chusi chusi thinte konchem kastam..mari meeru pacchivi, udakapettinaativi..ila thinte aarogyam bane untundi kaani..meeru maathram alage untaru..lifee annaka koddiga masalalu kuda undali ..adenandi spicy, junk..ilantivi.kaani meeru avesapadi thinesaaranuko meeru kooda maalo ante kovvu dhaathallo kalasipotharu..jagrattha mari :)
అపర్ణా, కన్నీళ్ళు ఆగడ౦ లేదు టపా చదివి...నేను ఒక ఖోడి, మేఖ మాత్రమే దాన౦ చెయ్యగలను ..అర్ధ౦ చేసికో :)
అప్పూ కుమ్మేసావ్....కేకలే. :P ఊరంతా ఒక దారి ఉలిపికట్టదోదారి అన్నట్టుంది నీ పరిస్థితి. అందరూ తగ్గాలనుకుంటే నువ్వు పెరగాలనుకుంటున్నావా...నీలాంటి అదృష్టవంతులు చాలాకొద్దిమంది ఉంటారు ప్రపంచంలో, సంతోషించు తల్లి.
సరేల నెనూ చెయ్యెత్తేసాను...ఎన్ని కేజీలు కావాలో చెప్పు, ధారాళంగా ఇస్తాను.
//రోజుకొక ఉడకబెట్టిన కోడి గు డ్డూ, ఆలుగ డ్డా, పాలు, పళ్లు, ఇవి కాక మామూలుగా తీసుకునే మూడు పూట్ల భోజనం, వాటి మధ్యలో అలా అలా కడుపులో కాస్త అవీ ఇవీ పడేస్తూ.. ఇంకా వీలైనప్పుడు మొలకలు కూడా..//
ఓ....... మీరు అర్జెంటుగా ఈ మిషన్ ఆపకపోతే మీరు ఫేట్ అవ్వటం కాదుగాని పక్కోళ్ళకి ఫుడ్డు దొరక్క పాకిస్థాన్నించి కూడా దిగుమతి చేసుకోవాలి.
అయినా జీరో సైజ్ కావాలని జనాలంతా గుళ్ళచుట్టూ తిరుగుతుంటే ఫ్రీగా వచ్చిన వరాన్ని ఎందుకండీ వేస్టు చేసేస్తారు.
రంజనీ.. చదివావా..? ఏమయ్యావు..?:(
హహ్హహ్హా కిరణ్.. నాకు తెలుసు కిరణ్ నీకు తెలుసని. నీ వాచ్ పోస్ట్ చూసా కదా..:) అయినా నువ్వు కొవ్వు గ్రహీతల్లో కదా ఉండాలి. కొవ్వు దాతల లైన్లో నుంచున్నావేంటి?
శివ ప్రసాద్ గారు, ధన్యవాదాలు:)
భాను గారు, ఏం చేస్తామండీ. అలా రివర్స్ గేర్‌లోనే నడవమని దేవుడు నుదుటి మీద రాసాక..
సుబ్రహ్మణ్యం గారూ,
>>మీరు తెలివైన వారు అనే అపోహ ఉండేది నాకు. ఈ వేళే నా కళ్ళు తెరుచుకున్నాయి. బ్రిలియంట్, జీనియస్, ఇల్లాంటివి కూడా మీ తెలివితేటలకి తక్కువే
>>మీ కంటే భారతరత్న కి అర్హులెవరు
మీరు నన్ను కించపరచడం లేదు కదూ.. అంటే బ్రిలియంట్, జీనియస్ లాంటివి చూస్తే నాకు అనుమానమొస్తుంది..;) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి మరియు 100 గ్రాముల కొవ్వుకి.. హహ్హహ్హా..
లత గారు, ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి. నేను కూడా అండీ.. అంటే మరీ రోజు వెన్న తినను కానీ మా ఊరు వెళ్లినప్పుడల్లా చాలా తింటాను. ఇంట్లో పాడి ఉంది కదా, ఫ్రెష్ వెన్న ఉంటుంది.. అయినా ఉపయోగం లేదు:(
మంచు గారు, మీరు ఇలా తోటకూర ని కించపరిస్తే తోటకూర అభిమాన సంఘం ఊరుకోదు. మీరు కూడా చెయ్యెత్తారు కాబట్టి వదిలేస్తున్నా;) ధన్యవాదాలు:)
హహహహ అపర్ణ పోస్ట్ రచ్చ రచ్చ .........సుబ్రహ్మణ్యం గారి మాటేనూ నాది నీ తెలివి తేటలకి సాటి ఎవరూ లేరు ..పాపం అపర్ణ అని అందరితోటి దెబ్బలాడేదాన్ని ........ అమ్మో నీ తెలివితేటలు ఇప్పుడే తెలిసాయి ...కిరన్ గారితో పాటు నేను కూడా చెయ్యి ఎత్తుతున్న ...
siva prasad గారి కామెంట్ కెవ్వు కేక
శ్రావ్య గారు, 2 సంవత్సరాల తరువాత సంగతి అంటారా..? ఖచ్చితంగా లావు అవుతా అంటారా..? అప్పుడు మీకొచ్చి బోలెడన్ని ధన్యవాదాలు చెబుతా..:))
మంజు గారు, హహ్హహ్హా.. నేనే పెడుతున్నా శిబిరం. బెంగుళూరులో పెట్టమని కిరణ్ గారి ఆర్డర్. వస్తారా అక్కడికి..? ధన్యవాదాలు:)
గిరీష్ గారు, లావవ్వడం కష్టం కాదా.. నాకు ఈ మధ్యనే తెలిసిన విషయమేమనగా, ఫిట్నెస్ సెంటర్లు లావు తగ్గించడం కోసం వసూలు చేసే ఫీ కన్నా లావు పెంచడం కోసం వసూలు చేసేది ఎక్కువని:(
జంక్ ఫుడ్ తింటే వచ్చే లావు ఎందుకండీ.. ఆరోగ్యంగా లావు అవ్వాలి. ఎంతైనా ఆరోగ్యం మహా భాగ్యం కదండీ.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..:)
Mauli గారు,
బాధ పడకండి ప్లీజ్. మీ కన్నీరు నన్ను చేరింది;)
>>నేను ఒక ఖోడి, మేఖ మాత్రమే దాన౦ చెయ్యగలను.
ఇదేమి లెక్క చెప్మా..!!
సౌమ్య గారు,
>>అప్పూ కుమ్మేసావ్....కేకలే
మీకు బోలెడు బోలెడు ధన్యవాదాలు:) ఏం చేస్తాం సౌమ్య గారు.. కష్టాలండీ కష్టాలు. కొంచెం ఫ్యాట్ అవ్వడానికి ఎంత కష్టపడుతున్నానో మరి:(
>>ఎన్ని కేజీలు కావాలో చెప్పు, ధారాళంగా ఇస్తాను.
శిబిరానికి తప్పక రావాలి మరి:)
3g గారు,హహ్హహ్హా..
>>పక్కోళ్ళకి ఫుడ్డు దొరక్క పాకిస్థాన్నించి కూడా దిగుమతి చేసుకోవాలి
ఇది అన్యాయం అండీ.. అయినా నా తిండి సంగతి నా "తిండి తిప్పలు" టపాలోనే చెప్పాను కదా.. నిజంగా వరమే అంటారా.? ఏంటో ఈ మధ్య ఎవరు తిడుతున్నారో ఎవరు పొగుడుతున్నారో కూడా అర్థం కాకుండా పోయిందండీ.:( అయినా మీ మీద నమ్మకంతో ఒప్పేసుకుంటున్నాను:))
రంజనీ.. హమ్మయ్య వచ్చేశావా.. నా టపా చదివి నీకేమైందో అని తెగ భయపడిపోయాను;)
అయితే సుబ్రహ్మణ్యం గారు చెప్పింది నిజమే అంటావా. అనుమానించల్సింది ఏమీ లేదంటావా.? ఏమిటో ఇలా నన్ను పొగిడేస్తుంటే కాళ్లు చేతులూ ఆడటం లేదు సుమీ..;) ధన్యవాదాలు:)
నీ పోస్ట్ చదివిన తరువాత నీ చిలిపి అయిడియాలకి నవ్వి నవ్వి ఇంక నవ్వలేక స్పృహ తప్పిపోయాను ... నేను వచ్చేసాను నీ కోసం ... సుబ్రహ్మణ్యం గారు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం ...
పై జనాలంతా కేజీ లు మాత్రమే దానం చేస్తానంటున్నారు నేను టన్ను ల కొద్ది దానం చెయ్యగలను కావాలంటే,కాకపోతే అంత దూరం రాలేను మరి.
పోస్ట్ అద్దిరింది ఎప్పటిలాగే
హ హ్హ హ్హ హ్హ...:)))))))))
మరి మన శరీరానికి కొవ్వుఅవసరం ఎంతైనా ఉంది అని తెలుసుకున్నాక ఎటువంటి కొపదార్థలు తినాలి అని తెలిస్తే మంచింది.మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోడానికి పనికొచ్చే కొవ్వు పదార్ధాలు ఏమిటో తెలుసుకుని అవి మీ ఆహారంలో తప్పనిసరిగా భాగంగా ఉండేలా శ్రద్ధ తీసుకోండి.
కొవ్వు దాతా సుఖీభవ... సుఖీభవ!!:))
రంజనీ..నిన్ను నమ్మేసాను రంజనీ నమ్మేసాను. పాపం, స్పృహ తప్పి పడిపోయావా.? ప్చ్..:(
శ్రీనివాస్ పప్పు గారు, టన్నుల కొద్దీ ఇస్తారా..? హమ్మయ్య. మీరెక్కడుంటారో అక్కడికే వచ్చి శిబిరం పెట్టేస్తాం..:) ఇక్క గ్రహీతల్లో కూడా బోల్డంత పెద్ద క్యూ ఉంది మరి..:)) ధన్యవాదాలు టపా నచ్చినందుకు..
అశోక్, ఏమిటో.. మళ్లీ కొవ్వుల్లో కూడా ఇన్ని రకాలా.? నేనింకా బ్లడ్‌లోనే ఉంటాయేమో బోలెడన్ని రకాలు అనుకున్నాను. ఇలా అయితే ఎలా మరి..!!
హా! అప్పూ నాకు తెలుసు ఆ బాధ! బక్కపిల్లా...బక్కపిల్లా అంటుంటే మనసులో ఎక్కడో ముల్లు గుచ్చుకున్న ఫీలింగ్.ఎంత తిన్నా ఇదేమిటిరా దేవుడా ఇలా ఎటు పోతోందీ అని ఆలోచించీ చించీ...ఎలాగైనా పెళ్ళీ టైం కి లావు అవ్వాలని...లేకపోతే బాల్యవివాహం లా ఉంటుందీ అని....కనిపించిన చాక్లెట్లు....ఖర్జూరపు పళ్ళు..స్వీట్లు....పాలు...చిప్స్...వేరుసనగలు...జీడిపప్పులు...బాదం పప్పులు...నెయ్యి...పచ్చి కొబ్బరి అలా కొవ్వుని దానం చేసే సకల పదర్ధాలు భుజిస్తే...హబ్బ...పెళ్ళి టైం కి యాభయ్ కేజీలు అయ్యా! సో హాపీస్! :) అదీ సంగతి :) నీ కొవ్వు దానానికి నేను మరి మంచి మంచి చిట్కాలు చెప్పానుగా నాకెంటట? అహ...నాకేంటటా?
నాక్కూడా కొద్దో గొప్పో దానం చేయాలనే ఉంది. కాని నా దగ్గిర కరెక్ట్ గా నాకు సరిపోను మాత్రమే ఉంది.కొంచెం కూడా ఎక్కువాలేదు తక్కువా లేదు. పైగా వాకింగ్ చేస్తు కంట్రోల్ చేస్తున్నా కూడా. ఇప్పుడు మీ కోసం నేను పెంచలేను గాని, మా దగ్గిర దాన కర్ణలు చాలా మందే ఉన్నారులెండి. వాళ్ళ దగ్గరినుంచి సేకరించి ఇంతో అంతో పుణ్యం మూట గట్టుకుంటాలే. కాని తొందరపడి ఏ జంతు కొవ్వో మాత్రం పుచ్చేసుకోకండి. తరువాత లక్షణాలు మారి పోయి ఇంకే దానాలో అడిగితే కష్టం. ప్రతి సారి అడుక్కుంటే అందరూ ఇవ్వరు మరి:)
హా హా. ఏదో సామెత చెప్పినట్టు ఉందండి.. మీ కష్టాలు చూసాక :)
ఆ శిబిరం ఏదో బెంగుళూరు లో ఏర్పాటు చెయ్యండి.. మా మేనేజర్ ని తీసుకొస్తా.. (వొళ్ళంతా కొవ్వే ఎదవ కి )
అయినా రోజుకో కోడి గుడ్డూ, ఆలుగడ్డా సరిపోవు.. రోజుకో కోడినో , మేకనో మీలో ఐక్యం చేసుకోవాలి. మీరు వస్తుంటే కోళ్ళూ, మేకలు భయం తో పారిపోవాలి.. :)
నైస్ పోస్ట్ :)
హాయిగా అలా సన్నజాజిలా వుండిపోక ఈ తిప్పలెందుకండీ బాబు ?
రోజుకి ఒక మూడు పూతల భోజనం చేసి మరో మూడు సార్లు చిరు తిళ్ళు..బాల జంతికలు..నాగ ఫ్రూట్ సలాడ్ లు..వెంకీ జీడి పప్పులు
అలా అలా లాగించావంటే..లావేంటి దానికి బాబు అవుతావు
కొవ్వు దాతా..సుఖీ భవ..కొవ్వు దానం చేస్తే కుట్టిన్చేసుకుంటారా ఏంటి మీరు మరీను..
ఇందు గారు బాగా చెప్పారు మొన్న కూడా కిరణ్ పోస్ట్ లో చిట్కాలు చెప్పారు.. అప్పూ! సో అదే అదే బెస్ట్ solution
ఎవరైనా
నవ్వు అడిగితే విసిరేయ్యచ్చు
పువ్వు అడిగితే తెంపియ్యచ్చు
లవ్వు అడిగితే చేశయ్యచ్చు
కొవ్వు అడిగితే ఎలాగండి...
కర్ణుడి ని కవ్చ కుండలాలు అడిగినంత పాపం
మీ కొవ్వు మీరే పెంచుకోండి
వేరే వాళ్ళతో పంచుకోకండి..
Just for fun
ఇందు గారు, చాలా చాలా థ్యాంక్స్ మీ అమూల్యమైన సలహాకి:))
మీరు చెప్పిన లిస్ట్‌లో చాక్లెట్లు, స్వీట్లు, చిప్స్ మినహాయించి మిగిలినవన్నీ బాగా తింటాను నేను. అయితే ఇంకా పెంచాలనమాట;) (ష్.. ఎవరికీ చెప్పకండి, మళ్లీ 3g గారు వచ్చేసి ఆఫ్ఘనిస్థాన్ నుండి కూడా దిగుమతి చేసుకోవాలి అంటారు) మొత్తానికి మీరు సాధించేసారనమాట. ఇంత మంచి మంచి చిట్కాలు చెప్పిన వెన్నెల ఇందు గారికి నేనేమి ఇవ్వగలను చెప్మా...!!!(ఆలోచిస్తూ ఉన్నానన్నమాట)
జయ గారు,
>>కాని తొందరపడి ఏ జంతు కొవ్వో మాత్రం పుచ్చేసుకోకండి
హహ్హహ్హా.. పర్వాలేదండీ మీరే ఇవ్వాలని లేదు. మీకు తెలిసిన ఎవరి చేతనైనా ఇప్పించొచ్చు:))) ధన్యవాదాలండీ.. చెప్పడం మరిచాను, మీరు చాలా గ్రేట్ అండీ.. ఎక్కువా కాకుండా తక్కువా కాకుండా మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేటే కదా..:)
వేణూరాం,
ఇంతకీ ఏ సామెతో చెప్పలేదు. మీ మేనేజర్ని తీసుకొస్తావా..? సూ...పర్ ఐడియా.. మా మేనేజర్‌కి కూడా చెబుతా మరి ;)
>>రోజుకో కోడినో , మేకనో మీలో ఐక్యం చేసుకోవాలి. మీరు వస్తుంటే కోళ్ళూ, మేకలు భయం తో పారిపోవాలి.. :)
ఇది చదివి ఎంతగా నవ్వానంటే.. ఆ సీన్ ఊహించుకుంటుంటేనే నవ్వొచ్చేస్తుంది..
మాలా కుమార్ గారు, హహ్హహా అంతే అంటారా..!! ధన్యవాదాలండీ:)
హరే కృష్ణ,
>>బాల జంతికలు..నాగ ఫ్రూట్ సలాడ్ లు..వెంకీ జీడి పప్పులు
హహ్హహ్హా ఏంటివి..? ఎన్ని తిన్నా ఇలాగే ఉంటున్నాననే కదా నా బాధ:( ఇక ఆ కుట్టించుకోవడం ఒకటే మిగిలింది మరి:(
చందు గారు,
ఆహా ఏం చెప్పారండీ.. మీరు కెవ్వు:) నాకు మీ వ్యాఖ్య భలే నచ్చేసింది:)
>>కర్ణుడి ని కవ్చ కుండలాలు అడిగినంత పాపం
హహ్హహ్హా.. ధన్యవాదాలు మీ వ్యాఖ్య కి:) అలాగే నీ కొవ్వు నేనే పెంచుకోడానికి ట్రై చేస్తా:)
ayyo.. meeru inka margadarsi lo cheraleda.. memu margadarsi lo cheram maa kovvuni meme penchukunam. Ayina ee devudu eppudu inthey nandi.. Vaddu anna vallaki icchesthu vuntadu,kavali anna vallaki ivvadu. Nenu taggudamani entha dieting chesthunna,, oka chemcha kovvu kooda karagatam ledu :(
sare meru lavu avvali anthey kada. chala simple.. Poddune legichi. Perugannam , aratikaya tinandi.. oka garita annam tini lavu kavatam la ante nenu emi cheyalenu.. Oka pattu patti tinandi.. enduku lavu karo nenu chustha.. Inka lavu kakapothey cheppa ga.. margadarsi lo cherandi.
హహ్హహ్హా శశిధర్:)
ఏం చేస్తాం, మార్గదర్శిలో నాకు ఎంట్రీ లేదంట;) ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇంతే అంట. ఇక ఆ పెరుగన్నం గురించి మీకు చెప్పాలి. ఇలా చెప్పారని, రోజూ ఉదయన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకుని తినే దాన్ని. నో యూజ్:((( ఇక అరటి పళ్లైతే రోజుకి కనీసం రెండు తింటాను. పట్టు పట్టమంటారా..? నా పట్టు పెంచాలేమో అయితే. తప్పకుండా ట్రై చేస్తా..:)) ధన్యవాదాలు బోలెడన్ని.
kiran nuvventamma line lo..tappuko tappuko....nenu vachchi, mee iddarikee istaale puchchukondi..kaanee naa onti meeda katti gaanee blade kaanee soodi kaanee padakoodadu...meeku ok ayite naaku double ok...manalo mana maata...india ki oka ticket meedi oka ticket naadi..aparna, kiran kalipi konna pharvaledu one way ticket..nenemee anukonu....ok na?
ఎన్నెల గారూ.. భలే ఉంది మీ వ్యాఖ్య:) కొవ్విస్తారు కానీ కత్తి గాటు పడొద్దా.. దానికేముందండీ.. కడుపుకో తలుపు తెలివితేటలు చూసారు కదా.. ఆ తెలివితేటల్ని ఒఖ్ఖ(క్క)సారి వాడానంటే బోలెడన్ని అయిడియాలు..;) మీరు ఇక్కడి వరకూ రావడం ఎందుకండీ.. మేమే అక్కడ శిబిరం ఏర్పాటు చేసేస్తాం;) ధన్యవాదాలండీ వ్యాఖ్యకి:))
అప్పోయ్ .. ఫస్ట్ సారీ నే .. నన్ను తిట్టు కొట్టు నా బద్దకానికి .. కామెంట్ పెట్టలేని నా అసహాయతకి .. ఇంకా చాల చాల ఉన్నాయ్ కానీ ఇప్పుడు గుర్తు రాదం లేదే ..
నువ్వు కేకా .. కొవ్వే కదా వచ్చేయి .. ఇక్కడకి ఒక 100 కేజీలు ఎక్కించేద్దాం పడి ఉంటుంది అలా :p
కావ్యోయ్.. ఎహె. మనలో మనకి సారీలేంటి..? బింగో అనాలి:)) నీ బద్దకానికి నిన్ను తిట్టాలా.? ఈ లెక్కన నా బద్దకానికి నన్ను చంపెయ్యాలేమో..:( అయినా నీ బ్లాగులో వ్యాఖ్య పెట్టలేక పోవడం నా నిస్సహాయత:( పిచ్చి నెట్వర్క్, పోస్ట్‌లో ఎంబెడ్ అయిన కామెంట్ బాక్స్ ఓపెన్ చెయ్యదు.
హహ్హహ్హా "ఒక 100 కేజీలు ఎక్కించేద్దాం పడి ఉంటుంది అలా" సూ...పరు. ఫ్యూచర్లో కావాలన్నా మళ్లీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా.. కిరణ్‌ని, శివ ని కూడా తీసుకుని వచ్చేస్తున్నా;)
నాకు తలలో కొవ్వుందిగాని ఒంట్లో కొవ్వు లేదమ్మాయ్....సో దానం చేయగలనోలెదో తెలియడంలేదు...చేయిని అటు పూర్తిగా లేపకుండా, పూర్తిగా దించనూకుండా అడ్డంగా లేపుతున్నా. తీసుకోవాలో లెదో నువ్వే డిసైడ్ జేస్కో :P
>>రోజుకో కోడినో , మేకనో మీలో ఐక్యం చేసుకోవాలి.<<
Fusion theory ను ఇంత బాగా వివరించిన నీవు పరంధాముడవు వేణురామా...అందుకో సలాములు
హాయ్ నాగార్జున:) వచ్చేసావా..!! పర్లేదులే.. పాపం ఇన్ని రోజులూ బ్లాగులకి దూరంగా ఉండి బాధ పడ్డావు కదా;) నీ కొవ్వు వద్దులే:)
>>>>రోజుకో కోడినో , మేకనో మీలో ఐక్యం చేసుకోవాలి.<<
Fఉసిఒన్ థెఒర్య్ ను ఇంత బాగా వివరించిన నీవు పరంధాముడవు వేణురామా...అందుకో సలాములు
హహ్హహ్హ్హా.. నిజమే సుమా..;) ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి:)
he he he.......... blog loni 3rd paragraph jalsa cinema lo pavan kalyan laga baga chepparu andi.....
i am big fan of u.......
super........ :)
Post a Comment