ఉరుకులు పరుగులు తీసే గోదారి మీద ఎన్నెన్ని పాటలు వచ్చాయో.. అవన్నీ చూసి/విని ఆనంద మేఘాల్లో తేలుతున్నాను. మీ అందరికీ అవన్నీ వినిపించాలని చిత్రమాలికలో టపాతో మీముందుకొచ్చాను:)
గోదావరి అంటే నాకెంత ఇష్టమో, గోదావరి మీద పాటలు కూడా అంతగా నచ్చాయి. మామూలుగా అయితే ఇవన్నీ వినేదాన్ని కాదేమో. ఈ టపా రాయడం కోసం గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఇవే వింటూ, గోదారి అలలపై మునుగుతూ తేలుతూ ఉన్నా!!! మరి ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన కార్తీక్కి థ్యాంక్స్ చెప్పకుండా టపా ఎలా పూర్తవుతుంది..??
Thank you sooooooo much Karthik:)
ఇంకెందుకాలస్యం.. చిత్రమాలికలో నా పరవళ్లు తొక్కే గోదావరి చూసి రండి :)
గోదావరి అంటే నాకెంత ఇష్టమో, గోదావరి మీద పాటలు కూడా అంతగా నచ్చాయి. మామూలుగా అయితే ఇవన్నీ వినేదాన్ని కాదేమో. ఈ టపా రాయడం కోసం గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఇవే వింటూ, గోదారి అలలపై మునుగుతూ తేలుతూ ఉన్నా!!! మరి ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన కార్తీక్కి థ్యాంక్స్ చెప్పకుండా టపా ఎలా పూర్తవుతుంది..??
Thank you sooooooo much Karthik:)
ఇంకెందుకాలస్యం.. చిత్రమాలికలో నా పరవళ్లు తొక్కే గోదావరి చూసి రండి :)
14 comments:
1st comment??
బాబోయ్ ఎంత ఓపిక నీకు అన్ని పాటలు మొత్తం రాసేసావ్ కదా
భలే రాశావ్ అపర్ణ!
keep it up.
వావ్.. చాలా బాగుందండీ.. 'ఉయ్యాల జంపాల' సినిమాలో 'కొండగాలి తిరిగింది..' పాటని మర్చిపోయారా? అందులో "గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది.." అన్న లైన్ ఒక్కటి చాలు, గోదారంటే ఏమిటో చెప్పడానికి.. అన్నట్టు, 'గలగల పారుతున్న గోదారిలా..' పాట ఒరిజినల్ సూపర్ స్టార్ కృష్ణ గారి 'గౌరి' సినిమాలోది.. ఇంకేమన్నా గుర్తొస్తే మళ్ళీ వస్తాను :)) ..మీకు మరోసారి అభినందనలు..
ఎంత బాగా రాసావ్ అప్పు ... ఇంత research చేసినందుకు మీకు మళ్ళి మళ్ళి ధన్యవాదములు.ఆ పాటలకి తోడు మీ పరవళ్ళు తొక్కే మాటల మూటలు టపా కే అందాన్నిచ్చింది..... :)
చాలా మంచి ప్రయత్నం. ఇన్ని పాటలు ఒకచోట చేర్చి రాయడమంటే చాలా సమయం వెచ్చించి ఉంటారు. టపా చాలా బాగుంది. అభినందనలు. అలాగే గోదావరి గురించిన ఇంకొక పాట "సిరిసిరిమువ్వ" చిత్రంలోనిది "గోదారల్లే, ఎన్నెట్లో గోదారల్లే, ఎల్లువా గోదారల్లే" కూడా చాలా బాగుంటుంది.
నేను చెప్పాలనుకున్నది శిశిర గారు చెప్పేశారు.. ఆ పాట ప్రారంభం 'ఒడుపున్న పిలుపు..' తర్వాత, 'అమెరికా అల్లుడు' (సుమన్, భానుప్రియ) 'నా పూలజడ గోదావరి..' అనే పాటొకటి ఉంటుంది..
అప్పూ,
చాలా చాలా బాగా రాశావ్! గోదారి ఒడ్డున కూర్చున్నంత హాయిగా ఉంది నీ పాటల టపా! :)
హరే.. నీదే ఫస్ట్ కామెంటు..:) ధన్యవాదాలు టపా నచ్చినందుకు:))
మురళి గారు, మీ ఙ్ఞాపకశక్తికి జేజేలండీ:)
>>'గలగల పారుతున్న గోదారిలా..' పాట ఒరిజినల్ సూపర్ స్టార్ కృష్ణ గారి 'గౌరి' సినిమాలోది
అవునా.. నేను వినలేదు:( మీరు చెప్పిన పాటలన్నీ డవున్లోడ్ చేసుకుని వింటాను. చాలా చాలా థ్యాంక్స్ అండీ మరికొన్ని గోదావరి పాటల్ని పరిచయం చేసినందుకు..
CS గారు, ధన్యవాదాలండీ నా టపా, ఇంకా నా మాటలు అంతలా నచ్చినందుకు:)
శిశిర గారు,
నిజమేనండీ.. చాలానే సమయం వెచ్చించాను. కానీ మీ అందరి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు పరిచయం చేసిన పాట కూడా డౌన్లోడ్ చేసేసుకుని వినెయ్యాలి:) ధన్యవాదాలండీ వ్యాఖ్యకి:)
మధుర, హహ్హహ్హా. నేను గత కొన్ని రోజులుగా వీలు దొరికినప్పుడల్లా గోదారి అలల్లో తేలిపోతూ ఉన్నానుగా..:)) ధన్యవాదాలు వ్యాఖ్యకి..
అపర్ణ బాగారాశారు .
అందాలరాముడు లో ఒక గోదారి పాట వుంది .
" కురిసెవెన్నెల్లో మెరిసే గోదారిలా , మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నది "
ఈ పాట , పాట చిత్రీకరణ , గోదారి చాలా చాలా అందం గా వుంటాయి . ఈ పాట చిమటా మ్యుజిక్ లో వుంది . వినండి .
లింక్ ఇవ్వటానికి ప్రయతించాను . సరిగ్గా రాకపోతే తిట్టుకోకండి :)
చాలా చాలా బాగుందండి మీ ప్రయత్నం...
ఎక్కడో మహరాష్ట్రలో పుట్టి ఎన్నెన్నో రకాల నేలలపై నుండి జాలువారి మన కోసం మన రాష్ట్రంలోకి వచ్చింది గోదావరి, అలాంటి అఖండ గోదావరమ్మ తల్లిపై ఇంత ప్రేమ ఉందంటే మీరు ఖచ్చితంగా గోదావరి జిల్లాల్లోనే పుట్టుంటారు. పరవళ్ళు తొక్కే గోదావరి చదువుతుంటే చిన్నప్పుడు చేసిన గోదావరి స్నానాలు, ఆ తల్లి ఒడిలో ఏరుకున్న చిన్న శంఖులు, లాంచీలపై ప్రయాణాలు గుర్తుకొస్తున్నాయి..
waiting for your next post andi..
మాలా కుమార్ గారు,
నిజమేనండీ ఆ పాట మిస్ చేసాను:) గుర్తు తెచ్చుకుని మరీ లింక్ ఇచ్చినందుకు బోలెడన్ని ధన్యవాదాలు:) బాగుంది పాట:)
డేవిడ్ గారు, ధన్యవాదాలండీ:)
వంశి గారు,
నాకు మీ వ్యాఖ్య ఎంతగా నచ్చిందంటే, బోలెడు సార్లు చదివాను ఇప్పటికి:)ఇంత మంచి వ్యాఖ్యకి ధన్యవాదాలు. నిజమండీ నాకు గోదావరి అంటే చాలా ఇష్టం. మాది గోదారి జిల్లా అయితే కాదు కానీ, మా ఊర్లో కూడా గోదావరి ప్రవహిస్తుంది.
అఙ్ఞాత గారు, కొత్త పోస్ట్ పెట్టేసానోచ్:)
Post a Comment