Wednesday, April 13, 2011

ఙ్ఞాపకాల సౌరభాలు..

చాలా రోజుల తరువాత మొన్న శ్రీరామ నవమికి మా ఊరెళ్లానోచ్..:)
మరి ఆనవాయితీగా మా ఊరి విశేషాలు మీతో పంచుకోవాలిగా. అందుకే ఇలా వచ్చా అన్నమాట:) ఆహా, ఎంత పద్ధతిగా బుద్ధిగా కూర్చున్నారో అందరూ(ఇది అబద్దం అని ఎవరక్కడ అనేది..?).. అందుకే మీరందరూ అంటే నాకిష్టం.

సరే ఇక విషయానికొస్తే, ఊరి విశేషాలు చెప్పడం కన్నా చూపిస్తేనే బాగుంటుందనిపించి ఎంచక్కా మీకోసం ఫోటోలు అవీ తీసాను మరి. 

ఊరికి వెళ్లడమైతే సంతోషంగా ఎగిరి గెంతులేస్తూ వెళ్లాను కానీ ఆ ఎండలకి తట్టుకోలేక కళ్లు తేలేస్తానా అని భయమేసింది. దూరంగా పూయ్..పూయ్.. అంటూ శబ్దం వినిపించేసరికి బుర్రలో ఎక్కడో నిద్ర పోతున్న చిన్న నాటి ఙ్ఞాపకాలు చుట్టు ముట్టి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకెళ్లా. దూరంగా కనిపించేది ఐసు బండే. ఆనందంతో మరోసారి ఎగిరి గెంతేసి మిట్ట మధ్యాహ్నం ఎంచక్కా పుల్లైసు కొనుక్కుని తిన్నా.


మధ్యాహ్నమంతా ఎంతగా సూర్యుడు తన ప్రతాపాన్ని/వీరత్వాన్ని చూపించినా, సాయంత్రమయ్యేసరికి మల్లెల కౌగిట్లో చల్లబడడా..? మా ఇంటి చిన్ని మల్లె చెట్టుకి పూచిన తెల్లని మల్లె పూలని నా స్వహస్తాలతో కట్టాను మల్లెల మాలగా (నిజ్జంగా నిజ్జం)


టపా టైటిల్‌లోనే మీకొక విషయం చెబుదామని మర్చిపోయాను చ..;)
నేను ఫుల్లుగా జున్ను లాగించేసానోచ్:) (ఇది చూసి ఎవరెవరు కుళ్లుకుంటున్నారో నాకు తెలుసు ;)) మరి జున్ను పాలని నాకోసం తెచ్చిన మా బుజ్జి లేగ దూడని చూస్తారా..?ఎండాకాలం కదా.. మా పెరడంతా ఖాళీగా ఉంది. ఈ గొర్రెలెవరివో తెలీదు కానీ ఆ గడ్డినే కష్టపడి పీక్కుంటూ తింటున్నాయి. పాపం:(


నాలుగు రోజులు ఖాళీ సమయం దొరికే సరికి, ఎంచక్కా చిన్నప్పటి రోజులకి వెళ్లిపోయాను. మా నాన్నతో అవీ ఇవీ మాట్లాడుతూ ఉంటే ఒక మంచి విషయం(నాకు, మీకు అది మంచిది కాకపోవచ్చు;)) బయట పడింది. మీరు భయపడకుండా టపా ఇంకా చూస్తా అంటేనే చెబుతా అదేంటో. మీవి ఏమాత్రం పిరికి గుండెలైనా వీక్ హార్ట్స్ అయినా నే చెప్పనంతే.

సరే ముందుకొచ్చారు కాబట్టి చెబుతున్నా. నేను చిన్నప్పుడు ఊసుపోక ప్రాణంపోసిన కళాఖండలన్నిటినీ (కొన్ని పిచ్చి బుర్రలు వాటిని పిచ్చి గీతలంటారు) మా నాన్న భద్రంగా దాచి పెట్టారు:) అవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ శిథిలావస్థలో క్యారు క్యారు మని ఏడుస్తుంటే అది చూసిన నా మాతృ హృదయం కన్నీరు మున్నీరుగా విలపించి , మీరు చిరంజీవులు నాన్నా.. తెలుగు బ్లాగ్లోకం ఉన్నంత కాలం మీరు సజీవంగా ఉంటారు అని హామీ ఇచ్చి, ఇదిగో ఇలా ఫోటోలు తీసి బ్లాగులో పెడ్తున్నా..

రాధా కృష్ణులు.. ఈ బొమ్మకి రంగులేద్దాం అని ఒక రెండు మూడు సంవత్సరాలు అనుకుని ఆ తరువాత నలుపు తెలుపు కూడా రంగులే కదా లైట్ తీసుకున్నా..


ఈ కింద వరసగా వచ్చే కొన్ని బొమ్మలన్నీ నిజంగా ఊసుపోక గీసినవే...:))))
ఇది నా చెయ్యే...:))))))
ఈ కింద రెండూ నా క్రియేటివిటీకి తార్కాణం. భయపడకండి..;) ఇది నీళ్ల కూజా కాదు అని ఎవరికైనా అనిపిస్తే వాళ్లు మండుటెండలో థార్ ఏడారిలో ఒక నెల రోజులు ఉండేలా ఏర్పాట్లు చేస్తా..హిహ్హిహ్హీ...ఊరికే..;)


ఇహహ్హహ్హా.. ఇహహ్హహ్హా..
ఇవి రెండూ నా సొంత సృజనాత్మకత ఉపయోగించి మనసులో 3D ఊహించుకుని మరీ గీసిన ఫ్లవర్ వేసులు..


ఇవి మాత్రం, డిగ్రీలో నా నేస్తం వాళ్లింట్లో ఉన్నప్పుడు గీశాను. మొదటిది నా ఫ్రెండ్ కాలిక్యులేటర్.. రెండోది వాళ్ల తమ్ముడి సైకిలు. 


43 comments:

వేణూరాం said...

వహ్ వా... సూపర్ గా ఉన్నాయి మీ జ్ణాపకాలు... అన్ని ఫొటోలు వేటికవే అన్నట్టు ఉన్నాయి..
ఇక మీ బొమ్మల క్రియేటివిటి ని ఏమని వర్ణించాలి? ఆ పళ్ళ బొమ్మ నాకు బాగా నచ్చీంది.. ఇన్కా మిగిలినవి కూడా బావున్నాయి..

మీలో రచయిత్రి మాత్రమే అనుకున్నా,., చెయ్యి తిరిగిన చిత్రకారిణి కూడా ఉందన్న మాట.. :) :)

తృష్ణ said...

టపాకి శ్రీరామనవమి ముచ్చట్లు అని పేరు పెట్టాల్సింది..:)

జున్ను తిన్నారని కాదు కానీ మాల అంత బాగా కట్టేసుకున్నారని కుళ్ళుకున్నా.. నాకు సరిగా రాని ఏకైక పని అది..:(

బొమ్మలు చాలా చాలా చాలా బాగున్నాయి. ఇంకా వేస్తున్నారా? ఆపేసి ఉంటే కనుక తప్పకుండా మళ్ళీ వీలున్నప్పుడు వేస్తూండండి. ఇది ఒక కళాకారిణి మరో కళాకారిణికి ఇస్తున్న సలహా అన్నమాట...:) అంటే నేను కూడా అప్పుడెప్పుడో నే గీసిన కొన్ని "కళాఖండాలను" బ్లాగ్లో పెట్టాను...:) అదన్నమాట..!!

Anonymous said...

I liked your drawings, these are not like your prev. ones, really good.

Raghu said...

It is a beautiful narration oops photo narration. I am impressed with the photos. and the art works.

Keep up

Raghu

..nagarjuna.. said...

ఆ బొమ్మలు చూసాకా........ ఊహుం, మాటల్లేవ్..
[నాతో నేను : ఛీ యెధవ, ఇంత ఎత్తు ఎదిగావ్ ఏం లాభం !! స్కేలు ఉపయోగించి కూడా తిన్నగా ఒక లైను వెయ్యలేవు నువ్వు కూడా ఇలాంటి సూ...పరు డ్రాయింగుల గురీంచి మాట్లాడుతున్నావ్ ప్చ్ ]

>>మీలో రచయిత్రి మాత్రమే అనుకున్నా,., చెయ్యి తిరిగిన చిత్రకారిణి కూడా ఉందన్న మాట.. :) :)
ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అధ్యక్ష్యా...., 'అనుకున్నా', 'ఉందన్నమాట' కాదు...., ఇద్దరూ ఖచ్చితంగా ఉన్నారు అని చెప్పాలి.

ఐనా బ్లాగు లోకపు ఆడ స్త్రీ లేడీస్ అందరు ఇలా వరస పెట్టి షాకుల మీద షాకులిస్తున్నారేంటో.... :-?

కావ్య said...

అప్పు నా ఫ్రెండ్ వి అయ్యినందుకు .. నా టేలెంట్ అంతా నీకు వచ్చింది ..
నువ్వు నా అంత బాగా బొమ్మలు వెయ్యలేకపోయాను అని ఏమి ఫీల్ అవకు .. బాగా ప్రాక్టిస్ చెయ్ ఎందుకు రాదో నాల వెయ్యడం చూద్దాం :)
నిజ్జంగా మాటడుకుండం ఇప్పుడు :)
ఎంత బాగా వేసావో తెల్సా .. సూపర్ ఉన్నాయి .. ఎందుకు కంటిన్యు చెయ్యడం లేదు .. నిజ్జంగా చేయి సరేనా ..
మీ ఇల్లు నీ జ్ఞాపకాలు .. అన్ని నీలాగే క్యుట్ గా ఉన్నాయి :)

నేస్తం said...

అప్పోడు నువ్వు ఇంత బాగా బొమ్మలేస్తావా ...అయ్యబాబోయ్ ..నాకైతే మతిపోతుంది..ఇది మా అప్పూయేనా అని..మీ బావగారికి చూపిస్తే అసలు నమ్మడం లేదు ఆ ప్లవర్వాజ్ లు ఫొటొస్ అంట..బొమ్మలు కాదంట :) కాని సూపర్ అంతే ..ఇంతకన్నా ఎక్కువ పొగిడితే దిష్టి తగులుతుంది ..నాకు ఆ సైకిల్, కుండ పిచ్చ పిచ్చగా నచ్చేసాయి..

ragalapallakilo koyilamma said...

Me muchhatlu, meru gesina bommalu anni bavunnayamdi...meku velunnapudu okasari na blog kuda chusi me abhiprayam cheppandi...kallurisailabala.blogspot.com

చిన్ని ఆశ said...

మీ జ్ఞాపకాలు చాలా పదిలంగా పదిల పరచిన మీ నాన్న గారు అభినందనీయులు. ఆ కళా ఖండాలని (వేసిన హృదయంకి మాత్రమే తెలుసా మాతృప్రేమ) ఇప్పటికైనా అక్కున చేర్చుకుని వాటికి మళ్ళీ పునర్జన్మనిచ్చిన మీ కళా హృదయానికి కళాభివందనాలు. నిజంగా ఇవి జ్ఞాపకాల సౌరభాలేనండీ! మీ చేతిలో ఉన్న మల్లె మాలంతటి సహజమైన అందం ఉంది మీ గీతల్లోనూ...

గిరీష్ said...

కూల్,
చాల బాగున్నాయ్ మీ ఇంటి సంగతులు..
ఎంతైనా హోమ్ టవునా మజాక..:)
బొమ్మలకొస్తే,
ఆ పండ్ల బొమ్మలు ఎక్కడో చూశానండి. చిన్నప్పడు డ్రాయింగ్ క్లాసులో అనుకుంట.
మీ క్రియేటివ్ బొమ్మ బాగుంది.
తర్వాత సైకిల్ బొమ్మ కూడ.
final touch: నా దగ్గగ పాలన్ని తీసేసుకొని జున్ను జుర్రేయడం కాకుండ నా ఫోటో కూడ తీస్తావా అని బాధ పడే ఆ దూడని చూడండి పాపం.. :)

శిశిర said...

అమ్మో.. ఎన్ని జ్ఞాపకాల సౌరభాలో! ఎంత టాలంటో! మీ సౌరభాలు నన్ను కూడా తాకి మాఊరెళ్ళిపోయి బాల్యంలో తిరుగాడుతూ వెనక్కివచ్చే దారి తెలియక, రావడం ఇష్టంలేక అక్కడే తిరుగాడుతున్నా. చిత్రకళలో మీ టాలెంట్ చూసి స్కేలుతో కూడా స్ట్రయిట్‍లైన్ స్ట్రయిట్‍‌గా గీయలేని నేను కుళ్ళుకుంటున్నా. :) బొమ్మలు చాలా బాగున్నాయి.

ఆ.సౌమ్య said...

అప్పు నువ్వు ఇంత మంచి కళాకారిణివా, ఎంత బాగా వేసావు బొమ్మలు...too good! మరి ఇన్నాళ్ళు అలా దాచేసుకున్నావేం మాకెవ్వరికీ చూపించకుండా? రాధకృష్ణూలు, నీ చెయ్యి-వేళ్ళు, ఫ్లవర్వాస్, చివర్న సైకిలు సూపరులే...చాలా బాగా వేసావు. ఇంకా వేస్తూ ఉండు, ఆపేయకు.

వేణూ శ్రీకాంత్ said...

అబ్బ జ్ణాపకాలు ఎంత బాగున్నాయో.. నిజంగానే కుళ్ళు వచ్చేస్తుంది జున్నుపాలు, పుల్లైస్, ఒత్తుగా కట్టిన మల్లెమాల (చాలా బాగా కట్టారు), మీ పెరడు.. ఇక మీ బొమ్మలు చూశాకైతే మాటల్లేవు.. అద్భుతః అంతే :)

నైమిష్ said...

బొమ్మలు చాలా బాగున్నాయి..ఎంతైనా చేతి వేళ్ళు సన్నగా వున్న వాళ్ళు అలవోకగా బొమ్మలు ఏసేస్తారని చిన్నప్పుడు మా మాస్తారు చెప్పేవారు..నిజమే..ఇంతకీ ఏ ఊరేటి మనది..తూగోజి నా , పగోజి నా?

మాలా కుమార్ said...

మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి .
బొమ్మలు , మల్లెలు సూపర్ గున్నాయి . మల్లెలైతే మరీనూ .

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ మల్లెల సౌరభాలు మా దాకా వచ్చేశాయి. ఆహ్లాదం తెచ్చేశాయి. కవితలు,కధలు,ఫోటోగ్రఫి,చిత్రలేఖనం ఇంకా ఎన్ని కళలు ఉన్నాయి మీ చేతిలొ?

కూరగాయల చిత్రం లో బెండకాయలు వెతికితే కింద లేడీస్ ఫింగర్స్ ఉన్నాయి. బాగుబాగు చిత్రాలు ఫోటోలు. నా క్కూడా కూజా,ద్రాక్షలు తెగ నచ్చేశాయి.

మనసు పలికే said...

వేణూరాం గారు..:) బోలెడన్ని ధన్యవాదాలు..
ఆ పండ్ల బొమ్మ ఎక్కడో చూసి గీశాలే..
>>మీలో రచయిత్రి మాత్రమే అనుకున్నా,., చెయ్యి తిరిగిన చిత్రకారిణి కూడా ఉందన్న మాట.. :) :)
కొద్ది రోజులుగా గమనిస్తున్నా.. ఎందుకు మీరు నన్ను పదే పదే తిడుతున్నారు..? ;)

తృష్ణ గారు,
నాకసలు ఆ ఆలోచనే తట్టలేదు నిజంగా టైటిల్ ఏం పెట్టాలా అని తెగ ఆలోచించినా కానీ.. బొమ్మలు ఈ మధ్య వెయ్యడం లేదండీ..:( కానీ మీ అందరి ప్రోత్సాహం చూస్తుంటే నాకు మళ్లీ మొదలు పెట్టాలని ఉంది:). బోలెడన్ని ధన్యవాదాలు. మీరు కూడా పెట్టారా బొమ్మలు..? నేను చూడనేలేదు. ఇప్పుడు చూస్తా:)

అఙ్ఞాత గారు, ధన్యవాదాలండీ చాలా ఫ్రాంక్‌గా తెలియజేసినందుకు:) కాకపోతే మీ పేరు కూడా పెడితే ఇంకా సంతోషించేదాన్ని:))

మనసు పలికే said...

రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్:)

నాగార్జున,
ఎందుకు నాగార్జున నిన్ను నువ్వు తిట్టుకుని చివరికి నన్ను కూడా తిడతావు..??? :(
బొమ్మలు నచ్చినందుకు, ఇంత పెద్ద వ్యాఖ్య పెత్టినందుకు బోలెడన్ని ధన్యవాదాలు:)))

కావ్యా,
హహ్హహ్హా.. మరే.. నిజమే, నీ టాలెంట్ చూసాకే నాకు ఇవన్నీ గుర్తొచ్చాయి. కాబట్టి ఇదంతా నీకే క్రెడిట్.:) కంటిన్యూ చెయ్యాలి కావ్యా.. ఇప్పుడు సీరియస్‌గా అనిపిస్తుంది మీ అందరి ప్రోత్సాహం చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్:)

మనసు పలికే said...

నేస్తం అక్కయ్యా...:)))))))
బావ గారికి చూపించారా నా బొమ్మల్ని.. ఆహా ధన్యోస్మి;)
చాలా చాలా హ్యాపీ నేను మీ వ్యాఖ్య చూసి. ఏంటో ఏం రాయాలో కూడా తెలీట్లేదు:) మీకు బోలెడు బోలెడు బోలెడు ధన్యవాదాలు:)

రాగాల పల్లకిలో గారు,
ధన్యవాదాలండీ నా బొమ్మలు నచ్చినందుకు:)
చూసానండీ మీ బ్లాగు, పేరు భలే ఉంది:) నాకు చాలా ఇష్టమైన పాట అది. 34 భాగాలు రాసారు కదూ. అవన్నీ చదివి వ్యాఖ్య పెడతాను:)

చిన్ని ఆశ గారు,
>>మీ జ్ఞాపకాలు చాలా పదిలంగా పదిల పరచిన మీ నాన్న గారు అభినందనీయులు
చాలా చాలా థ్యాంక్స్ అండీ:) నిజంగా పాపం మా నాన్న గారు వాటిని దాచి పెట్టకపోతే నేను పారేసుకునేదాన్నే:(
>>మీ చేతిలో ఉన్న మల్లె మాలంతటి సహజమైన అందం ఉంది మీ గీతల్లోనూ...
అబ్బ మీ వ్యాఖ్య నాకు ఎంత బాగా నచ్చిందో:) చాలా చాలా థ్యాంక్స్:)

మనసు పలికే said...

గిరీష్ గారు,
హహ్హహ్హ నిజమే సొంత ఊరుకి ఉన్న విలువ అలాంటిది:) అయితే మీరు కూడా గీస్తారనమాట బొమ్మలు. నా దూడ ఎక్స్ప్రెషన్‌కి ఎంత గొప్ప అర్థం ఇచ్చారు.. కెవ్వు:) ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)

శిశిర గారు,
ఇంకా అక్కడే ఉన్నారా? చిన్న నాటి ఙ్ఞాపకాలకున్న మహత్యం అలాంటిది. ఎన్ని సార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుండి రావాలనిపించదు. ఎంత మంచి రోజులో కదూ..
ధన్యవాదాలండీ నా చిత్ర కళని చూసి కుళ్లుకుంటున్నందుకు ;);)

సౌమ్య గారు,
చాలా చాలా ధన్యవాదాలు:) నేనెక్కడ దాచి పెట్టుకున్నానండీ. నేను పారేసుకుంటానని తెలిసి పాపం మా నాన్నారే దాచి పెట్టారు. హిహ్హిహ్హి.. మళ్లీ మొదలు పెట్టాలి సౌమ్య గారు. ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి..

నాగప్రసాద్ said...

సూపరో... సూపర్...

ఇక విమర్శించడం నా నైజం కాబట్టి... :-)

ఆ సైకిల్కు యాక్సిడెంట్ అయినట్టుంది. అందుకే ఫ్రంట్ టైర్ కొంచెం సొట్ట బోయింది. వెనకాల టైర్లో స్పోక్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. (ఏ కంపెనీ టైరో మరి)

>>"ఐనా బ్లాగు లోకపు ఆడ స్త్రీ లేడీస్ అందరు ఇలా వరస పెట్టి షాకుల మీద షాకులిస్తున్నారేంటో.... :-?"

ఆళ్ళకు పనీ పాటా ఉండదు నాగార్జున, ఖాళీగా ఉండలేక ఇట్టాంటివన్నీ నేర్చుకుంటారు అంతే... :-)

మనసు పలికే said...

వేణు శ్రీకాంత్ గారు,
మీరు కుళ్లుకుంటుంటే నాకు భలే సంతోషంగా ఉంది;) బోలెడన్ని ధన్యవాదాలు నా బొమ్మలు అంతలా నచ్చినందుకు:) ముఖ్యంగా ఒత్తుగా కట్టుకున్న నా మల్లెల మాల నచ్చినందుకు:))

నైమిష్ గారు,
>>ఎంతైనా చేతి వేళ్ళు సన్నగా వున్న వాళ్ళు అలవోకగా బొమ్మలు ఏసేస్తారని చిన్నప్పుడు మా మాస్టారు చెప్పేవారు
నిజంగానా..???:))) ధన్యవాదాలు నా బొమ్మలు నచ్చినందుకు. మాది తూ.గో నూ కాదు, ప.గో నూ కాదు:)) కానీ గోదావరి మా దగ్గర కూడా ఉరకలేస్తూ ఉంటుంది:)

మాలా కుమార్ గారూ:) బోలెడన్ని ధన్యవాదాలు:) మల్లెలంటే నాకు చాలా ఇష్టం, అందుకే చాలా శ్రద్ధగా కట్టుకున్నాను మాల:))

మనసు పలికే said...

గురూ గారూ:)
నా మల్లెల సౌరభాలు మీదాక వచ్చి ఆహ్లాదాన్ని పంచినందుకు సంతోషంగా ఉంది చాలా:)
>>కూరగాయల చిత్రం లో బెండకాయలు వెతికితే కింద లేడీస్ ఫింగర్స్ ఉన్నాయి
హిహ్హిహ్హి.. భలే ఉంది మీ వ్యాఖ్య. బోలెడన్ని ధన్యావాదాలు మాస్టారు నా బొమ్మలు, ఫోటోలు నచ్చినందుకు:)

నాగ గారు,
మీ అద్భుతమైన పరిశీలనా శక్తి కి ఒక ఓ వేసుకుంటున్నానిక్కడ:) ఇంత ఫ్రాంక్‌గా చెప్పినందుకు ధన్యవాదాలు:) ఆ సైకిలు బొమ్మ వెయ్యడానికి నేను చాలా కష్ట పడ్డానులే.. ఒక రెండు మూడు గంటలు సెల్లార్ పార్కింగ్‌లో కూర్చుని సైకిలుని చూస్తూ గీశాను;)
>>ఆళ్ళకు పనీ పాటా ఉండదు నాగార్జున, ఖాళీగా ఉండలేక ఇట్టాంటివన్నీ నేర్చుకుంటారు అంతే
ఇదన్యాయం అధ్యక్షా.. మీరు ఖాళీ గా ఉన్నప్పుడు ఆ మాత్రం ప్రొడక్టివ్ పని కూడా చెయ్యరుగా;);)

కొత్త పాళీ said...

బొమ్మలు చాలా చాలా బాగున్నాయి - ముఖ్యంగా పెన్సిల్ స్కెచెస్. ఇంకా కృషిచేస్తారని ఆశిస్తున్నాను.

ramya said...

నేను చిన్నప్పుడు ఊసుపోక ప్రాణంపోసిన కళాఖండలు<<

హ్మ్మ్మ్..ఉబుసుపోక గీసినవే ఇలావుంటే, సాధన చేస్తే ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు.
-------
రాధా కృష్ణులు.. ఈ బొమ్మకి రంగులేద్దాం అని ఒక రెండు మూడు సంవత్సరాలు అనుకుని ఆ తరువాత నలుపు తెలుపు కూడా రంగులే కదా లైట్ తీసుకున్నా..
--------
హహహ అవును కదా!!

--------

అది ముమ్మాటికి నీళ్ళ కూజా అని జస్ట్ ఇలా చూడగానే అనుకున్నా :))

త్రీడీ ఫ్లవర్ వేజ్ లు సూపర్.

సైకిలూ క్యాలిక్యులెటర్ ...
జవాబ్ నహీ.
మిగతావి అన్నీ కూడ సూపర్.
సాధన మాత్రం మానేయకండి.

Vamsi Maddipati said...

మీ CONCEPT చూసాక నా పిచ్చిగీతలను కూదా ఇలా బ్లాగులో పెట్టాలన్న Confidence వచ్చింది...

what an IDEA madamjee (Sorry idi matram abhishek inspiration)

Anonymous said...

"మా నాన్న భద్రంగా దాచి పెట్టారు:)"

.యీ మాట చాల బాగుంది ..మీ నాన్న గారు చాల మంచి పని చేసారు.... అపర్ణ గారు


నేను ఈ మధ్య ఆంధ్ర వెళ్ళినప్పుడు జున్ను తిందామని చాల ట్రై చేశాను....కాని ఎక్కడ దొరకలా....మీరు లక్కీ అండి.


3D లో మొదటి పిక్చర్ సూపర్ గా ఉంది.అలాగే మట్టి కుండ,వెండి భరిణ lively గా ఉన్నయీ.సైకిల్ అదరింది....

It'a wonderful post :)

పరుచూరి వంశీ కృష్ణ . said...

బొమ్మలు చాల చాల బాగున్నాయి త్రీడీ కూడా !

ఇందు said...

హేయ్ అప్పూ! నీ బ్లాగ్ ఇంత లేట్ గా చూసినందుకు నాకు తిక్క బాగా కుదిరింది! ఇంతమంచి టపా మిస్ అయ్యా :(

కానీ అప్పూ నువ్వు కేకంతే...ఫో! నేను అస్సలు అవాక్కయ్యా నీ బొమ్మలు చూసి :) నాకు ఆ సైకిల్ పిచ్చపిచ్చగా నచ్చెసింది. ఇంకా నీ క్రియేటివిటి లో పీక్ అయిన ఆ బ్రష్ హోల్డర్ కూడా భలె ఉంది. నాకు అది ఇచ్చెయ్యవా? ప్లీచ్ ప్లీచ్!! :((

అప్పు!! నీమీద ఇంకా భారం పెరిగిపోతోంది. నువ్వు నాకు వయోలిన్ నేర్పాలి.పూలు అంత చిక్కగా మాల కట్టడం నేర్పాలి......ఇలా మంచిమంచి బొమ్మలు వేయడం నేర్పాలి! ఎప్పుడు ఇవన్ని జరిగేది! టెల్లు! ఐ డిమాండ్ ఏన్ ఎక్స్ప్లెనెషన్ యునో ;)

బాలు said...

కూజా నిజంగా ఎఖ్సలెంటంతే. మరింక మాటల్లేవ్

మనసు పలికే said...

కొత్త పాళీ గారు.. ధన్యవాదాలండీ.. తప్పకుండా కృషి చేస్తాను:)

రమ్య గారు,
>>అది ముమ్మాటికి నీళ్ళ కూజా అని జస్ట్ ఇలా చూడగానే అనుకున్నా :))
మీరెంత మంచోరండీ...:) బోలెడన్ని ధన్యవాదాలు మీకు:)) మీ వ్యాఖ్య చూసి భలే సంతోషమేసిందిలే..

వంశి గారు, హహ్హహ్హా..
నిరభ్యంతరంగా పెట్టెయ్యండి మీ బొమ్మలన్నీ.. కామెంట్స్ ఎందుకు రావో చూద్దాం..;)

మనసు పలికే said...

CS గారు, చాలా చాలా థ్యాంక్స్ మీ వ్యాఖ్యకి..:) నిజమేనండీ పాపం మా నాన్న గారు శ్రద్ధ తీసుకోకపోతే ఆ గుర్తులు నాకు ఇంకా ఉండేవి కాదు..:( ఆ విషయంలో ( ఇంకా చాలా విషయాల్లోలే) మా నాన్నకి కృతఙ్ఞురాలిని:)
పాపం మీకు జున్ను దొరకలేదా.!! ప్చ్..

వంశీ కృష్ణ గారు, ధన్యవాదాలండీ:)

ఇందు,
నన్ను అడగాలా చెప్పు. నీకు ఏ బొమ్మ నచ్చితే దాన్ని తీసేస్కో.. నువ్వు అసలు ఇక్కడికి రా.. ఎంచక్కా మనం పాపికొండలు ట్రిప్‌కి పోదాం:) అక్కడే అన్నీ నేర్చేసుకుందాం.. నీకు బోలెడు కళలు నేర్పించేసి, సకల కళా వల్లభురాలిగా తీర్చిదిద్దకపోతే నేను పేరు మార్చేసుకుంటాను..:D:D
నీ వ్యాఖ్యకి మాత్రం బోబోబోబోబోలెడు థ్యాంకులు:))

బాలు గారు,
చాలా చాలా థ్యాంక్స్..

Radha said...

drawings chala chala baagunnai...
mee pullaisu kooda
mee peradu antha pedda ga untunda ante illu entha peddadi?
chuutoo anni polaalu.. realestate bhootam inkaa paakinattu leku mee ooriki... good.. lekapothe ippudu palletoorlalo kooda apartments and shopping maalls kada
felt good seeing ur drawings.. really nice

కృష్ణప్రియ said...

అపర్ణ,
మీ మల్లెపూల మాలా బాగుంది. గీసిన బొమ్మలూ బాగున్నాయి. అవునూ,... మల్లెపూలు సూది తో గుచ్చారా? అల్లారా? మీరు వేసిన బొమ్మల్లోమీ సొంత సొంత సృజనాత్మకత తో చేసిన ఫ్లవర్ వేసు చాలా నచ్చింది. ఇంకా సైకిల్, చేతులు కూడా!

మనసు పలికే said...

రాధ గారు,
చాలా చాలా థ్యాంక్స్ అండీ మీ వ్యాఖ్యకి:) అదృష్టం, రియల్ ఎస్టేట్ భూతం ఇప్పుడప్పుడే పట్టేలా లేదులెండి మా ఊరు. చా....లా పల్లెటూరు మాది:) ఊరంతా కలిపి ఒక కిలోమీటరు పొడవు కూడా ఉండదు. మాపెరడే పెద్దదండీ, ఇల్లు మామూలుగానే ఉంటుంది:) బోలెడన్ని ధన్యవాదాలు నా బొమ్మలు నచ్చినందుకు:))

కృష్ణప్రియ గారు,
నా బొమ్మలన్నీ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది:) మల్లెల మాల అల్లినదేనండీ, సూదితో గుచ్చలేదు. బోలెడన్ని ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)

సత్య said...

చాలా బాగున్నాయి మీ బొమ్మలు చాలా సార్లు చూసా... చాలా మందికి చూపించా.... మొదటి ప్లవర్వాజ్ చాలా బాగుంది...
కంగ్రాట్స్......

keep drawing...
get good progress....

--satya

శివరంజని said...

నేను ముందు నుండి చెబుతూనే ఉన్నాను............ నీది మాములూ టాలెంట్ కాదని ...అస్సలు నువ్వు ఇక్కడ ఉండాల్సినదానివి కాదు అప్పు ...

ఏమి చెప్పను నీ గురించి .......... ఒకటా ? రెండా ? మంచి మంచి కవితలు , స్టోరీలు , పెయింటింగ్స్ , ఫోటోగ్రఫీ ... ముందు ముందు ఇంకెన్ని కళలు చూపిస్తావో ........ నీకు రానివి, తెలియనివి ఒకవేళ ఏదైనా ఉండి ఉంటే చెప్పు తల్లీ ...అది నేను ట్రై చేస్తాను ....
కొంచెం దిష్టి కొడుతూ ..కొంచెం జెలసీ ఫీల్ ఆవుతూ కామెంట్ రాస్తున్న రంజని ....

హరే కృష్ణ said...

Wow..Excellent!
నేను delay చేస్తూ వస్తున్నా పోస్ట్ లు నెమ్మదిగా చదువుదాం లే అని
అద్భుతం
ఆ గ్రామ గేదె మాత్రం ఐక్యం చేసుకోవడానికి సూపర్ గా ఉంది

హరే కృష్ణ said...

కుల్లేస్కుంటున్న హరే :)
keep up the good work!

హరే కృష్ణ said...

కుల్లేస్కుంటున్న హరే :)
rocks!..keep up the good work!

మనసు పలికే said...

సత్య గారు,
>>చాలా సార్లు చూసా... చాలా మందికి చూపించా....
ఇది చదివి ఎంతగా పొంగిపోయానో.. బోలెడన్ని ధన్యవాదాలు:)

రంజని,
ఇక్కడ ఉండాల్సిన దానిని కాదు అంటే సరిపోద్దా..? ఎక్కడ ఉండాలో కూడా చెప్పాలి కదా..;)
నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నప్పుడు, దిష్టి కొడుతున్నప్పుడు ఎంత బాగున్నావో.. మొత్తానికి నీ వ్యాఖ్య చూసి బోలెడంత సంతోషపడ్డాను:) ధన్యవాదాలు:))

హరే,
>>ఆ గ్రామ గేదె మాత్రం ఐక్యం చేసుకోవడానికి సూపర్ గా ఉంది
ఏంటిదీ.????? :)))))) ఐక్యమా.? హహ్హహ్హా.. ఇట్టాంటి అయిడియాలు నీకెలా వస్తాయి..? కుళ్లుకుంటున్నందుకు మాత్రం బోలెడు థ్యాంకులు:) థ్యాంక్ యూ సో మచ్ హరే:)

శోభా రాజు said...

అపర్ణా... హమ్మో... నీ క్రియేటివీ చూస్తుంటే నాకు నోట మాట రావటం లేదు.. ఎంత చక్కగా గీశావు బొమ్మల్ని..

నేనీ మధ్య మావూరు వెళ్లాను. నీలాగా మా ఇంట్లో చెట్లో కాసిన మల్లెపూలను వారం రోజులపాటు చక్కగా మాలలుగా కట్టి పెట్టుకున్నా. ఎంత సంతోషమైందో.. ఆ చెట్టు ఫొటోలను కూడా తెచ్చా.. త్వరలోనే నా బ్లాగులో పోస్టు చేస్తా...

ఇకపోతే పుల్లైసు.. ఎంత చక్కటి జ్ఞాపకమో కదా.. నీలాగే నేనూ పుల్లైసు రుచి చూసేశానోచ్...

జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. అస్సలు జ్ఞాపకాలు లేనిదెవరికి.. ఇలా చక్కగా ముస్తాబు చేసి బ్లాగుల్లో పోస్టు చేసేది కొందరే.. అందులో ముందువరస నీదే.. ఆల్ ది బెస్ట్.. మరిన్ని కళాఖండాలను మా ముందుకు తెస్తావని ఆశిస్తూ... అభినందనలతో...

Ramesh Labisetty said...

Nice blog with good language...