Thursday, May 26, 2011

ఆదివారం అగచాట్లు

ఆదివారం.. ఉదయాన్నే 11 గంటలకి ఆవులిస్తూ, మెల్లిగా దుప్పటి పక్కకి జరిపి, నిద్రమొహంతోనే ఈనాడు/సాక్షి/ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం చదవడం, తర్వాత చిన్నగా కాలకృత్యాలు ముగించి కడుపులో కాస్త పడేయడం.. అద్భుతమైన అనుభూతులు కదా.. ఏంటి, ప్రతి ఆదివారం జరిగే సంగతినే గొప్పగా చెబుతున్నానా.? మరద్దే, అక్కడే ఆదివారం అనుబంధంలో కాలేశారు. ఆదివారం అర్థరాత్రి 7 గంటలకల్లా నిద్రలేచి (వంట చెయ్యాలంటే ఇంకో గంట ముందు), అన్ని పనులూ అర్థ..గంటలో ముగించుకుని దేశాన్ని ఏలే అభినవ యువనేత లాగా, రాణీ రుద్రమదేవి లాగా, ఝాన్సీ లక్ష్మి బాయి లాగా కదనరంగంలోకి దూకుతున్నట్లుగా, నడుస్తున్నట్లుగా పరిగెడుతూ మొత్తానికి ఆటో స్టాండ్కి వెళ్లడం. ఇది కల కాదు. ప్రతి ఆదివారం జరిగే తంతే..

అంత బిల్డప్ ఇచ్చి ఎక్కడికా వెళ్లేది అనే కదూ చూస్తున్నారు. ఒక్కసారి సంతూర్ యాడ్ గుర్తు తెచ్చుకోండి. "కాలేజా.. నేనా.. మామ్మీ" ఇక్కడేమో కాస్త రివర్స్. మేమంతా వెళ్లేది కాలేజికే (అంటే మేమందరం మమ్మీలని కాదు..). కథా కమామీషు అంతా చెప్పాలంటే ముందు ఆటో ఎక్కలి కదా. ఆటో స్టాండ్కి కాస్త పెద్దదైన పురుగొచ్చినా (పిల్ల మనిషి అనేసుకుంటాడు ఆటోవాడు) సరే, కనీసం ఎటెళ్లాలి అన్న సింగిల్ ప్రశ్న కూడా అడక్కుండా ఆటోలోకి తొక్కేసి లాక్కెళ్లిపోయే రకాలు మా హైదరాబాదు ఆటోవాలాలు. నిజమే మరి, మనుషుల్ని పురుగుల్లానే తొక్కేస్తారు ఆటోలో. ఒరేయ్ బాబూ నే వెళ్లాల్సింది అటు కాదురా అన్నా వినిపించుకోడు. మీరు భయపడకండి మేడం, మిమ్మల్ని సేఫ్గా XYZ (ఏరియా పేరు) దగ్గర దించేస్తాను అన్నట్లుగా అభయహస్తం ఒకటి. ఎలాఓకలా మనది కాని నిమిత్తమాత్రపు ఆటోని వదులుకుని మన గమ్యం దగ్గర చేర్చే ఆటోని వెతికి పట్టుకుని అందులో ఎక్కి ఊపిరి పీల్చుకునే లోపు, ధడేల్.. ధిడేల్.. ధన్.. ధన్ అంటూ సంగీత వాయిద్యాల కఠోర హోరు వినిపిస్తూ ఉంటుంది. అదేంటో అర్థమయ్యేలోపు చెవులకి సగం చిల్లులు పడిపోయి ఉంటాయి కనిపించకుండా.. :(

"భయ్యా.. థోడా వాల్యూం కం కర్ సక్తే క్యా?" మ్యావ్ అన్న సౌండు కూడా వినిపించనంత చిన్నగా అరిచే పిల్లిలా నేను. "నై హోతా" ఇంకోసారి మాట్లాడావో ఏరియాలో నీకింకో ఆటో దొరక్కుండా చేస్తా అన్న మెసేజ్ని చూపుల్తోనే చెబుతూ ఇంకాస్త సౌండ్ పెంచే అతను (అదేనండీ ప్రపంచంలోని రోడ్లన్నీ అతని పేరు మీదే ఉండి, ఏదో ఉదాత్తంగా మన మొహాలకి ధారాదత్తం చేసే ఆటో డ్రైవరు/ఓనరు). మొత్తానికి జాగ్రత్తగా సైడ్ కి తీస్కెళ్లి సరదాగా దేనికి పెడతాడో తెలీకుండా జాలీగా నడిపేస్తూ గమ్యం చేర్పించే సరికి మనకి తలనొప్పి వస్తుంది. హమ్మయ్య అనుకునేలోపు ఇంకో తలనొప్పి ఎదురవుతుంది. ఎవరంటే ఏం చెప్పను? అజయ్ కి ఆర్య లాంటి ఫ్రెండు లేకపోతే ఆర్య2 సినిమా వచ్చేదే కాదు. నాకు ప్రవీణ లాంటి నేస్తం లేకపోతే టపా పుట్టేదే కాదు. మీకు అర్థం అయిందనుకుంటాను! అయినా సరే నేననుకున్న నాలుగు ముక్కలు చెప్పి కానీ వదలను మిమ్మల్ని.

అమ్మాయి గురించి చెప్పాలంటే మనం కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. అంటే మరీ శ్రీకృష్ణ దేవరాయల కాలానికి కాదు కానీ ఒక 3 సంవత్సరాలు వెనక్కన్నమాట. పొరపాటున, నా అదృష్టం బాలేక, ఒకరోజు అమ్మాయికి ఒక పెన్ను ఇచ్చా. పెన్ను దానం కూడా ఒకానొక సమయంలో శాపం అయి కుర్చుంటుందని నాకు తర్వాతే తెలిసింది. అప్పటి నుండి తర్వాత ఒక సంవత్సరం వరకూ అదే

23 comments:

వేణూరాం said...

బాగున్నాయండీ మీ ఆదివారం ముచ్చట్లూ..

నాకు బాగా నచ్చిన లైన్ ఏదంటే..
"అజయ్ కి ఆర్య లాంటి ఫ్రెండు లేకపోతే ఆర్య2 సినిమా వచ్చేదే కాదు." సూపరో సూపరు.. ;D

మీ స్నేహం మీరు కోరుకున్నట్లు గానే ఎప్పటికీ పదిలంగా ఉండాలని కోరుకుంటున్నా. ;)

నైస్ పోస్ట్. ;)

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ అగచాట్లు బాగున్నాయి. యెస్ కొన్ని కొన్ని స్మృతులు మరిచిపోలేము. We would like to re-live them. కానీ

>>> అయినా సరే నేననుకున్న నాలుగు ముక్కలు చెప్పి కానీ వదలను మిమ్మల్ని...

అన్యాయం! పెన్నులు, ఫోన్లు నేస్తాలకి, ఉట్టి కబుర్లు మాకూనా? పైగా మీ నేస్తాలకి మేము విషెస్ చెప్పాలా?
ఒక పెన్ను కొత్తది మాకు పంపితే మీనేస్తాల no.s నోట్ చేసుకుంటాం. ఆతరువాత ఫొనమ్మాయి ఫోన్ పంపితే విషెస్ చెప్పుతాము.
ఇంతకీ మీరు టాం యా జెర్రీ నా ?

భాను said...

ఓ పెన్నమ్మయీ నీ ఆదివారం కబుర్లు బాగున్నాయి. ఎప్పటిలాగే మీ పోస్ట్ సూపర్:)

మంచు said...

అజయ్ కి ఆర్య లాంటి ఫ్రెండు లేకపోతే ఆర్య2 సినిమా వచ్చేదే కాదు. నాకు ప్రవీణ లాంటి నేస్తం లేకపోతే ఈ టపా పుట్టేదే కాదు.>>>>>>>>>>>

That means

అజయ్ = అప్పు
ఆర్య = ప్రవీణ

I like Arya :-)

మాలా కుమార్ said...

మీ ఆదివారం అగచాట్లు బాగున్నాయి :)
మీకూ మీనేస్తాలకు బెస్ట్ ఆఫ్ లక్ .

హరే కృష్ణ said...

ఏ క్షణం ఎప్పుడెళ్లిపోయిందో తెలియకుండా జారిపోతూనే ఉంటుంది. అందుకే కొన్ని విలువైన క్షణాలని మాత్రం ఒడిసిపట్టుకోవాలి. జీవితాంతం గుర్తుండేలా మనో ఫలకం మీద ముద్ర పడిపోయే అటువంటి క్షణాలని నలుగురితో పంచుకుంటే వాటి విలువ ఇంకాస్త పెరుగుతుంది కదా.

ఏంటో ఈ లైన్ కొచ్చేసరికి పిండి పడేసావ్

స్నేహం ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
కనీల్లకే కన్నీ లొచ్చే ఐక్యానికే ఐక్యమత్యం పుట్టే అని పాటేసుకుంటున్న హరే

శివరంజని said...

హహహః అప్పు బాగుంది నీ నీస్తం కధ మీ స్నేహం మీరు కోరుకున్నట్లు గానే ఎప్పటికీ పదిలంగా ఉండాలని కోరుకుంటున్నా. ;) ఎంచక్కా మీ ప్రవీణ నువ్వు టాం అండ్ జెర్రీల్లా కొట్టుకోవడం బాగుంది ...అదేమిటి నా ఫ్రెండ్స్ అందరి మీద పడి నేను కొట్టడం వాళ్ళు పడడం తప్ప తిరిగి కొట్టే ఫ్రెండ్స్ లేరు ..............

అవునా నీకు పెన్నా అమ్మాయి ఫోన్ అమాయి అని బిరుదులూ ఉన్నాయి .... కామెంట్లు పెట్టిన మా అందరికి మీ హైదరాబాద్ లో ప్లాట్ లు కొనిపెట్టావంటే చక్కగా ప్లాట్ అమ్మాయి అని కూడా పిలుస్తాము

గిరీష్ said...

చివర రెండు పేరాలు చాలా బాగున్నాయండి.
ఆటో బొమ్మ కూడ..
finally కథనం సూపరు.
మీరు రైటరు అయిపోయరంతే..
keep it up.

మంచు గారి కమెంట్ కూడ.. :)

ఆ.సౌమ్య said...

హహహ చాలా సరదాగా రాసావు. ఆటో కథనం బలే ఉంది..నేనూ అనుభవించినదాన్నే అది.. ముఖ్యంగా ఆ దిక్కుమాలిన పాటల్ సౌండ్ తగ్గించమని ఎప్పుడూ గొడవే ఆటోవాడితో.

మీ స్నేహం బావుంది...ఇలాగే ఎప్పుడూ ఉంటుందిలే బెంగపడకు. లాస్ట్ పేరా మాత్రం కుమ్మేసావు..బలే రాసావు.

శిశిర said...

మీకూ మీనేస్తాలకు all the best. :)

naga said...

రాజు(క్రి౦దటి పోస్టు అనానిమస్):బావు౦ద౦డి మీ పోస్టు...

ఈ ఆదివార౦(అగచాట్లు) కోస౦ మేము అరు రోజులు అగచాట్లు పడుతున్నాము.. :-)

జయ said...

శివరంజని కరెక్ట్. మరి నేను కూడా వైట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు ప్లాట్ అమ్మాయి అని పిలుద్దామా అని:)

Sasidhar Anne said...

Cool Aparna.. Part time chaduvukuntunnav annamata.. all the best.oka 2 years 2 weekends vadilesthey.. mana chethulo oka degree vuntundhi dummu dulupey.. :)

మనసు పలికే said...

వేణూరాం గారు, నా ఆదివారం ముచ్చట్లు నచ్చినందుకు ధన్యవాదాలు:) మా స్నేహానికి మీరందించిన విషెస్ కి ఇంకా ఇంకా ధన్యవాదాలు:)


గురూ గారు,
హహ్హహ్హా.. మీకు కూడా పెన్ను ఫోను కావాలా? గురుదక్షిణ గానా? ;) నేనైతే జెర్రీనే, హిహ్హిహ్హి..


భాను గారు, ధన్యవాదాలు టపా నచ్చినందుకు :)

మనసు పలికే said...

మంచు గారు,
అయితే ఆర్య తరపున ధన్యవాదాలు :)

మాలా కుమార్ గారు,
ధన్యవాదాలండీ మీ విషెస్ కి:)

హరే కృష్ణ,
హహ్హహ్హ.. బాగా పాడావా "కన్నీళ్లకే కన్నీరొచ్చే" పాట;) నీ విషెస్ కి చాలా చాలా థ్యాంక్స్:)

మనసు పలికే said...

రంజనీ.. నిజమా..? నువ్వు అందర్నీ కొట్టేస్తావా? నాకు ప్లాట్ అమ్మాయి అన్న బిరుదు వద్దు తల్లీ..:) కావాలంటే నువ్వు గోదావరి జిల్లాలో రైస్ ఫీల్డ్స్ కొనిచ్చి ఫీల్డ్స్ అమ్మాయి అని పిలిపించుకో..:))) ధన్యవాదాలు నీ విషెస్ కి:)


గిరీష్ గారు,
ధన్యవాదాలు:)


సౌమ్య గారు,
అయితే మీరు కూడా ఆటో వాళ్లకి బలి అయ్యారన్నమాట;) ధన్యవాదాలు మీ విషెస్ కి :)

మనసు పలికే said...

శిశిర,
ధన్యవాదాలు మీ విషెస్ కి :)


నాగ గారు,
హహ్హహ్హ.. బాగుంది మీ వ్యాఖ్య :)) ఆరు రోజుల అగచాట్ల తరువాత నాకు ఆదివారం అగచాట్లు. ఏం చేసేది;)


రాజు గారు,
ధన్యవాదాలు :)

మనసు పలికే said...

జయ గారు,
శివ రంజని మనకి గొదావరి జిల్లాలో రైస్ ఫీల్డ్స్ కొనిస్తా అని మాటిచ్చిందండీ;);) మీరే తేల్చుకోండి ప్లాట్ల అపర్ణ కావాలో, ఫీల్డ్స్ రంజని కావలో;)


శశిధర్,
హ్మ్మ్.. 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు :(((( రెండు నెలలకోసారి పరీక్షలు.. వా వా :'( ఏం దుమ్ము దులపడమో ఏంటో, కోర్స్ పూర్తయ్యే సరికి నేనెలా ఉంటానో అని భయమేస్తుంది;)

ప్రేమ సామ్రాజ్ఞి said...

Nenu anni postluu chadivesaaanu.. chaaala chaaalaa Baavunnayi. Chadivinanduku emee levaaa :P.. ante giftluu lantivannamaaata :P

Anonymous said...

apu em kangaru padaku, our friendship will stay this way forever.
em rasaave.. its too gud.

--ఫిమేల్ ఆర్య..

మనసు పలికే said...

ప్రేమ సామ్రాఙ్ఞి గారు, ధన్యవాదాలండీ మీకు నా టపాలు నచ్చినందుకు. గిఫ్టులు కావాలా.. అలాగే, తప్పకుండా ఇస్తా. ఎక్కడ ఎప్పుడు ఎలా అన్నది మీరు డిసైడ్ చేసెయ్యండి:)

హహ్హహ్హ ప్రవీణ:) అలాగే.. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది:) ధన్యవాదాలు నీకు నచ్చినందుకు..

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుంది ! బాగా రాసారు !
మీకంటే నేను నయం ఆది వారం పది గంటలకే లేస్తాను !
పెన్నమ్మాయి కధ బావుంది ! ఎటొచ్చీ నేను కూడా ఎగ్జాం ఫీసు డీడీ ప్రతి సెమిస్టరు మా ఫ్రెండ్ చేత తీయించే వాడిని నాకదొక సెంటిమెంట్ !
కాలేజీ నిద్ర ల కధ బావుంటుంది ..కూర్చునే బెంచి ప్రకారం , తీసుకునే క్లాసు ప్రకారం ఈ నిద్ర లని విభజించవచ్చు ...
>> ఆదివారం పొద్దున్నే ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉన్న సమయాల్లో మనం క్లాసుకి తయారవుతూ, రోడ్లన్నీ ఖాళీగా స్తబ్దుగా ఉన్నప్పుడు మనం కాలేజీకి పరిగెడుతూ, ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో ముసుగేసి పడుకోకుండా అటెండెన్స్ కోసమని కష్టపడుతూ ఉంటే ఏడుపొస్తూనే ఉంటుంది.
:-( ఐ అగ్రీ !

Srivatsa YRK said...

బహు బాగా రాసారు. ఇంతకీ ఆదివారం పొద్దునే లేచి మరి బయటకు ఎందుకు వెళ్లినట్టు?