Tuesday, October 4, 2011

బ్లాగ్లోకంలో మీతో నేను - 2

ఇప్పుడు మీకొక నోరూరించే బ్లాగు గురించి చెబుతాను:) ఆ పేరు వింటే చాలు, లాలాజలం వరద గోదారిలా పొంగుతుంది. పరిచయం చేసిన సౌమ్య గారికి, బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలపడం అన్నది చాలా తక్కువ అవుతుంది, కానీ అంతకు మించి ఏమీ చెయ్యలేను. అంత మంచి బ్లాగు ఎవరిదో ఈసరికే మీకర్థమయ్యి ఉంటుందనుకుంటున్నాను. అవును, మన కొత్తావకాయ గారిదే :) అడగడం ఆలస్యం ఆవకాయ గురించి "ఉప్పెంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత,అవన్నీ ఎంతో నూనె అంత. ఆవకాయంటే ఇంతే.." అంటూ చెప్పుకు పోతారు. తిండి తినడం ఇష్టం లేని నా లాంటి వారి చేత కూడా ఔరా, తిండి ఇంత బాగుంటుందా అనిపించేలా రాసిన "ప్రేమలో ఆరుసార్లు" టపా చదివితీరాల్సిందే. పూబాలల గురించి.. అబ్బో చెప్పనలవి కాదు. టపా చదివిన రాత్రి, చెంగల్వలు కల్లోకొచ్చి పలకరించాయంటే అర్థం చేసుకోవాల్సిందే ఆ అద్భుతాన్ని. అంతేనా, ఎన్నో పిట్ట కథలు, చిట్టి కథలు. మొత్తంగా ఆ బ్లాగు స్వర్గంలో దేవకన్యలు తిరిగుతూ ఉండే  నందనవనం :))

తెలంగాణ యాస మరింత నచ్చేట్టుగా చేసిన బ్లాగరు గురించి ఏమని చెప్పుకోగలం? ఆ రామయ్యపై తనకున్న స్నేహానికి, భక్తికి అద్భుతపు తొడుగు తొడిగి అందంగా మలచిన "ఎన్నెల రామాయణం" చదవకపోతే, నేను చెప్పను. మీరు చదవాలి అంతే:)చల్లని వెన్నెల, నవ్వుల  పువ్వులు, ప్రేమ గుర్తులు అన్నీ కనిపించే బ్లాగు. అంతేనా.. బెట్టీ కబుర్లు విన్నారంటే దయ్యం ధైర్యంగా వచ్చి చక్కిగింతలు పెట్టడం చూస్తారు . అసలివన్నీ కాదండీ, ఆ పేరుతోనే కట్టి పడేస్తారు అందర్నీ.. నాకు చాలా నచ్చిన బ్లాగర్లలో ఒకరు, మన ఎన్నెల గారు:) ఇక "పరకాయ ప్రవేశం" చదివారంటే, ఎన్నెల గారి లోకి పరకాయ ప్రవేశం చేసి ఆవిడ అంత బాగా ఎలా రాయగలరో, అన్ని అయిడియాలు ఎలా వస్తాయో తెలుసుకోవాలనిపించక మానదు :)


అలా అలా మాలికలో తిరుగుతూ జెక్కంశెట్టి సూర్రావు-ఎకరం పొలం టైటిల్ చూసి, ఇదేదో మన వంశీ కథ టైటిల్ లాగా ఉందే అనిపించి అలా దూకాను, పడమటి గోదావరిలోకి. మీకు అనుమానంగా ఉంటే ఒకసారి ఈ కథ చదవండి, వంశి కథని కాపీ చేసి తన బ్లాగులో పెట్టేసుకున్నట్లు లేకపోతే నన్నడగండి.బ్లాగరు పేరు శ్రీనివాసరాజు ఇందుకూరి. పశ్చిమ గోదావరి పసిరికలు, కొబ్బరి చెట్లు, ముగ్గుల కళ్లాపి వాకిళ్లు ఇంకా చాలా వాటిని మనకు పంచే ఒక మంచి బ్లాగరు:) శ్రీనివాసరాజు గారింట్లో నేల మాళిగల దర్శనం, లక్ష్మిదేవి  కటాక్షం చూసారంటే మళ్లీ వెనక్కి రారు, ఆ బ్లాగు ఫాలో అవ్వకుండా.ఇక కష్టాలున్న ఏ డెవలపర్ "ప్రతి డెవలపర్ కి ఒక రోజు" చదివినా, అటువంటి ఒకరోజుని తమకి కూడా ఆ దేవుడు ప్రసాదించేలా కోరుకోకుండా ఉండరు:)

శైలబాల.. ఈ పేరుతో కన్నా, "వెన్నెల్లో గోదావరి" పేరుతోనే బ్లాగ్లోకంలో సుప్రసిద్ధురాలు అనుకుంటున్నా :). జీవితం గోదావరి అయితే ప్రేమ వెన్నెల అంటూ.. ప్రేమతో నిండిన జీవితం వెన్నెల్లో గోదావరి అంత అందంగా ఉంటుందని తన నవల ద్వారా రుచి చూపించిన బ్లాగరు మన శైలు. శైలు అంటే వెన్నెల్లో గోదావరి గుర్తు రావడం మామూలు విషయం. వెన్నెల్లో గోదావరి అంటే శైలు గుర్తు రావడం బాగుంటుంది కదా చాలా. అదే జరుగుతూ ఉంటుంది నా వరకు. మంచి రచయితే కాదు, ఇంకా మంచి స్నేహితురాలు కూడా.ఇద్దరు మనుషుల మధ్య ఎటువంటి బంధమైనా, అందులో కాస్త ప్రేమని కలిపితే జీవితం ఎంత అందంగా ఉంటుందో చాలా బాగా చెప్పగలిగింది శైలు. బాధగా అనిపించిన విషయమేమిటంటే.. "వెన్నెల్లో గోదావరి" నవలకి సంబంధించి ఇక భాగాలు లేవు, ముగింపుని కలిశాయి. కానీ, తన నవల ద్వారా శైలు అందించిన ప్రేమ పూల పరిమళాలు చదివిన అందరి మనసుల్లోనూ ఉంటాయి ఎప్పటికీ.. మరి వెన్నెల్లో గోదావరి అంతా చదివేసి వెన్నెల్లో గోదావరి ఎలా పుట్టిందో చూడకుండా వెళ్లిపోతారా???

ఇప్పుడేమో మరొక అద్భుతమైన బ్లాగరు గురించి చెబుతానంటా.. మరేమో ఆవిడెవరంటే.. రోజువారీ విషయాల్లోనే కాసింత హాస్యాన్ని మేళవించి, మనకి చక్కిలిగింతలు పెడతారు కదా.. అర్థమయిపోయిందని నాకు తెలుసోచ్.. మన కృష్ణప్రియ గారు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. ఎందుకో తెలీదు కానీ, కృష్ణప్రియ గారి డైరీ నేను కాస్త ఆలస్యంగా చూశాను :( అందుకు చింతిస్తూ ఉంటాను కూడా.. అనుకోకుండా ఆ రోజు అతిథిదేవో భవ చూశా.. పాపం, మర్యాదలకు అర్హత లేని అతిథితో కృష్ణప్రియ గారు పడిన కష్టాలు చూసి అయ్యయ్యో అనుకున్నా. ఏమాటకామాటే చెప్పుకోవాలి, నాకు కృష్ణప్రియ గారి బ్లాగులో చాలా చాలా నచ్చేవి ఆవిడ వాడే క్లిప్ ఆర్టులు. భలే పెడతారు, సందర్భానికి అనుగుణంగా. ఆతరువాత అన్ని టపాలూ చదివాను :). ముఖ్యంగా నిర్వోష్ఠ్య బ్లాగాయణం చదివి ఎం చెప్పాలో కూడా తెలీలేదు. ఇదీ అదీ అని చెప్పలేను కానీ, అన్ని టపాలు నచ్చుతాయి నాకు. కొత్తగా రాసిన "నిజమైన కల" చదివి మామూలుగా నవ్వుకోలేదు ;)పదాలను సున్నితంగా అందంగా అల్లగల మరొక మంచి బ్లాగరు స్నేహ గారు. నిజంగా నేనేనా అంటూ మనతో ముచ్చట్లాడతారు. నేను మొదటగా చూసిన స్నేహ గారి రచన "పెళ్లి చూపులు" కథ. నాకు చాలా బాగా నచ్చిన కథ. అంతకు మించి బాగున్న కథ "రెండవ కథ". ముఖ్యంగా తన గురించి చెప్పుకోవలసినది, ఒక పాత్ర అంతర్గతంగా పడే సంఘర్షణని చాలా బాగా ఆవిష్కరిస్తారు.  బాల్యమా ఇక రావా అంటూ బాధ పడే కవిత చూస్తే మనల్ని మనం అందులో చూసుకుంటాం.చిన్న నాటి ఙ్ఞాపకాలు వెన్నంటి తీసుకెళ్తాయి ఆ రోజులకి. మొత్తంగా నాకు నచ్చిన మరొక మంచి బ్లాగరు స్నేహ గారు :)) 

కార్తీక్. సాధారణంగా కార్తీక్ పేరు వినగానే, చిత్రమాలిక కోసం అందర్నీ వ్యాసాలు అడుగుతాడని చాలా మందికి చిత్రమాలిక గుర్తొస్తూ ఉంటుంది(ట). కానీ నాకు మాత్రం నేను చదివిన మొదటి టపా గుర్తొస్తూ ఉంటుంది. బ్లాగ్వనభోజనాల్లో "టమోటా పులుసు" చేయు విధానం వర్ణించిన టపా. ఆరోజు ఎంతగా నవ్వానంటే.. నాకింకా గుర్తుంది వంటల పుస్తకంలో "టమాటాలని ఒకమాదిరి ముక్కలు కోసుకోవాలి" అని ఉండడంతో, ఏ మాదిరి ముక్కలు కొయ్యాలో తెలీక సైజుకి ఒక ముక్క కోసి వండిన తీరు. అబ్బ కడుపు చెక్కలయ్యేలా నవ్వాను. ఆ తరువాతే చిత్రమాలిక, అందులో తను పోస్ట్ చేసే ఆర్టికల్సూనూ ;)

"నా స్పందన" ఈ పేరు వినగానే మీ ముఖంపై చిరునవుల పువ్వులు పుయ్యడం సర్వ సాధారణం కదూ. నాకైతే అంతే. చాలా సున్నితమైన హాస్యంతో గిలిగింతలు పెట్టి నవ్వించేవాళ్లలో లలిత గారు ఒకరు. నాకు బ్లాగులు తెలిసిన కొత్తల్లో లలిత గారు బ్రేకులో ఉన్నారు. బ్రేకు నుండి తిరిగి వచ్చిన రోజు టపా చూశాను, మొదటిది. "బ్రేక్ కే బాద్, బ్రేకు లేకుండా బాదు" ఏదో డిప్రెషన్ లో ఉన్నట్లు రాశారు. కానీ బాధని కూడా సంతోషంగా, నవిస్తూ చెప్పగలగడం ఒక కళ. ఆరోజు టపా చదువుతూ అనుకున్న మాట ఇది, అంత బగా రాశారు. ఇక ఆ తరువాత నో బ్రేక్, ఆవిడ పంచే నవ్వులకి :) ఓదార్పు కావాలని, పద్మనాభుడికి వెంకటేశుడికి మీటింగు పెట్టి ఇంకా చాలా రకాలుగా నవ్వించేశారు. స్వీట్లు పంచి సంతోషాన్నీ పంచుకున్నారు..


ఆ మాటల్లో ఏం మంత్రం ఉందో, అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. తన ఊహలకి అలవోకగా అందమైన రూపాన్నిస్తూ ఒదిగిపోతాయి అక్షరాలు. తన రచనలు చదవడం మొదలు పెట్టేంత వరకే మనకు తెలుస్తుంది. ఎలా అక్షరాల వెంట పరిగెడతామో, ఎక్కడెక్కడ ఆగిపోయి అనుభవిస్తూ ఉంటామో తెలియను గాక తెలియదు. నాకు చాలా చాలా నచ్చిన బ్లాగుల్లో ఒకటైన మధు మానసం గురించి ఇంత కన్నా మంచి పరిచయం ఇవ్వాలని ఉంది, కానీ అక్షరాలు నా వెంట రావడం లేదు కదా.. ఏదైనా అనుభూతికో ఊహకో అనుభవానికో తనిచ్చే అక్షర రూపం చూస్తుంటే అసూయగా ఉంటుంది అన్నది అక్షర సత్యం:)నమ్మశక్యంగా లేకపోతే తను రాసిన "ఎవరు చెప్తారు నీకు" చదవండి.
అనుభవాలకి ఎర్ర రంగు అక్షరాల అందమైన మాల కట్టిన "గోరింటాకు గురుతులు" చూస్తే మీరంతా కూడా మీ చిన్నతనానికి వెళ్లిపోతారు. యాత్రా విశేషాలంటూ తను రాసిన అహోబిళం ముచ్చట్లు చదివితే తన రాతల్లోనే చూసేస్తారు అహోబిళం.

శిశిర, ఆ పేరులోనే ఒక పరిపక్వత కనిపిస్తూ ఉంటుంది నాకు. ముందుగా ఎదసడి బ్లాగులోకి వెళ్లాలంటే, శిశిర గురించి తనే రాసుకున్న నాలుగు మాటలు చదివి తీరాల్సిందే. చదువుతూ చదువుతూనే మరో లోకంలోకి వెళ్లిపోకపోతే.. అహ, అసలు అలా జరగదు, ఖచ్చితంగా వెళ్లిపోతాం. తన మాటల్లోని మాయ అలాంటిది. "గమ్యం కంటే ఆ గమ్యంకోసం చేసే ప్రయాణమే నాకిష్టం. ఎందుకంటే అందులోనే బ్రతుకుంది, అందులోనే అర్థముంది" అని చెప్పే శిశిర ఎంత పరిపక్వతతో ఆలోచిస్తుందో, మరెంతగా జీవితాన్ని అర్థం చేసుకుందో తెలుసుకోవాలనుకుంటే తన బ్లాగు చూడాల్సిందే. చాలా విషయాలు చెబుతున్నప్పుడు, తనొక సైకాలజిస్టొ, ఫిలాసఫిస్టో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. కానీ వృత్తి పరంగా ఉపాధ్యాయురాలు అని తెలిసి మరింత సంతోషించా (నాకు ఆ వృత్తంటే చచ్చేంత ఇష్టం మరి). రోజూ మనకు కనిపించే విషయాల్లోనే ఎన్నో కొత్త కోణాలు చెప్పీ చెప్పకుండా "మరో ప్రయాణంలో" చూపించింది శిశిర. శిశిర అంటే సీరియస్ టపాలు అని తనే ఇచ్చేసుకున్న పేరు నుండి కాస్త పక్కకి జరిగి రాసిన టపా "ఒక సాయంత్రం" తప్పక చదివి తీరాలి:)))

జీవితాన్ని ప్రతి క్షణం జీవించాలన్న ఆశతో ముందుకు సాగే తృష్ణ గారి బ్లాగు గురించి అందరికీ తెలిసిందే. వంటల తయారీ మొదలుకొని, సినిమా రివ్యూలు, పుస్తక సమీక్షలు, పాటల పరిచయాలు దేన్నైనా అలవోకగా రాసెయ్యగల బ్లాగరు తృష్ణ గారు. పెరట్లో మొక్కల ఫోటోలు నాకు భలే నచ్చుతాయి. తృష్ణ గారి టపాలన్నీ మంచి ఇంఫర్మేటివ్ గా ఉంటాయి అనిపిస్తుంటుంది నాకైతే. తన బ్లాగులో టపాలు చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. చాలా ఫ్రీక్వెంట్ గా రాసే తృష్ణ గారు ఈ మధ్యనే బ్రేక్ ఇవ్వడం మనసుకి రుచించలేదు. త్వరలో మళ్లీ తృష్ణ గారు బ్లాగ్లోకానికి రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

మరొక్కసారి నేను ముందు టపాచివర్లో చెప్పిన నాలుగు ముక్కల్ని గుర్తు తెచ్చుకోండీ :):) (ఈ టపాలో నేను పలకరించని వాళ్లెవరూ కూడా తొందరపడి బాధపడి, నా మీద అలిగేసి, ధర్నాలు గట్రా చెయ్యొద్దని మనవి :) :) మీ అందరినీ కలుసుకోడానికి మరొక టపాతో మీ ముందుకు వస్తాను. అంతవరకూ...)
సశేషం..

20 comments:

ఏకాకి, కేర్ ఆఫ్ ఎడారి said...

తెలుగు బ్లాగు పుస్తకానికి ఇండెక్సు పేజిలా బావుంది.

Lakshmi Raghava said...

బాగానిపించింది...నేను బ్లాగర్ అయినా బామ్మగా స్లో కాబట్టి నాకు ఇలా చోటు వుండదు కాని మంచి బ్లాగ్ లను ఇలా చేస్తే బాగుంటుందన్న మీ ఆలోచనకు జోహార్లు !!సదా ఆశీర్వాదాలు

ఆ.సౌమ్య said...

nice nice!

రాజ్ కుమార్ said...

మంచి మంచి బ్లాగ్స్ గురించి పరిచయం చేశారు. ఇచ్చిన ప్రతీ లింకూ ఓపెన్ చేసి చదివెయ్యాలనేట్టు గా ఉందీ మీరు వివరించిన విధానం.

కొన్నాళ్ళు అగ్రిగేటర్ కాకుండా మీ బ్లాగు కే వస్తానన్నమాట ;)

మధురవాణి said...

Super Appu! :)

హర్షవర్ధనం [HarshaVardhanaM] said...

మనసు పలికే గారు...!!
చాలా బాగుంది,
ఈ మధ్యనే బ్లాగ్ కి పరిచయం ఐన నాకు, మిస్ ఐన మంచి మంచి పోస్ట్స్ ని పరిచయం చేసారు... ధన్యవాదములు..
--
హర్షం

kallurisailabala said...

అప్పు థాంక్స్ రా
బ్లాగ్ లోకంలోకి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయిన ఇంకో మంచి నేస్తానివి నువ్వు.
నీ పుట్టిన రోజును నువ్వు సెలెబ్రేట్ చేసుకున్న విధానంతో నాకు ఇంకా దగ్గరయ్యావు.మేము కూడా రాసాము కాని ఈ పోస్ట్ల కి సంబంధించి ఇది బెస్ట్.
ముఖ్యంగా లింక్ ఇవ్వడం చాలా బావుంది.

జ్యోతిర్మయి said...

మంచి బ్లాగులు పరిచయం చేశారు..మీరు పరిచయం చేసిన విధానం బావుంది.

Ennela said...

ఇలా క్లిక్కులు పెట్టి మంచి టపాల్లోకి తీసుకెళ్ళావ్. ఒక్క దెబ్బకి ఎన్ని పువ్వులో!!!(టపాలు)

అపూ ,నీకు ఎంత ఓపికో!!!!హ్యాట్స్ ఆఫ్ నీకు...టయిము లేదు అంటూనే ఇన్ని ఎలా గుర్తు పెట్టుకున్నావ్!! ఉండు యీ సందర్భం లో నాకొక పాట పాడాలనిపిస్తోంది....

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ...ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో...(ఇంకా పాడాలని ఉంది కానీ ఇక్కడ రికార్డ్ అరిగిపోయింది..సారీ)
అప్పుడెప్పుడొ కొత్త సంవత్సరారంభంలో తృష్ణ గారి బ్లాగులో నా పేరు చూసుకుని నాలుగు రోజులు నిద్దరోలేదు..(ఆనందంతో రాలిన కన్నీరు ఇక్కడ మంచు కుప్పలై గడ్డ కట్టేసింది కూడా)..అది కొంచెం ఎండాకాలంలో కరిగిపోతోందని బాధ పడేలోపు ఇదిగో ఇలా మళ్ళీ మీ బ్లాగులో నా పేరు...ఇంక మాట రావట్లేదు...కన్నులు వర్షిస్తున్నాయి..బయట వాతవరణం మంచు చెయ్యడానికి తయారవుతోంది...
అపర్ణా థ్యాంక్యూ సో మచ్

కొత్తావకాయ said...

" థాంక్స్" చాలా చిన్న పదమని మొదటి సారి అనిపిస్తోంది. బ్లాగ్ మిత్రుల టపాల లంకెలు బాగున్నాయ్. మిస్ అయినవి చదువుకుంటున్నాను. థాంక్ యూ, అపర్ణ గారు!

మనసు పలికే said...

ఏకాకి గారూ, మీ పేరు భలేగా ఉంది ;) వ్యాఖ్య కి బోలెడు ధన్యవదాలు, ముఖ్యంగా తెలుగు బ్లాగులకి ఇండెక్సుతో పోల్చినందుకు చాలా సంతోషంగా ఉంది :):)

లక్ష్మి రాఘవ గారు.. క్షమించాలి, పని వత్తిడి ఎక్కువవడం వలన కొత్త బ్లాగులు (అంటే నాకు కొత్త) చూసే అవకాశం లేకపోతోంది, అందుకే నేను మీ బ్లాగు తలుపు ఇంతవరకూ తట్టలేదు. బామ్మ మాట బంగారు మాట అంటారు కదా, కాబట్టి ఖచ్చితంగా మీకు ముందు స్థానమే ఉండాలి. సమయం చూసుకుని మీ టపాలు చదువుతాను:):) మీ వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలు. ఆశీర్వాదాలకి నమస్సులు..

సౌమ్య గారూ ధన్యోస్మి:):)

మనసు పలికే said...

రాజ్.. కెవ్వ్..;) అగ్రిగేటర్లు కాకుండా నాబ్లాగుకి వస్తా అన్న నీ వ్యాఖ్య నాకు బోలెడు సంతోషాన్నిచ్చింది. ఇంకా చాలా బ్లాగుల గురించి రాయాలి. నీ వ్యాఖ్య నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. ధన్యవాదాలు:)

మధుర, ధన్యవాదాలు:)

హర్షవర్ధనం గారూ, ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి. అయితే మీరు కొత్తగా వచ్చారా, ఇంకా బోలెడు మంచి మంచి బ్లాగులు ఉన్నాయండీ. నాకు తెలిసినంతలో, తెలియనివి తెలుసుకుని మరీ పరిచయం చెయ్యాలనుంది. తప్పక ప్రయత్నిస్తాను.

మనసు పలికే said...

శైలు, చాలా చాలా థ్యాంక్స్ :) నా గురించి అంత మంది అంత మంచిగా చెప్పారు, మరి నేనేం చెయ్యగలనా అని ఆలోచిస్తే ఈ ఆలోచన తట్టింది అనమాట. ఎలా రెసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను కానీ, మీరంతా ఇచ్చే వ్యాఖ్యలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ధన్యవాదాలు శైలు.. నీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ :)

జ్యోత్రిమయి గారూ, నా పరిచయ విధానం నచ్చినందుకు ధన్యవాదాలు:)

ఎన్నెల గారూఊఊఊఊ.. మీ వ్యాఖ్య నా రోజుని చేసింది ;)(You made my day kikkikki)
మీ కన్నీటి మంచు గడ్డ ఏ ఎండకీ కరగొద్దని నేనే ఇలా చేశా అనమాట ;) రికార్డ్ అరిగిపోయినా, మీ పాట నాకు సంతోషాన్నిచ్చింది;) అసలు మీ వ్యాఖ్యతో నేను ఫుల్లు హ్యాపీ... మరి పువ్వులన్నిటినీ (టపాలు) తడిమేశారా???

మనసు పలికే said...

కొత్తావకాయ గారూ, బోలెడు బోలెడు ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి :) మీ ప్రొఫైల్ పిక్ లో ఆవకాయ బొమ్మ నోరూరించేస్తుంది.. చూసిన ప్రతి సారీ...

కృష్ణప్రియ said...

Thanks Aparna! ఈ టపాల సిరీస్ ఇప్పుడే చూస్తున్నా. నా బ్లాగు గురించి మంచి ముక్కలు చెప్పారు! ధన్యవాదాలు.

shanti said...

few blogs are just awesome..thanx for so much good information..

Anonymous said...

బాగుందండీ మీ బ్లాగుల పరిచయం. నేను ఇప్పటిదాకా చూడని బ్లాగులు రెండు మూడు ఉన్నాయి. చదవాలి. రాజ్ కుమార్ గారన్నట్టు మీరు పరిచయం చేసిన బ్లాగులన్నీ నోట్ చేసుకున్నాను. ధన్యవాదాలు.

Anonymous said...

తెలుగుపలికితే తీయదనం
చెలియపలికితే చిలిపిదనం
పోతనపలికితే భాగవతం
అమ్మపలికితే కమ్మదనం
మనసుపలికితే ఆలోకనం

Anonymous said...

కేకో కేక

http://1.bp.blogspot.com/-jEpAQ83JnhA/Tp6W8YE5OEI/AAAAAAAAAeg/etkhkiDeWZs/s1600/nene+mee+alludu.JPG

మనసు పలికే said...

ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మిత్రులందరికీ క్షమార్పణలతో...


మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు కృష్ణప్రియ గారు. మీ గురించి నాలుగు మంచి ముక్కలా, సమయము స్థలమూ ఎక్కువగా లేకపోబట్టి సరిపోయింది కానీ, ఎంతంటే అంత రాయొచ్చు మీ బ్లాగు గురించి. నాకు అంత ఇష్టం:)

మొదటి అనానిమస్ గారు, ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:). మరి చదివి వ్యాఖ్య పెడుతున్నారా ఆయా బ్లాగుల్లో:):)

రెండవ అనానిమస్ గారు, చాలా సంతోషం వేసింది మీ వ్యాఖ్యకి.. ధన్యోస్మి. మీ పేరు రాశారు కాదు..

మూడవ అనానిమస్ గారు, ధన్యవాదాలు:)