Thursday, November 3, 2011

గురువు పుట్టిన వేళ

చీకట్లో రోడ్డు మీద బస్సు రామబాణంలా దూసుకుపోతుంది.. స్ట్రీట్ లైట్లు వెనక్కి వెళ్లిపోయి చాలా సేపయ్యి చెట్లు పుట్టలు కూడా వచ్చేశాయి. చల్లగాలి రివ్వున మొహానికి తాకుతూ చలిని పెంచుతుంది..ఇంటికెళుతున్నానన్న ఆనందం ఇవేమీ లెక్కచెయ్యకుండా బస్సుకన్నా వేగంగా ముందుకి పరిగెడుతుంది.. అలోచనలు ఇంటి చుట్టూ చేరి చాలాసేపయింది. తమ్ముళ్లతో ఆడుతూ, అమ్మ చేతి వంట తింటూ నాన్నతో కబుర్లాడుతూ ఊహలు అలా అలా సాగిపోతుండగా.....

ఉన్నట్టుండి మధ్యలో ఘృతాచి వచ్చింది. ఇలియానా డ్యాన్సు చేస్తూ కనిపించింది. ఇక నిత్య.. కళ్లతోనే ఏదేదో చెబుతుంది.. ఎందుకిలా జరుగుతుంది చెప్మా అని విస్తుపోయిన నా మొహం మీద, శూతమహాముని తన కమండలంలోని నీళ్లు చల్లి.. "ఓసీ దుష్ట శిష్యురాలా.. నీ గురువు జన్మదినమునే మరచితివా??????" అని అన్ని కోణాల్లోంచి ఇకోలతో చెప్పారు.. అప్పడియా, అలాగా, ఈజ్ ఇట్, అటులనా, ఐసె క్యా?? అని తెలిసి తెలియని చాలా భాషల్లో ప్రశ్నించేసరికి, పాపం పారిపోయారు:(

అమ్మో ఇంకాసేపు అలాగే ఇంటిధ్యాసలో పడిపోతే ఎంత ధారుణం జరిగిపోయేది అని బహు చింతించి చింతించీ.. అయినా, జీవితమంటేనే ప్రయాణం కదా, ఇంక ప్రయాణంలో చెప్పే శుభాకాంక్షలకి బోల్డంత వాల్యూ అనుకుని (మీరు కూడా అలాగే అనుకోవాలి మరి:)) ఇలా బస్సులోనే కుర్చుని మా గురూ గారికి బోలెడు విషెస్ అందిస్తున్నా అనమాట..

ప్రియాతి ప్రియమైన గురువు బులుసు సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పుట్టినరోజులు కనీసం(ఇంకా ఎక్కువే అని కోరుకుంటున్నాను) మరొక 33 అయినా చేసుకుని సెంచరీ కొట్టెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....

గురుగారి శుష్యురాలు :)

రండి అందరూ వచ్చి మీ శుభాకాంక్షలు కూడా అందించండి..
పన్లో పని నాకు హ్యాపీ జర్నీ కూడా చెప్పి మా ఊరొచ్చెయ్యండి ;)

P.S. అంటే 12 గంటలకి నెట్ ఉంటుందో డిస్కనెక్ట్ అవుతుందో అని ఇప్పుడే వేసేస్తున్నా అనమాట :) 

20 comments:

మధురవాణి said...

బులుసు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరిలాగే నవ్వుతూ నవ్విస్తూ బోల్డు పుట్టిన రోజులు జరుపుకోవాలని మా కోరిక. :)

అప్పూ.. ఎంచక్కా ఇంటికెళ్తున్నావా? మరి నేనో? :(
సరేలే.. నా బదులు కూడా నువ్వే బాగా ఎంజాయ్ చేసిరా.. నా అతరపున మన గోదావరికి ఒక హాయ్, రాముడికీ ఒక నమస్కారం చెప్పు. :)

హర్షవర్ధనం [HarshaVardhanaM] said...

గురువు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
--
HarshaM

..nagarjuna.. said...

అభిమాన గురువులు బులుసేంద్రులవారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.....గురూగారు మీరిలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలనీ సెంచరీలు బాదేయాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నా. :)

వేణూ శ్రీకాంత్ said...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు... Have a great day :-)

శేఖర్ (Sekhar) said...

బులుసు గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు.ఎల్లప్పుడూ ఇలానే నవ్వుతు ఉండండి సర్

Sravya Vattikuti said...

బులుసు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు !

శిశిర said...

బులుసు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

SHANKAR.S said...

బ్లాగోక ముళ్ళపూడి, శ్రీ శ్రీ శ్రీ సు.స.భా స్వామీజీ, ప్రభావతీ మనోనాథుడు, ఘృతాఛీలోల, అసమాన సుమనాభిమాని, గుర్గురువు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు.

నేస్తం said...

బులుసుగారికి జన్మదిన శుభాకాంక్షలు
:) ఊరెళుతున్నావా :) అసలు కనిపించడం లేదు ఎక్కడా :) హేపీ జర్ని..ఫుల్ ఎంజాయ్ చేయి

జయ said...

బులుసు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకేమో హ్యాపీ జర్నీ. మరి మా వైపు కూడా వస్తున్నారా.

బులుసు సుబ్రహ్మణ్యం said...

థాంక్యూ అపర్ణగారూ మనఃపూర్వక ధన్యవాదాలు.

ఈ బ్లాగు ప్రయాణం లో మీలాంటి శ్రేయోభిలాషులు, శిష్యులు దొరకడం నా అదృష్టం.

శుభాకాంక్షలు అందచేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

Anonymous said...

Happy Birthday Bulusu gaaru.

Ennela said...

many many happy returns of the day andee bulusu gaaruu.mee puttina rojani telisi ekkada wraasarabbaa ani anni blogluu vetukutuu pothunte..ikkada dorikindi info..asalu naake mind panicheyyatledu enduko..modata aparna blog kadaa vetakaali...ento!!!
aparnaa...intikelli manollandarikee naa taraphuna hello cheppu.

Zilebi said...

బ్రహ్మాండం , బ్రహ్మానందం , శ్రీ బులుసేటిక్ బులుసు గారి కి హార్దిక శుభాభినందనలు.

రాజ్ కుమార్ said...

గురువు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..

జై గురూజీ.. జై జై గురూజీ..

kiran said...

బులుసు గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు
అప్పు తల్లి..నువ్వు ఎక్ష్ప్రెస్స్ అమ్మాయ్....నాకు చెప్పిన అది నిమిషాలకి ఇంత మేటర్ రాసేసావ్..నువ్వు కెవ్వు :)

మాలా కుమార్ said...

బులుసు గారికి జన్మదిన శుభాకాంక్షలు .

ఇందు said...

Happy Birhtday Guruvugaru :)

మనసు పలికే said...

మన గురువు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని శుభాకాంక్షలందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. సమయాభావం వలన ఆలస్యంగా స్పందిస్తున్నాను. క్షమించగలరు:)

మధు, ఇంటికి వెళ్లొచ్చేశాను కదా.. గోదావరికి రాముడికి నీ తరపున హాయ్ చెప్పాలే. నువ్వు సుఖంగా ఉండేలా చూస్తా అన్నాడు రాముడు:)

నేస్తం అక్కయ్యా, ధన్యోస్మి:)

ఎన్నెల గారూ.. చెప్పేశానోచ్:) మీకు కూడా హెలో చెప్పమన్నారు మనోళ్లందరూ..

కిరణు, కిక్కిక్కి..;) మరి ఏం చేసేదీ.. బస్సులో కుర్చుని రాశాను కదా.. అందులోనూ మన ఎ.పి.యస్.ఆర్.టి.సి. బస్సు. నన్ను అందరూ వింతగా చూస్తుంటే, త్వరత్వరగా పూర్తి చేసేసి ఇలా వేసెయ్యాల్సొచ్చింది:)

kallurisailabala said...

బులుసు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
late ga choosanu
ayina malli birthday vachhevaraku cheppachhu kada