Tuesday, July 6, 2010

నన్ను కోల్పోయాను

మనసు ఏం పలుకుతుందా అని చూస్తున్నారా..? నా మనసు ఎన్నెన్నో చెబుతుందండీ. అవన్నీ ఎవరితో చెప్పాలా అని చూస్తుంటే ఇదిగో ఇలా బ్లాగ్లోకం, బ్లాగాడు వారు కనిపించారు. మన మనసుల్లో ఎలాంటి తింగరి ఆలోచనలు వచ్చినా అవి చదవాల్సిన "బాధ్యత" (ఖర్మ అనుకోండి) మన బ్లాగ్మిత్రులకు ఎల్లప్పుడూ ఉంటుంది..ఉండాలి. ఏమంటారు..? ఇంతకీ చెప్పాలనుకున్నది చెప్పకుండా ఊరికే ఈ ఉపోద్ఘాతం ఎంటా అని చూస్తున్నారా? వస్తున్నా వస్తున్నా.. అక్కడికే వస్తున్నా. ఎప్పుడూ ఖాళీ గా ఉండని మన చిన్న మెదడు కి అప్పుడప్పుడూ సుతి మెత్తని ఆలోచనల చిరుగాలి తాకిడి, విరజాజుల సువాసనల్ని అందించి భావుకత్వాన్ని నిద్ర లేపుతుంది. మరి అలాంటప్పుడు మన మనసుల్లో నుండి బైటికి వచ్చే చిలిపి ఆలోచనలకి అక్షర రూపం కల్పించి, భద్రపరిచి, మిగిలిన వారి మెదడుల్ని కూడా భుజించెయ్యాలని ఎవరికి ఉండదండీ..? అదే కోవలో నేనూనూ..!!
రెండు మూడేళ్ల క్రితం ఇలాంటి ఆలోచనలు చాలానే వచ్చేవండీ.. మరి ఐటి ఉద్యోగమంటే మాటలా..? మన ఆలోచనల్ని అలవాట్లని ఇట్టే మర్చెయ్యదూ..!! అలా మారిన బాధనంతా మూట గట్టుకుని దానికి ఇలా ఒక రూపాన్ని ఇచ్చానండీ..

నన్ను నేను ఎక్కడో పోగొట్టుకున్నాను..
నాకు తెలిసిన "నేను" కాదు; ఇప్పుడున్న నేను..
ఏమయ్యాను..?
ఇష్టం లేని మార్గం లో.. ఎక్కడో..ఎక్కడో.. ఆగిపోయాను.

"నన్ను" కోల్పోయి నెను పరిగెడుతూనే ఉన్నాను; ఆగకుండా...!
ఎన్నిటినో తడుముతున్నాను; యాంత్రికంగా..!
ఎక్కడ పోగొట్టుకున్నానో తిరిగి చూసే సమయం లేదు,
వెనుక వాడు ముందుకెళ్లిపోయే (పె..ద్ద) ప్రమాదం ఉంది...(!?)
నిలబడి నీళ్లు తాగలేకపోతున్నాను..
అందుకే,
పాలే తాగడం నేర్చుకున్నాను... పరిగెడుతూ.
"అదేంటి అలా పరిగెడుతున్నావు? నాతో పాటే నువ్వు"
అని "నేను" ఎంత చెబుతున్నా వినట్లేదు నేను;
అంత తీరిక లేదు మరి.
ఎక్కడో ఆవేశపు తొందరలో.. అనాలోచితపు దొంతర్లలో.. ఎక్కడో పోగొట్టుకున్నాను.
పరిగెడుతూ చాలానే పారేసుకున్నాను..
"నా" తో మొదలుకొని.. విలువల వస్త్రాల వరకూ..
అలా నగ్నంగా పరిగెడుతూనే ఉన్నాను;
కీర్తి ప్రతిష్ఠల కవచం ఉందన్న భ్రమలో.
మధ్యలో రుధిరపు తూరుపు పలకరిస్తున్నా పట్టించుకోలేదు.
సంగీతపు మధుఝరిలో ఓలలాడించాలని ప్రయత్నించిన శాకుంతలాలని ఛీ పొమ్మన్నాను.
అమాయకపు విరజాజి పై ఆకర్షితమవుతున్న మనసుని గొంతు నులిమి చంపేశాను.
గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న ముసలవ్వని, చూడనట్లే నటించాను.
ఎప్పుడూ నా ముందే పరిగెట్టే సెకన్ల ముల్లుని దాటడం కోసం,
ఎన్నో వదిలేశాను..ఎన్నో మర్చి పోయాను..
మరెన్నో పోగొట్టుకున్నాను.
తెలియడం లేదు..
స్పందించే హృదయాన్ని పోగొట్టుకున్నానో..
హృదయ స్పందననే పోగొట్టుకున్నానో..
మళ్లీ వెనక్కి వెళ్లాలనిపిస్తోంది.
"నా" తో పాటు సాగడానికి...

నా బాధ మీకు అర్ధం అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. కొత్తగా ఈ బ్లాగ్లోకం లోకి ప్రవేశించిన నాకు మీ విలువైన సలహాలని అందిస్తారని ఆశిస్తున్నాను.కోట్లాది ధన్యవాదాలతో..
అపర్ణ.

36 comments:

Viswa Ravi said...

toooooooooooo good for a starter in the blogging .. and

telugu chaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaala chakkagaa undi...

idi naku telisi neelaa naala IT lo unna prati "nenu leni nenu" ki vartistundi..

Keep writing.. and Smiling..

సవ్వడి said...

ఐటి లో ఉంటే తప్పదు. తెలుగు చాలా బాగుంది. . it is too good. keep writing...
remove word verification.

మనసు పలికే said...

@విశ్వ
ధన్యవాదాలు.. ఏ ఒక్కటీ వదలకుండా చదివి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సలహాలను అందించినందుకు. నేను రాసిన ప్రతీ వాక్యం యొక్క భావాన్ని అర్థం చేస్కుని నాకు సలహాలందించడం లో మీ పరిశీలనా శక్తి తెలుస్తుంది. నా సిరివెన్నెల బ్లాగు లో మీ కామెంట్ లను చదివాను. :) :) చాలా సంతోషంగా ఉంది..

@సవ్వడి
కృతఙ్ఞురాలిని.. Word Verification తీసేశాను. తప్పకుండా ఇంకా రాస్తాను, మీ లాంటి వారి ప్రోత్సాహం ఉంటే.. :)

అశోక్ పాపాయి said...

చాల వేదనతో పరిచయం అయ్యరు చాల బాగుంది మీ బాధ ఎంటో అందరికి తెలిసిపొతుంది...... keep writing nd i wish u well deserved success...

మనసు పలికే said...

@అశోక్: ఏం చేస్తాం చెప్పండి.. మనల్ని మనం పోగొట్టుకోవడం అంటే మాటలా.. :):)

మధురవాణి said...

అప్పూ..
ఓ.. కొత్తగా మొదలెట్టారా ఈ బ్లాగుని! మీ బ్లాగ్ప్రయాణం హాయి హాయిగా సాగిపోతూ, మీదైన లోకంలో విహరిస్తూ, కాలం వేసిన గాలానికి ఎక్కడో పోగొట్టుకున్న మీ మధురభావాలన్నీటినీ తిరిగి దోసిట్లో నింపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. Happy Blogging! :)

మనసు పలికే said...

ధన్యవాదాలు మధురవాణి గారూ.. ఇలా మీ లాంటి వారి ప్రోత్సాహం ఉంటే తప్పకుండా హాయి హాయిగా అని పాడుకుంటూ బ్లాగేస్తాను.. :):)

శిశిర said...

చాలా బాగా రాస్తున్నారు అపర్ణగారు. మీ ప్రతీపోస్టూ చదివాను. బాగున్నాయి.

మనసు పలికే said...

ధన్యవాదాలు శిశిర గారూ! ముఖ్యంగా చాలా ఓపికగా ప్రతి టపా చదివినందుకు చాలా చాలా ధన్యవాదాలు :)

Pranav Ainavolu said...

"ఎక్కడో ఆవేశపు తొందరలో.. అనాలోచితపు దొంతర్లలో.. ఎక్కడో పోగొట్టుకున్నాను.
పరిగెడుతూ చాలానే పారేసుకున్నాను..
"నా" తో మొదలుకొని.. విలువల వస్త్రాల వరకూ..
అలా నగ్నంగా పరిగెడుతూనే ఉన్నాను;
కీర్తి ప్రతిష్ఠల కవచం ఉందన్న భ్రమలో."
- చదవగానే గతం ఒడిలో నిద్రిస్తున్న జ్ఞాపకాలను నిద్రలేపాయి మీ(ఈ) అక్షరాలు.

ఎప్పుడో రాసుకున్న ఇది గుర్తుకొచ్చింది...

నేను నేనుగా లేనప్పుడు
ఇంకెవరిలనో బతుకుతున్నప్పుడు
నా గురుంచి చెప్పడానికి 'నేను' అన్న పదం వాడడానికి మనస్కరించట్లేదు.

ఏదో చేయాలనుకున్నాను
ఇంకేదో చేశాను (చేయల్సోచ్చింది)
ఇప్పుడు మారేదో చేస్తున్నాను
నా ప్రమేయం లేకుండా నాకు జరుగుతున్నవన్నీ గమనిస్తూ... కేవలం గమనిస్తూ..
నా జీవితంలో నేనే ప్రేక్షక పాత్ర వహించినట్టనిపిస్తుంది.
తలచుకున్నప్పుడల్లా ఓ నవ్వులాంటి ఏడుపొస్తుంది.

మనసు పలికే said...

ప్రణవ్ గారూ!! చాలా చాలా బాగుంది మీ కవిత. ముఖ్యంగా "నా గురుంచి చెప్పడానికి 'నేను' అన్న పదం వాడడానికి మనస్కరించట్లేదు." అన్న వాక్యం, అద్భుతంగా ఉంది. (భావం మాత్రం మనసు జీర్ణించుకోలేకపోతుంది :(. మనం ఈ విధంగా బ్రతుకుతున్నామా ,జీవించకుండా అని చాలా బాధగా ఉంది).
ధన్యవాదాలు ప్రణవ్ గారు, నాకు ఇంత ఆలోచింపజేసే వాక్యాలని పరిచయం చేసినందుకు.

హరే కృష్ణ said...

Welcome to blogging world

All the best!

మనసు పలికే said...

ధన్యవాదాలు కృష్ణ గారూ!!

madhu said...

Aparna Garu...meeru eppatikaina..mee 'mee' kosam struggle avutunnaru ... mee mee koraku tapana padutunnaru ...nakkaite...nannu nenu eppudo marchi poyanuu...nannu naku evariana parichayam chesina "nannu" gurthinchagalanaaa....anipistundi..bayamestundhi..ee strugle for existing(?) lo nannu nenu marichipoya poorthi gaa... nannu naaku evairana parichayam chesina gurthincha galana ani yedupostundhi...
Naakoo na nenu kavali...Naa naannu naku techichedevaru...?
Nannu nannu gurthinchadam yelaaa!!!
yedo magic jaragite tappa naaku nenu dorakanemooo....
Thanks for making me to realise that i lost myself!!!
I wish you every success in your each step...
Way to go...!!!

మనసు పలికే said...

మధు గారూ!! ధన్యవాదానండీ.. ముందుగా నా బ్లాగులోకి మీకు స్వాగతం.
మొత్తానికి , మీరు మిమ్మల్ని కోల్పోయారని నేను గుర్తు చేశానా..? హహ్హహ్హ బాగా చెప్పారు, నా సంగతే నాకు ఏమీ గుర్తుండటం లేదు..
మీ మ్యాజిక్ ఏదో త్వరగా జరిగి మీకు మీరు పూర్తిగా గుర్తు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. :)

కొత్త పాళీ said...

"సంగీతపు మధుఝరిలో ఓలలాడించాలని ప్రయత్నించిన శాకుంతలాలని ఛీ పొమ్మన్నాను"
ఇంత చక్కటి భావుకమైన వాక్యం రాసిన మీరు ఏం రాయాలో తెలియట్లేదు అంటే నమ్మడానికి మేం వెర్రికుట్టెలం కావాలి. :)

మనసు పలికే said...

ధన్యవాదాలు కొత్త పాళీ గారు, నాకు ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ వచ్చి ఉండదు.. చాలా సంతోషంగా ఉంది..:)) Thank you soooo much..

..nagarjuna.. said...

కొత్తపాళిగారికి నా తరఫునకూడా ధన్యవాదాలు...ఆయన వ్యాఖ్య పెట్టకపోతే నేనసలు ఇంతమంచి కవితను చదవకపోయేవాణ్ణి.....

and అపర్ణ ఏమో అనుకున్నానుగాని (ఏమిటొమరి దేవుడు వ్యక్తుల్ని గుర్తెరిగే టాలెంటు ఇవ్వలేదు :( ) your skill is awesome, ఇన్నిరోజులు ఎందుకు చదవలేదూ అని అనిపించింది .

ప్రత్యేకించి

>>
నన్ను నేను ఎక్కడో పోగొట్టుకున్నాను..
నాకు తెలిసిన "నేను" కాదు; ఇప్పుడున్న నేను..
ఏమయ్యాను..?
ఇష్టం లేని మార్గం లో.. ఎక్కడో..ఎక్కడో.. ఆగిపోయాను.

"నన్ను" కోల్పోయి నెను పరిగెడుతూనే ఉన్నాను; ఆగకుండా...!
ఎన్నిటినో తడుముతున్నాను; యాంత్రికంగా..!
<<
ఇక్కడకొచ్చిన కొత్తలో నా పరిస్థితి అదే....నీ పదాల్లో మళ్ళి నన్ను నేను చూసుకున్నా...Thanks very much buddy

..nagarjuna.. said...

’శాకుంతలాలు’ అనగా...?

మనసు పలికే said...

ధన్యవాదాలు నాగార్జున.:) చాలా ఆనందంగా ఉంది నీకు నా కవిత నచ్చినందుకు..:) నిజానికి అది నా కవిత కాదు, నా మనసులో పేరుకు పోయిన బాధ. మళ్లీ పాత అపర్ణ లాగా మారిపోడానికి చేసే ప్రయత్నం ఇది..:)
శాకుంతలాలు అంటే పక్షులు..:)

కొత్త పాళీ said...

A small correction
శకుంతము = ఒక పక్షి
బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
ṣakuntamu [Skt.] n. A bird. పక్షి. ఉద్యచ్చకోరశకుంతావళి. Raja Sekhara. i. 11.

జనించిన తొలినాళ్ళలో శకుంతములనే పక్షులచే సాకబడినది కాబట్టి ఆమె శకుంతల అయినది.
ఆమెని గురించిన కథ శాకుంతలం అయింది.
ఈ శకుంత పక్షుల తియ్యటి గానాన్ని గురించి ఇక్కడ మరికొంచెం చదవొచ్చు.

మనసు పలికే said...

కొత్త పాళీ గారు,
>>జనించిన తొలినాళ్ళలో శకుంతములనే పక్షులచే సాకబడినది కాబట్టి ఆమె శకుంతల అయినది.
ఆమెని గురించిన కథ శాకుంతలం అయింది.

నాకి ఇది మాత్రమే తెలుసు..:) మాకు 9 వ తరగతి లో శకుంతల గురించి పాఠ్యాంశం ఉంది..:)
కానీ మీరు పైన చెప్పినంత వివరంగా తెలియదు.. చాలా చాలా థ్యాంక్స్..:)

ఆ.సౌమ్య said...

చాలా బావుంది మీ ఆవేదన, ప్రతీ ఒక్కరూ పడేదే. IT అనేకాదు ఏ రంగంలో ఉన్నా ఈ పరుగులు తప్పట్లేదు. మీ ఆవేదన చదవగానే నా హృదయవేదన గుర్తొచ్చింది. నాకు కవితలు రాయడం రాదు కానీ ఇంచుమించు మీ బాధలాగే ఉంది నాది కూడా.

"స్పందించే హృదయాన్ని పోగొట్టుకున్నానో..
హృదయ స్పందననే పోగొట్టుకున్నానో".........నాకూ తెలియట్లేదు :(

మనసు పలికే said...

సౌమ్య గారు, ధన్యవాదాలు నా కవిత మీకు నచ్చినందుకు..
నిజమేనండీ , IT అనే కాదు, ఈ రోజుల్లో ప్రతి రంగమూ అలాగే ఉన్నట్లుంది.. ఏదో సాధించాలి అన్న తపనతో పరుగులు పెడుతూ ఉన్నాము.. కానీ చివరికి సాధించాల్సింది మధ్యలో ఎక్కడో వదిలేసి పరిగెట్టేస్తున్నాం..:((

Anonymous said...

ఇక్కడ ఎవరో ఆ.సౌ.గారిని సౌ. అని పిలిచి అవమానం చేసితిరని తెలిసినది.

ఎవరు ఎవరు అంత ధూస్సాహసానికి పాల్పడింది?

మనసు పలికే said...

తార గారూ... వ్వా... నేనే అంతటి ఘోర పాతకానికి తలపడితిని..:( మీరు అలా కన్నెర్ర చేయకండి తార గారూ.. నా పాపానికి పరిహారము ఏమిటో శెలవివ్వండి.. శిరసావహించెదను..:(

ఆ.సౌమ్య గారూ.. మీరు క్షమించినట్టేనా నన్ను..?? లేదంటే ఇక్కడ తార గారు... వ్వా... వ్వా...(ఏం చేస్తారన్నది కూడా తెలియడం లేదు.. అందుకే నేను ఏడ్చేస్తున్నాను...)

ఆ.సౌమ్య said...

హ హ హ ఆ పనిలేని తార ఏదో అనడం మీరు నమ్మేసి ఏడ్చేయడం ఏమిటండీ ఇదంతా, మీరు మరీను :D ఆ.సౌమ్య అన్నా, సౌమ్య అన్నా పలుకుతా ఆ బెంగేం లేదు, అభ్యంతరమూ లేదు.

మనసు పలికే said...

సౌమ్య గారు, ధన్యవాదాలు..:)

Anonymous said...

>> హ హ హ ఆ పనిలేని తార

??

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఇప్పుడే చదివాను మీ 'నా ప్రియ నేస్తం'మరియు 'నన్ను కోల్పోయాను' అన్న మీ రెండు గేయాలు. బాగున్నాయి. మీరన్నది నిజం,

ఎక్కడికో వెళ్లాలనుకొని
మరెక్కడికో వెళుతున్నాం
ముందుకు వెళ్లాలనుకొని
వెనక్కి నడుస్తున్నాం
లక్ష్యాల శిఖరాల కెగబ్రాకుతూ
పాతాళ కూపాలలోకి జారుతున్నాం
సమస్యల వలయాలలో చిక్కుకొని
మానవత్వపు విలువలు మరిచిపోయి
ఎక్కడికి వెళుతున్నాం
ఎందుకు వెళుతున్నాం

చూసారా ఇది చదివి నేను కూడా ఓ తవిక చెప్పేశాను.

మనసు పలికే said...

సుబ్రహ్మణ్యం గారు.. ధన్యవాదాలండీ నేను అడగ్గానే నా తవికలు చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసారు..
>>చూసారా ఇది చదివి నేను కూడా ఓ తవిక చెప్పేశాను.
మీది తవిక అంటారేంటండీ.. నిజంగా చాలా బాగా రాసారు..:)

Arun Kumar said...

అప్పూ..
ఓ.. కొత్తగా మొదలెట్టారా ఈ బ్లాగుని! మీ బ్లాగ్ప్రయాణం హాయి హాయిగా సాగిపోతూ, మీదైన లోకంలో విహరిస్తూ, కాలం వేసిన గాలానికి ఎక్కడో పోగొట్టుకున్న మీ మధురభావాలన్నీటినీ తిరిగి దోసిట్లో నింపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. Happy Blogging! :)

మనసు పలికే said...

అరుణ్ కుమార్ గారూ..
>>ఓ.. కొత్తగా మొదలెట్టారా ఈ బ్లాగుని
నేను కొత్తగా మొదలెట్టడం ఏమిటండీ.. మొదలు పెట్టి విజయవంతంగా 7 నెలలు అయిపోయింది;)
మీరు పొరపాటున పైన మధురవాణి గారి వ్యాఖ్యని కాపీ పేస్ట్ చేసినట్లున్నారు.. ఎలాగైతేనేం ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)

జ్యోతిర్మయి said...

అపర్ణ గారూ, మీరేం కోల్పోలేదండీ ఒక్కొక్కప్పుడు అలా అన్పిస్తుద౦తే. ఇంత చక్కటి కవిత వ్రాయగలిగిన మీరు అన్నీ మనసులోనే దాచుకున్నారు. జాగ్రత్తగా వెతుక్కోండి మరి.

మనసు పలికే said...

జ్యోతిర్మయి గారూ.. చాలా చాలా థ్యాంక్స్ అండీ.. మనసులోనే దాచుకున్నాను అంటారా అయితే. మళ్లి అన్నిటినీ వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నా అండీ. మీరన్నట్లు నా ప్రయత్నం సఫలమవుతుందన్న ఆశతో.. మీకు బోలెడు బోలెడు ధన్యవాదాలు :))))

nmrao bandi said...

ఒకేసారి చెబ్తా నా ఆనందం...

అయ్యో...

ఇవేం తవికలు...
మరి నే రాసేవేంటి?

రాయాలనే కోరికను నానుంచి దూరం
చేసేట్లున్నారు చూస్తుంటే...

నా చెవికలు (మీవి తవికలైతె
నావి చెవికలందాం(చెవిలో పూలు) )
కనుమరుగయ్యేలోగా
మీ బుర్రలోకి ఎలాగైనా దూరి...
కొన్నైనా...ఊహల్ని...వగైరాల్ని...
ఎలాగైనా కొట్టెయ్యాల్సిందే...

నిజం చెప్పండి...
అసలెక్కడ్నుంచి సాక్షాత్కారిస్తున్నారీ
రెక్కలు (తాళ్ళు) కనబడని ఊహల ఉయ్యాలల్ని...


లేచిన రోజు బాగుంది...
మీ బ్లాగ్ కనబడింది...
లేకపోతె...
ఇంకా చెవికలు రాస్తూనే ఉండేవాణ్ణేమో...
(రాసినా నాకేం నష్టం...చూసేవాళ్లకు కదా ప్రాబ్లం...ఇదేదో బాగానే వుంది...నాకేం నష్టం...
వాళ్లకు ప్రాబ్లం లేపోతే రాస్తే పోలా..)

ఒట్టేసి చెబుతున్నా...
ఒక్ఖటి కూడా నచ్చకుండా లేదు...
పైనెవరొ చెప్పినట్లు...
పైనే ఉంచండి...
పైనే ఉండండి...
తవిక రాణి గారు...

గుడ్ విషెస్...