మది జారిన శూన్యంలో.. నువ్వూ కరిగిపోయావా?
నీకై తపన కరువని కాలంతో కదిలిపోయావా??
మదిలో మిణుగురు మెరుపుకే
అరగడియైనా ఆలస్యంలేని నీ ఆగమనం..
అందంగా అర్థవంతంగా ముస్తాబయ్యి
కలంలో సిరాలా జాలువారి
పొందిగ్గా ఒదిగిపోయే నీ రూపం.
రెప్పల వెనుక రంగుల్లో ఉండగా చటుక్కున వచ్చే నీ ఙ్ఞాపకం.
నన్నొదిలి వెళ్లేదానివా, తెల్ల కాగితాన్ని నలుపు చేసేంత వరకూ..
రవ్వంత బాధలో ఉంటే, ఒడిలో చేర్చుకుని అందించే ఓదార్పు నీదే కదా.
కొండంత సంతోషంలో ఉంటే నీ ఈ కూతురి నవ్వుని నలుగురికీ పంచేదీ నువ్వే.
ఇదంతా ఒకనాటి మాట
అలా కళ్లు మూసి తెరిచానో లేదో
కాసిన్ని నెలలు కరిగిపోయాయి గోడమీద.
ఇంతలో ఏమైందో ఏమో,
ఉలుకూ పలుకూ లేని నువ్వు.. నా ఎదురుగా..
ఒక తలంపుకే నన్ను వరిస్తావనుకున్నా.
కానీ ఎన్నెన్ని పిలుపులకి సైతం నీ కరుణ దొరకలేదే.
మనసుని ఎంతని మధించను నిన్ను రప్పించడానికి?
భావాల్ని ఎన్నని వరించను నువ్వు వర్ణించడానికి?
దేనికీ చలనం లేని నిన్ను చూసి
దుఃకిస్తున్న మది ఓదార్పుకైనా రావు కదా..
అయినా ఊహల గేలానికే అందని నువ్వు
కలమంచున కరగడానికెలా వస్తావు?
మనసు పేజీలో లేని నీ సంతకం
సిరాలో కలవడం ఎలా సాధ్యం?
ఆరోజు..అద్వితీయమైన అనుభూతికి మాత్రమే నీ ఆసరా కరువైన రోజు.
అది అనుభూతి గొప్పదనం.
ఈరోజు..కనీసం అనుభవానికైనా నీ ముసుగు వెయ్యలేని రోజు..
ఇది ఖచ్చితంగా నా పరాభవం.
నాకు తెలిసిన నీ గురించి చెప్పాలంటే..
నీ స్పర్శ చాలు, తెల్లని శూన్యం కాస్తా
అంబరాన్నంటే ఆనందంగా మారగలదు
అగాధాలను స్పృశిస్తూ లోతుల్ని కొలవగలదు
చరిత్ర పుటల్లోని చరణాలను వినిపించగలదు
నిజం..
నీ ఒక్క అడుగు చాలు, అంతులేని మది నింగిని తెరిచి చూపించగలదు.
మరి అలాంటి నువ్వు ఎందుకు నేస్తం నా చెంతకు చేరవు..

14 comments:

ఎంతో బావుంది.
రెప్పల వెనుక రంగుల్లో ఉండగా చటుక్కున వచ్చే నీ ఙ్ఞాపకం.
నన్నొదిలి వెళ్లేదానివా, తెల్ల కాగితాన్ని నలుపు చేసేంత వరకూ..
రవ్వంత బాధలో ఉంటే, ఒడిలో చేర్చుకుని అందించే ఓదార్పు నీదే కదా.
మీ భావవ్యక్తీకరణ బావుంది.
తవిక చాలా బాగుందండి. తప్పు మీది కాదులెండి. నన్ను ఊహించుకుంటే తవికలు అలా తన్నుకొచ్చెస్తాయ్ మరి. హిహిహి.. మీ శ్రీవారు చూశారంటే నన్ను తంతారేమో. ఎందుకొచ్చిన బాధ! :p
"నీకై తపన కరువని కాలంతో కదిలిపోయావా??"
ఈ కరువేంటి?? అర్థం కాలేదు. వివరించుడీ.
చాల బాగుందండీ..
>>
మనసు పేజీలో లేని నీ సంతకం
సిరాలో కలవడం ఎలా సాధ్యం
>>
ఇది awesome!
పైనే ఉంచండి(keep it up)..:)
అద్భుతంగా రాశావ్ అప్పూ!
రాద్దామంటే దొరకటం లేదు ఒక్క అక్షరం కూడా
మెరిసిన భావాలు ఎగిరిపోయాయి మిణుగురులై
కష్టపడి అరువు తెచ్చుకున్న అక్షరాలతో కూడా
కుదరటం లేదు ఎంత ఆలోచించినా ఏ కామెంటు.
అంత బాగా వ్రాసారు. కేక అంతే.
మది గదులను మృదువుగా మధించే మనోజ్ఞమైన పద-లాఘవం..
నీ పదాలకు చిరు పలకరింపు..నా మది పలికిన పదాలలో
>> ఎత్తైన శిఖరం.. లోతైన అగాధం.. సరి లేని సరితం.. కనలేని కావ్యం.. <<
మీకు తెలుసు నాకు కవితలు అర్ధం చేసుకునేంత సీన్ లేదనీ. అయినాగానీ పట్టి పట్టి ప్రయత్నించాను కుంచేం అర్ధం అయ్యిందీ. మిగిలినది అర్ధం చేసుకోవాలి అని ప్రయత్నిస్తుంతె మోకాలు నొప్పొచ్చేస్తుందీ. అందుకనీ ఆఫేశాను.
అయినా ఏమన్నా అంటే అన్నామంటారూ "తెలుగు లో రాయొచ్చు కదండీ " :) :) లేకుంటే నేను గతం లో చెప్పినట్టూ తెలుగు డిక్షనరీ అయినా ఇవ్వాలి నా లాంటీ పామర జనం కోసం ;) :)
చాలా బాగా రాసారు మనసు పలికే గారు...!!
>>>>నీ స్పర్శ చాలు, తెల్లని శూన్యం కాస్తా
అంబరాన్నంటే ఆనందంగా మారగలదు
అగాధాలను స్పృశిస్తూ లోతుల్ని కొలవగలదు<<<<
Excellent Lines...
ఒక చిన్న ప్రశ్న.. శూన్యం తెల్లగా ఉంటుందా? చాలా మంది శూన్యం ని నలుపుతో పోలుస్తారనుకుంటా,..
క్షమించండి, పిచ్చి ప్రశ్న అడిగానని మీరు భావిస్తే...:)
--
HarshaM
శైలు.. నా తవిక నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ :)
జ్యోతిర్మయి గారు, బోలెడు ధన్యవాదాలు:))
చాణక్య గారూ.. నా ఉద్ధేశ్యం ఏమనగా, ఈ మధ్య ఏదైనా రాయాలి అనే తపన తక్కువయిపోయిందండీ. ఒకప్పుడు ఏదో రాయాలి, ఇంకేదో చెయ్యాలి అన్న ఉత్సుకత ఉండేది. అందుకే "నీకై తపన కరువయిందని" నన్నొదిలేసి వెళ్లిపోయావా అని రాశా అనమాట:) వ్యాఖ్యకి ధన్యవాదాలు..
గిరీష్ గారూ.. ధన్యోస్మి.. మీరు చెప్పినట్లుగానే పైనే ఉంచుతాను:)))
మధుర, ధన్యవాదాలు:)
గురూ గారూ..
"రాద్దామంటే దొరకటం లేదు ఒక్క అక్షరం కూడా
మెరిసిన భావాలు ఎగిరిపోయాయి మిణుగురులై
కష్టపడి అరువు తెచ్చుకున్న అక్షరాలతో కూడా
కుదరటం లేదు ఎంత ఆలోచించినా ఏ కామెంటు. "
మీరసలు కెవ్వు నిజంగా.. అందుకే నన్ను మీ శిష్యురాలిగా చేర్చుకోండి..:))
Singharam గారూ.. మీ వ్యాఖ్య నన్ను ఎంత సంతోషపరిచిందో చెప్పలేను. మీకు బోలెడు ధన్యవాదాలు. కానీ మీ పొగడ్తకి నేను సరితూగలేనేమో అని నా అనుమానం :((
వేణూరాం.. ఇది టూ మచ్. నేను వచ్చీ రాని తెలుగులోనే కదా రాశాను. అప్పుడెప్పుడో ఒకటి రాశానని ఇప్పటికీ అలాగే రాస్తా అనుకుంటున్నావా?;) అసలు నా బాధే నాకు రాయడానికి ఏమీ రావడం లేదని;) అర్థం చేసుకోరూఊఊ..
హర్షవర్ధనం గారూ, హహ్హహ నన్నే అడిగారా ప్రశ్న. నా ఆలోచన అయితే, తెల్లని కాగితాన్ని శూన్యంతో పోల్చాను. ఏమీ లేని తెల్లని కాగితం ఎన్నో లోతుల్ని, ఎత్తుల్ని అక్షరం రాకతో చూపించగలదు అని నా ఉద్ధేశ్యం. వ్యాఖ్యకి ధన్యవాదాలు:)
baaga vrastarandi.mee chalaki maatallage mee blogunu.follow avuthanu.
ravisekhar oddula
www.ravisekharo.blogspot.com
మళ్ళీ...
మళ్ళీ...
ఆసాంతం చాలా బాగుంది...
అభినందనలు...
ఇలా...
ఒక్కక్క దానికి ఎందుకు ఈ ఆయాసం...
చివరిగా...అన్నీ చదివి
ఒకేసారి చెబ్తా నా ఆనందం...
Post a Comment