Wednesday, November 16, 2011

ఆనందమానందమాయే

ప్రపంచంలోని ఏ ఇద్దరు మనుషులూ ఒకేలా ఆలోచించలేరట. కానీ ప్రతి ఇద్దరిలోనూ ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటుంది, అలాగే ఎక్కడో ఒక ఆలోచన దగ్గర అవును కాదు అనే సందర్భమూ ఎదురవుతుంది. ఇలా వ్యక్తిగతంగా చూస్తేనే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ, తన తోటి మనిషితో.. ఇటువంటి విషయాలు తెలుసుకుని మసులుకోవడమే మానసిక పరిపక్వత అనుకుంటూ జీవితాన్ని జీవించేస్తున్నా అన్న భ్రమలో కాలాన్ని వెళ్లదీస్తున్న నేను, ఒకే తాటిపై నిలబడి, నలుగురికీ జీవితాన్ని పంచుతున్న ఒక కుటుంబాన్ని చూసి విస్తుపోయాను అంటే అది చిన్న పదమే అవుతుంది.

అవును.. జీవని ప్రసాద్ గారి కుటుంబాన్ని దర్శించిన తరువాత అచ్చంగా నా మనసుపలికిన మాటలు ఇవి. అలా ఇంటిలోని ప్రతి ఒక్కరూ జీవని చిన్నారి పిల్లల్ని ప్రేమ ఆప్యాయతలతో చూడడం, అతిథి సేవని అదృష్టంగా భావించి ఆదరాభిమానాలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యడం, అయ్యయ్యో పాపం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం అన్న బాధ క్షణక్షణానికీ ఎక్కువవుతున్నా, ఇంతగా కూడా ఆదరించగలరా అన్న ఆశ్చర్యం ఇక నోరు తెరవనివ్వలేదు. "ఇలా మా ఇంటికి మీరు వస్తూ పోతూ ఉంటే మాకు చాలా సంతోషం" అంటూ నిండైన మనసుతో, గుండెల్లోంచి విరిసిన నవ్వుతో ఆహ్వానించే అమ్మ గారికి; శరీరానికి ఓపిక లేకపోయినా, అందర్నీ ఆనందంగా గమనిస్తూ, జీవని కుసుమాల్ని తన సొంత మనవళ్లు మనవరాళ్లుగా ప్రేమించే నాన్న గారికి; కొడుకుగా జన్మించడం ప్రసాద్ గారి అదృష్టమా? ఇంత మంచి కుటుంబంలోకి అడుగుపెట్టి, వారి ఆలోచనల్ని మనసారా గౌరవిస్తూ, ఎంతో ఇష్టంగా, అలుపు లేకుండా సేవించే సునందక్క దొరకడం ఆ కుటుంబం అదృష్టమా? ఏంటో.. నాకైతే కనీసం ఇన్నేళ్లకైనా ఆ కుటుంబంతో, ప్రేమతో నిండిన పరిసరాలతో పరిచయం ఏర్పడడం నా అదృష్టమనే అనిపిస్తుంది.

రెండు మనసుల్లో మొలకెత్తిన ఒక గొప్ప సంకల్పం ఎంతటివారినైనా ఒకటి చేస్తుంది. అందుకు ఉదాహరణ, జీవని ప్రసాద్ గారిని నోరారా అన్నా అని ఆప్యాయంగా పిలిచే యస్.ఆర్.ఐ.టి. ఛెయిర్మెన్ సాంబ శివా రెడ్డి గారు. యస్.ఆర్.ఐ.టి. కాలేజి కూడా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా అందులో లైబ్రరీ, ఇంకా ఎక్కువగా రీడింగ్ రూం. ఒక ఇంజినీరింగ్ కాలేజిలో రామాయణం, మహాభారతాల లాంటి పురాణాలకి, అమరావతి కథలు, మైండ్ పవర్, శ్రీశ్రీ కవిత్వం లాంటి మంచి పుస్తకాలకి కూడా స్థానం ఉంటుందని మొదటిసారిగా తెలిసింది:) ఛెయిర్మెన్ గారి ఒక ఫోన్ కాల్‌తో అక్కడి ఇన్‌ఛార్జ్ మాకందించిన గౌరవం, కాలేజి అంతా చూపించిన తీరు చూసి మా ఆనందానికి పట్టపగ్గాల్లేవు :):). మరి ఉన్నట్టుండి వి.వి.ఐ.పి. లు అయిపోయినట్లుగా అనిపించింది. అంత పెద్ద కాలేజి అధిపతి, కోటీశ్వరులు.. ప్రసాద్ గారి ఇంటికొచ్చి ఒక మామూలు మంచం మీద బాసింపట్ల వేసుక్కూర్చుని, భోజనం చేస్తుంటే ఎందుకో నాకు ఆయన మీద ఎనలేని గౌరవం పెరిగిపోయింది. ప్రసాద్ గారి కుటుంబంతో, అతిథులుగా వచ్చిన మాతో, జీవని పిల్లలతో ఆయన మాట్లాడిన తీరు చూసి అభినందించకుండా ఉండలేకపోయాను.

గరికపచ్చ మైదానంలో రంగురంగుల సీతాకోక చిలుకలు చుట్టుముట్టిన భావన, జీవని చిన్నారులు "అక్కా బాగున్నావా" "అన్నయ్యా బాగున్నావా" పలకరింపులతో చుట్టుముట్టినప్పుడు. మన తెలుగు బ్లాగ్లోకపు క్రియేటివ్ హెడ్ రాజ్‌కుమార్, అంతకు ముందు తీసిన ఫోటోల ప్రింట్‌లు ఆ చిన్నారులకి ఇచ్చిన నిమిషంలో, ఎన్ని వేల సూర్యుళ్లని పక్కన పెడితే వారి చిరునవ్వుల వెలుగులకి సరితూగగలదు. ఇక సౌమ్యగారు డిల్లీ నుండి తెచ్చిన గాజులు, చెవి రింగులు, క్లిప్పులు, బెల్టుల్ని చూసి, తీసుకుని, మళ్లీ మళ్లీ చూసి ఎంత ఆనందించారో.. అమ్మా నాన్నా కొత్తగా ఏ వస్తువు కొనిచ్చినా, అంబరాన్నంటే సంతోషాన్ని వెంటపెట్టుకు తిరిగే రోజులు ఏమైపోయాయా అని ఆలోచిస్తే, వాటిని మింగేసింది కాలమా, డబ్బా, బాధ్యతలా, పెద్దరికమా అన్న నా ప్రశ్నకి ఇంకా జవాబే దొరకలేదు. పిల్లల చలాకీతనాన్ని చూసి, మనం వాళ్లకి నేర్పించే సంప్రదాయం పోయి, వాళ్ల దగ్గర నేర్చుకునే రోజులు వస్తే బాగుండు అనుకున్నాను.

ఎన్నాళ్లుగానో కేవలం రాతల ద్వారానే పరిచయం కలిగిన అంతమంది బ్లాగు/బజ్జు మిత్రుల్ని ఒక్కసారిగా కలుస్తానని అనుకోలేదు. కార్తీక్ పెళ్లి అందించిన ఒక మంచి అవకాశం. అందిపుచ్చుకున్నాను:) చాలా ఆనందించాను.అసలు ఎవరో కొత్త వాళ్లతో మాట్లాడుతున్నా అన్న భావనే లేదు ఏ కోశానా.. ఎన్నేళ్లుగానో పరిచయం ఉన్న నా బాల్య మిత్రుల్లా అనిపించారు అందరూ. మరి, అభిరుచి కలిపిన నేస్తాలు కదా:) నాతో పాటు మా ఆయనకూడా బ్లాగ్మిత్రులందరితో కలిసిపోయి సంతోషంగా గడపడం నాకు ఇంకా సంతోషాన్నిచ్చింది:) పెళ్లికొచ్చిన కెమెరా మెన్‌లతో కలిసిపోయిన రాజ్‌కుమారూ; అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఆలోచనల్లో పాపం తన సంగతే మర్చిపోయే ఆర్గనైజర్ బంతి; ఆంగికము, ముఖ కవళికలతోనే మ్యాటర్ అంతా చెప్పడానికి ప్రయత్నించే శీనన్న; భోజన ప్రియురాలు సౌమ్య గారు, భోజనమంటే పడని కిరణు, వాళ్ళిద్దరి సరదా సరదా గొడవలు; పంచులతో నవ్వించే నాగార్జున; అమాయకంగా అనిపించే రెహ్మాన్; ఉన్న పళంగా నన్ను మా ఊరి పొలాలకి తీస్కెళ్లిపోయిన చిలమకూరి విజయ్ మోహన్ గారు; బజ్జులో చూసేది నిజంగా ఈ శంకర్ గారినేనా అని అనుమానం కలిగేంత సైలెంట్‌గా ఉన్న శంకర్ గారు; కాషాయ వస్త్రాల్లో వస్తారేమో అని ఎదురు చూస్తుంటే రంగు దుస్తుల్లో కనిపించి నిరాశపరిచిన నాగానంద స్వాముల వారు.. ఈ అందరితోనూ పంచుకున్న రెండ్రోజుల సమయం నిజంగా అద్భుతం.

పెళ్లంటే పందిళ్లు తప్పట్లు తాళాలు తలంబ్రాలూ... ఇటువంటి సంప్రదాయబద్దమైన పెళ్లిని చూసి చాన్నాళ్లయింది. పెళ్లిలో జరగాల్సిన అన్ని తతంగాల్నీ చాలా చక్కగా సంప్రదాయబద్దంగా జరిపించారు. కార్తీక్ పెళ్లి జంట చూడముచ్చటగా ఉంది.కార్తీక్ తనలో ఉన్న పైశాచికానందాన్ని నిద్రలేపి, పాపం పెళ్లికూతురిని ఏడిపించడం జరిగింది. ఇందుకు గాను తగిన శిక్ష త్వరలోనే అనుభవించబోతున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎందుంకటే నేను పెళ్లికూతురుతో ఫ్రెండ్‌షిప్ చెయ్యబోతున్నా కదా..;). కార్తీక్ పెళ్లిలో ఉన్నాడన్న మాటే కానీ, పాపం తన మనసంతా మా గుంపు దగ్గరే ఉంది. వీళ్లంతా ఎంచక్కా ఎంజాయ్ చేసేస్తున్నారు, నేను ఇక్కడ ఇరుక్కుపోయా అన్నట్లుగా దీనాతిదీనంగా మొహం పెట్టి పదే పదే మమ్మల్నే చూస్తూ పెళ్లి చేసుకున్నాడు. చివరగా ఫోటోలు గట్రా సుబ్బరంగా దిగేశాంలే..

చిన్నప్పుడు ఎవరి పెళ్లికి వెళ్లినా, ఒక విషయం గురించి మాత్రం ఎప్పుడూ దిగులుగా ఉండేది. భోజనాల నుండి ఏ సాకు చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచనల్లో మునిగిపోయేదాన్ని. మరి, పెద్ద పెద్ద బంతిభోజనాల్లో కుర్చుని గంటలు గంటలు తింటూ కుర్చుంటే కుదరదు కదా. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడికెళ్లినా బఫే పద్ధతి చూసి, బంతి భోజనాలు తిని ఎన్నేళ్లయింది అని పాత రోజుల్ని కేవలం ఊహల్లో తలుచుకుంటూ తినెయ్యడమే. అలా బఫే భోజనాలతో విసుగొచ్చిన నేను, కొన్ని సంవత్సరాల తర్వాత కార్తీకు పెళ్లిలో బంతి భోజనాలు చూసిన క్షణంలో.. నాలోపల ఎక్కడో దాగున్న భోజన ప్రియురాలు నిద్రలేచి ఆనంద డోలికల్లో తేలిపోయింది. ఇక రుచి సంగతి చెప్పాలంటే, ముందుగా ప్రసాద్ గారి ఇంటికి వెళ్లిపోవాలి. అల్పాహారం అన్న పేరుతో మూడు రకాల వంటలు, మధ్యాహ్న భోజనం పేరుతో ఇంకొన్ని వంటలు.. ఆహా.. అద్భుతం నిజంగా. అవి అచ్చమైన అనంతపూర్ వంటలంట. నేనైతే దేన్నీ వదిలెయ్యకుండా లాగించేశా :) ఇక పెళ్లి వంటల దగ్గరికొస్తే.. కొంచెం కర్ణాటక రుచులు కలిపిన వంటలంట. ఎన్ని రకాలో.. అఱిటాకులో రుచికరమైన భోజనం. మొత్తంగా రాయలసీమ రుచులకి నేను ఫిదా :):)

ఇక బ్లాగర్ల బ్యాచ్ అల్లరి సంగతి చెప్పాలంటే ఒక టపా సరిపోదు. రెండు రోజులు పూర్తిగా నవ్వులకి అంకితమైపోతే ఎలా ఉంటుందో అనుభవానికొచ్చింది:):) కడుపులో నొప్పి, కళ్లల్లో నీళ్లు మా నవ్వుల్ని ఆపలేకపోయాయి.ఇంత మంచి అనుభవానికి కారణమైన కార్తీక్‌కి, శ్రమ అనుకోకుండా బ్లాగర్లందరినీ ఎంతో ఆదరంగా ఆహ్వానించి ఆతిథ్యాన్నందించిన జీవని ప్రసాద్ గారికి, బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కార్తీక్ కి అతని అర్ధాంగికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారి వైవాహిక జీవితం కలకాలం ఆనందమయం కావాలని, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలోని రెండు పేజీలు ఇంతటి గొప్ప అనుభూతికి లోనవ్వడానికి కారణం మా ఆయన సహకారం:) బ్లాగ్ముఖంగా మా వెంకట్ గారికి కూడా ఓ ధన్యవాదాన్ని ఇచ్చేసుకుంటున్నాను ;)

43 comments:

ఆ.సౌమ్య said...

wow అప్పు బలే రాసావ్. నా మనసులో ఉన్న భావాలన్నీ నీ అక్షరాలో కనిపించాయి. నిజంగా అ రెండు రోజులు మరుపురాని మధురానుభూతుల్ని మిగిల్చాయి. సమయం ఎలా గడిచిందో తెలీదు. జీవని పిల్లలతో గడిపిన క్షణాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ప్రసాద్ గారి కుటుంబానికి జోహార్లు.

శేఖర్ (Sekhar) said...

మీరందరూ ఇంత బాగా ఎలా రాస్తారో తెలియదు కాని...అద్బుతం అంతే...
రానివాళ్ళు ఇది చదివి తాము కోడ అక్కడే ఉన్నట్లు...తాము కోడ అందులో పార్ట్ ఐనట్లు అనిపించలే రాసారు...
ఇంకా నా లాగా చివరి నిమిషం లో రాకుండా డ్రాప్ అయిన వాళ్ళకి మాత్రం నిజం గ ఈ ఫీలింగ్ అనుభవించలేక...మన కార్తీక్ ఎలా ఇబ్బంది పడ్డాడో మీ గుంపు ను చూస్తూ అల ఉంది నా పరిస్థితి....

పిల్లలు...జీవని ప్రసాద్ గారు + వాళ్ళ ఫ్యామిలీ మరియు మీరందరూ అదృష్టవంతులు......అంతే.

రాజ్ కుమార్ said...

హ్మ్మ్.. జీవని వెళ్ళిన ప్రతీసారీ ఇదే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ని చాలా చక్కగా మాటల్లో పెట్టారు
సూపర్ సూపర్ సూపరంతే..!

రాజ్ కుమార్ said...

కానీ ఆ రెండు రోజులూ, ఆ కేరింతలూ, ఆ నవ్వులూ ఎప్పటికీ మరిచిపోలేనివి. ఈ పోస్ట్ చదూతుంటే టైం మెషీన్ లో వెనక్కి వెళ్ళినట్టూ ఉంది. ;)

Manasa Chamarthi said...

I do not have many details abou this event, but the way you have penned it made me feel so close to everybody and everything mentioned .
Fantabulous write-up!

..nagarjuna.. said...

>>అంతకు ముందు తీసిన ఫోటోల ప్రింట్‌లు ఆ చిన్నారులకి ఇచ్చిన నిమిషంలో, ఎన్ని వేల సూర్యుళ్లని పక్కన పెడితే వారి చిరునవ్వుల వెలుగులకి సరితూగగలదు....

నిజం చెప్పాలంటే ఆ ఆనందాన్ని స్వీకరించే స్థానంలో నేను లేనే అనే చిన్న ఈర్ష్య.ఆరోజు ఆ స్ధానంలో ఉన్న రాజ్, సౌమ్యగారు ఎంత అదృష్టవంతులో కదా!!

పిల్లలను మమ్మల్ని ఇంట్లో సోంతమనుషుల కన్నా ఎక్కువ ఆదరంగా చూసుకున్న ప్రసాద్‌గారికి, వారి కుటుంబసభ్యులకు, ప్రసాద్‍గారి స్నేహితులకు ఎన్ని హ్యాట్సాఫ్‌లు చెప్పినా తక్కువే.

ఆ రెండ్రోజుల నవ్వుల గలగలలు, పిల్లలతో గడపటం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతులు :)

జ్యోతిర్మయి said...

అపర్ణ గారూ..మీ పేరు ఇదే కదూ...మీరు చెప్తుంటే ఎంత బావుందో..మిమ్మల్నందరినీ వెంటనే పరిచయం చేసుకోవాలనుంది. మంచి అనుభూతిని సొంతం చేసికున్నందుకు అభినందనలు.

MURALI said...

మీరు బాగా వ్రాసి నేను ఎందుకు మిస్సయ్యనబ్బా అని ఫీలయ్యేలా చేసారు :(

prasad.sv said...

మీ అభిమానానికి ధన్యవాదాలు.
మీరు చెప్పినట్టు జీవని కోసం మా కుటుంబం మొత్తం కృషి చేస్తూ ఉంటుంది.
అలాగే సాంబశివా రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంచికి పర్యాయపదం తను. జీవని జెట్ వేగానికి తనే కారణం.
దూరాభారం అనుకోకుండా వచ్చిన మీ కష్టంతో పోలిస్తే మా ఆతిథ్యం ఏపాటిది?
పిల్లల తరఫున మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

ఫోటాన్ said...

నేనూ ఆ బాచ్ లో ఉండాల్సింది అని కుల్లుకునేంత బాగా రాసారు..:)
కార్తీక్ కి మరోసారి శుభాకాంక్షలు.
జీవని ప్రసాద్ గారికి అభినందనలు..

చాణక్య said...

చాలా బాగా రాశారండీ. మేము కూడా వచ్చుంటే బాగుండేదని అనిపించింది.

>>>ఇందుకు గాను తగిన శిక్ష త్వరలోనే అనుభవించబోతున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎందుంకటే నేను పెళ్లికూతురుతో ఫ్రెండ్‌షిప్ చెయ్యబోతున్నా కదా..;)

వామ్మో..! కాత్రీకు గారి పని అయిపోయిందింక. ఆయన్ని కాపాడాలంటే ఒకటే మార్గం. మేమందరం కలిసి మీ శ్రీవారితో ఫ్రెండ్‌షిప్ చెయ్యాలి.

Padmarpita said...

ప్చ్:( నేను మిస్ అయ్యాను....

శ్రీనివాస్ said...

అబ్బో నువ్ కూడా భావుకత్వం పరిమళించిన బ్లాగర్ వేనా :D

శశి కళ said...

కార్తీక్ గారికి ఆశీస్సులు.మీ అల్లరి చూస్తె నెను కూడ
వచ్చి ఉంటె బాగుండెది అని బాధ గా ఉంది.

బులుసు సుబ్రహ్మణ్యం said...

అపర్ణ గారూ చాలా బాగా వ్రాసారు. నేను మిస్ అయ్యాను.

జీవని ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి అభినందనలు. కార్తీక్ గారికి వారి శ్రీమతి గారికి శుభాకాంక్షలు.

రసజ్ఞ said...

నాకు కూడా రావాలనిపిస్తోంది! బాగా వ్రాశారు! వారి కుటుంబానికి అభినందనలు!

మధురవాణి said...

Superb post అప్పూ.. చాలా చాలా బాగా రాశావ్.. మాలాగా రాకుండా మిస్సయిపోయిన వాళ్ళందరికీ నీ కళ్ళతో చూపించినట్టుంది. very well written post.. Thanks a lot for sharing with us! :)

హరే కృష్ణ said...

అపర్ణ చాలా బాగా రాసావు

నాగార్జున చెప్పిన లైన్స్ మాటల్లేవ్ అంతే..అద్భుతం!
కార్తీక్ కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..జీవని ప్రసాద్ గారికి జోహార్లు

ఇందు said...

అప్పు నన్ను పిలవకుండా....మాట కూడా చెప్పకుండా.....నన్ను తీసుకెళ్ళకుండా వెల్లిపోయినా నిన్ను,సౌమ్యని,కిరణ్ ని ఏం చేయాలి? మీ అందరితో పచ్చి :( ఇక మాట్లాడను ఫోండి. [మూతి ముడుచుకున్న ఇందు]

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగా రాశారు అప్పు :-) నిజంగా అదృష్టవంతులు మీరంతా.. కార్తీక్ దంపతులకు శుభాకాంక్షలు, జీవని కుటుంబానికి పాల్గొన్న మీ అందరికీ కూడా అభినందనలు.

కొత్తావకాయ said...

కళ్ళకి కట్టించారు. మంచి టపా!!

గిరీష్ said...

nice..

శిశిర said...

నువ్వు రాసింది చదువుతుంటే నా కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తున్నట్టు అనిపించింది అపర్ణా. పిల్లలకి "మీకు మేమందరం ఉన్నాం" అని నైతిక స్థైర్యాన్ని ఇచ్చిన మీకందరికీ హృదయపూర్వక అభినందనలు. నూతన దంపతులకి శుభాకాంక్షలు.

మనసు పలికే said...

సౌమ్య గారు,
ధన్యవాదాలు టపా నచ్చినందుకు:) నిజం, అసలు సమయం ఎలా గడిచిందో తెలీలేదు ఆ రెండు రోజులు. తిరుగు ప్రయాణంలో చాలా దిగులుగా అనిపించింది.

శేఖర్ గారు,
ధన్యవాదాలు నా రాతలు నచ్చినందుకు. మీరు వద్దామనుకుని రాలేకపోయినట్లు తెలిసింది. కార్తీక్ ఇబ్బందితో పోల్చిన మీ బాధ నాకు అర్థం అవుతుంది. మరోసారి తప్పక కలుద్దాం జీవని దగ్గరే, మనమంతా:)

రాజ్ కుమార్,
ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి. నిజంగా టైం మెషిన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, మరోసారి ఆ రోజులకి వెళ్లిపోవాలని ఉంది.

మనసు పలికే said...

మానస,
మీ వ్యాఖ్య చాలు నా సంతోషం పదింతలవ్వడానికి. నా టపాలో మీ వ్యాఖ్య కనిపిస్తే నాకంత సంబరం:) ఇంక మీకు నచ్చింది అంటే నా భావాన్ని మాటల్లో చెప్పలేను. బోలెడు ధన్యవాదాలు. నిజానికి నేను ఇక్కడ పెద్దగా రాసింది ఏదీ లేదు, అక్కడ జరిగిన ఒక్కొక్క సంఘటనలో నా ఫీలింగ్ చెప్పడానికి ప్రయత్నించాను అంతే. అవన్నీ అచ్చంగా మనసులోంచి వచ్చిన భావాలు.

నాగార్జున,
నువ్వన్నది నిజం. నాకు కూడా ఈర్ష్య కలిగిన మాట వాస్తవం. అయ్యయ్యో పిల్లలకి ఏమీ తేలేదే అని బాధ పడ్డాను. మరోసారి ఖచ్చితంగా వెళ్తాం కదా, అప్పుడు ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం:) వ్యాఖ్యకి ధన్యవాదాలు.

జ్యోతిర్మయి గారు,
నా పేరు అదే:) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. అదృష్టం కొద్దీ చాలా మంచి అనుభూతిని సొంతం చేసుకున్నాను. తప్పక పరిచయం చేసుకుందాం:):)

మనసు పలికే said...

మురళి గారు,
ధన్యవాదాలు వ్యాఖ్యకి:) బాధ పడకండి, ఈ సారి ఖచ్చితంగా మీరు కూడా రండి.

ప్రసాద్ గారు,
నిజంగా మీ కుటుంబానికి జోహార్లు.. సాంబశివ రెడ్డి గారి గురించి బాగా చెప్పారు.
>>దూరాభారం అనుకోకుండా వచ్చిన మీ కష్టంతో పోలిస్తే మా ఆతిథ్యం ఏపాటిది?
ఇది ఖచ్చితంగా మీ సంస్కారం. మీఅంతటి వారితో పరిచయం కలగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలందర్నీ అడిగినట్లు చెప్పండి.

ఫోటాన్ గారు,
టపా నచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సారి తప్పకునడా మీరు కూడా కలవచ్చు:)

మనసు పలికే said...

కౌశిక చాణక్య గారు,
ధన్యవాదాలు వ్యాఖ్యకి. మా శ్రీవారు ఖాళీగా లేరు, అని చెప్పమన్నారు:)

పద్మార్పిత గారు,
బాధ పడకండి. మరోసారి మీరు కూడా వద్దురు. వ్యాఖ్యకి ధన్యవాదాలు:)

శీనన్నాయ్,
నాకేంటో నీ వ్యాఖ్య చదివినా కూడా, ఆంగికంతో ముఖ కవళికలతో కూడిన నీ భావ వ్యక్తీకరణే గుర్తొస్తుంది. వ్యాఖ్యని గుర్తు చేసుకుని మరీ మరీ నవ్వుతున్నాను. నేనే కాదు మా ఆయన కూడా:):)

మనసు పలికే said...

శశి కళ గారు,
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు:) ఈ సారి మీరు కూడా వచ్చెయ్యండి:)

గురువు గారూ,
ధన్యవాదాలు టపా నచ్చినందుకు. మీరు కూడా వచ్చి ఉంటే భలేగా ఉండేదిలే. ఈసారి తప్పకుండా ప్రయత్నించండి:)

రసఙ్ఞ గారు,
అయితే ఈసారి మిమ్మల్ని కూడా లెక్కలో వేసెయ్యొచ్చనమాట:) బోలెడు ధన్యవాదాలు టపా నచ్చినందుకు..

మనసు పలికే said...

మధు,
అబ్బ, నీ వ్యాఖ్య నన్ను ఎక్కడికో తీసుకు పోయింది:) ధన్యోస్మి. నువ్వు భద్రాచలం వచ్చినప్పుడు చెప్పు, మనం ఇద్దరం వెళ్దాం.

హరే,
బోలెడు ధన్యవాదాలు టపా నచ్చినందుకు.

ఇందు,
జీవని చిన్నారులకి నీ గురించి చెప్పాంగా.. ఇందు అక్క ఏది, ఎక్కడ ఉంది అని అడిగారు కూడా :):) ఈ సారి ఇండియా వచ్చినప్పుడు తీసుకొస్తాం అని చెప్పాం. మరి వస్తున్నావు కదూ!!! హమ్మయ్య ఇందు నవ్విందా???

మనసు పలికే said...

వేణు గారు,
బోలెడు ధన్యవాదాలు టపా నచ్చినందుకు. నిజంగా మేం అదృష్టవంతులం:) ఈసారి మీరు కూడా వస్తారనే అనుకుంటున్నాను.

కొత్తావకాయ గారు,
ధన్యోస్మి:) మనసులో ఉన్నది ఉన్నట్లు రాశాను అంతే, మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

గిరీష్ గారు,
Thank you sooo much:)

శిశిర,
నీ వ్యాఖ్య నాకు చాలా సంతోషాన్నిచ్చింది:) నిజం, ఆ చిన్నారులకి డబ్బో, మరేదో కన్నా వాళ్లతో కాసేపు కుర్చుని మాట్లాడితే ఎంత సంబరమో. ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి.

..nagarjuna.. said...

>>ఆంగికంతో ముఖ కవళికలతో కూడిన నీ భావ వ్యక్తీకరణే గుర్తొస్తుంది. వ్యాఖ్యని గుర్తు చేసుకుని మరీ మరీ నవ్వుతున్నాను


లో.....ళ్

నేస్తం said...

అప్పు కళ్ళకు కట్టినట్లు రాసావ్..అయ్యో మేము లేమే అని రాలేని నాలాంటివాళ్ళు బాధపడేలా..మన్సు చాలా సంతోషం వేసింది ఇది చదవగానే

kiran said...

అప్పు......రెండు చిటికెని వెళ్ళు నోట్లో పెట్టుకుని..ఈఇల వేస్తున్న దృశ్యం ఉహించుకో..(ఆంగికం effect ..)
sooooooooooooooooooooooooooooper అంతే :)

happy married life to karthik :)

శివరంజని said...

అప్పు నీ పోస్ట్ చూడడానికి చాలా లేట్ అయింది అందుకు పనిష్మెంట్ గా నీ పోస్ట్ లో కామెంట్ ఉన్నాయి మిగతా ఆరు కామెంట్స్ నేను పెట్టి నలభై చేస్తానేం :)))))))))))

శివరంజని said...

అమ్మా అప్పు................ నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయావా పెళ్ళికి .... పైగా ఆనందమానందమాయే" అని గంతులేస్తావా .............పో నీతో కచ్చి :((((((((((((((((((((((((

శివరంజని said...

అది సరే కాని పోస్ట్ చాలా బాగా రాసావు రాసావు అని చెప్పి చెప్పి నీ చెవులు రెండు వాయిన్చేస్తున్నా కాని ..... మరేమీ చేయను ఇంత అందం గా రాస్తూ ఉంటే చెప్పక పొతే ఎలా .

కళ్ళకు కట్టినట్లు రాసావ్..కళ్ళు కుట్టుకునేలా రాశావ్ ...:))))))))

శివరంజని said...

నన్ను పెళ్ళికి తీసుకెల్లనందుకు నీ మీద స్ట్రైక్ చేయడానికి ప్లాన్ కూడా చేస్తున్ననా ...


స్ట్రైక్ చేయకుండా ఉండాలంటే నన్ను బాగా బ్రతిమాలుకో :P

శివరంజని said...

దీనితో 39వ కామెంట్ నాది 40వ కామెంట్ గా నాకు రిప్లై పెట్టు .. పెళ్ళికి తీసుకు వెళ్లనందుకు నన్ను బ్రతిమాలుకుంటూ

శిశిర said...

హహహ 40వ కామెంట్ నేను పెట్టేశాను శివరంజనీ. :)

..nagarjuna.. said...

తొందర్లో ఎవరో పెళ్లిచేసుకొనేట్టుగానే ఉన్నారులే శివరంజని. ఆ పెళ్ళిలో నీ ముచ్చట నెరవేరుస్తుందిలే బాధపడకు :P

మనసు పలికే said...

నాగార్జున :):) తొందర్లో పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు నాగార్జున???;)

శంకర్ గారు,
మీ వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలు, చాలా సంతోషం వేసింది మీ వ్యాఖ్య చూసి :)
అయితే అక్కడికి వచ్చింది నిజంగా మీరు కాదా;)

నేస్తం అక్కయ్యా,
మీ వ్యాఖ్యకి బోలెడు బోలెడు ధన్యవాదాలు:)

మనసు పలికే said...

కిరణు,
ఈల వేస్తున్న కిరణుని ఊహిస్తున్న అప్పుని ఊహించుకో;);) ధన్యోస్మి..

రంజనీఈఈఈ,
ఏమి ఈ వ్యాఖ్యాప్రవాహం;) చాలా చాలా థ్యాంక్స్ :) ప్లీజ్ రంజని, స్ట్రైకులు, కచ్చిలు ఆపెయ్యవా.. ప్లీజ్ ప్లీజ్ :):)

శిశిర,
హహ్హహ్హా.. ధన్యోస్మి:)

Kranthi M said...

అపర్ణ/కిరణ్ గారూ ఇక్కడ మీ పోస్ట్‌లలో రాసినవాళ్ళ గురించి నాకు ఒక్క విషయమూ తెలియకపోయినా. మీరందరికీ కలిగిన ఆనందం నాకూ కలుగుతునట్టే ఉంది.అంత చక్కగా రాసారు మరి.

మీరు చేసిన అల్లరి చూసినట్టే అనిపించింది, వెన్నెల బ్లాగులో కిరణ్ గారు కూడా, పెళ్ళిలో నేను తిండి తక్కువ తిన్నానేమో గానీ రాతల్లో ఏమీ తక్కువ తినలేదన్నట్టూ నవ్వించేసారు.

నాకూ అందరిలానే కొంత బాధ కలిగింది నేనక్కడ లేనందుకు.కానీ మీ రాతలు చదవటం వల్ల అది కొంత తీరిందనేది మాత్రం నిజం.ఒకరిని మించి ఒకరు రాసారు.

ఇద్దరు రాసిన దానికి స్పందన కనుక ఇద్దరికీ ఒకటే కామెంట్.:-)